09 October 2016

మీనరాశి PISCES

మీనరాశి.

 మీన రాశి జాతక చక్రంలో ఆఖరుది మరియు చివరిది. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి సరి రాశి, ద్విస్వభావ రాశి, స్త్రీ రాశి, శుభ రాశిగా వ్యవహరిస్తారు. ఈ రాశి జలతత్వం కలిగిన రాశి. శబ్దం నిశ్శబ్దం, సమయం పగటి సమయం, పూర్ణ జలరాశి, ఉభయోదయ రాశి, పరిమానం హస్వం, జాతి బ్రాహ్మణ, జీవులు జల జీవులు, దిక్కు ఉత్తర దిక్కు, ప్రకృతి కఫం, సంతానం అధికం, వర్ణం స్వచ్ఛం, కాల పురుషుని శరీరంలో పాదాలను సూచిస్తుంది.



ఈ రాశి అధిపతి గురువు. పూర్వాబాధ్ర నక్షత్రము నాల్గవ పాదము, ఉత్తరాబాధ్ర నక్షత్రము 1,2,3,4 పాదములు రేవతి నక్షత్రము 1,2,3,4 పాదములు, మొత్తము 9 పాదములు కలసి మీన రాశి యగును. నిరయన రవి ఈ రాశిలో మార్చి పదిహేడవ తేదీన ప్రవేశిస్తాడు. ఈ రాశిలో పదిహేను డిగ్రీలలో బుధుడు నీచను పొందగా ఇరవై ఏడు డిగ్రీలలో శుక్రుడు ఉచ్ఛను పొందుతాడు. ఈ రాశి వారు వైద్యశాలలు, రాయబార కార్యాలయాలు, చేపల వ్యాపారం మొదలైనవి. జాలరులు, సముద్రమందలి అన్ని పదార్ధాలు, రత్నములు, పగడములు, ముత్యములు, నదులకు ఈ రాశి కారకత్వం వహిస్తుంది.






 మీనం: భాహాద్రేకం, బలహీనత, కీళ్ళజబ్బులు, పాదములు, కాలివేళ్ళు నీరు పట్టడం, మద్యపానాదుల వల్ల వచ్చే అనారోగ్యం, కణతులు, మలకోశం, ఆమకోశం మొదలైన వానికి సంబంధించిన అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది.



 జాగ్రత్తలు: 1. మొలకలు వచ్చిన శనిగలు, మితహారం 2. పసుపు ఆహారంలో తీకుకోవటం 3. కవితా రచన భావోద్రేకాలను అదుపు చేస్తుంది 4. ఫెర్రంపాసు (హోమియో) వీరికి తగినది.


 మీనరాశి పూర్వాభద్ర 4వ పాదం ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదాలు  రేవతి 1,2,3,4 పాదాలు










కుంభరాశి AQUARIUS

కుంభరాశి.

కుంభరాశిలో జన్మించిన వారికి బంధాలు అనుభంధాలు ఎక్కువ. మేలు చెసిన వ్యక్తులను గుర్తుంచుకుంటాఆరు. కొత్త వారు ఎందరు పరిచయము అయినా పాత స్నెహాలను, బంధుత్వాలను మరువరు.






ఇంటి భోజనము అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నుతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు. కాని ఎక్కువ కాలము క్రమశిక్షన నిలవని పరిస్థితులు ఎదురౌతాయి. అవేశము, ఇతరులు రెచ్చగొదితే రెచ్చి పోయె స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తాయి. తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించరు. బధను అధికముగా మనసులో దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మొహమాతముగా చెప్పడము వలన విరోధాలు వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడనికి ప్రయత్నించి విఫలము ఔతారు. మధ్యవర్తిత్వానికి ముమ్దు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు.










 సాంకెతిక విద్య, వైద్య విద్యలలో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్రవిచిత్ర వ్యాపారాలు అనుభవము నెర్పు కలిగి ఉంటారు. కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటాయి. అవసర సమయాలలో ధనము లభించక పొయినా అవసరము లెనప్పుదు ధనము అధికముగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గము అవసరాలకు ధనము సర్ధుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు. సమాజములో ఉన్నత స్థానాలలో , గౌరవ స్థానాలలో ఉన్న వారి వలన అన్యాయానికి గురి ఔతారు. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపొతారు. అకస్మాత్తుగా రాజకీయాధికారము చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు యోగిస్తాయి. ఏకపక్షముగా పొరబాటుగా తిసుకున్న నిర్నయాల వలన ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చెస్తాయి.









సమాజములో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి ఔతారు. తన సంతానము, ఆత్మీయులు, స్వంత వారు చెసే తప్పులు తప్పులుగా కనిపించవు. వారిని సమర్ధించడానికి రక్షించడానికి అధికముగా ధనమును పలుకుబడిని ఉపయోగిస్తారు. వ్యాపారములో అంచనాలు నిజమై లాభము పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి ఔతారు. భుములు విలువ పెరగడము వలన ధనవంతులు ఔతారు. వ్యాపారకూడలిని అద్దెకు ఇచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. సంతానము అదృష్టము వలన మంచి స్థితికి చేరుకుంటారు.









స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికము. జీవిత ప్రారమ్భములో తెలిసి తెలియక చెసిన నిర్ణయాలు మంచికి దారి తిస్తాయి. వీరు అందలము ఎక్కించి బలోపేతము చేసిన అసమర్ధులైన చిన్నపాటి వ్యక్తులే విరికి ప్రత్యర్ధులు ఔతారు. పోటీ లేని చోట్ల కూడా వీరి మమ్చితనము వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలరు. అయినా స్వయంకృతాపరాధాన్ని సరి దిద్దుకోలేరు. మీరు కొల్పోయిన ధనము, పదవి ఇతరులు మీ కారణంగానే పొందారని పేరు వస్తుంది. భాగస్వామ్యము కొంత కాలమే లాభిస్తుంది. హస్తవాసి మంచిదని పేరు వస్తుంది.సొదర సోదరీ వర్గానికి సహాయము చేయడము వలన మరో వర్గము దూరము ఔతారు. పైస్థాయి మరియు కిమ్దస్థాయి వారి వలన ఏకకాలములో ఇబ్బందులు ఎదురౌతాయి. ఋణల విషయములో అసత్య ప్రచారాలు ఎదురౌతాయి. కోర్టు వ్యవహారాలలో అపజయము ఎదురౌతుంది. ఆత్మీయ వర్గము ద్రోహము చెస్తే తప్ప ఏ విషయమునకు లోటు ఉండదు. ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవము గడిస్తారు. ఎదుటి వారి మనస్తత్వము తేలికగా గ్రహిస్తారు. విరి కంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా దీర్గకాలములో వారిని వీరు అధిగమించగలరు. పెద్దలు ఇచ్చిన స్థిరాస్థులు పోగొట్టుకున్నా స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు. శత్రు వర్గము మీద విజయము సాధిస్తారు వారి వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయి వారి వలన ఇబ్బందులురాకుండా జాగ్రత్త వహిస్తారు. అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.





 పడమర, దక్షిణం, ఉత్తర దిశలు యోగిస్తాయి. వీరికి ఏదిక్కూ దోషమైనది కాదు. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్త్రోత్ర పారాయణము మేలు చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా జీవితము నడుస్తుంది. కుంభరాశి కొన్నిజ్యోతిష విషయాలు కుంభ రాశి జాతకచక్రంలో పదకొడవ స్థానంలో ఉంది. ఈ రాశ్యధిపతి శని భగవానుడు. ఈ రాశి 300 డిగ్రీల నుండి 330 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ రాశి బేసి రాశి, క్రూర రాశి, పురుష రాశి, స్థిర రాశిగా వ్యవహరిస్తారు. ఈ రాశి తత్వం వాయుతత్వం, శబ్దం అర్ధ శబ్దం, అర్ధ జల రాశి, జీవులు మానవులు, జాతి వైశ్య జాతి, సంతానం సమ సంతానం, సమయం పగటి సమయం, పరిమాణం హస్వం, ఉదయం శీర్షోదయం, దిక్కు పడమర దిక్కు, ప్రకృతి వాత, కఫ, పిత్త ప్రకృతి, కాలపురుషుని శరీరావయవం పిక్కలు. ఇది విషమ రాశి. నిరయన రవి ఈరాశిలో ఫిబ్రవరి పదిహేన తేదీలో ప్రవేశిస్థాడు. ఈ రాశిని రాహువుకు స్వస్థానంగా కొందరు భావిస్తారు. సహజంగా ఛాయా గ్రహమైన రాహుకు జాతక చక్రంలో స్థానం లేదని పండితులు భావిస్తారు. ఈ రాశి గూఢాచారులను, వ్యాపారులను సూచిస్తుంది, గృహంలో నీటి పారలు, నీరు ఉండే ప్రదేశాలు ఈ రాశికి స్థానాలు.






ఈ రాశిలో జన్మించిన వారు లౌక్యం తెలిసిన వారు, అల్పసంతోషులు, దానధర్మములు చేయు వారు, ఎవరిని నొప్పించ మాటాడని వారు, సామాన్యులుగా ఉంటారు. సన్నని వారై ఉంటారు.








ఈ రాశి వారికి అయిదు, పన్నెండు, ఇరవై ఎనిమిది సంవత్సరాలలో ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. ఈ రాశికి అంటు వ్యాధులు, నేత్ర వ్యాధులు, చర్మరోగములకు కారకత్వం వహిస్తాడు. కుంభం: నంజువ్యాధి, కంటి జబ్బు, నరాల జబ్బు, రక్తప్రసారదోషాలు, గుండెజబ్బు, బెణుకు నొప్పులు, కాళ్ళు, సీల మండల వ్యాధులు, అంటువ్యాధులు, జలోదరం, మలేరియా, నిద్రలేమి, రక్తపోటు మొదలైన అనారోగ్యాలకు అవకాశం ఉంది.









 జాగ్రత్తలు: 1. మకరరాశి వలె వీరు కూడా నువ్వుల నూనె మసాజ్‌, ఆహారంలో నువ్వులపొడి వాడటం, సూర్య నమస్కారాలు చెయ్యటం చేయాలి. 2. నేత్రం మూరు వాడడం మంచిది 3. ప్రతిపనిలోను చురుకుదనం అలవర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తిని సమకూర్చుకోగలరు.



 కుంభరాశి

 ధనిష్ట 3,4 పాదాలు

 శతభిష 1,2,3,4 పాదాలు

పూర్వాభద్ర 1,2,3,పాదాలు
















మకరరాశి CAPRICORN

మకరరాశి.

మకరరాశి కాలపురుషుని కర్మ స్థానము. సూర్యుడు ఈ రాశి లో ప్రవేశించినప్పుటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమౌతుంది. వెంఖటేస్వరస్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము ఈ రాశిలోనిదే. ఈ రాశి వారు జీవితములో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని స్వంతము చేసుకుంటారు. ఇతరులు మొసము చెయ్యనంత వరకు ఇతరులను మోసము చెయాలన్న తలంపు రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడము వీరి స్వభావము బలహీనత కూడా. పక్కవాళ మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారి తీస్తుంది. తన లొపము తెలిసిన తరువాత తమ తప్పును అంగీకరించడానికి వెనుకాడరు. చేసిన పొరపాటు తిరిగి చెయ్యరు.





 అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా పద్ధతి మార్చుకోరు. సాత్విక స్వభావము మాట మిద నిలబడే తత్వము ఉంటాయి.






 స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికముగా ఉంటుంది. సంతానము వీరి అభీష్టము ప్రకారము నడవక వీరిని ఇబ్బందులకు గురి చేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికముగా శ్రమిస్తారు. చిన్నతనము నుండి అధికముగా శ్రమపడి చిన్నతనములోనే అధికముగా శ్రమించి అవి సాధించడానికి కృషిచేస్తారు. అనుకున్న దానిని ఎదొ ఒక విధంగా సాధిస్తారు. పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము అధికముగా ఉంటుంది. అధికమైన జ్ఞాపక సక్తి, సాధారణమైన ఆకారము కలవారై ఉంటారు. రచనా వ్యాసమ్గము, పరిశోధనా, నతన, కళాఅ సంబంధమైన నైపుణ్యము విశేషముగా ఉంటుంది. వీరు చేసే పనులకు సమానంగా ఇతరులు అనుసరించ లేరు. విరి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకొనబడుతుంది. విరి ప్రతిభ వెలుగులోకి రావడము కష్టము.








ధన సంపాదనే ధ్యేయముగా జీవించరు. ఎదో విధముగా ధనము సర్ధుబాటు అయి అవసరాలు గడిచి పొతాయి. అభిమానించే నమ్మిన అనుచర వర్గము వెంట ఉంటారు. కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు. స్త్రీల వలన అదృష్టము కలసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు. చాలా మందికి తండ్రి వలన మేలు జరగదు. ప్రజాభిమానముతో ఊన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహము అధికముగా ఉంటుంది. బంధువర్గము కంటే బయటి వారి సహాయము అధికముగా అందుతుంది. అంచనాలు చక్కగా పొరబాట్లు లేకుండా వేస్తారు.







 ఊహలు నిజము ఔతాయి.శని, శుక్ర, బుధదశలు యొగిస్తాయి. ఆధ్యతమక విషయాలలో అమ్కితభావముతో ఉంటారు. సామాజిక సేవ, సామాజిక న్యాయము దైవముగా భావిస్తారు.





జివిత మధ్యకాలములో మోకాల్ల నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటివి వస్తాయి. జ్యోతిష విషయాలు రాశి చక్రంలో పదవ స్థానంలో ఉన్న మకర రాశిని 270 డిగ్రీల నుండి 300 డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది. ఈ రాశిని సరి రాశిగాను, శుభ రాశి గాను, స్త్రీరాశిగాను, చర రాశిగానూ వ్యవహరిస్తారు. తత్వం భూమి, శబ్దం అర్ధ శబ్దం, రాత్రి సమయంలో బలం కలిగిన రాశి, పూర్ణ జల రాశి, ఊదయం పృష్టోదయం, సమయం రాత్రి, జాతులు పశువులు, పరిమాణం సమపరిమాణం, జాతి శూద్ర జాతి, సంతానం అల్పం, ప్రకృతి వాతం, వర్ణం కపిల, శ్వేత వర్ణాలు, కాల పురుషుని శరీరభాగాలలో మోకాళ్ళను సూచిస్తుంది.






 ఈ రాశి సౌమ్య రాశి. ఈ రాశి అధిపతి శని భగవానుడు. నిరయన రవి ఈ రాశిలో పదునాలుగు, పదహైదు తేదీలలో ప్రవేశిస్తాడు. ఈ రాశిలో అయిదవ డిగ్రీలో గురువు నీచ స్థిని పొందగా ఇరవై ఎనిమిదవ డిగ్రీలో కుజుడు ఉచ్ఛస్థితిని పొందుతాడు. ఈ రాశి పాలకులను, పాలనాధికారులను, హస్వ స్వరూపులను సూచిస్తుంది. ఈ రాశి నదులు వన ప్రాంతములను సూచిస్తుంది. ఈ రాశి వారు సౌందర్యవంతులు, ధైర్యవంతులు, ఆలోచనాపరులు, దానపరులై ఉంటారు.





 ఈ రాశి వారికి రెండు, ఏడు, పన్నెండు, ఇరవై, ఇరవై అయిదు, ముప్పై రెండు సంవత్సరాలలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ రాశి వారికి జలగండం కలిగే అవకాశం ఉంది. ఈ రాశి బొల్లి, వాతము, మానసిక రోగములకు కారకత్వం వహిస్తుంది.



 మకరరాశి

 ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు

 శ్రవణం 1,2,3,4 పాదాలు

 ధనిష్ట 1,2 పాదాలు


 మకరరాశి వారి అదృష్ట సంఖ్యలు 8, 3, 4, 5, 9. సోమ, మంగళ, శుక్రవారములు మంచివి.












ధనూరాశి SAGITTARIUS

ధనూరాశి.

 ధనూరాశి వారికి అత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి అధికము. స్వ విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. స్వ విషయాలలో ఇతరుల జోక్యము అంగీకరించరు. ఆధునిక విద్య, విద్యలపట్ల ఆసక్తి, వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్ఠలు కలిగి వింటారు. దైవ భక్తి, మంత్రోపాసన మొదలైన విషయాల అందు ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధముగా ఏమీ చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగిఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నింటిని పరిగణకి తీసుకుంటారు. అవకాశము ఉండీ సహాయము చేయ లేదన్న నింద భరించవలసి వస్తుంది. ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్ళకు ఏమి చేయలేక పోయామన్న భావన కలుగుతుంది.







సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయము చెయ్య లేరు. ఆత్మీయుల ప్రతిభా పాతవాలను సాధించాలని కోరిక ఉన్నా వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానము సాధించ లేరు. వారిని ఏ విధముగా అందలము ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు. స్వంత వారితోనె బద్ధ వైరము ఏర్పడుతుంది. వారు మిమ్మలను ఆర్ధికముగా అధిగమించి కయ్యానికి కాలు దువ్వుతారు. ధన సంపాదన కంటే మించినవి చాలా ఉనాయి అన్న వీరి భావన చెతకాని తనముగా భావించబడుతుంది. ఏ రంగములో అయినా ఎవరికైనా మీరు ఆదర్శముగా ఉండాలని విరు భావిస్తారు. మితో మమ్చిగావ్యవహరించి పనులు సాధించుకున్న వారు తరువాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించ లేని విషయముగా మారుతుంది. దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు అందుకుంటారు. ధనము కొరకు తాపత్రయ పడక వృత్తిలో గౌరవము పేరు ప్రతిష్ఠలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ధనము కొరకు ప్రాధెయ పడరు. ధనమె విరి చుట్టూ తిరగాలని అనుకుంటారు.





 ఆడ మగ అన్న తేడా లేక సంతానాన్ని సమంగా చుస్తారు. జ్యేష్ట సంతానము విషయములో జాగ్రత్త అవసరము. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సహాలను పాటించాలని ఒత్తిడి చెయ్యక వారి విచక్షణకు వదిలి వెస్తారు. స్వంత వారిని రక్షించే ప్రయత్నము చెయ్యరు. ఏ విషయములో అతిగా కలుగ చెసుకోరు. వీరి మాట దిక్కరిమ్చిన వారిని జీవిత కాలము శత్రులుగా భావిస్తారు. ఆత్మీయ బమ్ధువర్గము కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు, ప్రతిష్ఠలు దెబ్బ తింటాయి. స్వంత వాళ్ళు స్థాయిని మరచి కలహించుకుని నోరు పారేసు కోవడము ఇబ్బందిని కలిగిస్తాయి.  నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు.






సహొదర, సహోదరీ వర్గానికి చెసే సహాయము విపరీతాలకు దారి తిస్తుంది. ఎవరు ఏమనుకున్నా ధనూరాశి వారు మారక వారి సిద్ధామ్తాల కొరకు జీవిస్తారు. అధికార పదవులకు ఎంపిక ఔతారు. సమాజములో ఎందరికో జీవనోపాధి కల్పిస్తారు. వీరి మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు, సేవ ఎమ్దరికో ఆదర్శము ఔతాయి. అందరికీ మంచి చెస్తారు దాదాపు అందరికీ మంచి ఔతారు. స్వంత వారికి మంచి చేసే అవకాసము ఉండదు కనుక వరికి మంచి కాలేరు. వారసుడిని వీరు అనుకున్న విధముగా తీర్చి దిద్దడములో విఫలము ఔతారు.




 కుజ, రవి, రాహు, గురు దశలు యోగిస్తాయి. శుక్రదశా కాలములో కళత్రముతో విబేధాలు వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది. ధనూరాశి వారి జ్యోతిష విషయాలు ధనస్సు రాశి రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవ రాశి. ఈ రాశి బేసి రాశి, పురుష రాశి, అశుభరాశి, ద్విస్వభావ రాశి, అధిక శబ్దం కలిగిన రాశి, అగ్నితత్వ రాశి, రాత్రి వేళ బలము కల రాశి, పృష్టోదయ రాశి, అర్ధజాల రాశి, మనుష్య రాశి, సమ పరిమాణం కలిగిన రాశి, క్షత్రియ రాశిగా వ్యవహరిస్తారు. అల్ప సంతానం, ప్రకృతి ఉష్ణ ప్రకృతి, కాలపురుషుని శరీర భాగంలో తొడ భాగం, కపిల వర్ణం, క్రూర రాశిగా వ్యవహరిస్తారు. ఈ గ్రహానికి అధిపతి గురువు. ఈ రాశిలో ఏ గ్రహం ఉచ్ఛ, నీచాలను పొందదు. ఈ రాశిలో నిరయన రవి దిసెంబర్ పదిహేనవ తేదీన ప్రవేశిస్తాడు.





ఈ రాశి విద్యాలయాలు, న్యాయస్థానములు, ధర్మస్థాపనలు, చర్చీలు, మసీదులు, శరణాలయాలు, సత్రములు మొదలైన దైవీక విద్యా సంబంధిత ప్రదేశాలను సూచిస్తుంది. ఈ రాశి ప్రొఫెసర్లు, న్యాయమూర్తులు, మతభోదకులను మొదలైన వారిని సూచిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడగరులుగా, వినయ సంపన్నత, పెద్దల ఎడ గౌరవ భావం, మంచి మైత్రీ భావం, శీఘ్రకోపం, ఉపన్యాసకులు, ఉపన్యాసకులుగా ఉంటారు.






 ఈ రాశి వారికి పద మూడవ సంవత్సరంలో ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. ఈ రాశి కీళ్ళ వాతం, వాతం, ఊపిరితిత్తుల వ్యాధి, నడుము నొప్పి, ఎముకలు చిట్లుట మొదలైన రోగములకు కారకత్వం వహిస్తుంది. ధనుస్సు: ప్రమాదాలకు గురికావడం, తొడలు, పిరుదులు, నరములు వీటికి సంబంధించిన అనారోగ్యములు, గాయాలు, రక్తదోషము అనారోగ్యము, చర్మవ్యాధులు, స్థూల శరీరం వలన కలిగే ఇబ్బందులు, ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహం.. మొదలైనవి కలిగే అవకాశం వుంది.



 జాగ్రత్తలు: 1. వ్యాయామం, ప్రాణాయామం 2. తగిన మోతాదులో ఆహరం 3. మొలకలొచ్చిన శనిగలు, అల్పహారం 4. ఎక్కువ బాధ్యతలు తలపైనే వేసుకోకుండా మానసిక ప్రశాంతి కోసం రెండుసార్లు ధ్యానం చేయటం మంచిది.


 ధనూరాశి

 మూల 1,2,3,4 పాదాలు

 పూర్వాషాఢ 1,2,3,4 పాదాలు

 ఉత్తరాషాఢ 1 పాదం

 కన్యారాశి వారి అదృష్ట సంఖ్యలు 5, 1, 3, 4, 6. ఆది, శుక్ర, సోమ వారాల్లో శుభకార్యాలు తలపెట్టడం మంచిది.













వృశ్చికరాశి SCORPIO

వృశ్చికరాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సెకరణకు విలక్షణ పద్దతులు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడము కష్టము. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు.





భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారి వలన జీవితములో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకు ఒక సారి మార్చుకునే మనస్తత్వము వీరికి లేదు. జీవితములో మంచి స్థితికి రావడానికి ఇది కారణము ఔతుంది. జీవితములో ఎదగక పోవడానికి ఇదే కారణము. మంచితనము, పట్టుదల అధికముగా ఉండడానికి ఇదే కారణము.





 వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితములో మంచికి దారి తీస్తాయి. సహోదర, సహోదరీ వర్గము ఎదుగుదలలో ముఖ్యపాత్ర వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరిపట్ల చుపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది. వీరు అనేక మందికి శత్రువు ఔతారు. బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది. ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితములో మంచి మలుపుకు దారి తీస్తాయి. మీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. జరిగిన సంఘటనలను మరచి పోరు. తగిన సమయము వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. దూరప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు.








భూములు పెరగడము వలన జీవితములో చక్కని మలుపుకు దారి తీస్తాయి. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికముగా శ్రమిస్తారు. ఈ స్థితి జీవిత కాలము కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధము ఏర్పడుతుంది. జివితాశయ సాధనకు, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండ లేకుండా శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు. ముఖ్యమైన సమయాలలో బంధువర్గము వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురుచూసిన సహాయము అందదు. ఈ కారనముగా అభివృద్ధి కుంటువడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పేరు సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజాసంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. పోలీసు అధికారులుగా, న్యాయముర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు.









బంధువులవుతో వైరము, స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురి చేస్తాయి. గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి, గ్రహణాల సమయములో జాగ్రత్త వహించడము అవసరము. ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యము, ఇతరులను లక్ష్యపెట్టకుండా మీ అభిప్రాయాలను అమలు చెయ్యడము నష్టాన్ని కలిగిస్తుంది. సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల వలన ఇబ్బందులు ఎదురౌతాయి. ఈ విషయము ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది. వచ్చిన సదవకాశాలను వినియోగించుకుని కుటుంబసభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితము ఒడిదుడుకు లేకుండా సాగి పోతుంది.







వృశ్చికరాశి కొన్ని జ్యోతిష విషయాలు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది. ఈ రాశి రాశ్యధిపతి కుజుడు. ఈ రాశి సమ రాశి, శుభరాశి, స్త్రీరాశి, సరి రాశి, స్త్రీరాశి, స్థిర స్వభావరాశి, జలరాశి, కీటకరాశిగాను వ్యవహరిస్తారు. తత్వం జలతత్వం, సమయం పగటి సమయం, శబ్దం నిశ్శబ్దం, పరిమాణం దీర్ఘం, జాతి బ్రాహ్మణ, జీవులు కీటకములు, దిక్కు ఉత్తర దిక్కు, పాద జలతత్వం, సంతానం అధికం, ప్రకృతి కఫం, కాలపురుషుని శరీరాంగం మర్మ స్థానం, వర్ణం బంగారు వర్ణం.










ఈ రాశిలో చంద్రుడు నీచను పొందుతాడు. ఈ రాశి 210 డిగ్రీల నుండి 240 డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది. ఈ రాశిలో 3వ డిగ్రీలో చంద్రుడు నీఛను పొందుతాడు. నిరయన రవి ఈరాశిలో నవంబర్ పదిహేనున ప్రవేశిస్తాడు. ఈ రాశి విద్యుత్ కేంద్రాలు, శ్మశానాలు, ఇంటిలోని ఖాళీ ప్రాంతములను సూచిస్తుంది. విషము, విముతో కూడిన మందులు, పాములు పట్టువారి సూచిస్తుంది. ఈ రాశి వేరుశనగ, దుంపకూరలు లాంటి భూ అంతర్భాగాన పండే పంటలను సూచిస్తుంది. పాములు, పుట్టలు, విషకీటకములు,









ఈ రాశి గుణగణాలు తగాదాలకు సంసిద్ధత, కోపము, గూఢమైన కార్యాచరణ, పరస్త్రీ వ్యామోహం, ఇతరులను ద్వేషించుట, ఇతరుల కార్యములను చెడగొట్టుట, ధైర్యము కల వారుగా ఉంటారు. వీరిని సంతోషపెట్టుట కష్టం.





 జాతకం : వృశ్చికరాశి లక్షణాలు వీరికి మనస్సు చంచలంగా ఉంటుంది. ఊహాశక్తి మాత్రం అధికంగానే ఉంటుంది. ఇతరులు చేసే పనిని చూడగానే చక్కగా అనుక రించగల శక్తి వీరికుం టుంది. దానధర్మాలలో ఆసక్తి ఉంటుంది. ఇతరులు చేసిన తప్పులను కూడా క్షమిస్తారు. ఒకసారి ధైర్యం, మరోసారి చికాకు, అధైర్యం, ఒకసారి పనిని సక్రమంగా నెరవేర్చ డం, మరోసారి మధ్యలో మానేయడం ఇలా ఉంటుంది వీరి వ్యవహారం. అంటువ్యా ధులకు వీరు దూరంగా ఉండాలి. వీరికి తేలికగా కోపం వస్తుంది. ఆ కోపంలో ఎలా మాట్లాడుతు న్నారో గుర్తించకుండా మాట్లాడి ఇబ్బందుల నెదుర్కొంటారు. వీరి ఆకారం కొంచెం పొడవుగా ఉండి అమరిన శరీర సౌష్ఠవంతో అందంగా కనిపిస్తారు.









వీరి స్వభావంలో ఇతరుల దోషాలను హేళన చేసే తత్త్వం ఉంటుంది. తాము నిర్వహించే కార్యా లను పట్టుదలతో ఇతరులచే వేలెత్తి చూపించు కొనని రీతిలో నిర్వహించి అందరికంటె నేనే ఘ నుడను అనే భావాన్ని పొందుతారు. మనోభా వాలు బైట పడకుండా చక్కగా నటించగలరు. వీరికి కోపం ఎక్కువ. దైవ సంబంధమైన విష యాల్లో ఆసక్తి ఉంటుంది. వీరిలో స్వార్థచింతన ఇతరులు గుర్తించలేని రీతిలో ఉంటుంది. కాని మొండిగా ప్రవర్తించే తీరు ఇతరులకు బాధ కలిగి స్తుంది. రహస్యాలు గుర్తిస్తారు. తమను తామ కాపాడు కొనుటలో నేర్పు కలిగి ఉం టారు. ఇతరులను తమకు అనుకూలంగా మలచుకొంటారు. సంభాషణా నైపు ణ్యము, లేఖన నైపుణ్యము కలిగి ఉంటారు. ఎటువంటి వాతావరణంలోనైనా చక్కగా ఇమిడి పోగలరు.









దుష్టులతో స్నేహం వలన వీరు జీవి తంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు ఉపకారం చేసినా అది మరొకరికి తెలియడం వీరికి ఇష్టం ఉండదు. వీరి మనస్సులోని భావా లు గ్రహించడం కష్టం. వీరి జీవిత భాగస్వామికి అనారోగ్యావకాశాలు ఉంటాయి. వీరు ప్రతి పనిని స్వయంగా పరిశీలించుకొనినగాని తృప్తి పడరు. ఇతరులు చేసే పనులు వీరికి నచ్చవు. ఇతరులకు నీతిబోధ చేస్తారు. వీరికి పనులయందు శ్రద్ధ ఎక్కువ. ఆ శ్రద్ధ తీవ్రస్థాయి చేరుకొని ఆ శ్రమవల్ల అనారోగ్యం కలిగేవరకూ శ్రమ పడతారు. సుఖములనుభ వించడం విషయంలో కూడా అట్టి తీవ్ర స్వభా వమే కలిగి ఉంటారు. వీరి తీవ్ర స్వభావానికి తట్టుకొనలేక కొందరు మిత్రులు కూడా శుత్రు వులుగా మారతారు. వీరి మనస్సు లోతైన విష యాలు కలిగి ఉంటుంది. ఆ శక్తిని శ్రాస్తీయము లైన విషయములలో వినియోగించినచో గొప్ప పాండిత్యం సంపాదించగలరు. అలా కాకపోతే ఇతరుల తప్పులను గ్రహించుటయందే కాలం గడిచిపోతుంది. వీరికి పోటీలో విజయం సిద్ధి స్తుంది. విద్యా విషయంలో ఇట్టి పోటీ వీరిని ఉత్తమ స్థాయిలో నిలబెడుతుంది.







 ఈ రాశి వారికి మూడు, అయిదు, పదిహేను, ఇరవై అయిదు  చివర అంకెలుగల సంవత్సరాలలో ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. ఈ రాశి వారికి సుఖరోగములు, తెల్లపు విడుదల, మూలశంఖ, మూత్రకోశంలో రాళ్ళు, విషప్రయోగము వలన కలుగు వ్యాధులు, మూత్రకోశంలో రాళ్ళు.


 వృశ్చికం
 విశాఖ 4వ పాదం
 అనూరాధ 1,2,3,4 పాదాలు
 జ్యేష్ట 1,2,3,4 పాదాలు


 వృశ్చికరాశి వారి అదృష్ట సంఖ్యలు 9, 1, 2, 3.

ఆది, సోమ, గురు వారాలు యోగప్రదాలు.



తులారాశి LIBRA

తులారాశి

 తులారాశి వారి గుణగణాలు తులారాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. జీవితములో ప్రారంభములో ఎదురైన అపజయాలకు క్రుంగి పోక ఉపాయముతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు. తమ ఆలోచనను బయటకు చెప్పరు. ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఎత్తులకు పై ఎత్తులు వేయడములో నేర్పు కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు.







 ప్రజాకర్షణ అధికముగా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యొగ, వ్యాపార, వ్యాపకాలలొ రాణిస్తారు. ఆర్ధిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరాస్థులని అభివృద్ధి చెస్తారు. అనువంశికముగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. అలంకార ప్రియులు. ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలరు. కళా, సాహిత్య, రాజకీయ రంగాలలో రాణిస్తారు. యవ్వన ప్రాయములో అదృష్టము కలసి వస్తుంది. జీవితములొ అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంముగా నిలుస్తారు. బంధు వర్గముతొ విబేధాలు దీర్గ కాలము కొనసాగుతాయి. ఏ విషయములో రాజీ లేకుండా శ్రమిస్తారు.








 కూతురుకి మాత్రము అన్ని విషయాలలొ మినహాయింపు ఉంటుంది. వ్యక్తిగత సామర్ధ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చెసుకుంటూనే ఉంటారు. ఒక స్థాయికి వచ్చినా పాత పద్దతులు పొవు. అత్మీయులతో విబెధాలు వస్తాయి. గతము మరిచారన్న విమర్శను ఎదుర్కొంటారు. విదేశీయానము లాభిస్తుంది. సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. శని మహర్ధశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగము ఉంటుంది.








 జీవితములో నిందారోపణలు బాధ కలిగిస్తాయి. వైరి వర్గము సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి ఒక్కుమ్మడిగా వ్యతిరేకము ఔతారు. వైరి వర్గము ఒక్కటి కానంత వరకు వీరికి ఇబ్బంది లేదు. స్వంత వర్గము భయపడకుండా జాగ్రత్త వహిస్తారు. అంతర్యాన్ని గ్రహించే ప్రయత్నము చెయ్యక స్వజనుల అసమ్మతికి తగిన కాణనము కనుగొనడములో విఫలము ఔతారు. ఉన్నత స్థానములో ఉన్న వారి వలన అన్యాయపు తీర్పులు అమలౌతాయి. ముఖ్యముగా బాల్యములో ఉన్నత స్థానాలలో ఉన్న వారి వలన కుటుంబానికి అన్యాయము జరుగుతుంది.





న్యాయపరమైన విషయాలు జివితములో ప్రాధాన్యత సంతరించికోకుండా జాగ్రత్త వహించాలి. సాహసోపేతమైన నిర్ణయాలు కలసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వాచ్చిన విభేదాలు ఇబ్బందికి గురి చేస్తాయి. విలాసవంతమైన జీవితానికి కావలసిన సామగ్రికి అధికముగా ఖర్చు చేస్తారు. పడమర, దక్షిణ దిక్కులు లాభిస్తాయి. శుక్ర మైఢ్యమి కాలములో జాగ్రత్త వహించడము మంచిది. ప్రజాబలము, సన్నిహిత వర్గము అండదండలు, సంఘంలో మంచి పేరు ఉంటాయి.







దీపావళి నాడు చేసే లక్ష్మీ పుజ మేలు చేస్తుంది.

మేధస్సు, సాంకెతిక పరిజ్ఞానము, స్వీయ విద్య అక్కరకు వస్తాయి. బాల్యములో మిశ్రమ ఫలితాలు ఉన్నా స్వయంకృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు.




తులారాశి కొన్ని జ్యోతిష విషయాలు రాశి చక్రంలో ఈ రాశి ఏడవది. ఈ రాశిని పురుష రాశి గాను, విషమ రాశిగానూ, క్రూర రాశిగానూ, అశుభరాశి గానూ, చర రాశిగానూ, బేసి రాశిగానూ వ్యవహరిస్తారు. తత్వం వాయు తత్వం, శబ్దం నిశ్శబ్దం, సమయం పగటి సమయం, జాతి వైశ్యజాతి, అధిపతి శుక్రుడు. సూర్యుడు ఈ ర్శిలో నీచ స్థితిని పొందుతాడు. ఉదయం శీర్షోదయం, పాదజల తత్వం, జీవులు మానవులు, దిక్కులు పడమర, వర్ణం నీల వర్ణం, పరిమాణం దీర్ఘం, ప్రకృతి వాత ప్రకృతి, సంతానం అల్పం. నిరయన రవి ప్రవేశం సెప్టంబర్ పదహేను. ఈ రాశిలో పది డిగ్రీలలో రవి నీచను పొందుతాడు. ఈ రాశిలో ఇరవై డిగ్రీలలో శని పరమోచ్ఛను పొందుతాడు. ఈ రాశి వారి వృత్తులు వ్యాపారం, న్యాయశాలలు, భోజన శాలలు. ఈ రాశి ప్రదేశములు పట్టాణములు, దుకాణములు.






 ఈ రాశి వారి గుణగణాలు

 సుఖములు అనుభవించుట. సమాజంలో గుర్తింపు, పెద్దల ఎడ గౌరవం, సమాజంలో గుర్తింపు, పాండిత్యం, కళాభిమానం, కళత్రం మీద అభిమానం, ద్వికళత్రం, దానగుణం, వ్యాపారం చేసి ధనార్జన మొదలైన ప్రత్యేక గుణాలు.






 హెర్నియా, వరబీజం, కీళ్ళవాతం నడుము నొప్పికి తులారాశి కారకత్వం వహిస్తుంది. తుల... ఆందోళన, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, మూత్ర సమస్యలు, శోష, కీళ్ళవాతం, పైత్యం, శిరోవ్యాధులు, మలబద్ధకం, రక్తహీనత కలిగే అవకాశాలు
ఎక్కువ.








 జాగ్రత్తలు: 1) బొబ్బర్లు ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. 2) యోగా, వ్యాయామం తప్పనిసరి. 3) అందరూ మీరు చెప్పినట్టే వినాలి అనే ధోరణి వదిలేయండి.




 తులారాశి

 చిత్త 3,4 పాదాలు

 స్వాతి 1,2,3,4 పాదాలు

 విశాఖ 1,2,3 పాదాలు



 తులారాశి వారి అదృష్ట సంఖ్యలు 6, 2, 7, 9. సోమ, శుక్ర, శని వారాలు వీరికి అనుకూలిస్తాయి.









కన్యారాశి VIRGO

కన్యారాశి -

కన్యారాశి వారి గుణగణాలు కన్యారాశిలో జన్మించిన వారు స్వయముగా ప్రతిభ కలిగి ఉండడమే కాక ఇతరుల ప్రభను గుర్తించగలరు. ఎ పనుకి ఎవరు సమర్ధులో వీరు చక్కగా నిర్ణయించగలరు. బధుప్రితి అధికముగా ఉంటుంది.







 గణితములో ప్రజ్ఞ అధికముగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కలిగిఉంటారు. సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము వీరికి ఉంటుంది. ఇతరుల నెర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నెర్పు ఉన్నా దానిని ఋజువు చేసే ప్రయత్నము చేయలేరు. రచయితగా, లేఖికునిగా రాణిస్తారు. పత్రికా రంగములో రాణించగలరు. అకౌంటు, ఆర్ధిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యము కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించగలిగిన నేర్పరులు.








 ప్రభుత్వరంగములో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి. అర్ధికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది. ధనమును చక్కగా వినియోగంచగలిగిన నేర్పరితనము ఉంటుంది. మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండుట వంటివి వీరికి నష్టము కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మక పోయినా ఇతరులను నమ్మి మోసపోతారు. అధ్యాత్మిక గురువులకు సమ్బంధించిన వ్యవహారాలు మెలు చీస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగములో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి.







 వివాహజీవితములో ఒడి దుడుకులు ఊండక పోయినా స్వయంకృత అపరాధము వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. శుక్రదశ యోగిస్తుంది. మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితము గడుపుతారు. ఆపదలలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బదుల్లుకు గురి ఔతారు. ముద్రణ, టెండర్లు, ఒప్పంద పనులు కలిసి వస్తాయి. సినీ, కళా రంగాలలు ప్రతిభను నిరూపించుకుంటారు. వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును ఏర్పరచుకుంటారు. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు. నష్టములో ఉన్న సంస్థలను కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగిన దక్షత వీరికి ఉంటుంది. హాస్యము, అంచనాలకు సంబంధిచిన రచనలు చేయగలరు. ఏ పని అయినా చివరి వరకు కొనసాగవలసి ఉంటుంది. పనులు చక్కదిద్దటములో కొద్దిపాటి నిర్లక్ష్యము చుపించినా నష్తపోగల అవకాశము ఉంది.






 పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయములో వివ్వాదాలు తల ఎత్త వచ్చు. ఆస్తులు అన్యాక్రాంతము అయ్యే అవకాశము ఉంది. గృహము మీకు నచ్చిన విధముగా తీర్చి దిద్దుకుంటారు. ఉత్తర, దక్షిణ దిక్కులు కలసి వస్తాయి. కుజదశలో రవాణా వ్యాపారము కలసి వస్తుంది. విష్ణు ఆరాధనా, గణపతి ఆరాధనా వలన సమస్యలను అధిగమించ వచ్చు.




 కన్యారాశి జ్యోతిష విషయాలు రాశి చక్రంలో కన్యారాశి ఆరవది. ఈ రాశి అధిపతి బుధుడు.ఈ రాశిని స్త్రీ రాశి, శుభరాశి, సమ రాశిగా వ్యవహరిస్తారు. స్వభావం ద్విస్వభావం, తత్వం భూతత్వం, శభ్ధములు అర్ధ, ఉదయం శీర్షోదయం, జీవులు మనుష్య, నిర్జల తత్వం, పరిమాణం దీర్ఘం, వర్ణములు చిత్రవర్ణం, జాతులు శూద్ర, దిక్కు దక్షిణం, ప్రకృతి వాతం, సంతానం అల్పం,






కాలపురుషుని శరీర భాగం ఉదరం. వ్యాధులు :- డయేరియా, నులి పురుగులు, ఏలిక పాములు, కలరా, అజీర్ణము, టైఫాయిడ్. కన్య... పొట్ట, నాభి ప్రదేశం, వెన్నెము కింది భాగాలకు అనారోగ్యం, అజీర్ణం, విరేచ నాలు, అతిసారం, జీర్ణకోశ వ్యాధులు కలిగే అవకాశం ఉంది.







 జాగ్రత్తలు: 1) సమయానికి మితాహారం తీసుకోవడం. 2) వ్యాయామం, మొలకెత్తిన పెసలు. 3) ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గింపు. 4) ఆత్మవిశ్వాసం పెంచుకోవడం.



కన్యారాశి

 ఉత్తర ఫల్గుణి 2,3,4 పాదాలు

 హస్త 1,2,3,4 పాదాలు

 చిత్త 1,2 పాదాలు

 కన్యారాశి వారి అదృష్ట సంఖ్యలు 5, 1, 3, 4, 6.

 ఆది, శుక్ర, సోమ వారాల్లో శుభకార్యాలు తలపెట్టడం మంచిది.










సింహరాశి LEO

సింహరాశి

సింహరాశి వారి గుణగణాలు ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖజీవితానికి దూరము చేస్తుంది.





వ్యక్తిగత ప్రతిష్ఠకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్ధిక విషయాలలో సమర్ధులుగా పేరు గడీస్తారు. వంశప్రతిష్ట, కులగౌరవాలకు ప్రాధానయత ఇస్తారు. ఇతర కుల, మత, వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారము రాదు. కఠిన మైన స్వభాము కలవారన్న ముద్ర పడుతుండి. సన్ని హితులు, సేవకా వర్గము వీరి చేత కొంత ఆలస్యముగా అయినా పని చేయించుకోగలుగుతారు. వీరిని భయ పెట్తి లొంగదీసు కోవడము దాదాపు అసాధ్యము. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మక పోయినా లక్ష్యపెట్టరు. వీరి అంచనా నూటికి తొంభై పాళ్ళు నిజము ఔతాయి. వైఫల్యము చెందిన పది శాతం గుర్తించ తగిన నష్టాన్ని కలిగిస్తుంది.










 సన్నిహితులు, బంధువులు, రక్తసంబంధీకులు, స్త్రీల వలన అధికముగా నష్టపోతారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము, అల్పులను ఆశ్రయించుట తప్పక పోవచ్చు. రాజకీయ రంగములో ప్రారంభములోనే ఊన్నత స్థితి సాధిస్తారు. సాధారన స్థితిలో ఉన్నప్పుడు ఉన్నతవర్గాల వారికి దురము ఔతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరము చేస్తారు. శి







రోవేదన, పాఋశ్య వాయువు, కీళ్ళ నొప్పులు వేధిస్తాయి. సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయముగా వ్యవహరిస్తారు. ఉద్యోగుల పత్ల వారి విధుల పత్ల వీరికి ఉన్న స్పష్ట మైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. పైన అధికారములో ఉన్న వారు వీరి ధనముతో ప్రోత్సాహముతోనే ఇతరులను బలవంతులను చేసి చివరకు వీరికె పోటీగా నిలుపుతారు. కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురౌతాయి. స్వంత వారు వదిలి వేసిన బాధ్యతలన్ని వీరి తల మీద పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తరువాత స్వమ్త వాళ్ళ వలన సమస్యలు ఎదురౌతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగి పోతారు. రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యొగిస్తాయి. శని దశ కూడా బాగానే ఉంటుంది. స్నేహితులు మరచి పోలేని సహాయాలు చేస్తారు. వ్యతిరేకముగా ఆలోచిమ్చనమ్త కాలము మెలు గుర్తుంటుంది. కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యహారాలు లాభిస్తాయి. ప్రయోజనము లేని శ్రమకు దూరముగా ఉండాలి. వీరి ఉద్దేశ్యాలు మంచివే అయినా ఆచరనలో పెట్టదము కష్టము అని గుర్తించ వలసి ఉంటుంది.










 శివార్చన, ఆంజనేయార్చన మేలు చేస్తుంది. సింహరాశి జ్యోతిష విషయాలు సింహ రాశి రాశి చక్రంలో అయిదవ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఇది పురుష రాశి, విషమ రాశి, స్థిర రాశి, అగ్ని తత్వ రాశి, అశుభ రాశి, పురుష రాసి అని వ్యవహరిస్తారు. జాతి క్షత్రియ జాతి, శబ్దం అధికము, ప్రదేశము నిర్జల ప్రదేశములు, జీవులు పశువులు, వర్ణము పాండు వర్ణం ధూమ్ర వర్ణం, దిక్కు తూర్పు, పరిమాణం దీర్ఘం, ప్రకృతి పిత్త ప్రకృతి, సంతానం అల్పం, కాల పురుషుని అంగం గుండె, సమయము దినం, జీవులు పశువులు. కొండలు, నిర్జన ప్రదేశములు, ఏడారులు, కొండలు, నీటి ఎద్దడి కలిగిన అడవులు ఈ రాశి ప్రభావిత ప్రాంతములు. ఈ రాశి పొడుగు రాశి.










సింహం... వీపు, వెన్నెముక, హృదయం సంబంధించిన వ్యాధులు, హృదయ దేర్భల్యం, గుండెదడ, నడుము నొప్పి, పండ్ల నొప్పి, ముఖవ్యాధి మొదలనవి సంభవించవచ్చు.








 జాగ్రత్తలు: 1) తమ మనసులోని భావాలు బహిరంగపరచడం. 2) సూర్యనమస్కారాలు, ప్రాణాయామం. 3) తమ పనులు తామే నిర్వహించడం. 4) పండ్లు వాడడం మంచిది.



 సింహరాశి

మఖ 1,2,3,4 పాదాలు

 పూర్వఫల్గుణి 1,2,3,4 పాదాలు

 ఉత్తర ఫల్గుణి 1 పాదం

 సింహరాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 2, 3, 5, 9.


ఆది, మంగళ, గురువారములు వీరికి అనుకూలం.










కర్కాటకరాశి CANCER

కర్కాటకరాశి

కర్కాటకరాశి వారు మనోధైర్యము కలిగిన ఉంటారు. జల సంబంధిత విషయాఒలు ఇబ్బందులకు గురి చేసినా అవే జీవితములో పురోగతిని కలిగిస్తాయి. అన్ని విషయాలకు పోరాటము ఉంటుంది. ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు మార్లు కష్టపడ వలసి వస్తుంది. సన్నిహిత వర్గములో నిజాయితీపరులు ఉన్నంత వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు.




రాజకీయరంగములో చక్కగా రాణిస్తారు. మహాలక్ష్మీ పుజ వలన ఆటంకాలను అధిగమించగలరు. లలితకళలలో ప్రవేశము ఉంటుంది. కళా సమ్బంధిత వృత్తి వ్యాపారాలలో రాణించగలరు. సంతానము పురోగతి సాధిస్తారు. ప్రారమ్భములో సమస్యలు ఉన్నా నిదానముగా వాతిని అధిగమిస్తారు. రాణించలేమని భావిమ్చిన రంగాలలో రాణిస్తారు. హాస్యము పత్ల ప్రత్యేకమైన అవగాహన ఉంటుంది. కార్యనిర్వహనకు చక్కని పధకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు. నిష్కారణ శతృ వర్గము ఎప్పుడూ పొంచి ఉంటుంది.  ఊపిరి తిత్తుల మీద ప్రత్యేక శ్రద్ధ అవసరము. ఇతరుల పేరు మీద చెసే వ్యాపారాలలో ద్రోహము ఎదురౌతుంది. టెండర్లు, ముద్రణా పనులు, చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి. ధనము నిలువ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికముగా శ్రమపడవలసి వస్తుంది. నిందలు పుకార్లను ఎదుర్కొంటారు. అయినా ప్రజాకర్షణ బాగా ఉంటుంది. పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు. పట్టువిడుపు లౌక్యము ప్రదర్శించుట వలన ప్రయోజనము ఉంటుంది. వివాదాలు ముదరకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము.











 సన్నిహిత వర్గాన్ని మితి మీరి ప్రోత్సహించడము వలన వారి వలన పోటీ ఏర్పడుతుంది. చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాట్ల వలన అధికముగా నష్టపోతారు.






 అనుకున్న వివాహము ఒకటి చెసుకున్నది మరొకతి ఔతుంది. శని గ్రహ అనుకూల పరిస్తితులు ఉన్న అనుకున్న వివాహము జరిగినా వివ్వహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. సంబమ్ధబాంధవ్యాలు లెని వారు ప్రోత్సహిమ్చి ఆశ్రయము ఇవ్వదము జీవితములో మలుపుకు దారి తీస్తుంది. విదేశీ, విద్య, ఉద్యోగము, విదేశీ యానము కలసి వస్తాయి.







భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి. అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవదము కష్తము. స్వార్జితము నిలబడుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు. ఏమాత్రము సంబంధము లెని విషయాలలో ఎదురైయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి. దైవానుగ్రహము అప్రతిష్ఠ రాకుండా కాపాడుతుంది. అహంభావము లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. ఉన్నత స్థానము కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది.






భొగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని మరచి పోరు. రవి, చంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుంది. కర్కాటకరాశి జ్యోతిష విషయాలు కర్కాటక రాశి అన్నది రాశి చక్రంలో నాలుగవది. రాశి అధిపతి చంద్రుడు. ఈ రాశి అందు ఉచ్ఛ స్థితిని, కుజుడు నీచ స్థితిని పొందుతాడు. దీనిని సమ రాశి, జలరాశి, శుభ రాశి, స్త్రీ రాశి, సౌమ్య రాసి, చర రాశి, కీటక రాశిగా వ్యవహరిస్తారు. ప్రకృతి కఫము, సమయము రాత్రి, సంతానము అధికం, శభదం నిశ్శబ్ధం, దిశ ఉత్తరం, ఉదయం పృష్టోదయ రాశి, వర్ణం పాటల వర్ణం (లే గులాబి), జాతి శూద్ర, జీవులు జల జీవులు, కాల పురుషుని అంగములు వక్షస్థలం, తత్వం పూర్ణ జల తత్వం.రస తత్వము కలిగిన బత్తాయి, నిమ్మ, నారంజ, కమలా, చెరకు, కొబ్బరి ఫలాలకు ఈ రాశి కారకత్వము వహిస్తుంది. బావులు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రములు, ఇతర జలాశయములకు ఈ రాశి కారకత్వము వహిస్తుంది.






ఈ రాశి కఫ సంధిత రోగములు, అజీర్ణము, పిత్తాశయంలో రాళ్ళు, కామెర్లు వంటి వ్యాధులకు కారకత్వము వహిస్తుంది. కర్కాటకం... రొమ్ము, జీర్ణకోశం, హృదయనాళాల సంబంధిత వ్యాధులు, నీరుపట్టడం, కఫం, కేన్సర్‌, హిస్టీరియా, కీళ్ళనొప్పులు, శోష, గొంతులో బాధ, మానసిక శారీరక బలహీనతలు, కంటికి సంబంధించిన అనారోగ్యాలు, అజీర్ణం, వరిబీజం వంటివి వచ్చే అవకాశం ఉన్నది.




 జాగ్రత్తలు: 1) ఎక్కువ ఆలోచనలు మానాలి. 2) యోగాసనాలు చెయ్యాలి. 3) తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనే అనుమానాలు విడనాడితే మంచిది. 4) మెడి టేషన్‌ చేయాలి.


 కర్కాటకరాశి
 పునర్వసు 4వ పాదం
పుష్యమి 1,2,3,4 పాదాలు
 ఆశ్లేష 1,2,3,4 పాదాలు

 కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్యలు 2 మాత్రమే. మంగళ, శుక్రవారములు మంచివి.














మిథునరాశి GEMINI

మిథునరాశి
మిధునరాశి వారి గుణగణాలు

 మిధున రాశి వారు హాస్యప్రియులు. తాము అనుకున్నది సామరస్యముగా సాధించడానికి ప్రయత్నిస్తారు. వ్యవహార విషయాలను కూడా తమ శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు ప్రణాళిక చక్కగా వేస్తారు. 





సమయానుకూలముగా మాట్లాడే నేర్పు ఉంటుంది. ఉన్నత స్థానాలలో ఉనా వారు, బంధు వర్గము, స్వజాతి వారు ముఖ్యమైన సందర్భాలలో మోసము చెస్తారు. బాల్యము నుండి కష్టాలు ఎత్తు పల్లాలు చూస్తారు. జీవితానుభవము, అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనము నుండి అలవడుతుంది. 








వివాహము, సంతానప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచి పోతుంది. మాట తప్పె మనుషుల వలన జీవితములో పని చేయించుకుని ప్రత్యుపకారము చేయని వారి వలన ఇబ్బందులు ఎదురౌతాయి. వంశపారంపర్యముగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలసి రాదు. ఇతరుల సొమ్ము మీద బమ్ధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు. స్వార్జితము మీదే అధికముగా దృష్టి సారిస్తారు. పధకము రచించడములో దానిని అమలు చేయదములో నైపుణ్యము ఉంటుంది. కార్యక్రమాలను అమలు చేయడానికి తోడు కావాలి. ఇది వీరికి చెప్పుకోతగినంత నష్టము కలిగిస్తుంది. 









ఆదర్శముగా ఉండే వీరి భావాలు పలువురుకి అయిష్టత కలిగిస్తుంది. అవకాశాలను సద్వినియోగము సామధ్యము కలిగి ఉంటుంది. రాజకీయము పత్ల విపరీతమైన ఆసక్తి కలిగి ఉంటారు. శుక్రదశ, శనిదశ యోగవంతమైన కాలము. ఈ దశలలో మంచి ఫలితాలు సాధిస్తారు. జీవితములో జరిగిన నిరాదరణ భవిష్యతూకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు. తాను పడిన కష్టాలు ఇతరులు పదకూడదని భావిస్తారు. సత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయము వచ్చినప్పుడు మాత్రము ప్రతీకారము తీర్చుకోరు.









 సంతానముతో చక్కని అనుబంధము ఉన్నా తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నము మాత్రము చేయరు. వీరి సామర్ధ్యాన్ని, నైపుణ్యాన్ని, ఆలోచనలను ఇతరులు తిరస్కరిస్తారు. సమస్యలను పరిష్కరించే వ్యక్తుల సహకారము వీరికి ఉంటుంది. ప్రభుత్వపరముగా, చట్టపరముగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్ధము చేసుకుంటారు. చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు. అన్ని లెక్కలు వ్రాత పుర్వకముగా లేకున్నా చక్కగా గుర్తు ఉంటుంది. వివాదాలకు దూరముగా ఉంటారు కాని సమస్యలకు దూరముగా పారి పోరు. ప్రతిఘటించే తత్వము అధికముగా ఉంటుంది. వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడములో శ్రద్ధ వహిస్తారు.










 స్త్రీల వలన పురుషులకు పురుషుల వలన స్త్రీలకు పకారము జరుగుతుంది. ఐకమత్యము కొరకు గ్రూఫు రాజకీయాలను రూపుమాపడనికి అధికముగా శ్రమిస్తారు. జీవితములీ రెండు విధముల వృత్తి ఉద్యోగాలను చేసే నైపుణ్యము ఉంటుంది. ప్రధాన విద్యకంటే మధ్యలో నెర్చుకున్న విద్య జీవితానికి అధికముగా ఉపయోగపదుతుంది.







 సన్నిహితుల వలన, బంధువుల వలన ఇబ్బమ్దులకు గురి ఔతారు. గతాన్ని గురిమ్చి అధికముగా ఆలోచించడము తగ్గించుకుంటే ఉన్నత స్థితికి చేరుకుంటారు. శివార్చన, శివభక్తి, రుద్రకవచ పారాయనము వలన మెలు జరుగుతుంది. 







మిధునరాశి జ్యోతిష వివషయాలు మిధున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి. జూన్ మాసం సగము నుండి జూలై మాసం సగం వరకు దినంలో లగ్నారంభ రాశి. దీనికి అధిపతి బుధుడు, స్వభావం ద్వి స్వభావం, లింగం పురుష, సమయము రాత్రి, ఉదయం శీర్షోదయం, జీవులు మానవులు, శబ్దం అధిక, తత్వం వాయువు, వర్ణం ఆకుపచ్చ, పరిమాణం సమ, జాతి వైశ్య, దిక్కు పడమర, సంతానం సమ , కాలపురుషుని అంగము బాహువులు, రాశి పురుష, విషమ, ప్రకృతి వాతం.




 ఈ రాశి సంబంధిత వృత్తులు సాంకేతికములు, వార్తలు మొదలైనవి. అంటే టెలి ఫోన్లు, సమాచార కేంద్రములు, రేడియోలు ఆకాశవాణి కేంద్రములు, విమానములు విమానాశ్రయాలు, వాతావరణంఅ కేంద్రములు, వాణిజ్య కేంద్రములను, రైల్వేలు రైల్వే వాణిజ్య విభాగంలను సూచిస్తుంది. వార్తలు, వారపత్రికలు, ప్రచురణాధిపతులను సూచిస్తుంది. 





ఈ రాశి వారు పొడగరులు. ఈరాశి ఉబ్బసము, క్షయ, దగ్గు, ఫ్లూ జ్వరము మొదలైన రోగాలకు కారణము. మిథునం... విశ్రాంతి లేకపోవడం, ఊపిరితిత్తుల వ్యాధులు, మనోవ్యాధి, ప్రాణవాయువు (ఆక్సిజన్‌ లేకపోవుట), మూలవ్యాధి, న్యుమోనియా, క్షయ, ఫ్లూ, అండవ్యాధులు, మానసిక రోగాలు, చెవుడు, తలనొప్పి, ఉన్మాదం (పిచ్చి) మొదలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. 





జాగ్రత్తలు: 1) పౌష్టికాహారం తీసుకోవడం. 2) గాలి, వెలుతురు ఉన్న గృహ నివాసం. 3) క్రీడలు, వ్యాయామం తప్పనిసరి. 4) కాలీమూరు (ఆయుర్వద మందు) వాడాలి. అంతేకాకుండా ఆరోగ్యాన్ని ప్రసాదించే మొలకెత్తిన పెసలు పండ్లు ఫలాలు  తినడం చాలా మంచిది. 

మిథునరాశి 

మృగశిర 3,4 పాదాలు.

 ఆరుద్ర 1,2,3,4 పాదాలు 

పునర్వసు 1,2,3 పాదాలు 

మిధునరాశి వారి అదృష్ట సంఖ్యలు 5, 1, 6, 7, 8. ఆది, శుక్ర, శని వారాలు వీరికి అదృష్టాన్నిచ్చే రోజులు.