వివాహానికి స్ర్తీ పురుషుల అష్ట కూటాలు.
శ్లో॥ గుణైక వర్ణం ద్విగుణంచ వస్యం,త్రిభిశ్ఛ తారా చతురస్తుయోనిః। పంచః ఖగ షడ్గుణతో గణాశ్చ భకూట సప్తాష్ట గుణాళి నాడిః॥
1. వర్ణ కూటం గుణములు.
2. వస్య కూటం గుణములు.
3. తారా కూటం గుణములు.
4. యోని కూటం గుణములు.
5. గ్రహ కూటం గుణములు.
6. గణ కూటం గుణములు.
7. రాశీ కూటం గుణములు.
8. నాడి కూటం గుణములు.
మొత్తము గుణములు 36.కనీసం 18 పైన ఉండవలెను.
1.వర్ణ కూటముః-
శ్లో॥కర్క్యాంత్యే వృశ్చికే విప్ర, క్షత్రిస్సింహ ధనుష్వజా। వైశ్యో వృష మృగః కన్య,శూద్రో యుగ్మ తులాఘటాః॥ వర్ణ శ్రేష్టంతు యా నారీ వర్ణ హీనంతు యఃపుమాన్, వివాహమేతయో కుర్యాత్ తస్య భర్తా వినస్యతి॥
కర్కాటకము, మీనము, వృశ్చికము బ్రాహ్మణ వర్ణము,
సింహము,ధనుస్సు మేషము క్షత్రియ రాశులు
వృషభము,కన్య మకరము వైశ్య రాశులు
మిధునం,తులా కుంభం శూద్ర రాసులు.
వరుని వర్ణము వధువు వర్ణము కన్న పెద్దది గా ఉండవలెను.
2.వస్య కూటముః-
శ్లో॥మేషస్య సింహౌ వస్యాళి-వృషస్య తుల కర్కటౌ।మిధునస్యబలా వస్యం కర్కటస్యాళి కార్ముకం,సింహస్య క్రియ భావస్యం,మీనస్య మకరస్తధా॥
మేషం, వృషభం చతుష్పాద రాశులు (2).
మిధునము,కన్య, ధనుస్సు, తుల,కుంభం మానవ రాశులు(5).
కర్కాటకం,మకరం, మీనం జలచర రాశులు (3).
వృశ్చికం కీటక రాశి,(1) .
సింహం వన చర రాశి(1).
3.తారాకూటముః-
వధునక్షత్ర మారభ్య, వర నక్ష్త్రత్ర గణ్యతే। నవభిః పర్యాయేణ తారాకూటం ప్రగణ్యతే॥ వధువు నక్షత్రము నుండి వరుని నక్షత్రము తొమ్మిది నవకములుగా లెక్కించగా 2, 4,6,8,9 శుభప్రదము,1,3,5,7,పనికి రావు.
4.యోని కూటము.
నక్షత్రము…………….యోని అశ్విని………………………..గుఱ్ఱం భరణి…………………..ఏనుగు
కృత్తిక……………మేక
రోహిణి, మృగశిరలు……………పాము ఆరుద్ర……………………..కుక్క
పునర్వసు…………పిల్లి
పుష్యమి----మేక
ఆశ్రేష…..గండు పిల్లి
మఘ,పుబ్బలు ….ఎలుకలు
ఉత్తర……………….ఆవు
హస్తమి…………………….గేదె
చిత్త……………………పులి
స్వాతి…………ఎనుపోతు
విశాఖ ........ పులి.
అనూరాధ, జ్యేష్టలు …లేడి
మూల…………………కుక్క
పూర్వాషాడ…….కోతి
ఉత్తరాషాడ, (అభిజిత్)……..ముంగిసలు
శ్రవణం……కోతి
ధనిష్ట……సింహం
శతభిషం…..గుర్రం
పూర్వాభాద్ర…..సింహం
ఉత్తరాభాద్ర…..ఎద్దు
రేవతి…………….ఏనుగు.
వైరి వర్గాలు ఆవు………x………………పులి ఏనుగు……x……….సింహం
గుఱ్ఱం……x………..గేదె
కుక్క……x……లేడి
కోతి……x…………మేక
ముంగిస…x…పాము
ఎలుక…x……పిల్లి
5. గ్రహ కూటం(గ్రహమైత్రుత్వం)ః-
రాశ్యాధిపత్యంః-శ్లో॥ సింహస్యాధిపతి సూర్య చంద్రః కర్కట ప్రభూ। మేష వృశ్చిక యోర్భౌమా- కన్యా మిధునయోర్భుధః। ధనుర్మీన ద్వయోర్మంత్రీ,తులా వృషభయోర్బృగుః। మకరే కుంభ రాశౌచ నాయకః సూర్య నందనః॥
సింహ రాశికి సూర్యుడు,
కర్కాటక రాశికి చంద్రుడు అధిపతులు.
మేష వృశ్చిక రాశులకు కుజుడు,
కన్యా మిధున రాశులకు బుధుడు,
ధనుస్సు మీన రాశులకు బృహస్పతి,
తులా వృషభ రాశులకు శుక్రుడు
మకర కుంభ రాశులకు శని అధిపతులు.
శత్రు మిత్రుత్వాలుః-
శ్లో॥అర్క మందస్తధా వైరమ్, కుజ మందస్తధైవచ। గురు భార్గవ యోర్వైరం,వైరంతు బుధ్ సోమయో।సోమస్య సోమపుత్రస్య మహావైరీ ప్రకీర్తితాః॥ శ్లో॥ఆదిత్య సోమ గురు మంగళ యోస్సఖిత్వం, అత్యంత మైత్రి బుధ శుక్ర శనైశ్చరాణాం, వైరం రవే రవి సుతస్య బుధస్య సోమా। శుక్ర ప్రకోప కురుతే రవి జీవ భౌమౌ॥ రాశి నాధే విరుద్ధేచ మిత్రే హంశాధిపే సతి। హంస నాయక మిత్రుత్వం వివాహం సర్వ సమ్మతం॥ పితా పుత్రో న శత్రుత్వం కర్మణా బాహ్యతే రిపుః।అర్కార్కి బుధ సోమస్య వైరీ దోషో నవిద్యతే॥
6.గణ కూటముః-
గణములు 3 విధములు.1 దేవ గణం 2. మనుష్య గణము 3.రాక్షస గణము.
దేవ గణంః- శ్లో॥అశ్విని మృగశిరో హస్తా స్వాతి పుష్య పునర్వసు। మైత్రా శ్రవణ రేవత్యాం ఏతే దేవ గణా స్మృతాః॥
అశ్విని,మృగ శిర హస్త, స్వాతి పుష్యమి పునర్వసు, అనూరాధ(మైత్ర).
శ్రవణం మరియు రేవతి నక్షత్రములు దేవ గణములు.(9 నక్షత్రములు).
మనుష్య గణంః-శ్లో॥రోహిణీ త్రీణి పూర్వాణీ భరణి రౌద్రమేవచ।త్రివుత్తరాశ్చ విఙ్ఞేయ । మానుషాశ్చ ప్రకీర్తితాః॥
రోహిణి, పుబ్బ,పూర్వాషాడ, పూర్వాభాద్ర,భరణి,ఆరుద్ర,ఉత్తర ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర, నక్షత్రములు మనుష్య గణములు (10).
రాక్షస గణంః-
శ్లో॥అగ్నిర్మఘ విశాఖాచ అశ్రేషా శత తారకా। ధనిష్టా చిత్ర సంయుక్తం జ్యేష్ట మూలంతు రాక్షసం. కృత్తిక(అగ్ని),మఘ,విశాఖ, ఆశ్రేష,శత భిషమ్ ధనిష్ట చిత్త మరియు జ్యేష్ట నక్షత్రములు రాక్షస నక్షత్రములు (8 నక్ష్త్రములు).
నక్షత్రము……………గణము
అశ్విని……………దేవ గణం
భరణి……………మనుష్య గణం
కృత్తిక……………రాక్షస గణం
రోహిణి, మనుష్య గణం మృగశిరలు………దేవ గణం ఆరుద్ర……………… మనుష్య గణం
పునర్వసు…………దేవగణం
పుష్యమి---- దేవగణం ఆశ్రేష…..రాక్షస గణం మఘ….., రాక్షస గణం పుబ్బ … మనుష్య గణం ఉత్తర………… మనుష్య గణం హస్తమి…………దేవ గణం చిత్త…………………రాక్షస గణం
స్వాతి………దేవ గణం
విశాఖ రాక్షస గణం
అనూరాధ….. దేవ గణం
జ్యేష్ట …రాక్షస గణం
మూల………రాక్షస గణం
పూర్వాషాడ……. మనుష్య గణం
ఉత్తరాషాడ, మనుష్య గణం శ్రవణం…… దేవ గణం ధనిష్ట…… రాక్షస గణం
శతభిషం…..రాక్షస గణం
పూర్వాభాద్ర….మనుష్య గణం
ఉత్తరాభాద్ర…..మనుష్య గణం
రేవతి…………….దేవ గణం.
గణ కూటం చూడడానికి శ్లో॥ స్వగణం చోత్తమం ప్రీతి।మధ్యమం దేవ మానుషం,అధమం దేవ దైత్యానాం మృత్యోర్మానుష రాక్షసం॥ శ్లో॥ స్త్రీ రాక్షసం న కర్తవ్యం, కర్తవ్యం పురుష రాక్షసం।సద్భకూట యోనిసిద్ధి, గ్రహ సఖ్యం గుణ త్రయం,।యేష్వైక తమ సద్భావో। కన్యా రాక్షో గణా శ్శుభాః॥ ఇంద్రాగ్నిరసుర సార్పా।త్వష్టుర్ జ్యేష్టాచ వారుణీ॥ స్త్రీ రాక్షసం శుభం ప్రోక్తం అన్య రుక్షం వివర్జయేత్॥
7.రాశీ కూటంః-
స్త్రీ రాశ్యాధి ప్రయత్నేన పురుష రాశ్యాంత గణ్యతే।క్రమేణ ద్వాదశం చైవ రాశీ కూటం ప్రగణ్యతే॥ రాశీకూట గణన పలితం తెలుసుకోవటానికి శ్లో॥ ద్విర్ద్వాశకే మృత్యు, ఆయుర్ద్వాదశకే శుభం। త్రీణి ఏకాదశీ సౌఖ్యం దుఃఖమేకాదశత్రికం। చతుర్థ దశమమ్ ప్రీతి అప్రీతి ర్దశ చతుర్థకం। పంచమన్నవ సౌభాగ్యం,వైధవ్యం నవ పంచమం షష్టాష్టకే దరిద్రత్వం పుత్ర లాభోష్ట షష్టకే। సమ సప్త సుభం ప్రోక్తం రాశీ కూటం ఫలం లభేత్॥
2-12 ….మృత్యువు.
12-2 శుభం
3-11 సౌఖ్యం.
11-3 దుఃఖం.
4-10 ప్రీతి.
10-4 అప్రీతి.
5-9 సౌభాగ్యం.
9-5 వైధవ్యం.
6-8 దరిద్రం.
8- 6 పుత్ర లాభం.
7-7 శుభం.
7-7 శుభం.
8.నాడీ కూటంః-
శ్లో॥అశ్విన్యాది క్రమాత్రీణీ। పర్యాయాశ్చ పునఃపునః॥అనులోమ విలోమాభ్యాం నాడీ కూటం ప్రగణ్యతే॥ ఆదినాడి మధ్య నాడి అంత్యనాడి .
అశ్విని భరణి కృత్తిక ఆరుద్ర మృగశిర రోహిణి పునర్వసు పుష్యమి ఆశ్రేష ఉత్తర పుబ్బ మఘ హస్తమి చిత్త స్వాతి జ్యేష్ట అనూరాధ విశాఖ మూల పూర్వాషాడ ఉత్తరాషాడ శతభిషం ధనిష్ట శ్రవణం పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి.
నాడీ కూట పలితం ః-శ్లో॥ ఏక నాడీ పతిం హంతి, పార్శ్వనాడీతు కన్యకా। ఉభయోర్మధ్య నాడీచ భిన్న నాడీ శుభావహం॥
అన్ని కూటాలు కలిపిః- గుణైష్షోడశభర్నిందం।మధ్యమం తురగిందమం।వింశత్యూర్ద్వం శుభం ప్రోక్తం। వివాహం సర్వ సమ్మతం॥ చాతుర్వర్ణములకు ముఖ్యమైన కూటములు.శ్లో॥గ్రహమైత్ర ద్విజాతీనాం క్షత్రియాణాం గణస్తధా।వైశ్యానాం రాశీకూటంచ, శూద్రాణాం యోనిమేవచ॥
No comments:
Post a Comment
మీ అభిప్రాయం తెలియచేయండి.