జీవనదర్శిని PRASADTIMES
జ్యోతిష్యం "శాస్త్రం". సూర్యోదయం ప్రభావంతో మన శరీరాలు హార్మోన్లను విడుదల చేయడంతో మనం మేల్కొంటాం. అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, దూరంగా జరగడం వంటి మార్పుల వల్ల సముద్రపు అలల్లో తేడాలు వస్తాయి. అందువల్లనే మనవ మరియు ప్రకృతిలో విపరీత ధుర్ఘటనలు చూస్తున్నాము. పౌర్ణమి అమావాస్య ఎప్పుడు వస్తుందో మూడనమ్మకము అన్నవాడు చెప్పలేడు. మనపై మనకు విశ్వాసం లేకపోతే, ఇతరత్రా విషయాలేవీ పెద్దగా పనిచేయవు. అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి. సర్వే జనా సుఖినోభవంతు.
21 May 2020
మనమే అసలు గ్రహాలం కాదా?
క్షణికావేశం మనిషిని చంపేస్తుందా
07 May 2020
క్యాలెండర్
గడియారాలు(Watches)క్యాలెండర్(Calendar)
* గడియారం సాధారణంగా వృత్తాకారంలో ఉంటుంది.
* గడియారం ముఖం 12 భాగాలుగా విభజితమై ఉంటుంది.
* గడియారంలోని ముల్లుల్లో చిన్నముల్లు గంటలను, పెద్దముల్లు నిమిషాలను సూచిస్తాయి.
* పెద్దముల్లు అంటే నిమిషాల ముల్లు ఒక గంటలో పూర్తిగా ఒక చుట్టు తిరుగుతుంది.
* పెద్దముల్లు 60 నిమిషాల్లో ఒక సంపూర్ణ కోణం అంటే 360º తిరుగుతుంది.
కాబట్టి 60 నిమిషాల్లో 360º తిరుగుతుంది.
1 నిమిషంలో = 360/60 = 6° తిరుగుతుంది
* చిన్నముల్లు అంటే గంటల ముల్లు 12 గంటల్లో ఒకపూర్తి చుట్టు తిరుగుతుంది. అంటే 12 గంటల్లో 360º తిరుగుతుంది.
1 గంటలో = 360/12 = 30° తిరుగుతుంది
1 నిమిషంలో = 30/60 = 1/2° తిరుగుతుంది
* ఒక నిమిషం కాలంలో నిమిషాల ముల్లు, గంటల ముల్లు కంటే లు అధికంగా తిరుగుతుంది.
* గంటల ముల్లు, నిమిషాల ముల్లుల వేగాల నిష్పత్తి
1/2° : 6° = 1:12
రైల్వే టైమింగ్స్ :
* రైల్వే టైమింగ్స్ 24 గంటలు సూచిస్తాయి.
* 0 గంటలు అంటే రాత్రి 12 గంటలకు సమానం.
ఉదా: ఒక రైల్వే స్టేషన్‌లో గడియారం 15 : 50 గంటలు సూచిస్తే సాధారణ గడియారంలో సమయమెంత?
15:50 - 12:00 = 3:50 P.M.
Note:> రాత్రి 12 గంటల సమయం నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయం వరకు After Meridian (జ.M.) గా, మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి రాత్రి 12 గంటల సమయం
వరకు Post Meeridian (P.M) గా సూచిస్తారు.
* 0:30 గంటలు అంటే రాత్రి 12:30 లకు సమానం.
* 60 నిమిషాల వ్యవధిలో నిమిషాల ముల్లు 60 నిమిష భాగాలు తిరుగుతుంది. అదే సమయంలో గంటల ముల్లు 5 నిమిష భాగాలు మాత్రమే తిరుగుతుంది. దీన్ని బట్టి నిమిషాల ముల్లు 60 నిమిషాల వ్యవధిలో గంటల ముల్లు కంటే 55 నిమిష భాగాలు అధికంగా తిరుగుతుంది.
* గంటల ముల్లుకంటే, నిమిషాల ముల్లు 55 నిమిష భాగాలు అధికంగా తిరగడానికి పట్టే సమయం 60 నిమిషాలు అంటే 1 గంట.
55 నిమిష భాగాలు తిరగడానికి - 60 నిమిషాలు పడుతుంది.
కాబట్టి ఒక నిమిష భాగం తిరగడానికి 60/55 అంటే 12/11 నిమిషాలు పడుతుంది.
* ఒక రోజులో 2 ముల్లులు 22 సార్లు ఏకీభవిస్తాయి. అంటే ముల్లుల మధ్యకోణం 0º.
* ఒక రోజులో 2 ముల్లులు 22 సార్లు సరళ కోణాన్ని అంటే 180º లను ఏర్పరుస్తాయి. అంటే గడియారంలో ముల్లులు వ్యతిరేక దిశలో ఉంటాయి.
* ఒక రోజులో 2 ముల్లులు 44 సార్లు లంబకోణం అంటే 90ºలు ఏర్పరుస్తాయి.
* ఒక రోజులో 2 ముల్లులు ఏ ఇతర కోణమైనా అంటే 0º, 180ºలు కాకుండా(0º< θ < 180º) 44 సార్లు ఏర్పరుస్తాయి.
* రెండు ముల్లుల మధ్య కోణం 0º లేదా 180º అయితే అవి రెండూ ఒకే సరళరేఖపై ఉంటాయి.
Q. 5, 6 గంటల మధ్య ఏ సమయంలో నిమిషాల ముల్లు గంటల ముల్లుతో ఏకీభవిస్తుంది?
జ. h, h + 1 గంటల మధ్య రెండు ముల్లులు hగంటల 60 h/11 నిమిషాలకు ఏకీభవిస్తాయి.
60h/11 = 60x5/11 = 300/11 = 27 3/11 నిమిషాలు అవుతుంది
రెండు ముల్లులు 5 గం.ల 27 3/11 నిమిషాలకు ఏకీభవిస్తాయి.
Model II
Q. 5, 6 గంటల మధ్య ఏ సమయంలో నిమిషాలముల్లు, గంటలముల్లు మధ్య కోణం 90ºలు ఉంటుంది?
జ. 5, 6 గంటల మధ్య రెండు సందర్భాల్లో రెండు ముల్లుల మధ్యకోణం 90ºలు ఉంటుంది.
5 గంటలకు రెండు ముల్లుల మధ్య కోణం 5 × 30 = 150º
Case (i) θ = 150º -90º = 60º
T = 2/11 X60 = 120/11 =10 10/11
T= 5 గంటల 10 10/11 నిమిషాలకు
Case (ii) = 150º + 90º = 240º
T = 2/11 x240 = 480/11 = 43 7/11
= 5 గంటల 43 7/11 నిమిషాలకు
Q. సోమవారం ఉదయం 8 గంటలకు ఒక గడియారం 10 నిమిషాలు ఆలస్యంగా తిరుగుతుంది. అదే గడియారం ఆదివారం ఉదయం 8 గంటలకు 20 నిమిషాలు ముందుగా తిరుగుతుంది. అయితే ఆ గడియారం సరైన సమయాన్ని ఎప్పుడు సూచిస్తుంది?
జ. సోమవారం ఉదయం 8 గంటలకు 10 ని.లు ఆలస్యంగా తిరుగుతుంది. అంటే L = 10
ఆదివారం ఉదయం 8 గంటలకు 20 ని.లు ముందు తిరుగుతుంది. అంటే G = 20
గడియారం సరైన సమయం సూచించడానికి సూత్రం = L/L+Gx మొత్తం గంటలు
మొత్తం గంటలు = 6 రోజులు x24
= 10/10+20x144
= 48 గంటలు = 2 రోజులుకు అనగా బుధవారం 8 గంటలకు
సోమవారం ఉదయం 8 గంటల తర్వాత నుంచి 48 గంటలు అంటే బుధవారం ఉదయం 8 గంటలకు సరైన సమయాన్ని సూచిస్తుంది.
గమనిక: రెండు ముల్లుల మధ్య సరళకోణం అంటే 180º ఉండాలంటే వాటి మధ్య 30 నిమిషభాగాల తేడా ఉంటుంది.
రెండు ముల్లుల మధ్య సరళకోణం ఉండే సమయం కనుక్కోవడానికి సూత్రాలు
T =Ax30-180x 2/11; A>6
T =Ax30+180x 2/11; A<6
Q. 3,4 గంటల మధ్య ఏ సమయంలో రెండు ముల్లులు ఒకే సరళరేఖలో ఉంటాయి?
జ. 3 < 6 కాబట్టి
T =3x30+180x2/11 = 90-180x2/11
=270x2/11 =540/11 =49 1/11
5 గంటల 49 1/11 నిమిషాలు రెండు ముల్లులు ఒకే సరళరేఖపై ఉంటాయి.
Q. 7, 8 గంటల మధ్య ఏ సమయంలో రెండు ముల్లులు ఒకే సరళరేఖలో ఉంటాయి?
జ. 7 > 6 కాబట్టి
T =7x30-180x2/11 =210-180x 2/11
=30x2/11 =60/11 = 55/11
అంటే 7 గంటల 5 5/11 ని.లకు రెండు ముల్లుల మధ్య కోణం 180º డిగ్రీలు ఉంటుంది. అంటే అవి ఒకే సరళరేఖలో ఉంటాయి.
గమనిక: రెండు ముల్లుల మధ్య కోణం θ అయితే θ = |30H - 11/2 m!,H గంటలను, M నిమిషాలను సూచిస్తాయి.
Q. సమయం 7 గంటల 10 నిమిషాలు అయితే రెండు ముల్లుల మధ్య కోణం ఎంత?
జ. H = 7; M = 10
θ = |30x7 - 11/2x10|= |210 - 55| =155º
సమయం 7 గంటల 10 ని.లు అయితే రెండు ముల్లుల మధ్య కోణం 155º డిగ్రీలు.
Model - VI
Q. గడియారంలో సమయం 7:45 గంటలు సూచిస్తే అద్దంలో ప్రతిబింబ సమయమెంత?
జ. అద్దంలో ప్రతిబింబ సమయం
= 12 గంటలు - గడియారంలో నిజకాలం
= 12:00- 7:45 = 4 : 15
కాబట్టి అద్దంలో ప్రతిబింబ సమయం 4 గంటల 15 ని.లు సూచిస్తుంది.
Q. సెకన్ల ముల్లు 240º తిరిగిన సమయంలో నిమిషాల ముల్లు ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది?
జ. ఇచ్చిన కోణాం/60
= 240/60 = 4º
నిమిషాల ముల్లు 4º లు తిరుగుతుంది.
Q.సెకన్ల ముల్లు 240º తిరిగిన సమయంలో గంటల ముల్లు ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది?
జ. ఇచ్చిన కోణాం/12
= 240/12 = 20
కాబట్టి గంటల ముల్లు 20º డిగ్రీలు తిరుగుతుంది.
క్యాలెండర్(Calendar)
*ఏదైనా సాదారణ సంవత్సరంలో మొత్తం 365 రోజులు ఉండును.
52 వారాలు+1రోజు అదనపు రోజు
*ఏదైనా ఒక లీపు సంవత్సరంలో 366 రోజులు ఉండును.
52 వారాలు+2 అదనపు రోజులు
*యివ్వబడిన సంవత్సరం లీపు సంవత్సరం కావలెనన్న ఆ సంవత్సరంలోని చివరి 2 సంఖ్యలు 4 చె భాగించబడవలెను.కాని శతాబ్ధంతో మొదలయ్యే సంఖ్య వచ్చిన 400 చే భాగించబడవలెను .
ఉదా: 1856, 1992,200,1600
*ఒక నెలలో 28/29/30/31 రోజులు ఉండును
*క్యాలెండర్ లోని మొదటి తేది జనవరి1 ఒకటవ శతాబ్ధం సోమవారం తో ప్రారంభం అయ్యింది.
*B.C అనగా(క్రీ.పూర్వం ).
*జ.D అనగా (క్రీ.శకం)
*28 రోజులు కలిగిన నెలలో 4 వారాలు 0 అదనపు రోజులు ఉండును.
*29 రోజులు కలిగిన నెలలో 4 వారాలు 1 అదనపు రోజులు ఉండును.
*30రోజులు కలిగిన నెలలో 4 వారాలు 2 అదనపు రోజులు ఉండును.
*31 రోజులు కలిగిన నెలలో 4 వారాలు 3 అదనపు రోజులు ఉండును.
అదనపు రోజులు: ఇచ్చిన రోజులని 7 చే భాగించినపుడు వచు శేషమే అదనపు రోజులు.
ఉదా: 45 రోజులకు 3 అదనపు రోజులు ఉండును
odd days(అదనపు రోజులు) :0,1,2,3,4,5,6 వరకు ఉండును
వారాలకు కోడులు:
ఆదివారం - 0
సోమవారం - 1
మంగళవారం - 2
బుదవారం - 3
గురువారం - 4
శుక్రవారం - 5
శనివారం - 6
తరువాత అంటే ± రాయాలి
క్రితం అంటే - రాయాలి
నెలలకు కోడులు :
జనవరి- 0
ఫిబ్రవరి - 3
మార్చి- 3
ఏప్రియల్ - 6
మే - 1
జూన్ - 4
జులై - 6
ఆగష్టు - 2
సెప్టెంబర్ - 5
అక్టొబర్ - 0
నవంబర్ - 3
డిసెంబర్ - 5
శతాబ్ధపు కొడ్స్ :
1500 నుండి 1599 వరకు -0
1600 నుండి 1699 వరకు -6
1700 నుండి 1799 వరకు -4
1800 నుండి 1899 వరకు -2
1900 నుండి 1999 వరకు -0
2000 నుండి 2099 వరకు -6
2100 నుండి 2199 వరకు -4...
Q. 07-03-2017 నాడు ఏమి వారం?
జ. సూత్రం : తేది+సం.పు చివరి రెండు అంకెలు +నెల కోడ్+శతాబ్ధం కోడ్+(సం.పు చివరి రెండు అంకెలు/4 చెస్తే వచ్చు బాగఫలం) చేయగా వచ్చు శేషమే జవాబు
07+17+3+6+4(17/4లభ.ఫ)/7 = ల యొక్క శేషం = 2
2 అంటే మంగళవారం
Q. 10-05-1990 నాడు ఏమి వారం?
జ. 10+90+1+0+22/7 = ల యొక్క శేషం =4
4 అంటే గురువారం
Q. నేడు సోమవారము అయినా 32 రోజుల తరువాత ఏ వారం వచ్చును? ల యొక్క శేషం =4
4 అంటే గురువారం
జ. నేడు ---> సోమవారము (1)
32 ----> 32/7 అదనపు రోజులు 4 = 4+1=5
5 అనగా శుక్రవారం
Q.నేడు మంగళవారం అయినా 57 రోజుల తరువాత ఏ వారం వాచ్చును? అదనపు రోజులు 4 = 4+1=5
5 అనగా శుక్రవారం
జ. నేడు ---> మంగళ(2)
57 ---> 57/7 అదనపు రోజులు 1 = 1+2= 3
3 అనగా బుధవారము
Q. నేడు శనివారము అయినా 73 రోజుల క్రితం ఏ వారం అగును?
జ. నేడు ---> శనివారము = 6
73 ---> 73/7 అదనపు రోజులు 3 = 3-6= 3(క్రితం అంటే - చెయ్యాలి)
3 అనగా బుధవారము
Q. నేడు శుక్రవారము అయినా 89 రోజుల క్రితం ఏ వారం అగును?
జ. నేడు --->శుక్రవారము=5
89 ---> 89/7 అదనపు రోజులు 5 = 5-5= 0
0 అనగా ఆదివారము
Q. ఏప్రియల్ 3,2012 సోమవారము అయినచో అదే సంవత్సరంలో ఆగష్టు 1 ఏ వారము అగును?
జ. సోమవారము = 1
ఏప్రి--27
మే --31
జూన్ --30
జులై --31
ఆగష్టు --1 మొత్తం కూడగా 120 రోజులు
120/7 అదనపు రోజులు = 1 రోజు
1+1 =2 అనగా మంగళవారము
Q. డిసెంబర్ 5,2012 నాడు శనివారము అయినా సెప్టెంబర్15,2012 న ఏమి వారము?
జ. శనివారము = 6
సెప్టెంబర్ ---15
అక్టొబర్ ----31
నవంబర్ ---30
డిసెంబర్ ---5 మొత్తం 81/7 = 4-6= 2 మంగళవారము
Q. 2096 వ సంవత్సరము తరువాత వచ్చు లీపు సంవత్సరము ఏది?
జ. లీపు సంవత్సరము వచ్చేవరకు 4 ను కుడుతూపోవాలి
2096+4 = 2100 ఇది శతాబ్దిక సంవత్సరము కావున 400 చే బాగించబడాలి కావున ఇది లీపు సంవత్సరము కాదు
2100+4 =2104 ఇది లీపు సంవత్సరం
Q. 2196 తరువాత వచ్చు లీపు సంవత్సరము ఏది?
జ. 2196+4 = 2200 లీపు సంవత్సరం కాదు
2200+4 = 2204 లీపు సంవత్సరము
Q. 1996 తరువాత వచ్చు లీపు సంవత్సరము ఏది?
జ.1996+4 = 2000 లీపు సంవత్సరం
Q. జనవరి 20,2016 గురువారము అయినచో జనువరి 20,2017 ఏవారము అగును?
జ. గురువారము = 4
2016 లీపు సంవత్సరము కావున 2 అదనపు రోజులు వుంటాయి
2+4 = 6 అంటే శనివారము అగును
Q. ఆగష్టు 15,2004 బుధవారం అయినచో ఆగష్టు 15,2009 ఏవారము అగును?
జ. బుధవారం = 3
ఆగష్టు 15,2004
ఆగష్టు 15,2009
మొత్తం 6 అదనపు (2008 లీపు సం..)రోజులు + 3 = 9/7
= 2 అంటే మంగళవారము
Q. ఒక సంవత్సరంలో ఏప్రియల్ నెలను పోలిన నెల ఏది ?
జ. అప్రియల్ - 2 అదనపు రోజులు
మే - 3 అదనపు రోజులు
జూన్ - 2 అదనపు రోజులు
మొత్తం 7 అదనపు రోజులు కావున జులై నెల ఏప్రియల్ నెలను పోలి వుంటుంది
Q. ఒక సంవత్సరంలోమార్చ్ నెలను పోలిన నెల ఏది ?
జ. మర్చ్ - 3
ఏప్రియల్ --2
మే --3
జూన్ -- 2
జులై --3
అగష్టు --3
సెప్టెంబరు -2
అక్టోబరు - 3
మొత్తం అదనపు రోజులు 21
21/7 కావున నవంబరు నెల మార్చ్ నెలను పోలి వుంటుంది.
Q.2005 ను పోలిన సంవత్సరము?
జ. 2005-1
2006-1
2007-1
2008-2
2009-1
2010-1 మొత్తం 7 అదనపు రోజులు కావున 2011 సంవత్సరము 2005 ను పోలిన సంవత్సరము
Q.1987 ను పోలిన సంవత్సరము 1987 తర్వాత ఏప్పుడు వచ్చును?
జ. 1987-1
1988-2
1989-1
1990-1
1991-1
1992-2
1993-1
1994-1
1995-1
1996-2
1997-1
మొత్తం 14 అదనపు రోజులు కావున 1998 సం.1987సం.ను పోలివుండును
వయస్సులు(AGES)
Q. 3 సంవత్సరాల క్రితం A యొక్క వయస్సు 18 సంవత్సరాలు. 2 సంవత్సరాల తర్వాత అతని వయస్సు ఎంత?
జ. 18+3 = 21+2 = 23
Q. 5 సంవత్సరాల తర్వాత A యొక్క వయస్సు 30 సంవత్సరాలు. అయినా 3 సంవత్సరాలకు క్రితం అతని వయస్సు ఎంత?
జ. 30−5 = 25−3 = 22 సంవత్సరాలు
Q. 5 సంవత్సరాల క్రితం A,B ల వయస్సుల మొత్తం 30 సంవత్సరాలు అయినా ప్రస్తుతం వారి వయస్సుల మొత్తం ఎంత?
జ. 30+10 = 40
Q. A,B ల వయస్సుల మొత్తం 60 సంవత్సరాలు, వారి వయస్సుల మద్య నిష్పత్తి 3:2 అయినా A వయస్సు ఎంత?
జ. 3:2 లోని మొత్తం బాగాలు 3+2 =5
3/5×60 = 36
Q. A,B,C ల వయస్సుల మొత్తం75 సంవత్సరాలు, వారి వయస్సుల మద్య నిష్పత్తి 7:5:3 అయినా C వయస్సు ఎంత?
జ. 7:5:3 లోని మొత్తం బాగాలు 7+5+3 =15
3/15×75 = 15
Q. A,B ల వయస్సుల మొత్తం 24 సంవత్సరాలు A వయస్సు B వయస్సుకు 3 రెట్లు అయిన A వయస్సు ఎంత?
జ. A:B
3:1
3/4×24 = 18 సంవత్సరాలు.
Q. A,B ల వయస్సుల మొత్తం 40 సంవత్సరాలు A వయస్సు B వయస్సులో 60% అయిన A వయస్సు ఎంత?
జ. A:B
60:100
4:5
3/8×40 = 15 సంవత్సరాలు.
Q. 5 సంవత్సరాల క్రితంA,B ల వయస్సుల మొత్తం 40 సంవత్సరాలు.ప్రస్తుతం వారి వయస్సుల మద్య నిష్పత్తి 3:2 అయినా A వయస్సు ఎంత?
జ. ప్రస్తుతం వారి వయస్సుల మొత్తం = 40+10 = 50
3:2
3/5×50 = 30
Q. 6 సంవత్సరాల తర్వాత A,B ల వయస్సుల మొత్తం 60 సంవత్సరాలు.ప్రస్తుతం వారి వయస్సుల మద్య నిష్పత్తి 7:5 అయిన A వయస్సు ఎంత?
జ. 60-12 = 48
7:5 ⇒ A వయస్సు = 7/12×48 =28 సంవత్సరాలు
B వయస్సు = 5/12×48 =20 సంవత్సరాలు
Q. A,B ల వయస్సుల మొత్తం 30 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల మద్య నిష్పత్తి 5:3 అయినా ప్రస్తుతం A వయస్సు ఎంత?
జ. 30+10 = 40
5:3 ⇒ 5/8×40 = 25-5 =20 సంవత్సరాలు
Q. A,B ల వయస్సుల మొత్తం 80 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం వారి వయస్సుల మద్య నిష్పత్తి 7:5 అయినా ప్రస్తుతం A వయస్సు ఎంత?
జ. 80-8 = 72
7:5 ⇒ 7/12×72 = 42+4 =46 సంవత్సరాలు
Q. తండ్రి కొడుకుల వయస్సుల మొత్తం 50 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత తండ్రి వయస్సు కొడుకు వయస్సుకు రెట్టింపు.అయినా ప్రస్తుతం తండ్రి వయస్సు ఎంత?
జ. 50+10 = 60
2:1 ⇒ ప్రస్తుతం తండ్రి వయస్సు = 2/3×60 = 40-5 = 35 సంవత్సరాలు
ప్రస్తుతం కొడుకు వయస్సు = 1/3×60 = 20-5 = 15 సంవత్సరాలు
Q.తల్లీ కూతురుల వయస్సుల మొత్తం 60 సంవత్సరాలు, 5 సంవత్సరాల క్రితం తల్లి వయస్సు కూతురు వయస్సుకు 4 రెట్లు అయినా ప్రస్తుతం కూతురు వయస్సు ఎంత?
జ. 60-10 = 50
4:1 ⇒ ప్రస్తుతం కూతురు వయస్సు = 1/5×50 = 10+5 = 15 సంవత్సరాలు
ప్రస్తుతం తల్లి వయస్సు = 4/5×50 = 40+5 = 45 సంవత్సరాలు
Q. A,B ల వయస్సుల మద్య నిష్పత్తి 5:3, 4 సంవత్సరాల తర్వాత వారి వస్సుల మద్య నిష్పత్తి 11:7 అయినా A వయస్సు ఎంత?
జ. 5:3 = 11:7 ⇒ 5×7-3×11 = 35-33 = 2
11-7 = 4
A వయస్సు = (ప్రస్తుత A నిష్పత్తి బాగం(5) × 4 సంవత్సరాల తర్వాత(4 ) × 4 సంవత్సరాల తర్వాత నిష్పత్తి మద్య తేడా(11-7 =4))/ప్రస్తుత నిష్పత్తి మద్యతేడా(2)
A వయస్సు = 5*4*4/2 = 40 సంవత్సరాలు
Q. A,B ల వయస్సుల మద్య నిష్పత్తి 8:5, 6 సంవత్సరాల క్రితం వారి వస్సుల మద్య నిష్పత్తి 7:4 అయినా B వయస్సు ఎంత?
జ. 8:5= 7:4 ⇒8×4-5×7 = 32-35 = 3
7-4= 3
B వయస్సు = 5*6*3/3 = 30 సంవత్సరాలు
A వయస్సు = 8*6*3/3 = 48 సంవత్సరాలు
Q. x,y ల వయస్సు మద్య నిష్పత్తి 5:6, 7 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల మద్య నిష్పత్తి 6:7 అయినా x వయస్సు ఎంత?
జ. 5:6
6:7 ⇒ 5*7*1/1 = 35
ధన్యవాదాలు.
03 March 2020
సన్ అఫ్ లేట్ కొమరం వీరేంద్ర, పరమ్ వీర్ చక్ర.
అది తూర్పు గోదావరి జిల్లా లో ఓ పల్లెటూరు . రాత్రి తొమ్మిదయ్యింది. పాకిస్తాన్ ‘ఉరీ’ మీద చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ కొమరం వీరేంద్ర భార్య, కొడుకు ఉంటున్న చిన్న పెంకుటిల్లు. ఆర్మీ అధికార లాంఛనాలు, లోకల్ లీడర్లు , మీడియా వాళ్ళ హడావిడి అంతా ఐయిపోయి , చివరికి వాళ్లిద్దరూ, చీకటి, నిశ్శబ్దం మిగిలాయి ఆ ఇంట్లో.
‘అమ్మా’ , పిలిచాడు కొడుకు రవి . ‘ఊ చెప్పు నాన్న’ అంది రాజేశ్వరి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. భర్త జ్ఞాపకాల్లా. ‘నాన్నకి యుద్ధం అంటే ఇష్టమా అమ్మా’ అడిగాడు రవి. ‘లేదు నాన్న’ అంది బాధగా. ‘మరి మనమంటే కోపమా,’ ‘లేదమ్మా ఎందుకు ఆలా అడుగుతున్నావు’ కొంచెం విసుగ్గా అడిగింది రాజేశ్వరి. ‘మరెందుకమ్మా నాన్న మనకి దూరంగా వెళ్ళిపోయాడు ?’ రవి ఏడుస్తూ అడిగాడు.
‘అదేం లేదు నాన్నా. అప్పట్లో మీ నాన్న పెద్దగా చదువుకోలేదు. కొంచెం బలిష్టంగా ఉండేవారు. మీ తాత వెళ్ళమంటే వెళ్లారు. అంతే.’ నాన్నకి దేశమంటే చాలా ఇష్టమని ఎందుకో కొడుక్కి చెప్పాలనిపించలేదు.
‘అమ్మా’, మళ్ళీ పిలిచాడు రవి. ‘చెప్పు నాన్నా’ ఈ సారి విసుక్కి ముసుగేసింది.
‘పక్కింటి అంకుల్ ఏం చదివారమ్మా’ అడిగాడు రవి.
‘ఆయన కూడా మీ నాన్నలాగే పెద్దగా చదువుకోలేదు . ఎందుకు అడుగుతున్నావు’ ?
‘మరి పక్కింటి అంకుల్ ఈ ఊర్లోనే జాబ్ చేస్తున్నారు . పైగా వాళ్లకి పెద్ద మేడ, కారు ఉన్నాయి. వాళ్ళ అబ్బాయికి కూడా మంచి క్రికెట్ కిట్ ఉంది. ఎలా అమ్మ, ఇవన్నీ’ .
‘వాళ్ళ నాన్న మున్సిపాలిటీలో బంట్రోతు నాన్నా, రెండు మర్చిపోతే డబ్బుకు లోటు ఉండదు” పైకి చెప్పలేదు రాజేశ్వరి.
‘పడుకో నాన్న, రేపుటినుంచి స్కూల్ కి వెళ్ళాలి” అంటూ అటు తిరిగి పడుకుంది. ఆకలి వెయ్యక పోయినా, తినాలి, నిద్ర రాకపోయినా పడుకోవాలి. ఏడుపు వస్తున్నా ఆపుకోవాలి. చావాలని ఉన్నా బతకాలి.
పొద్దున్నే టిఫిన్ పెడుతూ అంది . “రవీ, నువ్వయినా బాగా చదవాలి. ఎదురింటి అన్న లాగ ఇంజనీరింగ్ చేసి అమెరికా లో సెటిల్ అవ్వాలి . ఇప్పుడు టెన్త్ క్లాస్. ఇప్పటినుంచి బాగా చదువు . మంచి కాలేజీ లో ఇంజినీరింగ్ సీట్ రావాలి నీకు సరేనా”. ‘అలాగే అమ్మా’ అన్నాడు రవి . వాడు కూడా ఎవరిమీదో తెలియని కసితో ఉన్నాడు.
కొన్నేళ్ల తర్వాత
అది ఐఐటీ, చెన్నై ప్రాంగణం. ఇన్డోర్ ఏసీ ఆడిటోరియంలో చల్లగా గాలి వీస్తోంది. క్యాంపస్ సెలక్షన్ లో సెలెక్ట్ అయ్యిన వాళ్లకి మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్ లాంటి కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చే ఫంక్షన్. పేరెంట్స్ ని కూడా ఇన్వైట్ చేసారు. హాలు మొత్తం స్టూడెంట్స్ , పేరెంట్స్ తో నిండిపోయింది. ఫంక్షన్ మొదలైంది.ఒకరి తర్వార్త ఒకరు మాట్లాడుతున్నారు. ప్యాకేజీలు అదిరిపోయాయి. పేరెంట్స్ కళ్ళల్లో చెరువు నిండిన కరువు రైతు పొందే ఆనందం.
రెండో వరుసలో ఆఖరి సీట్లో కూర్చుని ఉంది రాజేశ్వరి. మళ్ళీ ఆమె కళ్ళల్లో నీళ్లు. ఈసారి ఆనందంతో . ఆమె పక్కన ఉన్నావిడ చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. రాజేశ్వరికేసి చూసి ఒకసారి నవ్వింది. రాజేశ్వరి కూడా చిన్నగా నవ్వింది.
అందరూ మాట్లాడిన తర్వాత కంపేర్ నెమ్మదిగా ఇంగ్లీష్ లో చెప్పింది ‘ఇప్పుడు ఈరోజు చీఫ్ గెస్ట్ మాట్లాడుతారు’ .
చీఫ్ గెస్ట్ నెమ్మదిగా మొదలుపెట్టారు.
“డియర్ ఫ్రెండ్స్, ఆరు సంవత్సరాలు మీరు పడిన కష్టానికి ఈరోజు ఫలితం దక్కింది. అందుకు మీకు అభినందనలు.
ఇక్కడ మీరు కట్టే ఫీజు ఈ స్థలాన్ని అక్వైర్ చేయడానికి గవర్నమెంట్ ఖర్చు పెట్టిన దానికి అయ్యే వడ్ఢేలో వందోవంతు కూడా ఉండదు. సగటున ప్రభుత్వం మీ ఒక్కొక్కరి మీద దాదాపు 10 లక్షలు ఖర్చు పెడుతోంది అన్ కండీషనల్ గా. దేశంలోని ప్రజలు మొత్తం కట్టే టాక్స్ లో కొంత మీ మీద ఇన్వెస్ట్ అవుతోంది. బట్ నో రిటర్న్స్. దేశంలో అతి కొద్దీ మంది మేధావుల్లో మీరు కొందరు. పోనీ ఇక్కడ అవకాశాలు లేవా అంటే . అసలు అవేంటో తెలుసుకొనే టైం కూడా మీకు లేదు, వీళ్ళు ఇవ్వరు.
(కంపెనీ ప్రతినిధులూ, యూనివర్సిటీ మానేజ్మెంట్ కొంచెం ఎంబేరాస్సింగ్ గా చూస్తున్నారు గెస్ట్ కేసి). సారీ, చెప్పి, తిరిగి మొదలుపెట్టాడు. ఇస్రో, DRDO , R & D , BRO, సివిల్ సర్వీసెస్, స్టార్ట్ అప్స్ , ఎంట్రప్రెన్యూర్షిప్, IT , ఇలా ఎన్నో ప్రొడక్టివ్ దారులు మీ గురుంచి తెరిచి ఉన్నాయి. ఒక్కసారి ట్రై చేయండి. మీ మీద, మీ పిల్లల మీద, ఈగ కూడా వాలకుండా మా ప్రాణాలు అడ్డేసి కాపాడుతాం. మీరు హాయిగా లగ్జరీ గా బ్రతికేంత జీతాలు పెరిగాయి ఇప్పడు. దేశానికీ మీలాంటి మేధావుల అవసరం చాలా ఉంది.
పోనీ మన తర్వాత తరాలకి కూడా దాచాలనుకొంటే, ఈ మధ్య ఓ తెలుగు సినిమాలో చెప్పినట్టు, మన పిల్లలు మంచి వాళ్లయితే వాళ్లకి మన డబ్బు అవసరంలేదు. అలా కాదనుకొంటే మనం ఎంతిచ్చినా వాళ్ళు నిలబెట్టలేరు. నేను పైన చెప్పిన ఏ సర్వీసులో జాయిన్ అయ్యినా మీరు, మీ ఫామిలీ హాయిగా బ్రతకడానికి సరిపోయే జీతం వస్తోంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడున్న కంపెనీ ప్రతినిధులందరికి నా క్షమాపణలు. అయినా, దీన్నికూడా వాళ్లకున్న ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ లో ఒక భాగం అనుకుంటే సరిపోయే. జై హింద్.” అంటూ ముగించారు.
అప్పుడు స్టేజి మీద ఉన్న కంపేర్ మైక్ అందుకుని, “ఐ అం సారీ, చీఫ్ గెస్ట్ ని ఇంట్రడ్యూస్ చెయ్యడం మర్చిపోయాను. హి ఐస్ కమాండర్ కొమరం రవీంద్ర, సన్ అఫ్ లేట్ కొమరం వీరేంద్ర, పరమ్ వీర్ చక్ర. కమాండర్ రవీంద్ర ఇక్కడే బి.టెక్ చేసి, ఇండియన్ ఆర్మీ లో ఇంజనీరింగ్ వింగ్స్ లో ఒకటయిన మద్రాస్ sappers గ్రూప్ లో కంబాట్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఈ మధ్య కాశ్మీర్ లోని ‘ఉరీ’ వద్ద జరిగిన యుద్ధంలో మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి వీరందించిన సహకారంతో ఎటువంటి ప్రాణహాని లేకుండా, శత్రువులని తుదముట్టించగలిగింది మన సైన్యం. వీరి సేవలకు ప్రభుత్వం ‘థియేటర్ హానర్’ అవార్డు కూడా ఇచ్చింది.
హల్ అంతా ఒక్కసారి చప్పట్లతో మార్మోగిపోయింది.
రాజేశ్వరి కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు. ఈసారి తృప్తితో.
కారు నెమ్మదిగా వెళ్తోంది. ‘సారీ అమ్మా, నేను అంతగా ఎమోషనల్ అవ్వకుండా ఉండవలసింది. నన్నుగుర్తు పెట్టుకొని ఇన్వైట్ చేసినందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టున్నాను.” అన్నాడు రవి.
రాజేశ్వరి చిన్నగా నవ్వి రవి చేతి మీద చేయి వేసింది. “నిజానికి నేను నీకు సారీ చెప్పాలి రా. మీ నాన్న పోయిన మొదట్లో నాకు ఎదో తెలియని ఉక్రోషం ఉండేది ఈ దేశం మీద. ఆ కసితోనే నిన్ను ఇంజనీరింగ్ చదవమని కంపెల్ చేశాను. ఎలాగైనా ఈ దేశం వదిలి పోవాలని. కానీ, ఆలా చేస్తే మీ నాన్న త్యాగానికి, గవర్నమెంట్ మన మీద చూపించిన కంపాషన్ కి విలువ లేకుండా పోతుంది. అందరిలాగా నువ్వూ ప్యాకేజీ చూడకుండా నా మాటకి విలువిచ్చినందుకు థాంక్స్.” అంది రాజేశ్వరి.
మళ్ళీ ఆమె కళ్ళల్లో నీళ్లు. బాధ, ఆనందం, తృప్తి, ఇవేవీ కాదు. అంతకు మించి. దేశభక్తితో
‘ఉరీ’కి నా భర్తని పంపఁగా
పోరుకి తానర్పితమవ్వగా
కరిగిన సింధూరం సాక్షిగా
మరిగిన నా రుధిరం కోరగా
తరిమెను నా కొమరుణ్ణి
ఎదురుగ పోరాడమని
అవసరమై కోరగా దేశం
ఇంకోసారమ్మగ మారనా
మరో వీరుణ్ణి అంకితమివ్వనా
ఎప్పుడో డైరీ లో రాసుకున్న వాక్యాలు గుర్తొచ్చాయి ఆమెకి.కారు స్థిరమైన వేగంతో ముందుకి కదుల్తోంది. దేశం ప్రగతిలాగా….
హరి ప్రసాద్
రచయిత, రాజకీయ విశ్లేషకులు.
Prasadtimes జీవనదర్శిని.
https://prasadtimes.blogspot.com/2018/08/blog-post_46.html?m=0
20 October 2018
హిందూ కాలగణన
శతాబ్దము లేదా శతాబ్ది (Centuary) అనేది 100 సంవత్సరములకు సమానమైన ఒక కాలమానము. ప్రస్తుతం మనము క్రీ.శ. 21 వ శతాబ్దం (2001 - 2100) లో ఉన్నాం.
ఝాము
ఝాము ఒక కాలమానము. ఒక ఝాము 3 గంటలు లేదా 7 1/2 ఘడియలకు సమానము. ఎనిమిది ఝాములు ఒక రోజుగా పరిగణిస్తారు.
నిమిషము అనేది ఒక కాలమానము. ఒక గంటలో 60 వ భాగం నిముషం. ఇది 60 సెకండ్ల కాలానికి సమానము.
విఘడియ ఒక కాలమానము. ఒక విఘడియ ఆరు రెప్పపాటులతో సమానం. 60 విఘడియలు ఒక ఘడియ.
ఘడియ ఒక కాలమానము. ఒక ఘడియ 60 విఘడియలతో సమానం. రెండున్నర ఘడియల కాలం ఒక గంట.
రోజు లేదా దినము అనేది ఒక కాలమానము. ఒక రోజు 24 గంటల కాలానికి సమానము.
వారము అనేది ఏడురోజులకు సమానమైన ఒక కాలమానము. ఒక సంవత్సరములో 52 వారాలు మరియు ఒకటి లేదా రెండు రోజులు ఉంటాయి. సంవత్సరపు మొదటి వారం లో గురువారము ఉంటుంది.
పక్షము అనగా 15 రోజులకు (లేదా కచ్చితంగా 14 రాత్రులకు) సమానమైన ఒక కాలమానము. ప్రతి నెలలో రెండు పక్షాలుంటాయి:
వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉంది. ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.
పాడ్యమి (అధి దేవత - అగ్ని)
విదియ (అధి దేవత - బ్రహ్మ)
తదియ (అధి దేవత - గౌరి)
చవితి (అధి దేవత - వినాయకుడు)
పంచమి (అధి దేవత - సర్పము)
షష్ఠి (అధి దేవత - కుమార స్వామి)
సప్తమి (అధి దేవత - సూర్యుడు)
అష్టమి (అధి దేవత - శివుడు)
నవమి (అధి దేవత - దుర్గా దేవి)
దశమి (అధి దేవత - యముడు)
ఏకాదశి (అధి దేవత - శివుడు)
ద్వాదశి (అధి దేవత - విష్ణువు)
త్రయోదశి (అధి దేవత - మన్మధుడు)
చతుర్దశి (అధి దేవత - శివుడు)
పున్నమి/పూర్ణిమ/పౌర్ణమి లేక అమావాస్య (అధి దేవత - చంద్రుడు)
నెల లేదా మాసము (ఆంగ్లం: Month) అనేది ఒక కాలమానము. చంద్రమానంప్రకారం ఒక నెల 30 రోజుల కాలానికి సమానము. అయితే సూర్యమానం ప్రకారం 28-31 రోజులు వుండవచ్చును. ఒక సంవత్సర కాలంలో 12 నెలలు ...
నెల:
నెల అంటే 30 రోజుల కాలము.రెండు పక్షాల కాలము ఒక నెల. ఒక సంవత్సరములో 12 వ భాగము.
పంచాంగ గణనం ప్రకారం సౌరమాన సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీ పదకొండుంబావు రోజులు తేడా ఉంది. చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కన్నా చిన్నది. ఇదే మాదిరిగా చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది. ఇందువల్ల ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం కావడం జరగకుండా పోతుంది. అటువంటప్పుడు సూర్యసంక్రాంతి లేకుండా పోయిన చాంద్రమాసానికి అధికమాసం అని పేరుపెట్టారు.
సూర్యుని చుట్టూ భూమి చుట్టివచ్చే కాలాన్ని సౌర సంవత్సరం అంటారు. కాని ఈ భ్రమణం వల్ల నెలలు ఏర్పడవు. నెలలను కొలవడానికి చంద్ర భ్రమణమే మూలం. భూమి చుట్టు చంద్రుని ప్రదక్షిణాకాలాన్ని నెల అంటారు. దాన్నే చాంద్ర మాసమని అంటారు. ఆ విదంగా ఏర్పడిన 12 చాంద్ర మాసాలను కలిపి ఒక సంవత్సరం అని అనలేము. సూర్యుడు .... మేషం, వృషభం వంటి 12 రాశులలో ఒక్కో రాశిలో ఒక్క నెల సంచరించడాన్ని సౌర మాసం అని అంటారు. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోనికి ప్రవేశించ డాన్ని రాశి సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం ప్రతి నెలలోను జరుగుతుంది. కాని మనం మకర రాశి సంక్రమణాన్ని మాత్రమే మకర సంక్రాంతిగా గుర్తిస్తున్నాము. ఒక్కో రాశిలో ఒక నెలపాటు తిరగాల్సిన సూర్యుడు...... రెండు నెలల పాటు ఒకే రాశిలో వుండటం వల్ల ఏర్పడేదే అధిక మాసం. ఇందులో మొదటి నెలలో రవి సంక్రాంతి వుండదు. దాన్నే అధిక మాసం అంటారు.
సంవత్సరము అనేది ఒక కాలమానము. భూమి సూర్యుని చుట్టూ తిరిగే భ్రమణ క్రమంలో ఒక స్థానానికి భూమి తిరిగి రావడానికి పట్టే కాలాన్ని (సమయాన్ని) సంవత్సరం అంటారు. ఇదే నిర్వచనాన్ని ఇతర గ్రహాలకూ విస్తరించవచ్చును. ఉదాహరణకు సూర్యుని చుట్టూ అంగారక గ్రహం ఒకమారు తిరగడానికి పట్టే కాలాన్ని "అంగారక సంవత్సరం" అనవచ్చును.
346.62 రోజులు — కొన్ని septenary కేలండర్లలో ఒక draconitic year
353, 354 or 355 రోజులు — కొన్ని చాంద్ర, సౌరమాన కేలండర్లలో ఒక సామాన్య సంవత్సరం కాలం.
354.37 రోజులు (12 చాంద్రమాన మాసాలు) — చాంద్రమాన కేండర్లలో ఒక సాధారణ సంవత్సర కాలం.
365 రోజులు — చాలా సౌరమాన కేలండర్లలో ఒక సాధారణ సంవత్సర కాలం.
365.24219 రోజులు — 2000 సంవత్సరం సమయానికి ఒక సగటు tropical సంవత్సరం.
365.2424 రోజులు — ఒక vernal equinox సంవత్సరం.
365.2425 రోజులు — గ్రిగోరియన్ కేలండర్లో ఒక సగటు సంవత్సర కాలం.
365.25 రోజులు — జూలియన్ కేలండర్లో గ్రిగోరియన్ కేలండర్లో ఒక సగటు సంవత్సర కాలం.
365.2564 రోజులు — ఒక sidereal సంవత్సరం.
366 రోజులు — చాలా సౌరమాన కేలండర్లలో లీప్ సంవత్సరం.
383, 384 లేదా 385 రోజులు — కొన్ని చాంద్రసౌరమాన కేలండర్లలో లీప్ సంవత్సరాల కాలాలు.
383.9 days (13 చాంద్రమాన మాసాలు) — కొన్ని చాంద్రసౌరమాన కేలండర్లలో లీప్ సంవత్సరం.
కాలమానము అనగా కాలాన్ని కొలుచుటకు లేదా వ్యక్తపరచుటకు ఉపయోగించే పదము
నిమిషము = 60 సెకనులు
గంట = 60 నిమిషాలు
రోజు = 24 గంటలు
వారము = 7 రోజులు
పక్షము = 15 రోజులు
నెల = 30 రోజులు
సంవత్సరము = 12 నెలలు
10 సంవత్సరములు = దశాబ్ధము
40 సంవత్సరములు = 1 రూబీ జూబ్లి
25 సంవత్సరములు = రజత వర్షము
50 సంవత్సరములు = స్వర్ణ వర్షము
60 సంవత్సరములు = వజ్ర వర్షము
75 సంవత్సరములు = అమృత వర్షము
100 సంవత్సరములు = శత వర్షము లేదా శతాబ్దము
1000 సంవత్సరములు = సహస్రాబ్ధి
క్రాంతి = 1 సెకనులో 34,000వ వంతు
తృటి = 1 సెకెనులో 300వ వంతు
తృటి = 1 లవము లేదా లేశము
2 లవాలు = 1 క్షణం
30 క్షణాలు = 1 విపలం
60 విపలాలు = 1 పలం
60 పలములు = 1 చడి(24 నిమిషాలు)
2.5 చడులు = 1 హోర
24 హోరలు = 1 దినం
రెప్పపాటు అతి చిన్న ప్రమాణము
విఘడియ = 6 రెప్పపాట్లు
ఘడియ = 60 విఘడియలు
గంట = 2 1/2 ఘడియలు
ఝాము = 3 గంటలు లేదా 7 1/2 ఘడియలు
రోజు = 8ఝాములు లేదా 24 గంటలు
వారము = 7 రోజులు
పక్షము = 15 రోజులు
మండలము = 40 రోజులు
నెల = 2 పక్షములు లేదా 30 రోజులు
ఋతువు = 2 నెలలు
కాలము = 4 నెలలు
ఆయనము = 3 ఋతువులు లేదా 6 నెలలు
సంవత్సరము = 2 ఆయనములు
పుష్కరము = 12 సంవత్సరములు
ఆయనము ఒక కాలమానము. ఒక ఆయనము 3 ఋతువులు లేదా 6 నెలలకు సమానము. ఒక సంవత్సరములో రెండు ఆయనాలు వస్తాయి. అవి ఉత్తరాయనము మరియు దక్షిణాయనము.
భారతదేశంలోని ఋతువులు,అవి ఏ మాసంలో వస్తాయో, వాటి లక్షణాలను తెలియజేస్తుంది. సంవత్సరమునకు ఆరు ఋతువులు
1 వసంతఋతువు Spring చైత్రమాసము మరియు వైశాఖమాసము. చెట్లు చిగురించి పూవులు పూయును. మార్చి 20నుండి మే 20 సుమారు 20-30 డిగ్రీల ఉష్ణోగ్రత; వివాహాల కాలం ఉగాది, శ్రీరామ నవమి, వైశాఖి, హనుమజ్జయంతి, ఈ ౠతువులో వచ్చే పండగలు.
2 గ్రీష్మఋతువు Summer జ్యేష్ఠమాసము మరియు ఆషాఢమాసము. ఎండలు మెండుగా ఉండును. మే 20 నుండి జూలై 20 బాగా వేడిగా ఉండి 40 డిగ్రీల ఉష్ణోగ్రత, వటపూర్ణిమ, రధాయాత్ర, గురుపూర్ణిమ, ఈ ౠతువులో వచ్చే పండగలు.
3 వర్షఋతువు Monsoon శ్రావణమాసము మరియు భాద్రపదమాసము. వర్షములు విశేషముగా ఉండును. జూలై 20 నుండి సెప్టెంబరు 20 చాలా వేడిగా ఉండి అత్యధిక తేమ కలిగి భారీ వర్షాలు కురుస్తాయి. రక్షా బంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, ಓಣಂ, ఈ ౠతువులో వచ్చే పండగలు.
4 శరదృతువు Autumn ఆశ్వయుజమాసము మరియు కార్తీకమాసము. మంచి వెన్నెల కాయును. సెప్టెంబరు 20 నుండి నవంబరు 20 తక్కువ ఉష్ణోగ్రత నవరాత్రి, విజయదశమి, దీపావళి, శరద్ పూర్ణిమ, బిహు, కార్తీక పౌర్ణమి, ఈ ౠతువులో వచ్చే పండగలు.
5 హేమంతఋతువు Winter మార్గశిరమాసము మరియు పుష్యమాసము. మంచు కురియును, చల్లగా నుండు కాలము. నవంబరు 20 నుండి జనవరి 20 చాలా తక్కువ ఉష్ణోగ్రతలు (20-25 డిగ్రీలు) పంటలు కోతల కాలం పంచ గణపతి భోగి, సంక్రాంతి,కనుమ, ఈ ౠతువులో వచ్చే పండగలు.
6 శిశిరఋతువు Winter & Fall మాఘమాసము మరియు ఫాల్గుణమాసము. చెట్లు ఆకులు రాల్చును.
సూర్య చంద్ర్రుల గమనము కాలము ఇది ఒక ప్రామాణము. పనుల మధ్య జరిగిన కాల భేదమును చెప్పటానికి వాడుతారు. భౌతికశాస్త్రములో మరియు సామాన్యశాస్త్రములో కాలమును ఆతి ప్రాథమిక పరిమాణముగా పరిగణిస్తారు. కాలమును ఇతర పరిమాణాలను కొలవటానికి కూడా వాడుతారు. ఉదాహరణకి వేగము. కాలానికి ఆతి చిన్న ప్రమాణము సెకను. కాలవిభజనను తెలుసుకొనుటకు కాలమానమును చూడండి.
మాసం, పక్షం, రోజు, ఘడియ, విఘడియ, నిమిషం, పగలు, దినం, ఝాము, ఋతువు, క్షణం, ముహూర్తం, లగ్నం, సంవత్సరం, దశాబ్ధం, శతాబ్దం, శకం, వారం, తిథి.
భూతభవిష్యద్వర్తమాన కాలాలనే త్రికాలములు అంటారు.
వర్తమాన కాలం - జరుగుతున్న కాలం.
భవిష్యత్ కాలం - రాబోవు కాలం.
తెలుగు నెలలు : తెలుగు నెలలు పన్నెండు. నెలకు ముప్పై రోజులు. పదిహేను రోజులు ఒక పక్షం. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.
1. శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు) : రోజు రోజుకూ చంద్రుడితో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్లం అంటే తెలుపు అని అర్థం).
వైశాఖము.
జ్యేష్ఠము.
ఆషాఢము.
శ్రావణము.
బాధ్రపదము.
ఆశ్వీయుజము.
కార్తీకము.
మార్గశిరము.
పుష్యము.
మాఘము.
ఫాల్గుణము.
ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు.
పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల వైశాఖము.
పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల జ్యేష్ఠము .
పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాషాఢా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల ఆషాఢము.
పౌర్ణమి రోజున శ్రవణం నక్షత్రం (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల శ్రావణము .
పౌర్ణమి రోజున పూర్వాబాధ్ర్హ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాబాధ్రా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల బాధ్రపదము.
పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల ఆశ్వయుజము.
పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల కార్తీకము.
పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం (అనగా చంద్రుడు మృగశిరా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల మార్గశిరము .
పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం (అనగా చంద్రుడు పుష్యమీ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల పుష్యము.
పౌర్ణమి రోజున మఖ నక్షత్రం (అనగా చంద్రుడు మఖా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల మాఘము.
పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి (ఉత్తర) నక్షత్రం (అనగా చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల ఫాల్గుణము.
05 August 2018
గ్రహములలో శుభులు పాపులు మిత్రువులు శత్రువులు
అధర్మమయినవి) యొక్క పాప ఫలమును ఏ గ్రహము ప్రసాదిస్తుందో ఆ గ్రహము పాప గ్రహము అని అన్నారు
రాసి చక్రములో మకర లగ్నమునకు సప్తమ స్థాన అధిపతి అవడం వలన చంద్రుడు ఆ మకర లగ్నమునకు పాప గ్రహము అయ్యెను.
1. మకరము 2. కుంభము 3. మీనము 4. మేషము 5.వృషభము 6.మిథునము 7. కటకము
రాసి చక్రములో కటక/కర్కాటక లగ్నమునకు అధిపతి చంద్రుడు . కటక లగ్నమునకు స్థిర పుణ్యుడు కావడము చేత చంద్రుడు కటక లగ్నమునకు శుభ గ్రహము.
అభిజిత్ లగ్నం అంటే ఏమిటి.
"అష్టమే దివస స్వార్దేత్వభిజిత్ సంజ్ఞకఃక్షణం"
మధ్యాహ్నము గం!! 11:45 ని!! నుండి గం!!12:30ని!! వరకు అభిజిత్ ముహుర్తము అని అంటారు. నారద పురాణం ప్రకారం మధ్యాహ్నం
గం!!12:00లకు పూర్వము ఒక ఘడియ తరువాత ఒక ఘడియ అనగా ఉదయం గం!!11:36 ని!! నుండి మధ్యాహ్నం గం!!12:24 ని!! వరకు అభిజిన్ముహుర్తము.ప్రకారాంతముగ సూర్యోదయం నుండి నాల్గవ లగ్నం అభిజిత్ లగ్నము అభిజిత్ కాలము సుదర్శన చక్రము వలె సర్వ దోషములను నశింపజేస్తుందని చెప్పబడినది.
"దిన మధ్య గతే సూర్యే ముహుర్తే హ్యాభిజిత్ ప్రభు! చక్రమాదాయ గోవిందః సర్వాన్ దోషాన్ నికృన్తతి"
కాని బుధవారము అభిజిత్ నింద్యము కాని దక్షిణ దిశకు ప్రయాణం చేయరాదు.
"అభిజిన్ని బుధే శస్తం యామ్యంతం గమనే తథా"
#నారద సంహిత తొమ్మిదవ అద్యాయం దివారాత్రి ముహుర్త విచారణ అందలి ఆరవ శ్లోకము #
శ్లో!!పౌరాణికా రౌద్ర సిత మైత్ర వారభవాఃక్షణాః
సావిత్రవైరాజికాఖ్యో గంధర్వాశ్చష్టమోభిజిత్!!
తాత్పర్యముః- పౌరాణికుల మతము నందు దివా ముహుర్తములు ఈ విధముగా చెప్పిరి.రౌద్ర,సిత,మైత్ర,సూర్య,సావిత్ర,వైరాజిక, గంధర్వ,అభిజిత్ అని ఎనిమిదవ ముహుర్తమే కాంతపకాలమని చెప్పిరి.
తరువాత పదవ శ్లోకము నందు నక్షత్రాధిపతులు ముహుర్తములలో శుభకాములు చేయవచ్చని చెప్పుచున్నారు.
శ్లో!!అభిజిద్భలయుక్తాస్తే సర్వ కార్యేషు సిద్ధిదాః!
ఏషు చుక్షేషు యత్కర్మ కథితం నిఖిలం చయత్!!
తదైవత్యే తన్ముహుర్తే కార్యే యాత్రాధికం సదా!!
తాత్పర్యంః-
దినమందు ఎనిదవ ముహుర్తమగు అభిజిత్ ముహుర్తము మిక్కిలి బలమైనది మరియు సకల కార్యములను చేయునది అగుచున్నది.అని చెప్పిరి ఆయా నక్షత్రములయందు విధింపబడిన ఆయా కార్యములు చేయుట కుదరక పోయినచో ఆ నక్షత్రమునకు తగిన ముహుర్తమున ఆ కార్యమును చేయవచ్చని చెప్పిరి.
వశిష్ఠ సంహిత
వివాహాధ్యాయంలో రెండు వందల ఇరవై ఆరవ శ్లోకము
శ్లో!!మధ్యం దినగతే భానౌ ముహుర్తో2భిజిదాహ్వయః!
యో2అష్టమః సర్వదోషఘ్నస్త్వం
థకారంయథా రవిః!!
తాత్పర్యముః
సూర్యుడు
ఆకాశ మధ్య భాగములో వచ్చినప్పుడు అభిజిత్ ముహుర్తమంటారు.ఇది రోజులో ఎనిమిదవ ముహుర్తము,సూర్యుడు ఏ విధముగా నైతే చీకటిని నశింపచేయునో అలాగే అభిత్ ముహురేతం సర్వ దోషములను నశింపజేయును.
శ్లో!!సూర్యచ్ఛతుర్థం యల్లగ్నమభిజిత్సంజ్ఞకం యతత్!
సర్వ దోషం నిహంత్యాశు,పినాకే త్రిపురం యథా!!
తాత్పర్యముః
సూర్యోదయమునుండి నాల్గవ ముహుర్తము అభిజిత్ ముహుర్తము అందురు.పినాకపాణి త్రిపురాసురున్ని నశింపజేసినట్టు ఈ లగ్నము కూడ సర్వ దోషములను నశింజేయును.
శ్లో!!సర్వదేశేష్విదం ముఖ్యం సర్వ వర్ణేషు సర్వదా!
సర్వ దోష హరః యద్వద్ధరిత్యక్షర ద్వయమ్!!
తాత్పర్యముః
శ్రీ హరి నామ స్మరణ ఏ విధముగా దోషములను తొలగించునో అదేవిధముగా ఈ అభిజిత్ ముహుర్తము సర్వ దోషములు తొలగించును ఇది సమస్త దేశీయులకు,సమస్త వర్ణములవారికి ప్రశస్తమైనది.
ముహుర్త రత్నావళి
యాత్రా ప్రకరణము నందు
యాత్రాభిజిత్ర్సాశన్త్యము అను అంశము నందు
శ్లో!!అష్టయోహ్యభిజి దాహ్వాయక్షజో!దక్షిణాభిముఖ యనమమతరా!!
కీర్తతో2వరక కుప్సు సూరిభి!ర్యాయినామభిమతర్ష సాధనే!!
తాత్పర్యముః
యాత్రా సమయము నందు దక్షిణ దిక్కుకు తప్ప చక్కిన దిక్కులకు పగలు పదనాలుగు ఘడియల పిదప పదహారు ఘడియల వరకు అభిజిన్ముహుర్తము మిక్కిలి ప్రశస్తమైనదని ఇష్ట సిద్ధిని ఇచ్చునని శ్రీ పతి వచనము.
నారద సంహిత
యాత్రా ప్రకరణ మందు
శ్లో!!అభిజిక్షణ యోగో2యమ చేష్ఠా ఫల సిద్ధిదః!
పంచాంగ శుద్ధ రహితే దివసే2పి ఫలప్రదః!!
తాత్పర్యముః
యాత్రాకాలము నందు అభిజిత్ కాల మైనచో పంచాంగ శుధ్ధి లేనిదైనా శుభకరమే అగును.
శ్లో!!అభిజిత్ సర్వ కార్యేషు శస్తం నాత్రోపనయనమ్!!
తాత్పర్యముః
అభిజిత్ ముహుర్తమందు అన్ని కార్యములకు ప్రశస్త్యం కాని ఉపనయనమునకు పనికిరాదు.
ముహుర్త వల్లరి
అనే సంకలనము గ్రంధ మందు ఈ విధముగా కలదు
"అభిజిత్ సర్వ దోషఘ్నం" అనే వచనము ప్రయాణమునకు మాత్రమే వర్తించును.మిగిలిన అన్ని శుభకార్యములకు దానిని వర్తిప జేయుట తగదు.
ఈ అభిజిత్ లగ్నము సర్వ దోషములను నశింపజేయును కాని వివాహం,ఉపనయనం,గర్భాధానము తప్ప మిగిలిన సర్వ శుభకార్యముల యందు ప్రశస్తమైనది అని మహర్షుల వాక్యము.ఈ అభిజిత్ లగ్నము "అశేష దోష పహరు" అని ఋషి వాక్యం.ఈ లగ్నం సుమారుగా మిట్ట మధ్యహ్నము ఉండును ఈ లగ్నములో వివాహము చేసినచో నష్టము వాటిల్లునని బ్రహ్మ శపించునట్లు నారద సంహిత నందు గలదని వ్రాసినారు.
నారద సంహిత వివాహ ప్రకరణము నందు
శ్లో!!చతుర్థ అభిజిల్లగ్నముదయరాక్షత్తు ఏప్తియమ్!
గోధూలికం తదుభయం వివాహేపుత్ర పౌత్ర దమ్!!
తాత్పర్యముః
సూర్యోదయము నుండి నాల్గవ లగ్నం అభిజిత్ ఏడవ లగ్నం గో ధూలి లగ్నం వీని యందు వివాహం చేసిన దంపతులు పుత్ర పౌత్రాభివృద్ధిగా నుండును.
శ్లో!!ప్రాచ్యానాంచ కలింగానాం ముఖ్యం గోధూలికం స్మృతమ్!
అభిజిత్ సర్వదేశేషు ముఖ్యం దోష వినాశకృత్!!
తాత్పర్యముః
తూర్పు దేశీయులకు,కళింగ దేశీయులకు గోధూలి సమయం ప్రశస్తయము మిగిలిన దేశాలవారికి అభిజిత్ లగ్నము ప్రశస్త్యము.
శ్లో!!మధ్యం దినగితేభానౌ ముహుర్తో2భిజిదాహ్వయః!
నాశయత్యఖిలాన్దోషాన్పినాకీత్రిపురం యథా!!
తాత్పర్యముః
సూర్యని మధ్యాహ్న కాలసమయమే అభిజిల్లగ్న కాలము.ఇది పినాకపాణి త్రిపురాసురున్ని ఏ విధముగా నాశనం చేశాడో అదేవిధముగా అభిజిత్ లగ్నము సమస్త దోషములను నాశనము చేయును.
శ్లో!!మధ్యందినే భానౌ సకలం దోషనమచయమ్!
కరోతి మభిజిత్తూలరాశిమివానలః!!
తాత్పర్యముః
మధ్యాహ్నకాలమందలి అభిజిత్ లగ్నము దూదిరాశి యందు నిప్పుకణం వలె సర్వ దోషాలను దహింపజేయును.
జ్యోతిష్య రత్నమాల యందు ప్రయాణమునకు అభిజిత్ ప్రశంస.
శ్లో!!అష్టమోహ్యాభిజిదాహ్వాయఃదక్షిణాభిముఖ
యాన మంతరా కీర్తితో పరకకువ్సు సూరిభిర్యాయినా మభమతర్ష సిధ్ధిదః!!
ఉత్పత విష్టి వ్యతిపాత పూర్వాన్ నిహమతి
దోషానభిజిన్ముహుర్తః కరోతి యమోయపహయ కాష్టాం దిగంతరాణి ప్రజతోర్ష సిద్ధం!!
తాత్పర్యః
ఎనిమదవ ముహుర్తమయిన అభిజిత్ ప్రయాణానికి సిద్ధినిచ్చునది అని,వ్యతీపాత, విష్ఠి కరణ,ఉత్పాతములయందు సర్వ దోషములను పోగొట్టునని మరియు అభిజిత్ దక్షిణదిక్ప్రయాణమునకు నిషేధించబడినది.
వాస్తు దుందుభి
ఈ గ్రంధము నందు అభిజిత్ లగ్నము గూర్చి ప్రస్తావన
శ్లో!!ఉత్పాత విష్ఠి వ్యతిపాత పూర్వాన్నిహంతే దోషానభిజిన్ముహుర్తేః!
వ్రతంచ యమ్యామపహాయ కార్యకర్తుఃప్రయాతర్దిశతి స్వహృదయమ్!!
తాత్పర్యముః
ఈ అభిజిన్ముహుర్తము ఉత్పాతాదులు,విష్ఠి కరణాలు,వ్యతిపాత యోగాలుమొదలుగా గల దోషములు అన్నింటిని హరించును.ఈ అభిజిల్లగ్నమున ఉపనయనము,దక్షిణ దిక్కు ప్రయాణము,వ్రతము గాక ఏ కార్యమును గావించినను ఏ దిక్కునకు ప్రయాణించినను కార్య కర్తకును,ప్రయాణికునకు ను మనస్సునందు యేయే కోరికలు కలవో ఆ కోరికలన్ని వెరవేరును.
జ్యోతిర్విదా భరణము
వివాహ ప్రకరణోత్తరార్దము నందలి పదవ శ్లోకము.
శ్లో!!భగోడు వాల్మీకిరిహాహసౌమ్యం సీతా నిషేవేన దుఃఖం తదూడ!
భైమే తథైవాభిజిధృక్ష మత్రిస్తచ్ఛాపమాపోడుతదేయమస్మాత్!!
తాత్పర్యముః
వాల్మీకి మహర్షి సీతా వివాహము ఫల్గునీ నక్షత్రమున జరుగుటచే వైవాహిక సౌఖ్యము అబ్బలేదని.అదేవిధముగా అత్రి మహర్షి అభిజిత్ మంచిది కాదని తెలిపిరి ఎందుకనగా ఆ నక్షత్రమున నలునికి దమయంతితో వివాహము జరిగెను అందుచే ఆమెకు కూడ వైవాహిక జీవితము సుఖము కలుగలేదు.అందువలన పూర్వఫల్గుణి,అభిజిత్ నక్షత్రాలను ప్రజల వివాహమునకు వాడకుండ త్యజించినారు.ఆ మహాత్మురాండ్ర శాపమానక్షత్రములకు తగిలిందట అని వ్యాఖ్యానమలో నున్నది.
కాలామృతము
పంచమ బిందు 177 వ శ్లోకము
శ్లో!!స్యాధ్భంగో2భిజిదాహ్వయేచనిలయేధిష్ష్యే ముహుర్తే తథా!
రోగస్స్యాధ్వనుభన్యచోత్తర దళా దృక్షేషు పంచన్వివి,
ధుఖం దక్షిణ దిక్పయాతురథవా నాన్యత్ర యాతు స్త్వయం మిానేచేదథ సర్వ దిక్షు గమనం యాతుశ్చ వక్రిం భవేత్!!
తాత్పర్యముః
అభిలగ్నము నందు,అభిజిన్నక్షత్రము నందు,అభిజిన్ముహుర్తమందు ప్రయాణము చేయు వారికి శుభకరంబనియు,దక్షిణ దిక్కు ప్రయాణము చేయు వారలకు రోగకరమనియు అని ఉన్నది.
#వాల్మీకి రామాయణము#
వాల్మీకి రామాయణము నందు యుధ్ధ కాండ నాలుగవ సర్గ మూడవ శ్లోకము నందు గోవింద రాజు వ్యాఖ్యానం నందు
శ్లో!! అస్మిన్ ముహుర్తే సుగ్రీవ ప్రయాణ మభిరోచయే!
యుక్తో ముహుర్తో విజయః ప్రాప్తో మధ్యం దివాకరః!!
వ్యాఖ్యానంః-
సుగ్రీవుడా ఈ ముహుర్తము నందే (దండయాత్ర)
ప్రయాణమునకు ఇష్టపడుచున్నాను,ఈ ముహుర్తము ప్రయాణమునకు తగినది,విజయం కలిగించునది,సూర్యుడు దినమున నడి భాగము పొందినాడు,దండయాత్రకు విజయము కలుగు కారణము చెప్పు చున్నారు,దినమందు రవి నడిమి భాగమున ఆకాశ మధ్య భాగమున పొందినాడు,దినమందు!రాత్రికి పదునైదు ముహుర్తములు పగటికి పదునైదు ముహుర్తములు కలిసి ముప్పై ముహుర్తములు రెమడు ఘడియలకొక ముహుర్తము ఇరువది నాలుగు నిమిషములకొక ఘడియ! అర్ద్రో,రోగ,మిత్ర,వసు,జల,విశ్వ,భిజిద్వెరించేంద్రాఃఐంద్రాగ్నిమూలం వరుణార్యయ భగతారా దివా ముహుర్తాస్స్యుః!!
ఆరుద్ర,అశ్రేష,అనూరాధ,మఖ,ధనిష్ఠ,పూర్వాషాఢ,ఉత్తరాషాఢ,అభిజిత్ రోహిణి,జ్యేష్ఠా,విశాఖ,మూల,శతభిషము,ఉత్తర ఫాల్గణి,పూర్వఫాల్గుని అను నక్షత్రములకు చెందినవి పగటి పదునైదు ముహుర్తములు అని "విద్యా మాధవీయం"అనే జ్యోతిష్య గ్రంధమందు చెప్పబడినవి,వీనిలో దినము నడిభాగము నున్న ముహుర్తము అభిజిన్ముహుర్తము అగును ఇది విజయావహము.
అభిజిన్ముహుర్తములు దక్షిణయాత్రలందు విశిష్ఠములని"జ్యోతిష్య రత్నాకరము" నందు "భుక్తా దక్షిణ యాత్రాయాం ప్రతిష్ఠాయాం ద్విజన్మని!అథానేచ ధ్వజారోహే మృత్యుదస్స్యాత్సదా2భిజిత్.
(భుక్తి,దక్షిణ యాత్రా,దేవతా ప్రతిష్ఠా,ఉపనయనము,అథానము,ధ్వజారోహణము అను కర్మలయందు ఎల్లప్పుడు మృత్యువు కలిగించును.)అని చెప్ప బడినది మరి అభిజిత్ ముహుర్తము దక్షిణ యాత్రకు ఎట్లు పనికి వచ్చును అని ఆక్షేపణ రాగా లంకా నగరము కిష్కిదకు దక్షిణ పూర్వము గలదు అనగా ఆగ్నేయదిశయందున్నది దక్షిణ దిశ కాదు కావున చెెప్పబడిన దోషము లేదు.
విశేషముః సర్వ సాదారణముగా ప్రయాణమందు యోగ్యమైన కాలమని ఆయా ఋషుల మతమిట్లున్నవి.
"గార్గ్య సిధ్ధాంత ముషః కాలకలన శకుటముానుటయది బృహస్పతి మతంబు!విప్రజన వాక్యమరయంగా విష్ణు మతము సర్వసిద్ధాంత మభిజిత్తు సమ్మతంబు"
(ప్రాతః కాలమున ప్రయాణము మంచిదని గార్గముని మతం,శకునము చూచి ప్రయాణము చేయుట మంచిదని బృహస్పతి మతము,(బ్రాహ్మణ వాక్యమును బట్టి ప్రయాణము చేయుట మంచిదని విష్ణు మతము) అభజిన్ముహుర్త ప్రయాణము చేయుట అందరికి సమ్మతమైన మతము.
#ముహుర్త చంద్రిక#
ముహుర్త చంద్రిక యందు అభిజిత్ విశేషము
శ్లో!!ఉత్పాత విష్ఠి వ్యతిపాపూర్వం నిహంతి దోషానభిజిన్ముహుర్త!
కరోతి యమ్యమసహాయ కాష్టాదిగంత చాణి వ్రజతోర్థసిద్దిం!!
తాత్పర్యముః
అభిజిన్ముహుర్తము ఉత్పాత దోషము విష్ఠి దోషము వ్యతిపాత ప్రముఖ దోషము ఇత్యాది దోషములు పరిహారింప జేయును ప్రయాణములందు దక్షిణ దిక్కుకు తప్ప తదితర దిక్కులకు అర్ష లాభము చేయునని అర్థము.
#ముహుర్త మార్తండము#
అభిజిత్ లక్షణం తత్ఫలం
శ్లో!!మిశ్రాఖైరువభైర్దనాదిమలవే తేక్ష్టేర్ది తే యన్తి మేక్షిప్రైర్నక్రమశో మృదూగ్ర చరభై రాత్రి త్రిభాగేష్వియాత్!
శ్రుత్యర్కేజ్యమృగేష్వయంపనియోవైశస్త్వపాదశ్ర
ఏస్తిథ్యక శన్త్విధిజిద్గ మేసఫలదో యామిం వినావీక్షణః!!
తాత్పర్యంః
అభిజిన్ముహుర్తమందు దక్షిణ దిక్కు తప్ప మిగిలిన దిక్కులకు పోవటం వలన సకల విధములకు శుభకరము విశేషఫలం అభిజిల్లక్షణ కాల సమాప్తం
(తాత్పర్యం సూక్ష్మంగా విశ్లేషణ చేడమైనది)
#ముహుర్త దర్పణము#
అభిజిత్ మరియు గోధూళి సమయాలు
శ్లో!!మధ్యందిన గతే భానో ముహుర్తో2భితదహ్వయః!
సర్వదోషన్నిహంత్సాశు పినాకీ త్రిపురం యథా!!
శ్లో!!సూర్యచ్ఛతుర్థం యల్లగ్ననుభిజిత్సంజ్ఞకం చతత్!
సర్వ దేశేత్వదం ముఖ్యం సర్వ వర్ణేషు సర్వదా!!
శ్లో!!అశేషదోషపహారం శుభప్రదం జగుర్మనీంద్రా అభిజిన్ముహుర్తం తధైవ గోధూళికనామధేయం వివాహ యాత్రాద్యాఖిలోత్సవేషు!!
తాత్పర్యముః
అభిజిన్ముహుర్తం విష్ఠి,వ్యతిపాత,దోషాలు అపహరించును వివాహము ప్రయాణము గృహప్రవేశము,వాస్తు కర్మ మొదలయిన శుభ కార్యాలయందు శ్రేష్ఠమైనది అని చెప్పబడినది.
శ్లో!!అభిజిత్సర్వ కార్యేషు శస్తం నాత్రోపనాయనం!
సూర్యాత్సప్తలగ్నం మేద్గోధూళిక మితి స్మృతమ్!!
తాత్పర్యముః
అభిజిత్ ముహుర్తము ఉపనయనమునకు త్ప్ప మిగిలిన అన్న శుభకార్యములకు ప్రసిద్దము,విశేషమైనది ప్రాశస్త్యమైనది.
#రత్నమాలా#
శ్లో!!యస్మిన్ ధిష్ణ్వే యఛ్ఛ కర్మోపధిష్టం తద్దైవత్యే తన్ముహుర్తేపి కార్యమ్!!
తాత్పర్యముః
ఏ నక్షత్రమున ఏకర్మ చేయుట చేయుట శ్రేష్ఠమని చెప్పబడినదో ఆ నక్షత్రాధి దేవత యొక్క ముహుర్త మందు ఆ శుభ కర్మ చేయుట మంచిది.
*సర్వ దేశములయందును సర్వ వర్ణములమదును ఉపనయనము తప్ప సర్వ శుభకర్మలయందును,సర్వ శుభ కార్యములయందును ప్రశస్తమైనది అని మహర్షులు చెప్పుచున్నారు.
*దైవజ్ఞులు నిశ్చయించెడి సుముహుర్తములు లగ్న బల సమపదచే స్వల్పదోషములు నశించును మహా దోషములు తొలుగుట గూర్చి చెప్పుట లేదు.ఈ అభిజిల్లగ్నము గూర్చి శాస్త్రము "అశేష దోషాపహంగ"అని చెప్పు చన్నది.
*కావున దైవజ్ఞ భారము వహిపలేని వారు ఈ అభిజిల్గ్నమును సర్వ కార్యములయందు ఆశ్రయించుట మంచిది.
ఎక్కువగా యాత్రలకు శుభప్రదమని ప్రమాణాలున్నవి.
కాలసర్ప యోగము
గోచార రీత్యా వక్రించే గ్రహాలు
మీ జాతక చక్రం లో ఎవైనా కొన్ని గ్రహాలు వక్రించి ఉన్నాయా అని చూడండి. గ్రహాలు "ఆర్" అనే సంకేతం తో ఉంటాయి. అలంటి గ్రహాలు మీ జాతకం లో ఉంటే వాటి ఫలితాలు తెలుసుకోండి. వాస్తవానికి గ్రహాలు వెనుకకు నడవడం (వక్రించడం) అంటూ ఉండదు. భూమి చలనం వల్ల మనకు అలా అనిపిస్తుంది అంతే. నిజానికి కొన్ని గ్రహాలు కొంత నిర్ణీత సమయాల్లో వక్రిస్తూ ఉంటాయి. శని గ్రహం 36.39%, గురు గ్రహం 30.24%, బుధ గ్రహం 19.76 %, కుజ గ్రహం 9.33% మరియూ శుక్ర గ్రాహం7.43% గ్రహం సమయం తమ మొత్తం సమయం లో వక్రిస్తూ ఉంటాయి. రాహు కేతు గ్రహాలు ఎల్లప్పుడూ వెనక్కు నడుస్తూనే ఉంటాయి. సూర్య మరియూ చంద్ర గ్రహాలు అసలు వక్రించం ఎప్పుడూ ఉండదు. మొదట గా రాహు కేతు గ్రహాల గురించి చూద్దాము. ఆ గ్రహాలు ఎప్పుడూ వెనక్కు నడవడమే గానీ ముందుకు నడవడం ఉండదు. ఐతే అవి చూసే దృష్టి మాత్రం చాల వై విద్యం తో ఉంటుంది. జాతకుని ఉన్నత స్థానాలకు వూ హించని విధంగా తీసుకుని వెళ్తుంది. రాహు, కేతు గ్రహాలు సాధారణం గా నే వెనక్కు నడవడం వల్ల, జాతకునికి కీడు చేయడం ఉండదు. ఎందుకంటే వాటి స్వభావం రెట్రోగ్రేడ్ (వక్ర గమనం) కాబట్టి. ఇక పోతే మిగతా 5 గ్రహాల సంగతి మాత్రం కాస్త పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. కుజ , బుధ , గురు , శుక్ర మరియూ శని గ్రహాలు. అవి వక్రిస్తే మన జాతకం మీద ప్రభావం చూపుతాయి. ఈ గ్రహాలే మనకు పంచ మహా పురుష యోగాలను సిద్ధింప చేస్తున్నాయి అనే విషయం కాస్త గుర్తు పెట్టుకోవాలి. సృష్టి లోని పంచ మహా శక్తులకు ఇవే నిలయం అని తెల్సు కోవాలి. గురు ఆకాశానికి, శని వాయువుకు, కుజ అగ్ని కి, శుక్రుడు నీటికి, బుధ భూమికి ప్రతీక గా చెప్తారు. ప్రతి గ్రహం ఏదో ఒక పంచ భూతానికి నిలయం కనుక మనం ఎ గ్రహం వక్రించిందో తెలుసుకొని వ్యవహరిస్తే సత్ఫలితాలు ఉంటాయి. వక్ర గ్రహాలు ముఖ్యం గా మనవ సంభంధాలు వారి మధ్య గల జీవన భంధవ్యాలపై ప్రభావం చూపుతుంది. వేద జ్యోతిషం ప్రకారం వక్రించిన గ్రహాలు మంచి బలవంత మైనవి గ ఉంటాయి. ఈ గ్రహాలు భూమికి దగ్గర గా ఉండడం వల్ల మానవుల పైన ఎక్కువ ప్రభావం చూపుతాయి. అంటే ఎంత ఏవిధంగా అనేది తరచి చూడ వలసిన విషయం. ఈ విషయం లో రెండు విధాలుగా చూడవలసి ఉంటుంది. ఒకటి గోచార రీత్యా వక్రించే గ్రహాలు మరియూ మన జాతక చక్రం లో వక్రించిన గ్రహాలు. గోచార రీత్యా వక్రించే గ్రహాలు ఆ యా వ్యక్తులపైన ఎలానూ సాధారణం గ ప్రభావం చూపుతాయి కాబట్టి ప్రత్యేకం గ ఏమీ సమస్యలు ఉండవు. జాతక రీత్యా చక్రం లో ఉండే వక్ర గ్రహాల విషయమ చాల జాగ్రతగా చూడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడూ ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి ఒక్కోసారి తిక్కగా మాట్లాడాడంటే దానికి కారణం వక్రించిన బుధుడు అని గ్రహించాలి. అందువల్ల మనం తెలుసు కావలసింది ఏమిటంటే వక్రించిన గ్రహాల విషయం అంత తేలిక గ తీసిపారెయ్యడానికి వీలు లేదు. ఆలోచనలు మొదలైనవి బుధ గ్రహ లక్షణాలు ఐతే, క్రియేటివిటీ లేక సాంఘిక పరమైన ఆలోచనలు శుక్ర గ్రహం వల్ల సంభవిస్తాయి. తమపైన తమకు నమ్మకము గురు గ్రహం వల్ల కలుగుతాయి. ఇవన్నీ వక్రించినప్ప్డు వ్యతిరేక ఫలితాలనిస్తాయని అనుభవజ్ఞులు అంటారు. ఏదైనా ఒక గ్రహం వక్రించినట్లైతే జాతకునికి అన్నీ కష్ట నష్టాలె వస్తాయని, జీవన గమనం లొ కొంచెం కుంటు బడుతుందని అని కూడ అంతా అనడం సబబు. దాన్ని ఇంకా కొంచెం వివరం గా ఛూసి నిర్ణయించుకొవాలి. ఊదాహరణకు గురు గ్రహం వక్రిస్తే ఆ వ్యక్తి ఒక విధమైన ఆత్మాభిమనాన్ని పెంపొందించుకుని తను ఒక ప్రత్యేమైన వ్యక్తి గ అనుకుని వ్యవహరించడం జరుగుతుంది. ఒక్కొ గ్రహం వక్రిస్తే వొక్కో రకమైన గుణ గణాలు జాతకుని లో కనిపిస్తాయి. బుధ గ్రహం వక్రిస్తే ఆలొచన, తెలివి తేటలు మొదలైనవటిపైన ప్రభావం ఉంటుంది. శుక్రుడు వక్రిస్తె శ్రుజనాత్మకత, సాంఘిక కర్యకలాపాలు, కుజుని వల్ల మనిషి తనను తాను వ్యక్తీకరించు కొవడం భిన్నమైన ఆలొచనలు ఉంటె, శని వల్ల ఆత్మ నిగ్రహమూ వస్తాయి.
వక్ర గ్రహ విశ్లేషణ
విధి వక్రించింది అంటూ ఉంటారు చూడండి అలాగే గ్రహాలు కూడా వొక్కో సారి వక్రించడం ఉంటుంది. దాన్ని గురించి తెలుసుకోండి. మీ జాతక చక్రం లో ఎవైనా కొన్ని గ్రహాలు వక్రించి ఉన్నాయా అని చూడండి. గ్రహాలు "ఆర్" అనే సంకేతం తో ఉంటాయి. అలంటి గ్రహాలు మీ జాతకం లో ఉంటే వాటి ఫలితాలు తెలుసుకోండి. వాస్తవానికి గ్రహాలు వెనుకకు నడవడం (వక్రించడం) అంటూ ఉండదు. భూమి చలనం వల్ల మనకు అలా అనిపిస్తుంది అంతే.
నిజానికి కొన్ని గ్రహాలు కొంత నిర్ణీత సమయాల్లో వక్రిస్తూ ఉంటాయి. శని గ్రహం 36.39%, గురు గ్రహం 30.24%, బుధ గ్రహం 19.76 %, కుజ గ్రహం 9.33% మరియూ శుక్ర గ్రాహం7.43% గ్రహం సమయం తమ మొత్తం సమయం లో వక్రిస్తూ ఉంటాయి. రాహు కేతు గ్రహాలు ఎల్లప్పుడూ వెనక్కు నడుస్తూనే ఉంటాయి. సూర్య మరియూ చంద్ర గ్రహాలు అసలు వక్రించం ఎప్పుడూ ఉండదు.
మొదట గా రాహు కేతు గ్రహాల గురించి చూద్దాము. ఆ గ్రహాలు ఎప్పుడూ వెనక్కు నడవడమే గానీ ముందుకు నడవడం ఉండదు. ఐతే అవి చూసే దృష్టి మాత్రం చాల వై విద్యం తో ఉంటుంది. జాతకుని ఉన్నత స్థానాలకు వూ హించని విధంగా తీసుకుని వెళ్తుంది. రాహు, కేతు గ్రహాలు సాధారణం గా నే వెనక్కు నడవడం వల్ల, జాతకునికి కీడు చేయడం ఉండదు. ఎందుకంటే వాటి స్వభావం రెట్రోగ్రేడ్ (వక్ర గమనం) కాబట్టి. ఇక పోతే మిగతా 5 గ్రహాల సంగతి మాత్రం కాస్త పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. కుజ , బుధ , గురు , శుక్ర మరియూ శని గ్రహాలు. అవి వక్రిస్తే మన జాతకం మీద ప్రభావం చూపుతాయి. ఈ గ్రహాలే మనకు పంచ మహా పురుష యోగాలను సిద్ధింప చేస్తున్నాయి అనే విషయం కాస్త గుర్తు పెట్టుకోవాలి. సృష్టి లోని పంచ మహా శక్తులకు ఇవే నిలయం అని తెల్సు కోవాలి. గురు ఆకాశానికి, శని వాయువుకు, కుజ అగ్ని కి, శుక్రుడు నీటికి, బుధ భూమికి ప్రతీక గా చెప్తారు. ప్రతి గ్రహం ఏదో ఒక పంచ భూతానికి నిలయం కనుక మనం ఎ గ్రహం వక్రించిందో తెలుసుకొని వ్యవహరిస్తే సత్ఫలితాలు ఉంటాయి. వక్ర గ్రహాలు ముఖ్యం గా మనవ సంభంధాలు వారి మధ్య గల జీవన భంధవ్యాలపై ప్రభావం చూపుతుంది. వేద జ్యోతిషం ప్రకారం వక్రించిన గ్రహాలు మంచి బలవంత మైనవి గ ఉంటాయి. ఈ గ్రహాలు భూమికి
దగ్గర గా ఉండడం వల్ల మానవుల పైన ఎక్కువ ప్రభావం చూపుతాయి. అంటే ఎంత ఏవిధంగా అనేది తరచి చూడ వలసిన విషయం. ఈ విషయం లో రెండు విధాలుగా చూడవలసి ఉంటుంది. ఒకటి గోచార రీత్యా వక్రించే గ్రహాలు మరియూ మన జాతక చక్రం లో వక్రించిన గ్రహాలు. గోచార రీత్యా వక్రించే గ్రహాలు ఆ యా వ్యక్తులపైన ఎలానూ సాధారణం గ ప్రభావం చూపుతాయి కాబట్టి ప్రత్యేకం గ ఏమీ సమస్యలు ఉండవు. జాతక రీత్యా చక్రం లో ఉండే వక్ర గ్రహాల విషయమ చాల జాగ్రతగా చూడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడూ ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి ఒక్కోసారి తిక్కగా మాట్లాడాడంటే దానికి కారణం వక్రించిన బుధుడు అని గ్రహించాలి. అందువల్ల మనం తెలుసు కావలసింది ఏమిటంటే వక్రించిన గ్రహాల విషయం అంత తేలిక గ తీసిపారెయ్యడానికి వీలు లేదు. ఆలోచనలు మొదలైనవి బుధ గ్రహ లక్షణాలు ఐతే, క్రియేటివిటీ లేక సాంఘిక పరమైన ఆలోచనలు శుక్ర గ్రహం వల్ల సంభవిస్తాయి. తమపైన తమకు నమ్మకము గురు గ్రహం వల్ల కలుగుతాయి. ఇవన్నీ వక్రించినప్ప్డు వ్యతిరేక ఫలితాలనిస్తాయని అనుభవజ్ఞులు అంటారు. ఏదైనా ఒక గ్రహం వక్రించినట్లైతే జాతకునికి అన్నీ కష్ట నష్టాలె వస్తాయని, జీవన గమనం లొ కొంచెం కుంటు బడుతుందని అని కూడ అంతా అనడం సబబు. దాన్ని ఇంకా కొంచెం వివరం గా ఛూసి నిర్ణయించుకొవాలి.
ఊదాహరణకు గురు గ్రహం వక్రిస్తే ఆ వ్యక్తి ఒక విధమైన ఆత్మాభిమనాన్ని పెంపొందించుకుని తను ఒక ప్రత్యేమైన వ్యక్తి గ అనుకుని వ్యవహరించడం జరుగుతుంది. ఒక్కొ గ్రహం వక్రిస్తే వొక్కో రకమైన గుణ గణాలు జాతకుని లో కనిపిస్తాయి. బుధ గ్రహం వక్రిస్తే ఆలొచన, తెలివి తేటలు మొదలైనవటిపైన ప్రభావం ఉంటుంది. శుక్రుడు వక్రిస్తె శ్రుజనాత్మకత, సాంఘిక కర్యకలాపాలు, కుజుని వల్ల మనిషి తనను తాను వ్యక్తీకరించు కొవడం భిన్నమైన ఆలొచనలు ఉంటె, శని వల్ల ఆత్మ నిగ్రహమూ వస్తాయి.
మంచి ఆలోచనలు ఉంటే మనకు అంతా మంచే జరుగుతుంది. గ్రహాలగురించి ఆలోచన మాని, నలుగురికి మంచి చేయాలని ఆలోచన చేయగలరు.
అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి.