24 September 2016

మనసాంప్రదాయంలో స్త్రీలు పాటించవలసిన ఆచారాలు.

ఇళ్ళముందు ముగ్గులు:-

మన హిందూ సాంప్రదాయంలో ప్రతి రోజు స్త్రీలు ఉదయం ఇళ్ళముందు ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేయమని చెప్పడానికి ఆరోగ్య కారణాలున్నాయి. శరీరంలో నడుము భాగానికి తగిన వ్యాయామం లేకపోతే అది దీర్ఘకాలంలో అనేకానేక వెన్ను సమస్యలకు దారి తీస్తుంది. రాత్రంతా పడుకున్న సమయంలో వెన్ను నిటారుగా ఉంటుంది. ఉదయం లేవగానే నడుముకు సంబంధించిన వ్యాయామం చేయడం సత్ఫలితాలనిస్తుందని గమనించారు మన పెద్దలు. ఉదయమే నడుముకు సంబంధించిన వ్యాయామంలో భాగమే స్త్రీలు ముగ్గు వేయడం. ముగ్గులు వేయాలంటే నడుమువంచాలి. చుక్కలు పెడతారు, అవి కలపడానికి అటు, ఇటు చేతులు, నడుము కదపాలి. ఈ విధంగా నడుముకు సంబంధించిన వ్యాయమం చేసినవారవుతారు. దీని కారణంగా దీర్ఘకాలంలో నడుము నొప్పులు రావు. అందుకే ఉదయమే ముగ్గులు వేయడం మన సంప్రదాయంలో భాగంగా పెట్టారు.

 ఈనాటి కాలంలో ఒక్కసారి గమనిస్తే, మనమూ, మన పిల్లలు కూడా శరీరంలో అన్ని భాగాలకు తగిన వ్యాయామం అందివ్వడంలేదు. పిల్లలు పొద్దున బడికి వెళ్తే, ఏ రాత్రో ఇంటికి వస్తున్న రోజులివి. ఇంట్లో సౌకర్యాలు అన్ని ఉండడం వల్ల అసలు నడుము ఒంచి పని చేసే అవకాశం ఉండడంలేదు. ఇది దీర్ఘకాలంలో వెన్నుపూసకు సంబంధించిన రుగ్మతలను కారణం అవుతుంది. వారు ఆ కాలంలో ఆలోచించి వాడుకలోకి తెచ్చిన ఈ సంప్రదాయం ఈ కాలం వారికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? పెయింట్లు పెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నాం.












స్త్రీలే వేయాలా అంటే కాదు అనే చెప్పాలి. గర్భగుడిలో భగవంతుని వద్దకు పూజారి మాత్రమే వెళ్తాడు. దేవుడి వద్ద శుభరపరిచి, ఆయనే వేస్తారు(ఎందుకంటే గర్భ గుడిలోనికి పూజారి తప్ప వేరేవారు ప్రవేశించరు కనుక). అలాగే సూర్య భగవనుడికి సంబంధించిన పూజలు చేసే సమయంలో, ఇతర దేవతాపూజలలోనూ కొన్ని రకాల యంత్రాలను వేయవలసి ఉంటుంది. అప్పుడు కూడా ఉపాసకులే వేస్తారు.


ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి. ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి.


ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.


తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి.

యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి.

దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.

నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.

దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.

ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవరు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైదవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి. .













ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి. నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.















నుదుట‌న కుంకుమ బొట్టు ధ‌రించడం:-

నుదుట‌న కుంకుమ బొట్టును ధ‌రిస్తే అక్క‌డి న‌రాలు ఉత్తేజిత‌మై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయ‌ట‌. దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ట‌. లైంగిక సామ‌ర్థ్యం కూడా పెరుగుతుంది.


బొట్టు పెట్టుకుంటే…!
నుదుట బొట్టుపెట్టుకునేందుకు
పసుపుతో చేసిన కుంకుమ శ్రేష్టమైనది.
పసుపు మన శరీరంపై అమితమైన
ప్రభావాన్ని చూపుతుంది.
రక్తాన్ని శుభ్రపరిచి శరీరకాంతిని
ఇనుమడింప జేస్తుంది.
కురుపులను, గాయాలను మాన్పుతుంది.
కుష్ఠు రోగాన్ని కూడా రూపుమాపే శక్తి పసుపుకు ఉంది.
కఫాన్ని అరికడుతుంది.
కుంకుమను అమ్మవారి ప్రసాదంగా
భావించి,
సర్వమంగళ మాంగల్యే
శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరి
నారాయణీ నమోస్తుతే
అని జగన్మాతను ప్రార్థిస్తూ,
నుదుటన పెట్టుకుంటే సమస్త
మంగళాలు కలుగుతాయి.

ఉంగరపు వేలుతో బొట్టు
పెట్టుకుంటే శాంతి చేకూరుతుంది.

నడిమి వేలితే పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది.

బొటన వేలుతో పెట్టుకుంటే పుష్ఠి
కలుగుతుంది.

చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి
కలుగుతుంది.

మన శరీరంలో జ్ఞానేంద్రియ,
కర్మేంద్రియాలన మిగిలిన
అవయవాలకు ఒక్కొక్క
అధి దేవత ఉన్నారు.
వారిలో లలాట అధిదేవత బ్రహ్మ.
పరమ ప్రమాణములైన వేదాలు
బ్రహ్మ ముఖకమలం నుండి
వెలువడ్డాయి.
అందుకే బొట్టు పెట్టుకోవడానికి
బ్రహ్మ స్థానమైన లలాటం స్థానమైంది.
ద్వాదశ పుండ్రాలను పెట్టుకోక పోయినా,
కనీసం బొట్టు అయినా
పెట్టుకోవాలి.
అప్పుడు దేవుని పూజించినట్లే
అవుతుంది.




చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు.
అందుకే బ్రహ్మస్థానమైన నొసటిపై
ఎరుపురంగు వ్యాప్తిలోకి వచ్చింది.
ఇందులో నిగూఢార్థముంది.
మనలోని జీవుడు జ్యోతి
స్వరూపుడు.
ఆ జీవుడు జాగ్రదావస్థలో
భ్రూమధ్యంలోని ఆజ్ఞాచక్రంలో
సంచరిస్తుంటాడు.
మన నొసటిపై పెట్టుకున్న
కుంకుమబొట్టుపైన సూర్యకాంతి
ప్రసరిస్తే, కనుబొమల మధ్య నుండే
ఇడా పింగళ నాడులు సూర్యశక్తిని
గ్రహించి శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి.
ప్రాణశక్తికి కారణమైన నరాలకు
కేంద్రస్థానము కనుబొమల
మధ్య నుండే ఆజ్ఞాచక్రము.
కుంకుమ బొట్టును పెట్టుకోవడం
వల్ల ఆజ్ఞాచక్రాన్ని పూజించినట్లే
అవుతుంది.
మానసిక ప్రవృత్తులను
నశింపజేసేదే ఆజ్ఞాచక్రమని
అంన్నారు.


















గోరింటాకు పెట్టుకోవ‌డం.:-

ఆషాఢ మాసం మనసులో మెదిలిందంటేనే గుర్తుకొచ్చేది గోరింటాకు. ఆడవాళ్ల చేతులు ఎర్రగా, అందంగా పండిపోతూ దర్శనమిస్తాయి ఈ నెల్లాళ్లు. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ మగాళ్లను సైతం ఇంట్లో పెద్దలు పోరుతూ ఉంటారు. కారణమేమంటే జ్యేష్ఠ మాసంలో మొదలైన వర్షాల ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. దీంతో కాళ్లు చేతులు రోజూ తడిచే ప్రమాదం ఉంది. దీంతో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం జరిగుతుంటాయి. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. 



ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసుబారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. మన పద్దతులు:- ఔషధీయుక్త సౌందర్య సాధనమైన గోరింటాకు స్త్రీలకు ప్రకృతి ప్రసాదించిన వరం .
గోరింటాకు పెట్టుకోవ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి, జ్వ‌రం, ఒత్తిడి వంటి స‌మ‌స్య‌లు కూడా తగ్గుతాయి.









పసుపు పారాణి పెట్టుకోవ‌డం:-

అందాన్ని, ఆరోగ్యాన్నీ ఇచ్చే పసుపు పారాణి స్త్రీలకు సంబంధించిన ఆచారాలు, అలవాట్లలో పసుపు, కుంకుమలకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పెళ్ళి, పేరంటం లాంటి శుభ సందర్భాల్లో కాళ్ళకు పసుపు రాసుకోవడం తప్పనిసరి. పారాణి పెట్టుకోవడం ఆనవాయితీ. పసుపు కుంకుమలను నీళ్ళతో కలిపి పారాణిగా తీర్చిదిద్దుకుంటారు మహిళలు. పసుపుకుంకుమలు శుభ సంకేతం. పసుపు కుంకుమలవల్ల ప్రత్యేకతను సంతరించుకోవడమే కాకుండా అందం, ఆరోగ్యం ఇనుమడిస్తాయి. పూజలు, వ్రతాలు లాంటి శుభ కార్యాల్లో పసుపుకుంకుమలకు చాలా ప్రాధాన్యత ఉంది. పండుగలు, పెళ్ళిళ్ళ లాంటి విశేష దినాల్లో గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడమే కాకుండా స్త్రీలు కాళ్ళకు తప్పకుండా పసుపు రాసుకుంటారు. ముఖాన చిటికెడు కుంకుమ లేకపోతే ఎంత బోసిగా, అందవిహీనంగా ఉంటుంది. పూజలు మొదలు పెళ్ళి పేరంటాల పిలుపుల వరకూ అంతా పసుపు కుంకుమలతోనే ముడిపడి ఉంటుంది. స్నానం చేసేముందు ముఖానికి, చేతులకు పసుపు పట్టించి కొంతసేపయ్యాక స్నానం చేస్తారు. దీనివల్ల శరీర ఛాయ పెరుగుతుందని, ముఖంలో మంచి వర్చస్సు వస్తుందని, అన్నిటినీ మించి ఆరోగ్యానికి మంచిది. 











 నాల్గవరోజున, బంధువులు మరణించినప్పుడు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకుంటారు. కారణం పసుపు క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. అలా నీళ్ళలో పసుపు వేసుకోవడంవల్ల మరింత శుద్ధి జరుగుతుంది. అనేక ఆయుర్వేద ఔషధాల్లో పసుపును ఉపయోగిస్తారు. దెబ్బ తగిలినప్పుడు, వెళ్ళసందులో పుండు ఏర్పడినప్పుడు, ఇతరత్రా గాయాలకు పసుపు అద్దడం తెలిసిందే. ఇన్ఫెక్షన్లు రాకుండా పసుపు కాపాడుతుంది. కళ్ళ కలకలు ల్లాంటి సమస్యలను నివారించడంలో పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. 













స్త్రీలే పసుపు ఎందుకు రాసుకుంటారు అనే సందేహం కలగడంలో ఆశ్చర్యం లేదు. అనాదిగా ఇంటిపనులు చేసేది, గృహ బాధ్యతలు నిర్వహించేదీ ఆడవాళ్ళే కదా! వంటావార్పు, అంట్లు కడగడం బట్టలు ఉతకడం లాంటి పనులు చేయడంవల్ల కాళ్ళు తడిలో నాని పాచిపోయే అవకాశం ఉంది. కాళ్ళకు పసుపు రాసుకోవడంవల్ల విరుగుడుగా (anti-allergicగా) పనిచేస్తుంది.

రావి చెట్టును పూజించ‌డం:-

హిందువుల్లో అధిక శాతం మంది రావి చెట్టుకు పూజ‌లు చేస్తారు. ఈ చెట్ల‌యితే ఎక్కువ‌గా దేవాల‌యాల్లోనే ఉంటాయి. అయితే సాధార‌ణంగా చెట్ల‌న్నీ ప‌గ‌టి పూట ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తే ఈ చెట్టు మాత్రం రాత్రి పూట కూడ ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తుంది అందుకే రావి చెట్టును పూజిస్తారు. 



ఆల‌యాల్లో గంట‌లు ఉండ‌డం:-

ఆల‌యాల్లో ఉండే గంట‌ను ఏడు సార్లు కొడితే మ‌న శ‌రీరంలో ఉన్న ఏడు చ‌క్రాలు ఉత్తేజం అవుతాయ‌ట‌. అంతేకాదు మెద‌డు కుడి, ఎడ‌మ భాగాలు రెండూ కొంత సేపు ఏక‌మ‌వుతాయ‌ట‌. దీంతో మ‌న మ‌న‌స్సుకు ప్ర‌శాంత‌త క‌లుగుతుంద‌ట‌. ఏకాగ్ర‌త పెరుగుతుంద‌ట‌. గంట‌ను మోగించ‌డం వ‌ల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశ‌న‌మ‌వుతాయి.




నిద్రించేట‌ప్పుడు త‌ల‌ను ఉత్త‌రానికి పెట్ట‌క‌పోడం:-

భూమికి అయ‌స్కాంత క్షేత్రం ఉన్న‌ట్టుగానే మ‌న శ‌రీరానికి కూడా అయ‌స్కాంత క్షేత్రం ఉంటుంది. ఒక వేళ మ‌నం ఉత్త‌రం దిశ‌గా త‌ల‌ను పెట్టి ప‌డుకుంటే మ‌న శ‌రీరంలో ఉన్న ఐర‌న్ మెద‌డుకు ప్ర‌వ‌హించి బీపీ, గుండె సంబంధ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. త‌ల‌నొప్పి, అల్జీమ‌ర్స్‌, పార్కిన్‌స‌న్స్ డిసీజ్ వంటి వ్యాధులు వ‌స్తాయ‌ట‌. కాబ‌ట్టి త‌ల‌ను ఉత్త‌రం దిశ‌కు పెట్టి నిద్రించ‌కూడ‌దు.


రెండు చేతులతో న‌మ‌స్క‌రించ‌డం‌:-

ఎదురుగా ఉన్న వారికి రెండు చేతుల‌తో న‌మ‌స్క‌రిస్తే మ‌నం వారిని ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటామ‌ట‌. ఎలాగంటే రెండు చేతుల‌ను జోడించిన‌ప్పుడు చేతి వేళ్ల‌న్నీ క‌లిసిపోయి ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి మ‌న జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయ‌ట‌. దీంతోపాటు మెద‌డు ప‌నితీరు కూడా మెరుగు ప‌డుతుంది‌.












నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం:-

నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం వ‌ల్ల ప‌ద్మాస‌నం భంగిమ వ‌స్తుంది. దీంతో జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రిగి జీర్ణాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయ‌ట‌. కార‌మైన ఆహారం ముందు, స్వీట్లు త‌రువాత తిన‌డం… భోజ‌నం చేసిన‌ప్పుడు ముందుగా కారంగా ఉండే ఆహారం తిన‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో జీర్ణ‌క్రియ‌కు అవ‌స‌ర‌మైన ఆమ్లాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయ‌ట‌. దీంతో జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రుగుతుంద‌ట‌. అయితే భోజ‌నం మొదట్లోనే స్వీట్లు తింటే అది మ‌నం తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణం చేయ‌నీయ‌దు.









న‌దుల్లో నాణేలు వేయ‌డం:-

ఒక‌ప్పుడు మ‌న ద‌గ్గ‌ర రాగితో చేసిన నాణేలు చ‌లామ‌ణీలో ఉండేవి. ఈ కార‌ణంగా ఆ నాణేల‌ను న‌దుల్లో వేస్తే ఆ రాగి అంతా ఆ నీటిని శుద్ధి చేసేద‌ట‌. దీంతో ఆ నీటిని తాగేవారికి ఎన్నో అనారోగ్యాలు దూర‌మ‌య్యేవి.







ఉపవాసము వలన:-

ఉపవాసము అనగా ఉప=స్వామి సమీపము నందు, వాసః=నివసించుట. అనగా స్వామి యొక్క గొప్పదనమును తెలుసుకొను . అంతే కాని ఆకలి వేయుచుండగా జీవుని బాధించుకొనుట కానేకాదు. మధ్య మధ్యలో క్షీరపానము చేయవలయునని అర్ధము. దీనిచే శక్తి లభించును. మరియు పాలు సులభముగా జీర్ణమగుట వలన తమో గుణమైన మత్తురాదు. ఫలములు కూడా పాల వంటివే. ఆ విధముగా ఎవరు రోజంతయును సత్సంగములతో భజనలతో గడుపుదురో శక్తి కొరకు పానీయములను మాత్రము నోటిద్వారా తీసుకొందురో వారినే ఉపవాసము చేయువారందురు . ఉప‌వాసం ఉండ‌డం… హిందువుల్లో అధిక శాతం మంది వారంలో ఏదో ఒక రోజు దేవుడికి ఉప‌వాసం ఉంటారు క‌దా. ఆయుర్వేద ప్ర‌కారం అలా ఉప‌వాసం ఉండ‌డం మంచిదేన‌ట‌. ఎందుకంటే ఉప‌వాస స‌మ‌యంలో మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థకు పూర్తిగా విశ్రాంతి ల‌భించి శ‌రీరంలో ఉన్న ప‌లు విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్ల‌గొట్ట‌బ‌డ‌తాయ‌ట‌. దీంతోపాటు దేహం త‌న‌కు తాను మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంద‌ట‌. ఉప‌వాసం ఉండ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్‌, బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్లు రావ‌ట‌. ఉపవాసము లో రకాలు : సంపూర్ణ ఉపవాసము : ఈ తరహా ఉపవాసము చేసేవారు మంచి నీళ్ళు కూడా తాగరు . పానీయాలతో ఉపవాసము : ఇందులో ఘనపదార్ద ఆహారానికి బదులు మంచి నీళ్ళు , పండ్లరసాలు , టీలు , కాఫీలు , పానకము మున్నగు ద్రవరూప ఆహారం తీసుకుంటారు .
వండని పదార్దాలలో ఉపవాసము ఇందులో ఆహారానికి బదులుగా పండ్లు , పచ్చి కూరలు , వడపప్పు , చెరుకు ముక్కలు … వండని ద్రవపదార్దములతో కలిపి (సహా) తీసుకుంటారు . వండిన , ఉడికించిన పదార్దాలు తీసుకోరు . వండిన ఆహారముతో ఉపవాసము : ఈ తరహా ఉపవాసము లో ఉడికించిన కూరగాయలు , గింజలు తో సహా అన్ని పానీయాలు తీసుకుంటారు . ఉపవాస విధానాలు : ఉపవాసము ఒకరోజు నుంచి అనేక రోజులు చేయవచ్చును . ముందు తక్కువ సమయం ఉపవాసము చేసి ఆ తర్వాత ఎక్కువ రోజులు చేయడానికి ప్రయత్నించాలి . భోజనము లేదా ఆహారము లో కొన్ని పదార్ధాలను మినహాయించుకొని ఉపవాసం చేయుట . రోజులో ఒక పూట ఉపవాసము , ఒక రోజు అంతా ఉపవాసము చేయుట , వారాంతం ఉపవాసాలు … వారానికి ఏదో ఒకరోజు ఉపవాసము చేయుట-క్రమము తప్పకుండా చేయుట , పండగ , పుణ్య . పవిత్ర దినాలలో ఉపవాసము చేయుట – ఇది ఒక క్రమ (regular) పద్దతి లో ఉండదు , ఉపయోగాలు : లంకణం పరమౌషధం కాబట్టి …మన జీర్నశాయానికి కొంచెం విశ్రాంతి ఇవ్వడం ద్వారా అది మరింత చక్కగా పనిచేయడానికి దోహదపడం.. ఉపవాస కాలము లో శరీరము స్వస్థత పొందడం ప్రారంభమవుతుంది , జీర్ణ వ్యవస్థ , జీర్ణక్రియ మెరుగు పడుటుంది . , రోగనిరోధక వ్యవస్థ ప్రచ్చన్నమవుతుంది.







భార్య, భర్తకు ఎడమ పక్కనే ఉండాలి:-

సమస్త పూజాదికాలు నిర్వహించే టప్పుడు, దానాలు,ధర్మాలు చేసే సమయాన భార్య, భర్త ఎడమవైపున ఉండాలి.

కన్యాదాన సమయాన, విగ్రహ ప్రతిష్టలప్పుడు కుడి వైపున ఉండాలి. బ్రహ్మ దేవుడు మగవాడ్ని కుడి భాగం నుంచి, స్త్రీని ఎడమ భాగం నుంచి సృష్టించాడని శాస్త్రాలు చేపుతున్నంయి. 

శ్రీ మహా విష్ణు శ్రీ మహా లక్ష్మిని ఎడమ స్థానంలో పదిలంగా ఉంచుకుంటాడు.










ఆడ‌వారు గాజులు ధరించ‌డం:-

ఆడ‌వారు గాజులు ధరించ‌డం వెనుక‌… పురాత‌న కాలంలో కేవ‌లం మ‌గ‌వారే బ‌య‌టికి వెళ్లి శారీర‌క శ్ర‌మ చేసేవారు. దీంతో వారు ఆరోగ్యంగా ఉండేవారు. అయితే మ‌హిళ‌లు ఎప్పుడూ ఇంటి ప‌ట్టునే ఉండి త‌క్కువ‌గా శ్ర‌మిస్తారు కాబ‌ట్టి వారికి గాజుల‌ను ధ‌రింప‌జేసే వారు. దీంతో ఆ గాజుల వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ట‌. గాజులు ఎల్ల‌ప్పుడూ చేతి న‌రాల‌కు తాకుతూ ఉండ‌డం వ‌ల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంద‌ట‌. అంతే కాకుండా ఆడ వారి శ‌రీరం నుంచి విడుద‌ల‌య్యే నెగెటివ్ శ‌క్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా గాజుల‌ను ధ‌రింప‌జేసే వారు.












ముక్కు పుడక ధరించ‌డం:-

ముక్కుకి ఎడమ వైపున చంద్ర నాడి ఉంటుంది.కనుక ముక్కుకు ఎడమ వైపున అర్థ చంద్రాకారంలోని బేసరి ధరించాలి. కుడివైపు సూర్యనాడి ఉంటుంది. కాబట్టి కుడి వైపున మండలాకారమైన ఒంటి రాయి బేసరి ధరించాలని శాస్త్రోక్తం. మధ్యలో ముక్కెర ధరించాలి. ఇది సాధారణంగా ముత్యం లేదా కెంపు ని బంగారం తో చుట్టించి ధరిస్తారు. ముక్కుకి ఎడమవైపున ధరించే ముక్కు పుడక లేదా ముక్కు బేసరి వల్ల ఆడవారికి గర్భకోశ సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి. పురుటి నొప్పులు ఎక్కువగా కలుగకుండానే సుఖప్రసవం అవుతుంది. కన్ను, చెవి కి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయి. చెవిపోటు, చెవుడు వంటివి కలుగ కుండా ముక్కుపుడక కాపాడుతుంది. శ్వాస సంబంధమైన వ్యాధులు కలుగవు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ మెరుగు పడుతుంది .











పిల్ల‌ల‌కు చెవులు కుట్టించ‌డం:-

చిన్నారుల‌కు చెవులు కుట్టించ‌డం స‌హ‌జ‌మే. ప్ర‌ధానంగా ఆడ‌పిల్ల‌ల‌కు, ఆ మాట‌కొస్తే కొంత మంది మ‌గ పిల్ల‌ల‌కు కూడా చెవులు కుట్టిస్తారు. అయితే ఇలా కుట్టించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి దాంతో వారికి వ‌చ్చే అనారోగ్యాలు పోతాయ‌ట‌. ప్ర‌ధానంగా ఆస్త‌మా వంటి వ్యాధులు రావు‌.











కాలి వేళ్ల‌కు మెట్టెలు ధ‌రించ‌డం:-

హిందూ సాంప్ర‌దాయంలో పెళ్ల‌యిన మ‌హిళ‌లు కాలికి మెట్టెల‌ను ధ‌రిస్తారు. ఇలా ధ‌రించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి వారి గుండె నుంచి గ‌ర్భాశ‌యానికి ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. దీంతో వారి రుతు క్ర‌మం స‌రిగ్గా ఉంటుంద‌ట‌. అయితే వెండి మెట్టెలు ధ‌రిస్తే ప్ర‌కృతిలో ఉన్న పాజిటివ్ ఎన‌ర్జీ వారి శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంద‌ట‌. వివాహిత స్త్రీలు కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవడం ఆచారం. వాడుకలో 'మెట్టెలు'గా ఉన్న ఈ పదం నిజానికి 'మట్టెలు'. కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువుపట్టు వంటిది. దాని నుంచి విద్యుత్తు ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదు. అలా తగలకుండా ఉండటానికే మెట్టెలు ధరించే సంప్రదాయం ఏర్పడిందని పండితులు అంటారు. ఇలా అనుకోవడానికి కారణం ఓ పురాణగథ. దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానిస్తాడు. తన భర్తకు జరిగిన అవమానాన్ని చూసి కోపోద్రిక్తురాలైన దాక్షాయణి, తన కాలివేలిని భూమిపై రాసి నిప్పు పుట్టించి, అందులో తాను దహనమయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. దీనిని అనుసరించే పై నమ్మకం ఏర్పడింది. అందుకే వివాహిత స్త్రీలు మెట్టెలు పెట్టుకునే ఆచారం వచ్చింది. 









సాంప్రదాయం ప్రకారం పెళ్లి అయిన స్త్రీలుకాళ్లకు మెట్టలు ధరిస్తారు… ఇది కేవలం ఆమెకు పెళ్లి అయ్యిందని సూచించడమే కాదు. దానికి ఓ ప్రత్యేకత ఉంది.సాధారణంగా స్త్రీలు కాలి రెండవ వేలికి మెట్టెలు ధరిస్తారు. కాలి రెండవ వేలి నుండి ఓ ప్రత్యేక నరం గర్భాశయానికి సంధి చేయబడి గుండె వరకు వెళుతుంది. ఈ వేలికి మెట్టె పెట్టుకోవడం వల్ల గర్భాశయం ధృఢపడుతుంది. ఇది రక్తప్రసరణను నియంత్రించి రుతుచక్రం సక్రమంగా వచ్చి గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.వెండి మంచి ఉష్ణ వాహకం కావడం వల్ల..భూమి నుండి ధనావేశాలను గ్రహించి శరీరమునకు ప్రసరింపజేస్తుంది..అందుకే వెండితో చేసిన మెట్టలను మన భారతీయ స్త్రీలు కాలి రెండవ వేలుకు ధరిస్తారు.










శుభాలు పొందుటకు స్త్రీలు పాటించవలసిన కొన్ని నియమాలను విధించారు మన పెద్దలు. భర్త అనురాగం పెరగటానికి సంతానభాగ్యానికి సిరిసంపదలు పొందటానికి వ్యాధులు రాకుండావుండటానికి ఈనియమాలు పాటించి చూడండి.


1. మంగళ సూత్రం లో పిన్నీసులు వుంచరాదు అలానే కొన్నిసార్లు హెయిర్ పిన్నులను కూడా తాత్కాలికంగానైనా స్త్రీలు మంగళ సూత్రానికి వుంచుతారు .మంగళ సూత్రం వేదమంత్రాల సహితంగా ప్రభావితము కాబడిన భర్త ఆయువు పట్టు.మంగళ సూత్రము రూపములో హృదయం వద్ద చేరివున్నది. ఇనుప వస్తువులు[పిన్నీసులు ,ఇనుముతో చేసినవి] దివ్యశక్తులను ఆకర్షించుకొను గుణముకలవి. కనుక అవి మంగళ సూత్రము లో దివ్యశక్తులను ఆకర్షించి భర్తను శక్తి హీనుడిని చేస్తాయి .భర్తకు అనారోగ్యం ,భార్యాభర్తలపట్ల అనురాగం తగ్గటం ఇలాంటి దుష్ఫలితాలొస్తాయి. కనుక వెంటనే ఈ అలవాటు వెంటనే సరి చేసుకోవాలి.




2. స్త్రీలు ధరించే గాజులు మట్టిగాజులై వుంటె చాలామంచిది. . ఈగాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక ,వీని శబ్దము శుభాలను ,అనురాగాలను పెంచుతుంది.




3.ఇంట్లో గుర్రం బొమ్మలు వుంచుట అంత క్షేమము కాదని డబ్బు విపరీతంగా ఖర్చవుతుందని చాలామంది నమ్మకం .
4.సంపదలను ,ఎక్కువగా ప్రదర్షించటం వలన నరఘోష ఏర్పడుతుంది .తద్వారా చెడు జరుగుతుంది. కనుక [అలంకారాదులు]సాధారణం గా వుండేలాచూసుకోవటం సాధారణ జీవిత విధానాన్ని పాటింఛటం ఇలా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు..





5. పిల్లలు తమ మాటవినలేదనేవారు ఈ చిన్నచిట్కాలు పాటించి చూడండి. ఆడపిల్లలకైతే ఐదుపోగుల ఎర్రదారం కుడిభుజమునకు కట్టి కుంకుమ బొట్టు పెట్టుకునే అలవాటు చేయండి . అలాగే మగపిల్లలైతే ఆకుపచ్చదారం తొమ్మిది పోగులు వేసి కుడిభుజానికి కట్టి గంధమునుదుట ధరించటం అలవాటు చేసి చూడండి పిల్లలు మీ మాటను శిరసావహిస్తారు.






6.ఆడపడుచులు ,అత్తమామలతో విబేధాలు ఎక్కువైతే ,వారు మిమ్మలను ఇబ్బందులు పెడుతుంటే వారు పనుకునేదిండు క్రింద తులసి వేరు వుంచండి వారు మిమ్మల్ని ఆప్యాయంగాచూసుకుంటారు విరోధాలు తగ్గుతాయి.



7. వంట చేసేప్పుడు రెండు బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించండి వంటకాలు ఎంతో రుచిగాను ఆరోగ్యకరం గాను వుంటాయి. పని మనిషిరానప్పుడు విసుగుచెంది కోపంతో బాధపడేకంటె ,పనిమనిషికంటే నేనే శుభ్రంగా గిన్నెలు శుభ్రం చేసుకుంటాను,వాల్లకంటె నేనైతే శుభ్రంగా వుంచుకోగలనని[ నిజాన్ని] మనస్సుకు పదేపదే చెప్పుకుని మీరు మీపనిని చేసుకునే ప్రయత్నం మొదలెట్టండి అసలు పనిమనిషిని మానిపించాలనే అని పిస్తుంది మీకు.




8.భర్త తాగి వచ్చి హింసపెడుతుంటే ఉదయం పూట టిఫిన్ చేసిన తరువాత ఒకచిన్నస్పూన్ [అంటె సుమారు అరగ్రాము] కరక్కాయ పౌడర్ ను ఆరు చెంచాల నీటి లో కలిపి త్రాగించండి. ఇలా అరవై రోజులు చేస్తే వాల్లకు తాగుడు పై విరక్తి కలుగుతుంది. కరక్కాయ పొడి ఆరోగ్యానికి చాలామంచిది ,నల్లవెంట్రుకలను కూడా తెల్లబరుస్తుంది .మొదట దీనిని త్రాగనని మారాం చేస్తారు. కొద్దిగా బతిమాలి తాగించటం అలవాటూ చేయండి ఈ ఔషధాన్ని.తాగుడు ఖాయంగా మానుతారని పలువురు అనుభవపూర్వకంగా చెబుతున్నారు.





9.సుఖసంతోషాలు కరువైనవారు పసుపురంగుపూలు ధరించండి ,క్రమేపీ స్థితి మెరుగవుతుంది.


10.అప్పుల బాధ ఎక్కువగావుంటె తెలుపు పూలు ధరించటం వలన రుణబాధలు తగ్గుతాయి.


11.ఆరోగ్యం సరిగాలేనివారు ,శరీరం నొప్పులు వున్నవారు మరువం ,మందారాలు కలిపి ధరించండి ఇరవై రోజులలో ఫలితం కనిపిస్తుంది.


12. పెల్లిచూపులప్పుడు ఎరుపు పూలు ,పసుపు పూలు కలిపి మాలకట్టి దరించండి వివాహం విషయం లో కన్యలకు ఎంతో శుభకరం గా ఫలితాలొస్తాయి.



13.మంచి తీర్ధం లో రెండు తులసి దలాలు వేస్తే అవి మానససరోవర జలాలంత పవిత్రమవుతాయి.



14.కూర్చునే పీఠమునకు శుభ్రం చేసి నాలుగు మూలలా బొట్లు పెట్టి కూర్చోవాలి. చాపైతే విభూది బొట్లు గుడ్డను ఆసనంగావాడితే కుంకుమ బొట్లను పెట్టండి .



15.భర్త బయటకు వెళ్ళుటకు షర్ట్ వేసుకుంటుంటే గుండీలు మీరు పెట్టండి . మీకుడు చేతితో తాకి వెళ్లమనండి.భర్తలకు ఆరోజు సంపాదనా ,విజయము సంతోషము వెంటనుంటాయి.



స్త్రీలు చేయ తగిన చేయ కూడని పనులు:-

స్త్రీలు ఎప్పుడు గుమ్మడి కాయను కొట్టరాదు ఎందుకంటె గర్భ సంచి కిందికి జారిపోయే అవకాశములు ఎక్కువ.

గర్భిణి స్త్రీలు శూర టెంకాయ, తమిళంలో చిదరు కాయ్ అంటారు దానిని కొట్ట కూడదు ఎందుకంటె అదురుడుకు గర్భము జారిపోవచ్చు, అదే మాదిరి శూర టెంకాయ కొట్టే స్తలములో కూడా ఉండకూడదు.


గ్రహణ సమయమందు భూమ్యాకర్షణ శక్తి మార్పు చెందుతుంది. దాని పరిమాణము మనపై చాల ఉంటుంది ముఖ్యముగా మన కడుపులో ఆహార పదార్థములు జీర్ణమవ్వడానికి కావలసిన ఆమ్లములు ఉండవు .అందువల్ల జీర్ణము కాదు ఈ కారణముగానే గ్రహణ సమయమునకు ముందుగ మూడు గంటలకు పూర్వమే మన కడుపులో ఏమి ఉండకూడదు అంటారు.


మీ భర్త పిల్లలు మంగళ వారము నాడు క్షవరము గడ్డము గీసుకోవడము చేయనీయ వద్దు. ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింప చేయును.



మంచి పనులను శుక్ల పక్షము నందే అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయ వలెను.


మీరు మీ పిల్లలు దిండు పైన కూర్చో వద్దు ఐతే ఈ కాలములో అందరూ దీనిని తప్పక చేస్తుంటారు.


స్త్రీలు రాత్రి సమయమున గాజులు కమ్మలు తీయరాదు.


దుఃఖము విచారణ చేయ వచ్చిన వారిని ఆహ్వానించ కూడదు. అలాగే వారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్ప కూడదు. ఈ మధ్య కాలంలో దుఃఖము విచారించ వచ్చిన వారిని రండి రండి అంటూ సాదరముగా ఆహ్వానించి స్థలము ఇచ్చి కూర్చోపెట్టి కాపీలు ఇచ్చి చాల అతిథి మర్యాదలు చేస్తారు .అపరోక్షముగా మనము అశుభములను కోరుకోవడానికి ఇది నాంది అవుతుంది.


కొత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక మూల రాయాలి, పసుపు క్రిమి నాసిని.


ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోడదు అయితే ఈ మధ్య కాలములో ఈ పని చాల చోట్లలో సహజమై పోయింది.


నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించ కండి ఈ మధ్య కాలంలో సువాసిని స్త్రీలుకుడా నలుపు రంగు వస్తువులు ధరించడం ఎక్కువై పోయింది.



ఉప్పు మిరప చింతపండు వీటిని ఎవరికి ఇచ్చిన చేతిలో ఇవ్వకూడదు ,కింద పెట్టండి వాళ్ళే తీసుకొంటారు .ఈ మద్య కాలంలో ఉప్పు చేతితో వడ్డించడం చాల చోట్లలో గమనిస్తాము.



ప్రతి రోజు భోజనమునకు ముందు కాకికి అన్నము పెట్టండి, ఇది పితృ దేవతలకు ప్రీతి .కాకికి మనము భోజనము చేయుటకు ముందు కుక్కకు మనము తిన్న తర్వాత పెట్టాలి.




టెంకాయ చిప్ప తామ్బులము ఇచ్చేటప్పుడు మూడు కండ్లు వుండే భాగము మీరు ఉంచుకొని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను.



స్త్రీలు ఎప్పుడు జుట్టు విరపోసుకొని ఉండకూడదు .ఇది జ్యేష్టాదేవి స్వరూపము ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది. ఈ చర్య ప్రతి గృహములో ఇప్పుడు ఒక తప్పని సరి అయిపొయింది.



శుక్రవారమునాడు గాని ,జీతము రాగానే గాని ఆ డబ్బుతో మొట్ట మొదటి సారి ఉప్పు కొనండి ఈ చర్య పై పై డబ్బులు చేరటానికి అవకాశము ఎక్కువ.



కాలిపైకాలు వేసుకొని కుర్చోవడము, కాళ్లాడిస్తూ కూచోవడం, ఒంటి కాలితో నిలవడం, స్తిరముగా నిలవక ఉగుతుండడం లాంటి పనులు చేయకూడదు ఇందువల్ల ఒకటి దారిద్ర హేతువు మరియొకటి ఆ ప్రదేశములు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ







ఎల్లప్పుడు ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేయాలి ,ఎడమ చేతిని ఉపయోగించ కూడదు.


సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి వేరే చోట పడుకొనరాదు ,  భర్త పడుకున్న చోటనే  బార్య నిద్రించాలీ. అలిగి ఆహారము తినకుండా నిద్రించ కూడదు. ఇది కుటుంభనాశనానికి దారి తీయిను.



స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు. పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పు రాదు ,రేపు తీసుకుంటాను అని అనవలెను.



ఎప్పుడు మన నోటినుండి పీడ ,దరిద్రం, శని పీనుగా కష్టము, అనే పదములను ఎప్పుడు ఉపయోగించ కూడదు.


ఇంటిలో దుమ్ము ధూళి, సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర హేతువులు, పదిరోజులకు ఒకమారు మంగళ శుక్ర వారములు కాకుండా దులిపి శుభ్రము చేయవలెను.


శ్రాద్ధ దినమందు ఇంటి ముందు ముగ్గు శ్రాద్ధము అయ్యేవరకు వేయకూడదు, శ్రాద్ధానంతరము ముగ్గు వేసి తర్వాత ఇంటిలోని వారు భోజనము చేయవలెను.


దిండులు, ఓర దుప్పట్లు అప్పుడప్పుడు ఉతుకుతూ వాడాలి .మనకు తెలియని సుక్ష్మ క్రిములు చాల ఉంటాయి దాని వాల్ల మనకు హాని జరుగును