26 February 2016

మన జాతరులు.

ఖమ్మం
-తేగడ జాతర : ఖమ్మం జిల్లా నూగూరు తాలూకా తేగడ
గ్రామంలో భద్రకాళి, వీరభద్రుల దేవాలయాలున్నాయి.
-ఈ దేవతలకు మాఘ బహుళ త్రయోదశి, చతుర్థశుల్లో
కల్యాణం చేస్తారు.
-గోదావరి నదికి వీరభద్ర స్వామి విగ్రహాన్ని తీసుకువెళ్లి
స్నానం చేయించి తిరిగి గుడికి తీసుకెళ్లి పూజలు
నిర్వహిస్తారు.
నిజామాబాద్
-సిద్దులగుట్ట జాతర : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్
మండలం సిద్దులగుట్ట వద్ద జాతర జరుగుతుంది.
-పురాతన కాలంలో నవనాథులు ఈ గుట్టపై శివలింగాన్ని
స్థాపించి తపస్సు చేయడంతో ఈ గుట్టను సిద్దులగుట్ట
అంటారు.
-ఇక్కడి దేవాలయంలోని శివుడిని సిద్దలింగేశ్వరుడిగా
కొలుస్తారు.
రంగారెడ్డి
-చేవెళ్ల జాతర : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల గ్రామంలో
శ్రీలక్ష్మి వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవాలు ప్రతి ఏడాది
చైత్రమాసంలో జరుగుతాయి. మూడు రోజుల పాటు జరిగే
ఉత్సవాల్లో బ్రహ్మోత్సవం, రథోత్సవం ప్రధానమైనవి.
మహబూబ్నగర్
కురుమూర్తి జాతర
-మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం అమ్మాపూర్
గ్రామంలో నిర్వహించబడుతుంది.
-ఇక్కడ ప్రధాన దైవం - కురుమర్తి రాయుడు
-ఈ జాతరను 19 రోజుల పాటు నిర్వహిస్తారు.
-దీనిలో 8వ రోజు జరిపే శ్రీవారి ఉద్ధాలసేవ చాలా
పవిత్రమైంది.
మన్నెంకొండ జాతర
-మహబూబ్నగర్ జిల్లాలోని మన్నెంకొండ వద్ద జాతర
జరుగుతుంది.
-ప్రముఖ దైవం - ఆంజనేయస్వామి
సిరసనగండ్ల జాతర
-మహబూబ్నగర్ జిల్లా వంగూరు మండలంలోని చారకొండ దగ్గర
సిరసనగండ్ల జాతర జరుగుతుంది.
-జాతర ప్రత్యేకత : వైభవంగా సీతారాముల కల్యాణం
జరపడం.
రంగాపూర్ జాతర
-మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్
గ్రామంలో ఈ జాతర జరుగుతుంది.
-ఇక్కడ నల్లమల అడవులోని కొండలపై ఉమామహేశ్వర
దేవాలయం ఉంది. కొండకింద రంగాపూర్ గ్రామంలో హజ్రత్
నిరంజన్ షావలి దర్గా ఉంటుంది.
-వారం రోజులపాటు ఈ జాతర మతాలకతీతంగా జరుగుతుంది.
సలేశ్వరం జాతర
-మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట మండలంలోని అడవుల్లో
చెంచుల ఆధ్వర్యంలో సలేశ్వర తీర్థం ఉంది.
-ఈ జాతర సంవత్సరానికి ఒకసారి ఏప్రిల్ నెలలో
చైత్రపౌర్ణమికి మూడు రోజుల ముందు, మూడు రోజుల వెనుక
మొత్తం వారం రోజులు జరుగుతుంది.
-ఇక్కడ ప్రధాన దైవం - శివుడు
మల్దగల్ జాతర
-మహబూబ్నగర్ జిల్లా మల్దగల్లో తిమ్మప్ప జాతర
జరుగుతుంది. శ్రీవేంకటేశ్వర స్వామిని భక్తులు తిమ్మప్పగా
కొలుస్తారు.
గద్వాల్ జాతర
-మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ పట్టణంలోని
చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రతి ఏడాది ఈ జాతర
జరుగుతుంది.
ఆదిలాబాద్
నాగోబా జాతర
-నోగోబా దేవాలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం
కేస్లాపూర్ వద్ద ఉన్నది.
-నాగోబా గిరిజనుల ఆరాధ్యదైవం. పూర్వకాలంలో నాగోబా గోండుల
కుటుంబంలో జన్మించి అద్భుతమైన మహిమలను కనబర్చి
కేస్లాపూర్ గ్రామాన ఉన్న పుట్టలోకి ప్రవేశించిందని
చెప్తారు. అప్పటి నుంచి గోండులు ఆ పుట్టకు పూజలు చేస్తూ
అక్కడ దేవాలయాన్ని నిర్మించారు.
-సర్పజాతిని పూజించడం ఈ పండుగ ప్రత్యేకత.
-ప్రతి ఏడాది పుష్యమాసం అమవాస్య రోజు నుంచి నాలుగు
రోజుల పాటు ఈ పండుగ జరుగుతుంది.
-నాగోబా జాతరలో దర్బార్ ఏర్పాటు చేసిన ప్రముఖ మానవ
పరిణామ శాస్త్రవేత్త - ప్రొఫెసర్ హైమన్డార్ప్
(1946)
బుర్నూరు జాతర
-ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు తాలూకాలోని బుర్నూరు ప్రాంతంలో
ఈ జాతరను జరుపుకుంటారు.
-బుర్నూరు ప్రాంతంలో గోండుల దేవతలు అయిన అకిపెణ్,
ఆవులపెణ్, మాసోబాలను గ్రామ పొలిమేరల్లో నెలకొల్పారు.
ఈ దేవతలను పూజిస్తూ గోండులు తమ కార్యక్రమాలను
కొనసాగిస్తారు.
వేలాల జాతర
-ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు తాలూకాలోని వేలాలలో
మహాశివరాత్రి రోజున అతిపెద్ద జాతర జరుగుతుంది.
-గోదావరి నది తీరంలో భక్తులు భజనలతో శంకరుడిని పూజించి
తమ మొక్కులు తీర్చుకుంటారు.
కరీంనగర్
బెజ్జంకి జాతర
-ఈ జాతర కరీంనగర్ జిల్లా బెజ్జంకి అనే ప్రాంతంలో
జరుగుతుంది.
-ఇక్కడ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం ఉంది. ఈ
దేవాలయంపై గోపికల నృత్యాలు, త్రిమూర్తుల విగ్రహాలు,
సముద్ర మథన కథ మొదలైన వాటిని అద్భుతంగా చెక్కారు.
-ఈ జాతరను చైత్రమాసంలో జరుపుతారు. చైత్రపూర్ణిమ
నాడు బండ్ల సేవ జరుగుతుంది. ఇక్కడ ఎడ్లబండ్ల పోటీలు
నిర్వహిస్తారు.
-ఆలయానికి ఉత్తరంగా 35 అడుగుల ఎత్తు స్తంభం ఉంది.
దీన్ని అండాళ్ స్తంభం అని అంటారు. సంతానం కోసం ఈ
స్తంభానికి చీర కట్టించి ఒడిబియ్యం పోసే ఆచారం ఉంది.
నల్లకొండ జాతర
-కరీంనగర్ జిల్లా కోడిమ్యాల మండలం నల్లకొండ గ్రామ
సమీపంలో ఈ జాతర జరుగుతుంది.
-ప్రతి ఏడాది మాఘ పౌర్ణమి రోజున జాతర జరుగుతుంది. -
ప్రధాన దైవం నల్లకొండ నర్సింహస్వామి.
సింగరాయ జాతర
-కరీంనగర్ జిల్లా కోహెడ మండలం కూరెళ్లలో ఈ జాతర
జరుగుతుంది.
-ప్రధాన దైవం - లక్ష్మీనర్సింహస్వామి.
-ప్రతి ఏడాది పుష్యబహుళ అమావాస్య రోజున
జరుగుతుంది.
కొండగట్టు జాతర
-కరీంనగర్ జిల్లా ముత్యంపేట సమీపంలో ఈ ఉత్సవాలు
జరుగుతాయి.
-ప్రధాన దైవం - ఆంజనేయస్వామి. ఇక్కడ హనుమంతుడు
ఒకవైపు నర్సింహస్వామి ముఖంతో, ఇంకోవైపున
ఆంజనేయస్వామి ముఖంతో రెండు ముఖాలను కలిగి ఉంటారు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయం తెలియచేయండి.