11 September 2016

పునర్వసు నక్షత్రము

పునర్వసు నక్షత్రము-గుణగణాలు, ఫలితాలు పునర్వసు గురు గ్రహ నక్షత్రం, దేవగణ నక్షత్రం, రాశ్యాధిపతులు బుధుడు, చంద్రుడు. అధిదేవత అధితి, పురుష జాతి. పునర్వసు నక్షత్రం మొదటి మూడు పాదాలు మిధున రాశిలోనే ఉంటాయి. నాలుగవ పాదము కర్కాటక రాశిలో ఉంటాయి.పునర్వసు నక్షత్రమున ఏ పాదంలో జన్మించినా దోషమనేది లేదు. ఎక్కువ శాతం శుభకరమనే చెప్పాలి. ఈ నక్షత్రంలో అమ్మాయి జన్మిస్తే.. ఆమె శాంత స్వభావంతో, బంధువులయందు అమితమైన అభిమానం చూపుతుంది. ఓర్పు ఉంటుంది. ధర్మకార్యాలు చేసేదిగా అవుతుంది. క్రమంగా ఆమె ధనవంతురాలు అవుతుంది. ఇక అబ్బాయి జన్మిస్తే సౌందర్యవంతుడు. శ్రమకు ఓర్చుకునేవాడు అయి ఉంటాడు. అయితే అతడు అల్పసంతోషి, తొందర పాటు ప్రవర్తన కలిగి ఉంటాడు.ఈ నక్షత్ర జాతకులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. సువర్ణం, ఆయుర్వేదం, ఎగుమతి వ్యాపారాలు కలసి వస్తాయి. సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపడతారు.పునర్వసు నక్షత్రము గుణాగణాలుజీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించగలిగిన వ్యక్తిగా, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా, స్వయం శక్తి కలిగిన వ్యక్తిగా సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.ఇక ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోరు. అయితే అత్యవసర సమయంలో ఇతరులను ఆదుకునే తత్వం ఉంటుంది. సొంత పనులకంటే ఇతరుల పనులకు సహాయపడే పనికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ధనుర్విద్య, తుపాకితో కాల్చడం వంటి అలసట కలిగించే విద్యలయందు ఆసక్తి అధికం. అభిప్రాయాలు, మటలు స్పష్టంగా ఉంటాయి. పరపతి బాగా ఉంటుంది. సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వం వహిస్తారు. పరపతి బాగా ఉపయోగపడుతుంది. పరిచయాలను కార్య సిద్ధికి ఉపయోగించుకుంటారు.వివాహ జీవితములో తలెత్తిన భేదాభిప్రాయాలను ప్రాధమిక దశలోనే సర్ధుబాటు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. చెప్పిందే పదే పదే చెప్పడం, అతి జాగ్రత్తలు, ఇతరులను అధికంగా నమ్మి కార్యభారము అప్పగించ లేని స్థితి వీరిని పిరికి వారుగా భావించే అవకాశం ఉంది.బాల్యం సుఖవంతంగానే గడుస్తుంది. అయితే క్రమంగా సమస్యల వలయములో చిక్కుకుంటారు. 40 నుండి 70 సంవత్సరాల తరువాత సమస్యల నుంచి బయట పడతాడు.

పునర్వసు మొదటి పాదం :- పునర్వసు మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది.  పునర్వసు నక్షత్ర అధిపతి గురువు. మేషరాసి అధిపతి కుజుడు. పునర్వసు నక్షత్రజాతకులది  దేవగణం.  కనుక వీరికి గురువు, కుజుడు గ్రహప్రభావం ఉంటుంది. సైనిక శిక్షణ వంటివి వీరికి అనుకూలిస్తాయి. వీరు ధైర్యంగా  మధ్యవర్తిత్వం వహించగలరు. ధర్మాన్ని రక్షణ చేయడానికి  వీరు వెనుకాడరు. భూ సంబంధిత వ్యాపార వృత్తి ఉద్యోగాలు  కూడా  వీరికి అనుకూలిస్తాయి. ఉపాద్యాయ వృ త్తి వీరికి అనుకులిస్తుంది. వైద్యానికి సంబంధించిన వృత్తి  ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. వీరికి బాల్యం సౌఖ్యంగా జరిగి పోతుంది. 15 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా 19 సంవత్సరాల కాలం సౌఖ్యం కొంత వెనుక పడుతుంది. కాలేజ్ చదువులలో కొంత జాప్యం, కొంత మందకొడితనం  జరగవచ్చు. కనుక ప్రయత్నపూర్వకంగా విజయం సాధించాలి. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం జరుగుతుంది. వివాహం కూడా కొంత  జప్యంగా జరుగు తుంది. వీరికి సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు వంటివి వీరికి జీవితకాలం వరకు మేలు చేస్తాయి.  51 సంవత్సరాల తరువాత వచ్చే బుధదశ వరకు సాఫీగా జరిగే జీవితంలో తరువాత కేతుదశ కాలం 7  సంవత్సరాలు కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. కానీ తరువాత 58 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ వీరికి సౌఖ్యవంతమైన జీవితానికి అవకాశం ఇస్తుంది. వృద్ధాప్యం వీరికి సౌఖ్యవంతంగా జరుగుతుంది.

పునర్వసు నక్షత్ర రెండవ  పాదం:- పునర్వసు నక్షత్ర రెండవ  పాదం వృషభరాశిలో ఉంటుంది. వృషభరాశి అధిపతి
శుక్రుడు, పునర్వసు నక్షత్ర అధిపతి గురువు వీరి మీద శుక్రు  గురు గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు గురువులుగా లోక పుజితులు ఔతారు. వీరు ధర్మపక్షపాతులుగా ఉంటారు.  వీరు దేవగణానికి చెందిన వారు కనుక ఏ  పని అయినా సౌమ్యతతో సాధిస్తారు. ఉన్నత ఉపాధ్యాయులుగా ,  ఉన్నతోద్యోగులుగా వీరు రాణిస్తారు. బాల్యంలో వీరు సౌఖ్యాలను అనుభవిస్తారు. 10 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా  19 సంవత్సరాల కాలం సౌఖ్యం కొంత వెనుక పడుతుంది. విద్య లో కొంత మందకొడి తనం నెలకొంటుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. వివాహంలో జాప్యం ఉంటుంది. 29 సంవత్సరాల అనంతరం వచ్చే బుధదశ కొంత ఉపశమనం కలిగిస్తుంది.  46 సంవత్సరాల తరువాత వచ్చే కేతు దశలో  కొన్ని సమస్యలు  ఎదురైనా 7 సంవత్సరాల అనంతరం 53 సంవత్సరంలో శుక్రదశలో  సౌఖ్యవంతమైన జీవితం ఆరంభం  ఔతుంది. మిగిలిన జీవితం సౌఖ్యవంతంగా  జరిగుతుంది.

  పునర్వసు నక్షత్ర మూడవ పాదం:-  పునర్వసు నక్షత్ర మూడవ పాదం మిధున రాశిలో  ఉంటుంది. మిధున రాశి అధిపతి బుధుడు. పునర్వసు నక్షత్ర గురువు . వీరికి బుధ గురు గ్రహ ప్రభావం ఉంటుంది. కనుక వీరు మేధో సంబంధిత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉపాద్యాయులు, ఉన్నతోపాధ్యాయులు , విద్యాసంస్థ అధిపతులుగా వీరు రాణిస్తారు. భూ సంబంధిత  వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి.  బంగారు వస్తువుల మిద వీరికి ఆసక్తి ఉంటుంది. బాల్యం సౌఖ్యంగా ఆరంభం ఔతుంది.  6 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా తరువాత 19 సంవత్సరాల కాలం సౌఖ్యం కొంత వెనుక పడుతుంది సౌఖ్యం తగ్గు ముఖం పడుతుంది.  విద్య లో కొంత మందకొడితనం కొనసాగుతుంది. ప్రయత్నా పూర్వకంగా విజయం సాధించాలి. జీవితంలో సకాలంలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. వివాహం సకాలంలో జరుగుతుంది. 25 సంవత్సరాల అనంతరం వచ్చే బుధదశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. వీరికి బుధదశ  సాఫీ గా జరుగి పోతుంది. 42 సంవత్సరాల తరువాత ఆరంభం అయ్యే కేతు దశ వలన వచ్చే సమస్యలు 7 సంవత్సరాలు ఎదురైనా తరువాత వచ్చే 49 సంవత్సరాలలో వచ్చే శుక్రదశలో  వీరికి  తిరిగి సౌఖ్యవంతమైన జీవితం మొదలౌతుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా జరుగుతుంది.

పునర్వసు నక్షత్ర నాలుగవ  పాదం:- పునర్వసు నక్షత్ర నాలుగవ  పాదం కటకరాశిలో ఉంటుంది. కతకంలో చంద్రుడు వర్గోత్తమం పొందుతాడు కనుక వీరికి తల్లి అంటే ప్రేమాభిమానాలు అధికంగా ఉంటాయి. వీరికి  తల్లితో ఉన్న అనుభందం విడదీయలేనిది. ఔషధ రంగం వీరికి చాలా అనుకూలం. ఉపాద్యవృత్తి కూడా వీరికి అనుకూలమే. తెల్లని వస్తువులు, పసుపు వర్ణ వస్తువులతో సంబంధం ఉన్న వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తులు వీరికి అనుకూలం. బాల్యం సౌఖ్యంతో మొదలైనా 2 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా తరువాత 19 సంవత్సరాల కాలంలో  సౌఖ్యం కొంత వెనుక పడుతుంది విద్య మందకొడిగా సాగుతుంది. ప్రయత్నపూర్వకంగా విద్యలో విజయం సాధించాలి. విద్యాభ్యాసం పూర్తి  అయిన తరువాత జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరిగే అవకాశం ఉంది. 38 సంవత్సరాల తరువాత వచ్చే కేతుదశలో ఎదురయ్యే సమస్యలు 7 సంవత్సరాల తరువాత తగ్గి 45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ వీరికి సౌఖ్యాలను అందిస్తుంది. తరువాత జీవితం సౌఖ్యంగా సాఫీగా జరుగుతుంది.

ఆరుద్ర నక్షత్రం

ఆరుద్ర నక్షత్రం – గుణగణాలు, ఫలితాలుఆరుద్ర నక్షత్రాన్ని పరమేశ్వరుని జన్మ నక్షత్రంగా ప్రతీతి. ఆధిపత్య దేవుడు పరమేశ్వరుడు. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు. గోమేధికం రాయి పెట్టుకోదగినది. వీరు వస మొక్కలు పెంచుకోవాలి. దర్భ సమిధలతో హోమం చేస్తే మంచిది.ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు మిథున రాశిలోనే ఉంటాయి.ఆరుద్ర మొదటి పాదముఆరుద్ర మొదటి పాదములో జన్మించిన వారు అదృష్టంపైనే నమ్మకం పెట్టుకుంటారు. అదృష్టంతోనే నెగ్గుకు రావాలనే మనస్తత్వం. వస్తు, విషయ జాగ్రత్తలు ఎక్కువ. ఈ విషయంలో ఒక్కోసారి శృతిమించుతుంటాయి కూడా. దీని వల్ల ఇబ్బందులు తప్పవు. పారదర్శక వైఖరితో కలుపుకునే స్వభావం ఉంటుంది. లోకాన్ని పరిశీలించే స్వభావం ఉండటంతో అవకాశాలపై పట్టు నిలుపుకుంటారు. సంస్కృతి, సాంప్రదాయలపై, ఆచార వ్యవహారాలపై ఆసక్తి, శ్రద్ధ ఉంటుంది.ఆరుద్ర మొదటి పాదములో గ్రహ దశలు ఈ పాదములో జన్మించినవారికి ముందుగా రాహు మహర్దశ 18 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి. ఆరుద్ర రెండో పాదముఆరుద్ర రెండో పాదములో జన్మించిన వారిలో పట్టుదల, తీక్షణత ఎక్కువగా ఉంటాయి. అంతిమ లక్ష్యం మీద దృష్టి పెడతారు. ఆలోచనల్లో భిన్నత్వాన్ని గుర్తించలేరు. దీంతో కోరి కష్టాలు తెచ్చుకుంటారు. పలు విషయాలందు ఆసక్తి ఎక్కువ. ఒక్కోసారి చేతులు కాల్చుకుంటారు. సమస్యలను గుర్తించటంలో ఇబ్బంది ఉంటుంది. మధ్యలో ఏర్పడే పరిణామాలతో కొంచెం గందరగోళానికి గురవుతారు.ఆరుద్ర రెండో పాదములో గ్రహ దశలు రెండో పాదములో జన్మించినవారికి రాహు మహర్దశ 13 సంవత్సరాల ఆరు నెలలు ఉంటుంది. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.ఆరుద్ర మూడో పాదముఆరుద్ర మూడో పాదములో తరచూ సమస్యలు ఎదుర్కొంటారు. చురుకుదనం వల్ల ఒక్కోసారి హద్దు మీరుతుంది. దీంతో సమస్యలు ఎదుర్కొనక తప్పదు. వేగంతో ముందుకెళ్లబోయి తల బొప్పి కట్టించుకుంటారు. వాయుతత్వ స్వభావం ఉండటంతో నిర్ణయాల్లో నిలకడ లోపిస్తుంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. సర్దుకొనే స్వభావం ఉండటం కలిసి వచ్చే లక్షణం. కానీ సమస్యను నిజాయితీగా అర్థం చేసుకుంటేనే ఫలితముంటుంది.ఆరుద్ర మూడో పాదములో గ్రహ దశలు మూడో పాదములో జన్మించినవారికి ముందుగా రాహు మహర్దశ 9సంవత్సరాలు, తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.ఆరుద్ర నాలుగో పాదముఆరుద్ర నాలుగో పాదమున జన్మించిన వారు నిదానంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా లౌక్యం, చాకచక్యం మిగిలిన లక్షణాలను ప్రభావితం చేస్తాయి. దూరదృష్టితో వ్యవహరించాలి. నిలకడ సాధించడం కూడా ముఖ్యమే. నిదానమే ప్రధానం అన్న సూక్తి వర్తిస్తుంది. అందరిని కలుపుకుపోయే స్వభావం ఉంటుంది. దీంతోపాటు ఫలితాన్ని పంచుకొనే వైఖరికూడా అవసరం. అనవసరపు కోపానికి సంకెళ్లు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అన్నింటా గెలిచి రావాలన్న వ్యూహాన్ని సమర్థంగా అమల్లో పెట్టాల్సి ఉంటుంది.ఆరుద్ర నాలుగో పాదములో గ్రహ దశలు నాలుగో పాదములో జన్మించిన వారికి ముందుగా రాహు మహర్దశ 4 సంవత్సరాల 6 నెలలు ఉంటుంది. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.ఆరుద్ర నక్షత్రము – గుణగణాలుఈ నక్షత్రములో జన్మించిన వారిది అనుకొన్న దానిని సాధించేదాకా నిద్రపోని తత్వం. మాటల్లో నేర్పరితనమును, మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది. పట్టుదల కూడా ఉంటుంది. కార్యసాధనలో ఎన్నిసార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. డబ్బుల విషయంలో నిర్ణయాలు సరిగా ఉండవు. తప్పుడు సలహాలు, శక్తిసామర్ధ్యాలు, పగ తీఱ్చుకోవాలనే కోరిక, మొండి పట్టుదల జీవితంలో ఒడిదుదుకులకు దారి తీయవచ్చును. తొందరపాటుతో ముందు వెనుక మంచి-చెడు అనేవి చూడకుండనే నిర్ణయాలను వెంటనే అమలు పరుస్తారు. అవమానాన్ని ఓర్చుకొనలేరు.ఆయుస్సు కూడా ఎక్కువే. ఆడవారిపట్ల గౌరవ భావం కలిగి ఉంటారు. మూకలని నమ్మించ కలిగిన ఆకట్టుకొనగలిగిన శక్తిని వీరు కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా ఎనలేని శక్తి సామర్ధ్యాలతో మరల వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు. వీరి వీరి బ్రతుకులలో ఏభై రెండు నుంచి 26 సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి.ఈ నక్షత్రము వారు ఆలోచనలు, నిర్ణయాలు చకచకా మార్చేసుకుంటారు. క్రయ విక్రయాలయందు ఆసక్తి ఉంటుంది. దీంతో వ్యాపారమందు దూసుకెళ్లే స్వభావం కనిపిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించకపోతే వీరితో పాటు వెంట ఉన్నవారికికూడా ఇబ్బంది తప్పదు.

రోహిణి నక్షత్రం

రోహిణి నక్షత్రం-గుణగణాలు, ఫలితాలు రోహిణీ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ. నక్షత్రాధిపతి చంద్రుడు. ఈ నక్షత్ర జాతకులు మానసిక ధృఢత్వము కలిగి ఉంటారు. మానవ గణము కనుక ధర్మచింతన కలిగి ఉంటుంది. జీవితంలో లౌక్యంగానూ ప్రవర్తిస్తారు. అనుకున్నది నయనా భయానా చెప్పి సాధిస్తారు. అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. సాహస క్రీడలంటే ఇష్టపడతారు. అందులోనూ ప్రావీణ్యత, గుర్తింపు సాధిస్తారు. రోహిణి నక్షత్రం 4 పాదాలూ వృషభ రాశిలోనే ఉంటాయి. రోహిణి మొదటి పాదము రోహిణి మొదటి పాదములో జన్మించిన వారి ప్రధాన బలహీనత అనవసర విషయాలపై దృష్టిపెట్టడం. అవసరం లేని ఇతర విషయాల మీదే ఎక్కువగా ఆలోచిస్తారు. ఆలోచన అంతగా లేకుండానే తొందరపడి పనులు మొదలుపెడతారు. దీనివల్ల ఇబ్బందుల్లో కూరుకుపోతారు. నిదానంగా ప్రవర్తించాల్సిన విషయాల్లో జాగరూకత అవసరం. ఇతర విషయాలవైపు మనసు లాగితే చేసే పనిమీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి, అనవసర విషయాలకు ప్రాధాన్యం తగ్గించాలి. పరిస్థితుల్ని బట్టి సర్దుకోగలగడం ఒక వరం అనుకోవాలి. సానుకూలతను బట్టి మెలగాలి. రోహిణి మొదటి పాదము గ్రహ దశలు ఈ నక్షత్రంలో జన్మించిన వారి గ్రహ దశల విషయానికి వస్తే.. ముందుగా చంద్ర మహర్దశ పదేళ్లు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 ఏళ్ళు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, ఆపై గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది. రోహిణి రెండో పాదము రోహిణి రెండో పాదములో జన్మించిన వారు అదృష్ట జాతకులు. కలిసివచ్చిన అవకాశాల్ని చక్కగా ఉపయోగించుకునే నేర్పు ఉంటుంది. ఈ విషయంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మాటల్లో పటుత్వం కలిగి ఉంటారు. ఈ ధోరణితో నెగ్గుకొని రాగలుగుతారు. ఇక జీవితంలో తరచూ తారసపడే అనవసరమైన విషయాల మీద ఆందోళన తగ్గించుకోవాలి. ప్రతిభా సామర్థ్యాలు ఏ స్థాయిలో వినియోగించుకోవాలనే విషయంలో స్పష్టత సాధిస్తే మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. రోహిణి రెండో పాదములో గ్రహ దశలు ఈ పాదములో జన్మించిన వారికి ముందుగా చంద్ర మహర్దశ ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత కుజ మహర్దశ 7 ఏళ్ళు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, ఆపై గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17 సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది. రోహిణి మూడో పాదం రోహిణి మూడో పాదంలో జన్మించిన వారికి రకరకాల ఆలోచనలు పరిభ్రమిస్తుంటాయి. అయితే ఆ ఆలోచనలు బయటపెట్టకుండా జాగ్రత్త పడతారు. కళలయందు ఆసక్తి ఉంటుంది. కొంచెం పట్టు ఉన్నా ఎక్కువ పట్టు ఉన్నట్లు చూపగల నేర్పు ఉంటుంది. అయితే ఎల్లప్పుడు అనవసరపు ఆందోళనలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. భావోద్వేగాలను ప్రకటించే విషయంలో పరిమితి తప్పనిసరి. గ్రహ దశలు తొలుత చంద్ర మహర్దశ 5 సంవత్సరాలు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, తదుపరి గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది. రోహిణి నాలుగో పాదం రోహిణి నాలుగో పాదంలో జన్మించిన వారు అంది వచ్చిన అవకాశాల్ని పసిగడుతారు. జాగరూకులై ప్రవర్తించడం వీరి సహజసిద్ధ లక్షణం. జాగ్రత్తలో ఉన్నప్పటికీ ఒక్కోసారి ఎదురుదెబ్బలు తగిలే అవకాశం. అటువంటి సందర్భాల్లో సైతం మెరుగైన అవకాశాలకోసం అన్వేషిస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో తమను తాము గుర్తెరిగి ప్రవర్తిస్తుంటారు. గ్రహ దశలు తొలుత చంద్ర మహర్దశ రెండున్నర సంవత్సరాలు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, తదుపరి గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, అనంతరం బుధ దశ 17సంవత్సరా లు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది. రోహిణి నక్షత్రము గుణగణాలు ఈ నక్షత్ర జాతకులు మానసిక ధృఢత్వము కలిగి ఉంటారు. అనుకూలంగా నదచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. త్వరగా కోపం రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్సలనైనా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారం కలసి వస్తుంది. అపనిందలు, ఆరోపనలు జీవితములో ఒక భాగము ఔతాయి. జీవితములో ఒడిదుడుకులు సహజము. వీరు హాస్యప్రియులు, కళ ప్రియులు కనుక కళారంగములో ప్రగతిని సాధిమ్చి అవార్దులు పొందగలరు. సంతానముతో విభేదిస్తారు. గురు మహర్ధశ, శని మహర్ధశ వీరికి కలసి వస్తుంది. ప్రేమ వివాహాలు కలసి రావు. భార్యా భర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది. క్రీడలు, కోర్టు వ్యవహారాలలో విజయము సాధిస్తారు. గజ ఈతగాళ్ళూ ఔతారు.తనకు తాను సుఖపడుతూనేతన వారిని సుఖ పెడతారు. వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు. తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చి దిద్దుతారు.

భరణి నక్షత్రం

భరణి నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు మేష రాశిలోని రెండో నక్షత్రమే ‘భరణి నక్షత్రము’. ఈ నక్షత్రం స్త్రీ లక్షణం కలిగి ఉన్నప్పటికీ ఉగ్రతారగా గుర్తింపు పొందింది. శుక్రుడు అధిపతిగా ఉన్నాడు కనుక వీరు రజో గుణంతో భాసిల్లుతారు. ఈ నక్షత్రము 4 పాదాలూ మేష రాశిలోనే ఉన్నాయి.భరణి మొదటి పాదము శారీరకంగా శక్తివంతులై ఉంటారు. ఇదే సమయంలో పౌరుషవంతులుగానూ.. శత్రువులను లొంగదీసుకుంటారు. పంతాలు పట్టింపులు సాధించుకునేందుకు ప్రయత్నిస్తారు. పెద్దలపట్ల గౌరవం, ఆచార వ్యవహారాలపైనా, సాంస్కృతి సాంప్రదాయలపైన, నీతి నియమాలపైనా శ్రద్ధాసక్తులు కలిగి మెసులుకుంటారు. అయితే తమలోని లోపాలు బయటపడకుండా నిరంతరం జాగ్రత్త పడుతుంటారు.మొదటి పాదములో గ్రహ దశలు జన్మించినప్పటి నుంచి శుక్ర మహాదశ ఇరవై సంవత్సరాలు, రవి మహాదశ ఆరు సంవత్సరాలు, చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 సంవత్సరాలు ఉంటుంది.భరణి రెండో పాదముభరణి రెండో పాదం యందు పంతం, పట్టుదల అధికంగా కనిపిస్తుంది. అనుకొన్నది పూర్తి చేయాలన్న పట్టుదల ఉంటుంది. అయితే ఈ క్రమంలో పలు సందర్భాల్లో మొండితనంతో వ్యవహరిస్తారు. సంపన్న జీవితాన్ని గడపడంతోపాటు మంచిచెడులపై అవగాహన, నీతి నియమాలపై శ్రద్ధ కలిగి ఉంటారు. కీర్తివంతులై చిరస్థాయిని పొందుతారు. ఆలోచనా ధోరణి అధికం. అనవసర విషయాలపై ఆసక్తితో శోధిస్తారు.రెండో పాదములో గ్రహ దశలు జన్మించినప్పటి నుంచి శుక్ర మహాదశ 20 సంవత్సరాల పాటు ఉంటుంది. రవి మహాదశ ఆరు సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 సంవత్సరాలు ఉంటుంది.భరణి మూడో పాదముభరణి మూడో పాదంలో జన్మించినవారు తమ ప్రమేయం ఏమీ లేకుండానే ఫలితం కోరుకుంటారు. వాస్తవానికి-ఆలోచనకు మధ్య పొంతన ఉండదు. అయితే తెలివితేటల విషయంలో గొప్పవారే. పొగడ్తలంటే ఇష్టపడతారు. శక్తివంతులు కావడంవల్ల ఆధిక్యాన్ని ప్రదర్శించడానికి ముందుంటారు. తొందరగా కోపం వచ్చినా నిగ్రహ శక్తిని కలిగి ఉంటారు. ఈ పాదంలో జన్మించిన వారికి దైవభక్తి ఎక్కువ.భరణి మూడో పాదంలో గ్రహ దశలు పుట్టినప్పటి నుంచి ముందుగా శుక్ర మహాదశ సుమారుగా పదేళ్లు. రవి మహాదశ ఆరేళ్లు, చంద్ర మహర్దశ పదేళ్లు, కుజ దశ ఏడేళ్లు, రాహు దశ పద్దెనిమిదేళ్లు ఉంటుంది.భరణి నాలుగో పాదముఈ పాదంలో ఊహల ఊయాల ఊగుతారు. మరోవైపు ఆడంబరాన్ని, పటాటోపాన్ని కోరుకుంటారు. పంతంపట్టి పనులు సాధించుకోవడం వీరి లక్షణం. కష్టమైనా, నష్టమైనా తమదే పైచేయిగా ఉండాలని పట్టుబడతారు. తరచూ కోపాన్ని ప్రదర్శిస్తారు. బతిమాలించుకునే మనస్తత్త్వం. పొగడ్తలను ఆస్వాదిస్తారు. గర్వంతోనూ, కఠినత్వంతోనూ వ్యవహరిస్తారు.భరణి నాలుగో పాదంలో గ్రహ దశలు ఈ పాదంలో జన్మించిన వారు శుక్ర మహాదశ ఐదేళ్లు, రవి మహాదశ ఆరేళ్లు, చంద్ర మహర్దశ పదేళ్లు, కుజ దశ ఏడేళ్లు, రాహు దశ పద్దెనిమిదేళ్లు ఉంటుంది.భరణి నక్షత్రము – గుణగణాలు, ఫలితాలు భరణి నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యధిపతి కుడా కుజుడు. ఈ కారణంగా వీరు అందంగానూ ఆకర్షణీయంగా ఉంటారు. ఇది మానవ గణ నక్షత్రము కనుక లౌక్యం చొరవ ప్రదర్శించే గుణము కూడా ఎక్కువే. ఈ నక్షత్రంలో జన్మించినవారు వేదాంత విషయాలపట్ల, ప్రాచీన సంప్రదాయాలపట్ల ఆసక్తి కలిగి ఉంటారు.పొగడ్తలంటే గిట్టనివారుగా పైకి కనిపించినా వాటిని బాగా ఆస్వాదిస్తారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయాన్ని, సందర్భాన్ని బట్టి తమ అభిప్రాయాలు మార్చుకుంటుంటారు. ఎదుటి వారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదే విధంగా అంతే కఠినంగా విమర్శిస్తారు. రెండు వాదనలను సమర్ధించుకుంటారు. స్వార్ధం కొంత సహజమే. తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు. వైఖరిలో మార్పు తెచ్చుకోలేకపోవడంతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించలేరు. వృద్ధాపయంలో సుఖజీవనం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు.సమాజంలో పేరు, ప్రతిష్థ వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు. సౌందర్యం, విలాసవంతం ఉండే విషయాల్లో ఆసక్తి చూపిస్తారు. సుగంధద్రవ్యాలు, సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికం. కళత్రము వలన కలసి వస్తుంది. విభేదాలు ఉంటాయి. అంతేకాదు వీరు వ్యూహరచన గొప్పగా ఉంటుంది. వీరు సలహాదారులుగానూ రాణిస్తారు.ఈ నక్షత్రంలో జన్మించిన వారికి బాల్యం సుఖవంతంగా జరుగుతుంది. 28 నుంచి 32 సంవత్సరాల తరువాత కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు. ఇందులో జన్మించిన నక్షత్రపాదాలు, జాతక చక్రంలో గ్రహస్థి వలన మార్పులు ఉంటాయి. ఫలితాలు సాధారణంగా అందరికీ సమానమైనా పుట్టిన సమయం గ్రహస్థితులు నవాంశము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు ఉంటాయి. ఇక వీరు వృద్ధాప్య దశలో సుఖవంతంగానే ఉంటారు.వీరి తమ వ్యక్తిత్వ తీరువల్ల అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధించడానికి ఆటంకాలు ఎదురవుతాయి. అందుకే నిత్యం భరణీ నక్షత్రములో పుట్టిన జాతకులు మహాలక్ష్మిదేవి పూజించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. ఇంకా సంవత్సరానికి ఒక్కసారైనా ఇంద్రాణీ హోమం చేయించడం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది.భరణి నక్షత్రంలో పుట్టిన జాతకులకు 9 అనే సంఖ్య అనుకూలిస్తుంది. 9తో పాటు 18, 27, 36, 45, 54, 63, 72 అనే సంఖ్యలు కూడా శుభ ఫలితాలనిస్తాయి. అలాగే ఈ జాతకులకు ఎరుపు, తెలుపు రంగులు అదృష్టానిస్తాయి. ఇందులో ఎరుపు రంగు చేతి రుమాలును వాడటం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి.భరణి నక్షత్ర జాతకులకు కుజ గ్రహ ప్రభావం ఉండటంతో వీరికి మంగళవారం కలిసివస్తుంది. బుధ, ఆదివారాలు సామాన్య ఫలితాలనిస్తాయి. అయితే గురువారం మాత్రం ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది

నవగ్రహాల శాంతి

నవగ్రహాల శాంతికి ఎలాంటి వస్తువులు దానం చేయాలంటే? నవగ్రహాల ఆధిపత్యంలో కష్టసుఖాలుంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కానీ నవగ్రహాలను శాంతి పరచడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇందులో భాగంగా ప్రతి శనివారం ఆయా గ్రహాధిపత్యంలో పుట్టిన జాతకులు తమ గ్రహాధిపత్య సంచారాన్ని అనుసరించి పూజ, దానం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. నవగ్రహ శాంతికి సంబంధించి జాతక ప్రకారం పూజాది కార్యక్రమాలు చేయాలనుకునేవారు నవగ్రహాలకు ప్రీతికరమైన వస్తువులతో పూజ, దానాది కార్యక్రమాలను నిర్వహించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నవగ్రహ పూజలో భాగంగా గ్రహ శాంతికి, దోష నివారణకు దానాలు చేయాలి. ఇలా చేసిన వారికి దోష నివారణ జరిగి సకల శుభాలు కలుగుతాయి. కోరిన కోర్కెలు నెరవేరతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సూర్యగ్రహ శాంతి కోసం పూజ చేసేవారు గోధుమలను దానము చేయాలి. ఈ జాతకులు చేతికి కెంపు ఉంగరాన్ని ధరించటం వల్ల రోగాదులు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది. గురు గ్రహానికి పూజ నిర్వహించేవారు శనగలను దానం చేయాలి. అదే విధంగా కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించటం వల్ల వీరికి అధికారం, ధనయోగంతో పాటు కీర్తివంతులవుతారు. చంద్రగ్రహ శాంతి కోసం చంద్రుణ్ణి పూజించి బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది. ముత్యాన్ని ధరించటం వల్ల నేత్రాలకు సంబంధించిన బాధలకు నివృత్తి కలుగుతుంది. కుజ గ్రహ పూజలో కందులను దానం చేయాలి. పగడపు ఉంగరాన్ని ధరించటం వల్ల రుణ విముక్తి కలిగి శత్రు బాధ తొలగుతుంది. బుధ గ్రహ పూజలో పెసలను దానం చేయాలి. పచ్చ ఉంగరాన్ని ధరించటం వల్ల ధనలాభం కలగటమే కాక వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. శుక్రుని పూజలో అలచందల దానము చేయాలి. వజ్రం, పగడము ధరించిటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యములకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. రాహు పూజకు మినుములను దానం చేయాలి. గోమేధిక ఉంగరాన్ని ధరించటం వల్ల భయాందోళనలు తగ్గుతాయి. ధనప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. కేతువు పూజలో ఉలవల దానం చేయాలి. వైఢూర్యం ఉంగరాన్ని ధరించాలి. దీనివల్ల సర్పాది భయాలు తొలగటమే కాక దైవశక్తి పెరుగుతుంది. శనిపూజలో నువ్వులను దానం చేయాలి. నీలిరంగు రాయి కలిగిన ఉంగరాన్ని ధరించటం వల్ల ఆరోగ్యవంతులవటమే కాక ఇతరత్రా కష్టాలు తొలగిపోతాయి.

గ్రహాలు వృత్తులు

గ్రహాలు వృత్తి కారకత్వాలు సూర్యుడు : వైద్యశాస్త్రం,బౌతికశాస్త్రం,కుజునితో కలసిన శస్త్ర చికిత్సకునిగా,గురువుతో కలసిన ఆయుర్వేదం,శనితో కలసిన అనస్తీషియా,ఆర్ధోఫిడిక్స్ వైద్యుడు,చంద్ర,శుక్రులతో కలసిన గైనకాలజిస్ట్,బుధునితో కలసిన నరాల నిపుణులు,మరియు కర్ణరోగ వైద్యం సూచించును.రాజ్యాధికారము , పరిపాలనా విభాగాములకు అధికారి , ఆఫీస్ మేనేజ్ మెంట్ , అధ్యక్ష పదవులు, ధార్మిక సంస్థలు , సంఘములకు గౌరవ అధ్యక్షులు మొదలగు అనేక విధముల యజమాని హోదా పొందగలరు. చట్ట సభలలో అధికారము, శాసన నిర్మాణ కర్తలు , ప్రజా పరిపాలకులు . ఆర్డర్స్ జారీ చేయు అధికారము , హోదా , గౌరవము కలిగిన వృత్తులను ప్రసాదించును. చంద్రుడు : చరిత్ర,కవిత్వం,సైకాలజీ,సముద్ర గర్బమును పరిశోదించుట. నీటికి సంబంధించిన శాఖలు , ద్రవ పదార్దములకు సంబంధించినవి . తెలుపు వర్ణమునకు చెందినవి . అనగా కూల్ డ్రింక్స్ , పాలు , పాల ఉత్పత్తులు , పంచదార , బియ్యము వ్యాపారములు , రైస్ మిల్స్ , హోటల్స్ , టిఫిన్ సెంటర్స్ , మిల్క్ పార్లర్స్ , నావికుల విద్య,శుక్రునితో కలసిన పాల వ్యాపారం,పెయింట్స్,కుజ శుక్రులతో కలసిన పశువైద్యం,బుద్ధునితో కలసిన టెక్స్ టైల్స్,వస్త్ర వ్యాపారములు , వాటర్ ప్లాంట్స్ , నీరు , చేపల ఉత్పత్తులు , బావులు త్రవ్వడం , బోరింగ్స్ , సముద్రపు ఉత్పత్తులు , జలాంత ర్గామి, నావికా దళ ఉద్యోగములు , దూది వ్యాపారము , దూది ఉత్పత్తులు, పుడ్ ప్రొడక్ట్స్ , వెండి వస్తువులు తయారీ మొదలగు వృత్తులను ప్రసాదించును . కుజుడు : గృహ నిర్మాణం,సర్వే,సివిల్ ఇంజనీర్,శస్త్ర చికిత్సలు,పశుపోషణ,శస్త్ర చికిత్సలు,మెకానికల్ ఇంజనీర్,రసాయన విద్యలు,రక్షణ విధానం,పేలుడువస్తువులు,ఫైర్ సర్వీస్,తీర్పులు,హైడ్రో ఎలక్ట్రిక్ ఇంజనీర్,విమాన చోదక విద్య,వ్యవసాయము , వ్యవసాయ ఉత్పత్తులు , మాంసపు ఉత్పత్తులు , కోళ్ల పరిశ్రమలు , యంత్రములు, పనిముట్లు తయారీ , వడ్రంగి పనులు , భవన నిర్మాణములు , కనస్ట్రక్షన్స్ , కాంట్రాక్టులు , బిల్డింగ్ మెటీరియల్ , విద్యుత్తు శక్తి శాఖలు , విద్యుత్ ప్లాంట్స్ , మిలటరీ , పోలీస్ తదితర రక్షణ శాఖలు , సైన్యమునకు సంబంధించిన ఉద్యోగాలు , మోటార్స్ , మెకానికల్ , భూ పరిశోధన, అటవీ ఉత్పత్తులు , అటవీ శాఖ కు చెందిన ఉద్యోగాలు ఇలాంటి వృత్తులు కుజుడు ఆధీనము లో ఉంటాయి . బుధుడు : వ్యాపారం,కమర్షియల్ డిగ్రీలు,బ్రోకర్స్ , బ్యాంకులు , పైనాన్సియల్ సెక్షన్స్ , చిట్ ఫండ్ వ్యాపారములు , ట్రెజరీ డిపార్టమెంట్లు , బడ్జెట్ తయారీ చేయువారు , చిత్ర కళ,డ్రాయింగ్,పెయింటిగ్,నమూనాలు గీయుట,ఎస్టిమేటింగ్,వ్రాత,గణిత విద్య,కంస్ట్రక్షన్ డిజైన్,జ్యోతిష్యం,శుక్రునితో కలసిన చాయా చిత్రములకు చెందిన వ్యాపారం,రసాయన శాస్త్రం,జీవశాస్త్రం,వృక్షశాస్త్రం,అనువాదకులు,ఉపాద్యాయులు, పత్రికలు , పత్రికా సంపాదకులు , ముద్రణా రంగములు , పుస్తక పరిశ్రమలు , రచయితలు చార్టెడ్ ఎకౌంట్స్ , విలేఖర్లు ,జర్నలిజం , గుమస్తా ఉద్యోగాలు ,సాప్ట్ వేర్ , కంప్యూటర్ , టెక్నాలజీ సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు పచ్చళ్ళు పరిశ్రమలు. గురుడు : న్యాయవాదులు,ఆర్ధిక శాస్త్రం,సంస్కృతంలో పట్టాలు,వేదాంతం,అవదాన విద్యలు,జ్యోతిష్యం,విద్యా సంస్థలు , ఉపాధ్యాయులు, లెక్చరర్స్ , భోధనా సంబంధ ఉద్యోగములు , పురోహితులు , పూజార్లు , పూజ గది , పూజా ద్రవ్యములు , దేవాలయ సిబ్బంది , దేవాదాయ శాఖలలో ఉద్యోగాలు , పరిశోధనా రంగములు , విశ్లేషకులు , మత ప్రచారకులు , మేధావి వర్గమునకు చెందినవారు . సంస్కృతి , సంప్రదాయములను వివరించు స్వామీజీలు వీరందరూ గురుడు కు సంబంధించిన వారు . గురుడు ఆకాశ తత్వమునకు చెందిన వాడు కాబట్టి విమానయాన రంగములు , శాటిలైట్ లు మొదలగునవి . శుక్రుడు : నాట్య రంగం,చిత్రకళలు,రసాయన శాస్త్రం,కామశాస్త్రం,గురు,బుదులతో కలసిన ఎలక్ట్రానిక్స్,వస్త్రాలు, ఆభరణ తయారీలు , ఆర్నమెంట్ నగల వ్యాపారము , బంగారు వ్యాపారము , అలంకరణ సామాగ్రి , ఇంటీరియర్ డిజైనింగ్ , ఫాన్సీ దుకాణాలు , హైర్ స్టైయిల్ డిజైనింగ్,కుట్టుపని,ఎంబ్రాయిడరీ ట్రైనింగ్,ఇల్లు,వాహనాలకు పెయింట్స్ వేయటం,మసాజ్ సెంటర్స్ , రెడీమేడ్ వస్త్రములు , వస్తువులు , స్త్రీలకు సంబంధించిన వస్తువులు , సుగంధ ద్రవ్యములు , అగరబత్తీ పరిశ్రమలు, నూతన వస్తువులు, కళలు , సినిమా రంగము , కళాకారులు , ఎలక్టానిక్ మీడియా , గాయకులు , సంగీత సాహిత్య రంగములు , శనిగ్రహము :గనులు,త్రవ్వకాలు,భూగర్భ శాస్త్రం,భూగోళ శాస్త్రం,పురాతన వస్తుసేకరణ,బొగ్గు గనులు,ఆర్ధోఫిడిక్స్, రాజకీయ నాయకులు , నామినేటెడ్ పోస్టులు పొందేవారు . న్యాయవాదులు , జడ్జీలు , న్యాయశాఖకు సంబంధించి ఉద్యోగులు , గాలికి సంబంధించిన రంగములు అనగా టెలీ ఫోన్ , కమ్యునికేషన్ , బట్వాడా కార్మికులు , తపాలా శాఖ , సేవకులు , కూలీలు , వ్యవసాయ కార్మికులు , కష్టముచే జీవించువారు , ఇనుము , ఉక్కు పరిశ్రమలు , ఇనుము ఉత్పత్తులు , బొగ్గు సంబంధిత శాఖలలో పనిచేయువారు , బరువులు మోయువారు , ఇన్సూరెన్స్ సంబందిత రంగములలో పని చేయువారు,ఇంగ్లీష్ విద్య,ప్రజా ప్రభుత్వ విద్యలు, సంచార జీవులు, నూనె కర్మాగారములు , పెట్రోల్ , డీసెల్ , గ్యాస్ సంబంధిత పరిశ్రమలలో ఉద్యోగ, వ్యాపారములు , సెకండ్ హ్యాండిల్ వస్తువుల వ్యాపారము మొదలగు వృత్తులు శనిగ్రహము వలన కలుగును . కంప్యూటర్ హార్డ్ వేర్ , అసెంబ్లింగ్ యూనిట్స్ మొదలగునవి . రాహువు : ఈ గ్రహ ప్రభావము వలన డాక్టర్స్ , మత్తు పానీయముల వ్యాపారము చేయువారు , మందుల దుకాణములు, కెమికల్ ఇండస్ట్రీస్ , రసాయన శాస్త్రవేత్తలు , చెత్త వ్యాపారము ఈ గ్రహమునకు సంబంధించిన వారు. . కేతువు : చర్మపు ఉత్పత్తులు , జోళ్ళు , రబ్బరు పరిశ్రమలు , రబ్బరు ఉత్పత్తులు మొదలగు వృత్తులను కలిగించును

జన్మ లగ్నం, జన్మ రాశి, రత్నం

జన్మ లగ్నం,జన్మ రాశి,నామ ప్రథమ అక్షరం ద్వారా రుధ్రాక్ష ధారణ. చూ,చే,చో,ల,లీ,లూ,లే,లో ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి ,మేష లగ్నం,మేష రాశి వారికి,మృగశిర,చిత్త్ర,థనిష్ట నక్షత్రాల వారికి "3"ముఖాల రుద్రాక్ష గాని,"1","3","5"ముఖాలు కలిగిన రుద్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును."పగడంస్టోన్"ధరించవచ్చును.

ఈ,ఊ,ఏ,ఓ,వా,వీ,వు,వే,వో ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, వృషభ లగ్నం వారికి,రాశి వారికి ,భరణి,పుబ్బ ,పూర్వాషాడ నక్షత్రాల వారికి "6" ముఖాల రుధ్రాక్ష గాని, "4","6","7" ముఖాలు కలిగిన రుధ్రాక్షలు గాని కవచం లాగ థరించ వచ్చును."డైమండ్ స్టోన్"ధరించ వచ్చును. .

కా,కి,కూ,ఖం,ఙ,ఛ,కే,కో,హా ప్రథమ నామాక్షరలు ఉన్న వారికి, మిథున లగ్నం వారికి ,రాశి వారికి ,ఆశ్లేష ,జ్యేష్ట ,రేవతి నక్షత్రాల వారికి "4" ముఖాల రుధ్రాక్ష గాని,"4',"6","7",ముఖాలు కలిగిన రుధ్రాక్షలు కవచం లాగ గాని థరించ వచ్చును."ఆకుపచ్చ స్టోన్"ధరించ వచ్చును..

హి,హు,హె,హూ,డా,డి,డూ,డే,డో, ప్రథమ నామాక్ష్రాలు ఉన్న వారికి,కర్కాటక లగ్నం వారికి ,రాశి వారికి, రోహిణి,హస్తా ,శ్రవణం, నక్షత్రాల వారికి "2"ముఖాల రుధ్రాక్ష గాని ,"2","3","5", ముఖాలు కలిగిన రుధ్రాక్షలు కవచంలాగ గాని ధరించ వచ్చును."ముత్యం స్టోన్"ధరించ వచ్చును.

మా,మీ,మూ,మే,మో,టా,టి,టు,టే ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి,సింహా లగ్నం వారికి,రాశి వారికి, కృత్తిక,ఉత్తర ,ఉత్తరాషాడ నక్షత్రాల వారికి "1"ముఖం గాని, "1","3","5", ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును."కెంపు స్టోన్"ధరించ వచ్చును. .

టో,పా,పి,పూ,ష,ణ,ఢ,పె,పో ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, కన్య లగ్నం వారికి,రాశి వారికి ,ఆశ్లేష,జ్యేష్ట, రేవతి,నక్షత్రాల వారికి "4"ముఖాల రుధ్రాక్ష గాని,"4","6","7",ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును."ఆకుపచ్చ స్టోన్"ధరించ వచ్చును..

రా,రి,రూ,రె,రో,తా,తీ,తూ,తే,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, తులా లగ్నం వారికి, రాశి వారికి,భరణి,పుబ్బ,పూర్వషాడ,నక్షత్రాల వారికి"6"ముఖాల రుధ్రాక్ష గాని ,"4','6","7"ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును.."డైమండ్ స్టోన్"ధరించ వచ్చును.

తో,నా,నీ,నూ,నే,నో,య,యి,యు,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, వృశ్చిక లగ్నం వారికి, రాశి వారికి, మృగశిర,చిత్త్ర,థనిష్ట నక్షత్రాల వారికి "3"ముఖాల రుధ్రాక్ష గాని,"2","3","5"ముఖాల రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును.."పగడంస్టోన్"ధరించవచ్చును. .

యే,యో,బా,బి,బు,ధ,భ,ఢ,బే,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి,థనస్సు లగ్నం వారికి, రాశి వారికి,పునర్వసు,విశాఖ,పూర్వాభాధ్ర,నక్షత్రాల వారికి "5"ముఖాల రుధ్రాక్ష గాని "1",'3","5"ముఖాల రుధ్రక్షలను కవచం లాగ థరించ వచ్చును."కనక పుష్యరాగం స్టోన్"ధరించ వచ్చును.

బో,జా,జి,జు,జే,జో,ఖా,గ,గి,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, మకర లగ్నం వారికి,రాశి వారికి,పుష్యమి,అనూరాధా,ఉత్తరాభాధ్ర నక్షత్రాల వారికి "7"ముఖాల రుధ్రాక్ష గాని,"4","6","7",ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును."నీలం స్టోన్"ధరించ వచ్చును.

గూ,గే,గో,సా,సి,సు,సే,సో,దా,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, కుంభ లగ్నం వారికి, రాశివారికి,పుష్యమి,అనూరాధా,ఉత్తరాభాధ్ర నక్షత్రాల వారికి"7"ముఖాల రుధ్రాక్ష గాని,"4","6","7"ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును."నీలం స్టోన్"ధరించ వచ్చును.

ది,దు,శ్యం,ఝ,ద,దే,దో,చా,చి,ప్రథమ నామాక్షరలు ఉన్న వారికి, మీన లగ్నం వారికి,రాశి వారికి,పునర్వసు,విశాఖ,పూర్వాభాథ్ర నక్షత్రాల వారికి"5"ముఖాల రుధ్రాక్ష గాని,"2","3","5"రుధ్రాక్షలను కవచం లాగ ధరించ వచ్చును."కనక పుష్యరాగం స్టోన్"ధరించ వచ్చును.

కృష్ణుడినే నమ్ముతాను

కొత్తగా క్రైస్తవంలోకి మారిన పార్ధసారధి..పీటర్ గా పేరుమార్చుకున్నాడు.i!i!
క్రైస్తవంలో డబ్బుసంపాదించడంఎలాగో మర్మం కనిపెట్టి పాస్టర్ గామారి "పాస్టర్ పీటర్" అయ్యాడు.i!i!
రెండురేకులువేసి,నాలుగోడలుకట్టి చర్చ్ కుడా కట్టాడు.వ్యాపారం బాగుంది.గొర్రెలు కొత్తగా గూట్లోకి వస్తున్నాయి.i!i!
పాస్టర్ పీటర్ కొడుకు పింటూ 1st స్టాండర్డ్ చదువుతున్నాడు.మహా గడుగ్గాయి.ఒక ఆదివారం వాళ్ళ నాన్నతో చర్చ్ కువెళ్ళాడు.i!i!
పాస్టర్ పీటర్ తన భోధనలుమొదలుపెట్టాడు.ఎప్పుడు అల్లరిచేసే పింటూ ఆ రోజు తన భోధనలు శ్రద్ధగా వినడం తో పీటర్ మరింతరెచ్చిపోయి హిందూదేవుళ్ళను చెడా మడా తిట్టేసాడు.i!i!
ముక్యంగా కృష్ణుడిని.
ఆ రోజు రాత్రి..పింటూ,పీటర్ కు మద్య జరిగిన సంభాషణ చదవండి.i!i!
పింటూ:నాన్నా..
పీటర్:ఏంనాన్న..
పింటూ:యేసుఎవరునాన్న
పీటర్:దేవుడునాన్న
పింటూ:మరి కృష్ణుడుఎవరునాన్న
పీటర్:ఆయనకుడా దేవుడునాన్న
పింటూ:మరిమీరు ఎందుకుతిట్టారు దేవుడిని?
పీటర్:ఆయన మనకి దేవుడుకాదు నాన్న.హిందువులకి దేవుడునాన్న.
పింటూ:మరిమనం ఎవరునాన్న
పాస్టర్:మనం క్రైస్తవులుం
పింటూ:ఓహో..మనంఎక్కడినుండివచ్చాం..
పాస్టర్:మనంఇజ్రాయెల్ నుండి వచ్చాం
పింటూ:మరిహిందువులూ?/
పీటర్:వాళ్ళుఇక్కడివారే
పింటూ:మనం భారతీయులంకామా?
పీటర్:అవునుబాబు కానిమనంహిందువులంకాదు
పింటూ:యేసుఎక్కడపుట్టాడు?
పీటర్:ఇజ్రాయెల్లో
పింటూ:కృష్ణుడు?/
పీటర్:ఇక్కడే
పింటూ:ఇక్కడపుట్టిన కృష్ణుడిని దేవుడు అనకుండా ఎక్కడోపుట్టిన యేసు ను ఎందుకుదేవుడుఅంటున్నాం?
పీటర్:యేసుదేవుడనిbible చెప్పిందిబాబు
పింటూ:మరి మా స్కూల్ లోభగవద్గీత చెప్పినప్పుడు కృష్ణుడు దేవుడుఅన్నారు?
పాస్టర్:అదితప్పుబాబు
పింటూ:తప్పుఎలాఅయ్యింది??bible కరెక్ట్ అనిఎవరుచెప్పారుమనకు?
పీటర్:బ్రిటిష్ వారు
పింటూ:ఎవరుమనల్ని బానిసల్నిచేసారువారా?వారుచెప్పిందిఏలా నమ్మరునాన్న వాళ్ళుదొంగలుకదా
పీటర్ ఏంచెప్పాలోతెలియక నీళ్ళునములు తున్నాడు.
మల్లిపింటూ:నాన్న మన మతం ఇజ్రాయెల్ నుండివచ్చిందిఅన్నావ్ కదా..మరిమనం ఎప్పుడుకావలిస్తేఅప్పుడు ఇజ్రాయెల్ వెల్లోచ్చా??
పీటర్;అలావేల్లలెం బాబు..అదిమన దేశంకాదుకదా
పింటూ:ఇజ్రాయెల్ ది మనదిఒకటే మతంకదా ఎందుకువేల్లాలెం?/
పీటర్:ఇజ్రాయెల్ దివేరే మతంబాబు.వారుయేసుని దెయ్యంఅంటారు
పింటూ:ఏంటి..ఈదేశంలో పుట్టినమనం ఈదేశంలోపుట్టిన కృష్ణుడిని దేవుడుఅనినమ్మమా?? సొంతదేశంలోనే దెయ్యంగా పిలవబడిన యేసుని మనంనమ్మాలా??అదీ అలా నమ్మమని..మనల్ని దోచుకున్న బ్రిటిష్ వారు చెబితే మనం యేసునినమ్మాలా?నాన్న నీకుకనీసం నాఅంతబుర్రకుడా లేదేంటినాన్న?నేనురేపటినుండియేసునినమ్మను.కృష్ణుడినే నమ్ముతాను.ఏం పీక్కుంటావో పీక్కో అని వెళ్ళిపోయాడు.
పాస్టర్ పీటర్ గుడ్లుతేలేసి కళ్ళుతిరిగి పడిపోయాడు.i!i!

జాతీయ జెండా

జాతీయ జెండా నియమాలు   
🚩2002 లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్ లోని ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నవి.
🚩జెండా ఎగురవేయడంలో నియమాలు తెలిసో తెలియకో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నవి.కాగా రాజ్యాంగా స్పూర్తికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం కూడా జరుగుచున్నది.
🚩Flag code of India సెక్షన్ V రూల్ ప్రకారం రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సంధర్భంగా జెండాలో పూలుఫెట్టి ఎగుర వేయవచ్చు

🚩ఝండా ఎవరు ఎగుర వేయాలనేది ఒక సమస్య.
1.👉విధాన నిర్ణాయక సంస్థలు,(బాధ్యులు ప్రధాని,ముఖ్యమంత్రి, ZP చైర్మెన్,గ్రామ సర్పంచు మొదలగు వారు).
2.👉కార్యనినిర్వహణ సంస్థలు.(రాష్ట్రపతి, గవర్నర్ కలెక్టర్ MDO, MEO.MRO  హెడ్ మాష్టర్  ప్రిన్సిపాల్) అనేవి ఈ విధంగా  రెండు రకాలు. మనం  కార్యనిర్వహణ సంస్థల క్రిందకు వస్తాము. కార్యనిర్వహుకులం.
👉💥పాఠశాలలు, కాలేజీలు కార్యనిర్వహణ సంస్థలు. కావున పాఠశాల్లో 15 ఆగష్టు,  26 జనవరిలనందు ప్రధానోపాధ్యాయులే 💥జాతీయ జెండాను ఎగుర వేయాలి.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🚩సాధారణ నియమాలు
1.👉జాతీయ జెండా చేనేత ఖాది,కాటన్ గుడ్డతో తయారైనది ఉండాలి.
2.జెండా పొడవు 3:2 నిష్పత్తిలో ఉండాలి. 6300x4200 మి.మీ. నుండి 150x100 మి.మీ.వరకు మొత్తం 9 రకాలుగా పేర్కోనడం జరిగింది.
3👉.ప్లాస్టిక్ జెండాలు అసలే వాడరాదు. tnus
4.👉పై నుండి క్రిందకు 3 రంగులు సమానంగా ఉండాలి.
5.👉జెండాను నేలమీదగాని, నీటి మీద పడనీయరాదు.
6👉.జెండాపై ఎలాంటి రాతలు,సంతకాలు, ప్రింటింగులు ఉండరాదు.
7.👉జెండా ఎప్పుడూ నిటారుగా ఉండాలి.కిందికి వంచకూడదు.
8.జెండాను వడిగా,(వేగంగా) ఎగురవేయాలి.
9.👉జెండాను ఎగురవేయడం ,మరియు దించడం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపున చేయాలి.
10.👉జెండా మధ్యలోని ధర్మచక్రంలో 24 ఆకులుండాలి.
11.👉జెండా పాతబడితే తుడుపు గుడ్డగా మాత్రం ఎట్టి పరిస్థితులలో ఉపయోగించరాదు. అది నేరం..దానిని కాల్చివేయాలి.ఎక్కడంటే అక్కడ పడ వేయరాదు.
12.👉ఒకవేల వివిధ రకాల జెండాల పక్కన ఎగుర వేయవలసి వచ్చినచో జాతీయ జెండా మిగతా వాటికంటే ఎత్తుగా ఉండాలి..
13.👉జెండాను ఎగుర వేయునపుడు జాతీయనాయకుల ఫోటోలు ఉంచాలి.
14.👉జెండాను ముందుగా 1,2 సార్లు పరిశీలించుకోవాలి. ఎక్కించి దించడం, మరల ఎక్కించడం చేయరాదు.
15.👉కావున భారత భావి పౌరులను తీర్చిదిద్ధాల్సిన ఉపాధ్యాయులం మనం. జెండా వందనాన్నీ నియమ నిష్టలతో, నిబద్ధతతో, నియమాలతో చేయాలి.
16.👉జెండా పోల్ నిటారుగా ఉండాలి.వంకరగా ఉండరాదు.కొన్ని సార్లు విరిగిన సంధర్భాలు జరిగినవి.జాగ్రత్త వహించాలి.
17.👉విద్యార్థుల జేబులకు ఉంచే చిన్న జెండాలు కింద ఎక్కడంటే అక్కడ పడ వేయనీయరాదు. వాటిని తొక్కనీయరాదు.వాటిని వీలయితే అన్ని ఏరి కాల్చి వేయాలి. పిల్లలకు తప్పని సరిగా జెండా నియమాలు  చెప్పి పాటింప చేయాలి.జాతీయ గేయం పాడునపుడు పాటించే నియమాలు చెప్పాలి.
18.👉వీలైనంత వరకు పురికోసలకు కట్టే పరారలకు త్రివర్ణ పతాకాలను (చిన్నవి) అతికించరాదు.రంగు రంగుల కాగితాలు మాత్రమే అతికించాలి.రెడీమేడ్ ప్లాస్టిక్ వి త్రివర్ణ పతాకాలు కడుతున్నాం వాటిని కూడా వాడరాదు

నువ్వుల నూనె

అన్నినూనెల్లోకి నువ్వుల నూనె శ్రేష్టమైనదని నిపుణులు అంటున్నారు. నువ్వుల గింజల్లో నూనె పదార్థంతోపాటు ప్రొటీన్ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ముఖ్యంగా మహిళలలో తరచుగా వచ్చే ఐరన్ లోప సమస్యలకు నువ్వులు దివ్యౌషదంగా పనిచేస్తుంది. నువ్వులు పురుషులలో వీర్యవృద్ధిని, కలుగజేస్తుంది.

కీళ్ళనొప్పులకు వాతం, ఎముకల బలహీనత ఉన్నవారికి, శిరోజాలు పెరగడానికి, నోటిపూత, గొంతు నొప్పి వ్యాధులకు నువ్వులు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. బహిష్టు సమయంలో స్పూన్ నువ్వులపొడి, 1 స్పూన్ శొంఠిపొడి, చిటికెడు ఇంగువ కలిపి మాత్రగా చేసి ఒకపూట తింటే నొప్పి తగ్గుతుంది.  నువ్వుల నూనెను గాయాలకు పూతగా రాయడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

మొలలు (పైల్స్) వ్యాధిలో, అతిసార వ్యాధిలో నువ్వులను ఉపయోగిస్తారు. బాలింతల్లో చనుబాలు పెరగడానికి నువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తారు. రక్త విరేచనాలకు చర్మ సంబంధమైన వ్యాధులకూ, శరీరంపై గాయాలకూ నువ్వులను పూతగా పెడితే మంచి ఫలితం వస్తుంది. దంతాలకు కూడా నువ్వులు బాగా మేలు చేస్తాయి ఎందువల్ల అంటే నువ్వులలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.

నువ్వు గింజలలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. నల్ల నువ్వులలో మాత్రం ప్రొటీన్లు ఎక్కువగా ఉండి, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. నువ్వుల నూనె శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. అన్నం బాగా జీర్ణం కావడానికి కూడా నువ్వులు ఉపయోగపడతాయి. కేశ వృద్ధికి నువ్వుల నూనె పని చేస్తుంది.

నువ్వుల నూనెతో ప్రతి రోజూ శరీరానికి మర్దన చేస్తే చర్మంలో వచ్చే వృద్ధాప్య ఛాయలను అరికడుతుంది. చిన్న పిల్లలకు నువ్వుల నూనెతో మర్దన చేయడం వల్ల ఎముకలు బలంగా తయారవుతుంది. ప్రతిరోజూ నువ్వుల నూనెతో తలకు మాలిష్ చేయడం వల్ల జుట్టు బాగా పెరగడంతో పాటు మేధాశక్తి ఎక్కువవుతుంది.