14 October 2016

ఎంత సంపాదించినా ధనం ఉండక పోవడానికి కారణాలు.



అయితే ఎంత సంపాదించినా ఒక్క రూపాయని కూడా నిలుపుకోలేని పరిస్థితి కొందరి ఇళ్ళల్లో కనుపిస్తుంటుంది. అందుకు కారణాలు అనేకం. ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టకపోవడం, అనవసర ఖర్చులు చేయడం వంటివే కాక ఇంటికి సరైన వాస్తు లేకపోవడం కూడా ఈ పరిస్థితికి దోహదం చేస్తుంది అంటున్నారు వాస్తు నిపుణులు. సంపాదించిన డబ్బును పొదుపు చేయడం లేదా మరింత డబ్బు సంపాదించాలనుకోవడానికి వాస్తు పరమైన మార్పులను కొన్నింటి ని సూచిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం…









ఇంటికి నైరుతి మూలను తమిళులు కుబేర స్థానమంటారు. ఇక్కడ ఎటువంటి సంప్‌ కా నీ, సెప్టిక్‌ టాంక్‌ కానీ బోర్‌వెల్‌ కానీ భూమిలోపల ఎటువంటి నిర్మాణం లేకుండా చూసుకోవడం వల్ల ఇంట్లో ధనం నిలుస్తుంది.
నగలు, ఇతర విలువైన పత్రాలు పెట్టే బీరువాలను, లాకర్లను వాస్తు ప్రకారం పెట్టుకోవాలి. తూర్పు ముఖంగా తలుపు తెరుచుకునే పశ్చిమపుగోడకు వీటిని పెట్టడం మంచిది. లేదా తూర్పు లేదా ఉత్తర ముఖంగా తలుపు తెరుచుకునేలా నైరుతి మూల ఉంచాలి.






లాకర్లు ఉత్తర ముఖం తెరుచుకునేలా దక్షిణపు గోడకు పెట్టడం కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది. లాకర్‌ తలుపులు ఉత్తరముఖంగా తెరుచుకోవడం మంచిది. ఎందుకంటే వాస్తు ప్రకారం ఈ దిక్కుకి కుబేరుడు అధిపతి.
బీరువాను ఈశాన్య మూలలో ఎప్పుడూ పెట్టకూడదు. ఎందుకంటే దీనివల్ల సంపద నష్టం జరుగుతుంది. ఆగ్నేయ, వాయువ్య దిక్కులు కూడా మంచివి కావు ఎందుకంటే దీనివల్ల అనవసర ఖర్చులు అధికమవుతాయి. డబ్బులు పెట్టుకునే బీరువాను ఎప్పుడూ దూలం కింద ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఆర్థిక స్థిరత్వం మీద ఎక్కువ ఒత్తిడి పెడుతుంది.ఈశాన్య మూల కూడా సంపద వృద్ధికి తో డ్పడుతుంది.




ఇంటికి ఈ మూలన సంప్‌, బోర్‌వెల్‌ లేదా బావి నిర్మిస్తే అభివృద్ధి, స్థిరత్వం వస్తాయి. ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిల్వ ఉండకపోవడం లేక అది వృద్ధి జరగకపోవడం వంటివి ఎదుర్కొంటుంటే ఇంట్లో రాత్రంతా కనీసం ఒక దీపానై్ననా వెలగని స్తూ ఉండాలిట. ఎందుకంటే కాం తి కూడా ఒక రకమైన శక్తే. ఫెంగ్‌షూయ్‌ ప్రకారం దీన్ని యాంగ్‌ శక్తి అం టారు. ఇది చలనం తీసుకువస్తుంది.
ఇంట్లో చేపల అక్వేరియం పెట్టుకోవడం సంపద వృద్ధి కావడానికి దోహదం చేస్తుందిట. ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండే చేపలను ఎం చుకొని ఇంటికి తెచ్చుకోవాలి. నీటిని శుభ్రం గా, గాలిపోయేలా ఉంచాలి. చేపలు అక్వేరియంలో తిరుగుతూ ఉంటే ఆ శక్తి ఇంట్లో సం పద వృద్ధి కావడానికి దోహదం చేస్తుందిట. దీ నిని గదిలో నైరుతి దిక్కున ఉంచడం మంచిది.






మీ అపార్ట్‌మెంట్‌ ముఖద్వారం పొడవైన కా రిడార్‌ చివర ఉన్నప్పుడు అక్కడ ప్రవహించే శ క్తి చాలా ఉధృతంగా ఉంటుంది. ఇది మీ ఆర్థిక పె ట్టుబడులకు రిస్క్‌ కాగలదు. దీనిని తగ్గించేందుకు కారిడార్‌ మధ్యలో అంటే దారికి అడ్డంగా కాదు గాని ఒక వైపు ఒక మొక్కను పె డితే ఆ ఉధృతి తగ్గుతుంది.






ఇంటి ముఖ ద్వారానికి మంచి రంగులు వేయడం ద్వారా సంపదను ఆహ్వానించవచ్చు. పక్కింటివారి గోడలకు, ముఖద్వారాలకు భిన్నంగా, ఆకర్షణీయమైన రంగులు వేసుకోమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా జీవితంలో ఆర్థికాంశాల పట్ల మరింత స్పష్టత కావాలనుకున్నప్పుడు మీ ఇం ట్లో గాజు వస్తువులను ఒకసారి పరిశీలించండి. ముఖ్యంగా ఇంటికి గాజు కిటికీ తలుపులు వుంటే అవి ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. మురికిగా ఉన్న అద్దపు తలుపులు సంపదను లోనికి రానివ్వవట.కిటికీకి క్రిస్టల్స్‌ వేలాడదీయడం వల్ల శక్తి చురుకుగా ప్రవహిస్తుంది. సూర్యకిరణాలు వా టిని తాకినపుడు అవి రంగు రంగుల అద్భుత ఇంద్రధనస్సులను సృష్టిస్తాయి. నేరుగా సూర్యకిరణాలు ప్రసరించే కిటికీని ఎంచుకుని అక్క డ ఒక క్రిస్టల్‌ను వేలాడదీస్తే మీ కెరీర్‌ వృద్ధికి అది దోహదం చేస్తుందంటున్నారు.







ఆదాయానికన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటే మొక్కలను కానీ విత్తనాలను కానీ టాయిలెట్లలో ఉంచాలి. ఇది ధన ప్రవాహం వృధా కావడాన్ని నిరోధిస్తుంది. ఎందుకంటే ఎదిగేవి ఏవైనా నీటి శక్తిని తిరిగి పీల్చుకొని రీసైకిల్‌ చేస్తుంటాయి.


మీ క్యాష్‌ బాక్స్‌ను లేదా లాకర్‌ను ప్రతిఫలించేలా బీరువాలో ఒక అద్దాన్ని పెట్టండి. ఇది మీ సంపదను సంకేతాత్మకంగా రెట్టింపు చేస్తుంది.ఇంట్లో అస్సలు డబ్బు నిలబడకుండా జీవితంలోంచే అదృశ్యమైపోతున్నట్టు అనిపించినపుడు ఇంటి ఎడమ మూలన బాగా బరువుగా ఉండే వస్తులను పెట్టండి. దానితో పాటుగా బాగా వెలుతురు వచ్చేలా చూడండి.సంపదను పెంచుకోవాలంటే ఆహ్లాదకరంగా నీరు పారే శబ్దం వినిపించేలా చిన్న ఫౌంటెన్‌ ఇంట్లో పెట్టుకోండి. అది డెస్క్‌ మీద పెట్టుకునేదైనా పర్లేదు. వాటర్‌ ఫౌంటెన్‌లా డబ్బును, సంపదను ఆకర్షించే శక్తి మరేదీ లేదు. నీరు పారే శబ్దం ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుంది.




జీవితంలో మరపురానిది పెళ్ళి. ఇది స్త్రీ పురుషులకు జీవన మైత్రి నిచ్చునది. శారీరక మానసిక స్థితి గతులలో విడదీయరానిది. వివాహము సర్వమతాల వారికి, వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఆమోదయోగ్యమైనది. హంగులతో ఆర్భాటాలతో వివాహము చేసుకొని ఆనందము పొందుట మన సామాజిక లక్షణము. వివాహం వల్ల ఆడ మగా ఇద్దరూ శారీరకంగాను, మానసికంగాను సుఖాన్నిపొందుతారు. పిల్లల కోసం, ఆస్తిపాస్తుల రక్షణ కోసం, వంశాభి వృద్ది కోసం పెళ్ళి అవసరం అవుతంది. " భార్యా భర్తలు నిత్యము గొడవలు పెట్టుకుంటే ఆ ఇంట్లో లక్ష్మి నిలవదు.




నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉభయసంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం- అని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. 'ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని వెలిగించి- ఖర్జూరమో, ఎండుద్రాక్షో లేదో ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు' అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతోంది. ఇలా దీపారాధన చేయడంవల్ల ఏ ప్రయోజనమైనా పొందవచ్చు- అన్నది శాస్త్రోక్తి.
మనం చేసే పనిని అనుసరించి మన విలువ ఉంటుంది. సమాజంలో తరతరాల నుంచి పిల్లలకు పెద్దలు పద్ధతులను, సం ప్రదాయాలను, మర్యాదలను, కట్టుబాట్లను, నియమాలను వినయ విధేయతలను నేర్పిస్తూ, వివరిస్తూ మన సంస్కృతి విశిష్టతను, వార సత్వంగా అందిస్తున్నారు. తరువాతి తరాల వారు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతున్నారు.


ఎవరి బాధ వారికి ఎక్కువ. ఎవరి దుఃఖం వారికి దుర్భరం. ఎవరి వేదన వారికి భారం. ఇంకెవరైనా ఓదార్చబోతే 'అనుభవిస్తే కాని నా బాధ నీకు తెలిసిరాదు' అని అంటుంటారు. నిస్పృహలో ఎలాంటి మాటైనా వస్తుంది. అది సహజం.
కష్టాలు, దుఃఖాలు, బాధలు- అందరివీ ఒక్కలా ఉండవు. పెద్దగీత, చిన్నగీతల అంతరాలతో ఉన్నట్టుంటాయి. కష్టాల్లో ఉన్నప్పుడు మనిషికి ఆశాజీవిగా బతకటం ఎంత అవసరమో, ఇంకొకరి బాధ చూసినప్పుడు తమ బాధను మరచి వారికొక ప్రోత్సాహకరమైన మాట చెప్పటం అంత అవసరం.
దైవ ప్రసాదితమైన ఈ జీవితంలో మనకు అవకాశాలు ఎప్పుడో కాని రావు. ఎన్నో కాని రావు. వచ్చినప్పుడు వాటిని చటుక్కున అందిపుచ్చుకోవాలి. ఒకర్ని సాంత్వనపరచి సేదతీర్చడంలోని ఆనందాన్ని తనివితీరా అనుభవించాలి. ప్రతి జీవితానికీ ఒక అర్థముందని తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేకపోతున్న వాళ్లకు తెలియజెప్పాలి.








మనస్సే సర్వస్వం
ఏది లేకుంటే మనిషి ఒక్కక్షణమైనా జీవించలేడో అది- 'మనస్సు'.  జీవిత సర్వస్వంగానూ చెప్పారు.
'మనస్సే ఈ సమస్త జగత్తు. అందువల్ల ఈ మనస్సును ప్రయత్నపూర్వకంగా సంస్కరించుకొంటూ జీవనాన్ని సాగించాలి. మనస్సు ఏ విధంగా ఉంటే ఫలితం ఆ విధంగానే ఉంటుంది. ఇది సనాతన రహస్యం. ఎప్పుడు మనస్సు సంపూర్ణంగా ప్రశాంత స్థితికి చేరుతుందో అప్పుడు అశుభకర్మలన్నీ నశించిపోతాయి. ప్రశాంతచిత్తంతో ఉండేవారే జీవితానందాన్ని అనుభవించగలుగుతారు. అప్పుడే తరగని ఆనందం వశమవుతుంది. 







అదృష్టం వరించాలంటే :-
 నెలలో వచ్చేమోదటి సోమవారం,తెల్లవారుజామునే నిద్ర లేచి, స్నానంచేసి, తెల్లని వస్త్రాలు ధరించి, పావుకిలో సగ్గుబెయ్యంతో పాయసం తయారుచేసి,అలాచేసే టప్పుడు 11- ఆకుపచ్చ యాలకులు వెయ్యాలి,  ఈ నైవేద్యాన్ని విష్ణుమూర్తి ఆలయంలో నివేదించండి, అందు కొండభాగాన్ని గోమాతకి తినిపించండి. 


11 రూపాయలు పురోహితునికి దక్షిణ ఇచ్చి కాళ్ళకు దణ్ణం పెట్టండి.

 మీఇంట్లో  దేవి ఫోటో లు ఉంటే ( దుర్గాదేవి,బాలాంబిక ,లలితాదేవి ), సాయం సంధ్యా సమయంలో దీపారాదనచేసి " దుర్గే స్ప్ర్తుతా, హరసభీతి మసేస జంతో, త్వస్త్వి సుధా , మతిమతీమ్ శుభాం దదాసి దారిద్రాయః దుఃఖ భయ హారిణి కాత్పదన్యా, సర్వోపకారణాయ  పదార్ధ చిత్తా ".

 ఇది ప్రతీనెలలో మొదటి శుక్రవారం ఈ ఆచరణ చేయండి.

 రవి పుష్యమి,గురు పుష్యమి  యోగంలో తెల్ల జిల్లేడు వేరును  పచ్చటి దారంతో కట్టి మీరు మేడలో కాని, చేతికి కాని కట్టిన మేకు అదృష్టం కలుగును.


పెరుగు, పాలకోవా, ఇటువంటి తీపి పదార్ధాలని పిల్లలకి ఉదయానే తినిపించండి. 2 వెండి గిన్నెలలో ఒకదానిలో పాలకోవా , మరో దానిలో పెరుగు ఉంచండి.  ఆ గిన్నెలను సరస్వతి దేవి కి నైవేద్యం పెట్టి , పిల్లలు పరిక్షలలో విజయం సాధించాలని కోరుకోండి. పిల్లలు పరిక్షకి వెళ్ళే సమయంలో మూడు గంటల ముందే ఒక గిన్నెలో ప్రసాదం తినిపించండి.  పరిక్షకి వెళ్ళే  ముందు మరో దానిలోది తినిపించండి. కుంకుమ పువ్వుతో తిలకం పెట్టి, నాలుక పై కేసరాన్ని ఉంచండి. ఇలా చేస్తే చదివిన వాణ్ణి గుర్తుకు వచ్చే అవకాసం చాలాఉన్నది.

3 గవ్వలను కుంకుమపువ్వుతో  కలిపి, నల్లటి వస్త్రం లో కట్టి , మీరు గనక మీ ఇంటిముందు తగిలించి , సాయం సమయంలో వాటిని నదిలో పారవేసిన మీకు వాహనం లభించును.

రోజు  శంకు పూలతో సాయం సమయంలో  పరమశివుని " నమశ్శివాయ ఓం " అని ధ్యానం చేసిన వాహనం లభించును.

ఏదయినా కొత్త వాహనం కొన్నప్పుడు ఆ వాహనంలో 5 గవ్వలను కుంకుమపువ్వుతో  కలిపి, నల్లటి వస్త్రం లో కట్టి  మీ వాహనంలో ఉంచండి. దానివలన వాహన రుగ్మతలు ఉండవు.

నిరంతరం  భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుని చాంటింగ్ చేస్తే, మన పనులు మనం చేసుకుంటుపోతే  నర   ద్రుష్టి ఉండదు ( అంటే వ్యాపార సంస్థలో, మీ ఇంటిలో భగవత్ చాంటింగ్ వినిపించాలి).  




వారానికి  ఒక సారి వ్యాపార సంస్థలో, మీ ఇంటిలో తడిగుడ్డతో తుడవాలి, పసుపు నీళ్ళు  జల్లాలి. 


మీ ఇంటి గృహిణి  ప్రతి నిత్యం కాకపోయినా గురువారం, శుక్రవారం, ఇంటి లేక షాపు ద్వారా బంధానికి పసుపు రాసి కుంకం, బొట్టులు  పెట్టిన మీ నరదిస్టి  పోతుంది.

నిమ్మకాయలతో మీ  వ్యాపార సంస్థకి కానీ , మీ ఇంటి కి కాని మూడు సారుల, అలా కుడినుండి ఎడమకి తిప్పి, ఎడమకాలితో కనక ఆ నిమ్మ కాయను తొక్కినా లేక రొడ్డుమేద పడవేసిన మీ నరద్రుస్టి పోవును. 


దేవీ ఖడ్గమాలా స్తోత్రం చదువుతూ, ఒక బూదిగ గుమ్మడి కాయకి పసుపురాసి కుంకుమ బొట్టు పెట్టి ,దానితో పాటు పట్టిక నల్లటి దారంతో చుట్టి ఉంచిన ,మీ నరద్రుస్టి పోవును. 


 ఇనుము, నూనె వ్యాపారస్థులు, తప్పనిసరిగా 19 శనివారాలు శనికి   తైలాభిషేకం చేఇంచవలెను.


మంగళ వారం, శుక్రవారం కాని,ఆదివారం కాని, అమావాస్య రోజున కాని , మీ వ్యాపారం చేసి షాపు మూసినతరువాత ముద్డ కర్పూరం వెలిగించి ఆ వ్యాపారసస్త ముందు పదవేయాలి.    

తులసి మొక్క ప్రత్యేకంగా ఏ ఇంట్లో పూజించబడునో ఆ ఇంట సర్వసంపదలు కలుగును.తులసి మొక్క లేని ఇంట్లో సమస్త సమస్యలు ఏర్పడును.రోజు ఒక తులసిదళం నమిలిమింగితే సమస్తరోగాలకు నివారణ కలుగును.
తులసి మొక్కలపై నుండి వచ్చే గాలి పీల్చిన చాలా ఆరోగ్యప్రదం.లక్ష్మీదేవికి ప్రతిరూపమే తులసి.విష్ణుమూర్తికి ప్రీతికరమైనది.అందుకే ఆమెకు హరిప్రియ అనే మరోపేరు కూడా ఉంది.సత్యభామ నిలువెత్తు బంగారం ఉంచినా తూగని ఆ విష్ణువు రూపుడైన ఆ శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవి సమర్పించిన ఒకే ఒక్క తులసీదళానికి వశుడయ్యాడు.
చాలా దేవాలయాల్లో తులసి నీరే తీర్ధంగా ఇస్తారు.ప్రతి రోజు నీళ్ళుపోసి, భక్త్, శ్రద్ధలతో తులసిమాతను ఆరాధిస్తే ఇంట్లో లక్ష్మీకళ తాండవించి, సకలసంతోషాలను మనకు ప్రసాదిస్తుంది.











శ్రావణమాసం లో శ్రావణ అష్టమి, నవమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ అమ్మ వారి పూజకు ముఖ్యమైన దినములుగా ఈ మాసం లో లక్ష్మీదేవిని ఆరాధించేవారి సకల సంపదలు మరియు శ్రావణ సోమవారములు శివునికి జరుపు అభిషేకముల వల్ల అనేక శుభములు చేకూరుతాయి.














పుట్టు మచ్చలు - శుభ అశుభ ఫలితములు

పుట్టు మచ్చల ఫలితములు
ముక్కుమీద – కోపము, వ్యాపార దక్షత
కుడికన్ను – అనుకూల దాంపత్యము
ఎడమకన్ను – స్వార్జిత ధనార్జన
నుదిటి మీద – మేధావి, ధన వంతులు
గడ్డము – విశేష ధన యోగము
కంఠము – ఆకస్మిక ధన లాభం
మెడమీద – భార్యద్వారా ధనయోగం
కుడి కణత - ధన లాభం, కీర్తి , ప్రతిష్టలు
ఎడమ కణత - అపజయాలు, దుర దృష్టం
కుడి కనుబొమ్మ - ధన వంతులతో వివాహం
ఎడమ కనుబొమ్మ - దూర దృష్టం
చెక్కిలి యందు - సకల భోగాలు
ముక్కు మీద - కార్య సిద్ది
పెదవులందు - చమత్కారులు
గడ్డమందు - ధనము ,కీర్తి
గళము నందు -వివాహం వలన ధన ప్రాప్తి
ముక్కు ప్రక్కల యందు - దేశ సంచారి
మోచేయి - వ్యవసాయ దృష్ట్యా ధనప్రాప్తి
కుడిచేయి మణికట్టునందు- విశేష బంగారు ఆభరణములు ధరించుట
కుడి ఎడమ ప్రక్కలు - ఆరోగ్య భంగం, ధన వ్యయం
ఉదరము - తిండి పోతూ, దురాశ కలవారు
పొట్టి కడుపు - బల హీనతలు కలవారు
కుడి భుజం - వివేకులు, వినయము కలవారు
ఎడమ భుజం - మూర్ఖత్వానికి గుర్తు
కుడి బాహువు - బల ధైర్యవంతులు
ఎడమ బాహువు - కార్య సిద్ది
మోచేయి దగ్గర - చంచలత్వం
మోచేయి క్రింద - జీవితాన్తమున ధన లాభము
చేతి బ్రొటన వ్రేలు – స్వతంత్ర విద్య, వ్యాపారం
కుడి చేయి చూపుడు వ్రేలు – ధనలాభము, కీర్తి
పాదముల మీద – ప్రయాణములు
మర్మస్థానం – కష్ట సుఖములు సమానం
ఎడమ మోకాలు (పురుషులకు ) - అల్ప బుద్ధి.








కుడి తోడ - అదృష్టము ధనవంతులు
ఎడమ తోడ - దారిద్యము
కుడి మోకాలు - భార్య వలన గృహ సౌక్యము
పిక్కల యందు - అలసత్వం
పాదాల యందు - ఆకస్మిక అనారోగ్యం, ఆకస్మిక మరణం
పొట్టమీద - భోజనప్రియులు
పొట్టక్రింద - అనారోగ్యం
పొట్టమీద – భోజనప్రియులు
పొట్టక్రింద – అనారోగ్యం
కుడి భుజం – త్యాగము,విశేష కీర్తి ప్రతిష్ట్రలు
బొడ్డులోపల – ధనలాభములు
ఎడమతొడ – సంభోగం
కుడి భుజం - త్యాగము,విశేష కీర్తి ప్రతిష్ట్రలు
బొడ్డులోపల - ధనలాభములు
కుడితొడ - ధనవంతులు
ఎడమతొడ - సంభోగం
చేతి బ్రొటన వ్రేలు - స్వతంత్ర విద్య, వ్యాపారం
కుడి చేయి చూపుడు వ్రేలు - ధనలాభము, కీర్తి
పాదముల మీద - ప్రయాణములు
మర్మస్థానం - కష్ట సుఖములు సమానం.









బల్లి పడుట వలన కలుగు శుభాశుభములు.
పురుషులకు
తలమీద - కలహం
పాదముల వెనక -  ప్రయాణము
కాలివ్రేళ్లు - రోగపీడ
పాదములపై - కష్టము
మీసముపై - కష్టము
తొడలపై - వస్త్రనాశనము
ఎడమ భుజము - అగౌరవము
కుడి భుజము -  కష్టము
వ్రేళ్ళపై - స్నేహితులరాక
మోచేయి - ధనహాని
మణికట్టునందు - అలంకారప్రాప్తి
చేతియందు - ధననష్టం
ఎడమ మూపు - రాజభయం
నోటియందు - రోగప్రాప్తి
రెండు పెదవులపై - మృత్యువు
క్రింది పెదవి - ధనలాభం
పైపెదవి - కలహము
ఎడమచెవి - లాభము
కుడిచెవి - దుఃఖం
నుదురు - బంధుసన్యాసం
కుడికన్ను - అపజయం
ఎడమకన్ను - శుభం
ముఖము - ధనలాభం
బ్రహ్మరంద్రమున - మృత్యువు.









స్త్రీలకు
తలమీద - మరణసంకటం
కొప్పుపై - రోగభయం
పిక్కలు - బంధుదర్శనం
ఎడమకన్ను - భర్తప్రేమ
కుడికన్ను- మనోవ్యధ
వక్షమున - అత్యంతసుఖము,పుత్రలాభం
కుడి చెవి - ధనలాభం
పై పెదవి - విరోధములు
క్రిందిపెదవి నూతన - వస్తులాభము
రెండుపెదవులు - కష్టము
స్తనమునందు - అధిక దుఃఖము
వీపుయందు - మరణవార్త
గోళ్ళయందు - కలహము
చేయుయందు - ధననష్టము
కుడిచేయి - ధనలాభం
ఎడమచేయి - మనోచలనము
వ్రేళ్ళపై - భూషణప్రాప్తి
కుడిభుజము -కామరతి, సుఖము
బాహువులు - రత్నభూషణప్రాప్తి
తొడలు - వ్యభిచారము,కామము
మోకాళ్ళు - బంధనము
చీలమండలు -  కష్టము
కుడికాలు - శత్రునాశనము
కాలివ్రేళ్ళు - పుత్రలాభం.
దవడల యందు  - దుఖ: వంతులు
ఎడమ మోకాలు  - అధిక సంతానం

మన ఇంట్లో దీపారాధనకు చేయడానికి నియమాలు


దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి.
ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి.








ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన ఆ ఇంట లక్ష్మీ ఎప్పటికి నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపారస్థలంలో దీపారాధాన చేయడం వలన కలిగే మార్పు స్వయంగా గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో, వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమవల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.








దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు.
దీపం సకల దేవతాస్వరూపం
దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపారాధన జరిగే ప్రదేశంలో మహాక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇళ్ళు కళావిహీనమై, అలక్ష్మీస్థానం అవుతాయని చెప్పారు. దీపారాధన లేకుండా దేవతారాధన చేయరు. దీపం సకల దేవతా స్వరూపం.






ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి, దానిపై ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట, నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి (చిన్నదైనా సరే), కొద్దిగా పసుపుకుంకుమ చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి, దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి, వేరే చిన్నవత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో, ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి.








దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు. అది అశుభసూచకం. కనీసం రెండు వత్తులైనా వేయాలి, అనగా రెండు వత్తులని కలిపి వేయాలి, విడివిడిగా కాదు.. రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు.దీపారాధానకు ఆవునెయి ఉత్తమం, తరువాత నువ్వులనూనె. దీపం వెలిగించాక, ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి, పూలు సమర్పించాలి. సర్వదేవతస్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి. చిన్న బెల్లం ముక్క కానీ, పటికబెల్లం పలుకులు కానీ, ఏదో ఒక పండుగానీ, లేక అందుబాటులో ఉన్నది దీపానికి నివేదన చేయాలి.




దీపంలో దేవతలున్నారు, వేదాలు ఉన్నాయి, శాంతి ఉంది, కాంతి వుంది. ఇంతటి విశిష్ట దీపాన్ని నేరుగా అగ్నిపుల్లతో వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి.


ఐదు వత్తులు :
దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్త మామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాల్గవది గౌరవం, ధర్మవృద్ధిలకూ, అయిదోది వంశాభివృద్ధికి అని చెప్తారు. దీపారాధన ఎవరు చేసినా రెండు వత్తులు తప్పనిసరిగా వుండాలి.

ఓ పక్క ఆవునేతితో, మరో పక్క నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్ఠం. ఆవునెయ్యిలో సూర్యశక్తి నిండి వుంటుంది. దీనివల్ల ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆవునెయ్యిలో నువ్వులనూనె, వేపనూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి.
వేప నూనె రెండు చుక్కలు ఆవునెయ్యి కలిపి పరమ శివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది. కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరునికి చేయడం వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరినూనె ఉపయోగిస్తే మంచిది.
నూవ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. దుష్పలితాలు దూరం చేసి సకలశుభాలూ ఇవ్వగలదు. నువ్వుల నూనె విష్ణ్వాంశమూర్తులకు అత్యంత ప్రీతికరం. వేరుశెనగ నూనెను దీపారాధనకు అస్సలు వాడరాదు.
దీపం వెలిగించే కుంది కింది భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణుమూర్తి, ప్రమిద శివుడు, కుందిలో వేసే వత్తి వెలుగు సరస్వతి, విస్ఫలింగం లక్ష్మీ దేవి. దీపారాధనలో వెండి కుందులు విశిష్టమైనవి. పంచలోహ కుందులు, మట్టికుందులది తర్వాతి స్థానం. దీపారాధన స్టీలు ఇనుప కుందిలో చేయకూడదు. కుంది కింద మరో ప్రమిదను తప్పనిసరిగా పెట్టాలి.



మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారీ తలంటుస్నానం చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది.













రజస్వల శుభ అశుభ విషయములు

రజస్వల విషయములు ప్రధమ రజస్వల ప్రాతః కాలమునుంచి మధ్యాహ్నములోపు అయిన శుభము. మిగిలిన కాలము అశుభము. ప్రాత కాలము అయినచో నిత్య సుమంగళి గానూ, మథ్యాహ్నం పూట అయినచో గొప్ప ధనవంతురాలవుతుంది. అర్థ రాత్రి అయితే గ్రహ తిథిలను బట్టి శాంతులు చేయించాలి. రజస్వల సరిసంఖ్య తేదీ కన్నా బేసి సంఖ్యా తేది మంచిది.








 చిరుగులు లేనివీ, శుభ్రమైనవీ, రంగు గలవి అయిన దుస్తుల్లో ప్రధమ రజస్వల అయితే శుభప్రదములు. 






రజస్వల సమయం మంచిది కాకపోతే నవగ్రహ శాంతితొ పాటు గౌరీదేవి కుంకుమార్చన చేయించుట మంచిది. రాజస్వలకు దుష్ట తిధులు: అమావాస్య, ఉభయ పాద్యమిలు, షష్టి, అష్టమి, ద్వాదశి తిదుల యందును పరిఘ యోగముల పూర్వార్ధమునండును, వ్యతీపాత, వైధృతి యోగాములండును, సంధ్యా కాలమునండును, ఉప్పెన, భూకంప మొదలైన వుపద్రవ కాలమండును భద్ర కారణమూ నందును మొదటిసారి రజస్వల అయిన శుభకరము కాదు.










  సోమ, బుధ, గురు, శుక్ర వారములందు ప్రధమ రజస్వల అయిన శుభ ఫలము, ఆది, మంగళ, శని వారములందు అశుభ ఫలము కలుగుతుంది. శుభ నక్షత్రములు: అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ , శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి యీ నక్షత్రములందు ప్రధమ రజస్వల అయిన సౌభాగ్యము, సౌఖ్యము, సంతానము, ఆయువు, ధనము కలుగుతుంది. మిగిలిన నక్షత్రములు అశుభ ఫలములు ఇచ్చును. కావున శాంతి చేయాలి.

  గ్రహణ సమయములందు, సంక్రాంతి యందు, అశుభమైన నిద్రా సమయములందు, అర్ధరాత్రి యందు ప్రధమ రజస్వల అయినచో యుక్తమైన శాంతులు నిర్వహించాలి.




 శుభ తిధులు: తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిధులు శుభము. లగ్న గ్రహ ఫలము: ప్రదమ రాజోదర్శన సమయమున కేంద్ర, కోణ, లాభ స్థానములందు శుబ గ్రహములు, తృతీయ, షష్ట లాభ స్థానములందు క్రూర గ్రహములు శుభ ఫలములిస్తాయి. చంద్రుడు అష్టమ స్థానమునందు వుండిన పతి నాశనము కలుగ జేస్తాడు. కాని చంద్ర తారాబలములు సంపన్నమైనపుదు పుత్ర, ధన సంపత్తులు కలుగుతాయి. కుజుడైనాను లేక చంద్రుడైనాను లగ్నమునకు 3, 6, 10 స్తానములన్డున్నచో సంపంనులగు కుమారులు కలుగుతారు. నక్షత్ర గ్రహ ఫలము: రజస్వలా సమయ నక్షత్రమందు గురుడుగాని, శనిగాని వున్నాను, యే గ్రహము లేకున్నను శుభము. 



రజస్వలా సమయ నక్షత్రము నందు కుజుడున్నను బుధ శుక్రులు కలిసి వున్నాను, రవి వున్నాను రాహు కేతువులున్నను అశుభము.





  తన యింటి యందును, గోడల చావిదియండును, స్వగ్రామ మధ్యమందు, జల సమీపమున, ఇంటి ఆవరణ మధ్య ప్రధమ రజస్వల అయిన శుభము.


 గ్రామము బయట, ఇతర గ్రామములందు, నగ్నముగా వున్నపుడు ఇతరుల యిండ్లలోను ప్రదమ రజస్వల అయిన అశుభము.


 వేళా విశేషములు: ప్రాతః కాలం చిర సౌభాగ్యం, ఉషః కాలం శోవ్భాగ్య లోపం, పూర్వాహ్నం పుణ్య క్షేత్ర దర్శనం,

 మధ్యాహ్నం ధనవతి, పుత్రవతి, సాయంత్రం జారగునం, సంధ్యలందు చేడుప్రవర్తన కలది,


 అర్ధరాత్రి బాల వైధవ్యం కలుగును. రాత్రి వేళ నిర్ణయం: రాత్రి రజస్వల అయినచో రాత్రిని మూడు భాగాలుగా చేసి రెండు భాగముల కాలము పూర్వదినము, మూడవ భాగాకాలమున తదుపరి దినమునకు చెందుతుంది.



 వస్త్రఫలము: తెల్లబాట్ట కట్టుకొని రజస్వల అయిన సౌభాగ్యవతి, గట్టి బట్ట కట్టుకొని రజస్వల అయిన పతివ్రతయు, దుకూల వస్త్ర దారియైన పట్టపురాణి యగును, నూతన వస్త్రము ధరించాగానే శుభ సంపన్నురాలగును, చిరిగినా బట్ట కట్టుకొనిన దౌర్భాగ్య రాలగును, యెర్రని బట్టకట్టుకోనిన వ్యాధి గ్రస్తురాలగును, నల్లని వస్త్రము ధరించినదైన దరిద్రురాలగును.




 రసజ్వలకు నక్షత్ర ఫలములు
 అశ్వని: భోగభాగ్యములు పొందును. మొదటి సంతానం నష్టం.

భరణి :అనారోగ్యము, భీతి, అల్పాయువు.

 కృత్తిక: కష్టనష్టములు అల్పసంతానం కలది చంచలము.

రోహిణి : ధనధాన్యవృద్ధి, పుత్ర సంతావంతురాలు.

మృగశిర : సుఖసౌఖ్యాదులు, దైవభక్తి కలది, యోగ్యురాలు.

ఆర్ద్ర : నీతినియమములు లేనిది, దురదృష్టవంతురాలు.

 పునర్వసు : స్వగృహమును విడిచిపెట్టునది.


పుష్యమి : పతిభక్తి గలది, సంతానం కలది యోగ్యురాలు.

ఆశ్రేష : దుష్టసంతానం కలది పతి సౌఖ్యము తక్కువ కలిగినది.

మఘ : తండ్రి యింటి వద్ద ఉండునది, భర్తకు కష్టం తెచ్చునది.

 పుబ్బ : గర్భస్రావం కలది దీనురాలు అనారోగ్యం కలది.

ఉత్తర : సంతానం కలది. మంచిసౌఖ్యముగలది.

హస్త : మంచిపుత్రికలు కలది. బందువులను ఆదరించునది.

చిత్త : పతిభక్తిగలది. లలితకళల యందు ఆశక్తికలది.

స్వాతి : పుత్రసంతానంగలది, పతివ్రత, భోగి.

విశాఖ : ధనధాన్యములు లది విలాసవమ్తురాలు, భోగి.


 అనూరాధ : పుత్రసంతానంకలది పవిత్రురాలు.

 జ్యేష్ఠ : దుష్ఠ ప్రవర్తనకలది. పతినిపోగొట్టుకొనునది.

మూల : పుణ్యక్షేత్రసంచారి, ధర్మంచేయుట యదిష్టతకలది.


పూర్వాషాడ : వైధ్యవ్యము పొందునది. హంతకురాలు అగును.


ఉతరాషాడ : పుణ్యకార్యములు చేయునది. సంపదలు గలది, భోగి శ్రవణం : దీర్ఘాయుర్దాయం కలది. పుత్రసంతానం కలది.



 ధనిష్ఠ : ధనధాన్యములు స్త్రీ సంతానం కలది. శతబిషం : సుఖ సౌఖ్యములు, ధన వృద్ధి కలది.


పూర్వాభాద్ర : మూర్ఖత్వము కలది. అనారోగ్యము గల భర్త కలది.


 ఉత్తరాభాద్ర : జ్ఞానము కలది. బంధువర్గము కలది. పవిత్రురాలు.


రేవతి : ధనవంతురాలు. పుణ్యకార్యములు చేయునది. మంచిజీవనము చేయునది.











 ప్రధమ రజస్వల అయిన కన్యకు అక్షతలు తలపై వేసి ఆసనమేసి కూర్చుండ బెట్టాలి. దీపమున్న గదిలోనే కన్యను ఉంచాలి. సువాసినులకు శ్రీ గంధము, పుష్పములను, తమ్బూలములను లవణము, పెసలు మొదలగునవి ఇవ్వాలి. ప్రధమ రజస్వల అయిన వస్త్రముతోనే మూడు రోజులు ఉంచాలి. ఎవరిని తాకకుండా జాగ్రత్త గా, ప్రశాంతముగా, ఉండునట్లు చూడాలి. భోజన విషయంలో పులగము, నెయ్యి, పాలు వంటి సాత్విక ఆహారము ఉప్పు, పులుపు, కారము లేకుండా ఇచ్చుట మంచిది, నాలుగవ రోజు స్నానము చేయించి నూతన వస్త్రములు కట్టించాలి. మూడు దినములు ఎవరిని తాకకూడదు. అభ్యంగనము, కాటుక, స్నానము, పగలు నిద్రించుట , అగ్ని ముట్టుట, ప్రాసనము, సూర్యావలోకనము, భూమిపై గీతాలు గీయుట చేయుట చేయకూడదు. క్రింద పడుకోవాలి, ఆవుపాలు, పెరుగు, మజ్జిగ, తాంబూలము, గంధమాల్యములు ఉపయోగించరాదు.







 రజస్వలా అయిన స్త్రీ మొదటి దినమునండు చండాల స్త్రీ సమానురాలు, రెండవ దినమందు పతితురాలితో సమానురాలు, మూడవ దినమునండు చాకలి స్త్రీతో సమానము, నాలుగవ దినమున కూడా శూద్ర స్త్రీ సమానురాలు, ప్రధమ రజస్వల అయిన స్త్రీ అయిదవ దినమందు దేవ పితృ కార్యములందు పరిశుద్దురాలూ అన్నారు. నాలుగవ దినమందు స్నాముచేత శుచి కాగలదు. బహిష్టు అయిన స్త్రీ మూడు రోజుల తరువాత శుద్ధి అవుతుంది. తిరిగి మల్లి పంతొమ్మిది రోజులలో బహిష్టు అయిన ఒక దినముతో శుద్ధి అట్లుగాక ఇరవై రోజుల అనంతరము ఎప్పుడైనా బహిష్టు అయిన మూడు రోజుల తరువాత శుద్ధి అగును.