నక్షత్రములలో ఇది మొదటిది.
అశ్విని నక్షత్రము గుణగణాలు అశ్వినీ నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్యభగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టిన వారు అశ్వినీదేవతలు.
అశ్వినీ నక్షత్రజాతకులు అశ్వము వలె ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వము అధికము. క్రీడల అందు ఆసక్తి అధికము. అశ్వినీదేవతలు శసత్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్వినీ నక్షత్రజాతకులు ఆయుర్వేదము వంటి వైద్యము అందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వము కలిగి ఉంటారు. రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధార్యసాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు. ఓర్పు, నేర్పు, సామర్ధ్యంతో కార్యనిర్వహణ చేస్తారు. ఉత్సాహవంతుతుగా ఉంటారు. పోటీ మనస్త్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు. వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయము తీసుకుంటారు.
ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయము, ధర్మము పాటించడములో ఆసక్తి కనపరుస్తారు. వీరు రుజువర్తనులై ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక అధికారులుగా చక్కగా రాణిస్తారు. నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము, దైవోపాసనా, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికము. కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికమే. ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వము కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు.
ఇవి అశ్వినీ నక్షత్రజాతకుల సాధారణ గుణాలు అయినా జాతకచక్రము, లగ్నము, పుట్టినసమయము, మాసముల వలన గుణగణాలలో మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరముల వరకు జీవితము సాఫీగా జరుగుతుంది. బాల్యము నుండి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరికి జీవితము వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది.
నవాంశ ఆధారిత గుణాలు
అశ్వినీ నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు, నవాంశ రాశ్యధిపతి కుజుడు కనుక వీరు ధైర్యసైహసాలు అత్యధికంగా కలిగి ఉంటారు. ఎటువంటి ఉద్రేకపూరిత వాతావరణంలో కూడా వీరు ముందు ఉంటారు. క్రీడాకారులు, సైనికాధికారులు, అగ్నిమాపకదళం వంటి ఉద్యోగాలు చేయడానికి ఉత్సుకత చూపిస్తారు.
అశ్వినీ నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు నవాంశ రాశ్యధిపతి శుక్రుడు ఈ నక్షత్రం వారి గుణ గణాలు అశ్వని నక్షత్రము ఏపాదంలో జన్మించినవారైనా అందం పెంపొదించుకోవాలని తాపత్రయపడతారు. ఎంతమందిని సలహాలు అడిగినా తన నిర్ణయాన్ని అమలు చేస్తారు.
అశ్వినీ నక్షత్ర జాతకులకు తారాఫలాలు
తార నామంతారలుఫలం జన్మ తారఅశ్విని, మఖ, మూలశరీరశ్రమ సంపత్తారభరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢధన లాభం విపత్తార కృత్తిక,
ఉత్తరఫల్గుణి, ఉత్తరాషాఢకార్యహాని క్షేమత్తారరోహిణి,
హస్త, శ్రవణంక్షేమం
ప్రత్యక్ తారమృగశిర,
చిత్త, ధనిష్టప్రయత్న భంగం
సాధన తారఆరుద్ర,
స్వాతి, శతభిషకార్య సిద్ధి,
శుభం నైత్య తారపునర్వసు,
విశాఖ, పూర్వాభాద్రబంధనం మిత్ర తారపుష్యమి,
అనూరాధ, ఉత్తరాభాద్రసుఖం
అతిమిత్ర తారఆశ్లేష,
జ్యేష్ట, రేవతిసుఖం, లాభం
అశ్వని నక్షత్రము కొన్ని వివరణలు నక్షత్రంఅధిపతిగణముజాతివృక్షంజంతువునాడిపక్షిఅధిదేవతరాశి అశ్వినికేతువుదేవపురుష అడ్డరసగుర్రంఆదిగరుడఅశ్వినీదేవతలుమేషం అశ్విని నక్షత్రము నవాంశ 1 వ పాదము - మేషరాశి. ASHVINI [అశ్వని]CAT’S EYE [వైడూర్యము. నామ అక్షరము (చూ.)
2 వ పాదము - మేషరాశి . ASHVINI [అశ్వని]CAT’S EYE [వైడూర్యము] నామ అక్షరము ( చే)
3 వ పాదము - మేషరాశి . ASHVINI [అశ్వని]CAT’S EYE [వైడూర్యము] నామ అక్షరము (చో)
4 వ పాదము - మేషరాశి . ASHVINI [అశ్వని]CAT’S EYE [వైడూర్యము] నామ అక్షరము (లా)
అను అక్షరములు గల పేర్లు పెట్టవలెను.
నక్షత్రానికి ఉన్న గుణలు కలిగిఉన్నా నవాంశని అనుసరించి నాలుగు పాదాల వారికి ప్రత్యేక గుణలు కొన్ని ఉంటాయి.
అశ్వినీ నక్షత్రము మొదటి పాదములో పుట్టిన వారు క్రీడాకారులుగా రాణిస్తారు. వీరు వీరవైద్యల అమ్దు ఆసక్తి కలిగి ఉంటారు
. అశ్వినీ నక్షత్రము రెండవ పాదములో పుట్టిన వారు అలంకరణ అందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి సంభందించిన అన్ని విషయాలు సౌందర్యంగా ఉండడానికి శ్రద్ధవహిస్తారు.
అశ్వినీ నక్షత్రము మూడవపాదములో పుట్టిన వారు విద్యలయందు అసక్తి కలిగి ఉంటారు.
అశ్విణీ నక్షత్రము నాల్గవ పాదములో పుట్టిన వారు ఆయుర్వేదము వంటి వైద్యము, ఔషధతయారీ వంటి వాటి అందు ఆసక్తి కలిగి ఉంటారు.
అశ్వని నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు అశ్విని నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్య భగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్య భవానుడికి పుట్టిన వారు అశ్వినీ దేవతలు. ప్రాథమికంగా అశ్వనీ నక్షత్రం సన్య నక్షత్రంగా పురుష లక్షణంతో క్షిపుతారగా గుర్తింపు పొందింది. దీనికి అధిపతి కేతువు.
ఈ నక్షత్రంలో జన్మించినవారు శివుడి అర్చన చేసి వైడూర్యాన్ని ధరించవలసి ఉంటుంది.అశ్వని నాలుగు పాదాలు మేష రాశిలోనే ఉన్నాయి మొదటి పాదం అశ్వినీ నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు. వీరు శక్తికి మించిన సామర్థ్యం ప్రదర్శించాలని ప్రయత్నిస్తారు. అస్థిర చిత్తంతో ఉంటారు. కొన్ని సార్లు రాజీ ధోరణితో ఉండాల్సి ఉంటుంది. అనవసర విషయాలపై దృష్టి పెట్టడం జరుగుతుంది. పనికి రాని ఆలోచనలు బుర్రను తొలుస్తుంటాయి. సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం పొందాలన్న తాపత్రయపడతారు.గ్రహ దశలుపుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ ఏడు సంవత్సరాలు, శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు, రవి మహర్దశ ఆరు సంవత్సరాలు, చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు అనుభవిస్తారు.
రెండో పాదం అశ్వినీ నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు నవాంశ రాశ్యధిపతి శుక్రుడు. దీంతో వీరు పట్టుదల గల వారు. ఎదుటి వ్యక్తుల స్వభావాన్ని త్వరగా గ్రహిస్తారు. చాలా విషయాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. తలపెట్టిన కార్యాన్ని సాధించడంలో అనుకూలమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ప్రాజ్ఞులు, దక్షులుగా గుర్తింపు పొందుతారు. మంచి ఆత్మవిశ్వాసం గలవారై ఉంటారు.గ్రహ దశలు వీరు పుట్టినప్పటి నుంచి కేతు దశ ఐదు సంవత్సరాల మూడు నెలలు. శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు. రవి మహర్దశ ఆరు సంవత్సరాలు. చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు అనుభవిస్తారు.
అశ్వని మూడో పాదంలో జన్మించిన వారికి ప్రాచీన శాస్త్రాలను ఇష్టపడుతారు. ముఖ్యంగా జ్యోతిష్య, తర్క శాస్త్రాలపై మక్కువ ఉంటుంది. చక్కటి సలహాలు ఇవ్వడంలో నేర్పరులు. అయితే ఆ సలహాల వల్ల తమకు తాము ఎలాంటి లాభాన్ని పొందలేరు. నలుగురిలో కలిసేందుకు ఇష్టపడరు.గ్రహ దశలు పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ మూడున్నర సంవత్సరాలు, శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు. రవి మహర్దశ ఆరు సంవత్సరాలు. చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 సంవత్సరాలు అనుభవిస్తారు.
అశ్వని నాలుగో పాదంలో జన్మించిన వారు కళాత్మకంగాను, అలంకార ప్రియులుగానూ, నిదానమైన ప్రవర్తనతోనూ ఉంటారు. గాఢమైన ఆలోచనలు కలిగి మేధావులుగా గుర్తింపు పొందుతారు. నిరంతరం కొత్త విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. లక్ష్యసాధనలో వెనుకడుగు వేయరు. అయితే వీరికి ఫలితం సునాయాసంగా అందదు. శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది.గ్రహ దశలు పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ 7 సంవత్సరాల 9 నెలలు, శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు. రవి మహర్దశ ఆరు సంవత్సరాలు. చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 సంవత్సరాలు అనుభవిస్తారు.ఈ నక్షత్ర జాతకుల గుణగణాలుఅశ్వినీ నక్షత్ర జాతకులు అశ్వం వలే ఉరిమే ఉత్సాహంతో కనిపిస్తారు. తెలివి, జ్ఞాపకశక్తి, సామర్థ్యం, చైతన్యవంతమైన, విశాలమైన కళ్ళు కలిగివుంటారు. పోటీ మనస్తత్వం ఉంటుంది. క్రీడల యందు ఆసక్తి అధికం. అశ్వినీదేవతలు శసత్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్వినీ నక్షత్రజాతకులు ఆయుర్వేదం వంటి వైద్యం యందు ఆసక్తితో ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వం కలిగి ఉంటారు. రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధైర్యసాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు. ఓర్పు, నేర్పు, సామర్ధ్యంతో కార్యనిర్వహణ పూర్తి చేస్తారు. తనను నమ్ముకున్న వారిని ఆపదలో కాపాడుట వీరి విశిష్ట గుణం.ఈ నక్షత్ర జాతకులు వీరు ఇతరుల సలహాలు స్వీకరించినా.. చివరకు తమకు నచ్చినట్లు నిర్ణయం తీసుకుంటారు. ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయం, ధర్మము పాటిస్తారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక రాజకీయనాయకులుగా, అధికారులుగా చక్కగా రాణిస్తారు. నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యం, దైవోపాసనా, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికం. కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఉంటుంది. ఇతరులకు కింద పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వం కలిగి ఉంటారు.క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. ఇవి అశ్వినీ నక్షత్రజాతకుల సాధారణ గుణాలు.
అయితే జాతకచక్రం, లగ్నం, పుట్టిన సమయం, మాసముల వలన గుణగణాలలో కొద్దికొద్దిగా మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. బాల్యము నుంచి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరికి జీవితం వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది. అశ్వనీ నక్షత్ర జాతకులకు కృత్తిక, మృగశిర, పునర్వసు, చిత్త, అనూరాధన, జ్యేష్ట నక్షత్రములు ఏ కార్యమునకు పనికి రావని శాస్త్రం చెబుతోంది.
ASHVINI [అశ్వని 4పాదములు దరించు రత్నము]CAT’S EYE [వైడూర్యము]
నక్షత్రం అశ్వని
అధిదేవత అర్ధనారీశ్వరుడు
వర్ణం పసుపు
రత్నం వైడూర్యం
నామం చూ,చే,చో,ల
గణం దేవగణం
జంతువు గుర్రం
నాడి ఆది
No comments:
Post a Comment
మీ అభిప్రాయం తెలియచేయండి.