19 September 2016

ఏశాస్తము చెప్పబడని దాంపత్యజీవితములోభార్య భర్తల బంధం

ఆర్థిక భారం మోసేది భర్త... కుటుంబ భారాన్ని మోసేది భార్య జీవనయానంలో ఇద్దరి ప్రాధాన్యం ఒకటే.
కుటుంబ రథం సాఫీగా సాగేది అప్పుడే సంప్రదాయ సంకెళ్లను దాటిరాని మగ మహారాజులు భార్య శ్రమను గుర్తించేది అతి తక్కువ మంది .










ఒక్క ప్రశంస ఆమె కష్టాన్నే మరిపిస్తుంది దూరమవుతున్న అనుబంధాల ఒడి సంప్రదాయ సంకెళ్లు తెగినా దొరకని ఊరట యాంత్రిక జీవనంలో దరిచేరని బంధాలు
నేడు భార్యను ప్రశంసించే రోజు... నువ్వంటే నాకిష్టం...నీ నవ్వంటే నా కిష్టం..." అంటూ రోజులో ఏదో ఒక సందర్భంలో భార్యతో అంటే ఆమె ఫీలింగ్‌ ఎలా ఉంటుందో గమనించండి. ఆమె మురిసిపోతుంది. మైమర్చిపోతుంది. ఎందుకంటే ‘ఆమె’ కోరుకునేది అదే. ‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది’ అన్నమాట కాగితాలకే పరిమితం చేసే మనం ఆమె కష్టాన్ని మరిపించే ఒక్క మాటైనా మాట్లాడడానికి ‘అహం’ ఫీలవుతాం.










కుటుంబ భారాన్ని మోసేది భర్త...కుటుంబాన్ని నడిపించేది భార్య...ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. కాలంతోపాటు వచ్చిన మార్పుల్లో ఇప్పుడు దంపతులిద్దరూ బాధ్యతలను, భారాన్ని సమానంగా పంచుకుంటున్నారు. అటువంటప్పుడు ప్రశంసలు కూడా ఇద్దరికీ దక్కాలి. అదే అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం. మనకోసం అనుక్షణం కష్టపడే భార్యను ప్రశంసించడం భారం కాదు...బాధ్యత. కుటుంబమనే రథానికి భార్యభర్తలు జోడుగుర్రాలు. ఒకేలా సాగితేనే ప్రయాణం సాఫీ అవుతుంది. కష్టం ఇద్దరిదీ అయినప్పుడు ప్రశంసలు ఒక్కరికే పరిమితం కాకూడదు.










భర్త తన భార్యను మరో తల్లిగా భావిస్తే... భార్య తన భర్తను తొలిబిడ్డగా భావిస్తుందట. అటు వంటి దాంపత్యంలోనే అన్యోన్యత వర్థిల్లుతుంది. అనుబంధం కలకాలం నిలవాలంటే పొగడ్తలు, ప్రశంసలే టానిక్కులు. కాపురంలో ఈ చికిత్స ఎన్నాళ్లు కొనసాగితే ఆ దాంపత్యం అన్నాళ్లు ఆరోగ్యంగా ఉంటుంది. భర్త నోటి నుంచి వచ్చే చిన్న ప్రశంసను భార్య ఓ వరంలా భావిస్తుంది. అందుకోసం ఎదురు చూస్తుంది. దానికి ఉన్న మహత్యం అటువంటిది. ప్రశంస ప్రాధాన్యాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకే ఏటా సెప్టెంబర్‌ 18న ‘భార్యల ప్రశంసల దినోత్సవం’ జరుపుకొంటారు. నేడు భార్యను ప్రశంసించే రోజు సందర్భంగా ప్రత్యేక కథనం ఇది.
తోడు...నీడ పరమశివుడ్ని అర్థనారీశ్వరుడంటారు. భార్యను తన అర్థభాగం చేసినందుకు ఆయనకు దక్కిన గౌరవం ఇది.









సృష్టిస్థితిలయకారకుడైన భగవంతుడే భార్యకు అర్థభాగమిస్తే సామాన్యమానవులం మనం మాత్రం ‘ఆమె’పట్ల నిర్లక్ష్యం చూపుతుంటాం. ప్రతి దాంపత్యంలోను భార్యాభర్తలిద్దరూ సరిసమాన పాత్రధారులు. భార్యాభర్తలు తోడూనీడ వంటివారు. మెట్టినింట అడుగుపెట్టిన మహిళకు తొలిరోజుల్లో భర్తే సర్వస్వం.ఇల్లే స్వర్గంగా...భర్త, పిల్లలే దేవుళ్లుగా భావిస్తుంది. తెల్లవారు జామున నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి తొలిజామున నిద్రపోయే వరకు ఎంతో శ్రమిస్తుంది. రుచికరమైన వంట చేసి వడ్డించడం నుంచి ఇంటిని అందంగా అలంకరించుకునే వరకు అన్నింటా ఆమె ప్రాధాన్యం స్పష్టంగా కనిపిస్తుంది. భర్తను మురిపించాలని, మెప్పించాలని ఆశిస్తుంది. ఆయన ప్రశంస కోసం ఎదురు చూస్తుంది. కానీ ఆమె కష్టాన్ని, శ్రమను గుర్తించే మగ మహారాజులు అతి తక్కువంటే అతిశయోక్తి కాదు. ఆఫీసులో తామే కష్టపడుతున్నామని, భార్య ఇంట్లో ఉండి చేసేదేముందిలే అన్న భ్రమలో బతికేస్తుంటాం. ‘శభాష్‌...బాగా చేశావ్‌’ అన్న ఒక్కమాట కోసం ఆమె ఎదురుచూస్తోందన్న విషయాన్ని గుర్తించరు.
ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఎదురుచూపు ఎప్పుడు ఫలించినా ఆమె కష్టం అప్పటితో మర్చిపోతుంది. లేదంటే మరో రోజుకోసం ఎదురు చూస్తుంది. యాంత్రిక జీవనం ఒకప్పుడు సంప్రదాయ సంకెళ్లు...ఇప్పుడు యాంత్రిక జీవనం...మహిళకు శాపం అనవచ్చు. ఒకప్పుడు భర్తే దైవం...ఆయన మాటే వేదం...భార్య వంటింటికే పరిమితం అన్న పెద్దలమాట వల్ల భార్య కష్టానికి గుర్తింపు లేకుండా పోయేది. కాలంతోపాటు మహిళ ప్రాధాన్యం పెరిగినా ఆమె కష్టానికి తగిన గుర్తింపు మాత్రం లభించడం లేదు. యాంత్రిక జీవనంలో పడిన మనిషి బంధాలు, అనుబంధాల ఒడిని చేరుకోలేకపోతున్నాడు. సంపాదన యావలో పడి.. భార్యాపిల్లలకు ప్రేమ, ఆప్యాయతలుపంచే బాధ్యతను విస్మరిస్తున్నాడు ‘అహం’ అనే చట్రంలో చిక్కుకున్న ఎందరో భర్తలు కనీసం ‘బాగాచేశావ్‌’ అన్న మాటకూడా అనడానికి ఇష్టపడడం లేదు. ఎవరిపని వారిదే అన్నట్లు అంటీ ముట్టనట్లు వ్యవహరించే దంపతులు ఎందరో తారసపడుతున్నారు.









పెళ్లి అనే ‘బంధం’లో తప్ప ఆప్యాయతా అనురాగాల ‘అనుబంధం’ను పెంచుకోలేకపోతున్నారు. నిర్లక్ష్యం...అహం..అవగాహన.... లేక పోవడము. భార్యంటే అన్నింటా తనకంటే తక్కువని, ఇంటి యజమానిగా తను గీసిన గీతే శాసనమని, కుటుంబ సభ్యులెవరికీ ఎదురు చెప్పే హక్కులేదని, భార్యంటే వంటింటికే పరిమితం కావాలన్న సంప్రదాయ వాదులు ఇప్పటికీ మనకు తారసపడుతుంటారు. పుట్టుకతో వచ్చిన అహం, నిర్లక్ష్య భావంతో కొందరు భార్యను ప్రశంసించేందుకు ఇష్టపడరు. భార్య శ్రమను గుర్తించకపోగా, అది ఆమె బాధ్యతగా భర్తల ఆలోచన. ఇటువంటి దంపతుల మధ్య బంధం కూడా అంతే కృత్రిమంగా ఉంటుంది. సంప్రదాయ సంకెళ్ల మధ్య బందీలుగా తప్ప ఆప్యాయ తానురాగాల బంధం వారి మధ్య కనిపించదు. అదే భార్యచేసే పనిలో కష్టాన్ని, ప్రేమను, ఆప్యాయతను, బాధ్యతను గుర్తించి గౌరవించే భర్తకు ఆమె మనసులో శాశ్వత స్థానం లభిస్తుంది. ఆ భర్తపట్ల ఆరాధన, గౌరవం పెరుగు తుంది.సందర్భం వచ్చినప్పుడల్లా... భార్యను ప్రశంసించడంలో కృత్రిమత్వం ఉండకూడదు. మీరిచ్చే కాంప్లిమెంట్‌లో వంద శాతం నిజాయితీ కనిపించాలి. సందర్భానికి తగ్గట్టు ప్రశంస ఉంటే ఆమె మురిసిపోతుంది. మైమర్చి పోతుంది. మీపట్ల ఆరాధన పెంచుకుంటుంది. భార్య పదిరోజులు పుట్టింటికి వెళ్లింది. చేతిపాకమో, హోటల్‌ తిండితోనే గడిపిన మీరు ఆమె తిరిగి వచ్చాక చేసిన వంట తింటూ ‘మళ్లీ నోటికి జీవం వచ్చింది. నీ చేతి వంట తినకుంటే నాకు ఏదోలా ఉంటుంది’ అంటూ ప్రశంసించి చూడండి. ఆమె మోము అరవిరిసిన మందారంలా విచ్చు కుంటుంది. ఆ ప్రశంసలో వందశాతం నిజాయితీని ఆమె గ్రహిస్తుంది. అందుకే టీ, టిఫిన్ పెట్టినప్పటి నుంచి రాత్రి పడుకునేముందు వరకు ఏదో ఒక సందర్భంలో భర్తగా ఆమె మనసుకు సాంత్వన పలికే ఒక్క మాట చాలు ఆమె తన రోజంతటి కష్టం మర్చిపోయేందుకు. ఆలోచనా విధానం మారాలి..., భార్య అనగానే వంటపని, ఇంటిపని చూసుకునే మహిళ అన్నది సగటు భర్త ఆలోచన. ఈ విధానం మారాలి. 







ఆఫీసులో భర్త చేసే పనికంటే పది రెట్లు ఎక్కువ పని ఇంట్లో భార్య చేస్తుందని గుర్తించాలి. పిల్లల్ని సాకడం, ఇంటి పనులు చేయడమే భార్య విధి అని, మరెందులోనూ జోక్యం చేసుకోకూడదన్న కొందరి అభిప్రాయం. కానీ ఇది తప్పు. కుటుంబ విషయాల్లో ఆమె అభిప్రాయాలను గౌరవించాలి. పదిమందిలో ఉన్నప్పుడు ఆమె గురించి రెండు మంచి మాటలు చెప్పాలి. సందర్భం వచ్చినప్పుడల్లా ఆమె ‘ప్రాధాన్యం’ గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులు, పిల్లల వద్ద చెబితే ఆమె తన కష్టాన్ని మర్చిపోయి కుటుంబం కోసం మరింత కష్టపడుతుంది. ‘ఇదేం గొప్పా...ఇంతేగా నువ్వు చేసేది’ వంటి పదాలు వాడక పోవడం మంచిది.
సమస్యలు...సూచనలు..... దంపతుల మధ్య ప్రతి విషయంలోనూ నిజాయితీ కొనసాగాలి. నిజాయితీగా వ్యవహరించనప్పుడు మనస్పర్థలు సహజం.సందర్భం ఏదైనా మనసు విప్పి మాట్లాడుకోగలగాలి. అవగాహనతో వ్యవహరించాలి. ఎవరివల్ల సమస్య ఎదురైనా పరస్పరం చర్చించుకుని పరిష్కారానికి మార్గాలు వెదకాలి. సాకులతో ఒకరిపై ఒకరు నెట్టుకోవడం వల్ల పరిస్థితి జఠిలమవుతుంది.పుట్టి,పెరిగిన వాతావరణం వేరుగా ఉండడం, మెట్టినింట వాతావరణం భిన్నంగా ఉన్నప్పుడు అలవాటుపడేలా ప్రోత్సహించాలి.
అర్థం చేసుకునేలా కౌన్సెలింగ్‌ చేయాలి. తూలనాడడం, చిన్నబుచ్చడం మంచిదికాదు.ఉద్యోగులైతే మిస్‌ అండస్టాండింగ్‌కు దూరంగా ఉండాలి. సమయపాలన విషయంలో పరిస్థితులను అర్థం చేసుకుని వ్యవహరించాలి. అపోహపడితే ఇబ్బందులే.పని విభజన చేసుకుని పరస్పరం సహకరించుకోవాలి తప్ప ‘నీదే బాధ్యత’ అన్న మాట రాకూడదు.లైంగికపరమైన అపోహలను దరిచేరనివ్వకూడదు. సమస్య ఉంటే సైకాలజిస్ట్‌ను సంప్రదించి పరిష్కరించుకోవాలి తప్ప ‘నువ్వే కారణం’ అనకూడదు.







వ్యవసానాలకు బానిస కావడం, బాధ్యతలేకుండా వ్యవహరించడం, ఆర్థిక ఇబ్బందులు సమస్యకు కారణం. ...ఎదురుచూపు గుర్తించాలి...., ఇంటిపనితో ఎంతో సతమతమయ్యే భార్య రోజులో ఒక్క సందర్భంలోనైనా భర్త ప్రశంస కోసం ఎదురు చూస్తుంది. ఆ ఎదురు చూపును గుర్తించినప్పుడే ఆమెపట్ల మనకున్న నిజమైన ప్రేమ బయటపడుతుంది. తమకోసం తన సర్వస్వంధారబోసే భార్య ఎదురు చూపును గుర్తించడం మర్చిపోతుంటారు. దీంతో ఆమె మనోవేదన అనుభవిస్తుంది. ఆమె పడుతున్న మనోవేదననూ గుర్తించలేని వారు ఎందరో ఉన్నారు. ‘ప్రత్యేకం’గా గుర్తుంచుకోవాలి...... భార్యకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను, రోజులను గుర్తుంచుకోవాలి. పుట్టిన రోజు, పెళ్లిరోజు, ముఖ్యమైన రోజులను గుర్తుంచుకుని విష్‌ చేస్తూ ఉండాలి.








రోజులో ఒక్కసారైనా ప్రేమగా నవ్వుతూ మాట్లాడాలి. వారానికి ఒక్కసారైనా భార్యను, పిల్లలను బయటకు తీసుకువెళ్లాలి. దంపతుల్లాకాకుండా స్నేహితుల్లా మెలుగుతూ కష్టసుఖాలను పంచుకోవాలి. ఒకరికి కోపం వస్తే మరొకరు తగ్గాలి. అప్పుడే జీవితం సాఫీగా సాగిపోతుంది. అనుక్షణం గుర్తుంచుకోవాలి..,..... భార్యను అనుక్షణం గుర్తుంచుకో వాలి. ఆమెకు సంబంధించిన విష యాల్లో ప్రత్యేకంగా విష్‌ చేయడం ద్వారా ఆమె మనసు చూరగొన వచ్చు. రోజులో ఒక్క క్షణమైనా భార్యతో ప్రేమగా మాట్లాడి ఆమె అవసరాలు అడిగి తెలుసుకోవాలి. చేసే పనిలో కాస్తంత ప్రేమను చూపించి బాగుందంటూ ఆమెను మెచ్చుకోవాలి. ఏ సందర్భం లో నైనా భార్యను నొప్పించకుండా ఆమె మనసు తెలుసుకుని మాట్లాడగలిగిన వ్యక్తే భర్తగా వందశాతం మార్కులు సాధించి నట్టు. మాట్లాడేటప్పుడు సునితత్వాన్ని ప్రదర్శించాలి. ఆమె పట్లే కాదు ఆమె బంధువులను, కుటుంబ సభ్యుల గురించి కూడా తక్కువచేసి మాట్లాడకూడదు. దానివల్ల ఆమె చిన్నబుచ్చుకునే అవకాశం ఉంది. ..గుర్తింపును ఆశిస్తారు....
భర్త ప్రశంసలు, పొగడ్తలను ప్రతి భార్య కోరుకుంటుంది. తను చేసే ప్రతిపనికి గుర్తింపును ఆశి స్తుంది. రోజులో ఒక్కసారైనా భర్త నుంచి ‘బాగుంది’ అన్న మాట కోసం ఎదురు చూస్తారు. భార్యను ప్రత్యేకంగా చూడడంతోపాటు వారి లో ఉన్న ప్రత్యేకతను గుర్తించాలి. వీలైనప్పుడల్లా వారితో మనస్ఫూర్తిగా మాట్లాడుతూ పనిలో సాయాన్ని అందిస్తూ ఉండడం ద్వారా ఆనందంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. భర్త, పిల్లల కోసం, కుటుంబం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసేది భార్య మాత్రమే. అటువంటి భార్యను వీలున్నప్పుడల్లా ప్రశంసించడం, ప్రత్యేకంగా అభినందించడం వల్ల పోయేదేమీ ఉండదు. అలా చేయడం వల్ల దాంపత్య బంధం బలపడుతుంది.






ప్రాతః కాలమున నిద్రనుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి, కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నిష్ఠతో భగవంతుని పూజించవలయును.
పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తమనేక ఘనకార్యములు చేసిన కాని మంచి ఫలము పొందలేక పోవుచున్నాడు. అటులనే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలెను. తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలయును గాని, అందాన్ని ఆకారాన్ని చూచి మోసపోకూడదు. అటులనే పురుషులునూ స్త్రీయొక్క అందమునే చూడక, శీలము, గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలెను. ఆవిధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యానురాగముతో కాపురము చేసిన యెడల ఆ సంసారము ఎంతో బాగుండును. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏవిధంగా ప్రేమతో సేవిన్చునో ఆ విధంగానే అత్తమాలల సేవ, అతితిసేవలయందు కూడా తగు భక్తిశ్రద్ధలతో చేసినయెడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును అని పురాణాలు చెపుతున్నాయి.








ప్రతి పురుషునకు తనకనుకూలవతియగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును. దానికీ ఉదాహరణగా స్త్రీయెటులుండవలయుననగా –
శ్లో: కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా
శయనేషు రంభా రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ!
ఇవి ఆరు ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి వర్ణించియున్నారు. అనగా యింటి పనులలో దాసీవలెను, రాచకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలెను, శయన మందిరంలో రంభవలెను, భోజన విషయమున తల్లి వలెను, రూమున లక్ష్మి వలెను, శాంతి స్వభావములో భూదేవి వలెను స్త్రీ ఆరువిధముల వ్యవహరింప వలెను.
అంతియేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం, అర్థము, కామము, మోక్షము అని నాలుగు పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనెంచిన మిగతా మూడున్నూ అనవసరం. ధర్మాన్ని అర్థాన్ని మనుజుడు ఏవిధంగా సాధించునో కామమును గూడా అట్లే సాధించవలయును. ప్రతి మానవుడు వివాహం చేసుకొనే ముందు కన్యయోక్క గుణగణములు తెలుసుకొనవలయును. జీవిత సుఖములలో భార్య ప్రధానమయినది. కనుక గుణవంతురాలగు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు.









గుణవతియగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా నుండుటయే కాక, అట్టి మనుజుడు ధర్మ-అర్థ-కామ-మోక్షములను అవలీలగా సాధించగలడు.
భార్య గయ్యాళి వినయ విధేయతలు లేనిదై యున్నచో ఆ భర్త నరకమును బోలిన కష్టములనుభవించుచు మరల నరక కూపమునకే పోగలడు. గనుక పెండ్లి చేసుకొనుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలెను. అదెటులన కన్య ఆరోగ్యవతియై యే విధమైన రోగాగ్రస్తురాలై ఉండకూడదు. యెంత అందమయినదైననూ మంచి కుటుంబములోని కన్యయై యుండవలెను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలయి, దేవా బ్రాహ్మణులను పూజించునదియై, అత్తమామల మాటలకు జవదాటనిదై యుండవలెను. 
ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పియున్నారు. గాన అటువంటి గుణవంతురాలగు కన్యనే ఎంచుకొనవలయును
భార్య తన భర్త ఆలోచనయందు మంత్రివలె సలహాలివ్వవలయును.
పనిపాటల యందు సేవకురాలి వలె నడుచుకొనవలయును.
భోజనం వద్దిన్చునప్పుడు తల్లి తన కుమారునకు ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టులో ఆవిధంగా భర్తకు భోజనం వడ్డించవలెను.
శయన మందిరమున వేశ్యవలె భర్తకు ఆనందం కలుగజేయవలయును.
రూపంలో లక్ష్మిని బోలియుండవలెను.
ఓర్పు వహించుటలో భూదేవిని బోలియుండవలెను.
ఈవిధంగా ఏ స్త్రీ నడచుకొనునో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడును.





స్త్రీ బహిష్టు అయిన నాలుగు దినములు ఏ పనిని చేయరాదు. అతిగా మాటలాడ కూడదు. ఎవరినీ ముట్టుకొన రాదు. అ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకొనవలెను. నాలుగవ రోజున సూర్యోదయము కాకుండా తలంటి నీళ్ళు పోసుకొని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్య భగవానునకు నమస్కరించి తర్వాత తమ ఇష్ట దేవతలను పూజించవలయును.
ఎటువంటి సమయమునందైననూ భర్త భుజించకుండా తాను భుజించకూడదు.












భార్య భర్తల మద్య ఉండకూడని మాటలు
భార్య భర్త తో అనకూడనివి :
1) మరో జన్మ ఉంటె నువ్వు మాత్రం నాకు వద్దు. ……
2) నువ్వింతే ఎప్పుడూ…నిన్ను చేస్కున్నాను చూడు … నన్ననుకోవాలి.
౩)మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది ….ఎప్పుడోకప్పుడు నువ్విలా చేస్తావని .
4)ఇతని వల్ల మళ్ళీ ప్రాబ్లం వచ్చేలా ఉంది (ఫ్రెండ్స్ తో భర్త ని ఉద్దేశించి ).
5)మీ నాన్న లాగే నువ్వు కూడా…అంటూ దెప్పి పొడిచే మాటలు.
6) కొత్త జాబ్ ఎప్పుడు వెతుక్కున్టావ్.
7)చేస్కున్నోళ్ళకి చేస్కున్నంత … ఇలాంటి మొగుడు వస్తాడని  మాత్రం అనుకోలేదమ్మా …(మంచిగా ఉన్నా కూడా అంటుంటారు కొంతమంది ).
8)అన్నీ బాగానే ఉన్నాయ్ …ఆ ఆరో లక్షణమే సరిగ్గా లేదు (దేన్ని ఉద్దేశించి అంటారో వాళ్ళకే తెలీదు).
9)కాళ్ళ కింద శని పెట్టుకుని నడుస్తుంటే ఎవరేం చేస్తారు ….. దమ్మిడీ లేదు కాని మాటలు మాత్రం మాట్లాడతాడు.
10 ) నేను తప్ప అందరూ ఆయనకి అందం గానే కన్పిస్తారు. చూడడానికి అలా ఉన్నాడు కాని వదిలేస్తే దేశాల్ని దోచేయ్యడూ ….
ఇలాంటి మాటలు భార్య భర్త ని అస్సలు అనకూడదు.  మరీ చెడ్డ వాడైతే ఒక రకం . కాని ప్రతి ఒక్క దానికీ సూటి పోటి మాటలతో వేదిస్తూ ఉంటారు ఇలా చాలా మంది. ఆడం టీసింగ్ లాగా ….
తప్పు చెయ్యని వాడు ఈ మాటలు పడ్డప్పుడు చాలా హార్ట్ అవుతాడు . అది వాళ్ళ మానసిక ఒత్తిళ్ళకి కారణం అయ్యి చాలా కాలం వేదిస్తూ ఉంటాయంట.
భర్త భార్య తో అనకూడనివి :
1) నీకెందుకే డబ్బుల విషయాలు …
2)అనవసరమైన విషయాల్లో జోక్యం చేస్కోకు.
౩)నీ ఇష్టాలేమన్నా ఉంటె నీలోనే ఉంచుకో…నా పై రుద్దకు.
4)డబ్బులేమన్నా చెట్లకి కాస్తున్నాయా…. సంపాదిన్చేవాడికి తెల్సు డబ్బు విలువ
5)బోడి నువ్వు తెచ్చిన కట్నానికి నా మీదే అజమాయిషీ నా …. (ఇలాంటి ప్రబుద్దులూ లేకపోలేదు ).
6) ఇంట్లో మహారాణి భోగాలు అనుభవించింది కదా…. ఇక్కడ మనపై చూపుతుంది అంతే. ( నువ్వింతే ..నీకంత సీన్ లేదు అని చెప్పడం )
ఇలాంటి మాటలే ..సంబందాలు చెడేలా చేస్తూ ఉన్నాయ్. మనల్ని నమ్మి వచ్చిన భార్యని ,మనతో జీవితాన్ని పంచుకునే భర్తని సూటిపోటి మాటలు తో వేధించడం అనేది  చాల భాదాదాయకం .
కొట్టినా ఆ దెబ్బ కొన్ని క్షణాల నుండి కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది … కాని సూటి పోటి మాటలు అనేవి మనసుకి తగుల్తాయి . తగ్గడానికి చాలా రోజులు…కొన్ని సార్లు సంవత్సరాల సమయం …కొన్ని సార్లు జీవితాంతం కూడా వేదిస్తుంటాయి ….










వివాహం అనేది స్వర్గంలో
నిర్ణయించబడుతుందని'' చాలా కాలం నుండి
ప్రాచారం పొందిన వ్యాఖ్య అవునా! నిజమే,
వివాహం అనేది జీవితంలో ఒకేసారి జరిగే మధుర
ఘట్టం. జీవిత కాలం పాటూ ఒకరికొకరు తోడు-
నీడగా ఉండే ఒక శుభకార్యం. నిబద్ధత,
భాగస్వామ్యం, బాధ్యత, నిజాయితీ వంటి పైన
మాత్రమే మీ సంబంధం కొనసాగుతూ
ఉంటుంది. కానీ, అటూ పెద్దలు నిశ్చయించిన
వివాహంలోనూ, ఇటూ ప్రేమ పెళ్ళిళ్ళలోనూ ఒకరి
పైన మరొకరికి నమ్మకం లేకనో, పెద్దలు చెప్పేది
వినకుండనో, అభిప్రాయ భేదాలు ఏర్పడి లేదా ఒకరి
అభిరుచులు ఇంకొకరికి నచ్చక, వారి
సంబంధాలు విడాకుల వరకు దారి తీస్తున్నాయి.
కానే కొంత మంది దంపతుల మధ్య
ఒడిదుడుకులు ఎదురైన కలిసి జీవిస్తున్నారు,
మరికొంత మంది విడాకుల ద్వారా విడిపోతున్నారు.
దంపతులు మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడి,
విడాకుల వరకు వెళ్లేందుకు గల ముఖ్య
కారణాల పట్టిక ఇక్కడ తెలుపబడింది.
ప్రాధాన్యతలు మరియు అంచనాలలో తేడా
దంపతుల మధ్య ఇద్దరు వేరు వేరు
ప్రాధాన్యతలను మరియు అంచనాలను కలిగి
ఉండటం వలన విడాకులకు ముఖ్య కారణంగా
చెప్పవచ్చు. ఈ విషయాలలో స్నేహితులు లేదా
పెద్దవారు చెప్పిన వినే పరిస్థితులలో వారు
ఉండరు కారణం వారి స్వతహాగా కలిగి ఉన్న
ఇష్టాలు, అహిష్టాలు, అహం వలన అని
చెప్పవచ్చు.




వ్యసనం
దంపతుల మధ్య కలిగి ఉండే వ్యసనాల వలన
ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. మీ
వ్యసనం వలన మీరు మాత్రమె కాకుండా,
అతడు లేదా ఆమె స్వతహాగా
భావించటమే కాకుండా, భాగస్వామి మరియు పిల్లల
ముందు తరచుగా భావోద్వేగానికి
లోనవుతుంటారు.





విసుగు పుట్టడం
వివాహం తరువాత కొంత కాలం పాటూ
దంపతులు ఇద్దరు సంతోషంగానే ఉంటారు,
కానీ కాలానికి అనుగుణంగా, వారి మధ్య అయిష్టత
మరియు దూరం పెరుగుతుంది. కారణం
ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిపోవటం. నూతనంగా
విడాకులు తీసుకునే ప్రతి జంట ఈ సమస్య
వల్లనే అని చెప్పవచ్చు.




విడాకులు తీసుకునే ముఖ్య 10 కారణాలలో ఇది
మొదటి కారణంగా చెప్పవచ్చు. వివాహం అంతరం
స్త్రీ మరియు పురుషులు ఇద్దరు శారీరక
సంతృప్తి కోసం పరితపిస్తుంటారు, కానీ
భాగస్వామి    లైంగిక
చర్యలలో స్త్రీ వలన  పురుషుడి అ సంతృప్తి  పుట్టడం ఇద్దరి
మధ్య చర్య విడాకుల వరకు దారి తీస్తుంది.
స్త్రీ లైంగిక పరంగా వారి
భాగస్వామి యొక్క అవసరాలను తీర్చాలి
విడాకులకు ముఖ్య కారణం
ఇదే అని చెప్పవచ్చు.


పిల్లల పెంపకంలో సమస్యలు
ఇద్దరు ఉద్యోగస్తులైతే ఇది ముఖ్య సమస్య
అని చెప్పవచ్చు, పిల్లల పెంపకంలో వారి మధ్య
ఉన్న అభిప్రాయ భేదాలు మరియు అహంకారాల
మధ్య పిల్లల పెంపకంపై ఇద్దరి మధ్య
భేదాభిప్రాయాలు ఏర్పడి విడాకుల వరకు దారి
తీస్తాయి. పిల్లల పెంపక విషయంలో ఇద్దరిలో ఉండే
వివధ ఆలోచనలు, వాటి అనుసరించే విధానాల వలన
ఇద్దరి మధ్య గొడవ జరిగి, విడాకుల వరకు దారితీసే
అవకాశం ఉంది.



ఆర్ధిక సమస్య
ఒక జంట విడాకుల ద్వారా విడిపోవటానికి ఆర్ధిక
సమస్య కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ
నూతన కాలంలో విడిపోయే వారి సంఖ్య ఈ కారణం
చేత అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.
నూతన కాలంలో విడిపోయే వారిలో అధికంగా,
పురుషుడి కన్నా స్త్రీ ఎక్కువగా
సంపాదించటం వలన ఇద్దరి మధ్య డబ్బు
విషయంలో, పొదుపు విషయంలో ఇద్దరి మధ్య
ఘర్షణలు జరగటం వలన కూడా విడాకుల
దారితీస్తుంది.




మంచి నడవడికతో ఇహమూ, పరమూ సాధించవలయునన్న యీ గృహస్థాశ్రమ మొక్కటియే సరియైన మార్గము.
భార్యయు, భర్తయు అనుకూలంగా నడచుకోనుత, ఉన్నంతలో తృప్తిచెందుట, దైవభక్తితో నడచుకొనుట అతిథి సత్కారములాచారించుట, మొదలగు సద్గుణములతో నడచుకొనే వాడే సరియైన గృహస్తుడనబడును. అదే భార్య భర్తల దాంపత్యజీవితము.




మీ జీవిత భాగస్వామితో మాట్లాడటం మానివేస్తే, ఇరువురి మధ్యగల సంబంధాలు చెడిపోతాయి. మీ జీవిత భాగస్వామితో బాగా మంచిగా మాట్లాడటం మరువవద్దు.



మీ జీవిత భాగస్వామి మీ ఇరువురికీ మధ్య పోట్లాట రావటానికి కారణం కావచ్చు అయితే ఆపోట్లాట ఎక్కువ కావటానికి లేదా కొనసాగటానికి మీరు కూడా కారణం. భార్యా భర్తల మధ్య సంబంధాలు చేడిపోవటానికి వారిరువురికి రాజీ పడే అలవాటు లేదా గుణం లేకపోవటం ప్రధాన కారణం.


ఘర్షణ వస్తే సర్దుబాటు ధోరణి కనబరచాలి. సానుకూల ధోరణి ఆనందకర దాంపత్య జీవితానికి అత్యంత అవసరం.

కొన్ని సందర్భాలలో పురుషుడికి గల అహం, స్త్రీ గల గర్వం, సుఖ సంసారానికి అడ్డంకిగా మారతుంది. ఇది భార్యా భర్తల మధ్య సంబంధాలకు హాని చేస్తుంది. భర్త ఆదిఖ్యం ఎక్కువ అయినప్పుడు  భార్య ఆత్మ గౌరవం దెబ్బ తింటుంది. ఇది భార్యా భర్తల మధ్య పూడ్చలేనంతటి అఘాదాన్ని సృష్టిస్తుంది.

భార్యా భర్తల మధ్య సంబంధాలు చేడిపోవటానికి వారిరువురికి రాజీ పడే అలవాటు లేదా గుణం లేకపోవటం ప్రధాన కారణం.



బరువు ఎత్తడానికి తోడు కావాలి, ఆడుకోవడానికి తోడు కావాలి, ఒంటరిగా ఉంటే తోడు కావాలి, బయటకి వెళ్ళడానికి తోడు కావాలి, ఏదైన పని చెయ్యడానికి తోడు కావాలి అంతెందుకు ఆకరికి పెరుగు చెయ్యడానికి కూడా తోడు కావాలి. ఈరోజు తోడు లేకపోతే నీకు రేపు పెరుగు ఉండదు. మనం చేసే నిత్యకార్యాలలో కూడా ఎన్నో నిజాలు దాగున్నాయి అని మనం కనుక్కోలేకపోతున్నాం. సహాయం లేకుండా ఫలితం రాదు అని పెరుగుకి కావాల్సిన తోడు చెప్తుంది. మనిషికి మనిషే తోడు, ఆ తోడే లేకుంటే లేదు నీకు మర్నాడు. రాజీ పడటం చాలా అవసరం.


ఇవి పాటించకుండా మీరు ఏ జ్యోతీష్యుడు దగ్గరకు వెళ్లినా ఏ రత్నము ధరించిన  ఉపయేగము ఉండదు. జాతకము ద్వార కొంత మేరకు వారి జీవితాలను సరి చేయవచ్చను.



















No comments:

Post a Comment

మీ అభిప్రాయం తెలియచేయండి.