09 September 2016

మన ఆచారాలు

మన ఆచారాలు భార‌తదేశం అంటేనే అనేక మ‌తాలకు, విశ్వాసాల‌కు నిల‌యం. ఇత‌ర ఏ దేశంలోనూ లేని ఆచార వ్య‌వ‌హారాలు, సాంప్ర‌దాయాలు ఇక్క‌డ ఉన్నాయి. అనేక వేల సంవత్స‌రాల నుంచి ఇక్క‌డి ప్ర‌జ‌లు వాటిని పాటిస్తున్నారు. అయితే నేటి త‌రం వారు అలాంటి ఆచారాల‌ను మూఢ న‌మ్మ‌కాలుగా కొట్టి పారేస్తున్నారు, కానీ కొంత మంది ఇప్ప‌టికీ వాటిని పాటిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో మూఢ న‌మ్మ‌కాలుగా ముద్ర ప‌డ్డ ప‌లు ఆచారాల‌ను, వాటిలో అంత‌ర్గ‌తంగా దాగి ఉన్న ప‌లు అర్థాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.






 ఆడ‌వారు గాజులు ధరించ‌డం వెనుక‌… పురాత‌న కాలంలో కేవ‌లం మ‌గ‌వారే బ‌య‌టికి వెళ్లి శారీర‌క శ్ర‌మ చేసేవారు. దీంతో వారు ఆరోగ్యంగా ఉండేవారు. అయితే మ‌హిళ‌లు ఎప్పుడూ ఇంటి ప‌ట్టునే ఉండి త‌క్కువ‌గా శ్ర‌మిస్తారు కాబ‌ట్టి వారికి గాజుల‌ను ధ‌రింప‌జేసే వారు. దీంతో ఆ గాజుల వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ట‌. గాజులు ఎల్ల‌ప్పుడూ చేతి న‌రాల‌కు తాకుతూ ఉండ‌డం వ‌ల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంద‌ట‌. అంతే కాకుండా ఆడ వారి శ‌రీరం నుంచి విడుద‌ల‌య్యే నెగెటివ్ శ‌క్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా గాజుల‌ను ధ‌రింప‌జేసే వార‌ట‌.










 పిల్ల‌ల‌కు చెవులు కుట్టించ‌డం… చిన్నారుల‌కు చెవులు కుట్టించ‌డం స‌హ‌జ‌మే. ప్ర‌ధానంగా ఆడ‌పిల్ల‌ల‌కు, ఆ మాట‌కొస్తే కొంత మంది మ‌గ పిల్ల‌ల‌కు కూడా చెవులు కుట్టిస్తారు. అయితే ఇలా కుట్టించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి దాంతో వారికి వ‌చ్చే అనారోగ్యాలు పోతాయ‌ట‌. ప్ర‌ధానంగా ఆస్త‌మా వంటి వ్యాధులు రావ‌ట‌.










 రావి చెట్టును పూజించ‌డం… హిందువుల్లో అధిక శాతం మంది రావి చెట్టుకు పూజ‌లు చేస్తారు. ఈ చెట్ల‌యితే ఎక్కువ‌గా దేవాల‌యాల్లోనే ఉంటాయి. అయితే సాధార‌ణంగా చెట్ల‌న్నీ ప‌గ‌టి పూట ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తే ఈ చెట్టు మాత్రం రాత్రి పూట ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తుంద‌ట‌. దీంతోనే రావి చెట్టును పూజిస్తారు.









 కాలి వేళ్ల‌కు మెట్టెలు ధ‌రించ‌డం… హిందూ సాంప్ర‌దాయంలో పెళ్ల‌యిన మ‌హిళ‌లు కాలికి మెట్టెల‌ను ధ‌రిస్తారు. ఇలా ధ‌రించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి వారి గుండె నుంచి గ‌ర్భాశ‌యానికి ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. దీంతో వారి రుతు క్ర‌మం స‌రిగ్గా ఉంటుంద‌ట‌. అయితే వెండి మెట్టెలు ధ‌రిస్తే ప్ర‌కృతిలో ఉన్న పాజిటివ్ ఎన‌ర్జీ వారి శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంద‌ట‌.












 గంట‌లు ఉండ‌డం.

 ఆల‌యాల్లో ఉండే గంట‌ను ఏడు సార్లు కొడితే మ‌న శ‌రీరంలో ఉన్న ఏడు చ‌క్రాలు ఉత్తేజం అవుతాయ‌ట‌. అంతేకాదు మెద‌డు కుడి, ఎడ‌మ భాగాలు రెండూ కొంత సేపు ఏక‌మ‌వుతాయ‌ట‌. దీంతో మ‌న మ‌న‌స్సుకు ప్ర‌శాంత‌త క‌లుగుతుంద‌ట‌. ఏకాగ్ర‌త పెరుగుతుంద‌ట‌. గంట‌ను మోగించ‌డం వ‌ల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశ‌న‌మ‌వుతాయ‌ట‌.






 నిద్రించేట‌ప్పుడు త‌ల‌ను ఉత్త‌రానికి పెట్ట‌క‌పోవ‌డం… భూమికి అయ‌స్కాంత క్షేత్రం ఉన్న‌ట్టుగానే మ‌న శ‌రీరానికి కూడా అయ‌స్కాంత క్షేత్రం ఉంటుంద‌ట‌. ఒక వేళ మ‌నం ఉత్త‌రం దిశ‌గా త‌ల‌ను పెట్టి ప‌డుకుంటే మ‌న శ‌రీరంలో ఉన్న ఐర‌న్ మెద‌డుకు ప్ర‌వ‌హించి బీపీ, గుండె సంబంధ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. త‌ల‌నొప్పి, అల్జీమ‌ర్స్‌, పార్కిన్‌స‌న్స్ డిసీజ్ వంటి వ్యాధులు వ‌స్తాయ‌ట‌. కాబ‌ట్టి త‌ల‌ను ఉత్త‌రం దిశ‌కు పెట్టి నిద్రించ‌కూడ‌ద‌ట‌.




 నుదుట‌న కుంకుమ బొట్టు ధ‌రించ‌డం.
 నుదుట‌న కుంకుమ బొట్టును ధ‌రిస్తే అక్క‌డి న‌రాలు ఉత్తేజిత‌మై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయ‌ట‌. దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ట‌. లైంగిక సామ‌ర్థ్యం కూడా పెరుగుతుంద‌ట‌.





 ఎదుటి వారికి రెండు చేతులతో న‌మ‌స్క‌రించ‌డం… ఎదురుగా ఉన్న వారికి రెండు చేతుల‌తో న‌మ‌స్క‌రిస్తే మ‌నం వారిని ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటామ‌ట‌. ఎలాగంటే రెండు చేతుల‌ను జోడించిన‌ప్పుడు చేతి వేళ్ల‌న్నీ క‌లిసిపోయి ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి మ‌న జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయ‌ట‌. దీంతోపాటు మెద‌డు ప‌నితీరు కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌.




 గోరింటాకు పెట్టుకోవ‌డం… చేతుల‌కు, కాళ్ల‌కు గోరింటాకు పెట్టుకోవడం వ‌ల్ల అక్క‌డ చివ‌ర్లో ఉండే న‌రాలు రిలాక్స్ అవుతాయ‌ట‌. దీంతో శ‌రీరానికి హాయి లభించి చ‌ల్ల‌ద‌నం ఇస్తుంద‌ట‌. అంతేకాదు గోరింటాకు పెట్టుకోవ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి, జ్వ‌రం, ఒత్తిడి వంటి స‌మ‌స్య‌లు కూడా తగ్గుతాయ‌ట‌. నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం… నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం వ‌ల్ల ప‌ద్మాస‌నం భంగిమ వ‌స్తుంది. దీంతో జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రిగి జీర్ణాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయ‌ట‌. కార‌మైన ఆహారం ముందు, స్వీట్లు త‌రువాత తిన‌డం… భోజ‌నం చేసిన‌ప్పుడు ముందుగా కారంగా ఉండే ఆహారం తిన‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో జీర్ణ‌క్రియ‌కు అవ‌స‌ర‌మైన ఆమ్లాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయ‌ట‌. దీంతో జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రుగుతుంద‌ట‌. అయితే భోజ‌నం మొదట్లోనే స్వీట్లు తింటే అది మ‌నం తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణం చేయ‌నీయ‌ద‌ట‌.






 న‌దుల్లో నాణేలు వేయ‌డం… ఒక‌ప్పుడు మ‌న ద‌గ్గ‌ర రాగితో చేసిన నాణేలు చ‌లామ‌ణీలో ఉండేవి. ఈ కార‌ణంగా ఆ నాణేల‌ను న‌దుల్లో వేస్తే ఆ రాగి అంతా ఆ నీటిని శుద్ధి చేసేద‌ట‌. దీంతో ఆ నీటిని తాగేవారికి ఎన్నో అనారోగ్యాలు దూర‌మ‌య్యేవ‌ట‌.





 ఉప‌వాసం ఉండ‌డం… హిందువుల్లో అధిక శాతం మంది వారంలో ఏదో ఒక రోజు దేవుడికి ఉప‌వాసం ఉంటారు క‌దా. ఆయుర్వేద ప్ర‌కారం అలా ఉప‌వాసం ఉండ‌డం మంచిదేన‌ట‌. ఎందుకంటే ఉప‌వాస స‌మ‌యంలో మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థకు పూర్తిగా విశ్రాంతి ల‌భించి శ‌రీరంలో ఉన్న ప‌లు విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్ల‌గొట్ట‌బ‌డ‌తాయ‌ట‌. దీంతోపాటు దేహం త‌న‌కు తాను మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంద‌ట‌. ఉప‌వాసం ఉండ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్‌, బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్లు రావ‌ట‌.






పిల్లలకు అన్నప్రాసన .

ఆడ పిల్లలకు ’5 ‘ వ నెలలో, మగ పిల్లలకు ’6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి.










ఏకవింశతి అవతారములు

విష్ణువు ధరించిన 21 అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు...::;; "యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్..!! పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" ధర్మమునకు హాని కలిగినప్పుడును, ఆధర్మము పెచ్చుపెరిగిపోవుచున్నప్పుడును (జన్మ కర్మ రహితుడనైనప్పటికిని) నన్ను నేను సృజించుకొందును. సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిరమొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. భగవద్గీత నాల్గవ అధ్యాయము - జ్ఙాన, కర్మ సన్యాస యోగముల లోని ఈ రెండు శ్లోకములు ప్రకారం భగవానుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం అవతారాలు దాల్చాడు.. వాటిలో దశావతారాలు ప్రసిద్ధమైనవి .. దశావతారాలతో ఏకవింశతి అవతారాలు కలవు వాటి గురించి తెలుసుకుందాం..!! పూర్ణావతారములలో దశావతారములు ముఖ్యమైనవి. అవి: మత్స్యావతారము కూర్మావతారము వరాహావతారము నృసింహావతారము లేదా నరసింహావతారము వామనావతారము పరశురామావతారము రామావతారము కృష్ణావతారము వెంకటేశ్వరావతారము కల్క్యావతారము బుద్ధుడు మరియు బలరాముడు విష్ణువు యొక్క అవతారములని ప్రతీతి. ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం బుద్ధుడు అవతారమైతే, దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు. (బుద్ధుడు అంటే బౌద్ధ మత ప్రబోదకుడైన బుద్ధుడు కాదు) మహాభాగవతం ప్రధమ స్కంధంలో ఈ 21 అవతారాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. తరువాత వివిధ స్కంధాలలో ఆయా అవతారాల గాధలు వివరంగా తెలుపబడ్డాయి. అవతారాలు లీలావతారాలు, అంశావతారాలు, పూర్ణావతారాలు అని వివిధ వర్ణనలతో ప్రస్తావించబడుతాయి. ఆయా అవతారంలో భగవంతుడొనర్చిన కార్యం లేదా ప్రదర్శించిన అంశనుబట్టి ఈ విభాగం చెప్పబడుతుంది. శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఇలా చెప్పాడు అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరమ యోగీంద్రులకు దర్శనీయుడు. ఈ అవతారాన్ని విరాడ్రూపమనీ అంటున్నారు. సకల సృష్టికీ, అవతారాలకూ ఈ మూర్తియే మూలం, అవ్యయం, నిత్యం, శాశ్వతం. ౧) బ్రహ్మ అవతారము: దేవదేవుడు కౌమార నామంతో అవతరించి బ్రహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు. ౨) వరాహ అవతారము: రసాతలంలోకి కృంగిపోయిన భూమిని యజ్ఞవరాహమూర్తియై ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేశాడు. ౩) నారద అవతారము: దేవ ఋషియైన నారదునిగా అవతరించి సమస్త కర్మలనుండి విముక్తిని ప్రసాదించే పాంచరాత్రమనే వైష్ణవతంత్రాన్ని తెలియజేశాడు. ౪)నర నారాయణ అవతారము: ధర్ముని పత్నియందు నరనారాయణ రూపంలో అవతరించి అనన్యసాధ్యమైన తపమును ఆచరించాడు. స్వానుష్టానపూర్వకంగా శమదమాల తత్వాన్ని లోకానికి ఉపదేశించాడు. ౫) కపిల అవతారము: నరనారాయణులు బోధించిన తత్వం కాలగర్భంలో కలిసిపోయింది. అపుడు దేవదేవుడు కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునకు తత్వ విర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు. ౬) దత్తాత్రేయ అవతారము: భగవానుడు అత్రి అనసూయా దంపతులకు పుత్రుడై జన్మించి దత్తాత్రేయునిగా ప్రసిద్ధుడయ్యాడు. అలర్క మహారాజుకు, మరికొందరు బ్రహ్మవాదులకూ ఆత్మవిద్యను బోధించి ఆశాస్త్రాన్ని ఉద్ధరించాడు. జీవాత్మ, పరమాత్మల తత్వాన్ని వివరించే ఆ తత్వవిద్యకు "అన్వీక్షకి" అని పేరు. ౭) యజ్ఞుడుయజ్ఞ అవతారము: భగవంతుడు రుచి మహర్షికి ఆకూడి కడుపున యజ్ఞుడనే పేరుతో జన్మించాడు. యమాది దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు. ౮) ఋషభ అవతారము: భగవానుడు అగ్నీధ్రుని కొడుకు నాభికి మేరు దేవియందు జన్మించి (ఉరుక్రముడనే పేరుతో ప్రసిద్ధుడైనాడు) విద్వాంసులైనవారికి సర్వాశ్రమ పూజితమైన పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు. ౯) పృధు అవతారము: పృథువు అనే చక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమినుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు. ఆహార యోగ్యాలయిన సస్యాదులను, ఓషధులను భూమిమీద మొలిపించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు. ౧౦) మత్స్య అవతారము: చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయకాలంలో మహామీనావతారుడై వైవస్వత మనువును, ఓషధులను, జనులను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు. ౧౧) కూర్మ అవతారము: దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా మునిగిపోతున్న మందరగిరిని ఉద్ధరించాడు. ౧౨) ధన్వంతరీ అవతారము: అమృత కలశాన్ని ధరించి వచ్చినవారికి అందించాడు. ౧౩) మోహినీ అవతారము: జగన్మోహినియై అమృతం దేవతలకు మాత్రం అందేలా చేశాడు. ౧౪) వరాహావతారం:వరాహావతారం హిరణ్యక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము .రాక్షసునితో భయంకరంగా యుద్దం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి. ౧౫) నృసింహ అవతారము: లోకకంటకుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి, భక్తుడైన ప్రహ్లాదుని కాచుటకు శ్రీనారసింహమూర్తియై ఉక్కు స్తంభం నుండి బయలువెడలినాడు. ౧౬) వామన అవతారము: కపట వామనమూర్తియై బలిచక్రవర్తినుండి మూడడుగుల నేలను యాచించి, త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు. ౧౭) పరశురామ అవతారము: మదోన్మత్తులై, బ్రాహ్మణ ద్రోహులైన క్షత్రియులపై ఇరవైఒక్కమారులు దండెత్తి వారిని దండించాడు. ౧౮) వ్యాస అవతారము: కృష్ణ ద్వైపాయనుడై ఒక్కటిగా ఉన్న వేదరాశిని విభజించాడు. ౧౯) రామ అవతారము: పురుషోత్తముడైన శ్రీరాముడై రావణసంహారం కావించాడు. ౨౦) కృష్ణ అవతారము: బలరామ కృష్ణులుగా ఒకేమారు అవతరించి దుష్ట సంహారం కావించి భగవద్గీతను ప్రసాదించాడు. ౨౧) కల్కి అవతారము : కలియుగాంతంలో రాజులు చోరప్రాయులై వర్తిస్తుండగా విష్ణుయశుడనే విప్రునికి కల్కి నామధేయుడై జన్మించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయగలడు. భాగవతం రెండవ స్కంధంలో భగవంతుని లీలావతారాలు అనేకమనీ, వాటిలో కొన్ని సుందరమైన అవతారాలను తాను చెబుతున్నాననీ క్రింది అవతారాలు చెప్పబడ్డాయి. వరాహావతారం - భూసముద్ధరణం. సుయజ్ఞావతారం - లోకపీడాపహరణం కపిలావతారం - బ్రహ్మవిద్యా ప్రతిపాదనం దత్తాత్రేయావతారం - మహిమా నిరూపణం సనకాద్యవతారం (సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులు) - బ్రహ్మవిద్యా సముద్ధరణం నరనారాయణావతారం - కామజయం ధ్రువావతారం - ధ్రువపదారోహం పృథురాజావతారం - అన్నసమృద్ధికరణం ఋషభావతారం - పరమహంస మార్గోపదేశం హయగ్రీవావతారం - వేదజననం మత్స్యావతారం - వేద సంగ్రహం కూర్మావతారం - మందర ధారణం ఆదిమూలావతారం - గజేంద్ర రక్షణం వామనావతారం - బలిరాజ యశోరక్షణం హంసావతారం - భాగవత యోగోపదేశం మన్వవతారం - మనువంశ ప్రతిష్ఠాపనం పరశురామావతారం - దుష్టరాజ భంజనం రామావతారం - రాక్షస సంహారం కృష్ణావతారం - లోకకళ్యాణం వ్యాసావతారం - వేద విభజనం బుద్ధవతారం - పాషండ ధర్మ ప్రచారం కల్క్యవతారం - ధర్మ సంస్థాపనం నారాయణుడే సృష్టి స్థితి లయాలకు మూలము. చిత్తు జీవుడు. అచిత్తు ప్రకృతి. ఇవి రెండూ ఆయన శరీరము. సూక్ష్మ చిదచిద్విశిష్టుడుగా ఉన్న పరమేశ్వరుడు స్థూల చిదచిద్విశిష్టుడు కావడమే సృష్టి. ప్రకృతి మూలంగానే ఈ జగత్తు అంతా సృజింపబడుతున్నది. శ్రీ మహావిష్ణువు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే చతుర్వ్యూహాలు దాల్చుతాడు. వాసుదేవుడు తన భక్తులపట్ల వాత్సల్యంతో ఐదు మూర్తులుగా గోచరిస్తాడు. అవి అర్చావతారము - దేవాలయాలలోని ప్రతిమలు విభవావతారములు - రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు. వ్యూహావతారములు - వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు. సూక్ష్మావతారము - సంపూర్ణ షడ్గుణ సంపన్న పరబ్రహ్మము. అంతర్యామి - సకల జీవనాయకుడు

జాతక చక్రం వేయడం

నక్షత్రాలు - రాశులు కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు. వీరిలో రోహిణి, అనూరాధ, ధనిష్ఠ అతి సుందరమైనవారు. రోహిణి ఈ ముగ్గురిలోనూ కూడా అందగత్తె. వారందరిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు.






 ఆ నక్షత్రముల పేర్లు - అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. 






ఆ బిడ్డలకు తగిన వరునికొఱకు దక్షుడు మునులను సంప్రదించాడు. మునుల సలహా ప్రకారం దక్షుడు తన కుమార్తెలను చంద్రునికిచ్చి పెండ్లి చేశాడు. అందరిచేతను ఒక పూలమాల తయారు చేయంచి చంద్రుని మెడలో వేయించాడు. - అని పురాణ కథ ఈ క్రింద శ్లోకం నేర్చుకుంటే నక్షత్రాల పేర్లు, రాశుల పేర్లు పెద్ద కష్టపడకుండా నోటికి వస్తాయి. ఏనక్షత్రాలు ఎన్నో పాదం వరకు ఏ రాశిలో ఉన్నాయో చాలా సులభంగా గుర్తు ఉంటుంది.











 అశ్వని భరణి కృత్తికా పాదో - మేషం కృత్తికాత్త్రయం రోహిణి మృగశిరార్థం - వృషభం మృగశిరార్థం ఆర్ద్రా పునర్వసుస్త్రయో - మిధునం పునర్వసు పాదం పుష్యమి ఆశ్రేషాన్తం - కర్కాటకం మఖ పుబ్భా ఉత్తరాపాదం - సింహం ఉత్తరస్త్రయో హస్త చిత్రార్థం - కన్య చిత్రార్థం స్వాతి విశాఖత్త్రయో - తుల విశాఖపాదో అనూరాధా జ్యేష్టాంతం - వృశ్చికం మూల పూర్వాషాడ ఉత్తరాషాడ పాదో - ధనుః ఉత్తరాషాడత్త్రయో శ్రవణం ధానిష్ఠార్థం - మకరం ధనిష్ఠార్థం శతభిషం పూర్వాభాద్రత్త్రయో - కుంభం పూర్వాభాద్రపాదో ఉత్తరాభాద్ర రేవత్యాంతం - మీనం.












 ఫలానా సయానికి ఏ తిథి, వార, నక్షత్రాలు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా? జాతక చక్రం వేయడం తెలుసుకుందామనుకునే వారికి కలిగే మొదటి సందేహం ఇదే అనుకుంటాను. చాలా మందికి ఈ విషయం చిన్నప్పటి నుండే తెలిసి ఉంటుంది. కానీ ఇంకా ప్రాథమిక స్థాయికి వెళదామనిపించి ఈ విషయం కూడా తెలిపే ప్రయత్నం చేస్తున్నాను. ఫలానా సయానికి ఏ తిథి, వార, నక్షత్రాలు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా? సమాధానం చాలా తేలికైనది. మన తెలుగు కాలెండర్ లో ఉంటాయి ఈ వివరాలన్నీ. ఇంకా మంచి పద్ధతి ఏమిటంటే ఓ చక్కని పంచాంగం ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవడమే! తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అను ఐదు ( పంచ ) విషయాల ( అంగాల ) గురించి వివరించునదే "పఞ్చాఙ్గము" మన ఆంధ్రులు చంద్రుని బట్టి లెక్కలు వేస్తారు. కనుక మనది చాంద్రమానము. సరే ఈ పఞ్చాఙ్గము లలో కూడా అనేక రకాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి గంటల పఞ్చాఙ్గము, ధృక్ ( సూర్య ) సిద్ధాంత పఞ్చాఙ్గము. పూర్వంనుండీ వాడేవి గంటల పఞ్చాఙ్గములు. కానీ సరిఅయిన లెక్కలు వచ్చునవి, జ్యోతీష్యులు అంగీకరించునవి ధృక్ సిద్ధాంత పఞ్చాఙ్గములు. తిథి, నక్షత్రాలు ఎప్పుడు ప్రారంభమౌతున్నాయి, ఎప్పుడు పూర్తవుతున్నాయి అనే విషయాలలో ఈ రెండింటికీ వ్యత్యాసాలు ఉన్నాయి. ( నేను ఇంకా తెలుసుకోవాలి ).




 ప్రస్థుతానికి నేను వాడేది ధృక్సిద్ధాంత పంచాగము. సరే అటువంటి పంచాంగములో ఫలానా తేదీ నాడు ఏ తిథి, నక్షత్ర, యోగ, కరణములు ఎంతవరకు ఉన్నదీ అనే విషయం ఉంటుంది. సాధారణంగా అన్ని పంచాంగములలోనూ ప్రారంభ సమయాలు కాక, అంత్య సమయాలు ఇస్తారు. ఇక వారం విషయం అందరకూ తెలిసినదే! కానీ ఆంగ్ల మానము ప్రకారం అర్థ రాత్రి 12 నుండి మళ్లీ అర్థ రాత్రి 12 వరకు వారము కాదు. 


సూర్యోదయము నుండి మరల సూర్యోదయము వరకు ఒకటే వారముగా గ్రహించాలి. అలాగే తిథిని గ్రహించేటప్పుడు పూజలో సంకల్పానికి అయితే సూర్యోదయానికి ఎతిథి ఉంటే అదే తిథిని చెప్పాలి. కానీ ముహూర్త నిర్ణయానికి అయితే ఆసమయానికి ఏది ఉంటే అదే గ్రహించాలి.











 తారాబలం చూడటం ఎలా? ముహూర్త నిర్ణయంలో ప్రథానమైనది తారాబలం. ఏ చిన్న ముహూర్తానికైనా మన జన్మ నక్షత్రానికి సరిపోయే నక్షత్రమును మాత్రమే తీసుకోవాలి. జన్మ నక్షత్రం నుండి ముహూర్త సమయానికి ఉన్న నక్షత్రం వరకు లెక్కించగా వచ్చిన సంఖ్యను 9 చే భాగహరించాలి. వచ్చిన శేషాన్ని బట్టి ఫలితం క్రింది విదంగా నిర్ణయించాలి. 1 వస్తే ‘జన్మతార’ అలా వరుసగా.... 1) జన్మతార, 2) సంపత్తార, 3) విపత్తార, 4) క్షేమ తార, 5) ప్రత్యక్తార, 6) సాధన తార, 7) నైధన తార, 8) మిత్ర తార, 9) పరమమిత్ర తార. ఇవేవో అశ్వని, భరణి, కృత్తికల వలే వేరే కొత్త తారలు అనుకోకండి. ఆ 27 నక్షత్రాలకే మన జన్మతారను బట్టి ఈ తొమ్మిది పేర్లు అన్వయించాలి. అంటే ‘విద్యార్థి’ అనే పేరు గల వ్యక్తి ఉన్నాడు. అతను ఒకరికి కొడుకు, ఒకరికి తమ్ముడు, ఒకరికి భర్త అవుతాడు. అలాగే అశ్వనీ నక్షత్రం ఒకరికి జన్మతార అయితే, మరొకరికి సంపత్తార ( సంపదలు కలిగించే తార ) అవుతుంది. మరొకరికి విపత్తార ( విపత్తులు కలిగించే తార ) అవుతుంది. ఎవరికి ఏమవుతుంది అన్నది వారి జన్మనక్షత్రాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. పైవాటిలో సంపత్తార, క్షేమ తార, సాధన తార, మిత్ర తార, పరమమిత్ర తారలు ( 2,4,6,8, 9 తారలు ) సకల శుభకార్యాలు చేసుకోవడానికి పనికి వస్తాయి. వృత్తి,వ్యాపార సంబంధమైన విషయాలు ‘సంపత్తార’ లోను, ప్రయాణాది కార్యాలు ‘క్షేమతార’ లోను, సాధించి తీరాలనుకునే కార్యాలు ‘సాధనతార’ లోను ప్రారంభించడం మరింత మంచిది. జన్మతార కొన్ని శుభకార్యాలకు పనికొస్తుంది. కొన్నిటికి పనికి రాదు. చెవులు కుట్టడం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, నిషేకం, యాగం, పట్టాభిషేకం, వ్యవసాయం, భూసంపాదన మొదలైన వాటికి జన్మతారను గ్రహించ వచ్చు. ప్రయాణం, పెండ్లి, క్షౌరము, ఔషధ సేవనం, గర్భాదానం, శ్రార్థం, సీమంతం, పుంసవనము మొదలైనవి జన్మనక్షత్రంలో చేయరాదు. 






ఉదాహరణ : రేవతి నక్షత్రం జన్మ నక్షత్రం అనుకుంటే, ముహూర్త నిర్ణయంరోజు పూర్వాభాద్ర నక్షత్రం ఉంది అనుకుంటే, రేవతికి పూర్వాభాద్ర సరిపోతుందో లేదో తెలుసుకోవాలి. అంటే రేవతి నుండి పూర్వాభాద్ర ఎన్నో నక్షత్రమో లెక్క పెట్టాలి. 26 వ నక్షత్రం అవుతుంది. దానిని తొమ్మితో భాగహరించగా శేషం 8 వస్తుంది. అంటే రేవతికి - పూర్వాభాద్ర ఎనిమిదో తార ( మిత్ర తార ) అవుతుంది. అంటే శుభం కనుక ముహూర్తము పనికొస్తుంది. శేషం సున్నా వస్తే అది తొమ్మిదిగా గుర్తించాలి.







 తప్పని సరి పరిస్థితులలో ముహూర్తనిర్ణయం చేయవలసి వస్తే ..... ప్రథమే ప్రథమం త్యాజ్యం ద్వితీయేతు తృతీయకం తృతీయే పంచమం త్యాజ్యం నైధనం త్రిషువర్జయేత్ ! ప్రథమ నవకం లో ( 1 నుండి 9 తారలలో ) మెట్ట మొదటి తారను, 2 వ నవకం లో ( 10 నుండి 18 తారలలో ) మూడవ తారను, 3 వ నవకంలో( 19 నుండి 27 తారలలో ) పంచమ తారను, ప్రతీ నవకంలో 7 వతారను ఎల్లప్పుడు వదిలి పెట్టవలెను. అంటే జన్మనక్షత్రము లగాయతు 1, 7, 12, 16, 23 మరియు 25 నక్షత్రాలను ఎల్ల వేళలా శుభకార్యములలో వదిలిపెట్టాలి. అంటే సాధారణంగా జన్మ నక్షత్రం నుండి 1,3,5,7,10,12,14,16,19,21,23 మరియు 25 నక్షత్రాలను శుభకార్యములలో వదిలిపెట్ట వలసి ఉన్నది. కానీ కావలసిన సమయము లోపల ముహూర్తములు కుదరని పక్షమున 1, 7, 12, 16, 23 మరియు 25 తారలు మాత్రం వదిలి మిగతావి రెండవ ఎంపికగా గ్రహించ వచ్చును.










 ఫలానా సమయానికి ఏ లగ్నం ఉన్నదో తెలుసుకోవడం ఎలా? పంచాంగములో తిథి, వార, నక్షత్రాలు ఇచ్చి నట్లే లగ్నాంతకాలములు అని ఒకచోట ఇస్తారు. అవి అంతమయ్యే సమయాన్ని తెలుపుతాయి. ఉదాహరణ: జనవరి 19 వ తేదీ ఉదయం 06-26 నుండి 08-14 ని.ల వరకు మకరలగ్నం ఉంది.

 ప్రశ్న : తరువాత ఏలగ్నం?
 జవాబు : ఇంకేమిటి ఉంటుంది? మకరం తరువాత కుంభమే కదా! :) ఉదయం 09-53 వరకు కుంభలగ్నం ఉన్నది. 

ప్రశ్న : ఏలగ్నంతో రోజు ప్రారంభమౌతుంది అనడానికి లెక్కలేమైనా ఉన్నాయా?

 జవాబు : సూర్యుడు ఏరాశిలో ఉంటే ఆ లగ్నంతో రోజు ప్రాంరంభమౌతుంది. తరువాత వరుసగా లగ్నాలన్నీ మారుతూ వచ్చి మళ్లీ సూర్యోదయానికి తిరిగి అదే లగ్నంతో ప్రారంభమౌతుంది. 

ప్రశ్న : సూర్యుడు ఎన్ని రోజులు ఒక రాశిలో ఉంటాడు? మళ్లీ ఎప్పుడు వేరే రాశిలోకి మారతాడు?
 జవాబు : సూర్యుడు సరిగ్గా ముప్ఫైరోజులు ఒక రాశిలో ఉంటాడు. సాధారణంగా ప్రతీనెలా 14 లేక 15 తేదీలలో రాశి మారుతుంటాడు. దీనినే సంక్రమణము అంటాము. అలాధనురాశిలోకి ప్రవేశించి నప్పుడే ధనుస్సంక్రమణం అంటాము. అప్పుడే ధనుర్మాసం ప్రారంభమౌతుంది. తరువాత నెలకి మకర సంక్రమణం ( సంక్రాంతి పండుగ ) వస్తుంది.








 ముహూర్తం చూడడం ఎలా? శ్లో// చక్షుషే జగతాం కర్మసాక్షిణే తేజసాంనిధేః మూర్తి త్రయ స్వరూపాయ మార్తాండాయ నమోనమః// మనం ఒక అధికారి దగ్గరికి పనిమీద వెళ్లేటప్పుడు ఆ అధికారి కోపంలో ఉన్నాడా!?, సంతోషంలో ఉన్నాడా!? మొదలైన విషయాలు తెలుసుకుని అతను సంతోషంలో ఉన్నప్పుడు వెళితే మన పని త్వరగా అవుతుంది. అలాగే తెలివైన వారు కాలం యొక్క స్వభావాన్ని తెలుసుకుని మంచి కాలములో తగిన పనులు చేయ తలపెడతారు. అన్నికాలాలూ మనకు జయాన్ని ఇవ్వవు. ఒక సమయంలో ఒకరికి శుభం జరిగితే మరొకరికి కష్టం కలగవచ్చు. మనం పుట్టిన సమయాన్ని బట్టి మనకు మాత్రమే ప్రత్యేకంగా సరిపడు కాలం తెలుసుకోవాలి. మనం పుట్టిన సమయానికి ఉన్న నక్షత్ర,లగ్న ములను బట్టి మనకు/ మనం తలపెట్టిన పనికి సరిపడు నక్షత్ర, లగ్న సమయాలు తెలుసుకుని ముందడుగు వేయడం జయాన్ని కలిగిస్తుంది. కాలం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఋషులు మనకు అందించిన అద్భుత వరం “జ్యోతిష్య శాస్త్రం”. దీని ఆధారంగా మన జీవితంలో జరుగు వివాహము, ఉపనయనము, గృహప్రవేశము మొదలైన కర్మలను ఏ రోజు, ఏ సమయంలో జరుపుకోవచ్చో తెలుసుకొనవచ్చు. ముహూర్తం చూసే ప్రక్రియలో ముఖ్యంగా ఈ క్రింధి విషయాలు గమనించాల్సి ఉంటుంది.

 1) తారా బలం, 2) చంద్ర బలం, ౩) లగ్న బలం, 4)పంచక రహితం, 5) ఏకవింశతీ మహా దోషాలు వీటి తో పాటు చివరిగా ఆయా క్రతువులకు పనికి వచ్చే తిథి, వార, నక్షత్రాలనే వాడామా లేదా అనే విషయం కూడా తప్పకుండా నిర్థారించుకోవాలి.


 ఉదాహరణకు : మనం అడిగి మరీ పెట్టించుకునే “ఆదివారం” గృహప్రవేశం, ఉపనయనం, వివాహం మొదలైనవాటికి తగిన వారంగా పేర్కొన బడలేదు. బుధ,గురు, శుక్రవారములు చాలా వరకు శుభకార్యములకు మంచివిగా పెద్దలు తెలిపారు. అయితే వారము కన్నా తిథి, తిథికన్నా నక్షత్రము, నక్షత్రముకన్నా లగ్నమూ అత్యంత బలీయములు. కనుక నక్షత్ర, లగ్నములు అనుకూలముగా ఉన్నచో తిథివారములు మధ్యస్థముగా ఉన్ననూ స్వీకరిస్తుంటారు. ఒక పని ముఖ్యంగా వైదిక సంబంధమైన వివాహ గృహప్రవేశాది క్రతువులు చేయతలపెట్టినప్పుడు ఈ విషయాలు అన్నీ గమనించి శుద్ధపరచిన శుభముహూర్తములు గ్రహించాలి. పంచకరహితం అంటే? ఏదైనా ముహూర్తమును నిర్ణయించ దలచుకున్నప్పుడు ఆ ముహూర్తమునకు పంచక రహితం అయ్యిందో లేదో చూసుకోవాలి. 


ముహూర్త సమయానికి ఉన్న తిథి - వార - నక్షత్ర - లగ్న ములు అను నాలుగింటిని కలిపి తొమ్మిదిచే భాగించగా వచ్చిన శేషం 1 తప్ప మిగిలిన బేసి సంఖ్యలైతే శుభం. అదే శేషం 1 అయితే మృత్యు పంచకం. ఇది అస్సలు మంచిదికాదు. ఆ ముహూర్తమునకు చేసే శుభకార్యము వలన మృత్యువు సంభవించ వచ్చును. 2 అయితే అగ్ని పంచకం. దీని వలన అగ్నిప్రమాదములు జరుగుతాయి. 4 అయితే రాజ పంచకం. అనుకోని అవాంతరాల వలన కార్యం ఆగిపోవచ్చు. 6 అయితే చోర పంచకం. కార్యక్రమంలో కొన్ని దొంగలచే దొంగిలించ బడతాయి. 8 అయితే రోగ పంచకం. కార్యక్రమంలో ప్రధాన వ్యక్తులు రోగముచే బాధపడతారు. కనుక శేషంగా 1,2,4,6,8 అను ఐదు సంఖ్యలు ( పంచకములు ) వస్తే అవి శుభప్రదం కాదు. ఆముహూర్తమును వదిలి పెట్టవలెను. అయితే తప్పని సరి పరిస్థితులలో ..... చోర రోగ త్యజే రాత్రౌ దివారాజాగ్ని మేవచ అహోరాత్రం త్యజేత్ మృత్యుః పంచకాని విచారయేత్ అని చెప్పుటచే చోర, రోగ పంచకములను రాత్రి ముహూర్తంలో త్యజించాలి( పగలైతే ఉపయోగించ వచ్చును ). రాజ, అగ్ని పంచకములను పగటి ముహూర్తాలలో వదిలివేయాలి ( రాత్రి స్వీకరించ వచ్చును ). మృత్యు పంచకమును ఎల్లప్పుడూ వదిలివేయాలి. మృత్యు, అగ్ని, రాజ, చోర, రోగ ములను ‘పంచకము’ అంటారు. ఇవి ‘రహితం’ చేసుకుని ముహూర్తము నిర్ణయించడాన్నే " పంచక రహితం " అంటారు. 

ఉదాహరణ : 19- 01-2012 సా.గం. 17-04 ఏదైనా శుభముహూర్తం నిర్ణయించాలనుకున్నాం. ఈ సమయానికి ( ముహూర్తానికి ) పంచక రహితం అయ్యిందో లేదో చూద్దాం. తిథి మొదలైనవి పంచాంగంలో చూసుకోవాలి. 19 తేదీ నాడు గురువారం, ఏకాదశి రా. 7.30 వరకు, అనూరాధ నక్షత్రం రా. 7-10 వరకు ఉన్నాయి. ఈ రోజు సా. 03-14 నుండి 05-26 వరకు మిథున లగ్నం ఉంది. వారం గురువారం - ఆదివారంనుంచి మొదలుపెడితే గురువారం ఐదవది. అనగా దీని సంఖ్య 5 అవుతుంది. తిథి సాయంత్రం 7-30 లోపే మన ముహూర్తం ఉంది కనుక ఏకదశి తిథినే తీసుకోవాలి. తరువాత అయితే ద్వాదశి తిథిని తీసుకోవాలి. ( కొందరు సూర్యోదయానికి ఉన్నతిథినే ఆ రోజంతా లెక్కించాలి అంటున్నారు. కానీ అది సరి అయినది కాదు. ఆ సమయానికి ఏ తిథి ఉంటే అదే తీసుకోవాలి. ) కనుక ప్రస్థుతం ఏకాదశి తిథి. అంటే పాడ్యమి నుండి మొదలు పెడితే ఏకాదశి 11 వ తిథి అవుతుంది. అనగా దీని సంఖ్య 11 అవుతుంది. నక్షత్రం అనూరాధ. అశ్వని మొదలు అనూరాధ 17 వ తార. కనుక దీని సంఖ్య 17 అవుతుంది. లగ్నం మిథునం. మేషం మొదలు మిథునం 3 వ రాశి కనుక దీని సంఖ్య 3 అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ వరసగా రాసుకుని కూడదాం. 

తిథి + వారము + నక్షత్రము + లగ్నము ఏకదశి + గురువారం + అనూరాధ + మిథునం 11 + 5 + 17 + 3 = 36 దీనిని 9 తో భాగహరించాలి. 9) 36 ( 4 36 ----- శేషం 0 ----- సున్నా అంటే 9 గా భావించాలి. తొమ్మిది 'బేసి` సంఖ్యకనుక ఈ ముహూర్తానికి పంచక రహితం అయినది. చంద్ర బలం ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు పరిశీలించవలసిన ముఖ్యమైన విషయాలలో చంద్రబలం ఒకటి. ముహూర్త సమయానికి చంద్రుడు ఉన్న రాశిని బట్టి బలాన్ని నిర్ణయించాలి. ఎవరికొరకు ముహూర్తం చూస్తున్నామో వారి జన్మ రాశినుండి, ముహూర్తం నిర్ణయించదలచిన రోజున చంద్రుడు ఉన్న రాశివరకు లెక్కించాలి. జన్మ రాశినుండి ముహూర్త సమయ చంద్రరాశి శుక్ల పక్షంలో : 2-5-9 క్రిష్ణ పక్షంలో : 4-8-12 శుక్లపక్షం, క్రిష్ణ పక్షం రెండిటిలోనూ : 1,3,6,7,10,11 అయితే మంచిది. అనగా శుక్లపక్షంలో చంద్రుడు 4-8-12 స్థానాలలో ఉంటే ఆ ముహూర్తానికి చంద్ర బలం లేనట్లే. మిగతా స్థానాలలో ఎక్కడున్నా మంచిదే. కృష్ణ పక్షంలో చంద్రుడు 2-5-9 స్థానాలలో ఉంటే ఆ ముహూర్తానికి చంద్ర బలం లేనట్లే. మిగతా స్థానాలలో ఎక్కడున్నా మంచిదే. మంత్ర సిద్ది పొంది ,అదిదేవతను,నిర్దిష్ట ఊజ ద్రవ్యాలతో,పూజించే విదానాన్నితంత్రము అంటారు .సత్పలితాలను పొందటానికి సిద్ది పొందిన గురువు అవసరము ఆదునిక కాలములో పొందే అనేకానేక అవరోదాలు దాటడానికి తంత్ర శాస్త్రం ఎంతో ఉపయోగ పడుతుంది.ఇతరులను బాదించే విదముగా మంత్రాన్ని ఉపయోగించుట మంచిది కాదు .తంత్రము లో పూజ ద్రవ్యాలు అత్యంత కీలక పాత్ర వహిస్తాయి.ఫలం ,పత్రం ,పుష్పం ,తోయం ,ఒషదులు ,దూపం,దీపం ,అక్షతలు ,జపమాల ఆసనం ,మొదలగు పూజ ద్రవ్యాలు శుచిగా శుబ్రంగా బద్రంగా ఉంచాలి .అంతే కాకుండా వివిధ పూజలకు నిర్దేసించి పూజ ద్రవ్యాలనే వాడాలి తప్ప లబ్యము కాలేదని మనమిష్టమొచిన ద్రవ్యాలను ఉపయోగించరాదు .ఆవిధంగా చేయుట వల్ల సత్పలితాలకు బదులు దుష్పలితాలే రావచును .దాని వల్ల శాస్త్రం పట్ల అపోహ ,విముఖత కలగా వచును . తంత్రము అంతే శాస్త్రము కాదు.ఆచరణ విదానము ఏయే ఖర్మలు ఎ విదంగా చేయాలో నిర్దేశిస్తుంది తప్ప బోదన చేయదు .ఆదునిక కాలములోని అప్లైడు సైన్సు వంటిది .ప్రయోగము చేయుటవల్లనే ఫలితం అర్ధమవుతుంది తప్ప పతనము వల్ల ,వినడం వల్ల తంత్రము తెలియ బడదు .ప్రతి మతమందు తంత్ర విదానం ఉంటుంది . తంత్ర విదానం లేని మతమే ఉండదు .విడనములో తేడా తప్పతంత్రము లేకుండా ప్రపంచములో ఎ మతకార్యము కాని ,దైవిక కార్య కలాపము కానీ,ఉండదు అసలీ తంత్రమును శివుడు కైలాస పర్వతమునందు పార్వతి కి ఉపదేశించినట్లు చెప్పబడింది .చెప్పినప్రతిచోటఅతిరహస్యమైనది, గోప్యమైనది,అని చెప్పడము వల్ల అనాదిగా గోప్యంగా ఉంచటం వల్ల ప్రజల్లో అనేకానేక భయాలు, సందేహాలుచోటు చేసుకున్నాయి .తంత్రానికి మతముతో సంబందము ఉండదు .ఎవరేమతం పుచుకున్నాతంత్రము సదన తో కూడు కున్నది.తంత్రాన్ని అర్దము చేసుకొనుటకు ప్రయత్నమూ చేయడము వ్యర్ద ప్రయాస .తంత్రాన్ని సాదన చేయాలి .జాతి,వర్ణ ,ప్రాంత ,మత సంబందాల కటితమైనది .మంత్ర శాస్త్రము సాదన ఒకటే దాని పరమ గమ్యం తప్ప మరేది కాదు తంత్రము ద్వారా ప్రాకృతిక శక్తులను మనకు అనుగుణముగా మార్చు కొనుట వల్ల మనకు కావలసిన పనులు చేసుకోన వచును .ప్రకృతి ప్రసాదించిన నీటిని ఎ విదముగా త్రాగుటకు ,కరెంటు తాయారు చేయుటకు వ్యేవసయానికి అభిషేకానికి వాడుకొంటమో ఆవిదంగానే తంత్రాన్ని వాడు కోవాలి . వైదికంగా చెప్పిన మంత్రాలకు ప్రయోగ శీలత లేదా ఆచరణ కలిగించడమే .తంత్ర శాస్త్ర ప్రయోజనం వేల సంవస్చారాల క్రితం నుండి ఎ పద్దతులు విదానాలు ప్రతీకలు అమలులో ఉన్నాయో అవే నేటికి ప్రపంచ నలు మూలల్లో వ్యాప్తి చెంది ఉండడమే తంత్ర శాస్త్ర గొప్పతనానికి నిదర్శనము .సంస్కృతంలో అనేక తంత్ర శాస్త్ర గ్రందాలు ఉన్నపటికీ తంత్ర శాస్త్రము అభి వృద్ది చెందిందని చెప్ప వచును . గ్రందస్తమైన విషయము కన్నా ఆచరణ లో ఉన్న విదానాలే తంత్ర శాస్త్రానికి ఆయువు పట్టులు తంత్ర శాస్త్రము ఎప్పుడు ఆచరణ ప్రయోగ వయిద్యము మీదే ఆదారపడి ఉంది కానీ తర్క వితర్కాల మీద పాండిత్య ప్రకర్ష మీద కాదు తంత్ర శాస్త్రము దొంక తిరుగుళ్ళు తిరగ కుండ సరాసరి విషయము మీద కాలునుతుంది కాబట్టి సులువుగా ఉన్నట్లు కనపడు తుంది కానీ అతి కష్టమైనదని కాలు పెట్టాక తెలుస్తుంది.తంత్రములో చెప్పబడిన విషయాలన్నీ ప్రతీకలతో కూడు కొన్నవి .వాటిని అర్ధం చేసుకోక పొతే అపార్దాలుగా కనిపిస్తాయి.అరాదనలో ఉపయోగించే వస్తు జాలమంతా అంతరంగాలలోని అంగలకు ప్రతీకలు సదకుడు తీవ్ర స్తాయి పొంది నప్పుడు ప్రతీకలు ప్రతిమలు పోయి సజీవ రూపాలనే సాధనకు ఉపయోగించాతము జరుగుతుంది .








ఆద్యాత్మిక దిన చర్య
మనస్సును ధార్మిక జీవనము మరియు దేవుని వైపు మరల్చుట కు ఆద్యాత్మిక దిన చర్య ఒక కొరడా వంటిది .ఈదిన చర్యను నియమంముగా పాటించిన చొ ప్రశాంత మనస్సు శాంతి కలిగి ఆద్యాత్మిక పదమునందుపురోగమింప గలుగును ప్రతి నిత్యమూ ఈ దిన చర్యను పాటించి దాని యొక్క అద్బుత ములగు ఫలితములను అనుభవించుము.





 [1] పడక నుండి ఎపుడు లేచితివి ? “పెందలకడనే పరుండి.పెందలకడ లేచుట వలన మానవుడారోగ్యమును,సంపదను ,మేధా శక్తీ ని పొందును .బ్రంహి ముహుర్తముననే 4 గంటలకు లేచి జప ,ద్యానముల నోనర్చుము .ఆ సమయములో ఎక్కువ పరిశ్రమ లేకుండగానే .మనస్సు తనకు తనే ద్యనావాస్త నొందును . [2 ] నీవెన్ని గంటలకు నిద్రించితివి ? ప్రతి వ్యక్తికి 6 గంటల నిద్ర చాలును .10 గంటలకు పరుండి ,వేకువ జామున 4 గంటలకు లెమ్ము .నిద్రాదిక్యము వలన మందత్వము మత్తత ఏర్పడును అదిక నిద్రవలన దేహ క్షీణము ,మేధా శక్తీ దుర్బలత్వము ఏర్పడును. [3] యోగమునకు జపమొక ప్రాముక్యమైన అంగమై ఉన్నది .ఈ కలియుగములో భగవత్ సాక్షాత్కారము నొందుటకై జప ,కీర్తనడులు అత్యద్బుతమైన సాదనములై యున్నవి. [4] ఎంత కాలము కీర్తన మొనరించితివి? భగవన్నామము పాడుట చే భక్తుడు దివ్యానుభవమును ,దివ్య నహిమను ,దివ్య చైతన్యమును ,తనలోను సర్వత్రానూ కంచగాలుగును .ఈ కలియుగములో సంకీర్తన వలన సులబముగా దైవ దర్శనము నొంద వచును . [5] ఎన్ని ప్రానయమములోనర్చితివి ? “శ్వాసను అదుపులో నుంచుట”కే ప్రాణాయామము అనిపేరు .పొట్ట కాళిగా నున్నపుడు పద్మాసనము,సుకాసనము,సిద్దసనము,లేక సులువుగానున్నఆసనము పై కుర్చోనుము .నేత్రములను మూయుము కూడు ముక్కు రంద్రమును కుడి చేతి బొటన వ్రేలితో మూయుము .ఎడమ ముక్కు రంద్రము ద్వారా శ్వాసను మెల్లగా లోనికి పీల్చు కొనుము .తదుపరి నీ చిటికిన వేలు మరియు ఉంగరపు వ్రేళ్ళతో ఎడమ ముక్కు రంద్రమును మూసివేసి శ్వాసను నీవెంత వరకైతే సుఖ కారముగా ఉంచ గలుగుదువోఅంత వరకు ఆపి ఉంచుము టడు పరి కుడి ముక్కు రంద్రమును తెరచి నిదానముగా శ్వాసను విడచి పెట్టుము ఈ విదముగా ముక్కు రంద్రములు మారుస్తూ పీల్చి వదలాలి దీనినే సుఖ ప్రాణాయామము అంటారు దీని వల్ల నాడి సుద్ది జరుగు తుంది . [6] ఆసనములు ఎంత కాలమొనర్చితివి ? అష్టాంగ యోగమునకు ఆసనమే ప్రదమావాస్త అయివున్నది .జప ,ద్యానములోనర్చుటకు పద్మాసన,సిద్దాసన,ములు ఆవస్యకములై ఉన్నవి ఆరోగ్యము నొందుటకై సీర్షాసనము,సర్వాన్గాసనము,పస్చిమోత్తసనము ,మొదలగునవన్నియు నానా విడములైన రోగములను పోగొట్టును [7] ఒకే ఆసనము పై ఎంతకాలము ద్యానించితివి? బ్రంహి మహుర్తమున 4 గంటల నుండి 6 గంటల వరకు నీ ద్యాన గదిలో నీకు సుకమైన ఆసనములో కుర్చుని చేయవలెను ఆసమయములో చేయు ద్యానము పరమో ఉత్క్రుష్ణమైనడి . [8] గీతయందు ఎన్ని శ్లోకములు పతిన్చితివి,లేక కన్తస్త మోనర్చితివి? స్వాదాయమే క్రియా యోగములేక నియమములలో ఒకటై ఉన్నది .స్వాద్యాయము హృదయమును పవిత్రమొనర్చి ,విశాలము ,అత్యున్నతము వికాసవంతమునగు భావములతో నింపి వేయును [9] సత్ సంగమునెంత కాల మున్టివి ? సాదుసత్పురుషులు ,యోగీశ్వరులు మరియు సన్యాసుల యొక్క సాంగత్యముమహిమను గురించి భాగవతము ,రామాయణము ,మొదలగు గ్రందములలో విసేశామముగా వర్ణించ బడినది .మానవుల యొక్కదుష్ట సంస్కారములను నసింప చేయుటకు ఒక్క క్షణ కాల సత్ సంగము మాత్రమే చాలును. [10] మవునం ఎన్ని గంటలు అవలంబిన్చితివి? వ్యర్ద ప్రసంగములతోను ,అతి ప్రసంగములతోను ,మన శక్తీ యంతయు వృధా యగుచున్నది .వ్యర్ధ ప్రసంగాములను వదలి పెట్టి మవునము అవలంబించిన ఇచా శక్తీ వృద్ది యగును వాగ్దోషములను నివారింప జేయును [11] నిష్కామ ఖర్మ మెంత వరకు మోనర్చితివి ? నిష్కామఖర్మ యోగము సమస్త పాపములను ,అపవిత్రను నసింప చేసి ,చ్త్తసుద్దినోనర్చును ,శుద్దమైన మనస్సు కలుగ చేయును ప్రతి దినము కొన్నింటిని పాటించు చుండుము .










మాంగల్యధారణ విశిష్టత

మాంగల్యధారణ విశిష్టత నేటి మహిళలు కొంతమంది . వివాహం అంటేనే మంగళసూత్రం. మంగళసూత్రం అంటేనే వివాహం. పురుషుడు తాను పుట్టగానే నేను పుట్టాను అని గుర్తుగా ఒక తల్లికి గాని, ఒక తండ్రికి గాని, ఒక తోబుట్టువుకు గాని ఏ గుర్తు మిగల్చడు. కాని వివాహ సమయంలో మంగళసూత్రధారణ చేసేటప్పుడు మటుకు నేనున్నాను అని గుర్తుగా నీ మేడలో మంగళసూత్రం కడుతున్నాను అని ముక్కోటి దేవతల సాక్షిగా మూడుముళ్ళు వేస్తూ మంగళసూత్రం కడతాడు. మరి మనము ఆ మంగళసూత్రం అడ్డుగా ఉంది అని బీరువాలో భద్రపరిస్తే అతని ఉనికే ప్రశ్నార్ధకం అవుతుంది కదా. పైగా ప్రతి ఆడది కోరుకునేది వందేళ్ళు సుమంగళిగా ఉండాలనీ, తన భర్త కళ్ళముందు ఆయన ఒడిలో తలపెట్టుకుని తను తుది శ్వాస వదలాలని కోరుకుంటుంది. మరి ఆ అయిదోతనం అంతా ఆ మంగళసూత్రంలోనే ఉంది కదా. మంగళసూత్రాన్ని కట్టించేటప్పుడు కూడా ఆ మంగళసూత్రం హృదయస్థానాన్ని తాకుతూ ఉండాలి అని మాంగల్యధారణ సమయంలో మంగళసూత్రాల్ని హృదయానికి పట్టుకొమ్మని పెళ్లి మంత్రాలను బ్రహ్మగారు చదువుతారు. హృదయస్థానంలోనే కట్టుకోవడానికి కారణం హృదయంలో ఎప్పుడూ ఆ పార్వతీపరమేశ్వరులు కొలువై ఉంటారు. ఎప్పుడూ ఆ మంగళసూత్రాలు హృదయస్థానానికి తాకుతూ ఉండటం వల్ల, ఆవిడ ఎల్లప్పుడూ ఆ సర్వమంగాళాదేవతని ఆరాధించడం వలన ఆవిడ ఎప్పటికీ సుమంగళిగా ఉంటుంది. అలాగే మాంగల్యధారణకు పసుపుతాడునే వాడుతారు. మూడు ముళ్ళు వేసిన తరువాత ప్రతిముడికి కుంకుమను అద్దడానికి కారణం, పసుకు కుంకుమలలో ఆ సర్వమంగాళాదేవత ఆవాహన అయి ఉంటుంది. అందుకనే నాంతాడు (మంగళసూత్రాలను కట్టుకునే బంగారు తాడు) మధ్యలో తాడు మటుకు పసుపుతాడే అయి ఉండాలి. ఎలాంటి లోహముతోనూ చుట్టించుకోకూడదు. మాంగల్యధారణ సమయంలో మూడుముళ్ళే వెయ్యడానికి కారణం మన సనాతన ధర్మంలో ఏది మూడుసార్లు అన్నా అది సత్యం అవుతుంది. అలాగే ముక్కోటి దేవతలు ఆశీర్వదిస్తారు కూడా. 1) బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు 2) తాంబూలంలో ఆకు, వక్క, సున్నం 3) సత్వ, గుణ, రజో గుణములు 4) యోగాగ్నిలో ఉపయోగించే అగ్నులు మూడు. అలాగే స్థూల దేహము, ఇప్పుడు ఉన్న శరీరం సూక్ష్మ శరీరం సాక్షిగా అనగా మనం చేసే పాప, పుణ్యాలకు సాక్షిగా కారణ శరీరం. ఏ కారణంగా మనం ఈ శరీరాన్ని అనుభవిస్తున్నామో ఈ మూడింటికి కలిపి స్థూల, సూక్ష్మ, కారణ, మూడు ముళ్ళు వేస్తాడు. అందుకనే ఒక వేళ ఏ కారణం చేత భర్త చనిపోయినప్పటికీ (అటువంటి అమంగళము ఎవరియందు జరగకుండుగాక) ఆమెను, ఆయన భార్యే అంటారు. అందుకనే ఆవిడ నూరేళ్ళు పసుపుకుంఖాలతో ఉండాలని వివాహ సమయంలో మంగళసూత్రాలను 100 నిష్కముల బంగారం అనగా 8 గ్రాముల బంగారంతో చేయిస్తారు. ఒక యింటి సౌభాగ్యం అంతా ఆ ఇంట ఉండే స్త్రీ యొక్క మంగళసూత్రంలో ఉంది అంటే అతిశయోక్తి కాదేమో. అందుకనే మనమందరం మాంగల్యం యొక్క విలువను తెలుసుకుని మన అభివృద్ధికి వ్యక్తి పరంగా మాంగల్యం ఉండకూడదు అని ఎవరైనా శాసిస్తే అలాంటి ఉద్యోగాలు మాకు అఖ్ఖర్లేదు, నేను వివాహితని, నా మంగళసూత్రం నాకు ప్రాణం అని మనమందరం ఒక్క మాట మీద ఉండగలగాలి. ఆ కంపెనీ దిగివచ్చి అలాంటి శాసనాల్ని మార్చివేస్తాయి. అందుకనే మనము తాళిని ఎగతాళి చేయకుండా అలా ప్రవర్తిస్తున్నవారికి మనకి తోచిన మంచి మాటలు చెప్పి వారిని దారిలో పెట్టడానికి ప్రయత్నించాలి. యువతే ప్రపంచం. మన దేశ స్త్రీలకు చేతులెత్తి నమస్కరించాలి. మన కట్టు, బొట్టు, సనాతనధర్మాల్ని మన విలువలను కాపాడుకుంటూ ఇంతే జాగ్రత్తగా ముందుతరాలకు అందచేయడానికి మనము కూడా ఒక సమిధ అవ్వాలి.

పుష్కరాల అపోహాలు.

ఆది కవి మరియు మహాకవి శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్రామయణంలో పుష్కర ప్రశంశ లేనే లేదు ఆకాలంలో మహా నదులు లేవా? శ్రీరామడు తనరాజధానిగాచేసుకుని పాలించిన అయోధ్య చెంతనే ప్రవహించుచున్న సరయూనదికి పుష్కరము లెందుకు లేవు? వ్యాసవిరచిత మహాభారతములో కూడా పుష్కర ప్రశంశలేదు ఎందువలన? మహాభారతకాలమున ఈనదులులేవా? శ్రీమద్భావతము దశమ స్కందమందు శ్రీకృష్ణుడు సకుటుంబముగా గ్రహణ స్నానము చేయుటకు వెళ్ళెనని చెప్పబడినది...... పుష్కరములు ఆశేతుహిమాచల పర్యంతముగల కొన్ని నదీనదముకు ఆ సమీపమునందును..సుదూరప్రాంతములందునివసించు వారలు కనీసం 12సంవత్సరముకొకమారైననూ కలసికొని సామాజిక సంబంధమును ధృడపరచుకొనుటకు....... సౌరకుటుంబములోని గ్రహములలో శుభగ్రహముగా పరిగణించబడిన బృహస్పతి భచక్రములోని పన్నెండు రాశులలో సంచరిచుకాలమును ననుసరించి ఒకరాశినుండి మరోరాశి ప్రవేకాలమున కొన్ని ముఖ్య జీవనదులకు...మరికొన్ని ఉపనదులకు కూడా పుష్కర ప్రాధాన్యమును ఆధ్యత్మికతతోజోడించి ,ఆచరిచ ప్రారంభించినారు...... లలితా సహస్రనామములో152వ.శ్లోకము వ్యాఖ్యానము పరిసీలించిన'పుష్కర' పుష్కరేక్షణా' జగన్మాత జలస్వరూపనియు. భాస్కరుని విపుల వ్యాఖ్యానమున్నది. సంస్కృతమున పుష్కర పదమునకు అమరకోశమందు వివిధ అర్థములివ్వబడినవి...... కాబట్టి వైదిక,పౌరాణి క ప్రాధాన్యతకన్నా... ఆస్తికులు ప్రకృతి ఆరాధలో జీవాధారమైన జలములకు వాటి శ్రోతములకు అధికప్రాధన్యతనిచ్చినారు. పిండప్రదానాదులు...ఆస్తికుల ఆసక్తి శ్రధ్ధాభక్తులవిషయము. స్నాన,పిండ ప్రదానాదులు చేసినవారికి పుణ్యము రావచ్చును.రాక పోవచ్చును. చేయనివారికి,చేయలేనివారికి పాపము మాత్రము రాదు. ప్రజలను వుపన్యాసప్రవచనములతో భయభ్రాతులను చేయుట నిందనీయము.

హారతి

హారతి ఆలయంలోకి వెళ్లి ఆ దైవాన్ని దర్శించుకున్నా, ఇంట్లోనే ఉండి పూజలు నిర్వహించినా.... హారతి ఇవ్వనిదే మన మనసుకి తృప్తిగా ఉండదు. షోడశోపచారాలలో ఒకటైన హారతి లేనిదే, పూజ సంపూర్ణం కాదు. మరి ఆ హారతిని ఎందుకు ఇస్తామంటే... - హారతిని సాధారణంగా కర్పూరంతోనే ఇస్తాము. ఈ కర్పూరం అనేది సంస్కృత పదం. వేదకాలం నుంచీ మన జీవన విధానంలో ఇమిడిపోయిన పదార్థం. అందుకే ఆంగ్లంలోని ‘camphor’ అనే మాట సైతం కర్పూరం అన్న పదం నుంచే వచ్చింది. - ఆలయంలోకి ప్రవేశించిన భక్తుడు ధ్వజస్తంభానికి మొక్కుతూ, ప్రదక్షిణలు చేస్తూ, భగవన్నామస్మరణను సాగిస్తూ... చివరికి గర్భాలయాన్ని చేరుకుంటాడు. ఆ గర్భాలయంలోని దైవం నూనెదీపాల వెలుగులో అస్పష్టంగా కనిపిస్తే, అతని మనసులో ఏదో ఒక మూల అసంతృప్తి కలగడం సహజం. హారతి ప్రకాశంతో ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దేదీప్యమానంగా చూసే అవకాశం కలుగుతుంది. అప్పటివరకూ భగవద్దర్శనం కోసం తపించిపోయిన మనసు సేద తీరుతుంది. ఇప్పటికీ కొన్ని దక్షిణాది రాష్ట్రాలలో ఒక్కసారి ఆ భగవంతుని చూపించండి అని భక్తులు అడగడం, పూజారిగారు హారతిని వెలిగించి వలయాకారంగా తిప్పుతూ ఆ మూర్తిని దర్శింపచేయడం జరుగుతుంటుంది. - ఒకప్పుడు ఆలయాలలో ఎలాంటి కృత్రిమమైన దీపాలూ ఉండేవి కావు. పైగా గాలి కూడా చొరబడని రాతితో ఆ నిర్మాణాలు సాగేవి. అలాంటి ప్రదేశాలలో తేమ అధికంగా ఉండటం సహజం. ఈ తేమతో దుర్వాసన, సూక్ష్మక్రిములు దరిచేరక తప్పదు. కర్పూరానికి సూక్ష్మక్రిములను సంహరించే శక్తి, అంటువ్యాధులను నివారించే గుణం ఉన్నాయని ప్రాచీన వైద్యుల నమ్మకం. ఇక కర్పూరం వెలిగిస్తే... దుర్గంధం అన్న మాట ఎక్కడిది. - ఇప్పుడంటే కర్పూరపు తయారీలో రసాయనాలను ఉపయోగిస్తున్నారు. కానీ ఒకప్పుడు అంతటి సాంకేతికత ఎక్కడిది! దానిని పూర్తిగా కర్పూరం చెట్ల నుంచే సేకరించేవారు. ఆ రకంగా ఫలపుష్పార్చనకూ, ధూపదీపాలకూ పూర్తిగా వృక్షాల మీదే ఆధారపడేవారు. పూజ అంతా ప్రకృతి సిద్ధంగానే సాగేది. - భగవంతునికి అందించిన హారతిని కళ్లకు అద్దుకోవడం సహజం. ఈ ప్రక్రియతో కళ్లకి చలువ చేసే మాట అటుంచి, భగవంతుని మూలవిరాట్టుని నేరుగా తాకలేము కాబట్టి, ఈ హారతి ద్వారా ఆయనను స్పర్శించుకుంటున్నామన్న తృప్తి కలుగుతుంది. - హారతితో పాటుగా ఘంటానాదాన్ని చేయడం సహజం. అదే సమయంలో మనం కళ్లు మూసుకుని హారతిని అద్దుకుంటూ ఉంటాము. అంటే మనసు, చెవులు, ఆఘ్రానించే శక్తీ, స్పర్శా... ఇన్ని ఇంద్రియాలు భగవంతుని ధ్యానంలో లగ్నమవుతాయి. చివరగా.... కర్పూరానికి రెండు సుగుణాలు ఉన్నాయి. ఒకటి ఎలాంటి అవశేషమూ మిగలకుండా దహించుకుపోవడం. రెండు- సుగంధాన్ని, ప్రకాశాన్ని వెదజల్లడం. బహుశా మనిషి జీవితం కూడా ఇలాగే సాగాలన్నది మన పెద్దల అభిలాష కాబోసు. భక్తుడు ఎలాంటి కర్మ ఫలమూ మిగలకుండా, మోక్షం వైపుగా సాగిపోవాలనీ... జీవించినంతకాలమూ జ్ఞానమనే ప్రకాశాన్నీ, సద్గుణాలు అనే సుగంధాలనీ వెదజల్లుతూ ఉండాలనీ పెద్దల అభిమతం కావచ్చు

పుట్టిన రోజు చేసుకునే విధానం.

రాబోయే సంవత్సరం అంతా ఎటువంటి పీడ లేక సుఖ శాంతులతో, శుభావహంగా ఉండాలని కోరుతూ చేసే క్రియా కలాపమే పుట్టిన రోజు వేడుక. దీనికి మన పెద్దలు ఒక పద్ధతిని సూచించారు. ఉదయం (ఒకప్పుడు అందరు సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచే వారు. కనుకనే వారికి కంటి చూపు బాగుండేది.) నిద్రలేవగానే ఇంట్లో పెద్దలు తలకి నూనె పెట్టి , మంగళ హారతి ఇచ్చిన తరువాత అభ్యంగన స్నానం చేయాలి. క్రొత్త బట్టలుధరించి, ఇంట్లో దేవుడికి నమస్కారం చేయాలి. పెద్దలకు నమస్కరించి వారి ఆశీస్సులను తీసుకోవాలి. వీలైతే దేవాలయానికి వెళ్ళటం ఉత్తమం. భోజనంలో పరమాన్నం తప్పక చేస్తారు సంప్రదాయం తెలిసిన పెద్దలు. పాలు (వీలైతే ఆవు పాలు), బెల్లంతో వండిన అన్నం శుభప్రదం. దేవతా ప్రీతికరం. ఆయుర్వృద్ధి కరం. అందుకనే అన్ని శుభ కార్యాలలో పరమాన్నం చేస్తారు. పూర్వపు రోజుల్లో పిల్లల పుట్టిన రోజంటే పేరంటం చేసే వారు. ముత్తైదువ లందరు కలిసి పాటలు పాడుతూ మంగళ హారతులిచ్చే వారు. అక్షతలు వేసి ఆశీర్వదించే వారు. వారందరికీ పసుపు కుంకుమలు, తాంబూలాలతో పాటు తమ శక్తి కొద్ది కానుకలు కూడా ఇచ్చే వారు. ఇపుడు పేరంటాల స్థానంలో పార్టీలు వచ్చాయి. మంగళ హారతి స్థానాన్ని అమంగళ కరమైన దీపాలార్పటం ( కొవ్వొత్తుల నార్పటం) ఆక్రమించింది. దీపం వెలిగించటం శుభం. దీపం ఆర్పటం అశుభం. శుభ కార్యాన్ని దీపం వెలిగించి ప్రారంభించటం భారతీయ సంప్రదాయం. పుట్టిన రోజు పండుగ ,అంటే శుభ కార్యమే కదా. దేవతా ప్రీతికరంగా, దైవానుగ్రహం కోరి చేసే పనిలో కోడి గ్రుడ్డుతో చేసిన కేకు ప్రాధాన్యం వహిస్తోంది . ఈ రెండు పద్ధతుల్లో ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా! మరి , పుట్టిన రోజుని ఈ రోజులకు తగినట్టుగా చేసుకునే విధానం ఏదైనా ఉందా? అంటే, ఉన్నదనే చెప్పాలి. మనం చాంద్ర మానాన్ని అనుసరించే వారం కనుక తిథుల ననుసరించి పుట్టిన రోజు జరుపుకోవటం సరైన పద్ధతి. ఇంట్లో అమ్మ కానీ, ఇంకా పెద్దవారు కాని, ముఖాన బొట్టు పెట్టి, నువ్వుల నూనెతో తల అంటి, హరతిచ్చాక అభ్యంగన స్నానం చెయ్యాలి. కొత్త బట్టలు ధరించి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. అంత కన్నా ముందు ఇంట్లో దేవుడికి, పెద్దలకు నమస్కారం చేయాలి. పేరంటం అన్నది పాత పద్ధతి అయి పోయింది . కనుక పార్టీ అనుకునే విధంగా బంధు మిత్రులని ఆహ్వానించి ఇష్ట దైవం ముందు ఎన్నో పుట్టిన రోజో అన్నీ దీపాలు “ ఉద్దీప్యస్వ .................నిరృతిమ్ మమ” అనే మంత్ర చదువుతూ వెలిగించి, వేడుక ప్రారంభించాలి. పాలు తేనె కలిపిన మిశ్రమాన్ని పాత్రలో పోసి, ఉద్ధరిణ (చెమ్చా)తో గుండ్రంగ కలుపుతూ “ త్ర్యంబకం యజా మహే సుగంధిం పుష్టి వర్ధనం ...... “ అనే మృత్యుంజయ మంత్రాన్ని ముమ్మారు పలకాలి. దానిని స్వీకరించాలి. మెత్తని మధుర పదార్థాన్ని ( హల్వా , కలాఖండ్ వంటివి) పళ్ళెంలో నింపి, దానిపై వజ్రపు గుర్తుని (ముందుగా మిఠాయిని సగం చేస్తూ మధ్యలో నిలువు గీత, దానిని ఖండిస్తూ అడ్డ గీత, ఈ గీతల నాలుగు కొనలని కలుపుతూ నాలుగు గీతలు, వీటి నన్నింటిని చుట్టి పరిధిలాగా ఒక వృత్తము ) నెమ్మదిగా , మృదువుగా లిఖించాలి. ఆ సమయంలో వచ్చిన వారందరు మృత్యుంజయ మంత్రాన్ని చదువుతూ ఉండాలి. అప్పుడు మంగళ హారతి నిచ్చి పెద్దలు అక్షతలను వేసి ఆశీర్వదించాలి. చిన్న వారు పాదాల వద్ద పూలు ఉంచి , నమస్కారం చేసి, వారి ఆశీర్వచనం తీసుకోవాలి. అప్పుడు ఆ తీపి పదార్థాన్ని అందరూ భగవంతుని ప్రసాదంగా తీసుకోవాలి. ఆ పై విందులు వినోదాలు యథేచ్ఛ. ఈ విధానం లో పెద్దల ఆశీస్సులు, భగవంతుని అనుగ్రహం పొందటం, ఆనందం ఉన్నాయి . పుట్టిన రోజు చేసిన పని ఏదైనా సంవత్సరమంతా నిరాఘాటంగా సాగుతుందని నమ్మకం . అందుకని ఆ రోజు మంచి పనులు చేయాలనుకుంటారు. అందుకనే బీదలకు అన్న దానం , అనాథాశ్రమాల్లో, ఆసుపత్రుల్లో పళ్ళు, ఫలహారాలు , వస్త్రాలు, దుప్పట్లు మొదలైనవి పంచటం వంటి సామాజిక కార్య క్రమాలు చేసి తమకు వారి ఆశీర్వాదం లభించిందని తృప్తి పొందుతూ ఉంటారు. నిజానికి జీవితంలో ఒక సంవత్సరం గిర్రున తిరిగి వచ్చిందంటే , కొత్త సంవత్సరం మొదలయిందంటే అప్పటివరకూ, కనీసం జరిగి పోయిన సంవత్సరం, ఏం సాధించామని పర్యాలోచన చేసుకొని లక్ష్య సాధనకు కేటాయించ బడిన సమయంలో ఒక ఏడాది అయి పోయింది కనుక ఇక ముందు ఏమి సాధించ దలచుకున్నామో దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం. అందుకనే అప్పుడు పెద్దల ఆశీస్సులతో పాటు మార్గ దర్శనం అవసరమౌతుంది

హనుమంతునికి తమలపాకుల పూజ.

అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ కలుగు లాభాలు.







సీతమ్మతల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు, రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని రంచేసినవాడు, రామలక్ష్మణులు నీకు మిత్రులే కాని, వాలి పంపగా వచ్చినవారు కారని సుగ్రీవునికి శాంతిని కలుగచేసినవాడు, నీ అహంకారం, నీ పరదారాపేక్షే నీకు మృత్యువును తెచ్చిపెడుతుంది అని నిర్భయంగా రావణునికి చెప్పినవాడు ఆంజనేయుడు. ఆంజనేయుడు శివాంశసంభూతుడని శాస్త్ర వచనం. శివుని 11వ అవతారంగాను, వైశాఖ మాస బహుళ దశమి తిథి హనుమజ్జయంతిగాను పరాశర సంహిత తెలియచేస్తుంది. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు కనుక వాయుసుతుడని పేర్గాంచాడు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ అఖ్ఖర్లేదు. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది.అదేంటంటే- ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దక వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు.అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది. 










మరో కథ ప్రకారం.. అశోకవనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు. అంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితం.






శతవృద్ధ జిల్లేడు, తెల్లజిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటితోటలో పూజించుట వలన సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితాలను ఇస్తుంది. అరటిపండ్ల నివేదన, సింధూర సమర్పణ, శని, మంగళవారములలో తమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి. హస్తమృగశీర్షానక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు. భూత, ప్రేత పిశాచాది బాధలు, రోగాలు, కష్టాలు తొలగడానికి అభీష్టసిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణములు శ్రేష్ఠం. స్వామి మహిమలు పరాశర సంహిత, ఉమాసంహిత, హనుమ సంహిత తదితర గ్రంథాలు చెబుతున్నాయ. హనుమారాధన భోగ, మోక్షములను రెండింటినీ ఇస్తుంది. రామ భజన ఎక్కడ జరుగుతున్నా హనుమంతుడు వచ్చి కూర్చుంటాడని భక్తుల విశ్వాసం. ఆంజనేయుని చూసి మానవులు పట్టుదల కార్యదీక్షాదక్షత, మాట నేర్పు ఇలాంటివెన్నో తెలుసుకోవాలి.







 అంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన కలుగు ప్రయోజనాలు.






1. ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది. 2. ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబందమైన పీడలు తొలగిపోతాయి. 3. సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లబిస్తుంది. 4. కొందరు చిన్న పిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు. చాలా నీరసంగా కనిపిస్తుంటారు. ఇలాంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు. 5. వ్యాపారంలో చాల నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. 6. ఏ వ్యక్తి అయితే హీనంగా చుడబడుతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది. 7. శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది 8. వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు నయమవుతాయి. 9. సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది. 10. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్ధించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం కలుగుతుంది. 11. వాద ప్రతివాదాల్లో స్వామిని ప్రార్ధించిచి తమలపాకుల హరాన్ని సమర్పించి, ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది. 12. తాంబూల దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది. పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దేనికి కూడా పర్ణ ప్రసాదమనే పేరు.








బొట్టు అనేది పార్వతీదేవి చిహ్నం.

'బిందు' అనే సంస్కృత పదం నుండి 'బిందీ' వచ్చింది, దీని అర్థం బొట్టు. సాధారణంగా ఇది కుంకుమ పౌడర్ నుండి తయారు చేయబడిన ఒక ఎర్రటి బొట్టు బిళ్ళ. హిందూ ధర్మానికి చెందిన మహిళలు దీనిని తమ నుదుటి మీద, రెండు కనుబొమ్మల మధ్య పెట్టుకుంటారు. దీనిని పార్వతీదేవి చిహ్నంగా పరిగణిస్తారు.

ఉంగరపు వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే…! నుదుట బొట్టుపెట్టుకునేందుకు పసుపుతో చేసిన కుంకుమ శ్రేష్టమైనది. పసుపు మన శరీరంపై అమితమైన ప్రభావాన్ని చూపుతుంది. రక్తాన్ని శుభ్రపరిచి శరీరకాంతిని ఇనుమడింప జేస్తుంది. కురుపులను, గాయాలను మాన్పుతుంది. కుష్ఠు రోగాన్ని కూడా రూపుమాపే శక్తి పసుపుకు ఉంది. కఫాన్ని అరికడుతుంది. కుంకుమను అమ్మవారి ప్రసాదంగా భావించి, సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే అని జగన్మాతను ప్రార్థిస్తూ, నుదుటన పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగుతాయి. ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి చేకూరుతుంది. నడిమి వేలితే పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది. బొటన వేలుతో పెట్టుకుంటే పుష్ఠి కలుగుతుంది. చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అసలు నొసటన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? మన శరీరంలో జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలన మిగిలిన అవయవాలకు ఒక్కొక్క అధి దేవత ఉన్నారు. వారిలో లలాట అధిదేవత బ్రహ్మ. పరమ ప్రమాణములైన వేదాలు బ్రహ్మ ముఖకమలం నుండి వెలువడ్డాయి. అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మ స్థానమైన లలాటం స్థానమైంది. ద్వాదశ పుండ్రాలను పెట్టుకోక పోయినా, కనీసం బొట్టు అయినా పెట్టుకోవాలి. అప్పుడు దేవుని పూజించినట్లే అవుతుంది. చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైన నొసటిపై ఎరుపురంగు వ్యాప్తిలోకి వచ్చింది. ఇందులో నిగూఢార్థముంది. మనలోని జీవుడు జ్యోతి స్వరూపుడు. ఆ జీవుడు జాగ్రదావస్థలో భ్రూమధ్యంలోని ఆజ్ఞాచక్రంలో సంచరిస్తుంటాడు. మన నొసటిపై పెట్టుకున్న కుంకుమబొట్టుపైన సూర్యకాంతి ప్రసరిస్తే, కనుబొమల మధ్య నుండే ఇడా పింగళ నాడులు సూర్యశక్తిని గ్రహించి శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి. ప్రాణశక్తికి కారణమైన నరాలకు కేంద్రస్థానము కనుబొమల మధ్య నుండే ఆజ్ఞాచక్రము. కుంకుమ బొట్టును పెట్టుకోవడం వల్ల ఆజ్ఞాచక్రాన్ని పూజించినట్లే అవుతుందని పెద్దలంటారు. మానసిక ప్రవృత్తులను నశింపజేసేదే ఆజ్ఞాచక్రమని పురోహితులు అంటున్నారు.

ఈ బొట్టు మహిళలను మరియు వారి భర్తలను కాపాడే స్త్రీ శక్తిని సూచిస్తుందని హిందువులు నమ్ముతారు. సాంప్రదాయకంగా ఇది పెళ్ళి అయిపోయిందని సూచించే ఒక చిహ్నం. దీనిని హిందూ వివాహిత స్త్రీలు పెట్టుకుంటారు. దీనిని టిక్క అని కూడా పిలుస్తారు. ఈరోజుల్లో ఆకర్షణీయమైన బొట్టు బిళ్ళలు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్ గా మారి పోయింది మరియు పెళ్ళికాని కన్యలు మరియు స్త్రీలు కూడా దీనిని పెట్టుకుంటున్నారు. ఈనాటి బొట్టు వృత్తాకారానికే పరిమితం కాకుండా అండాకారం, నక్షతాకారం, గుండె ఆకారం మొదలైన వివిధ ఆకారాల్లో లభిస్తున్నది. అంతేకాక, అది నీలిరంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, నారింజ రంగు మొదలైన వివిధ రంగుల్లో కూడా లభిస్తున్నది. అలాగే కేవలం కుంకమ పౌడర్ తో మాత్రమే తయారు చేసే పద్ధతికి స్వస్తి చెప్పి, ఈరోజుల్లో దీనిని రకరకాల పదార్థాలతో తయారు చేస్తున్నారు. ఇంకా ఇది రకరకాల డిజైన్లలో మరియు గాజు, తళతళలాడే ఇతర పదార్థాలతో తయారు అవుతున్నది. మంగళసూత్రం మంగళసూత్రం అంటే శుభాన్ని కలుగజేసే ఒక దారపు తాడు. ప్రత్యేకంగా దీనిని తమ పెళ్ళి అయిందని సూచించే చిహ్నంగా హిందూ ధర్మ స్త్రీలు మెడలో ధరిస్తారు. నల్లపూసలతో నిండిన రెండు దారపు తాళ్ళు కలిగి ఉండి మధ్యలో మామూలుగా ఒక బంగారం బిళ్ళ ఉంటుంది. చెడు నుండి కాపాడే రక్షణ కవచంగా నల్లపూసలు పనిచేస్తాయని వారి నమ్మకం. ఇంకా అవి ఆ స్త్రీ వివాహాన్ని మరియు ఆమె భర్త ప్రాణాన్ని కాపాడతాయని వారి నమ్మకం. దక్షిణ భారతదేశంలో, మంగళసూత్రాన్ని తాళి అని పిలుస్తారు. ఒక సన్నటి బంగారు ఛైను లేదా దారపు త్రాడుకు వ్రేలాడదీసిన ఒక చిన్న బంగారు నగ. హిందూ వివాహిత స్త్రీలు ఎట్టి పరిస్థితులలోనూ మంగళసూత్రాన్ని తొలగించకూడదు. ఆమె విధవరాలు అయినప్పుడు మాత్రమే అది కత్తిరించబడుతుంది.

చర,స్ధిర,ద్విస్వభావ రాశులు

చర,స్ధిర,ద్విస్వభావ రాశులు.
మేషం,కర్కాటకం,తుల,మకర రాశులు చర రాశులు.


వృషభం,సింహం,వృశ్చికం,కుంభ రాశులు స్ధిర రాశులు.









మిధునం,కన్య,ధనస్సు,మీనం రాశులు ద్విస్వభావ రాశులు.







చర రాశులు:-చర రాసులలో జన్మించిన వారికి చురుకుదనం,శీఘ్ర గమనం,దైర్యం,సాహసం,కొత్త విషయాల యందు ఆసక్తి,పరిసరాలు,పరిస్ధితులు,వృత్తులు,దినచర్యలలో మార్పులు కోరుకుంటూ ఉంటారు.క్షణ కాలంలో నిర్ణయాలు తీసుకుంటారు.ఉత్సాహము చూపుట,ఎప్పుడు తిరుగుతుండుట వీరి లక్షణాలు.





స్ధిర రాశులు:-స్ధిర రాశులలో జన్మించిన వారికి స్ధిరమైన అభిప్రాయాలు,సుఖ జీవనం,ఉన్న చోటును,ఇంటిని వదులుకోలేక వచ్చిన అవకాశాలు జార విడిచికొందురు. పొలం,గృహం,స్ధిరాస్తులపైనా మక్కువ చూపిస్తారు.పనులు కార్య రూపం దాల్చవలెనన్న వీరి సహాయం తీసుకొన్నచో పనులు కార్య రూపం దాల్చేదాకా నిద్రపోరు.మొండిగా మూర్ఖంగా ప్రవర్తిస్తారు.






ద్వి స్వభావ రాశులు:-ద్విస్వభావ రాశులలో జన్మించిన వారికి పలు అంశాలపైనా సమన్వయం ఉండును.వ్యాక్యాతలు,భోధన చేసేవారుగా రాణిస్తారు.సందేహాలు ఎక్కువ,సంకోచాలు ఎక్కువ,ఏ విషయాన్ని నిర్దారించలేరు.తొందరగా ఒక నిర్ణయానికి రాలేరు .ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తారు.ఎంతటి సమస్యనైనా పరిష్కరించగలరు.స్వతంత్రంతో ఏ పని చేయలేరు.













జోతీష్యంలో కాలం

కాలమే లేకపోతే ప్రారంభమూ ఉండదు, అంతమూ ఉండదు. ఆద్యంతాలు లేకపోతే సృష్టే ఉండదు. కాలంలోనే మన ఆస్థిత్వం ఉన్నది. కాలంలోనే మనం జన్మిచాం. కాలంలోనే మనం మరణిస్తాం. ఏ వ్యక్తి ఐనా కాల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే, కాలం ధర్మాన్ని అర్థం చేసుకున్నట్లయితే, కాల ధర్మానికి అనుగుణంగా నడుచుకున్నట్లయితే, ఆ వ్యక్తి జయుడే కాదు, విజయుడవుతాడు. ఒకరిక్కడ సాధించవచ్చు, మరొకరు మరొకచోట. కాలధర్మానికి అనుగుణంగా లేని వ్యక్తి జీవిత ప్రక్రియలో నలిగి నశించిపోతాడు. జీవితం అన్నది కాలం ఆడే ఒక ఆట. దీన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే ఈ దేశంలోని ప్రాచీన ఋషులు, మునులు, యోగులు కాలంపై అత్యంత శ్రద్ధ పెట్టారు. కాలం అంటే మన భావన ప్రస్తుతము, మన చుట్టూ వెనువెంటనే ఉన్న సృష్టికి – భూగోళానికీ, సౌరవ్యవస్థకూ – సంబంధించినది. 108 సంఖ్య ప్రాధాన్యత ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్ర రచన అయినటువంటి సూర్యసిద్ధాంతం ప్రకారం సూర్యకాంతి, 0.5 నిమిషాలలో 2,202 యోజనాలు ప్రయాణిస్తుంది. యోజనం అంటే తొమ్మిది మైళ్లు. 2,202 యోజనాలంటే 19,818 మైళ్లు. ఇక్కడ నిమిషం అంటే 16/75 సెకండ్లు. అర నిమిషం అంటే 8/75 సెకండ్లు. అంటే 0.106666 సెకండ్లు. 0.106666 సెకండ్లకు 19,818 మైళ్ల వేగం అంటే అది సెకండుకు 185,793 మైళ్లు. ఇది దాదాపు ఆధునిక శాస్త్రీయ గణాంకాలకు చాలా సమీపంగా ఉంది. ఇప్పుడు కాంతి వేగాన్ని సెకండుకు 186,282 మైళ్లుగా నిర్ణయించారు. ఆధునిక విజ్ఞానశాస్త్రం ఈ ఫలితాన్ని సాధించడానికి ఎంతో ప్రయత్నం చేసింది, ఎన్నో పరికరాలు ఉపయోగించింది. కాని, కొన్నివేల సంవత్సరాల కిందటే, మానవ వ్యవస్థ, సౌరవ్యవస్థ కలసి ఎలా పనిచేస్తాయో గమనించడం ద్వారా ఈ వేగాన్ని వాళ్లు కనుక్కోగలిగారు. సూర్యుడికీ భూమికీ ఉన్న దూరం, చంద్రుడికీ భూమికీ ఉన్న దూరం, భూభ్రమణ విధానం, దానికున్న ప్రభావం – వీటన్నిటినీ శ్రద్ధగా పరిశీలించారు. సూర్యుడికీ భూమికీ ఉన్న దూరం, చంద్రుడికీ భూమికీ ఉన్న దూరం, భూభ్రమణ విధానం, దానికున్న ప్రభావం – వీటన్నిటినీ శ్రద్ధగా పరిశీలించారు. సూర్యుడి వ్యాసాన్ని 108 తో గుణిస్తే సూర్యుడికీ, భూమికీ మధ్య దూరం వస్తుంది. అట్లాగే చంద్రుడి వ్యాసాన్ని 108 తో గుణిస్తే చంద్రుడికీ, భూమికీ మధ్య దూరం వస్తుంది. సూర్యుడి వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు. అందుకే మనం హారంలో 108 పూసలు గుచ్చుతాం. ఇట్లా నేను అద్భుతమైన అంకెలెన్నో చెప్పగలను. కాని అన్నిటికంటే ముఖ్యమైంది కాలనిర్మాణానికీ, మానవ శరీర నిర్మాణానికీ ఉన్న గాఢ సంబంధం. ఇది మీకు తెలిసిన విషయమే – భూగోళం ఇంచుమించు గుండ్రంగా ఉంది. దాని కక్ష్య స్వల్పవక్రంగా ఉంది. దాని ప్రయాణం స్వీయ భ్రమణంతో వృత్తాకారంలో జరుగుతుంది. ఒక ఆవృత్తి పూర్తికావడానికి 25,920 సంవత్సరాలు పడుతుందని మనకిప్పుడు తెలుసు. ఈ వంపు ప్రధానంగా చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ప్రభావం వల్ల కలుగుతుంది. ఈ ఆవృత్తి కాలాన్ని యుగచక్రం అంటాం. ఒక్కొక్క యుగచక్రంలో ఎనిమిది యుగాలుంటాయి. భూమి, మనిషి ఒక అక్షీయ భ్రమణ చక్రం – 25,920 ని 60 (ఆరోగ్యవంతుడైన మనిషి గుండె నిమిషానికి ఇన్నిసార్లు కొట్టుకుంటుంది) తో భాగిస్తే – 432 వస్తుంది. ఈ 432 అనే సంఖ్య అనేక సంస్కృతుల్లో వస్తుంది – నార్స్ సంస్కృతి, ప్రాచీన యూదు సంస్కృతి, ఈజిప్టు సంస్కృతి, మెసెపొటేమియన్ సంస్కృతి, అలాగే భారతీయ సంస్కృతి. 432 ఎందుకు? మీ ఆరోగ్యం చక్కటి స్థితిలో ఉంటే మీ గుండె నిమిషానికి 60 సార్లు కొట్టుకుంటుంది. అంటే గంటకు 3600 సార్లు. అంటే రోజుకు 3600×24 సార్లు, అంటే 86,400 సార్లు. మీరు 864 ను 2 తో భాగిస్తే 432 వస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉంటే నిమిషానికి 15 సార్లు శ్వాసిస్తారు. మీరెంతో సాధన చేస్తే అది 12 కు వస్తుంది. నిమిషానికి 15 సార్లు శ్వాస అంటే గంటకు 900 సార్లు, రోజుకు 21,600 సార్లు. 216 ను 2 తో గుణిస్తే 432 వస్తుంది. మీరు భూమి చుట్టు కొలతను తీసుకుంటే దాన్ని నాటికల్ మైళ్లలో కొలవాలి. భూగోళ స్వభావానికి అదే అసలైన కొలమానం . మనం వాడే కొలమానాలు మన సౌకర్యానికి సంబంధించినవి. ఒక వృత్తంలో 360 డిగ్రీలు ఉంటాయని మీకు తెలుసును. అట్లాగే భూగోళం పైనా 360 డిగ్రీలుంటాయి. ప్రతి డిగ్రీని 60 నిమిషాలుగా విభజించవచ్చు. ఒక నిమిషం ఒక నాటికల్ మైలు. అంటే భూమధ్యరేఖ వద్ద భూమి చుట్టుకొలత 21,600 నాటికల్ మైళ్లు – మీరు రోజుకు శ్వాస తీసుకునే పర్యాయాల సంఖ్యకూడా అదే. అంటే భూగోళం తన చుట్టూ తాను సమయం ప్రకారం పరిభ్రమిస్తూ ఉంటేనే మీరు బాగుంటారు. కాని భూపరిభ్రమణం సమయం తప్పితే మన పరిస్థితి అధోగతి. మీరు దానికి అనుగుణంగా లేకపోయినా అది మీకు మంచిదికాదు. మీరు కాలంపై స్వారీ చేయకపోతే మీ జీవితం అంతంత మాత్రంగానే ఉంటుంది – బహుశా కష్టాలమయంగా కూడా ఉండవచ్చు. కాలం అన్నది మనం కనుక్కున్న భావన కాదని చెప్పడానికే ఇదంతా – కాలం అన్నది వ్యవస్థలో గాఢంగా వేళ్లూనుకొని ఉంది, మన నిర్మాణమే దానికి అనుగుణంగా జరిగింది. మనం మహాభారతం చదివితే యుగాల గురించీ, అవి ఎలా నడుస్తాయన్న దాని గురించీ ఎన్నో విషయాలు చెప్పారు. మానవజీవితంపై కాలప్రభావాన్ని మీరు పరిశీలించాలని నా కోరిక. ఇదేదో ఎవరో ఊహించింది కాదు – ఇదొక అద్భుతమైన, గొప్ప విజ్ఞానం. యోగా ఎల్లప్పుడూ దీనితో గాఢంగా పెనవేసుకుని ఉంది. దాని గురించి సిద్ధాంతాలు చేయడంలో యోగా దృష్టి పెట్టదు. అభ్యాసంతో మనం మన శరీరాన్ని సృష్టికీ, కాలాలకీ, స్థలాలకీ అనుగుణంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తాం. ఎందుకంటే వాటికి అనుగుణంగా లేకుండా మనం ముందుకు సాగలేం. మీరు కాలంపై స్వారీ చేయకపోతే మీ జీవితం అంతంత మాత్రంగానే ఉంటుంది – బహుశా కష్టాలమయంగా కూడా ఉండవచ్చు. మీరు కాలంపై స్వారీ చేయగలిగితే మీ జీవితం అసాధారణంగా ఉంటుంది – మానవ దేహం , మానవ మేధస్సు ఇందుకనుగుణంగానే రూపొందించబడ్డాయి. సంక్షిప్తంగా అంకెలు : 0.5 నిమిషానికి 2202 యోజనాలు యోజనం = 9 మైళ్లు నిమిషం = 16/75 సెకండ్లు 2202 యోజనాలు 0.5 నిమిషంలో = 2202×9 మైళ్లు 0.5× (16/75) సెకండ్లు = 19818 మైళ్లు 0.10666 సెకండ్లలో = 185,793 మైళ్లు సెకండుకు.

సబ్బు (Soap)

*ఈ సారి సబ్బు (Soap) కొనేటప్పుడు ప్యాకెట్ మీద రాసి ఉన్న ఈ విషయాన్ని గమనించండి.*



శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మనకు అత్యంత అవసరం. ఈ నేపథ్యంలోనే రోజుకి కనీసం రెండు సార్లయినా స్నానం చేయాలని చెబుతారు. అయితే రెండుసార్లు కాకున్నా ఒకసారి చేసినా శరీరాన్ని మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే ఇందుకోసం ఎవరైనా సాధారణంగా ఏం వాడతారు? సబ్బు లేదా బాడీ వాష్. బాడీ వాష్ అనేది హై క్లాస్ వర్గీయులు ఎక్కువగా వాడేది.






ఇక సబ్బు విషయానికి వస్తే దీన్ని అత్యధిక శాతం మంది వాడతారు. అయితే ఏ సబ్బు వాడినా అది శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుతుందని ఎలా చెప్పగలరు? సదరు కంపెనీ ఇచ్చే యాడ్‌ని చూసా? కాదు. అలా చెప్తే మీరు పొరపాటు పడినట్టే. ఎందుకంటే లాభాపేక్ష కోసం కంపెనీలు ఎన్నో రకాల ప్రకటనలు ఇచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటాయి. అయితే సబ్బు ఎంత సమర్థవంతమైనది, ఎంత నాణ్యంగా పనిచేస్తుంది, ఎంతటి శుభ్రతనిస్తుంది ఎలా తెలుసుకోవడం? అందుకోసమే టీఎఫ్‌ఎం అనే పదం ఉపయోగపడుతుంది.








మీరు వాడుతున్న సబ్బు ప్యాకింగ్‌ను ఒక్క సారి సరిగ్గా గమనించండి. దానిపై టీఎఫ్‌ఎం 70శాతం, 67 శాతం, 82 శాతం అని రాసుందా? ఆ అదే! ఇప్పుడదే సబ్బు నాణ్యతను ధ్రువీకరిస్తుంది.అసలు టీఎఫ్‌ఎం అంటే ఏమిటి? టీఎఫ్‌ఎం (TFM) అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్. అంటే ఈ టీఎఫ్‌ఎం శాతం ఎంత ఎక్కువగా ఉంటే ఆ సబ్బు అంతటి నాణ్యమైన గుణాలను కలిగి ఉంటుందని అర్థం.భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) ప్రకారం సబ్బులను 3 రకాలుగా విభజించారు. అవి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3.76 అంతకు మించి శాతం ఉన్నవి

గ్రేడ్ 1 సబ్బులు. 70 నుంచి 75 వరకు టీఎఫ్‌ఎం ఉంటే అవి గ్రేడ్ 2 సబ్బులు. 60 నుంచి 70 శాతం మధ్యలో టీఎఫ్‌ఎం ఉన్నవి గ్రేడ్ 3 సబ్బులు. గ్రేడ్ 2,3 సబ్బుల్లో ఫిల్లర్లు అధికంగా ఉంటాయి.





ఇవి సబ్బు రూపంలో మామూలుగానే కనిపిస్తాయి. కాకపోతే వీటిలో శరీరానికి హాని కలిగించే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సబ్బుల్లో ఆస్బెస్టాస్ వంటి రసాయనాలు కూడా అధికంగానే ఉంటాయి. వీటిని వాడితే చర్మానికి హాని కలుగుతుంది.గ్రేడ్ 2,3 సబ్బులు నీటిలో కలిసిప్పుడు మెత్తగా అయిపోయి చాలా త్వరగా అరిగిపోతాయి. నురగ ఎక్కువ వచ్చినా వాటిని నాసిరకం సబ్బులుగానే పరిగణించాలి. ఎలాంటి చర్మం ఉన్నవారికైనా గ్రేడ్ 1 సబ్బే మంచిది. ఎందుకంటే ఈ సబ్బులు చర్మానికి మృదుత్వాన్ని ఇస్తాయి. దీంతోపాటు అధిక శుభ్రతను కలగజేస్తాయి. అదనపు కెమికల్స్ లేకుండానే సువాసనను ఇస్తాయి.