జాతకం అంటే ఏమిటి? జాత అంటే పుట్టుక ....పుట్టుకతో వచ్చినది కావున జాతకం అంటారు. ఏ మనిషికైనా భవిష్యత్తు గురించి కొద్దో గొప్పో బెంగ ఉండే ఉంటుంది. రేపు తనకు జరగబోయే శుభాశుభాలను గురించి తెలుసుకోవటం, ఏవైనా బాధలుంటే వాటికి నివారణోపాయాలను వెతుక్కోవాలనుకోవటం, ప్రతిక్షణం సుఖసంతోషాలతో జీవించాలనుకోవటం మనిషి నైజం. ఆ సుఖవంతమైన జీవితం అన్వేషణలోనే ఎన్నో రకాల శాస్త్రవిషయాలను కనుక్కోవటం జరుగుతున్నది. అయినప్పటికి భవిష్యత్తును తెలుసుకోవాలన్నా, దానిని సుఖవంతముగా మార్చుకోవాలన్నా అది ఒకే ఒక శాస్త్రంతోనే సాధ్యమవుతుంది. అదే జ్యోతిష శాస్త్రం.జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనము జన్మించిన సమయానికి ఖగోళములోని గ్రహస్థితులను సూచిస్తూ వేయబడే చక్రాన్నే జాతకము అంటారు. దీనినే జాతకచక్రము, జన్మకుండలి, హోరోస్కోప్ ఇలా వివిధ రకాల పేర్లతో ఆయా ప్రాంతాలవారు సంబోధిస్తుంటారు. ఒక వ్యక్తి జన్మించిన సమయము, ప్రదేశము ఆధారముగా జాతకచక్రము గణించబడుతుంది. ఖగోళములోని గ్రహస్థితులను గణితాధారముగా లెక్కించి, ఆయా రాశి, నక్షత్ర, భావాలలో ఉన్న గ్రహాల ఆధారముగా భవిష్యత్తు చెప్పబడుతుంది.దీని గణనలో కాని, జన్మించిన సమయములో కాని తప్పు జరిగినట్లయితే అది ఆ నిర్దేశిత వ్యక్తి జాతకం కాక వేరే వారి జాతకం అవటమే కాకుండా, ఈ వ్యక్తికి చెప్పబడ్డ భవిష్య ఫలాలన్నీ తప్పే అవకాశం ఉంటుంది.కాబట్టి భవిష్యత్తు తెలుసుకోవలనుకుంటే జాతక చక్రము అత్యావశ్యమైనదిగా చెప్పబడింది. జాతకం మనకు మన జీవిత రేఖను తెలియజేస్తుంది. మన గ్రహ స్థితిని అనుసరించి మనం తగు జాగ్రత్తలు పాటిస్తే పెను ప్రమాదం నుండి కాపాడబడి ఉపశమనం పొందగలము. ఉదా : వర్షం నుండి రక్షణ కలిగించే గొడుగులా ...ప్రమాదం నుండి కాపాడే శిరస్త్రానం లా.
జ్యోతిష్యం "శాస్త్రం". సూర్యోదయం ప్రభావంతో మన శరీరాలు హార్మోన్లను విడుదల చేయడంతో మనం మేల్కొంటాం. అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, దూరంగా జరగడం వంటి మార్పుల వల్ల సముద్రపు అలల్లో తేడాలు వస్తాయి. అందువల్లనే మనవ మరియు ప్రకృతిలో విపరీత ధుర్ఘటనలు చూస్తున్నాము. పౌర్ణమి అమావాస్య ఎప్పుడు వస్తుందో మూడనమ్మకము అన్నవాడు చెప్పలేడు. మనపై మనకు విశ్వాసం లేకపోతే, ఇతరత్రా విషయాలేవీ పెద్దగా పనిచేయవు. అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి. సర్వే జనా సుఖినోభవంతు.
26 February 2016
జాతకం అంటే ఏమిటి?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
మీ అభిప్రాయం తెలియచేయండి.