మన సంస్క్రతిలో గోరింటాకు:-
గోరింట చెట్టు కొంతమంది ఆకుల కోసం పెంచుతారు. గోరింటాకు గోరింటాకును ముద్దగా నూరి చేతికి, పాదాలకు పెట్టుకుంటే ఎర్ర్రని రంగుతో అందంగా ఉంటాయి. ఈ పొడిలో లవంగం పొడి కలిపితే ఎరుపు, ఉసిరి పొడిని కలిపితే నలుపు రంగు తల జుట్టుకు వస్తాయి.భారతీయులు పెళ్ళి సమయంలో దీన్ని తప్పనిసరిగా వాడతారు. మెహందీ లేదా హెన్నాఅనేది "మెంధిక" అనేసంస్కృతపదంనుండిఉద్భవించింది. మెహందీ మరియు పసుపులయొక్క ఉపయోగంముల గురించి హిందూమ తవేదకర్మ పుస్తకాల్లోవర్ణించబడింది. హల్దిని(పసుపుముద్ద)అభిరంజనముగా, అలాగే మెహందీని బాహ్య ప్రతీకగా వేదాలలో చెబుతారు. వేద సిద్దాంతమూలలొ ఇది "అంతర్గతంగ కాంతి లేవడం" అనే అర్ధం వస్తుంధి. సాంప్రదాయభారతనమూనాలలో మెహందీని చేతులు మరియు కాళ్ళుగుర్చిఉద్దేశించబడింది.
పాశ్చాత్య ప్రపంచంలో హెన్నా(గోరింట)అని పిలుస్తారు. భారతదేశం మరియు నేపాల్ దేశాలాలో మేహేందిని శరీర అలంకరణగా వాడతారు. మెహందీని సాధారణంగా వివాహనికి మరియు ఖర్వ చౌత్, ఆషాడ శుద్ద పూర్ణిమ, దీపావళి, భైదూజ్ మరియు తీజ్ వంటి పండుగలు వంటి ప్రత్యేక హిందూ మతం సందర్భాలలో సమయంలో వాడతారు. హిందూ మతం పండుగలలో చాలామంది మహిళలు హెన్నాని వారి చేతులుకు మరియు కాళ్ళుకు అలంకరించుకుంటారు. ఇది చర్మంపై సహజంగా ఉండే అలంకరణగా కనిపిస్తుంధి. హెన్నా నిజానికి ప్రధానంగా హిందూమతం వధువులకు ఒక అలంకరణరూపంగా ఉపయోగించబడింది.ముస్లింలు పండుగలు అయిన ఈద్ ఉల్ ఫితర్ మరియు ఈద్ ఉల్ అధా సమయంలో మెహందీని వాడతారు. భారత సాంప్రదాయ మెహందీని పెట్టేకళాకారు లుపరిమితసంఖ్యలో ఉండటం కారణముగా,ఆధునిక యుగంలో ప్రజలు రెడీమేడ్ హెన్నాన్ని(హెన్న ఛొనెస్) ఉపయోగిస్తున్నారు. రెడీమేడ్ హెన్నా ఆలంకరణకు సులభంగా ఉంటుంది.అయితే, భారతదేశం లో గ్రామీణ ప్రాంతాల్లో వృత్తిపరంగా దొరికే గోరింట ఆకులుని శుద్ధి చేసి,వీటికి ఆయిల్ కలిపి రాళ్ళుతొ నూరి ఆ మిశ్రమన్ని మెహందీగా వాడతారు. మెహందీని చాలా సందర్భలలో తాత్కలిక పచ్చబొట్లుగా ఉపయోగిస్తారు.దీన్నే గోరింట పచ్చబొట్టు అలంకరనగా పిలుస్తారు. నల్లని పచ్చబొట్టును ధరించడం కొసం,అనేక మంది గోరింటాకుకు కృత్రిమరంగును కలపడం ఆరంబించారు. దీని వల్ల చర్మానికి చాలా హానికరమైన మరియు శాశ్వతగాయాలు,తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి. ఆలాటా అనే ఒక రకమైన గొరింటను వధువల పాదాల అలకరణకు ఉపయోగిస్తారు. ఈ సంస్క్రుతి ఇప్పటికి బెంగాల్లొ వాడుకలొ ఉన్నధి.
ఆయుర్వేదం పరంగా గోరింటాకు:-
ఔషధమూలిక గోరింటాకు... Lawsonia inermis శాస్త్రీయ వర్గీకరణ రాజ్యం: ప్లాంటే విభాగం: మాగ్నోలియోఫైటా తరగతి: మాగ్నోలియోప్సిడా క్రమం: Myrtales కుటుంబం: Lythraceae జాతి: Lawsonia ప్రజాతి: Lawsonia inermis. గోరింటాకు అంటే అదేదో ఆడవాళ్ళకు సంబంధించిన విషయం అనుకోకండి. ఆయుర్వేదం పరంగా గోరింటాకు ఒక ఔషధం. గోరింటాకును రుబ్బి గోర్లపై భాగంలో పెట్టుకోవడం వలన గోర్లు పుచ్చిపోకుండా ఉంటాయి. అరిచేతిలోనూ, అరికాళ్ళలోనూ పెట్టుకోవడం వలన శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ శరీరంలో ఇతర భాగాలకు సంబంధించిన నాడులు ఉంటాయి.

ఆయుర్వేదంలో కొన్ని పద్ధతుల ద్వారా గోరింటాకును శరీరంలోకి ఔషధంగా తీసుకోవడం వలన అల్సర్ మొదలైన రోగాలను నయం చేయడమే కాకుండా, పేగులను శుభ్రపరుస్తుందని ఆయుర్వేద గ్రంధాల్లో కనిపిస్తుంది. శరీరంలో వేడి బాగా పెరిగినప్పుడు గోరింటాకును అరికాళ్ళ నిండ పట్టించుకుంటే వేడి తగ్గిపోతుంది. మార్కెట్‌లో గోరింటాకుతో చేసిన నూనె దొరుకుతుంది. శరీరానికి గాయమై రక్తం కారుతున్న సమయంలో, కాసింత గోరింటనూనెను గాయమైన భాగం మీద రాస్తే కాసేపట్లోనే విడిపోయిన చర్మం కలిసిపోయి, గాయం అతి త్వరగా మనిపోతుంది. గోర్లు, శరీరంలో వేడి కేవలం ఆడవాళ్ళకే ఉండవు, మగవారికి కూడా ఉంటాయి. తగిన జాగ్రత్త తీసుకోకపోతే ఎవరి గోర్లైనా పుచ్చిపోతాయి. ఆరోగ్యం కోసం గోరింటాకు అందరూ పెట్టుకోవాలి. గోరింటాకు ఆడవాళ్ళకే అని ఎక్కడ చెప్పలేదు. వ్రతం, పూజలు, వివాహాల సమయంలో, పెద్ద పెద్ద క్రతువులు చేసే సమయంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు. ఇక్కడ గోరింటాకు అంటే బయట దుకాణాల్లో మెహంది లేక గోరింటాకు పోడి కాదు. గోరింటకు చెట్టు నుంచి కోసి రుబ్బిన ఆకుకే ఔషధ గుణాలు ఉంటాయి.
మన సాంప్రాదాయాలు:-
గోరింటాకు పెట్టుకోవడం శుభసూచకం. పడతుల్లో మరెన్నో నమ్మకాలు ఉన్నాయి. పాదాలకు పారాణిగా, అరచేతులకు అలంకరణగాను గోరింటాకు సుపరిచితమే. తక్కువ స్థలంలోనే గుబురుగా పెరిగే మొక్క గోరింట. మగువ మనసుకు ముచ్చట కలిగించేది గోరింట. అతివల చేతుల్లో మందారంలా పూసి, అందరిని మురిసిపోయేలా చేస్తుంది. ఆకులను మెత్తగా రుబ్బి, ఆ పేస్ట్‌ని కావలసిన ఆకారంలో చేతులకు, పాదాలకు అలంకరించుకుని గంటపాటూ ఉంచితే ఎరుపు రంగులోకి మారుతుంది. గోరింట అలంకరణకు, అందం రెట్టింపు చేయడానికే కాకుండా ఆరోగ్యానికి సైతం ఉపయోగపడుతుందని ఆయుర్వేద, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే గోరింటాకులో ఎన్నో ఔషధ గుణాలున్న కారణంగా నెలకొక్కసారి అయినా పెట్టుకోవాలని వీరు సూచిస్తున్నారు. గోరింటాకు పెట్టుకోవడంవల్ల గోళ్ళలో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా పలు అలెర్జీలను దూరం చేయవచ్చు. ఏ కారణం చేతనైనా చర్మంపై ఏర్పడిన మచ్చలను పోగొట్టడానికి గోరింటాకు బాగా నూరి పూస్తే సరిపోతుంది. వేడిగడ్డలను సైతం గోరింటాకు నయం చేస్తుంది. ఇది గోరుచుట్టు, కాళ్ల పగుళ్లకు సహజ సిద్ధమైన నివారిణి అని చెప్పవచ్చు. గోరింటాకు పేస్టుతో తలకు ప్యాక్ వేసుకుంటే జుత్తు ఆరోగ్యకరంగా కాంతులీనుతుంది. జుత్తు రాలడం, చుండ్రు లాంటి సమస్యలను సమూలంగా నివారిస్తుంది. గోరింటాకు యాంటి బయాటిక్ లక్షణాలు కలిగి ఉండడం చేత క్రిములను దరిచేరనీయకుండా చూస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నచోట గోరింటాకు పేస్టును రాసి కాసేపు ఉంచితే ఫలితం కనబడుతుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తుంది. గోరింట బెరడుతో కాచిన కషాయం రక్తవిరోచనాలను ఇట్టే నివారిస్తుంది. గోరింట పువ్వులను నూరి వెనిగర్‌తో కలిపి తలకు పట్టిస్తే తలనొప్పి తగ్గుతుంది. పైగా సుఖనిద్రకు ఉపకరిస్తుంది. పలు చర్మ సమస్యలను గోరింటాకు ముద్ద పనిచేస్తుంది. ఆవనూనెలో గోరింటాకులు వేసి కాచి అది తలకు రాసుకుంటే వెంట్రుకలు పెరగడమే కాక మృదువుగా మారుతాయి. విత్తనాలు దుర్వాసన తొలగించే డియోడరెంట్‌గా వాడుతారు. పువ్వులలో నుంచి తీసిన నూనెలు పర్‌ఫ్యూమ్స్‌గా వినియోగిస్తారు. చెట్టు బెరడు పచ్చకామెర్లను, కాలేయం వాపు తీవ్రతనుతగ్గిస్తాయి. స్ర్తిలకు సంబంధించిన పలు సమస్యలకు గోరింటాకు, పూలు, కాయలు, బెరడు.. అన్ని ఉపయోగకరమే. పండగలు, పర్వదినాలలో గోరింట ప్రధాన భూమిక పోషిస్తుంది.

మన ఆచారాలు:-
ఆషాఢ మాసం మనసులో మెదిలిందంటేనే గుర్తుకొచ్చేది గోరింటాకు. ఆడవాళ్ల చేతులు ఎర్రగా, అందంగా పండిపోతూ దర్శనమిస్తాయి ఈ నెల్లాళ్లు. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ మగాళ్లను సైతం ఇంట్లో పెద్దలు పోరుతూ ఉంటారు. కారణమేమంటే జ్యేష్ఠ మాసంలో మొదలైన వర్షాల ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. దీంతో కాళ్లు చేతులు రోజూ తడిచే ప్రమాదం ఉంది. దీంతో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం జరిగుతుంటాయి. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసుబారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. మన పద్దతులు:- ఔషధీయుక్త సౌందర్య సాధనమైన గోరింటాకు స్త్రీలకు ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పవచ్చు.గోరింటాకుని మగ వాళ్ళు కూడా వాడుతారు. దీని రంగు శాశ్వతంగా ఉంటుంది. శరీరంలో ఉన్న అధిక మైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది. గోరింటాకుని చక్కగా ముద్దగా రుబ్బి,అరచేతుల్లోనూ, అరికాళ్లలోనూ పెట్టుకుంటే శరీరంలోని వేడినంతా లాగేసి, అవి ఎర్రబడతాయి. దాన్నే పండట మంటారు. శరీర తత్త్వాన్ననుసరించి లేత నారింజ రంగు నుండి ముదురు ఎరుపు రంగు వరకు పండుతుంది. ఈ రంగు ప్రేమ గాఢతని తీవ్రతని తెలియ చేస్తుందంటారు.

మన సౌందర్య పోషణ:-
తడిలో,నీళ్ళల్లో పని చేసే ఆడవారికి కాలి వేళ్ళ సందున పాయటం, మడమలు పగలటం సహజం. వానాకాలమైతే మరీనూ. గోరింటాకు పెట్టుకుంటే ఆ బాధలకి ఉపశమనం లభిస్తుంది. అందుకే తప్పనిసరిగా ఆషాఢ మాసంలోను,అట్ల తద్దికి, ఉండ్రాళ్ళ తద్దికి ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలని నియమం ఏర్పరచారు మన పెద్దలు. ఇది సంప్రదాయం పేరుతో ఏర్పాటుచేసిన వ్యాధి నివారణ కార్యక్రమం. ఆ విధంగా చెప్పకపోతే ఆడవాళ్ళు తమ గురించి తాము పట్టించుకుంటారా? గోరింటాకులో ఉన్న ఔషధీ గుణం పిప్పిగోళ్ళని గోరుచుట్టుని రాకుండా నివారిస్తుంది. ఒక వేళ వస్తే తగ్గిస్తుంది. కాలి వేళ్ళ గోళ్ళ మొదళ్ళలో మట్టి చేరి ఒండ్రు పోస్తే ఆ వేలికి గోరింటాకు పెడతారు. పోతుంది. వెనకటి రోజుల్లో పాద సౌందర్య పోషణ [పెడిక్యూర్], హస్త సౌందర్య పోషణ [మెనిక్యూర్] అని సౌందర్య శాలల వెంట తిరగటానికి తీరిక, ఓపిక, ఆర్థిక స్తోమతు లేకపోయినా, అన్నీ పనులు తామే చేసుకున్నా వారి చేతులు మృదువుగానే ఉండటానికి ఈ సహజమైన, ప్రకృతి సిద్ధమైన సామాగ్రిని ఉపయోగించటమే కారణం అని ఎంతో మంది అంగీకరించిన మాట. పనిలో పనిగా గోళ్ళని పగడాల్లాగా మెరిసేట్టు చేస్తుంది. గోళ్ళ రంగుల కోసం వందలు వేలు వెచ్చించాల్సిన పని లేదు. ఎటువంటి దుష్ప్రభావాలూ [సైడ్ ఎఫెక్ట్స్] ఉండవు. పిల్లలు తెల్లగా పుట్టాలని గోరింటాకుని తింటారు కొన్నిసంప్రదాయాలవారు. గోళ్ళకి లాగానే జుట్టుకి కూడా రంగునిస్తుంది గోరింటాకు. ఒకసారి జుట్టుకి గోరింటాకు రంగు పడితే ఒక పట్టాన పోదు. తగ్గదు కూడా! అంతే కాదు. అది సహజమైన మంచి కండిషనర్ గా పని చేస్తుంది. గోరింటాకు పెడితే జుట్టు మెత్తగా పట్టు కుచ్చు లాగా ఉండి, నిగనిగా మెరుస్తుంది. కేశ పోషణ కోసం మెంతి, ఉసిరి వంటివి ఉపయోగించాలంటే కూడా గోరింటాకు బేస్ లాగా పనిచేస్తుంది. ఇది ఆడవారికి మాత్రమే పరిమితం కాదు సుమా! ఈ రోజుల్లో ఆడ, మగ తేడా లేకుండా అందరూ జుట్టుకి గోరింటాకు పెట్టుకుంటున్నారు.

గోరింటాకు పెళ్లి వేడుకల్లో:-
వివాహానికి ముందు మెహిందీ కోసం ప్రత్యేకంగా వేడుకలు జరుపుకుంటాం.
గోరింటాకు ముద్దని తయారు చేయటమే ఒక కళ. ఆకుతో పాటు మరెన్నింటినో చేర్చుతారు ఆయా సందర్భాల కనుగుణంగా బాగా పండుతాయని. ఇప్పుడు గోరింటాకు ముద్దని తయారుచేసే పని లేదు. సిద్ధంగా అన్నీ చోట్లా లభిస్తోంది. గోరింటాకు పెట్టటం ఒకకళగా పరిగణించబడుతోంది. అరచేతులకే కాక చేతుల వెనుక భాగాలు, ముంజేతుల నుండి మోచేతుల వరకు కూడా రకరకాల జిలుగులతో గోరింటాకుని అలంకరించుకుంటున్నారు. ఇంకా, మెడ, భుజాలు కూడా ‘మెహింది’ పెట్టించు కోవటం ఒక ‘ఫాషన్’ అయింది. పెళ్ళిళ్ళకి ప్రత్యేకంగ మెహెంది పెట్టేవారిని నియమించుకుంటున్నారు. ఉత్తర దేశం వారి పెళ్లి వేడుకల్లో మెహెందికి ఒక రోజు కేటాయిస్తారు. పెళ్లి కూతురి చేతులకి గోరింటాకు పెట్టటం ఒక గౌరవంగా పరిగణించ బడుతుంది. ఇప్పుడు ప్రతి శుభ కార్యంలోను గోరింటాకు పెట్టటం ఒక ఆనవాయితీగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే పసుపు తర్వాత అంతగా ఆడవారి జీవితంతో పెనవేసుకు పోయింది గోరింటాకు.

మన పెద్దల నమ్మకాలు:-
గొరింటాకు , స్త్రీలకు ప్రకృతి ప్రసాదించిన వరమనే చెప్పాలి . పెళ్ళికాని అమ్మాయిలకు గోరింట ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని అంటారు.పెళ్ళైన వారు పెట్టుకొంటే .. బాగా పండితే .. తమ భర్త పై ఉన్న ప్రేమ గాఢతని తెలియ చేస్తుందంటారు.ఎర్రగా పండకపోతే కొందరు బాధపడిపోతూ వుంటారు , ఎవరి శరీర తత్వాన్ని బట్టి అలా పండుతుంది .గోరింటాకు పండితే రెండు రకాలయిన రంగులలో (ముదురు ఎరుపు మరియు లేత నారింజ ) వుంటుంది. గోరింటాకు ఒక సౌంధర్య సాదన కోసమే కాదు , ఇది ఒక అద్బుత ఔషధం కూడా .కేవలం ఆడవాళ్లకే కాదు , మగవారు కూడా దీనిని ఉపయోగించేవారు.ఎర్రగా పండడమంటే …శరీరం లోని వేడిని లాగేసి బయటకు వచ్చే క్రమంలో ఇది ఎర్రగా మారుతుంది.దానినే మనం బాగా పండింది అంటాము . కొన్ని హిందూ సాంప్రదాయ పండుగలలో ( అట్లతద్దె,ఉండ్రాళ్ళ తద్దె ) , గోరింటాకు ను తప్పని సరిగా పెట్టుకోవాలంటారు. దీనిలో ఉన్న ముఖ్య ఉద్దేశ్యం , పండుగలప్పుడు సౌందర్యం గా చేతులను , కాళ్ళను అలంకరించడం కోసమని కాదు ,పండుగ సమయాల్లో స్త్రీలు ఎక్కువగా తడి నీళ్ళలో తిరుగుతూ పనిచేస్తూ వుంటారు , దానివలన కాలి మడిమెలు వాయడం,మడిమెలు పగలడం జరుగుతుంటాయి,దాని వలన ఎంతో బాధగా వుంటుంది … గోరింటాకు ఇలాంటి భాదలనుంది ఉపశమనం కలిగిస్తుంది. గోరింటాకులో ఉన్న మరో అద్బుత గుణం గోరుచుట్టుని రాకుండా చేస్తుంది.శరీరం పైన వచ్చే పుండ్లు వంటి వాటిపైన గోరింటాకు పెడితే త్వరగా ఉపసమనం కలిగి , అవి తగ్గిపోయేలా చేస్తాయి.పూర్వకాలం లో కొన్నిసంప్రదాయాలవారు,పుట్టే పిల్లలు తెల్లగా పుట్టాలని గోరింటాకుని తినేవారట . గోరింటాకు కేవలం చేతులకు , కాళ్ళకు కాదు , జుట్టుకి కి కూడా ఎర్రదం వచ్చేలా చేస్తుంది. జుట్టుకోసం కండిషనర్ ఉపయోగిస్తుంటాం.గోరింటాకు కంటే కండిషనర్ ఉంటుందా చెప్పండి, గోరింటాకు పెడితే జుట్టు మృదువుగా ఉండేలా చేసి , జుట్టుకు సహజ మయిన ఎరుపు రంగులో మార్చి మరింత అందం గా చేస్తుంది.
గోరింటాకు మరకలు:-
సాధారణంగా మహిళలు రాత్రిపూట అరచేతులకు గోరింటాకు పెట్టుకుంటుంటారు. ఇలా పెట్టుకుని నిద్రపోతున్న సమయంలో బట్టలకు, బెడ్‌షీట్లకు గోరింటాకు మరకలు పడుతుంటాయి. వీటిని తొలగించేందుకు నానా తిప్పలు పడుతుంటారు. ఇలా పడిన గోరింటాకు మరకలు పోవడానికి మరకంటిన ప్రదేశాన్ని అరగంటసేపు పాలలో నానెయ్యాలి. తర్వాత శుభ్రం చేస్తే అదే పోతుంది. పాలతో వీలుపడని పక్షంలో నిమ్మకాయ ముక్కతో రుద్దిచూస్తే గోరింటాకు మరకలు పోతాయి. అలాగే, జేబు రుమాళ్ళపైన, టవల్స్ మీద పడే లిప్‌స్టిక్ మరకలు పోవాలంటే వాటిపై గ్లిసరిన్ రాసి కొంతసేపు తర్వాత సబ్బుతో ఉతకితే మంచి ఫలితం ఉంటుంది. శీకాయపొడితో రుద్దితే జరీమీద పడిన మరకలు పోతాయి. దుస్తుల మీద పడిన టీ మరకలు పోవాలంటే ఓ టమాటా ముక్కను మరక మీద రుద్ది తర్వాత సబ్బుతో ఉతికితే మరకపోతుంది. విద్యార్థుల దుస్తులపై పడిన సిరా మరకలు పోవాలంటే పుల్లటి పెరుగులో కాసేపు నానబెట్టి తర్వాత ఉతికితే సిరా మరక కనిపించదు. మన సంస్క్రతి. మన సాంప్రాదాయాలు. మన ఆచారాలు. మన పద్దతులు. మన ధర్మాలు. విలువలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది .