జ్యోతిష్యం "శాస్త్రం". సూర్యోదయం ప్రభావంతో మన శరీరాలు హార్మోన్లను విడుదల చేయడంతో మనం మేల్కొంటాం. అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, దూరంగా జరగడం వంటి మార్పుల వల్ల సముద్రపు అలల్లో తేడాలు వస్తాయి. అందువల్లనే మనవ మరియు ప్రకృతిలో విపరీత ధుర్ఘటనలు చూస్తున్నాము. పౌర్ణమి అమావాస్య ఎప్పుడు వస్తుందో మూడనమ్మకము అన్నవాడు చెప్పలేడు. మనపై మనకు విశ్వాసం లేకపోతే, ఇతరత్రా విషయాలేవీ పెద్దగా పనిచేయవు. అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి. సర్వే జనా సుఖినోభవంతు.
27 February 2016
శ్రీ సూక్తము
రుద్రాక్షలు
నవరత్నముల కు బదులు రుద్రాక్షలు కూడా ధరించవచ్చు. 1) కెంపు - ఏకముఖి, ద్వాదశముఖి
2) ముత్యం - ద్విముఖి, ఏకాదశ ముఖి
3) పగడం - త్రిముఖి, అష్టాదశ ముఖి
4) పచ్చ – చతుర్ముఖి, త్రయోదశ ముఖి
5) పుష్యరాగం – పంచ ముఖి, చతుర్దశ ముఖి
6) వజ్రం – షణ్ముఖి, పంచ దశ ముఖి
7) నీలం – సప్త ముఖి, షోడశ ముఖి
8) గోమేధికం – అష్టముఖి, గౌరీ శంకర ముఖి
9) వైఢూర్యం – నవ ముఖి, ఆష్టా దశ ముఖి.
రుద్రాక్షలు ధరించడం వల్ల వచ్చు ఫలితములు
1) ఏకముఖి రుద్రాక్ష - ఈ రుద్రాక్ష చాలా విలువైనది. ఎటువంటి మంత్ర తంత్ర ప్రయోగాలు అయినా తిప్పి కొట్టగలదు. సిరి సంపదలు, శిరో సంబంధ రోగములు నివారణ అగును.
2) ద్విముఖి – ఇది బ్రహ్మ రుద్రాక్ష అని కొందరి అభిప్రాయం. అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అని కూడా అనుకోవచ్చు. సంతాన ప్రాప్తి, ఏకాగ్రత, వ్యాపార అభివృద్ధి. కల్గును. మనోవ్యాకులతను దూరం చేస్తుంది.
3) త్రిముఖి – ఈ రుద్రాక్ష చాలా అదృష్టదాయకమయినది. ధనధాన్యసమృద్ధి, కామెర్ల వ్యాధి నివారణ మరియు సర్ప దోష నివారణ అగును.
4) చతుర్ముఖి – పరిశోధకులు, జ్యోతిర్గణిత వేత్తలు ధరించడం వల్ల అదికరాణింపు ఉండును మరియు ఏకాగ్రత పెరుగును.
5) పంచముఖి –బ్రహ్మ స్వరూపమయిన ఈ రుద్రాక్ష వల్ల అకాలమృత్యునివారణ, గుండెపోటు వంటి హృద్రోగ సంబంధిత వ్యాధులు నివారణ అగును మరియు మలబద్దకం నివారణ అగును.
6) షణ్ముఖి – ఈ రుద్రాక్ష కుమార స్వామి స్వరూపం, శక్తి, విజయం, శరీర ధారుఢ్యం, ఆరోగ్యం లభించును.
7) సప్త ముఖి- సభావశ్యత,సంపద, కీర్తి, ఉత్తేజం కల్గును. 8) అష్ట ముఖి – ఆకస్మిక ధన ప్రాప్తి కల్గును.
9) నవముఖి రుద్రాక్ష – ఈ రుద్రాక్ష భైరవ స్వరూపమయినది. రాజకీయ పదవులలో ఔన్నత్యం ఆశించువారికి, అపమృత్యు నివారణకు, పరోపకార దక్షులకు ధరిచవచ్చు.
10) దశముఖి రుద్రాక్ష – విష్ణు స్వరూపమయినది. గొంతు సంబంధ రోగాలను, నవగ్రహముల ద్వారా కలుగు కష్టములు, సమస్యలు నివారణ అగును.
11) ఏకాదశ ముఖి – ఇది శివాత్మకమయిన రుద్రాక్ష. వైవాహిక జీవితం లోఆనందమునకు, గర్భ సంభందరోగాలకు అనుకూలత లభించును.
వివాహ పొంతన
వివాహ పొంతన అనేది ప్రస్తుత కాలంలో పంచాంగం లో వధూవర గుణమేళన చక్రం ప్రకారం 18 పాయింట్ల కన్నా ఎక్కువ వచ్చినచో వివాహం చేసుకోవచ్చు అని 18 పాయింట్ల కన్నా తక్కువ వచ్చినచో వివాహం చేసుకోనరాదని చెప్పుచున్నారు.పాయింట్స్ ఎక్కువ వచ్చినను వాళ్ళు జీవితాంతం బాగుంటారని చెప్పలేము.అది అంతా సమంజసం కాదు. పాయింట్స్ ఎలా వచ్చినను ఇరువురి జాతకములను పరిశీలించి తదితర నిర్ణయం తీసుకోవడం మేలు. ఇంకొక ముఖ్య విషయం కుజ దోషం సంసారులు కానిదే సర్వేశ్వరులకైనా పరిపూర్ణత లేదు అనేది అర్ధవాక్యం. అటువంటి ముఖ్యమయిన సంసారానికి మూలమయిన వివాహ వ్యవస్థ లో వధూవర జాతక పరిశీలనలో ఎంతటి వారు అయినా భయపడేది “కుజ దోషం”.
ఏ జాతకము అయినా జన్మ లగ్నాత్తు 2,4,7,8,12 స్థానములలో కుజుడు ఉన్నా లేక ఆ స్థానములను కుజుడు చూసినను కుజదోషం కల్గి అది స్త్రీల యొక్క భర్త భావానికి పురుషుల కళత్ర భావానికి పీడ కల్గిస్తుందని, అలాంటి జాతకులకు వివాహం చేయరాదని, కుజ దోషం లేని వధూ వరులకు మాత్రమే పెండ్లి చేయాలని పెద్దల నిర్ణయం. కాని వధూవరుల జతకములు రెండింటా కుజ దోషం సమతుల్యంగా ఉంటే వివాహం చేయవచ్చు అని శాస్త్రాలు అంగీకరిస్తున్నాయి.
అంతే కాకుండా మేష, కర్కాటక, సింహా, వృశ్ఛిక, ధనుర్మీన లగ్నముల జాతకములకు కుజ దోషం వర్తించదు అని శాస్త్రం చెబుతుంది మరియు మేష,వృశ్చికములకు చతుర్ధ కుజుడు, వృషభతులల కు వ్యయ కుజుడు , మిధున కన్యలకు ద్వితీయ కుజుడు, మకర కర్కాటములకు సప్తమ కుజుడు, ధనుర్మీనములకు అష్టమ కుజుడు, కుంభ సింహములకు కుజుడు ఎక్కడ ఉన్ననూ కుజ దోషం లేదని శాస్త్ర నిర్ణయం.
సమస్త యంత్రములు
గణేశ యంత్రం - విఘ్నములు నివృత్తి చేయును.
లక్ష్మీ గణేశ యంత్రం - విఘ్నముల నివృత్తి, ఐశ్వర్య వృద్ది, సంతతి, గౌరవం, సర్వత్ర జయం మరియు లక్ష్మీ దేవి స్తిరంగా ఉండును.
ధన లక్ష్మి యంత్రం – ధనలక్ష్మి దేవి అనుగ్రహం ఉండి ఎల్లప్పుడు లక్ష్మి ప్రదము గా ఉండును.
నరఘోష యంత్రం – నరుల బాధ లేకుండా చేయును.
వాస్తు పురుష యంత్రం – మీ గృహం లో వాస్తు దోషం నివృత్తి అగును.
ఆంజనేయ యంత్రం – సర్వత్ర జయము గాను, ప్రతి కార్యము జయప్రదం గాను, శత్రు హాని, శత్రు జయము, సర్వ కార్య సిద్ది అగును.
మత్స్య యంత్రం – మీ గృహములో సంపూర్ణం గా వాస్తు దోషములు అన్నియు నివృత్తి అగును.
అష్ట లక్ష్మి యంత్రం – ఎనిమిది మంది లక్ష్మి అమ్మవార్ల అనుగ్రహం ఎల్లప్పుడు మీ అందు, మీ వ్యాపారం అందు ఉండును. అష్ట దిక్పాలకుల యంత్రం – సమస్త వాస్తు దోషములు నివృత్తి అగును మరియు అష్ట దిక్పాలకుల అనుగ్రహం ఎల్లప్పుడు ఉండును.
నారాయణ యంత్రం – అన్ని విధముల కస్టములు అన్ని తొలిగి పోయి సర్వత్ర శుభము గా ఉండి సుఖసంతోషములతో ఉండును.
సాయినాధ యంత్రం – సాయి నాధుని అనుగ్రహం లభించి అధ్యాత్మిక చింతన కల్గును. ఆకర్షణ యంత్రం – జనులు ఆకర్షింపబడును.
నవగ్రహ యంత్రం – సంపూర్ణ నవగ్రహముల దోషముల నివృత్తి అగును.
మృత్యుంజయ యంత్రం – మృత్యుంజయ దోషం నివృత్తి అగును, అప మృత్యుంజయు ని జయించి ధీర్ఘాయుర్ధాయము కల్గును.
గాయత్రి యంత్రం – సమస్త కష్టములు తొలిగిపోవును మరియు జ్ఞాపక శక్తి, సంపద,బ్రహ్మ జ్ఞానము కల్గును.
మహాలక్ష్మి యంత్రం – అన్ని రంగముల లోను అభివృద్ధి,ఆరోగ్యము, మనసౌఖ్యం,చర స్తిర ఆస్తుల యందు వృద్ధి అగును.
శ్రీ దుర్గా యంత్రం – సమస్త గ్రహ బాధలు, కస్టములు, పాపములు నివారణ అయి సుఖ సంతోషముల తో జీవించును. మహా సరస్వతి యంత్రం - మేధా శక్తి, బుద్ధి కుశలత, సూక్ష్మ గ్రాహక తత్వము, విద్యాభి వృద్ధి, పరీక్షల యందు విజయము, జ్ఞాన వృద్ధి కల్గును.
శ్రీ సుబ్రహ్మణ్య యంత్రం – సంతాన వృద్ధి, ఆరోగ్య అనుకూలత మరియు దంపతుల కలహ దోషం నివృత్తి అగును.
శ్రీ లక్ష్మి నారాయణ యంత్రం – దారిద్ర నిర్మూలన, ధనకనకవస్తువాహనఐశ్వర్య ప్రాప్తి, సర్వ కార్య సాధనం, సర్వత్ర జయము కల్గును.
కుబేర యంత్రం – ఋణ విముక్తి, ధన వృద్ధి, రాజా పూజ్యత కల్గును.వృత్తి లేని వారికి వృత్తి సమకూరును.
నవరత్నములు
రవి – కెంపు.
చంద్రుడు – ముత్యం
కుజుడు – పగడం
బుధుడు – పచ్చ
గురుడు - పుష్య రాగం
శుక్రుడు – వజ్రం
శని – నీలం
రాహువు - గోమేధికం
కేతువు - వైఢూర్యం
వాస్తు గృహాన్ని నిర్మించుకోవటం
వాస్తు నిరాకారమయిన భగవంతుని స్వరూపం వాస్తు. నిరాకార స్వరూపానికి ఆకారం ఏర్పరచు కోవటమే గృహాన్ని నిర్మించుకోవటం.
ఈ సృష్టి లో వాస్తు పుట్టుక ఏనాటిది అన్నది ఖచ్చితంగా చెప్పలేము. అయితే సృష్టి మొదలు నుండి సృష్టి అంతం వరకు వాస్తు పనిచేయక తప్పదు. వాస్తు అనేది వేద కాలంలో జన్మించింది అని కొందరు చెప్తారు.
వాస్తు లో అష్టదిక్పాలకులు, పంచ భూతములు ప్రధానపాత్ర వహిస్తాయి. వీటిని గురించి వేదాలలో, ఇతర ధర్మ శాస్త్రాలలో ఇలా ఉంది. వాస్తు శాస్త్రమును సంపూర్తిగా అధ్యయనం చేసి మనకు దగ్గర్లో అనేక గృహ నిర్మాణాలు గమనిస్తే శాస్త్రం వాస్తవమా ? కాదా ? అనేది అర్ధం అవుతుంది.
వాస్తు శాస్త్రం గురుంచి భగవద్గీత లో కూడా ప్రస్తావించడం జరిగింది. వాస్తుని సాకార స్వరూపంలో పూజించాల్సి వస్తే అది శ్రీకృష్ణ భగవానుడే. వాస్తు శాస్త్రంనకు వ్యతిరేఖం గా నిర్మాణాలు చేస్తే ఆర్దిక నష్టం, అవమానములు, హఠాన్మరణము వంటివి సంభవించును. ఇంకా చాలా ఆరిష్టాలు కల్గును. కావున అందరూ వాస్తు శాస్త్రమును పరిపూర్ణం గా తెలిసిన వారిని సంప్రదించి శాస్త్రము ప్రకారంగా గృహ నిర్మాణం చేసుకొనుట శ్రేయ స్కరం. అలా గృహమును నిర్మించుకోవడం వల్ల సకల అరిష్టాలను నివారించుకోవచ్చు.
మానవ జాతికి సంభందించి నంతవరకు చతుర్విధ పురుషార్ధ సాధనకు గృహస్థాశ్రమం ఆధార భూతం. సొంత ఇల్లు లేని గృహస్థుడు చేయు సమస్త శ్రౌత స్మార్త పుణ్య కర్మల ఫలితం ఆ గృహస్థుడు ఎవరి ఇంటివాడు ఆయా కర్మలను ఆచరించు చున్నాడో ఆ గృహ యజమానికి చెందునని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనిలో అర్ధం ఏమిటి అంటే ప్రతీ మానవుడు తన శక్తి కి తగ్గట్లు గా గృహ నిర్మాణం చేసుకొనవలయును.
ముహూర్తము.
ముహూర్త విషయము ముహూర్తం అనగా కనురెప్ప పాటు సమయం అని అర్ధం. ఈ ముహూర్తమును పంచాంగం ద్వారా నిర్ణయించబడును. పంచాంగం అనగా పంచ అంగములతో కూడుకున్నాటటువంటిది. అవి తిధి, వార, నక్షత్రం, యోగం, కరణం. అసలు ముహూర్తం అనగా కను రెప్ప పాటు సమయం అని ఇంతకముందు చెప్పుకున్నాం.
కాళిదాసు మతాను సారం గా వేయి కలువరేకులు ఒకే చోట వరుసగా పేర్చి దానిలో సన్నని బంగారు తీగ గుచ్చితే ఒక పద్మ పత్రంలో దిగే కాలమే ముహూర్తం అని చెప్పబడింది. అటువంటి ముహూర్తం ను తెలుసుకొనుట బ్రహ్మకు అయినా సాధ్యం కాదు.ముహూర్త నిర్ణయమందు జ్యోతిష్కుడు సాక్షీభూతుడు మాత్రమే కాబట్టి ముహూర్త సమయాన్ని ఆయా వ్యక్తులు పూర్వ జన్మ ఫలములు ను అనుసరించి వచ్చుచుండును.
ఒక ముహూర్తం నిర్ణయించాలంటే అనేక గ్రహ నక్షత్రాల కాంతి సమూహాలు ఒకే కేంద్రానికి వచ్చు సమయం నిర్ణయించడమే. ముహూర్తమునకు కావల్సిన నియమములు 1)లగ్నాధి పతి బలవంతుడు అయిఉండాలి. 2)లగ్నాధిపతి స్వక్షేత్ర, ఉచ్చ క్షేత్రములలో లేకపోయినను, మిత్రక్షేత్రమలలో గాని కేంద్ర కోణముల లో గాని ఉండవలయును. 3)కేంద్ర కోణములలో పాపులు ఉండకూడదు. 4)ముహూర్త లగ్నాధి పతి, వారాధి పతి, నక్షత్రాధి పతి ఒకరైనచో ఆ ముహూర్తం చాలా బలమయినది. 5)ఏకవింశతి దోషములను విడిచి ముహూర్తం నిర్ణయించుట చాలా మంచిది. 6)క్షీణ చంద్రుడు ఉన్నప్పుడు ముహూర్తం నిర్ణయించుట దోషము. 7)ఒక ముహూర్తం నిర్ణయించినపుడు కర్త యొక్క నామ,జన్మ నక్షత్రముల రెండిటికి తారాబాలమును చూడవలయును మరియు చంద్రబలమును, పంచరహితమును పరిశీలించవలయును. ఇంకను చాలా నియమ, నిభందనలు చాలా ఉన్నాయి.
కావున మీకు సంభందిత కార్యమునకు కావల్సిన ముహూర్తం ను మీరు పొందాలంటే మీ జన్మ నక్షత్రమును లేదా మీ నామనక్షత్రమును లేదా మీ జన్మ తేదీ, జన్మ సమయం, జన్మ ప్రదేశ వివరములు.
జ్యోతిష్యశాస్త్రం వలన ఉపయెగము ఏమిటి.
జ్యోతిష్య శాస్త్రం ప్రతి మానవుడు తన జీవితం లో భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతుంటారు. అయితే భవిష్యత్తు తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి. అవి హస్త సాముద్రిక శాస్త్రం,సంఖ్యా శాస్త్రం,జ్యోతిష్య శాస్త్రం. అన్నిటి కంటే హేతుభద్దమయినది కష్టమయినది శాస్త్రీయమయినది జ్యోతిష్య శాస్త్రం.
ఫలితములు చెప్పడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అవి అన్నియు కూడా మహర్షులు సూచించినవే. ఫలితములు చెప్పడం అనేది జ్యోతిష్కుడు మీద ఆధారపడి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంను ఎక్కువ గా అధ్యయనం చేసే కొలది ఎన్నెన్నో విషయములు విపులంగా చెప్పగలరు. అలా ఫలితములు చెప్పాలంటే జాతకుడు/జాతకురాలు పూర్తి వివరములు కావలయును. అవి జన్మించిన తేదీ, జన్మించిన సమయం, జన్మించిన ప్రదేశం 3 వివరములు ఇచ్చినచో మీ జాతక ఫలితములు చెప్పవచ్చును. జన్మించిన సమయమును సరిగ్గా గుర్తించాలి.