26 February 2016

పూజాకార్యక్రమాలు


ప్రస్తుతకాలం లో పూజాకార్యక్రమాలు శాస్త్రోక్తంగా ఆచరించాలి అనుకునే వారు ఆచరించ లేక పోతున్నారు.
అసలు పూజా కార్యక్రమాలు అంటే ఏమిటి అనే విషయానికి వస్తే పూజా కార్యక్రమాలు వేదముల సారాంశమే.


ఈ పూజా కార్యక్రమాలు మానవుని జన్మించిన దగ్గర నుండి గతించే వరకు షోడశ కర్మలు ఆచరించాలి. దీనిలో అంత్యేష్టి షోడశ కర్మ. దీనిని పరిగణన లోకి తీసుకోకుండా ఉంటే పంచదశ కర్మలు అవి.
గర్భాదానము .
సీమంతం .
జాతకకర్మ నామకరణం .
అన్నప్రాశన .
ఉపనయనం .
వైశ్వ కర్మ .
వ్రతం .
ప్రాజా పత్య వ్రతం
సౌమ్య వ్రతం.
ఆగ్నేయ వ్రతం .
వైశ్వ దేవ వ్రతం.
స్నాతక వ్రతం .
వివాహం .
పుట్టినరోజు.
ఈ కార్యక్రమాలన్నియు చతుర్వేదముల సారాంశం.
మన ఆచారాలను సాంప్రదాయాలను వదిలి పెట్టి వ్యాపారాల నిమిత్తం,ఉద్యోగాల నిమిత్తం మరియు మన అవసరాల నిమిత్తం వేరే ప్రదేశాలకి వెళ్ల వలసివస్తుంది.అచ్చట మన సాంప్రదాయముల ప్రకారం పూజా కార్యక్రమాలన్నియు ఆచరింప వలెను.



నిత్యములు,నైమిత్తికములు,స్నాన సంధ్యా నుష్టములు అనెడు కర్మలు ఆచరించుట ప్రతీ వ్యక్తికీ పరమ ధర్మమనియు ముఖ్య కర్తవ్య మనియు వేదాది సమస్త శాస్త్రము లందు చెప్పబడి ఉన్నది .







ప్రతీ వ్యక్తి కి మూడు విధముల ఋణములు ఉండును.అవి దేవ ఋణం,ఋషి ఋణము,పితృ ఋణము. "యత్కృత్వా నృణ్య మాప్నొతి దైవాత్ పై త్ర్యాచ్చ మానుషాత్" అని చెప్పినట్లు గా నిత్య కర్మలను చక్కగా ఆచరించుట వలన మానవుడు ఈ త్రివిధ ఋణముల నుండి విముక్తుడవును.



మానవ జన్మమును సఫల మొనర్చుట కై మానవ మాతృడయిన ప్రతీ వ్యక్తి నిత్య పూజా కార్యక్రమాలను నియామను సారంగా ఆచరించ వలయును.



అసలు బ్రాహ్మణుడు అంటే అర్ధం తెలుసుకుందాం బ్రహ్మ అస్య ఆస్తీతి బ్రాహ్మణః! బ్రహ్మ- బ్రహ్మ విద్య – వేద విద్య -జ్ఞాన విద్య అస్య - ఇతనికి ఆస్తి ఇతి - ఉన్నది కనుక బ్రాహ్మణుడు అగుచున్నాడు. యజనం – యజ్ఞ చేయుట యాజనం - యజ్ఞము చేయించుట అధ్యయనం – వేదము చదువట అధ్యాపకం – వేదము చెప్పుట దానము - దానము చేయుట ప్రతి గ్రహం - దానం తీసుకొనుట ఈ షట్కర్మములు కలవాడు బ్రాహ్మణుడు.








సదాచారము ,సత్ప్రవర్తన ,పరోప కార బుద్ధి ,సత్యము,సంస్కృతి,సాంప్రదాయము,భక్తి శ్రద్ధలు,వినయ విధేయతలు,ఏక పత్నీ వ్రతము,ధర్మకార్యా సక్తి,ఉపనయన సంస్కారము,సంధ్యా వందనము,నిత్యాగ్ని హవనములు,శాస్త్ర విజ్ఞానము మున్నగు సద్గుణములు కలవారు బ్రాహ్మణులు.

బ్రాహ్మణులు అనగా ఒక కులమునకు,ఒక మతమునకు చెందిన వారు కాదు. ఎవరైనా బ్రాహ్మణోత్తమును పొంద వచ్చును. జన్మనా జాయతే శూద్రః ! కర్మణే జాయతే ద్విజః ! వేదపాటేన విప్రః స్యాత్ ! బ్రహ్మ జ్ఞానేన బ్రాహ్మణః!! (స్కాంద పురాణము ) .
జన్మించినది మొదలు ఉపనయనము వరకు శూద్రత్వం,ఉపనయన సంస్కారము చేత ద్విజత్వము,వేద అధ్యయనము చేత విప్రత్వము,బ్రహ్మ జ్ఞానము చేత బ్రాహ్మణత్వము వచ్చును.



అవశ్య మను భోక్తవ్యమ్ ! కృతం కర్మ శుభా శుభం !! నా భుక్తమ్ క్షీయతే కర్మ ! కల్ప కోటి శతైరపి !!
జీవుడు తాను చేసిన పుణ్య పాప కర్మల ఫలాన్ని తప్పకుండా అనుభవించి తీరవలసిందే నని కొన్ని వందల కోట్ల కల్పాల కాలం జరిగిన చేసిన కర్మ అనుభవించ కుండా నశించదని పై శ్లోకం చెబుతుంది . ఇది ఋషి వాక్కు,పరమ ప్రమాణం. జనన మరణాత్మక మయిన ఈ సంసార మహా ప్రవాహం లో పాపము,పుణ్యము అప్రయత్నము గా జరిగి పోతూనే ఉంటాయి. పాపము వలన దుఃఖము,పుణ్యము వలన సుఖము కల్గును.దుఃఖదాయకములగు కర్మలను ఆచరించరాదని, సుఖ దాయకములగు కర్మలను ఆచరించాలని మన మహర్షుల ఉపదేశం. ఈ అంశాలను దృష్టి లో పెట్టుకుని మహర్షులు అనేక ఉపాయాలను సూచించారు.


అవి నవగ్రహ హవనం,చండీ హవనం,నవగ్రహ శాంతి, ఇలా ఇత్యాదికములు ఎన్నో పూజా కార్యక్రమములు ఉపదేశించారు.








ప్రతి రోజు పూజ చేయు విదానము.


గణపతి పూజ
పసుపు గణపతి
శ్రీ గురుభ్యోనమః
ఏపూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి .






పూజా ప్రారంభం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. (వినాయకుని ధ్యానించవలెను).
(ఎడమ చేతిలో ఒక ఉద్ధరిణె (చెంచా) తో నీళ్ళు పట్టుకుని-)
శ్లో అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాఅంతర శ్సుచిః ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః
(అనుకుని అనంతరం కుడిచేతి బొటన వ్రేలితో - ఆ ఉద్ధరిణె లోని నీళ్ళను తమ తలపై మూడు సార్లు చల్లుకొనవలెను).











దీపం
ఓం గురుభ్యో నమః
దీపమును వెలిగించి - గంధ పుష్పాదులతో అలంకరించి - దీపదేవతాభ్యో నమః అని నమస్కరించుకోవాలి.
దీప శ్లోకం : ఘ్రుతవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితోభవ
ఆచమన కేశవ నామములు
ఓం కేశవాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)
ఓం నారాయణాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)
ఓం మాధవాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)
ఓం గోవిందాయ నమః (అనుచు - ఎడమ చేతిని కుడి అరచేతితోను)
ఓం విష్ణవే నమః (అనుచు – కుడి చేతిని ఎడమ అరచేతితోను కడుగుకొనవలెను)
ఓం మధుసూదనాయ నమః (అనుచు బొటన వేలితో పై పెదవిని)
ఓం త్రివిక్రమాయ నమః (అనుచు బొటన వేలితో పై పెదవిని)
ఓం వామనాయ నమః (అనుచు శిరమున జలము చల్లుకొనవలెను)
ఓం శ్రీధరాయ నమః (అనుచు శిరమున జలము చల్లుకొనవలెను)
ఓం హ్ఋషికేశాయ నమః (అనుచు ఎడమ అరచేతిపైనను )
ఓం పద్మనాభాయ నమః (అనుచు రెండు పదముల పైనను)
ఓం దామోదరాయ నమః (అనుచు శిరము పైన నీరు చల్లుకొనవలెను)
ఓం సంకర్షణాయ నమః (అన్ని వేళ్ళు ముడిచి ఆ వేళ్ళ మొదళ్ళతో గడ్డమును తాకవలెను)
ఓం వాసుదేవాయ నమః (అనుచు ఎడమ ముక్కును)
ఓం ప్రద్యుమ్నాయ నమః (అనుచు కుడి ముక్కును అంగుష్ఠ (బొటనవేలు) తర్జనులతో (చూపుడు వేలు) తాకవలెను)
ఓం అనిరుద్ధాయ నమః (అనుచు ఎడమ కన్నును)
ఓం పురుషోత్తమాయ నమః (అనుచు ఎడమ చేతిని )
ఓం అధోక్షజాయ నమః (అనుచు ఎడమ చేతిని)
ఓం నారసింహాయ నమః (కుడి చేతిని అంగుష్ఠ (బొటనవేలు) అనామికలతో (ఉంగరం వేలు) తాకవలెను
ఓం అచ్యుతాయ నమః (అనుచు నాభిని అంగుష్ఠ కనిష్టికలతో (బొటన చిటికెన వేళ్ళతో) తాకవలెను)
ఓం జనార్ధనాయ నమః (అనుచు అరచేతిని హృదయమునకు ఆనించాలి)
ఓం ఉపేంద్రాయ నమః (అనుచు శిరమును కరాగ్రముతో తాకవలెను)
ఓం హరయే నమః (అనుచు బాహు మూలములను వేళ్ళను ముడుచుకొని తాకవలెను)
ఓం శ్రీకృష్ణాయ నమః.
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
శ్లోకము చదివి - అక్షతలు కొన్ని వాసన చూసి ఎడమచేతి ప్రక్కనుండి వెనుకకు వేసుకోవాలి.
అథః ప్రాణాయామః (కుడి చేతి బొటన వ్రేలు, మధ్య వ్రేలులతో రెండు నాసికాపుటములను బంధించి)
ఓం భూః, ఓం భువః , ఓం సువః, ఓం జనః, ఓం తపః , ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధీయోయనః ప్రచోదయాత్
ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం, (మూడు సార్లు జపించవలెను)
అనంతరం అక్షతలు తీసుకుని సంకల్పం చెప్పుకొనవలెను.










సంకల్పము:
ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభన ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, కృష్ణా-గోదావర్యోర్మధ్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐస్వర్యాభి వృద్ధ్యర్థం , ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం , ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం, సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవద్భిః ఉపాచారైః సంభవితా నియమేన, యావచ్చక్తి, శ్రీ మహా గణాధిపతి దేవతా ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే...
అంటూ అక్షతలు ఉదకం పళ్ళెంలో విడువవలెను.













 కలశపూజ:
కలశం అంటే నీళ్ళు వుండే పాత్ర కు గంధము, కుంకుమ అలంకరించి అక్షతలు, పుష్పము వేసి ఎడమ అరా చేతితో కింద పట్టుకొని కుడిఅరచేతితో పైన పట్టుకుని
తదంగ కలశ పూజాం కరిష్యే...
శ్లో. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా
ఋగ్వేదో యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగై శ్చ సాహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు శ్రీ మహా గణాధిపతి పూజార్థం దురితక్షయ కారకాః
(కొంచెం కలశం లోని జలమును పూజా ద్రవ్యాల మీద చల్లుతూ) పూజాద్రవ్యాణి (దేవుడి మీద చల్లి ) దేవం (తమ మీద చల్లుకుని) ఆత్మానం సంప్రోక్ష్య.


శ్లో. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా॥

ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- ధ్యాయామి - ధ్యానం సమర్పయామి. (ఒక పుష్పమును దేవుడి/దేవి వద్ద వుంచవలెను).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- ఆవాహయామి (ఆహ్వానిస్తూ ఒక పుష్పమును దేవుడి/దేవి వద్ద వుంచవలెను).

ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- రత్న సింహాసనం సమర్పయామి (కొన్ని అక్షతలు సమర్పించవలెను).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- పాదయోః పాద్యం సమర్పయామి ( పుష్పం తో నీరు దేవుడి/దేవి కి పాదములు కడగాలి - కడిగినట్టు భావించాలి ).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- దేవతాయై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (పుష్పంతో నీరు దేవుడి/దేవికి చేతులు కడగాలి - కడిగినట్టు భావించాలి ).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- ముఖే ఆచమనీయం సమర్పయామి (పుష్పంతో నీరు దేవుడి/దేవి కి ముఖం కడుగుటకు ఇవ్వాలి ).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- మధుపర్క స్నానం కరిష్యామి రూపేణ అర్ఘ్యం సమర్పయామి (పుష్పం తో నీరు దేవుడి / దేవికి మధుపర్క స్నానానికి సమర్పించాలి).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- శుద్ధోదక స్నానం సమర్పయామి. (పుష్పం తో నీరు దేవుడి. దేవికి స్నానం చేస్తున్న భావన చేస్తూ సమర్పించాలి).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- వస్త్ర యుగ్మం సమర్పయామి - వస్త్ర యుగ్మం రూపేణ అక్షతాన్ సమర్పయామి (వస్త్రము అలంకరిస్తున్న భావన చేస్తూ అక్షతలు సమర్పించాలి).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- ముఖ ధారణార్థం తిలకం సమర్పయామి (కుంకుమ ధారణ చేయాలి).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- యజ్ఞోపవీతం సమర్పయామి – యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి(అక్షతలు వేయాలి).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- శ్రీ గంధాం ధారయామి - (గంధం సమర్పించాలి).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- సర్వాభరణాన్ ధారయామి (అక్షతలు సమర్పించాలి).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- సమస్త పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి (పువ్వులు/ అక్షతలు సమర్పించాలి).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- (యథా శక్తి మన ఇష్ట దైవము యొక్క మంత్ర జపమును, అష్టోత్తర శత నామాన్ని, కాని లేదా ప్రార్థన శ్లోకము ను గాని చదువుకొన వలెను.
ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణాయ నమః,
ఓం లంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం ధూమకేతవే నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచం ద్రాయ నమః,
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః,
ఓం శూర్పక ర్ణాయ నమః,
ఓం హేరంభాయ నమః,
ఓం స్కందపూర్వజాయ నమః,
ఓం గణాధిపతయే నమః.
షోడశ నామ పూజా సమర్పయామి
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- ధూపమాఘ్రాపయామి (అగరుబత్తి వెలిగించి దేవుడికి/ దేవికి చూపించాలి).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- దీపం దర్శయామి (దీపం చూపించాలి).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- నైవేద్యం సమర్పయామి (నివేదనార్పణా విధి: నివేదన చేయు పదార్థముల చుట్టూ గాయత్రి మంత్ర స్మరణ చేస్తూ
ఓం భూర్భువస్సువః తథ్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయా త్ (అంటూ కొంచెం జలమును చిలకరించి)
సత్యం త్వర్తేన పరిషం చామి (మూడు సార్లు పుష్పము తో గాని , ఉద్ధరిణి తో గాని అన్నింటి చుట్టూ సవ్య దిశ లో (ఎడమ నుండి కుడి వైపుకు ) తిప్పాలి.
అమృతమస్తు (నైవేద్యం పై జలమును వుంచి) అమృతోపస్తర ణమసి (అదే నీటిని దేవుడి / దేవి వద్ద ) ఉంచాలి.
దిగువ మంత్రము లతో భగవంతునికి ఆరగింపు (తినిపిస్తున్నట్టు - బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేళ్ళ తో ) చూపవలెను.
ఓం ప్రాణాయ స్వాహా-- ఓం అపానాయ స్వాహా -- ఓం వ్యానాయ స్వాహా -- ఓం ఉదానాయ స్వాహా -- ఓం సమానాయ స్వాహా --ఓం పరబ్రహ్మణే నమః --- అంటూ నివేదించవలెను.
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- తాంబూలం సమర్పయామి - తాంబూలం రూపేణ అక్షతాన్ సమర్పయామి.(తాంబూలం చూపించుట కానీ, అక్షతలు గాని సమర్పించాలి).














ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి (కర్పూర హారతి ఇవ్వాలి).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- మంత్ర పుష్పం సమర్పయామి (అక్షతలు, పువ్వులు సమర్పించవలెను).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- నమస్కారం సమర్పయామి (ఆత్మ ప్రదక్షిణ నమస్కారములు చేయవలెను)
శ్లో యానికానిచ పాపాని జన్మాంతర క్రుతానిచా
తాని తాని ప్రణశ్యంతు ప్రదక్షిణం పదే పదే
పాపాహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ
త్రాహి మాం నరకాత్ ఘోరాత్ శరణాగత
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరా
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, ఆందోళిక నారోహమావహయామి, అశ్వా నారోహమావహయామి, గజనారోహమావాహయామి
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- సమస్త శక్త్యోపచారాన్, రాజ్యోపచారాన్, భక్త్యోపచారాన్ , దేవ్యోపచారాన్ సమర్పయామి.
(అంటూ అక్షతలు సమర్పించవలెను).
అనయా , యథా శక్తి, మయా కృత ధ్యానావాహనాది షోడశోపచార పూజాయచ – శ్రీ విఘ్నేశ్వర దేవతా సుప్రసన్నా, సుప్రీతా వరదో భవతు.
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- (మనం యథా శక్తి చేసిన పూజలకు భగవంతుడు ప్రీతి చెంది మన కోరికలను తీర్చి, మనలను కాపాడాలని కోరుకుంటూ ) కాయేన వాచా మనసేంద్రియై ర్వాబుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారయణా యేతి సమర్పయామి.











ఉద్వాసన:
'ఓం యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః
తాని ధర్మాణి , ప్రధ మాన్యాసన్
తేహ నాకం మహిమానస్ప చంతే
యత్ర పూర్వే సాధ్యా స్సంతి దేవాః
శ్లో॥ యస్య స్మృత్యాచ నో మొక్త్యాత పః పూజా క్రియాది షు: న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం
మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం జనార్ధన, యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే,
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయాచ భగవా న్సర్వాత్మక శ్రీ గణపతి దేవతా స్సుప్రీతో వరదో భవతు.
శ్రీ వినాయక ప్రసాదం శిరసా గుహ్ణామి. నమస్కరించి స్వామి వద్ద నున్న అక్షతలు తీసి తలపై వేసుకొని ప్రసాదమును (అనగా అక్షతలు మాత్రమే) స్వీకరించ వలెను.
ఆతరువాత మరల ఆచమనం చేసి చేయదలుచుకున్న వ్రతం గాని, పూజ కానీ ప్రారంభించ వలెను.
-------
దీపారాధనకు నువ్వుల నూనె గాని ,కొబ్బరి నూనె గాని ,ఆవు నెయ్యి గాని వాడవచ్చును. ఈ విధంగా దీపం వెలిగించి గంటను వాయిస్తూ నమస్కరించి ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను .













ఘంటా నాదము :
శ్లో || ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్
కుర్యాద్ఘంటార వం తత్ర దేవతా హ్వాహాన లాంచనమ్
మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించరాదు. పూజకు విడిగా ఒక గ్లాసు గాని ,చెంబు గాని తీసుకుని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించ వలెను. క్షీరాబ్ది ద్వాదశి రోజున దీపదానము అతి ముఖ్య మైనది . ఆ రోజు దీపదానము చేయువారు స్వర్గ ప్రాప్తిని పొందుదురు. దీపమునకు ఆవు నెయ్యి ఉపయోగించ వలెను అది దొరకనిచో మంచి నూనె వాడవచ్చును. ఆవు నెయ్యితో దీపము వెలిగించి దానము చేసినట్లయిన జ్ఞాన లాభములు మోక్ష ప్రాప్తి కలుగును.










లక్శ్మీ నారాయణుల పూజ:
పూజకు కావలసిన వస్తువులు :లక్ష్మీ
నారాయణుల యొక్క బొమ్మ (ప్రతిమ ) (తమ శక్తి కొలది బంగారముతో నైనను ,వెండితో
నైననూ లేక మట్టితో నైనను తీసుకొనవలెను ), లేదా చిత్ర పటము ,కొబ్బరికాయలు ,
బెల్లము, ఖర్జూరము, చెరకు, పళ్ళు ,పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం, హారతి
కర్పూరం, అక్షతలు, అగ్గిపెట్టె ,
అగరువత్తులు,వస్త్ర,యజ్నోపవీతములు,ప్రత్యేక నివేదనకు పిండివంటలుమొదలగునవి.
పిమ్మట యజమానులు (పూజ చేసేవారు ) ఈ దిగువ కేశవ నామాలను స్మరిస్తూ ఆచమనం
చేయాలి .ఈ నామములు మొత్తం 24 కలవు.
1  ఓం కేశవాయ స్వాహా " అని చెప్పుకొని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి
2 . " ఓం నారాయణాయ స్వాహా "అనుకొని ఒకసారి
3 . " ఓం మాధవాయ స్వాహా " అనుకొని ఒకసారి జలమును పుచ్చుకోనవలెను .తరువాత
4 . " ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగు కోవాలి .
5 . " విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు , బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి .
6 . " ఓం మధుసూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
7 . "ఓం త్రివిక్రమాయ నమః " క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
8 ,9 ." ఓం వామనాయ నమః " " ఓం శ్రీధరాయ నమః " ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లు కోవాలి .
.10 . ఓం హృషీ కేశాయ నమః ఎడమ చేతిలో నీళ్ళు చల్లాలి .
11 .  ఓం పద్మనాభాయ నమః  పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లు కోవాలి .
12 . ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించు కోవలెను .
13 .ఓం సంకర్షణాయ నమః చేతి వ్రేళ్ళు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోనవలెను .
14 . ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకొనవలెను .
15 .16 . ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్దాయ నమః నేత్రాలు తాకవలెను .
17 .18 .ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాక వలెను
19 .20 ఓం నార సింహాయ నమః ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్పృశించ వలెను .
21 .ఓం జనార్ధనాయ నమః చేతి వ్రేళ్ళతో వక్ష స్థలం , హృదయం తాకవలెను .
22 . ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను .
23
.24 .ఓం హరయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమ చేతి తోను , ఎడమ
మూపురమును కుడి చేతితోను ఆచమనం చేసిన తరువాత ఆచమనం చేసి ,వెంటనే సంకల్పము
చెప్పుకోనవలెను .
ఆచమనము అయిన తరువాత ,కొంచెం నీరు చేతిలో పోసుకుని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకమును పటించవలెను .
శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః
  యేతేషామ విరోదేన బ్రహ్మ కర్మ సమారభే ||
ప్రాణాయామమ్య:
ఓం భూ : -ఓం భువః ఓం సువః - ఓం మహః -ఓం జనః ఓం తపః - ఓగ్ సత్యం -ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ దీయో యోనః ప్రచోదయాత్ - ఓం ఆపోజ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువ స్సువరోం అని సంకల్పము చెప్పు కొనవలెను.
















సంకల్పము : మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే అద్య బ్రాహ్మణః (ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు ) ద్వితీయ పరార్దె శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్బాగే శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీశైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీశైలమునకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను ), కృష్ణా గోదావర్యో : మధ్య ప్రదేశే (మనం ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను ), శోభన గృహే (అద్దె ఇల్లు ఐనచో వసతి గృహే అనియు , సొంత ఇల్లయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను ), సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిదౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన .......... సంవత్సరే , (ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగు చున్నదో ఆ సంవత్సరము యొక్క పేరు చెప్పుకొనవలెను. ) ......... ఆయనే , సంవత్సరమునకు రెండు ఆయనములు - ఉత్తరాయణము, దక్షిణాయనము . జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము , జూలై 15 కర్కాటక సంక్రమణము నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణము వరకు దక్షిణాయనం పూజ చేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను )...........ఋతు : (వసంత ,గ్రీష్మ , వర్ష మొ || ఋతువు లలో పూజ సమయములో జరుగుచున్న ఋతువు పేరు )............మాసే , (చైత్ర , వైశాఖ మొ || పన్నెండు మాసములలో పూజాసమయంలో జరుగు చున్న మాసం పేరు ) .......పక్షే , (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము , అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుచున్న సమయమున గల పక్షము పేరు ) ........తిధౌ , (ఆరోజు తిది ) .........వాసరే (ఆ రోజు ఏ వారమైనది చెప్పుకొని ) శుభ నక్షత్రే , శుభయోగే ,శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిధౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్ ...........గోత్రస్య ........నామధేయః, శ్రీమత్యః , గోత్రస్య ,నామదేయస్య అనియు, స్త్రీలైనచో శ్రీమతి , గోత్రవతి , నామదేయవతి, శ్రీమత్యాః ,గోత్ర వత్యాః, నామధేయవత్యాః , అనియు (పూజచేయువారి గోత్రము , నామము చెప్పి ) నామదేయస్యః ధర్మపత్నీ సమేతస్యః (పురుషులైనచో ) మమ సహ కుటుంబస్య ,క్షేమ స్థైర్య, వీర్య , విజయ ,అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ద్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం , పుత్ర పౌత్రాభి వృధ్యర్ధం,సకల విధ మనోవాంచాఫల సిద్ద్యర్ధం , శ్రీ తులసీ ధాత్రి సహిత శ్రీ లక్ష్మీ నారాయణ దేవతా ప్రీత్యర్ధం (ఏ దేవుని పూజించు చున్నామో ఆ దేవుని యొక్క పేరు చెప్పుకుని ) క్షీరాబ్ధి శయన వ్రతాభ్యాం కర్మ కరిష్యే . సంభవ ద్భిరుపచారై: సంభవతానియమేన సంభవతాప్రకారేణ యావచ్చక్తి (నాకు తోచిన రీతిలో ,నాకు తోచిన నియమములతో , నాకు తోచిన విధముగా ,భక్తి శ్రద్దలతో సమర్పించు కుంటున్న పూజ ) ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే .ఆదౌ నిర్విఘ్నేన పరి సమాప్యర్ధం గణాధిపతి పూజాం కుర్యాత్. తతః తులసి ధాత్రి సహిత లక్ష్మీ నారాయణ దేవతా ముద్దిశ్య తులసి ధాత్రి సహిత లక్ష్మీ నారాయణ దేవతా ప్రీత్యర్ధం కల్పోక్త విధానేన యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే || పిదప కలశారాదనను చేయవలెను.














కలశ పూజను గూర్చిన వివరణ :
వెండి,
రాగి , లేక , కంచు గ్లాసులు (లేదా పంచ పాత్రలు ) రెండింటిలో శుద్ధ జలమును
తీసుకుని ఒక దానియందు అక్షతలు , తమలపాకు ,పువ్వు ఉంచుకొనవలెను. రెండవ
పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను అద్దవలెను ఇట్లు
చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమును కాని , కుంకుమను గాని
పూయరాదు. గంధమును ఉంగరపు  వ్రేలితో పూయవలెను. కుంకుమ అక్షతలు వగైరా బొటన,
మధ్య, ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించ వలెను. యజమానులు (ఒక్కరైతే ఒకరు,
దంపతులైతే ఇద్దరూను ) ఆ కలశాన్ని కుడి చేతితో మూసి వుంచి ఇలా అనుకోవాలి .
ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదువవలెను .
మం || కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్ర స్సమాశ్రితః
      మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతాః ||
      ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
      అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితః
శ్లో || గంగైచ యమునే చైవ కృష్ణే ,గోదావరి ,సరస్వతి ,నర్మదా సింధు
   కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు.
ఇక్కడ
ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీ తులసీ ధాత్రి సహిత శ్రీ లక్ష్మీ
నారాయణ పూజార్ధం దురితక్షయ కారకాః (ఏ దేవుని పూజిస్తున్నామో ఆ దేవుని పేరు
చెప్పవలెను ) కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య  (కలశ మందలి ఉదకమును దేవునిపై
చల్లాలి) ,ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి ) ఓం
పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి ) కలశ మందలి
నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని ,ఆకుతో గాని చల్లాలి .
మార్జనము : ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్తాం గతోపివా
                 యస్మరే త్పుండరీ కాక్షం సభాహ్యాభ్యంతర శ్శుచి :||.
అని
పిదప కాసిని అక్షతలు ,పసుపు, గణపతిపై వేసి ,ఆయనను తాకి నమస్కరించి ప్రాణ
ప్రతిష్టాపన చేయవలెను. ప్రాణ ప్రతిష్ట అనగా శ్రీ తులసీ ధాత్రి సహిత శ్రీ
లక్ష్మీ నారాయణ ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తోస్తు తధాస్తు .
స్థిరోభవ, వరదోభవ ,సుముఖోభవ ,సుప్రసన్నోభవ. తరువాత ఇలా చదువుతూ
విఘ్నేశ్వరునికి నమస్కరించవలెను .













శ్లో || శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
   ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే ||
   సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజ కర్ణక :
   లంబోరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః
   ధూమ కేతు ర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః
   వక్ర తుండ శ్శూర్ప కర్ణో హీరంభః స్కంద పూర్వజః
   షోడ శైతాని నామాని యః పటే చ్చ్రుణు యాదపి
   విద్యా రంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా
   సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్త స్యన జాయతే ||.
పిదప
షోడశోపచార పూజను చేయవలెను. షోడశోప చారములనగా ఆవాహన ,ఆసనం, అర్ఘ్యం ,పాద్యం
,ఆచమనీయం ,స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం,
నైవేద్యం, తాంబూలం, నమస్కారం ,ప్రదక్షణములు మొదలగునవి.
షోడశోపచార పూజా ప్రారంభః
ధ్యానం :
శ్లో || దక్షిణాగ్ర కరే శంఖం పద్మంత స్వాప్యదః కరే
   చక్ర మూర్ధ్వ కరే నామే గదాంత స్యాయ్సదః కరే
   దదానాం సర్వ లోకేశం సర్వా భరణ భూషితం
    క్షీరాబ్ధి శాయనం దేవం ధ్యాయేన్నారాయణ ప్రభుం
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః ధ్యాయామి -ధ్యానం
సమర్పయామి అని విష్ణువును మనస్సున ధ్యానించి నమస్కరించవలెను.
ఆవాహనం :
శ్లో || ఆవాహయామి దేవత్వం పూజార్ధ మిహహే ప్రభో |
     ఆగచ్ఛ దేవ దేవేశ సర్వ దేవ గణై స్సహ ||
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః ఆవాహయామి ఆవాహనార్ధం
అక్షతాం సమర్పయామి. అనగా మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం
అట్లు మనస్సున స్మరిస్తూ అక్షతలు దేవునిపై వేయవలెను.
ఆసనం :
శ్లో || అనేత హార సంయుక్తం నానామణి విరాజితం
  రత్న సింహాసనం దేవ ప్రీత్యర్ధ ప్రతి గృహ్యతాం ||
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః నవరత్న ఖచిత సింహాసనం
సమర్పయామి . సింహాసనార్ధం అక్షతాం సమర్పయామి .దేవుడు కూర్చుండుటకై మంచి
బంగారు పీట వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను.
అర్ఘ్యం :
శ్లో || నిష్కళంక గుణా రాధ్య జగత్త్రితయ రక్షక
   అర్ఘ్యం గృహాణ మద్దత్తం శుద్దోదక వినిర్మితం
ఓం
శ్రీ తులసీ ధాత్రి సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః హస్తౌ : అర్ఘ్యం
సమర్పయామి .దేవుడు చేతులు కడుగు కొనుటకై నీళ్ళి స్తున్నామని మనసున తలుస్తూ
,ఉద్దరిణెతో నీరు వేరొక గిన్నెలో వదలవలయును.
పాద్యం :
శ్లో || పద్మనాభ సురారాధ్య పాదాంభుజ శుభ ప్రద
  పాద్యం గృహాణ భగవాన్ మయానీతం శుభావహం
ఓం
శ్రీ తులసీ ధాత్రి సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః పాదౌ : పాద్యం
సమర్పయామి.దేవుడు కాళ్ళు కడుగుకొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ
పువ్వుతో పంచ పాత్రలోని నీరు అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలవలెను .
















ఆచమనీయం :
శ్లో|| సర్వ రాధ్య నమస్తేస్తు సంసారార్ణవ తారక
  గృహాణ దేవ మదత్తం పరమాచామనీయకం
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి
.అంటూ దేవుని ముఖము కడుగు కొనుటకై నీళ్లిస్తున్నామని మనమున తలుస్తూ పైన
చెప్పిన పాత్రలో ఉద్దరిణెతో ఒక మారు నీరు వదలవలెను.
సూచన : అర్ఘ్యం , పాద్యం, ఆచమనం మొదలగువాటికి ఉద్దరిణెతో నీరు వేరొక పాత్రలో వదలవలెను .అరివేణంలోవదలరాదు.


మధుపర్కం :
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః మధుపర్కం సమర్పయామి
అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చుచున్నామని తలుస్తూ ,ఈ
మధుపర్కం ను ఆయన ప్రతిమకు అద్దవలెను. (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో
గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకున్న
దాన్ని మధుపర్కం అంటారు.)
పంచామృత స్నానం :
శ్లో|| స్వపాద పద్మ సంభూత గంగా శోదిత విష్ణవ
పంచామృతై స్నాపయిష్యే తతః శుద్దోద కేనేచ
ఓం
శ్రీ తులసీ ధాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః పంచామృత స్నానం
సమర్పయామి .అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవు
నెయ్యి , ఆవుపాలు ,ఆవు పెరుగు ,తేనె, పంచదార కలిపినా పంచామృతమును స్వామిపై
ఉద్దరిణెతో చల్లవలెను.















శుద్దోదక స్నానం :
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః శుద్దోదక స్నానం
సమర్పయామి .పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను.
వస్త్ర యుగ్మం :
శ్లో|| విర్యు వ్విలాస రమ్యేణ సర్వ వస్త్రేణ సంయతం
వస్త్ర యుగ్మం గృహణేదం భక్త్యా దత్తం మయా ప్రభో
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః వస్త్ర యుగ్మం
సమర్పయామి (యుగ్మ మనగా రెండు ) అనుచు వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు
బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో
అద్దినచో అది వస్త్రమగును.ఇటువంటివి రెండు చేసుకొనవలెను )స్వామివారి
ప్రతిమకు అద్దవలెను.
యజ్ఞోపవీతం :
శ్లో || నారాయణ నమస్తేస్తు నాక నాధాధి పూజితం
  స్వర్ణో పవీతం మద్దతం స్వర్ణ దం ప్రతి గృహ్యాతాం
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః ఉపవీతం సమర్పయామి
అనగా జందెమును ఇవ్వవలెను .ఇదియును ప్రత్తితో చేయవచ్చును. ప్రత్తిని
తీసుకుని పసుపు చేత్తో బొటన వ్రేలు ,మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ
పొడవుగా చేసి ,కుంకుమ అద్దవలెను. దీనిని పురుష దేవతా పూజకు మాత్రమే
సమర్పించ వలెను.
గంధం :
శ్లో || రమాలింగన సంసక్త కాశ్మీర వక్షసే :
  కస్తూరి మిళితం దాస్యే గంధం ముక్తి ప్రదాయకం
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః రమ్య గంధం సమర్పయామి.
ముందుగా తీసి పెట్టుకున్న గంధమును కుడి చేతి ఉంగరం వ్రేలుతో స్వామివారి
ప్రతిమపై చల్లవలెను.















అక్షతలు :
శ్లో || అక్షతాన్ ధవళాన్ శుభ్రాన్ పక్షి రాజ ధ్వజా వ్యయ
  గృహాణ దేవ దేవేశ కృపయా భక్త వత్సల
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి
.(అక్షతలకు కొద్ది బియ్యమును తడిపి పసుపు వేసి కలుపవలెను ) అక్షతలు
తీసుకుని స్వామివారి ప్రతిమపై చల్లవలెను.
పుష్ప సమర్పణ :
శ్లో || బిల్వపు దళ తులసీ దళ మల్లికాభి ,
  స్త్వాం పూజయామి జగదీశ్వర వాసుదేవః
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః పుష్పాణి సమర్పయామి
స్వామివారికి పువ్వులతో అలంకారము చేయవలెను. పిదప అధాంగ పూజను చేయవలెను .ఈ
క్రింది నామాలను చడువుచూ పుష్పములతో గాని ,పసుపు కుంకుమలతో గాని స్వామిని
పూజించవలెను.









అధాంగ పూజ :
పాదావనత
కేశాయ నమః పాదౌ పూజయామి , నివృత్తిని మేషాది కాలాత్మనే నమః జంఘే పూజయామి
,విశ్వరూపాయ నమః జానునీ పూజయామి ,జగన్నాదాయనమః గుహ్యం పూజయామి , పద్మనాభాయ
నమః నాభిం పూజయామి, కుక్షి స్థాకిల విష్టపాయ నమః కుక్షిం పూజయామి , లక్ష్మీ
విలస ద్వక్షసే నమః వక్షః పూజయామి ,చక్రాది హస్తాయ నమః హస్తాన్ పూజయామి,
కంబు కంటాయ నమః కంటం పూజయామి , చంద్ర ముఖాయ నమః ముఖం పూజయామి , వాచస్పతయే
నమః వక్త్రం పూజయామి , కేశవాయ నమః నాసికం పూజయామి , నారాయణే నమః నేత్రౌ
పూజయామి , గోవిందాయ నమః శ్రోత్రౌ పూజయామి, నిగమ శిరో గమ్యాయ నమః శిరః
పూజయామి , సర్వేశ్వరాయ నమః సర్వాణ్యం గాని పూజయామి. తరువాత అష్టోత్తర
శతనామావళి పూజ .దీని యందు 108 మంత్రములుండును. ఈ మంత్రములను చదువుచూ
పుష్పములతో కాని ,పసుపు కుంకుమలతో గాని స్వామిని పూజించవలెను .










అష్టోత్తర శతనామావళి :
ఓం విష్ణవే నమః ;
ఓం లక్ష్మీ పతయే నమః ;
ఓం కృష్ణాయ నమః ;
ఓం వైకుంటాయ నమః ;
ఓం గరుడ ద్వజాయ నమః ;
ఓం పరబ్రహ్మణే నమః ;
ఓం జగన్నాదాయ నమః ;
ఓం వాసుదేవాయ నమః ;
ఓం త్రివిక్రమాయ నమః
; ఓం హంసాయ నమః ;
ఓం సమగ్ర మదనాయ నమః ;
ఓం హరయే నమః ;
ఓం శుభప్రదాయ నమః ;
ఓం మాధవాయ నమః ;
ఓం పద్మనాభాయ నమః ;
ఓం హృషీ కేశాయ నమః ;
ఓం సనాతనాయ నమః ;
ఓం నారాయణాయ నమః ;
ఓం మధు పతయే నమః ;
ఓం రతా రోక్ష్య వాహనాయ నమః ;
ఓం దైత్యాంత కాయ నమః ;
ఓం శింసుమారాయ నమః ;
ఓం శ్రీ కరాయ నమః ;
ఓం కపిలాయ నమః ;
ఓం పుండరీ కాక్షాయ నమః ;
ఓం స్థితి ప్రత్యై నమః ;
ఓం పరాత్పరాయ నమః ;
ఓం వనమాలినే నమః ;
ఓం యజ్ఞ రూపాయ నమః ;
ఓం చక్ర రూపాయ నమః ;
ఓం గదాధరాయ నమః ;
ఓం ఉపేంద్రాయ నమః ;
ఓం కేశవాయ నమః ;
ఓం భూమజనకాయ నమః ;
ఓం శేష శాయినే నమః ;
ఓం చతుర్బుజాయ నమః ;
ఓం పాంచజన్య ధరాయ నమః ;
ఓం శ్రీ మతే నమః ;
ఓం శార్ జ్ఞ పాణాయ నమః ;
ఓం జనార్ధనాయ నమః ;
ఓం పీతాంబర ధరాయ నమః ;
ఓం దేవాయ నమః ;
ఓం సూర్య చంద్ర విలోచనాయ నమః ;
ఓం మత్స్య రూపాయ నమః ;
ఓం కూర్మ తనవే నమః ;
ఓం క్రోధరూపాయ నమః ;
ఓం హృషీ కేశాయ నమః ;
ఓం వామనాయ నమః ;
ఓం భార్గవాయ నమః ;
ఓం రామాయ నమః ;
ఓం హలినే నమః ;
ఓం కల్కినే నమః ;
ఓం హరా ననాయ నమః ;
ఓం విశ్వంభరాయ నమః ;
ఓం ధృవాయ నమః ;
ఓం దత్తాత్రేయాయ నమః ;
ఓం అచ్యుతాయ నమః ;
ఓం అనంతాయ నమః ;
ఓం రధ వాహనాయ నమః ;
ఓం ముకుందాయ నమః ;
ఓం ధన్వంతరే నమః ;
ఓం శ్రీనివాసాయ నమః ;
ఓం ప్రద్యుమ్నాయ నమః ;
ఓం పురుషోత్తమాయ నమః ;
ఓం శ్రీ వత్స కౌస్తుభ ధరాయ నమః ;
ఓం మురారాతయే నమః ;
ఓం అదోక్షజాయ నమః ;
ఓం ఋషభాయ నమః ;
ఓం మోహినీ రూపాయ నమః ;
ఓం ధరాయ నమః ;
ఓం సంకర్షనాయ నమః ;
ఓం ప్రుధవే నమః ;
ఓం క్షీరాబ్ది శాయినే నమః ;
ఓం భూతాత్మనే నమః ;
ఓం అనిరుద్దాయ నమః ;
ఓం భక్త వత్సలాయ నమః ;
ఓం నారాయణాయ నమః ;
ఓం గజేంద్ర వరదాయ నమః ;
ఓం త్రిగ్దామ్నే నమః ;
ఓం సూర్య మండల మధ్యగాయ నమః ;
ఓం సనకాది మునీ ధ్యేయాయ నమః ;
ఓం భగవాశతే నమః ;
ఓం శంకర ప్రియాయ నమః ;
ఓం వీర గందాయ నమః ;
ఓం ధరా కాంతాయ నమః ;
ఓం వేదాత్మనే నమః ;
ఓం బాదరాయ ణాయ నమః ;
ఓం భాగీ రదీ జన్మ భూమినే నమః ;
ఓం పాద పద్మాయ నమః ;
ఓం సతాం ప్రభవే నమః ;
ఓం స్వభవే నమః ;
ఓం విభవే నమః ;
ఓం ఘన శ్యామాతవాసనే నమః ;
ఓం శ్వేత ద్వీప వానినేవ్యాయ నమః ;
ఓం గోవిందాయ నమః ;
ఓం బ్రహ్మ జనకాయ నమః ;
ఓం కైటభాసుర మర్ధనాయ నమః ;
ఓం శ్రీధరాయ నమః ;
ఓం కాయ ణమః ;
ఓం జగత్కార ణాయ నమః ;
ఓం అవ్యయాయ నమః ;
ఓం దశావతారాయ నమః ;
ఓం శాంతాత్మనే నమః ;
ఓం లీలా మానుష విగ్రహాయ నమః ;
ఓం దామొధరాయ నమః ;
ఓం విరాట్ రూపాయా నమః ;
ఓం భూత భవ్య భవిత్రు భవనే నమః .
పిదప అగరువత్తిని వెలిగించి .......
ధూపం :
శ్లో || దశాంగం గగ్గులో పేతం చంద నాగరు వాసితం
  ధూపం గృహాణ దేవేశ ధూర్జటి స్తుత సద్గుణ
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః ధూప మాఘ్రాపయామి .ధూపం
సమర్పయామి అంటూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరుబత్తిని తిప్పుతూ
పొగను స్వామికి చూపవలెను.







దీపం :
శ్లో || అజ్ఞాన ద్వాంత నాశాయ అఖండా లోక శాలినే
  ఘ్రుతాకావర్తి సంయుక్త దీపం దాస్యామి శక్తితః
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః సాక్షాత్ దీపం
దర్శయామి అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాదనలో ఉన్న అదనపు వత్తులలో ఒక
దానిని తీసుకుని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ
దీపం స్వామికి చూపుతూ పై శ్లోకమును చదువవలెను .ధూప దీపానంతరం శుద్దాచమనీయం
సమర్పయామి.







నైవెధ్యం
శ్లో || పృదు కానిక్షు ఖండాంశ్చ కదళీ ఫల సంయుతం
  దాపయిష్యే భవత్ప్రీ త్యై గృహాణ సురవందిత
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః నైవెధ్యం సమర్పయామి
అని ఒక బెల్లం ముక్క, పళ్ళు, కొబ్బరికాయ మొదలగునవి స్వామివద్ద ఉంచి దానిపై
పువ్వుతో నీళ్ళు చల్లుతూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ ' ఓం భూర్భువ స్సువః ఓం
తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ ,దీయో యోనః ప్రచోదయాత్, సత్యం
త్వర్తేన  పరిషించామి ,(ఋ తంత్వా సత్యేత పరిషించామి అని రాత్రి చెప్పవలెను )
అమృతమస్తు అమృతో పస్తరణమసి , ఓం ప్రాణాయ స్వాహా , ఓం అపానాయ స్వాహా, ఓం
వ్యానాయ స్వాహా , ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం
సమర్పయామి అంటూ ఆరు మార్లు చేతితో (చేతిలోని ఉద్దరి ణెతో ) స్వామికి
నివేదనం చూపించాలి .పిదప ఓం తులసీదాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః
నైవేద్యా నంతరం 'హస్తౌ ప్రక్షాళయామి ' అని ఉద్దరిణెతో పంచ పాత్రలోని నీరు
ముందు చెప్పిన అర్ఘ్య పాత్ర (పంచపాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకునే
నీళ్ళ పాత్ర ) లో వదలాలి .తరువాత 'పాదౌ ప్రక్షాళ యామి ' అని మరొకసారి నీరు
అర్ఘ్య పాత్రలో ఉద్దరిణెతో వదలాలి .పునః శుద్దాచ మనీయం సమర్పయామి .అని
ఇంకొక పర్యాయం నీరు వదలాలి .










తాంబూలం :
శ్లో || ఫూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
  విస్తీర్ణ కర్పూరేణ సుశం మిశ్రమ తాంబూలం స్వీకురు ప్రభో
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః తాంబూలం సమర్పయామి
అని చెబుతూ తాంబూలమును (మూడు తమలపాకులు ,రెండు పోకచెక్కలు,అరటి పండు వేసి
)స్వామీ వద్ద ఉంచాలి .తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు
ఇస్తున్నామని తలుస్తూ ,' తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ' అంటూ
ఉద్దరిణెతో నీరు అర్ఘ్య పాత్రలో వదలాలి .పిమ్మట కర్పూరం వెలిగించి .












నీరాజనం :
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః నీరాజనం సమర్పయామి
నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో
వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి ,మూడుమార్లు తిప్పుచూ
,చిన్నగా గంట వాయించవలెను. అనంతరం మళ్ళీ పువ్వుతో నీరు హారతి కుంది చివర
వదులుతూ ' కర్పూర నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి ' అని చెప్పి
నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు
అద్దుకోవాలి. తరువాత అక్షతలు ,పువ్వులు ,చిల్లర డబ్బులు చేతితో పట్టుకొని.












మంత్రపుష్పం :
శ్లో || పుష్పాంజలిం ప్రదాస్యామి భక్త్యా దత్తా మిదం ప్రభో
   అనుగ్రహ హేణ మాం రక్ష దేవ దేవ దయానిధే
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః యధా శక్తి
మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పుకొని అక్షతలు ,పువ్వులు ,చిల్లర స్వామి
వద్ద ఉంచవలెను . పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణలు
చేయాలి .
ప్రదక్షిణం :
శ్లో || ప్రదక్షిణం కరిష్యామి సర్వ భ్రమ నివారణం
  సంసార సాగరాన్సాంత్వం ముద్దర స్వ మహాప్రభో
శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర క్రుతానిచ
  తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆత్మ ప్రదక్షిణ
నమస్కారాన్ సమర్పయామి చేతిలో అక్షతలు , పువ్వులు తీసుకొని లేచి నిలబడి
మూడుసార్లు ఆత్మ ప్రదక్షణ చేసి (అనగా తమలో తాము చుట్టూ తిరిగి ) పిమ్మట
శ్రీ స్వామికి ,అమ్మవారికి (లక్ష్మీ నారాయణులకు) సాష్టాంగ నమస్కారం చేసి
(మగవారు పూర్తిగా పడుకుని తలను నేలకు ఆన్చి ,ఆడువారు మోకాళ్ళపై పడుకుని
కుడికాలు ఎడమకాలుపై వేసి )తరువాత స్వామిపై చేతిలో ఉన్న అక్షతలు పువ్వులు
చల్లి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ ........
పునః పూజ :
ఓం
శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః పునః పూజాంచ కరిష్యే
అని చెప్పుకొని ,పంచపాత్రలోని నీటిని చేతితో తాకి ,అక్షతలు స్వామిపై
చల్లుతూ ఈ క్రింది మంత్రములు చదువు కొనవలెను .
విశేషోపచారములు:
ఛత్రం ఆచ్చాదయామి ,చామరం వీజయామి ,నృత్యం దర్శయామి , గీతం శ్రావయామి
,వాద్యం ఘోషయామి, సమస్త రాజోపచార ,శక్త్యోప చార ,భక్త్యోప చార పూజాం
సమర్పయామి అనుకొని ,నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను.
పూజా ఫల సమర్పణమ్ :
శ్లో || యస్య స్మృత్యాచ నామోక్త్యా తపం పూజా క్రియాది షు
   యాన సంపూరతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్
   మంత్ర హీనం క్రియాహీనం భక్తి హీనం మహేశ్వర |
   యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
    అనయా ధ్యానా వాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ ...........సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు .
    ఏతత్ఫలం శ్రీ .............ర్పణ మస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను .
   పిమ్మట
'శ్రీ ...............ప్రసాదం శిరసా గృహ్ణామి ' అనుకొని స్వామివద్ద
అక్షతలు తీసుకొని తమ తమ తలలపై వేసుకొనవలెను .ఆ పిదప పసుపు గణపతి ఉన్న
పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెములో ఉన్న పసుపు
గణపతిని తీసి దేవుని పీటముపై నుంచవలెను. దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.
పూజా విధాణం సంపూర్ణమ్.
తీర్ధ ప్రాశనమ్ :
శ్లో || అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణమ్ |
  సమస్త పాపక్షయకరం శ్రీ ........పాదోదకం పావనం శుభమ్ ||
అని
తీర్ధమును చేతిలో వేసుకొని మూడు మార్లు నోటిలోనికి తీసుకొనవలెను

జాతకం అంటే ఏమిటి?


జాతకం అంటే ఏమిటి? జాత అంటే పుట్టుక ....పుట్టుకతో వచ్చినది కావున జాతకం అంటారు. ఏ మనిషికైనా భవిష్యత్తు గురించి కొద్దో గొప్పో బెంగ ఉండే ఉంటుంది. రేపు తనకు జరగబోయే శుభాశుభాలను గురించి తెలుసుకోవటం, ఏవైనా బాధలుంటే వాటికి నివారణోపాయాలను వెతుక్కోవాలనుకోవటం, ప్రతిక్షణం సుఖసంతోషాలతో జీవించాలనుకోవటం మనిషి నైజం. ఆ సుఖవంతమైన జీవితం అన్వేషణలోనే ఎన్నో రకాల శాస్త్రవిషయాలను కనుక్కోవటం జరుగుతున్నది. అయినప్పటికి భవిష్యత్తును తెలుసుకోవాలన్నా, దానిని సుఖవంతముగా మార్చుకోవాలన్నా అది ఒకే ఒక శాస్త్రంతోనే సాధ్యమవుతుంది. అదే జ్యోతిష శాస్త్రం.జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనము జన్మించిన సమయానికి ఖగోళములోని గ్రహస్థితులను సూచిస్తూ వేయబడే చక్రాన్నే జాతకము అంటారు. దీనినే జాతకచక్రము, జన్మకుండలి, హోరోస్కోప్‌ ఇలా వివిధ రకాల పేర్లతో ఆయా ప్రాంతాలవారు సంబోధిస్తుంటారు. ఒక వ్యక్తి జన్మించిన సమయము, ప్రదేశము ఆధారముగా జాతకచక్రము గణించబడుతుంది. ఖగోళములోని గ్రహస్థితులను గణితాధారముగా లెక్కించి, ఆయా రాశి, నక్షత్ర, భావాలలో ఉన్న గ్రహాల ఆధారముగా భవిష్యత్తు చెప్పబడుతుంది.దీని గణనలో కాని, జన్మించిన సమయములో కాని తప్పు జరిగినట్లయితే అది ఆ నిర్దేశిత వ్యక్తి జాతకం కాక వేరే వారి జాతకం అవటమే కాకుండా, ఈ వ్యక్తికి చెప్పబడ్డ భవిష్య ఫలాలన్నీ తప్పే అవకాశం ఉంటుంది.కాబట్టి భవిష్యత్తు తెలుసుకోవలనుకుంటే జాతక చక్రము అత్యావశ్యమైనదిగా చెప్పబడింది. జాతకం మనకు మన జీవిత రేఖను తెలియజేస్తుంది. మన గ్రహ స్థితిని అనుసరించి మనం తగు జాగ్రత్తలు పాటిస్తే పెను ప్రమాదం నుండి కాపాడబడి ఉపశమనం పొందగలము. ఉదా : వర్షం నుండి రక్షణ కలిగించే గొడుగులా ...ప్రమాదం నుండి కాపాడే శిరస్త్రానం లా.

కాలం స్త్రీ పురుష రూపాత్మకం

కాలం స్త్రీ పురుష రూపాత్మకం… కాలం స్త్రీ పురుష రూపాత్మకం.

 చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధభాగం పురుషరూపాత్మకం.

 ఆశ్వయుజం నుంచి ఫాల్గుణం వరకుగల కాలం స్త్రీ రూపాత్మకం.

 అశ్వనీ నత్రక్షంతో కూడిన పూర్ణిమ కలిగిందే ఆశ్వయుజ మాసం. ఆశ్వయుజి అంటే స్త్రీ. దేవి, సరస్వతి, లక్ష్మి- వీరి ఆరాధన ఈ మాసంలో వైశిష్ట్యం.

 శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజంలో పుచ్చపువ్వులా వెన్నెల కాస్తుంది. ఈ మాసంలో సూర్యచంద్రులు నిర్మలంగా కనిపిస్తారు. సూర్యుడు శక్తి కారకుడు. చంద్రుడు మనఃకారకుడు.


సర్వసృష్టి స్త్రీ నుంచి సంభవిస్తోంది. పురుషుడు ప్రాణదాత. స్త్రీ శరీరధాత్రి.

 సకల బ్రహ్మంలో సత్వ రజో తమోగుణాలు ఉంటాయి. సత్వం నిలువెల్లా నింపుకొని ఉన్న పరతత్వాన్ని విష్ణువుగా, రజస్సుతో కూడినదాన్ని బ్రహ్మగా, తమస్సుతో ఏర్పడిన పరతత్వాన్ని శివుడిగా వేద పురాణాలు రూపొందించాయి.







 సృష్టి, పోషణ, లయం నిర్దిష్టకార్యాల్లో వారికి తగిన సహకారం అందించే శక్తిస్వరూపాలు- సరస్వతి, లక్ష్మి, పార్వతి. సమస్త జగత్తును పాలించేది ఆదిపరాశక్తి. ఈ పరాశక్తి త్రివిధాలుగా రూపుదాల్చి లక్ష్మి, సరస్వతి, పార్వతియై లోకాలకు సకల సౌభాగ్యాలు, విద్య, శక్తి ప్రసాదిస్తున్నట్లు చెబుతారు.






 మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమినాడు వాగ్దేవి సరస్వతీ పూజ. జ్ఞానభూమికగా సరస్వతిని దర్శించడం భారతీయ సంప్రదాయం.


 ఆశ్వయుజ పాడ్యమి నుంచి నవమి వరకు శరన్నవరాత్రులు. శైలపుత్రిగా, బ్రహ్మచారిణిగా, చంద్రఘంటాదేవిగా, కూష్మాండదేవిగా, స్కందమాతగా, కాత్యాయనిగా, కాళరాత్రి దేవిగా, మహాగౌరిగా, సిద్ధిధాత్రిగా ఈ తొమ్మిది రోజులూ దేవిని అర్చించడం ఒక సంప్రదాయం. పదోరోజు విజయదశమి. ఆ రోజునే శ్రీరాముడు రావణ సంహారం చేశాడని విశ్వాసం.



అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలు తీయించి కౌరవ వీరులను జయించినది విజయదశమినాడే అని పురాణోక్తి.



 ఆశ్వయుజ బహుళ తదియ అట్ల తదియ- స్త్రీల పండుగ. త్రయోదశి ధనత్రయోదశి. లక్ష్మీపూజ చేస్తారు. నరకచతుర్దశి నాటి గాథలో సత్యభామ పాత్ర పురాణ ప్రసిద్ధమే. అమావాస్యనాడు దీపావళి. దీపావళి బలిచక్రవర్తి గౌరవార్థం జరిగినట్లు భవిష్యోత్తర పురాణం చెబుతోంది. దీపావళినాడు విక్రమార్కుడి పట్టాభిషేకం జరిగిందనే గాథ ప్రచారంలో ఉంది. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అనే ఉపనిషద్‌ వాక్యానికి ఆచరణ రూపం దీపావళి.










 తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగ జరుపుకొనేదీ ఆశ్వయుజంలోనే. ఈ మాసంలో జరిగే ప్రతి ఉత్సవమూ పండుగా స్త్రీ ప్రాధాన్యం కలిగినవే. అందుకే ఆశ్వయుజం మహిళామాసం.










వసంత పంచమి

ఈరోజు వసంత పంచమి. మాఘశుద్ధ పంచమినే వసంత పంచమి అంటారు.

ఈ రోజు సరస్వతీ పూజ నిర్వహించడానికి చాలా ప్రశస్తమైన రోజు. వసంత పంచమి రోజును సరస్వతీ దేవి పుట్టిన రోజుగా పేర్కొంటారు. మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ పూర్వేహ్ని సమయం కృత్యాతత్రాహ్న సంయతః శుచిః -






మాఘ శుక్ల పంచమినాడు, విద్యారంభంనాడు సరస్వతిని అర్చించాలి. మొదట విఘ్నాధిపతి గణపతిని పూజించి, అటుపై చదువుల తల్లి శారదాంబ ప్రతిమను, పుస్తకాలను, విద్యకు సంబంధించిన ఇతర వస్తువులను ఆరాధించాలి.







షోడశోపచారాలతో సరస్వతి మాతను పూజించాలి. తల్లికి తెల్లని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో, శుక్ల వస్త్రాలతో ఆ విజ్ఞాన మూర్తిని అర్చించాలి. ఉత్తర భారతదేశంలో శ్రీ పంచమి నాడు సరస్వతీ దేవిని అత్యంత శ్రద్ధతో పూజిస్తారు. దక్షిణాదిలో కూడా చాలామంది ఈరోజున సరస్వతీ దేవిని అర్చిస్తారు.







సాధారణంగా దేవాలయలలో మూడు రోజులపాటు వసంత పంచమిని జరుపుకుంటారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి మీద వెలసి కనకదుర్గమ్మకు వసంత పంచమి సందర్భంగా సరస్వతీ దేవి అలంకారం చేస్తారు. అలాగే బాసరలో కొలువై వున్న సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆదిశంకరుడు తాను అపారమైన వాఙ్మయాన్ని, తత్వవిజ్ఞానాన్ని ఈ తల్లి కృప చేతనే పొందినట్లు పేర్కొన్నాడు. అంతేకాకుండా శారదానుగ్రహం వలన మనమందరం సమగ్ర జ్ఞానంతో ఎదగగలమని చాటాడు. గాయత్రిగా, సావిత్రిగా, పరాశక్తిగా శ్రుతులు పేర్కొన్న సర్వచైతన్య స్వరూపిణి శారదాదేవి.








అందుకే వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని పూజిస్తే జ్ఞానవంతులవుతారన్న నమ్మకం అనాది నుంచీ వుంది. పూర్వం ‘యాకుందేందు…’ అన్న శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభమయ్యేది. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతీ. వాక్కుకీ, జ్ఞానానికీ చదువుకి ఆమె అధిదేవత. వేదాల్లో కూడా సరస్వతీ సూక్తాలున్నాయి. ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా ఉపాసించే దేవతను అంబితమే, నదీతమే, దేవితమే అని శ్రుతి కీర్తించింది. అలాంటి సరస్వతీదేవిని ఆమె పుట్టినరోజు నాడు అర్చించే అవకాశం మనకు వసంత పంచమి (శ్రీపంచమి) రూపంలో వచ్చింది. దానిని సద్వినియోగం చేసుకుందాం.






సామెతలు

తెలుగు సామెతలు

1.
అంత్యనిష్ఠూరం కన్నా
ఆది నిష్ఠూరం మేలు

2.
అంబలి తాగే వారికి
మీసాలు యెగబట్టేవారు కొందరా

3.
అడిగేవాడికి
చెప్పేవాడు లోకువ

4.
అత్తలేని కోడలుత్తమురాలు
కోడల్లేని అత్త గుణవంతురాలు

5.
అనువు గాని చోట
అధికులమనరాదు

6.
అభ్యాసం
కూసు విద్య

7.
అమ్మబోతే అడివి
కొనబోతే కొరివి

8.
అయితే ఆదివారం
కాకుంటే సోమవారం

9.
ఆలూ లేదు చూలు లేదు
కొడుకు పేరు సోమలింగం

10.
ఇంట్లో ఈగల మోత
బయట పల్లకీల మోత

11.
ఇల్లు కట్టి చూడు
పెళ్ళి చేసి చూడు

12.
ఇంట గెలిచి
రచ్చ గెలువు

13.
ఇల్లు పీకి
పందిరేసినట్టు

14.
ఎనుబోతు మీద
వాన కురిసినట్టు

15.
చెవిటి వాని ముందు
శంఖమూదినట్టు

16.
కందకు లేని దురద
కత్తిపీటకెందుకు

17.
కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు

18.
కుక్క కాటుకు
చెప్పుదెబ్బ

19.
కోటి విద్యలూ
కూటి కొరకే

20.
నీరు పల్లమెరుగు
నిజము దేవుడెరుగు

21.
పిచ్చుకపై
బ్రహ్మాస్త్రం

22.
పిట్ట కొంచెం
కూత ఘనం

23.
రొట్టె విరిగి
నేతిలో పడ్డట్టు

24.
వాన రాకడ
ప్రాణపోకడ
ఎవరి కెరుక

25.
కళ్యాణమొచ్చినా
కక్కొచ్చినా ఆగదు

26.
మింగమెతుకులేదు
మీసాలకు సంపంగి నూనె

27.
ఆడబోయిన తీర్థము
యెదురైనట్లు

28.
ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

29.
ఆది లొనే
హంస పాదు

30.
ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే
మహా వృక్షము

31.
ఆకలి రుచి యెరుగదు
నిద్ర సుఖమెరుగదు

32.
ఆకాశానికి
హద్దే లేదు

33.
ఆలస్యం
అమృతం
విషం

34.
ఆరే దీపానికి
వెలుగు యెక్కువ

35.
ఆరోగ్యమే
మహాభాగ్యము

36.
ఆవులింతకు అన్న ఉన్నాడు కాని
తుమ్ముకు తమ్ముడు లేడంట

37.
ఆవు చేనులో  మేస్తే
దూడ గట్టున మేస్తుందా?

38.
అబద్ధము ఆడినా
అతికినట్లు ఉండాలి

39.
అడగందే అమ్మైనా
అన్నము పెట్టదు

40.
అడ్డాల నాడు బిడ్డలు కాని
గడ్డాల నాడు కాదు

41.
ఏ ఎండకు
ఆ గొడుగు

42.
అగ్నికి వాయువు
తోడైనట్లు

43.
ఐశ్వర్యమొస్తే
అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు

44.
అందని మామిడిపండ్లకు
అర్రులు చాచుట

45.
అందితే జుట్టు
అందక పోతే కాళ్ళు

46.
అంగట్లో అన్నీ ఉన్నా,
అల్లుడి నోట్లో శని ఉన్నట్లు

47.
అన్నపు చొరవే గాని
అక్షరపు చొరవ లేదు

48.
అప్పు చేసి
పప్పు కూడు

49.
అయ్య వారు వచ్చే వరకు
అమావాస్య ఆగుతుందా

50.
అయ్యవారిని చెయ్యబొతే
కోతి బొమ్మ అయినట్లు

51.
బతికుంటే
బలుసాకు తినవచ్చు

52.
భక్తి లేని పూజ
పత్రి చేటు

53.
బూడిదలో పోసిన
పన్నీరు

54.
చాదస్తపు మొగుడు
చెబితే వినడు,
గిల్లితే యేడుస్తాడు

55.
చాప కింద
నీరులా

56.
చచ్చినవాని కండ్లు
చారెడు

57.
చదివేస్తే
ఉన్నమతి పోయినట్లు

58.
విద్య లేని వాడు
వింత పశువు

59.
చేతకానమ్మకే
చేష్టలు ఎక్కువ

60.
చేతులు కాలినాక
ఆకులు పట్టుకున్నట్లు

61.
చక్కనమ్మ
చిక్కినా అందమే

62.
చెడపకురా
చెడేవు

63.
చీకటి కొన్నాళ్ళు
వెలుగు కొన్నాళ్ళు

64.
చెరువుకి నీటి ఆశ
నీటికి చెరువు ఆశ

65.
చింత చచ్చినా
పులుపు చావ లేదు

66.
చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,
ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట

67.
చిలికి చిలికి
గాలివాన అయినట్లు

68.
డబ్బుకు లోకం
దాసోహం

69.
దేవుడు వరం ఇచ్చినా
పూజారి వరం ఇవ్వడు

70.
దరిద్రుడి పెళ్ళికి
వడగళ్ళ వాన

71.
దాసుని తప్పు
దండంతో సరి

72.
దెయ్యాలు
వేదాలు పలికినట్లు

73.
దిక్కు లేని వాడికి
దేవుడే దిక్కు

74.
దొంగకు దొంగ బుద్ధి,
దొరకు దొర బుద్ధి

75.
దొంగకు
తేలు కుట్టినట్లు

76.
దూరపు కొండలు
నునుపు

77.
దున్నపోతు మీద
వర్షం కురిసినట్లు

78.
దురాశ
దుఃఖమునకు చెటు

79.
ఈతకు మించిన
లోతే లేదు

80.
ఎవరికి వారే
యమునా తీరే

81.
ఎవరు తీసుకున్న గోతిలో
వారే పడతారు

82.
గాడిద సంగీతానికి
ఒంటె ఆశ్చర్యపడితే,
ఒంటె అందానికి
గాడిద మూర్ఛ పోయిందంట

83.
గాజుల బేరం
భోజనానికి సరి

84.
గంతకు తగ్గ బొంత

85.
గతి లేనమ్మకు
గంజే పానకం

86
గోరు చుట్టు మీద
రోకలి పోటు

87.
గొంతెమ్మ కోరికలు

88.
గుడ్డి కన్నా
మెల్ల మేలు

89.
గుడ్డి యెద్దు
చేలో పడినట్లు

90.
గుడ్డు వచ్చి
పిల్లను వెక్కిరించినట్లు

91.
గుడినే  మింగే వాడికి
లింగమొక లెఖ్ఖా

92.
గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు

93.
గుడ్ల మీద
కోడిపెట్ట వలే

94.
గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట

95.
గుర్రము గుడ్డిదైనా
దానాలో తక్కువ లేదు

96.
గురువుకు
పంగనామాలు పెట్టినట్లు

97.
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు

98.
ఇంటి దొంగను
ఈశ్వరుడైనా పట్టలేడు

99.
ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు

100.
ఇంటికన్న
గుడి పదిలం

101.
ఇసుక తక్కెడ
పేడ తక్కెడ

102.
జోగి జోగి రాసుకుంటే
బూడిద రాలిందంట

103.
కాచిన చెట్టుకే
రాళ్ళ దెబ్బలు

104.
కాగల కార్యము
గంధర్వులే తీర్చినట్లు

105.
కాకి ముక్కుకు
దొండ పండు

106.
కాకి పిల్ల
కాకికి ముద్దు

107.
కాలం కలిసి రాక పోతే
కర్రే పామై కాటు వేస్తుంది

108.
కాలు జారితే తీసుకోగలము
కాని నోరు జారితే తీసుకోగలమా

109.
కాసుంటే
మార్గముంటుంది

110.
కడుపు చించుకుంటే
కాళ్ళపైన పడ్డట్లు

111.
కలకాలపు దొంగ
ఏదో ఒకనాడు దొరుకును

112.
కలిమి లేములు
కావడి  కుండలు

113.
కలిసి వచ్చే కాలం వస్తే,
నడిచి వచ్చే కొడుకు పుడతాడు

114.
కంచే
చేను మేసినట్లు

115.
కంచు మ్రోగునట్లు
కనకంబు మ్రోగునా !

116.
కందకు
కత్తి పీట లోకువ

117.
కరవమంటే కప్పకు కోపం
విడవమంటే పాముకు కోపం

118.
కీడెంచి
మేలెంచమన్నారు

119.
కొండ నాలికకి మందు  వేస్తే
ఉన్న నాలిక ఊడినట్లు

120.
కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు

121.
కొండను తవ్వి
ఎలుకను పట్టినట్లు

122.
కొన్న దగ్గిర కొసరే గాని
కోరిన దగ్గర కొసరా

123.
కూసే గాడిద వచ్చి
మేసే గాడిదను చెరిచిందిట

124.
కూటికి పేదైతే
కులానికి పేదా

125.
కొరివితో
తల గోక్కున్నట్లే

126.
కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు

127.
కొత్తొక వింత
పాతొక రోత

128.
కోటిి విద్యలు
కూటి కొరకే

129.
కొత్త అప్పుకు పొతే
పాత అప్పు బయటపడ్డదట

130.
కొత్త బిచ్చగాడు
పొద్దు యెరగడు

131.
కృషితో
నాస్తి దుర్భిక్షం

132.
క్షేత్ర మెరిగి విత్తనము
పాత్ర మెరిగి దానము

133.
కుడుము చేతికిస్తే
పండగ అనేవాడు

134.
కుక్క వస్తే రాయి దొరకదు
రాయి దొరికితే కుక్క రాదు

135.
ఉన్న లోభి కంటే
లేని దాత నయం

136.
లోగుట్టు
పెరుమాళ్ళకెరుక

137.
మెరిసేదంతా
బంగారం కాదు

138.
మంచమున్నంత వరకు
కాళ్ళు చాచుకో

139.
నోరు మంచిదయితే
ఊరు మంచిదవుతుంది

140.
మంది యెక్కువయితే
మజ్జిగ పలచన అయినట్లు

141.
మనిషి మర్మము..
మాను చేవ...
బయటకు తెలియవు

142.
మనిషి పేద అయితే
మాటకు పేదా

143.
మనిషికి
మాటే అలంకారం

144.
మనిషికొక మాట
పశువుకొక దెబ్బ

145.
మనిషికొక తెగులు
మహిలో వేమా అన్నారు

146.
మంత్రాలకు
చింతకాయలు రాల్తాయా

147.
మీ బోడి సంపాదనకు
ఇద్దరు పెళ్ళాలా

148.
మెత్తగా ఉంటే
మొత్త బుద్ధి అయ్యిందట

149.
మొక్కై వంగనిది
మానై వంగునా

150.
మొరిగే కుక్క కరవదు
కరిసే కుక్క మొరగదు

151.
మొసేవానికి తెలుసు
కావడి బరువు

152.
ముల్లును ముల్లుతోనే తీయాలి
వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి

153.
ముందర కాళ్ళకి
బంధాలు వేసినట్లు

154.
ముందుకు పోతే గొయ్యి
వెనుకకు పోతే నుయ్యి

155.
ముంజేతి కంకణముకు
అద్దము యెందుకు

156.
నడమంత్రపు సిరి
నరాల మీద పుండు

157.
నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో
నీ మాటలో అంతే నిజం ఉంది

158.
నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా

159.
నవ్వు
నాలుగు విధాలా చేటు

160.
నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు

161.
నిదానమే
ప్రధానము

162.
నిజం
నిప్పు లాంటిది

163.
నిమ్మకు
నీరెత్తినట్లు

164.
నిండు కుండ
తొణకదు

165.
నిప్పు ముట్టనిదే
చేయి కాలదు

166.
నూరు గొడ్లు తిన్న రాబందుకైనా
ఒకటే గాలిపెట్టు

166.
నూరు గుర్రాలకు అధికారయినా
భార్యకు యెండు పూరి

167.
ఆరు నెళ్ళు సావాసం చేస్తే
వారు వీరు అవుతారు

168.
ఒక ఒరలో
రెండు కత్తులు ఇమడవు

169.
ఊపిరి ఉంటే
ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు

170.
బతికి ఉంటే
బలుసాకు తినవచ్చు

171.
ఊరంతా చుట్టాలు
ఉత్తికట్ట తావు లేదు

172.
ఊరు మొహం
గోడలు చెపుతాయి

173.
పనమ్మాయితొ సరసమ్ కంటే
అత్తరు సాయిబు తో కలహం మేలు

174.
పాము కాళ్ళు
పామునకెరుక

175.
పానకంలో పుడక

176.
పాపమని పాత చీర ఇస్తే
గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట

177.
పచ్చ కామెర్లు వచ్చిన వాడికి
లోకమంతా పచ్చగా కనపడినట్లు

178.
పండిత పుత్రః
పరమశుంఠః

179.
పనిలేని మంగలి
పిల్లి తల గొరిగినట్లు

180.
పరిగెత్తి పాలు తాగే కంటే
నిలబడి నీళ్ళు తాగడం మేలు

181.
పట్టి పట్టి పంగనామం పెడితే
గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట

182.
పెదవి దాటితే
పృథ్వి దాటుతుంది

183.
పెళ్ళంటే నూరేళ్ళ పంట

184.
పెళ్ళికి వెళుతూ
పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు

185.
పేనుకు పెత్తనమిస్తే
తలంతా గొరికిందట

186.
పెరుగు తోట కూరలో పెరుగు యెంత  ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది

187.
పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు

188.
పిచ్చోడి చేతిలో రాయిలా

189.
పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా

190.
పిల్లికి చెలగాటం
ఎలుకకు ప్రాణ సంకటం

191.
పిండి కొద్దీ రొట్టె

192.
పిట్ట కొంచెము
కూత ఘనము

193.
పోరు నష్టము
పొందు లాభము

194.
పోరాని చోట్లకు పోతే
రారాని మాటలు రాకపోవు

195.
పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట

196.
పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు

197.
పువ్వు పుట్టగానే పరిమళించినట్లు

198.
రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము

199.
రామాయణంలో
పిడకల వేట

200.
రామాయణం అంతా విని
రాముడికి సీత
యేమౌతుంది
అని అడిగినట్టు

201.
రామేశ్వరం వెళ్ళినా
శనేశ్వరం వదలనట్లు

202.
రెడ్డి వచ్చే
మొదలాడు అన్నట్టు

203.
రొట్టె విరిగి
నేతిలో పడ్డట్లు

204.
రౌతు కొద్దీ గుర్రము

205.
ఋణ శేషం
శత్రు శేషం ఉంచరాదు

206.
చంకలో పిల్లవాడిని ఉంచుకుని
ఊరంతా వెతికినట్టు

207.
సంతొషమే సగం బలం

208.
సిగ్గు విడిస్తే
శ్రీరంగమే

209.
సింగడు
అద్దంకి పోనూ పొయ్యాడు
రానూ వచ్చాడు

210.
శివుని ఆజ్ఞ లేక
చీమైనా కుట్టదు

211.
శుభం పలకరా వెంకన్నా అంటే
పెళ్ళి కూతురు ముండ ఎక్కడ
అన్నాడంట!