జ్యోతిష్యం "శాస్త్రం". సూర్యోదయం ప్రభావంతో మన శరీరాలు హార్మోన్లను విడుదల చేయడంతో మనం మేల్కొంటాం. అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, దూరంగా జరగడం వంటి మార్పుల వల్ల సముద్రపు అలల్లో తేడాలు వస్తాయి. అందువల్లనే మనవ మరియు ప్రకృతిలో విపరీత ధుర్ఘటనలు చూస్తున్నాము. పౌర్ణమి అమావాస్య ఎప్పుడు వస్తుందో మూడనమ్మకము అన్నవాడు చెప్పలేడు. మనపై మనకు విశ్వాసం లేకపోతే, ఇతరత్రా విషయాలేవీ పెద్దగా పనిచేయవు. అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి. సర్వే జనా సుఖినోభవంతు.
12 February 2016
అష్టాదశ పురాణాలు
మానవులు పాటించవలసిన ధర్మాలు, చేయవలసిన పనులు, దర్శించవలసిన క్షేత్రాలు, తరించే తీర్ధాలు గురించి వివరించేవి పురాణాలు .ఇవి కధల రూపంలో ఉంటాయి.పురాణం అంటే సర్గ, ఉపసర్గ, మన్వంతరం, వంశం, వంశానుచరిత్ర అనే పంచలక్షణాలు కలిగి ఉంటుంది.
శ్రీ మహావిష్ణువు అంశ వల్ల జన్మించిన శ్రీ వ్యాసభగవానుడు అష్టాదశ పురాణాలు, వేద విభాగం, బ్రహ్మ సూత్రాలు, మహాభారత రచన చేసిన మహర్షి, పురాణలు రచించినది వ్యాస మహర్షి అయితే వాటిని శౌనకుడు మొదలగు నైమిశారణ్య వాసులకు మరియు ఎనభైఎనిమిది వేల ఋషులకు తెలియజేసినది సూతమహాముని. వాటిని జనారణ్యానికి తెలిపినది శౌనక మహాముని మరియు ఆ ఋషిపుంగవులు. వ్యాసభగవానుడు రచించిన పద్దెనిమిది పురాణాల పేర్లు ఈ క్రింద శ్లోకంగా కూర్చబడినది.
మద్వయం భద్వయం చైవ
బ్రత్రయం వ చతుష్టయం
అనాప లింగ కూస్కాని
పురాణాని ప్రచక్షత
మద్వయం : " మ" కారంతో రెండు. అవి 1.మత్స్య పురాణం,
2.మార్కండేయ పురాణం.
భద్వయం: " భ" కారంతో రెండు. అవి 3.భాగవత పురాణం,
4.భవిష్యత్ పురాణం.
బ్రత్రయం: " బ్ర" కారంతో మూడు. అవి 5.బ్రహ్మపురాణం,
6.బ్రహ్మవైవర్తన పురాణం, 7.బ్రహ్మాండ పురాణం.
వచతుష్టయం : " వ" కారంతో నాలుగు. అవి 8.వాయుపురాణం,
9. వరాహపురాణం,
10.వామనపురాణం,
11.విష్ణు పురాణం.
అనాపలింగ కూస్కా : "అ" కారంతో 12.అగ్ని పురాణం,
" నా" కారంతో
13. నారద పురాణం, " ప" కారంతో 14.పద్మ పురాణం", "లిం" కారంతో
15. లింగపురాణం, " గ" కారంతో 16.గరుడపురాణం, " కూ" కారంతో 17.కూర్మపురాణం. మరియు " స్క" కారంతో
18.స్కాందపురాణం అనేవి మొత్తం పురాణాల పేర్లు.
Subscribe to:
Posts (Atom)