22 October 2016

నీలం – Sapphair

నీలము నీలాకాశంలో నీలి రంగు వెలుగొందే శని గ్రహానికి నీలరత్నమంటే ప్రీతి. అందున మహానీలము స్వచ్ఛమైన శనిగ్రహ వర్ణమే కలిగియుండుట వలన ఈ గ్రహ రత్నములకు రెండిటికి స్పర్శగుణం ప్రధానము వాయుత్వము కలిగి యుండుట వలన మహా నీల మాదిరిగా గల నీల రత్నములు శని గ్రహ సంబంధించిన రత్నములుగా పేర్కొన బడినవి. ఈ రత్నము స్త్రీ జాతికి సంభంధించినవి శరీరమునందలి పంచ ప్రాణములలో ఉదానమను ప్రాణము యొక్క లక్షణములు కలిగియున్నది. త్రిదోషములందలి వాత దోషమును తొలగించి ఆరోగ్యము నొసంగుటలో ఈ రత్నము చాలా గొప్పది. శరీరంలో జగన్మాత కాలరాత్రి యనబడే శక్తిరూపముతో అధిసించియున్న అనాహత చక్రమునందలి పసుపు, ఎరుపు, నలుపు రంగులు కాలసిన కాంతి కిరణాలు నీల రత్నానికి దగ్గర సంభంధం కలవు. అనాహత కాంతులు తమ సహజ శక్తిని కోల్పోయినప్పుడు శరీరంలో సంభవించే అలజడి అనారోగ్యాలకు నీలధారణచాలా మంచిది. నీల రత్నములోని కాంతి కిరణాలు చర్మరంద్రాల గుండా పయనించి శరీరాంతర్భాగాలలో వ్యాపించి యున్న అనాహత కాంతి కిరణాలు దీప్తిని కలిగించడం ద్వారా ఆ సంభంధమైన బాధలు అంతరించగలవు.








పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాధ్ర అను నక్షత్రములందు జన్మించిన వారు ఏసమయమునందైనను నీలమును ధరించవచ్చును.

మిగిలిన నక్షత్రములలో ఉత్తర, ఉత్తరాషాడ, కృత్తిక నక్షత్రముల వారు తప్ప మిగిలిన అందరూ వారి వారి జన్మ జాతక గ్రహస్థితి ననుసరించి శని గ్రహం బలహీనిడై దోషప్రదునిగా నున్నప్పుడు నీల రత్నమును ధరించిన అశుభములు తొలగిపోయి శుభఫలితాలను పొంది సుఖించగలరు.













 జన్మ సమయంలో ఏ ర్పడిన గ్రహములయొక్క స్థితి ననుసరించి శని గ్రహము లగ్నము నుండి 6-8-12 స్థానములందుండుట, ఆ స్థానాధిపత్యములు కలుగుట మరియు ఆ స్థానాధిపతుల యొక్క కలయిక , వీక్షణమునొందియుండుట దోషప్రదము.

సప్తమ స్థానంలో బలవంతుడైన శని గ్రహము ఉన్నప్పుడు వివాహ కార్యమునకు కనేకాటంకములు కలిగి కల్యాణము కానేరదు.

 పాపగ్రహములతోకూడి బలవంతుడైన శని గ్రహమునకు కోణాదిపత్యము కలిగి కేంద్రములందున్నను షష్ఠాధిపత్యముకలిగి 2-4-7-10 స్థానములందున్నను, అష్టమాధి పత్యము కలిగి 3-5-9 స్థానములందున్నను , వ్యయాధిపత్యము కలిగి 1-2-5-9-10 స్థానములందున్నను దోషప్రదుడు అట్టి సమయములలో ఆ శనిగ్రహము వక్రగమనము నందుండిన దోషమధికముగా నుందుగలదు. గోచారమునందుండి 3-6-11 స్థానములు దప్ప మిగిలిన అన్ని స్థానములు శని గ్రహానికి దోష స్థానములనే చెప్పబడ్డాయి.

జాతక, గోచారములందు స్థానాది షడ్బలములు, అష్టకవర్గ బిందుబలము కలిగిన శనిగ్రహము పాపసంభంధము అధికముగా కలిగి దుష్ఠస్థాన స్థితుడై వ్యతిరేకముగా నున్నప్పుడు, మిక్కిలి కష్టములు సంప్రాప్తించగలవు.

తెలియబడని వ్యాధులు,

 భూత పిశాచ బాధలు.

 చోరాగ్నిభీతి,

 అవమానములు అపకీర్తి,

కార్య విఘ్నము,

 మగోలిచారము,

 రాజదండన,

 బంధన దరిద్రము,

హీనజీవితము,

ఆపదలు గండములు,

 దీర్ఘవ్యధులు వాత ప్రకోపము,

 కళత్ర, పుత్ర, బంధునష్టము,

 మాతా పితారుల మరణము,

 ఋణబాధలు, దాస్యము,

మొదలగు ఫలితములేగాక, మరణము కూడా సంభవించగల అవకాశములున్నవి.

ఇట్టి చెడు కాలములందు ఉత్తమమైన జాతికి చెందిన ఇంద్రనీలము, మహా నీలము, నీలమణి అను రత్నములు ధరించిన యెడల శనిగ్రహ దోషములంతరించి ఆయుర్భాగ్య సంపదలు కలుగగలవు.










 నీలము వల్ల కలిగే శుభయోగాలు :-

 నీలమణి, మహామణి, ఇంద్రనీలము మొదలగా గల నీలరత్నములను ధరించుట వలన శరీరమునందు ఓజశ్శక్తి అభివృద్ధి జెందటమే కాకుండా నూతనోత్సాహము ధైర్యము,

 కార్యదక్షత కలుగగలవు.

 నీలము ధరించిన వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయాది వృత్తులలో అనుకూలత కలిగి పురోభివృద్ది నుండగలదు.

ఆదాయాభివృద్ది, ధనలాభము, సంఘమునుండి గౌరవ మర్యాదలు పెరుగుట,

వివాహాది ఆటంకములు తొలగి పెండ్లి కాగలదు.

మానసిక వ్యాధులు నివారింపబడి చిత్త స్థిరత్వము లభించగలదు.

శనిగ్రహ దోషముచే కలుగు అనేక దుష్ఫలితాలనుంచి రక్షణ కలుగగలదు.

పిత్తకోశమునందలి దోషములు,

వాత ప్రకోపములవలన జనించు రోగములు,

కీళ్ళ నొప్పులు,

పక్షవాతము,

నరముల దుర్భలత్వము,

 అజీర్ణ వ్యాధులు.

 కాళ్ళు, కాళ్ళ పిక్కలకు సంబంధించిన రోగములు,

త్రాగుడు,

 వ్యభిచారమువలన కలుగు బాధలు,

 ఊపిరి తిత్తుల వ్యాధులు,

 మందబుద్ది మొదలగు అనేక విధములైన రుగ్మతలు సమూలంగా నశింపబడి ఆరోగ్యవంతులుగాకాగలరు.

 బాలారిష్టములు,

 దృష్టిదోషములు,

 తాంత్రిక కృత్రిమ క్షుద్రగ్రహబాధ లంతరించగలవు. జీవితమునందు సంభవించిన పలువిధములైన గండములు తొలగిపోగలవు.

 అపమృత్యు దోషములంతరించి ఆయుర్దాయాభివృద్ధి కలుగగలదు.నీలము ఆధ్యాత్మికాభివృద్ధికి దోహదపడగలదు.

నీలధారన వలన చిత్తచాంచల్యము తొలగి ఏకాగ్రత లభించగలదు.

ఆధ్యాత్మిక జీవన ప్రగతి ఆరోహనక్రమంలో దిన దినాభివృద్ది నొందగలరని బౌద్దుల నమ్మిక. అందువల్లనే వారు జాతి నీలముకంత ప్రాధాన్యత నిచ్చుచుండెదరు.

ముఖ్యముగా దరిద్ర బాధలు కష్టనష్టములు మానశిక చికాకులు రూపుమాపి సంతోషము సుఖసౌఖ్యములు, ధనధాన్యములు భాగ్యసంపదలు స్థిరమైన జీవనములు సిద్ధించగలవు.









 నీలము ధరించు విధానము :

 దోషములేని ఉత్తమ మైన జాతినీలము పంచలోహం లేక బంగారమును దిమిడ్చి ధరించడం శ్రేష్టము ఉంగరం యొక్క అడుగుభాగం రంద్రముగా నుంచి పైభాగంలో ధను (విల్లు) ఆకారముగా తీర్చబడిన పీఠము యొక్క మధ్యభాగాన నీలంను బిగించి శుద్ధియెనర్చి షోడశోపచార పూజలు నెరవేర్చిన పిదప శుభముహూర్తములో ధరించాలి పుష్యమీ నక్షత్రముతో కూడి యున్న శనివారము త్రయోదశి తిధియందు గానీ లేక త్రయోదశీ శని వారమందుగానీ చంద్రగ్రహణము సమయమందుగానీ చిత్తా నక్షత్రము 3,4 పాదములందు గానీ శని సంచారం గల కాలంలో పూర్వాషాఢ నక్షత్రం ప్రాప్తించిన శనివారమందుగానీ (శని అస్తంగతుడు కాకయున్నప్పుడు) శనిహోర జరిగే సమయంలో గానీ ఉంగరమునందు నీలరత్నము బిగించి తదుపరి ఒక దినము గోమూత్రమునందు. రెండవదినము పంచగవ్యములందు, మూడవ దినము నల్లనువ్వులయందు ఆ ఉంగరమును అధివాసము చేయించి పంచామృతాలతో శుద్ధోదక స్నానములు చేయించి, శాస్త్రోక్తముగా షోఢశోపచార పూజలు నిర్వహించిన శుద్ది కాగలదు. ధరించెడి వారికి తారాబలం చంద్రబలములు కలిగి మంగళ, శుక్ర, శని వారములయందు శుభతిధులు కలిగియున్నప్పుడు వర్జ్య దుర్ముహుర్తాలు లేని కాలంలో వృషభ, తులా ధను, కుంభ లగ్నములందు తొలుత పూజలు జరుప బడిన ఉంగరమును ధరించవలెను. ధరింపబోవు సమయమునకు ముందు ఉంగరమును కుడిహస్తము నందుంచుకొని పడమర ముఖముగా దిరిగి నిలబడి గురువుని, గణపతిని ధ్యానించి "ఓం హ్రీం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయ నిర్మాంస శుష్క దేహాయ సర్వసిద్దిం దేహి దేహి స్వాహా" అను మంత్రమును గానీ లేక "ఓం శన్నో దేవీ రభిష్టయ అసోభవంతు పీతయే శంయోరభి స్రవంతునః" అనే మంత్రమును గానీ 108 పర్యాయాలు జపించి ఉంగరమును ముమ్మరు కనుల కద్దుకొని కుడిచేతి నడిమివ్రేలికి ధరించాలి కొందరు పెద్దలు ఎడమ చేతి నడిమి వ్రేలికి ధరించవచ్చును అని చెబుతారు కావున వారి ఆచారం ఏ ప్రకారంగా ఉంటే ఆ విధంగా నడిమి వ్రేలికి మాత్రం ధరించాలి.

 నీల రత్నము ఉంగరపు వ్రేలికి (అనామిక)మాత్రం ధరించకూడదు.

నవరత్నములను గాక ఇతర రత్నములు చేయించుఉంగరములో నీలముతో బాటుగా కెంపులను, పచ్చలను జేర్చి ఉంగరమును ధరించకూడదు.

కెంపు అవసరము గలిగి నప్పుడు కెంపు నీలము లేదా కాకి నీలమును, పచ్చల అవసరమున్నప్పుడు, మయూర నీలము ధరించిన శ్రేయస్కరముగా నుండగలదు.










  నీలం – Sapphair
 8, 17, 26 తేదీలలో జన్మించినవారు, జ్యోతిష్య శాస్త్రప్రకారం శనిదశ జరుగుతున్నవారు, వృషభ,తుల,మకర, కుంభ లగ్నములలో పుట్టినవారు ధరించాలి. పుష్యమి, అనురాధ, ఉత్తరభాధ్ర, నక్షత్ర జాతకంలో పుట్టినవారు. పక్షవాతం, పిచ్చి, ఊపిరితిత్తుల వ్యాధులు తగ్గుదల. మానసిక ఉత్తేజం. పైత్య నివారణ.ఉధ్యగ, వ్యవసాయ లాభం. స్త్రీలలో సంతానోత్పత్తి. తేలుకాటు వేసినచోట నీలాన్ని ఉంచిన నీటితో కడిగితే తేలువిషం విరిగిపోతుంది. ఏకాగ్రత పెరుగుదల. శారీరక, మానసికి ఉత్తేజం.














నవరత్నాలు పగడం Koral

పగడము ముదురు ఎరుపురంగు కలిగి నునుపుగా ఉండి ప్రకాశవంతమైన పగడాలు కుజగ్రహానికి చాలా ప్రీతి. కుజుడు రక్త వర్ణము కలిగి అగ్నితత్వం గల పురుషగ్రహము.




పగడముకూడా తేజోతత్వానికి సంబంధించినది. ఎర్రగా నుండుట వల్లనే కుజునుకి ఇష్టప్రదమైనది. ఈ పగడము త్రిదోషమునందలిపిత్తమను దోషమును హరింపగలదు. సమానవాయువు సంకేతముగా గలది, పురుషజాతికి, క్షత్రియత్వమునకు సంభంధించిన దగుటవలన చాలా కఠినముగా నుండి కోతకు స్వాధీనపడదు. శరీరమునందలి మూలాధార చక్రమునందలి వివిధ కాంతి విశేషములన్నియు ఈ పగడమునందు నెలకొని యుండుట వలన, మూలాధార చక్రమునందలి పసుపుపచ్చని రంగుగల కాంతి కిరణాల దేహతత్వంపై ఏ విధంగా పనిచేయగలవో ఈ పగడం ధరించడంవల్లకూడా అదేవిధంగా హరిత కిరణాలు దేహ రంద్రాలగుండా చొచ్చుకుపోయి, రక్త దోషాలు, లివర్, బ్లడ్ ప్రషర్, అల్సరు, జననేంద్రియ సంభంధిత వ్యాధులు, స్ఫోటకం వంటి అనేక అంటువ్యాధులు, కీళ్ళ బాధలు మొదలగు అనేక ఋగ్మతలు పారద్రోలి ఆరోగ్యవంతులను చేయగలదు.



మృగశిర, చిత్త, ధనిష్ఠ అను నక్షత్రములందు బుట్టిన వారు ఏ కాలమునందైనను మంచిపగడాలను ధరించవచ్చును.

 ఇతర నక్షత్రజాతకులలో ముఖ్యంగా పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రజాతకులు పగడం ధరించి సత్ఫలితలు పొందటం చాలా కష్టము, మిగిలినవారు తమ యొక్క జన్మకాలమునందలి జాతక చక్రము ననుసరించి గ్రహముల యొక్క దశాంతర్దశలను గమనించి కుజగ్రహము దోషప్రమాదముగా నున్న సమయములందే పగడము ధరించవలెను. అట్లు ధరించిన యెడల కుజగ్రహ దోషమువల్ల జీవితంలో సంభవించే అనేక అనర్థాలు, నివారింపబడి శుభము జయము కలుగును.






జన్మ సమయమున లేర్పడిన జాతక చక్రమునందు లగ్నము నుంచి, 6-8-12 స్థానములందు కుజుడుండిన లేక ఆ స్థానాధిపతులతో కలయిక గానీ, దృష్టిగానీ పొందియుండిన యెడల కుజగ్రహ దోషప్రమాదము, కుజునికి ద్వితీయ, సప్తమాధి పత్యములు గల్గుట 2-4-7-8 స్థానములందుట కూడా దోషప్రదమే! షడ్వర్గ బలము, అష్టక బలము, కలిగిన కుజ గ్రహము పైన దెల్పిన స్థానములందుండిన విశేషహాని జేయుటకు దుష్టలక్షణములు కలిగి బలవత్తరుడైయున్న అంగారక గ్రహము యొక్క మహర్దశలు, అంతర్దశలు సంభవించినపుడు మరియు గోచారమునందు కుజునికి దుష్టస్థానమునందు స్తంభనము వ్రక్రత్వము గ్రహయుద్దము, పాపగ్రహవేధలుసంభవించియున్న కాలమునందు శతృవృద్ది, పోట్లాట్లు, దరిద్రము ఉద్రేకము, రక్తహీనత, దీర్ఘరోగములు, శస్త్రచికిత్సలు, ఆకస్మిక ప్రమాదములు, అగ్నిభాధలు, విషపీడ, ఋణబాధ, దాయాది వైరము, భూనష్టము, అవమానము, కాలవిఘ్నము, నీచజన స్నేహము, నిత్యకలహము, దంపతులకెడబాటు, సుఖవ్యాధులచే బాధలు, మెదలగు దుఃఖ ప్రదమైన అనేక ఫలితాలు ప్రాప్తించును. అట్టి సమయమునందు ఉత్తమమైన పగడము ధరించిన అరిష్ట నివారణమై శుభం కలుగుతుంది.
















 పగడం ధరించడం వలన కలిగే శుభయోగాలు : బ్రహ్మజాతికి , క్షత్రియ జాతికి సంభంధించిన సంభంధించిన ఉత్తమమైన పగడాలను శాస్త్రీయ పద్ధతులననుసరించి ధరించిన యెడల చాలా శుభం జరుగుతుంది. ఆచరించే ప్రతికార్యంలో కలిగే విఘ్నాలు అంతరించి ఆయా పనులలో విజయం లభిస్తుంది. ఆ కారణముగా శత్రుత్వము తొలగిపోయి జనవశీకరణ లభించగలదు.


 పగడము అగ్నినుంచి, ఆయుధముల నుంచి కౄరశతృవుల నుంచి తగిన రక్షణ చేకూర్చగలదు.

ఆకస్మిక ప్రమాదములు,

గండములను తప్పించి క్షేమం కలిగించగలదు.

 చాలా కాలం బాధిస్తున్న ఋణ బాధలు, సూర్యోదయమునకు చీకట్లు తొలగి పోయినట్లు తొలగిపోవును.

వివాహ విషయములో కలిగే వివిధ ఆటంకములు అంతరించి శీఘ్రంగా వివాహం జరుగగలదు.

కుజదోషముల వలన కలిగే దాంపత్య జీవితంలో కలిగే కలహాలు, కలతలు కార్పణ్యాలు, పరస్పర వైషమ్యాలు, విడాకులలాంటి దుర్మార్గపు భావనలు, అంతరించి, అన్యోన్యప్రేమ పూరితమైన అనురాగంతో దంపతులు దీర్ఘకాలం సుఖసంసార జీవనం చేసుకొనుటకు తోడ్పడుతుంది.



భారీయంత్ర పరిశ్రమలో తరచుగా కలుగుచుండే అనేక ప్రమాదాలు, మోటారు వాహనములకు కలిగే నష్టాలు.


శతృవుల కుయుక్తులవల్ల సంభవించే రాజకీయ భాధలు, పోలీస్ కేసులు, ఇతర బాధలు.




 లివర్ వ్యాధులు,

 మూలశంక.

 రక్తపోటు,

 జ్వరము,

 దేహతాపము.

చర్మవ్యాధులు,

గడ్డలు వ్రణములు.

 వాపులు కీళ్ళబాధలు.

 జననేంద్రియములకు సంభంధించిన అన్ని రోగాములు.

కడుపునొప్పి కాన్సరు మొదలగు యింకా అనేక వ్యాధులను శీఘ్రంగా నివారించి సంపూర్ణ ఆరోగ్యవంతులగుటకు పరిపూర్ణ సంతోషముతో తృప్తిగల సుఖవంతమైన జీవితమును గడుపుటకు పగడము తోడ్పడగలదు.









పగడము ధరించిన వారికి జీవితంలో నైరాస్యం బద్దకం సోమరితనం అనేవి ఉండవు. సహనం సాహసం విజృంభణ అధికంగా నుంటవి. అన్యాక్రాంతంలో నున్న భూములు స్వాధీనమగుతవి. పశుసంపద వృద్దినొంది, వ్యవసాయరంగంలో విశేష లాభాన్ని పొందుతారు. మిలటరీ, పోలీస్ శాఖల్లో పనిచేసేవారు క్షత్రియ జాతి పగడాన్ని ధరించడం చాలా మంచిది. వారి వృత్తిలో అసాధారన ప్రతిభగలవారై ప్రతి పనియందు విజయాన్ని పొందుతారు.

పగడానికి అధిపతియైన కుజగ్రహం అనుగ్రహం కలిగి శుభగ్రహ స్థానల్లో ఉంటే ఎంత మంచి చేస్తాడో ఆ విధమైన బలం కలవాడై అశుభ స్థానాల్లో ఉంటే అంతటి కీడును కూడా కలిగిస్తాడు. ఆయనకు ప్రీతికరమైన పగడాన్ని ధరించడం వలన కుజగ్రహం ప్రసన్నుడై సకల ఆయురారోగ్యాలతో భోగ భాగ్యాలతో సంపదలతో, రాజ్యపూజ్యతల్ గౌరవం, ఆరోగ్యము, గౌరవం వంశాభివృద్ది, సకలసౌభాగ్యాలు కలుగచేస్తారు.

పగడపు పూస మాలలు ధరించడం వలన కూడా పై విధమైన ఫలితాలు కలుగుతాయి. రుద్రాక్ష మాలల యందు ఏడు పగడాలు గానీ కనీసం ఒకటి రెండు పగడాలుగానీ జేర్చి ధరించవలెను. ఇతర నవరత్నాలవలె పగడాలు అధిక ధరలుకలిగి యుండక అందుబాటు ధరల్లో లభిస్తాయి.






పగడము ధరించే పద్దతి :
 పరిశుభ్రమైన పగడాలు ధారణకు యోగ్యముగానుంటవి. బ్రహ్మ జాతి ప్రవాళం బరువుగా నుండి ప్రకాశవంతముగా నుంటుంది. క్షత్రియజాతికి బరువు మాత్రంలోపించగలదు. ఇట్టి పగడము ఏడు కారెట్లు (21 వడ్డగింజల బరువు)గలదానిని ధరించుట శ్రేష్ఠము. త్రికోణముగా నున్న పగడము విశేషఫలప్రదము, అట్లుకాని యెడల బాదంకాయవలే నున్న దానిని వాడవచ్చు. నలుచదరపు, వర్తులము విల్లువలె నుండునది. నక్షత్రాకారమును పోలిన పగడములు ధారణకు అంతగా ఉపయోగించవు. పగడము చిన్నదైనా దోషరహితంగా వుండాలి. బంతివలెనున్న ప్రవాళాలు మూలలయందు, ఆభరనములందు కూర్చోనుట ఉత్తమము పగడముకూర్చే ఉంగరము బంగారంతో గానీ లేక వెండితో గానీ, లేదా పంచలోహములతో గానీ తయారు చేయించాలి. ఈ ఉంగరం పీట భాగంలో ముక్కోణాకారములో ఉండి దానిచుట్టూ వలయ రేఖలను ఏర్పరచడం చాలా ముఖ్యము. కృష్ణపక్షంలో చదుర్దశీ మంగళవారం వచ్చిన దినమునందుగానీ, లేక కుజుడు మకర రాశిలో ధనిష్ఠా నక్షత్ర సంచారం చేసే కాలంలో గానీ ఏదో ఒక మంగళవారంనాడు గానీ, మధ్యాహ్నం 1గం-2 గం|| మధ్యకాలంలో గానీ లేక రాత్రి 2గం- 3గం మధ్యకాలంలో గానీ దక్షిణముఖంగా కూర్చొని పగడము ఉంగరములో బిగించవలెను. ఆ తర్వాత ఆ ఉంగరమునుఒక దిన మంతయు నవధాన్యాలలో ఉంచి మరుసటి దినమంతయు పంచగవ్యములు (ఆవుపాలు, పెరుగు, ఆవునెయ్యి, ఆవు పంచితం, గోమయం కలిసినది)యందుంచి, మూడవరోజున సుగంధ, ద్రవ్యాలతోడను, ఎర్రచందనపు నీళ్ళచేతను రుద్రాభిషేకం జరిపించి శుద్దిగావించవలెను. ధరించెడివాడు తమకు తారాబలం చంద్రబలం గలిగిన శుభతిదులయందు (శనివారం గాక)మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్మీన లగ్నములు వర్తించు వేళాలందు ఉంగరము కుడిచేతి ఉంగరపు వేలికి ధరించాలి. ధరించుటకు పూర్వమే షోఢశోపచార పూజలు జరిపి నమస్కరించి గురువులను గణపతిని ధ్యానించి దక్షిణ ముఖముగా నిలువడి ఉంగరము కుడి అరచేతియందుంచుకొని "ఓం లం ఐం హ్రీం శ్రీం మహిపుత్రాయ సకలారిష్ట వివారనాయ క్లీం క్లీం స్వాహా"అనే మంత్రాన్ని నిశ్చలంగా 108 పర్యాయాలు జపించి, ఉంగరము ముమ్మారు కనులకద్దుకొని వ్రేలికి ధరించవలెను.

 స్త్రీలు మాత్రం ఎడమ చేతికి అనామికా వ్రేలికి ధరించుట శుభప్రదము. మాలలు ఇతర ఆభరణమునందలి పగడములకు కూడా పైవిధంగా శుద్దిని పుణ్యకార్యములను నిర్వర్తించి ధరించుట శాస్త్ర సమ్మతము, ఉంగరము అడుగుభాగాన రంద్రము కలిగి యుండవలెను.















  పగడం – Koral 9, 18, 27 తేదీలలో జన్మించినవారు. మేష,కర్కాటక, ధనుస్సు, వృచ్చిక రాశివారు.మంగళవారం పుట్టినవారు. కుజమహాదశ నడుస్తున్నవారు ధరిస్తే మంచిది. స్త్రీలకు గర్భాశయ వ్యాధులనుండి విముక్తి. సంతాన ప్రాప్తి. ఉబ్బసం అల్సర్ వ్యాధులు తగ్గుదల.రక్త శుద్ధి. చర్మవ్యాధులు, పచ్చకామెర్లు కిడ్ని వ్యాధుల నివారణ. సెక్స్ సామర్ధ్యం పెంపుదల. అపాయ నివారణ. వివాహ యోగం కలుగును.















వైఢూర్యం – Cats Eye

వైడూర్యము
 వైడూర్య రత్నలు కేతు గ్రహానికి సంభంధించినవి. న్యాయాన్యాయ వివేచన, పుణ్యపాప వివక్షత, ధర్మాధర్మ పరిశీలనలు గల చిత్ర గుప్తుని అంశవల్ల ఈ వైడూర్య రత్నాలు పుట్టినట్లు కొందరు చెబుతారు. శరత్కాలంలో చంద్రుని యొక్క షోడస కళలు గల వెన్నెల కిరణలు కొన్ని రసాయన ధాతువులు కలిగిన శిలాభూములయందు ప్రవేశించి అచ్చట రసధాతువులు గల శిలాభూములయందు ప్రవేశించి అచ్చటి రసధాతువులుగల శిలలకు చంద్రకిరణములకు కలిగే పరస్పర సంయోగం వలన ఆశిలలు కొంత కాలానికి వైడూర్య రత్నాలుగా మారతున్నవని కొందరి అభిప్రాయము.










 అశ్వని, మఘ, మూల జన్మ నక్షత్రాలుగా కలిగియున్నవారువైడూర్యాన్ని ఏ సమయములో నైనను ధరించవచ్చును. మిగిలిన నక్షత్రములు గలవారు తమ జన్మ కాలమందలి గ్రహస్థితి ననుసరించి కేతువు యొక్క దోషప్రదమైన కాలము నందు ఈ రత్నము ధరించుట ఉత్తమము.










జన్మజాతకములందు శుభస్థానములందు కేతువు బలహీనుడై ఉన్నప్పుడు వైడూర్యధారన చేసిన ఆ కేతువు సకల శుభముల నొసగును. బలవంతుడైన కేతుగ్రహము 6-8-12 స్థానములందుండుట ఆ స్థానాధిపతులతో కలసి చూడబడుట చాలా దోషప్రదము. పాపగ్రహముల యతి, దృష్టి వేధల వంటి సంబంధములు కలిగియున్న కేతువు అపకారమును చేయగలడు, లగ్నము నుండి 2 వ స్థానమునందు పాపబలముగల కేతువుండుట, ఆ విధముగా పంచమ స్థానమందుండుట, ఏడవ స్థాన మునందుండుట 9 వ స్థానమునందుండుట కూడా దోషప్రదమే! జన్మ లగ్నము ననుసరించి ఏర్పడిన గ్రహములు బలాబలములందు కేతుగ్రహము పూర్తి బలవంతుడై దుష్ఠ స్థానములందుండగా అతని మహర్దశ, అంతర్దశలు, ఇతర యోగదశలలో ఇతని అంతర్దశలు, విదశలు సంభవించినప్పుడుషడ్వర్గబలము, అషటకవర్గ బిందు బలము కలిగి కేతువు గోచారము నందు దుష్టస్థానములందు సంభవించు గొప్ప భయముతో కూడిన కష్టములు ప్రాప్తించగలవు.

దోషప్రదమైన కేతు గ్రహానికి సంబంధించిన కాలంలో పిచ్చి ఉన్మాదము,

భిక్షుక వృత్తి,

కృరప్రదేశములందు నివాసము.

 సరియైన ఆహార నిద్రాదులు లేకుండుట,

 సిరి సంపదలు అకారణముగా తొలగిపోవుట,

 కృషి నాశనము.

ఉద్యోగ భంగము,

 కుటుంబకలహము విరక్తి,

 భార్య నష్టము.

 పితృమృతి, సంతాన కష్టనష్టములు,

 దుష్కీర్తి, అపజయము,

 వేదన,

శతృభీతి.

 విషజంతువులచే ప్రమాదము,

 ధన సంభంధమైన ఇబ్బండులు,

 కోర్టు వ్యవహారములు కోర్టు వ్యవహారములలో ప్రతికూలత,

 మనో వ్యద పిల్లల బాలారిష్టములు.

 కురుపులు మొదలగు చేమ వ్యాదులు కలరా,

 విడువని తల నొప్పి,

 అజీర్ణవ్యాధులు,

 దురదలు.
 ఆటలమ్మ,
తడపర, ఉబ్బాసం.

 కాన్సర్,

 ప్రసూతి బాధలు,
నొప్పులు సరిగారాక పోవడం, కష్టమైన కాన్పు,

 గుర్రపు వాతము.

 తీవ్రమైన దరిద్రము, మొదలగు అనేక విషమ పరిణామములు సంభవించి దుఃఖపెట్టగలవు.


అటువంటి సందర్భాలలో వైడుర్య రత్నము ధరించడం వలన సత్ఫలితాలు కలుగును.












వైడూర్యాల ద్వారా కలిగే శుభయోగాలు :
ఉత్తమ జతికి చెందిన దోషరహితమైన వైడూర్యమును ధరించిన యెడల జీవితం అభివృద్ది దాయకంగా నుండుటయే గాక ఆర్ధిక పుష్టి కృషిలో రాణింపు.

 ఉద్యోగ ప్రాప్తి.

 అధికారము.

 జనాదరణ పలుకుబడి,

 కీర్తి గౌరవ మర్యాదలు,

 భోగ భాగ్య సంపదలు.

 వాహన ప్రాప్తి.

గృహ లబ్ది,

 కళత్ర సౌఖ్యము,

కుటుంబ సుఖశాంతులు.

 శతృనాశనము,

జయము కార్యశిద్ది.

 దేహా రోగ్యము,

సకల వ్యాధినాశనము,

ఆయువృద్ది, అరిష్టనివారణ,

 దుష్టగ్రహ బాధా విముక్తి,

 దేవతానుగ్రహము సుఖము శాంతి సద్భావన,

 సజ్జన స్నేహము,

 సర్పదోష పరిహారము,

 సంతానప్రాప్తి,

వంశాభివృద్ది కలుగగలవు.









 వైడుర్యము అత్యంత మహిమాన్వితమైనదగుట వలన దీన్ని ధరించెడి వాడికి సకల క్షేమము కలుగ చేయగలదు. ప్రసవకాలంలో స్త్రీలకు కలుగు అనేక బాధలు నివారించి సుఖముగా శీఘ్రముగా ప్రసవము జేయింపగలరు. ఈ రత్నమును నీటియందుంచి ఆ నీటిని ప్రసవ స్త్రీలచే త్రాగించిన శీఘ్రముగా ప్రసవించుటయే గాక ప్రసవానంతరం సంభవించే దుష్టలక్షణముల నుండి పూర్తిగా రక్షణ కలిగించగలదు..



చర్మ వ్యాధులు గలవారు ఈ వైడుర్యము ఆదివాసము గావించిన నీటిచే స్నానము చేసిన అనతి కాలంలోనే చర్మ వ్యాధుల నుండి విముక్తులై ఆరోగ్యవంతులు కాగలరు.

గృహము నందలి సింహద్వారామునకు పైభాగమున వైడూర్యములు తాపటము జేయించిన ఆ గృహమునందు నివశించే వారికి అమ్మవారు ఆటలమ్మ, తడపర, కలరా, మొదలగు బాధించవు. వైడూర్య రత్నము అమోఘమైన శక్తి సంపన్నమై యున్నది. ఇది ధరించిన శతృవులు సైతం మితృలుగా మారిపోగలరు.


 పగవారు చేయు చేత బడి, ప్రయోగములు మొదలగు కృత్రిమములు భూత భేతాళ, యక్ష రాక్షస, శాకినీ, కామినీ మొహినీ, గ్రహబాధలు దరిజేరలేవు.

దీని వలన జీవితములో మంచి అభివృద్ది, మేధాశక్తి, ఆలోచనా పటిమను, కర్య సాధన, జనాకర్షన, జనరంజనలకీ వైడూర్యమును మించిన రత్నము మరొకటి లేదు.















 వైడూర్యము ధరించే పద్ధతి :
 రత్నాలకు గ్రహాలకు చాలా అవినాభావ సంభంధంఉంది. అదే విధంగా మానవ జీవితాలకు కూడా దగ్గర సంభంధం ఉన్నది.జీవితంలో కలిగే కష్టసుఖాలు, వ్యాధిబాధలు, దుఃఖసంతోషాలకు, గ్రహాలు మూల కారణమని జోతిష్యశాస్త్రం చెబుతుంది. ఈ మానవజీవితంలో కలిగే వ్యతిరేక ఫలితాలనుండి తప్పుకొని పూర్తి శుభఫలితాలు పొందడానికి గ్రహశాంతులతో బాటుగా రత్నములను ధరించే విధానాలు కుడా జ్యోతిశాస్త్ర పరమైనవే ! దోషరహితమైన ఉత్తమజాతికి చెందిన ప్రకాశవంతమైన వైడూర్యము, బంగారం లేదా వెండితో లేదా పంచలోహాలతో తయారు చేయ బడిన ఉంగరము నందు ఇమిడ్చి ధరించాలి ఉంగరము అడుగు భాగం రంద్రమును కలిగి ఉండే విధంగా పైభాగం ద్వజాకారం లేదా వర్తుల, చతురస్రాకారము గలిగిన పీఠమును ఏర్పరచి దాని మధ్యభాగంలో సూత్రం పైకి కనిపించే విధంగా వైడూర్యమును బిగించి, శుద్దిగావించిన పిమ్మట శాస్త్రోక్తముగా షోడశోపచార పూజలు నిర్వర్తించి శుభముహూర్తమున ధరించాలి కేతుగ్రహస్తమైన సూర్య చంద్రగ్రహణములు సంభవించిన కాలంలో వైడూర్య రత్నాన్ని ఉంగరంలో బిగించడం చాలా ఉత్తమం .

 మూలా, ఉత్తరాషాడ, ధనిష్ఠ అను నక్షత్రములచే కూడివచ్చిన అమావాస్య ఆదివారం యందు గానీ మృగశిర 1-2 పాదములయందు గానీ, ఉత్తర నక్షత్రములు గల సోమవారంగానీ శ్రావణమాసంలో శుక్లపంచమి, పూర్ణిమాతిదులయందుగానీ వర్జ్య దుర్ముహుర్తములు లేకుండా చూచి రవి లేదా చంద్ర హోరాలు జరిగే సమయంలో వైడూర్య ఉంగరమును బిగించాలి. ఆ తర్వాత దానిని ఒక దినమంతయు ఉలవ నీటియందుంచి, మరుసటి రోజు పంచ గవ్యములందు, మూడవదినము తేనెను కలిపిన నీటియందు నిద్ర గావింపజేసి శుద్ధోదకము చేత పంచామృతము చేత స్నానము గావింపజేసి ఆ ఉంగరమును శాస్త్రోక్తవిధిగా ధూపదీప నైవేద్యములచే షోడశోపచార పూజలు గావింపజేసిన పిమ్మట అనుకూలమైన శుభముహుర్తాన చేతికి ధరించవలెను. ధరించెడివాడు తమకు తారాబలం, చంద్రబలం కలిగిన శుభతిదులయందు, కృత్తిక, రోహిణి, మృగశిర, ఉత్తర, హస్త, చిత్త, శ్రవనం, ధనిష్ఠ, ఉత్తరాషాఢ నక్షత్రములు గల ఆదివారము, సోమవారము, మంగళవారములందు ధనుర్మీన కుంభరాసులు గల సమయంలో ఉంగరమును ధరించుట ప్రశస్తము, ధరించుటకు ముందుగా ఉంగరమును తన కుడిచేతి హస్తమునందుంచుకొని తూర్పు లేక ఉత్తర ముఖముగా నిలబడి గురువును, గణపతిని ధ్యానించి "ఓం హ్రీం క్రీం ఐం హ్రీం శ్రీం కేతవేఖండ శిరసే స్వాహా " అను మంత్రమునుగానీ, "సోమోధేనుగం"అను వేద మంత్రమునుగానీ 108 పర్యాయాలు జపించి ఉంగరమును ముమ్మారు కనుకద్దుకొని కుడిచేతి ఉంగరపు(అనామిక)వ్రేలికి ధరించాలి.

స్త్రీలు ఎడమ చేతికి ధరించినను దోషంలేదు. ఈ వైడూర్యమును బొటనవ్రేలికి ధరించినను దోషంలేదు. బొటన వ్రేలికి ధరించిన మంత్రసిద్ధులు చేకూరగలవు. చూపుడు వ్రేలికి ధరించిన ఆద్యాత్మికాభివృద్ది, వైరాగ్యము, మోక్షము, ప్రాప్తించగలవు.

నడిమి వ్రేలికి ధరించకూడదు.

చిటికెన వ్రేలికి ధరించిన వ్యాపారాభివృద్ది, ఉద్యోగప్రాప్తి, విద్యాజయము, కార్యసిద్ధి కలుగును. హస్తకంకణమునందిమిడ్చి మణికట్టునకు (గాజువలే)ధరించిన సర్వార్థ సాధనము కలుగును.














  వైఢూర్యం – Cats Eye
 7, 16, 25 తేదీలలో జన్మించినవారు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతుమహాదశ నడుస్తున్నవారు, అశ్విని, ముఖ, మూల నక్షత్రాలలో జన్మించినవారు చిటికెన వేలుకు ధరించాలి. మూర్చ, పక్షవాతం, క్యాన్సర్, స్పాండిలైటిస వ్యాధుల నిరోధం. నరదిష్టి, చేతబడి, ఇతర మంత్రాలు పారవు. ఉధ్యోగం లోబాధలు నివారణ, వ్యాపార వృద్ది. లక్ష్మీ కటాక్షం. శతృభవ నివారణ. ఆలోచనా శక్తి, ధైర్య వృద్ధి. స్త్రీలకు సుఖప్రసవం. ఆయువృధ్ధి.మానసిక ఆనందం.
















వజ్రం – Diamond

వజ్రము (రవ్వ)
 ఆకాశములో తూర్పునకు గానీ, పడమరకు గానీ శుక్రగ్రహం దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దీనినే "చుక్క" అనివాడుకలో సంభోధిస్తుంటారు. ఈ చుక్కవలే మరేచుక్క గూడా ప్రకాశించక పోవడం గమనార్హం, వజ్రంకూడా ఈ చుక్క వలే ప్రకాశిస్తూ మరియే రత్నమునకు లేనటువంటి కాంతి ప్రభలతో వెలుగొందుతూ ఉన్నందున వజ్రానికి శుక్రగ్రహము ఆదిపత్యము వహించుచున్నాడు.













 శుక్రుడు స్త్రీజలమై జలతత్వానికి సంభంధించిన వాడగుట వలన వజ్రముకూడా స్త్రీజాతి జతతత్వ రత్నమగుటవలన వజ్రాధిపతి శుక్రగ్రహము. పాంచభౌతికమయిన శరీరమునందు రూపము చల్లదనము అనునవి శుక్రగ్రహమునకు చెందినవి. శరీరమునందలి త్రిదోషములలో కఫదోషజన్యములైన అనేక అనారోగ్యములను వజ్రము నశింపజేయగలదు. పంచ ప్రానములందలి అపాన ప్రాణవాయువు సంకేతముగా గల వజ్రము పీతారుణ కాంతులు వజ్రంలో కూడా కలవు. కంఠ స్థనమునందలి విశుద్ధియందలి వెలువడే ఈ దివ్యకాంతుల ప్రభావము తగ్గినప్పుడు కఫము ప్రకోపమునొంది ధ్వని పేటిక ఉపిరితిత్తులు మూత్రపిండాలు, యోని మొదలగు అవయవాలకు సంభంధించిన అనేక వ్యాధులు బాధిస్తుంటాయి. ఆ సమయంలో ఉత్తమ మైన వజ్రాన్ని ధరించడం వలన శరీరంలో తరిగిన ఆయా కాంతులను వజ్రం సమకూర్చి రోగములను నశింపజేసి ఆరోగ్యం సమకూర్చగలదు. సాధారణముగా జాతకములో శుక్రగ్రహం బలహీనుడై యున్నప్పుడు కలిగే అరిష్టాలనన్నింటినీ వజ్రం తొలగించగల శక్తి కలిగి యున్నది.









జన్మకాలమునందేర్పడిన గ్రహస్థితి ననుసరించి శుక్రగ్రహ లగ్నమునుంచి 6-8-12 స్ఠ్నాములందున్నను ఆ స్థనాధిపత్యములు కల్గినను , ఆస్థానాధిపతులచే చూడబడి, కూడబడి యున్న దోషప్రదుడు మరియు కుజునితో కలసి 1-5-7 స్థానములందుండుట వలన లేక రవి చంద్రునితో కలసి 4-10 స్థానములందుండుట రాహువుతో కలసి ఒకే స్థానములో ఉండుట కూడా శుక్రగ్రహము దోషప్రదమై ఉన్నది. ఈ చెప్పబడిన స్థానములు శుక్రునుకి నీచక్షేత్రములైన కొంత దోషము తొలగిపోగలదు. జాతకమునందు గానీ గోచారమునందుగానీ శుక్రగ్రహము దుష్టస్థానములందుండి, షడ్వర్గ బలము, అష్టక బిందుబలము కలిగి యున్నప్పుడు అతనియొక్క మహర్దశ అంతర్దశలు ఇతర యోగ గ్రహములయొక్క దశలలో ఈతని భుక్తికాలములు, గోచారకాలము విపరీత దుష్పరిణామములు కలిగించగలదు.

వ్యసనములకు బానిసలగుట,

స్త్రీలోలత్వము వ్యభిచారదోషములు,

దంపతులకు నిత్యకలహము,

ప్రేమ నశించుట,

 దరిద్ర బాధలు,

కృషినష్టము,

 మానశిక అశాంతి.

 దేశదిమ్మరితనము,

 బాధలను సహింపలేకుండుట,

 స్త్రీకలహము,

 నష్టకష్టములు,

 జటిలమగురోగబాధలు,

  మర్మాయవముల వలన బాధలు,

రక్తస్రావము.

అతిమూత్రవ్యాధి,

కార్యవిఘ్నము,

 వివాహము కాకుండుట,

 వీర్య నష్టము,

 సోమరితనము, మొదలగు విపరీత ఫలితములు కలుగుచుంటవి. ఇట్టి సమయములందు యోగ్యమయిన వజ్రమును ధరించిన యెడల బాధలంతరించి ఆయుః ధన సమృద్దిగా లభించగలదు.

వజ్రము ద్వారా కలిగే శుభయోగాలు :

 ధరించే వ్యక్తి వజ్రం చిన్న దైనప్పటికీ దోషరహితంగా వుండటం చాలా ముఖ్యము ఉత్తమ లక్షణములు కలిగిన వజ్రమును ధరించడం వలన అనేక విధములైన శారీరక, మానశిక వైఫల్యాల రిత్యా కలిగే అలజడి అశాంతి నివారింపబడి సుఖ జీవనము లభిస్తుంది. అంతే గాక దరిద్ర బాధలు కష్ట నష్టములు తొలగిపోగలవు.

సంగీతము, సాహిత్యము, కవిత్వము, నటన నాట్యము, చిత్రలేఖనము మొదలగు అరువది నాలుగు కళలయందు సూక్ష్మ పరిగ్రహణ శక్తి కలిగి బాగా రాణీంచగలరు.


 సినిమా రంగమున ఉండు వారికి వజ్రధారణ చాలా అవసరం.

 సుఖరోగములు, ఇతర మర్మాయవ రోగములు నివారించగలదు.

శుక్రబలం లోపించిన వధూవరులకు వజ్రపుటుంగరమును ధరించిన యెడల వారి అన్యోన్య దాంపత్య జీవితం "మూడుపువ్వులు ఆరు కాయలు"గా ఉంటుంది.


వివాహాటంకములు ఏర్పడి ఎన్ని నాళ్ళకు వివాహం కాని వారికి వజ్రం ధరించిన తర్వాత వివాహం జరుగ గలదు.


బాలగ్రహ దోషములు, అనేక రకాల దృష్టి దోషాలు నివారింపబడుతవి.

పొడి దగ్గులు.
ఉబ్బసము వ్యాధి మూత్ర పిండాలకు సంబంధించిన దోషాలు.

 అకాల వృద్దాప్యపు లక్షణాలు వెంట్రుకలు చిన్నతనంలోనే తెల్లబడుట,


వ్యభిచార దోషాలు సంతాన దోషాలు స్త్రీల విషయంలో బెరుకుతనము, ఆహార అయిష్టత, ఊహా లోకాల్లో విహరిస్తూ సోమరితనంగా ఉండటం శరీర కృశత్వము మొదలగు శారీరక మానశిక వ్యాధుల నుంచి రక్షించి నిత్య యవ్వనులుగ తీర్చిదిద్ది నూతనోత్సాహంతో ఉల్లాసవంతమైన జీవిఉతం గడపడానికి ఈ వజ్ర ధారణ బాగా ఉపయోగపడుతుంది.



 స్త్రీలకు సంబందించిన కుసుమరోగాలు బహిష్ఠురోగాలు పోకార్చి ఆరోగ్యవంతులుగా నుంచగలదు.


వజ్రాన్ని ధరించే పద్దతి :

 వజ్రాన్ని వివిధ రూపాల్లో ధరిస్తుంటారు. కొందరు కంఠహారాల్లోను మరికొందరు హస్త కంకణాలలోను(గాజులు)చెవి కమ్మలు, ముక్కుపుడకలు షర్టు గుండీలు, యింకా అనేక విధాలుగా ధరిస్తుంటారు. సర్వసాధారనంగా వజ్రన్ని ఉంగరంలో ఇమిడ్చి ధరించడం ఎక్కువగా చేస్తుంటారు బంగారంతో చేయించిన ఉంగరానికి అడుగున రంధ్రం ఉంచి పైభగం ఐదు కోణాలు (నక్షత్రాకారం)గా తీర్చి దిద్ది దాని మద్యలో వజ్రాన్ని బిగించాలి. దిని బంగారం మినహా ఇతర లోహాలు పనికిరావు.


 భరణి పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలలో జన్మించిన వారికి వజ్రధారణ చాలా ముఖ్యము. ఇతర నక్షత్రాల వారు వారి జాతక ప్రభావాన్ని అనుసరించి శుక్రగ్రహం బలహీనంగా నున్నపుడు మాత్రమే వజ్రాన్ని ధరించాలి.


కృత్తిక, రోహిణి, ఉత్తరాషాడ, శ్రవణం ఈ ఆరు నక్షత్రాలు జన్మ నక్షత్రాలుగా గలవారు వజ్రాన్ని వాడడం అంత మంచిదికాదు.


అనూరాధ, ఉత్తరాభాధ్ర నక్షత్రాలు కలిగిన శుక్రవారం రోజునగానీ, రేవతీ నక్షత్రం గల శనివారమునందుగానీ, శుక్రుడు ఉత్తరాభాధ్ర, రేవతి నక్షత్రాలలో సంచరించే సమయంలో భరణి నక్షత్రంలో గల శుక్ర వారమునందుగానీ శుక్ర హోరాకాలం జరిగే టప్పుడు గానీ (వజ్ర దుర్ముహుర్తాలు లేకుండా చూచి) వజ్రాన్ని ఉంగరంలో బిగించాలి. ఆ తర్వాత ఆ ఉంగరాన్ని ఒక రోజంతా పంచగవ్యాలలో నిద్రగావింపజేసి, మరుసటి రోజు గుఱ్ఱము మూత్రమునందుంచి, మరొక దినము పసుపు నీటియందుంచి తిరిగి మంచి నీటి చేత పంచామృతములచేత శుద్ధిగావించాలి. ఈ ప్రకారం పరిశుద్ధమైన వజ్రపుటుంగరము (ఆభరణము)నకు శాస్త్రోక్తముగా పూజ జరిపించి ధూపదీప నైవేద్యములచే శాంతి జరిపించిన పిమ్మట ధరించెడు వాడికి తారా బలం చంద్రబలం కలిగిన శుభతిదుల యందు, బుధ, శుక్ర, శని వారాములలో మిధున, ధనుర్మీన లగ్నమునందు గల శుభముహుర్తంలో ధరించాలి. ఉంగరాన్ని లేక ఆభరనమును ధరించే ముందుగా దానిని కుడిచేతి హస్తము నందుంచుకొని తూర్పు ముఖముగా నిలబడి గురువుని, గణపతిని ధ్యానించి "ఓం శీం ఐం హ్రీం శ్రీం భృగుసూనవే శుక్రాయస్వాహా" అను మంత్రముతోగానీ లేక "వర్షంతుతే విభావరి దివో అభ్రస్య విద్యుతః రోహస్తు సర్వ బీజా న్యవ బ్రహ్మద్విషోజహి" అను మంత్రమును గానీ 108 సార్లు పఠించి శుక్రగ్రహమునకు నమస్కరించి కుడిచేతి నడిమి వ్రేలికి ఉంగరమును ధరించవలెను. (వజ్రమును ఉంగరపు వ్రేలికి ధరించుట పనికిరాదు). కొందరు చిటికెన వ్రేలుకి ధరించు చుండెదరు ఒకే ఉంగరమునందు వజ్రముతో బాటుగా కెంపు ముత్యమును జేర్చి బిగించ కూడదు. (ఇది తొమ్మిది రత్నాలు కూర్చునపుడు మాత్రంకాదు).





వజ్రమునకు ముఖ్యముగా గమనించవలసినవి పంచలక్షనములు అవి 1) దోషరహితము, 2) అధిక కోణములు, 3) కాంతిప్రకాశము 4) ఆకారము(జాతి) 5) రంగు ఇవి చాలా ముఖ్యము. 6. వజ్రం – Diamond వజ్ర శరీరం, ఆరోగ్యం కలుగుతాయని వజ్రాన్ని ధరించేవారు. శతృనిరోధం.











6, 14, 24 తేదీలలో జన్మించినవారు, శుక్రవారం జన్మించిన వారు, భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలలో పుట్టినవారు, శుక్రమహాదశ జరుగుతున్నవారు వజ్రాన్ని ధరించాలి. అంటువ్యాధి నిరోధం, భార్యభర్తల అన్యోన్యత.













పచ్చ – Emerald

పచ్చ మకరత రత్నాలు బుధగ్రహానికి చాలా ప్రీతికరమైనది. బుధగ్రహము పీత వర్ణము గలవాడు. భూతత్త్వ ప్రధానుడై ఘ్రూణేంద్రియమున కాధిపత్యము వహించుటవల్ల ఈ విశేషములు కల్గిన మకరతము బుధునుకి సంభంధించినదనడంలో ఎట్టిసందేహంలేదు. పచ్చ త్రిదోషములందలి కఫ దోషమును హరింపగలదు. పంచ ప్రాణములలో మొదటిదగు ప్రాణవాయువు సంకేతముగా గల్గియున్నది. ఇది స్త్రీజతికి సంభంధించినదని కొందరు, నపుంసక జాతికి చెందినదని కొందరు చెప్పుచున్నారు. బుధ గ్రహము మాత్రం నపుంసక గ్రహముగా జ్యోతిష్యశాస్త్రంళో వ్రాయబడినది.







శరీరమునందలి సహస్రార చక్రమునకు ఈ మకరతమునకు కాంతివర్ణ సామిప్యములు గలవు. పచ్చను ధరించిన యెడల అందలి ఆకుపచ్చ కాంతులు శరీరము నందలి వివిధ నాడీమండలములపై సకల అనారోగ్యములను వారించి అనారోగ్యమును నివారించి ఆరోగ్యమును ప్రసాదించగలదు.












 ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి అను నక్షత్రములందు జన్మించిన వారు ఏ సమయములందైనను పచ్చలను ధరించవచ్చును.


మిగిలిన నక్షత్ర జాతకులలో రోహిణి, హస్త, శ్రవణ, నక్షత్రములు గలవారు మినహా మిగిలిన అన్ని నక్షత్రములవారు ఈ పచ్చలను ధరించుట వలన శుభఫలితాలను పొందగలుగుతారు. పచ్ఛలను ధరించుట వలన జనన సమయము నందలి జాతక గ్రహముల యొక్క స్థితిగతులను విచారించి దశాంతర్దశలు, గోచారము బాగుగా పరిశీలించి బుధగ్రహము దోషప్రదునిగా నున్న సమయములందు మాత్రమే పచ్ఛను ధరించిన యెడల గ్రహముల వల్ల సంభవించే అన్ని విధములైన అరిష్టములు హరించుకొనిపోయి శుభఫలితాలు కల్గును.










 జన్మ సమయమున ఏర్పడిన జాతక చక్రము బుధగ్రహము 6-8-12 స్థానాధిపత్యములను పొందియుండుట ఆ స్థానాధిపతులతో కలసియుండుట, వారిచే చూడబడుట 6-8-12 స్థానమునందలి దోషప్రదము మరియు బుధుడు అష్టమ వ్యయాదిపత్యములు కలిగి , ద్వితీయ సప్తమ దశమ స్థానములందుండుట, యోగకారకుడై నీచ , శతృక్షేత్రములందుండుట, పాపగ్రహసహితుడై కేంద్రకోణ రాశులయందుండుట, పాపగ్రహ సహితుడై కేంద్ర కోణ రాశులయందుంచుట, షడ్వర్గ అష్టకవర్గ బలములను బుధుని దుష్టత్వము నధికము గావింపగలవు. బుధుడు దుష్ట లక్షణముతో కూడియుండి అతని యొక్క మహర్దశగానీ అంతర్దశగానీ సంభవించినప్పుడు, లేక గోచారమునందు దుష్టస్థాన సంచారము కలిగిన కాలము,

ఇతర రాజయోగ దశలయందు బుధుని అంతర్దశలు, విదశలు సంభవించిన కాలమునందు అనేక విధములైన కష్టనష్టములు ఆపదలు సంభవించగలవు. అట్టిచెడు సమయములందు ముఖ్యముగా కఫ పైత్య వికారములచే కలుగు వ్యాధులను.

బుద్ధిబలము లోపించుట,

 వ్యాపారాటంకములు,

వ్యాపార నష్టములు,

 కుటుంబకలహములు,

 దైవనింద వ్యవహార బాధలు,

నరముల బలహీనత,

 విధ్యార్థులకు పరీక్షలలో అపజయము,

గణిత విభాగమునందు పురోభివృద్దిలోపించుట.

 కృత్రిమ ప్రయోగాది బాధలు,

 మతి విభ్రమము,

విడువనట్టి జ్వరభాధ,

 కామెర్లరోగము.

 స్త్రీలకు సంభంధించిన వ్యాధులు.

 కష్ట ప్రసవము మొదలగు అనేక విధములైన వ్యాధి బాధ దుఃఖములు కలుగుచుండగలవు.


పచ్చ ద్వారా కలిగే శుభయోగాలు :

 శ్రేష్ఠమైన పచ్చలను ధరించిన యెడల, బుద్ధి జ్ఞానములు అభివృద్దినొందగలవు.

 విధ్యాజయము, పాండిత్యము, చక్కని వాక్కులు, జ్యోతిషశాస్త్రాభిరుచులు కలుగగలవు.

మాటలు సరిగారాని వారికి, నత్తి మాటలుగలవారు ఈ పచ్చను ధరించిన వారి వాక్కులు సుస్పాష్టములై యుంటవి.

తల్లివర్గీయులైన భంధువులతో గల స్పర్థలు అంతరించి వారివలన సహాయ సహకారములు పొందగలరు.

తాము చేయుచున్న వృత్తులలో కలిగే ఆటంకములు, అవాంతరములు తొలగిపోయి వారివారి వృత్తులు నిర్విఘ్నంగా కొనసాగ గలవు.

 కుటుంబములో సంభవించే గృహచ్ఛిద్రములు అంతరించి కుటుంబసౌఖ్యం లభిస్తుంది.

వ్యాపార వ్యవహారములందేర్పడిన స్తబ్దత తొలగిపోయి వ్యాపార విజయము చేకూరును.

 దైవభక్తి జ్ఞానాభివృద్ది,

 సత్కార్యచరణ సమాజంలో గౌరవ ప్రతిపత్తులు ధన సంపద ఐశ్వర్యాభివృద్ది కల్గుటయే గాక, శరీరమునందు కలిగే అనేక విధములైన జ్వరాతిసార కామిలాది బాధలు నివారణ కాగలవు.

 బి.పి అధికంగానున్న వారికిది దివ్యౌషధము,

  అంతభ్రమణము,

మూర్చరోగము,

కంఠమునందలి వొణుకు,

నాలుక యందలి దోషములు.

 స్త్రీల యొక్క ఋతు సంభంధమైన వ్యాధులు నివారింపగలదు.

ప్రసవవేదనజెందు స్త్రీలకు ఈ పచ్చను ధరింపజేసిన సుఖప్రసవము కాగలదు.

 వ్యాధి నివారణతో బాటు పరిపూర్ణ ఆరోగ్యమును కూడా ఈ పచ్చ ప్రసాదించగలదు.
















 పచ్చను ధరించే పద్దతి :

 పచ్చలను దోష రహితమైనవిగా చూచుకొని ధరించాలి. ఉత్తమ మైన మరకతాలు సత్ఫలితాలను కలిగించగలవు. మరకత రత్నాన్ని బంగారంతో పొదగబడిన బాణాకారంగల ఉంగరంలో ఇమిడ్చి ధరించడం శాస్త్రీయము.

 కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రములు కలిగిన బుధవారంగానీ, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రములు గల శుక్రవారం నాడు గానీ బుధుని యొక్క హోరాకాలంలో వర్జ దుర్ముహుర్తములు లేకుండా బోడి రత్నమును (పచ్చను) ఉంగరంలో బిగించాలి. ఆ తర్వాత ఆ ఉంగరమును ఒక దినము ఆవు పంచకంనందు ఉంచి రెండవదినము పశుపు నీటియందు నిద్ర గావింపజేసి పంచామృతములచే శుద్దిచేసి పూజించాలి. ధరించెడివారు తమకు తారాబలం చంద్రబలం కలిగిన శుభతిదులయందు, ఆది, బుధ, శుక్రవారములలో వృషభ, సింహ, కన్య, తులా లగ్నములుగల సమయమునందు ఉంగరము ధరించవలెను. ధారణకు ముందే శాస్త్రోత్తమముగా పూజలు జరిపి కుడి హస్తమునందుంచుకొని ఈ శాన్యదిశగా తిరిగి గురువుని, గణపతిని స్మరించి "ఓం శ్రీం ఐం హ్రీం శ్రీం సౌమ్యాయ సౌః క్లీం ఐం బుధాయస్వాహా" అను మంత్రమును 108 సార్లు జపించిన తర్వాత ఆ ఉంగరమును ముమ్మారు కనులకద్దుకొని కుడిచేతి చిటికెన వ్రేలునకు గానీ, లేక ఉంగరపు వ్రేలునకు గానీ ధరించవలెను.

 స్త్రీలు ఎడమ చేతి చిటికెన వ్రేలుకి ధరించుట ఆచారమై ఉన్నది.

ఉంగరము అడుగుభాగం మాత్రము రంద్రము కలిగి యుండాలి. కొందరు సిద్ద పురుషులు మరకత రత్నమును శివలింగములుగా దీర్చి దేవ తార్చనయందు నిత్య పూజలు నిర్వహించుచుండెదరు. అట్టివారి పుణ్యఫలితము అనంతము. వారికి త్వరగా మోక్షము ప్రాప్తించగలదు.












  పచ్చ – Emerald
 5, 14, 23 తేదీలలో జన్మించినవారు పచ్చను ధరించాలి.బుధవారం పుట్టినవారు. కన్యా రాశివారు. దీని రంగు ఆకుపచ్చ. జ్ఞాపకశక్తి వృధ్ధి. విద్య, వ్యాపార వృధ్ది. మానసిక వ్యధ నివారణ. గణిత శాస్త్రజ్ఞులు ధరించాల్సిన రాయి. బుధుడు పచ్చకు అధిపతి.కాలేయ వ్యాధులు, పుండ్లు, ఆస్మా, గుండె రోగాలు తగ్గుతాయి.













గోమేధికం – Jakarn

గోమేధికము

భూగోళానికి అనుసంధానమై నియమిత దూరాలలో పరిభ్రమించే గ్రహగోళాలు ఏడే ఐనా వాటి మధ్యలో ఛాయాగ్రాహకులుగా ప్రశిద్ధినొందిన రాహు-కేతువులనే గ్రహాలున్నట్లు పాశ్చాత్య ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అట్టి ఛాయాగ్రహమైన రాహువునకు, గోమేధికమునకు చాలా దగ్గర సంభంధములున్నవి. ఒక సిద్దాంతము ప్రకారం భూగోళము యొక్క కుడి ఎడమ భాగాలే రాహువు కేతువులని ప్రతీతి. అందువల్లనే భూమి యొక్క ఏ వైపు భాగం సూర్య చంద్రులకు అడ్డుగా వస్తుందో ఆ గ్రహ సంభంధిత గ్రహణం సంప్రాప్తిస్తున్నదని నవీన సిద్దాంతము. అట్టి గ్రహనకాలం పరమ పవిత్రమైనదిగా భారతీయుల నమ్మకం ఎప్పటికీ మార్పు లేనటువంటి భూమి యొక్క కుడి ఎడమల దూరం 180-0` డిగ్రీలైతే రాహువు కేతువు మధ్యగల దూరం కూడా 180-0’ డిగ్రీలే! భూమి యొక్క ఆగ్నేయ నైఋతీ భాగాలను కలిపే దక్షిణ దిక్కు రాహువైతే ఈశాన్య వాయువ్య భాగాలను కలిపే ఉత్తరదిక్కు కేతువనేది కొందరి సిద్దాంతము.


రాహుగ్రహాని కదిదేవత గోమాతగా వేదములందు తెలుపబడినది. అట్టిగోమాత యొక్క మూత్రము వంటి రంగు కల్గిన గోమేధికము రాహు సంభంధమనుటలో నిస్సందేహము లేదు. కావున రాహుగ్రహ ప్రీతికరమైన గోమేధికమును ధరించుట వలన జాతక గోచారములందలి రాహు దోషాలు నివారింపబడి సకల శ్రేయోభివృద్ధి జరుగ గలదు.











ఆర్ద్ర, స్వాతి, శతభిషం జన్మనక్షత్రాలవారు ఏ సమయమునందైనను గోమేధికమురత్నమును ధరించవచ్చును. మిగిలిన నక్షత్రములవారు మాత్రం తమ జన్మ సమయమునందలి గ్రహస్థితి ననుసరించిబలవంతుడైన రాహువు దుష్టస్థానములందున్న దశాంతర్దశ కాలమునందు మాత్రమే గోమేధికము ధరించుట ఉత్తమము. ఎవరికైనను వారి జన్మ జాతక ములందు రాహువు గ్రహము షడ్భలములు అషటకవర్గ బిందుబలము కలిగి జన్మలగ్నము నుండి 6-8-12 స్థానములందున్నను, ఆ అధిపతితోకూడుట చూడబడుట, తటస్థించినను, ఆ స్థానమునందు ఇతర పాపగ్రహ దృగ్యోగవేధా సంభంధము కలిగినను రాహువు బహుదోషప్రదుడుమరియు 2-5-7 స్తానములందు పాప గ్రహ సంభంధము కలిగి రాహువున్నను, గురు సంభంధమును కలిగి ధనుర్మీన రాశులయందున్నను, గురు సంభంధమును కలిగి రాహువు వున్నను, శని కుజుల సంభంధము కలిగి జన్మలగ్నమునందున్నను, అధిక దోషప్రదుడై అపకారముల నొనర్చును, చంద్రుడు బలహీనుడై యుండగా బలవంతుడైన రాహువు నవమస్థానము నందుండిన (శుభ దృష్టి లేక )బాలారిష్టములు కలుగ చేయ గలడు. రాహువునకు జాతకమునందలి అశుభ దశాంతర్దశలు ప్రప్తించినప్పుడు, గోచారమునందు రాహువు సంచారము దోషయుక్తమైన కాలమునందు ధరించాలి.








వివిధ రూపములలో కష్టనష్టములు,

 ఈతి బాధలు, దారున పరిస్థితులు తటస్థించి దుఃఖప్రదముగా నుండగలదు.

మరియు దుష్టగ్రహమైన రాహుగ్రహ ఫలికాలంలో కుటుంబకలహాలు,

అజన విరోధములు,

 ఆస్తినష్టము .

విద్యాభంగము,

వ్యాపార నష్టము.

 కోర్టు చిక్కులు.

 రోగచోరఋణబాధలు,

వృత్తి ప్రతికూలత,

 ఆర్థిక, సామాజిక బాధలు, దెయ్యములు, ప్రయోగాదిగాగల దుష్టగ్రహ బాధలు.

 ఆహారమునందయిష్టత.

 ఆత్మహత్యను గూర్చి ఆలోచించుట,

ఉన్మాదము,

మతిబ్రమ మొదలగు మానసిక వ్యాధులే గాక కీళ్ళవాతాలు నులి పురుగులు జేరుట,

 కడుపులో ఏలిక పాములు విరోచనాలు (అతిసారం) లివరు,

పశికర్లు,

గర్భకోశంలో వాపు, కాన్సర్,

 కడుపునొప్పి,

మలబద్దకము

 మెదడుకు సంభంధించిన అనేక వ్యాధులు.

 రహస్యముగా ఆచరించే చెడుపనులు,

 దుష్టుల స్నేహం వలన ఆపదవలు మొదలగు అనేక కష్ట నష్టములు దుఃఖబాధలు సంభవింపగలవు.


గోమేధికము వలన కలిగే శుభయోగాలు :

 ఇది రాహుగ్రహానికి సంభంధించిన రత్నమగుట వలన రాహుగ్రహ దోషములన్నింటినీ పరిహరింప జేయుటమే గాక కుటుంబసౌఖ్యము జనానుకూలత,

విధ్యాభివృద్ది,

కృషిలో విజయము ,

ఆర్ధికపుష్టి,

 వృత్తిలాభము,

 సమాజంలో గౌరవము,

ఆరోగ్యము,

స్త్రీమూలక ధనప్రాప్తి,

ఆకస్మిక ద్రవ్య లాభము,

వారసత్వపు ఆస్తిసంక్రమించుట.

 ఋణబాధలు తీరిపోవుట.

 బందువుల ఆదరణ కల్గుట.

మాతామహ వర్గీయుల ద్వారా ఉపకారము.

రాజకీయ, కోర్టు వ్యవహారములందు పరిష్కారము,

గంగా స్నానఫలము,

 దైవభక్తి.

స్థిరబుద్ది,

సన్మానమార్గము ధనాభివృద్ది,

ఆకస్మిక ప్రమాదములనుంచి, దుష్టగ్రహ పీడల నుంచి రక్షణ,

శతృనాశనము, మిత్రవర్గముల వారి సహాయ సంపత్తి లభించుట, గండములు తోలగిపోవుట,

దీర్ఘవ్యాధుల నుండి విముక్తి, సంపూర్ణారోగ్యము,

భూగృహక్షేత్ర సంపద కలుగుట, అఖండకీర్తి, జయము క్షేమము, ఉల్లాసము కలుగగలవు.

















గోమేధికము ధరించే పద్దతి :

దోషములు లేని ఉత్తమ లక్షణములు గల గోమేధికము బంగారం లేక పంచలొహముల ఉంగరమునందు బిగించిధరించిన యెడల అభీష్టము చేకూరగలదు. వెండి గోమేధికమును బిగించుటకు పనికిరాదు. ఈ రత్నమును బిగించు ఉంగరముపైభాగముపై చేట ఆకారముగా పీఠము నేర్పటుగావించి అడుగుభాగం మ్కాత్రం రంద్రమునుంచి గోమేధికమును పీఠము మద్యభాగములో బిగించి శుద్ది గావించి ధరించవలెను. రాహుగ్రహస్తమైన సూర్య లేక చంద్ర గ్రహణములు సంభవించిన కాలమునందుగానీ, ఆదివారము పుష్యమీహస్తా నక్షత్ర యుక్తమైనపుడు కానీ, సప్తమీ ఆదివారము వచ్చినప్పుడుగానీ అదే విధంగా అమావాస్య ఆదివారమ్నాడుగానీ మకర సంక్రాంతి పుణ్యకలమునందుగానీ సూర్యుని హోరా జరిగే సమయమునందుగానీ శాస్త్రీయంగా తయారు చేయబడిన ఉంగరము నందు గోమేధికమును బిగించాలి. ఆ తదుపరి ఉంగరమును ఒక దినము కాకరాకు పసరయందు మరుసటిరోజు గోమూత్రము నందు మూడవదినము ఆవుపాల యందు నిద్ర గావింపజేసిన పరిశుద్దము కాగలదు. అటుపిమ్మట పంచామృత స్నానముగావింపజేసి శాస్త్రోక్తకముగా షోడశోపచార పూజలు గావింపజేసి శుభముహుర్తమునందు వ్రేలికి ధరించుట శాస్త్రీయ సమ్మతము ధరించెడి వారికి తారాబలం చంద్రబలములు కలిగియున్న శుభతిధులు కలిగియున్నప్పుడు వర్జ్య దుర్ముహుర్తాలు లేని కాలంలో మృగశిర, ఉత్తర, చిత్త, శతభిషం, ఉత్తరాభాద్ర నక్షత్రములయందు వృషభ, మిధున, సింహం కుంభలగ్నములు జరుగు సమయములందు పూజించిన ఉంగరమును ధరించవలెను ధరింపబోవు సమయమునకు ముందు ఉంగరమును కుడిహస్తము నందుంచుకొని దక్షిణ ముఖముగా తిరిగి నిలబడి గురువుని, గణపతిని ధ్యానించి "ఓం భ్రీం ఐం హ్రీం శ్రీం తమోగ్రహాయ స్వాహా" అను మంత్రమును 108 పర్యాయాలు జపించి ఉంగరమును ముమ్మరు కనుల కద్దుకొని కుడిచేతి ఉంగరపు(అనామిక) వ్రేలికి ధరించాలి. స్త్రీలు ఎడమ వ్రేలికి ధరించుట ఆచారము గలదు. నవరత్నములను గాక ఇతర రత్నములు చేయించుఉంగరములో గోమేధికముతో బాటుగా ముత్యాలను, వైడూర్యములు జేర్చి ఉంగరమును ధరించకూడదు.









 గోమేధికం – Jakarn 4, 13, 22, 31 తేదీలలో జన్మించినారు. అరుద్ర, స్వాతి నక్షత్రాలలో పుట్టినవారు. ఆదివారం రోజున పుట్టినవారు. దీన్ని పంచలోహాలతో కలిపి ధరించాలి. ఇది గోవుమూత్రం రంగులో, చాక్లెట్ రంగులో ఉంటుంది. ఇది రాహువుకు సంబంధించిది. దీనివల్ల లాభాలు – సర్వజన వశీకరణ. ధనలాభం. శతృభాధ నివారణ. కార్యసిధ్ధి. మానసికరోగ నివారణ.జీర్ణకోశ ఇబ్భందులు తొలగుతాయి. శరీరానికి తేజస్సు. ఋణబాధ విముక్తి.














పుష్యరాగం – Topaz

పుష్యరాగం
 పుష్యరాగ రత్నాలు బృహస్పతి (గురు) గ్రహానికి విశేషమైన ప్రీతి గలవి. ఎందువలన అనగా ఖగోళంలో నున్న పుష్యమీ నక్షత్రానికి అధిపతి గురువు. ఈ నక్షత్రమువలే ప్రకాశించే పుష్యరాగం గురుగ్రహానికి అభిమాన పాత్రవంటే అతిశయోక్తి కాదేమో ? అదీగాక, కర్ణేంద్రియ ప్రధానమైన ఆకాశతత్వాధిపతి బృహస్పతి, ఆకాశము శబ్ధలక్షణము కలది. ఈ పుష్యరాగం కూగా పై లక్షణము కలిగియుండును. అందువలన గురు గ్రహమునకు సంభంధించిన రత్నము పుష్యరాగమని స్పష్టమగుచున్నది. పుష్యరాగము త్రిదోషము నందలి వాత దోషమును శమింపజేయగలదు.
ప్రాణపంచకములలో వ్యానమను ప్రాణవాయువునకు సంకేతమై ఉన్నది.












 ఇది పురుషజాతి రత్నము శరీరమునందలి అతి ప్రధానమైన అజ్ఞాచక్రమునందలి మహత్తరమైన ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయా కాంతులకు ప్రతీకమైనది పుష్యరాగము-- బృహస్పతి బ్రహ్మజ్ఞాన సమన్విటుడు బ్రహ్మజ్ఞాన ప్రతిపాదిత మయినది గాయత్రి, అట్టి గాయత్రి యొక్క ఐదు ముఖాములకు గల వర్ణములే బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించే భవామధ్య స్థానంలో గల అజ్ఞచక్రంలో నిబిడీకృతామై ఉన్నది. బృహస్పతి యొక్క రత్నమయిన పుష్యరాగం ఏ రంగులో నున్నప్పటికీ ఈ ఐదురంగుల యొక్క సమిష్టి ప్రభావము కలిగి వుంటుంది. అందువల్లనే ఈ రత్నము సత్కర్మలకు, బ్రహ్మజ్ఞాననిష్ఠులకు ఉపయోగార్ధమై రాణించుచున్నది.










పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్రములందు బుట్టిన వారు అన్ని వేళలయందు పుష్యరాగం ధరించవచ్చును. ఇతర నక్షత్రములలో జన్మించిన వారి విషయంగా భరణి, పుబ్బ, పూర్వాషాడ, నక్షత్రజాతకులు మినహా మిగిలిన అన్నినక్షత్రములవారు పుష్యరాగమును నిరభ్యరంతముగా ధరించవచ్చును.




ఈ రత్నమును ధరించుటకు జన్మకాలమునందు గ్రహముల యొక్క స్థితి గతులు విచరించి దశాంతర్దశల యందలి శుభాశుభములను గోచారము నందలి మూర్తి మరియు వేదలను బాగుగా విచారించి గురు గ్రహము దోషప్రదుడుగా నున్న సమయములందు

పుష్యరాగమును ధరించిన యెడల గురు గ్రహమువల్ల కలిగే అన్ని విధములైన కష్టనష్టములు దుఃఖములు పరిహరింపబడి సఖలైశ్వర్య భోగ భాగ్య సంపదలను ఆయురారోగ్యములను పొందగలరు.


జన్మ సమయమున లేర్పడిన జాతక చక్రమునందు గురుగ్రహము లగ్నము నుండి 6-8-12 స్థానములందున్నను, ఆ స్థానాధిపత్యములు కలిగినను, ఆ స్థానాధిపతులచే కలయుట లేక చూడబడుట యుండినను షష్ఠ్యాధిపత్యము కలిగి కోణరాశులయందున్నను, వ్యయాధిపత్యము కలిగి ద్వితీయ తృతీయ ఏకాదశ రాశులయందున్నను గురు గ్రహము బహుదోషప్రదుడు మరియు పాపగ్రహ వీక్షితుడైన క్షీణ చంద్రునితో గలసి లగ్నమునందున్నను, రాహుగ్రహ సహితుడై లేక వీక్షితుడై ఏ రాశియందున్నను గురువు గొప్ప దోషవంతుడు కాగలడు. ఇట్టి ధోషములు కలిగియున్న బృహస్పతికి స్థానాదిషడ్వర్గబలములు, అష్టకవర్గ బిందుబలము కలిగియున్న తన దోషములను వృద్ధి గావించుకొనగలడు. గురుడు దుష్ట లక్షణములతో గూడి యున్నప్పుడు అతని మహర్దశగానీ సంభవించినను లేక గోచారమునందు దుష్టన్థాన సంచారములు కలిగిన కాలము మొదలగు గురు సంభందితమైన అశుభ కాలములందు సర్వవిధములైన అరిష్టములు ప్రాప్తించగలవు.

 ముఖ్యముగా ఆర్దిక ఇబ్బందులు.

 కుటుంబకలహాలు,

పిల్లల ప్రవర్తన సరిగా లెకపోవుట.

 పుత్రవిచారము.

 భార్యతో కలహము,

దేశాటనము,

 ఋణబాధలు,

 అకారణ శతృత్వము నిందలు,

అవమానములు అగౌరవ పరిస్థితులు పరీక్షలలో అపజయము,

ఆకస్మిక ప్రమాదములు,

అజీర్ణ వ్యాధులు,

వాత ప్రకోపము,

 ఉబ్బులు,

చర్మరోగాలు,

మానసికవిచారము,

నష్టకష్టములు మొదలగు అనేక శుభఫలితములు కలుగుచుంటవి.


పుష్యరాగము ద్వారా కలిగే శుభయోగాలు : మల్లెపువ్వువంటి తెల్లని రంగు కలిగినవి గానీ, గోగు పువ్వువంటి పసుపు పచ్చని రంగుతో నున్నవి గానీ, పుష్యరాగములను శాస్త్రీయ పద్ధతుల ద్వారా ధరించిన వారికి విశేష పాండిత్యము మబ్చగలదు.

దరిద్రబాధ లంతరించి ధన సమృద్ధి కాగలదు,

విధ్యాలయందు ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణత.

సత్కర్మాచరణము, కుటుంబసౌఖ్యము,

గృహచ్ఛిద్రములంతరించి, దంపతుల అన్యోన్యత,,

వంశాభివృద్ది సంతానము ప్రయోజకులగుట.

 భంధువుల ఆదరణ, ప్రజాభిమానము,

 గౌరవము సభాపూజ్యత కీర్తి నిరాటంకము,

శతృవులు మితృలగుట, వారి వలన సహాయ సహకారములు .

సంతాన ప్రాప్తి.

అప్రయత్నముగా ధనలాభం.

 దైవభక్తి.

 దుర్వసనములందు అయిష్టత.

 జీర్ణశక్తి, వాత వ్యాధులు అంతరించుట,

మేధాశక్తి, వినయ వివేకములు,

 వ్యాధులు నివారింపబడుట.

శీఘ్రముగా ఆరోగ్యము,

 మనఃశ్శాంతి కార్యసాఫల్యత.

ఐశ్వర్యాభివృద్ది కలుగ గలవు.

యోగులు దీనిని ధరించిన యెడల పరిపూర్ణ యొగ ఫలసిద్దినొందగలరు. సత్కర్మాచరణులు నైష్టికులు ధరించిన ఆయా కర్మలందు సంపూర్ణ ఫలమునొంది ఇహపర సౌఖ్యములను పొందగలరు.

















 పుష్యరాగమును ధరించే పద్ధతి:

ఏ జాతికి చెందిన పుష్యరాగమైనప్పటికీ దోషరహితంగా చూచి బంగారు ఉంగరములో ధరించటం ఉత్తమము, వెండి యందు ధరించడం రెండవ పక్షము. ఇతర లోహములు పనికి రావు పంచలోహములలోను ఈ ఉంగరము ధరించవచ్చునని కొందరు చెప్పియున్నారు. బంగారం లేక వెండితో చేయబడిన ఉంగరము యొక్క పైపీఠము దీర్ఘచతురస్రాకారంగా చేయించి అందు పుష్యరాగ రత్నమును ఇమిడ్చి పూజించి ధరించవలెను.


మృగశిర పుష్యమి, ఉత్తర, పూర్వాభద్ర నక్షత్రములు కలిగియున్న గురువారం గానీ లేక పుష్యమీ నక్షత్ర గురు ఆది వారములందుగానీ సంభవించిననాడు గురు హోరకాలమునందు వర్జదుర్ముహుర్తములు లేకుండా చూచి పుష్యరాగమును ఉంగరమును బిగించలి ఆ తర్వాత ఉంగరమును ఒక దినమంతా పంచగవ్యములందుంచి, రెండవదినము మంచి గంధపునీటియందుంచి శుద్ధి గావించాలి. ఆ తదుపరి ఉంగరమునకు విధ్యుక్తముగా పూజ జరిపించాలి. ధరించెడువాడు తమకు తారాబలము చంద్రములు కల్గిన శుభతిదులయందు ఆది, మంగళ, గురువారములయందు సింహ, కటక ధనుర్మీన లగ్నములు జరుగుచున్నకాలమునందు ఈ ఉంగరము ధరించవలెను. ధారణకు పూర్వమే పూజాధికములను నిర్వర్తించి ఉంగరము తన కుడి హస్తమునందుంచుకొని ఉత్తరదిశాభిముఖులై గురువుని , గణపతిని ధ్యానించి "ఓం ఐం శ్రీం హ్రీం క్లీం బృహస్పతయే స్వాహా"అను మంత్రమును 108 పర్యాయములు జపించి ఆ తర్వాత ఉంగరమును ముమ్మారు కనులకద్దుకొని కుడిచేతి చూపుడు వ్రేలుకిగానీ, ఉంగరపు వ్రేలికిగానీ ధరించవలెను. స్త్రీలు కూడా ఈ పుష్యరాగ ముద్రికను కుడిచేతికి ధరించుటే శ్రేష్ఠము. ఉంగరమునకు అడుగుభాగం రంధ్రమును కలిగి వుండటం శాస్త్రీయము. అందువల్ల పుష్యరాగమునందలి వివిధకాంతులకు చెందిన కిరణశక్తి శరీరమునందు చొచ్చుకుపోయి అంతర్గత నాడీమండలములందు తమ శక్తిని ప్రభావితము గావించి దివ్యసిద్ధులను సత్ఫలితాలను కలుగచేయగలదు. పుష్యరాగ రత్నములచే చేయబడిన దేవతా విగ్రహములు నిత్యపూజలందు అత్యుత్తమ శుభఫలితములను గూర్చగలదు.







పుష్యరాగం – Topaz దీన్ని ధరించవలసినవారు. 3, 12, 21, 30 తేదీలలో జన్మించినవారు. మార్చి, సెప్టెంబర్, డిసెంబర్ నెలలో పుట్టినవారు. గురుదశ జరుగుతున్నవారు. కనక పుష్యరాగం కోరికలు తీర్చు కల్పవృక్షం. ఇది ధరిస్తే ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి. విజయం. సంతాన నష్ట నివారణ. చెడు అలవాట్లు దూరం. ఆరోగ్యం, మేధాశక్తి. ఇది గురుగ్రహానికి సంబంధించిందని ఈజిప్టులో కూడా నమ్మకం. దీని భస్మం వైన్ లో వేసుకుని తాగితే పిచ్చి, మూర్చలు తొలగిపోతాయి.




















మత్యం – Pearl

ముత్యము
మంచి జాతి ముత్యాలు చంద్రగ్రహానికి చాలా ప్రీతిప్రదము. చంద్రుడు జలగ్రహమై తెల్లని వర్ణము గలవాడగుట వలన జలము వల్ల పుట్టి సమాన వర్ణచ్ఛాయలు గల ముత్యములు చంద్ర సంభంధములై యున్నవి. అదీగాక పంచ భూతాలలో నీటికిసంభంధించిన విభాగమునందే చంద్రుడు ముత్యము గూడా నున్నవి. ఈ ముత్యము త్రిదోషములందలి కఫదోషములను పోగొట్టగలదు. అపానవాయువు సంకేతముగా గలది. స్త్రీజాతికి సంభంధించిన దగుటవలన బహుసుకుమారమై ఆకర్షణీయముగా వుంటుంది. శరీరమునందలి స్వాధిష్ఠాన చక్రమునందలి కాంతి పుంజము లేవికలవో అవి ఈ ముత్యంలో కూడాకలవని శాస్త్ర వచనము ముత్యము చూచుటకు తెలుపురంగు కలిగి ఉన్నప్పటికీ దీనినుండి వెలువడే కాంతితరంగాలు ఆకుపచ్చరంగులో నుంటవి. కావున స్వాధిష్ఠాన చక్రమునందలి ఆకుపచ్చరంగు కాంతికిరణాలు శరీరము నందంతటను వ్యాపించి, వాత దోషములు హృదయ దౌర్భల్యమును మానసిక చింతను పోకర్చి ఆరోగ్యము కలిగింపగలవు, ఈ కాంతి ప్రసారశక్తి సన్నగిల్లినప్పుడు, వాత ప్రకోపముచే అనేక వ్యాధులుత్పన్నములుకాగలవు.










 రోహిణి, హస్త, శ్రవణం అను నక్షత్రములందు పుట్టిన వారు ఏ సమయమునందైనను, ముత్యములను ధరించవచ్చును.


    ఇతర జాతకులలో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులు తప్ప తక్కిన వారందరూ ముత్యముధరించుట వలన ఇబ్బందియునుండదు.

 జన్మజాతక గ్రహములయొక్క స్థితిగతులను విచారించి దశాంతర్దశములు - గోచారము బాగుగా పరిశీలించి చంద్రగ్రహము దోషముగానున్న సమయములందీ ముత్యములను ధరించిన యెడల చంద్రగ్రహములవల్ల కలిగే సకల అరిష్టములు తొలగి శుభంకలుగుతుంది.
















 జాతక చక్రమునందు చంద్రగ్రహమునకు 6-8-12 స్థానాధి పత్యములు కల్గుట. లేక ఆస్థానములందుండుట, ఆ స్థాఅనాధిపతుల యొక్క దృష్టి, కలయిక సంభవించుటవల్ల దోషప్రదుడగుచున్నాడు. అంతేగాక రెండవస్థానమున కాధిపత్యముకలిగి ఎనిమిదవ స్థానమునందుండుట అష్టమాధిపత్యము వహించి ద్వితీయమునందుండుట వలన కూడా చంద్రుడు అపకార మొనర్చుట కవకాశములున్నవి. వీటికితోడుగా షడ్వర్గబలము లోపించుట, అష్టక వర్గమునందు హీనబిందువులు కలుగుట. కేమదృమాది దుర్యోగములు ప్రప్తించుట మొదలుగాగల లక్షణములు చంద్రుని దుష్టత్వమును అధికము గావించగలవు. చంద్రుడు దుష్టలక్షణములతో కూడియుండి అతని యొక్క దశగానీ, ఇతర శుభదశలం దాతని అంతార్దశలుగానీ సంభవించినకాలము మరియు గోచారవశమున కాలసర్ప యోగము సంభవించిన కాలమునందలి చంద్రగ్రహ సంచార సమయము బహుదుష్ట లక్షనములు గలిగి అనేక విషయ పరిణామములు, వ్యతిరేక ఫలితములు కలుగుచుండగలవు. ఆ దుష్ట సమయములందు
ముఖ్యముగా

 వ్యాపార స్థంభన నష్టము,

 ధనహీనత, భాగ్యనాశనము,

గృహకల్లోలములు దంపతులకు కలహము స్పర్థలు,

వివేక శూన్యత మనశ్శాంతి లోపించుట,

వాతాధిక్యత, నిద్రపట్టకపోవుట,

పిచ్చి పిచ్చి ఆలోచనలు,

భవిష్యత్ శూన్యంగా నుండుట,

మనోభయము,

 అజీర్ణ హృదయ సంభంధ వ్యాధులు, వివాహాటంకములు,

వృత్తిలో ప్రతికూలత, అపజయము, మాతృస్త్రీకలహములు

 మొదలగు దుఃఖజనకమైన ఫలితములు కలుగుచుంటవి. అట్టి సమయములందు మంచి ఆణిముత్యమును ధరించుటవల్ల చంద్రగ్రహ దుష్టత్వము నశించి శుభములు కలుగుతవి.


ముత్యముల ద్వారా కలిగే శుభయోగాలు : ముత్యములలో కల్లా శ్రేష్ఠమైనట్టి ఆణిముత్యమువంటి ఉత్తమజాతి ముత్యములను శాస్త్రీయ పద్ధతుల ననుసరించి ధరించిన యెడల

 ప్రశాంతత, మనశ్శాంతి,

వీర్యవృద్ది, దాంపత్య సౌఖ్యము. అన్యోన్యత,

అధిక జ్ఞాపకశక్తి, సద్భుద్ది, గౌరవ మర్యాదలు పొందగల్గుట,

స్త్రీ జనరంజనము, ధైర్యముగా పురోగమించుట,

కుటుంబ సుఖసంతోషాలు, ధన ధాన్యాభివృద్ధి, సౌభాగ్యసంపదలు కల్గుట, ఆటంకములంతరించి నిర్విఘ్నముగా అన్ని పనులు నెరవేరుట,


వివాహాది శుభకార్యములు కలసి వచ్చి సంతోషము కల్గుట జరుగగలవు.

 ఈ ముత్యధారణవల్ల కుష్ఠు, అపస్మారము, పిచ్చి, బొల్లి, చర్మవ్యాధులు, క్షయ, ఉబ్బసము, మేహవ్యాధి, కీళ్ళ వాతము, అజీర్ణ భాధలు మొదలగున వన్నియు నివారింపబడి శీఘ్రముగా ఆరోగ్యవంతులు కాగలరు.


చంద్రుడు వ్యాపారములకు కొంత సంభంధించి యుండుట వలన వ్యాపార నష్టములను నిరోధించి వ్యాపారాభివృద్ధిని కలిగించుటకు కూడా ముత్యధారణ ఉత్తమమై ఉన్నది.










ముత్యము ధరించే పద్ధతి :-

 ముత్యాలు అనేక రకాలుగా నున్నప్పటికీ నీటిచ్ఛాయలు గలిగి తెల్లనై గుండ్రంగా నుండి ప్రకాశించే ఆణిముత్యాలు ధరించడానికి బహుశ్రేష్ఠమైనవి. ముత్యమునకు బరువు ఇంత ఉండాలి అనే నియమం లేక పోయినప్పటికీ ఎంత పెద్దవిగా ఉంటే అంత మంచిది. అదీగాక ఒకే ముత్యం ముత్యం ధరించేటప్పుడు పెద్దదిగా చూచి ధరించడం అవసరం దండలు, మాలలుగా ధరించే ముత్యాలు అనేకంగాబట్టి అవి చిన్నా, పెద్దా వున్నాదోషంలేదు. ముత్యాలను బంగారం లేదా వెండి లోహాలతో చేయబడిన నలుచదరపు ఉంగరంలో ఇమిడ్చి ధరించాలి. శ్రావణశుద్ద పౌర్ణమినాడు శ్రవణ నక్షత్రంలో గానీ, లేక పూర్ణిమ సోమవారం గానీ, చంద్ర గ్రహణ సమయంలో గానీ, వృషభ రాశిలో చంద్రుడు ఏకదశస్థానంలో నుండగా గానీ, చంద్రహోర జరిగే సమయంలో గానీ, వర్జము దుర్ముహుర్తము లేకుండాచూచిమంచి ముత్యము ఉంగరమునందు బిగించాలి. ఆ తర్వాత ఆ ఉంగరము ఒక దినమంతయు ఆవుపాలలో ఉంచి మరుసటిరోజు మంచి నీటితో శుద్దిగావించాలి. ధరించేవాడు తమకు తారాబలము చంద్రబలములు బాగుగా నుండిన శుభతిధులలో సోమవారం లేక శుక్రవారం రోజున వృషభ, కర్కాటక, ధనుర్మీన లగ్నమునందు ఉంగరము (పూజించి) ధరించవలెను, ఉంగరమును నిర్ణయించిన శుభసమయమునందు ధరించుటకు ముందుగానే యధావిధిగా పూజించి, నమస్కరించి, గురువుని, గణపతిని, చంద్రగ్రహమును ధ్యానించి కుడివైపునగల అరచేతిలో నుంచుకొని "ఓం వం ఐం హ్రీం శ్రీం జూం సః చంద్రమనే స్వహా"అనే మంత్రాన్ని నిశ్చలంగా 108 పర్యాయములు జరిపించిన పిదప ఆ ఉంగరమును ముమ్మారు కనులకద్దుకొని కుడిచేతి ఉంగరపు వ్రేలికి ధరించాలి స్త్రీలు మాత్రం ఎడమ చేతి ఉంగరపు వ్రేలికి(అనామిక)ధరించడం చాలా విశేషము స్త్రీలుగాని, పురుషులు గానీ ముత్యములను మాలలుగా ఇతర ఆభరణములుగా గానీ ధరించుట గూడా పైవిధానము ప్రకారమే పూజించి ధరించవలెను. ఉండరమునందలి అడుగుభాగం రంద్రముగా నుండినయెడల ముత్యమునందలి శక్తి సంపన్నమైన దివ్యకిరణములు శరీరమునందు ప్రవేశించి ఫలసిద్దికి తోడ్పడగలదు.














మత్యం – Pearl 2, 11, 20, 29 సంఖ్యలలో జన్మించినవారికి. వృషభ, కర్కాటక రాశులవారు. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలలో పుట్టినవారు. సోమ, ఆదివారాల్లో పుట్టినవారు. నల్లముత్యం అన్నింటికన్నా విలువైంది. మానసిక ప్రశాంత్రత. సుఖనిద్ర. భార్యభర్తల మధ్య కలహాల నిరోధం. సంతానం లేనివారికి. కంటి వ్యాధులు నయం చేయడానికి.
















కెంపు - Ruby

కెంపు మాణిక్య రత్నము .

సూర్యగ్రహానికి అతి ప్రీతిపాత్రము ఎందువల్లననగా సూర్యగ్రహ సంభంధమైన వర్ణ, గుణతత్వములాదిగాగల సమస్తము కెంపునకు కూడా జెంది యుండటమే! పంచమహా భూతాలలో అగ్నితత్వము గల రత్నము కెంపు నవగ్రహములలో అగ్ని తత్వ గ్రహము రవి. ఈ ప్రకారము అన్ని విషయాలలోను సూర్యగ్రహాన్ని బోలిన గుణతత్వాలు కెంపుకున్నవి.









ఈ రత్నము త్రిదోషమునందలి పిత్త గణదోషములను శమింపజేయగలదు. సమాన వాయువు దీని సంకేతమై ఉన్నది. పురుషజాతికి చెందిన ఈ కెంపు శరీరమందలి మణిపూర చకమునందు తన కాంతి పుంజములను ప్రసరింపజేసి, కళ్ళదృష్టి, హృదయము, మెదడు అను అవయవములపై తన ప్రభావము చుపగలదు.





 కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాడ అను నక్షత్రములందు బుట్టినవారు ఏ కాలమునందైనను కెంపును ధరించుటకు అభ్యంతరముండదు. ఇతర నక్షత్ర జాతకులు వారి జన్మకాలీన దశాంతర్దశలు-గోచారము మొదలగు విషయములు గమనించి సూర్యగ్రహము బలహీనుడై దుష్ట ఫలితములనిచ్చుచున్నప్పుడు స్వచ్ఛమైన కెంపును ధరించిన యెడల వారికి సూర్యగ్రహారిష్టము తొలగి వివిధ శుభఫలితములు కలుగుచుంటవి.











 జాతమునందు రవిగ్రహము 6-8-12 ఆధిపత్యములు కల్గుట 6-8-12 అధిపతులతో కలియుట, లేక షష్ఠాష్ట వ్యవస్థానములందు పాపగ్రహ సహితుడై ఉండుట, షడ్వర్గబలము లోపించుట, అష్టక వర్గమునందు హీనబిందువులు కలిగియుండుట, మొదలగు దుర్లక్షణములు సంభవించి బలహీనుగై అతని (రవి)యొక్క దశాంతుర్దశాది కాలములందు వ్యతిరేక, దుష్టఫలితముల నిచ్చుచున్నప్పుడు ఆ దోషపరిహారమునకు కెంపును ధరించవలెను. 














కెంపుద్వార కలిగే శుభయోగాలు : 

ఉత్తమమైన జాతి కెంపులు శాస్త్రీయ పద్ధతులలో ధరించిన వారికి ముఖ్యంగా శరీర ఆరోగ్యం సక్రమమైన పద్ధతులలో కొనసాగి ఉల్లాసంగా వుంటారు. శరీరంలో కలిగే అనేక విధములైన అనారోగ్యాలను ఈ కెంపు యొక్క కాంతిపుంజాలు నివారణగావించి దేహము యొక్క ఆరోగ్య పరిస్థితిని సక్రమంగా వుంచుతుంది. మాణిక్య రత్నధారణ వలన మానవుని మేధస్సు అభివృద్ది జెందగలదు. జ్ఞాపకశక్తి అధికంగా లభించి విద్యార్థులకు పరీక్షలలో విజయం చేకూరగలదు. దారుణమైన శిరోవ్యాధులు, హృదయరోగములు, క్షయ, అపస్మారకము మూర్ఛ నివారణమై తేజోవంతులుకాగలరు. ఆత్మస్థైర్యం చేకూరి ప్రజ్ఞావంతులుగాను, ప్రతిభావంతులు గాను మనగలరు. రాజకీయ సంభంధమైన అనేక కార్యాలలో ఎదురయ్యే అవరోధాలు తొలగిపోయి విజయం చేకూరగలదు. యింకా కోర్టు వ్యవహారాలు సులబంగా పరిష్కరించబడి మేలుకలుగగలదు. 





ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఈ కెంపు జాతికి చెందిన కౌస్తుభమణి ధరించి మహాభరతంలో సాటిలేని రాజకీయ చాతుర్యము ప్రదర్శించి విజయాన్ని పొందటం అందరికీ తెలిసిన విషయమే! కెంపుకు రవిగ్రహధిపత్యము కలుగుటవలన సూర్య గ్రహము, ఆరోగ్య్టమునకు, శరీరమునకు కీర్తి ప్రతిష్టలకు ప్రధాన గ్రహమగుట వలన, రవి బలంలోపించిన వారికి సామాన్యంగా, అకారణ నిందలు, పరపతి లోపించుట, గౌరవభంగము, శరీర కృశత్వము, అనారోగ్యములు, కుటుంబకలహములు, నేత్రభాధలు, శిరోహృదయ భాధలు తరచుగ కలుగుచుంటవి. రాజకీయంగా సమస్యలు చిక్కులుగలవారు, ఉద్యోగ సంభంధమైన కష్టనష్టములు కలుగుచున్నవారు, దురభ్యాసములకులోనైనవారు, 


తమ జాతకమునందు సూర్యగ్రహము, బలహీనుడై వున్నాడని గ్రహించి జాతి కెంపును ధరించలి. 










కెంపునుధరించే పద్దతి:

 ఉత్తమమైన రత్నాన్నైనా పరీక్షించకుండా ధరించకూడదు. వివిధ రకములకు చెందిన కెంపులలో పరీక్షయందు నిలచి ప్రకాశవంతమైన ఉత్తమమైనదిగా నిర్ణయించిన రత్నాన్ని షుమారు 30 దినములు తమ వద్ద నిడివిగా ఉంచుకొనిన అనుభవంలో దాని గుణ ఫలితాలు అనుకూలంగా నున్నచో లేవో గమనించాలి శుభ ఫలితాలనిచ్చే రత్నం ఉంగరంలో ధరించటానికి అభ్యంతర ముండదు. కెంపులు ఉంగరమునందిమిడ్చి ధరించుట కొరకు గుండ్రని ఆకారము గలవి గానీ లేక నలుచదరపు ఆకారముననున్నవిగానీ శ్రేష్టములు. ఇట్టిరత్నములు 5 రతుల (15 వడ్డగింజల బరువుకు )తగ్గరాదు బంగారంలేక వెండి పంచలోహములలో దేనిచేనైనను ఉంగరము చేయించిన తర్వాత పుష్యమీ నక్షత్ర ఆదివారముగానీ, హస్తానక్షత్రయుక్త ఆదివారమునందుగానీ అమావాస్యా ఆదివారమునందుగానీ మధ్యాహ్నం 1-2 గంటల మధ్యగానీ (ఈ కాలంలో వర్జ్యం ఉండరాదు.)ఉంగరంలో బిగించి ఆ ఉంగరమును ఒక దినము ఆవుపాల యందు, ఆ మరుదినము ధాన్యమునందును, మూడవ దినము మంచినీటి యందును వుంచి నిద్ర గావింపజేసి శుద్దిచేయాలి. పంచాంగం శుద్ది అనగా ధరించువారికి తారాబలం చంద్రబలములు కలిగి శుభకరమైన తిదులలో ఆది, సోమ, బుధ, గురువారములయందు, మేష సింహ, ధనుర్లగ్నములు గల సమయములందు పూజించి కుడిచేతికి అనామికా వ్రేలికి ధరించాలి ఉంగరమును ధరించుటకు ముందుగా గంధపుష్పాక్షతములచే పూజించి ధూపదీపములర్పించి కొబ్బరికాయ కొట్టి, ఫలక్షీరములు నివేదన గావించి, భక్తిపూరస్సరముగా నమస్కరించి, గురువుని, గణపతిని, సూర్యభగవానుని స్మరించి, ఉంగరమును కుడిభాగమందలి అరచేతిలో పెట్టుకొని సూర్యునికెదురుగా నిలబడి "ఓం హ్రీం శ్రీం క్లీం సః సూర్యాయ నమః స్వాహా" అనే మంత్రాన్ని 108 సార్లు స్మరించి ఉంగరమును ముమ్మారు కళ్ళకద్దుకొని వ్రెలికి ధరించాలి. ఉంగరములో రత్నానికి అడుగుభాగంగల స్థానంలో రంధ్రం వుండి రత్నమునందలి దివ్యకిరణములు శరీరమునందు ప్రవేశించవలెను.











కెంపు – Ruby 1, 10, 19, 28 తేదీలలో జన్మించినవారికి.మేష, కర్కాటక, సింహ, వృశ్చిక రాశులలో పుట్టినవారు. ఆదివారం పుట్టినవారు. జనవరి నెలలో పుట్టినవారు. దానిమ్మ గింజ రంగులో ఉంటుంది. కెంపు వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఆయువృధ్ధి. పట్టుదల. మనోధైర్యం. కంటి, కిడ్ని వ్యాధులకు ఉపశమనం.