'బిందు' అనే సంస్కృత పదం నుండి 'బిందీ' వచ్చింది, దీని అర్థం బొట్టు. సాధారణంగా ఇది కుంకుమ పౌడర్ నుండి తయారు చేయబడిన ఒక ఎర్రటి బొట్టు బిళ్ళ. హిందూ ధర్మానికి చెందిన మహిళలు దీనిని తమ నుదుటి మీద, రెండు కనుబొమ్మల మధ్య పెట్టుకుంటారు. దీనిని పార్వతీదేవి చిహ్నంగా పరిగణిస్తారు.
ఉంగరపు వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే…! నుదుట బొట్టుపెట్టుకునేందుకు పసుపుతో చేసిన కుంకుమ శ్రేష్టమైనది. పసుపు మన శరీరంపై అమితమైన ప్రభావాన్ని చూపుతుంది. రక్తాన్ని శుభ్రపరిచి శరీరకాంతిని ఇనుమడింప జేస్తుంది. కురుపులను, గాయాలను మాన్పుతుంది. కుష్ఠు రోగాన్ని కూడా రూపుమాపే శక్తి పసుపుకు ఉంది. కఫాన్ని అరికడుతుంది. కుంకుమను అమ్మవారి ప్రసాదంగా భావించి, సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే అని జగన్మాతను ప్రార్థిస్తూ, నుదుటన పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగుతాయి. ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి చేకూరుతుంది. నడిమి వేలితే పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది. బొటన వేలుతో పెట్టుకుంటే పుష్ఠి కలుగుతుంది. చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అసలు నొసటన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? మన శరీరంలో జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలన మిగిలిన అవయవాలకు ఒక్కొక్క అధి దేవత ఉన్నారు. వారిలో లలాట అధిదేవత బ్రహ్మ. పరమ ప్రమాణములైన వేదాలు బ్రహ్మ ముఖకమలం నుండి వెలువడ్డాయి. అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మ స్థానమైన లలాటం స్థానమైంది. ద్వాదశ పుండ్రాలను పెట్టుకోక పోయినా, కనీసం బొట్టు అయినా పెట్టుకోవాలి. అప్పుడు దేవుని పూజించినట్లే అవుతుంది. చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైన నొసటిపై ఎరుపురంగు వ్యాప్తిలోకి వచ్చింది. ఇందులో నిగూఢార్థముంది. మనలోని జీవుడు జ్యోతి స్వరూపుడు. ఆ జీవుడు జాగ్రదావస్థలో భ్రూమధ్యంలోని ఆజ్ఞాచక్రంలో సంచరిస్తుంటాడు. మన నొసటిపై పెట్టుకున్న కుంకుమబొట్టుపైన సూర్యకాంతి ప్రసరిస్తే, కనుబొమల మధ్య నుండే ఇడా పింగళ నాడులు సూర్యశక్తిని గ్రహించి శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి. ప్రాణశక్తికి కారణమైన నరాలకు కేంద్రస్థానము కనుబొమల మధ్య నుండే ఆజ్ఞాచక్రము. కుంకుమ బొట్టును పెట్టుకోవడం వల్ల ఆజ్ఞాచక్రాన్ని పూజించినట్లే అవుతుందని పెద్దలంటారు. మానసిక ప్రవృత్తులను నశింపజేసేదే ఆజ్ఞాచక్రమని పురోహితులు అంటున్నారు.
ఈ బొట్టు మహిళలను మరియు వారి భర్తలను కాపాడే స్త్రీ శక్తిని సూచిస్తుందని హిందువులు నమ్ముతారు. సాంప్రదాయకంగా ఇది పెళ్ళి అయిపోయిందని సూచించే ఒక చిహ్నం. దీనిని హిందూ వివాహిత స్త్రీలు పెట్టుకుంటారు. దీనిని టిక్క అని కూడా పిలుస్తారు. ఈరోజుల్లో ఆకర్షణీయమైన బొట్టు బిళ్ళలు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్ గా మారి పోయింది మరియు పెళ్ళికాని కన్యలు మరియు స్త్రీలు కూడా దీనిని పెట్టుకుంటున్నారు. ఈనాటి బొట్టు వృత్తాకారానికే పరిమితం కాకుండా అండాకారం, నక్షతాకారం, గుండె ఆకారం మొదలైన వివిధ ఆకారాల్లో లభిస్తున్నది. అంతేకాక, అది నీలిరంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, నారింజ రంగు మొదలైన వివిధ రంగుల్లో కూడా లభిస్తున్నది. అలాగే కేవలం కుంకమ పౌడర్ తో మాత్రమే తయారు చేసే పద్ధతికి స్వస్తి చెప్పి, ఈరోజుల్లో దీనిని రకరకాల పదార్థాలతో తయారు చేస్తున్నారు. ఇంకా ఇది రకరకాల డిజైన్లలో మరియు గాజు, తళతళలాడే ఇతర పదార్థాలతో తయారు అవుతున్నది. మంగళసూత్రం మంగళసూత్రం అంటే శుభాన్ని కలుగజేసే ఒక దారపు తాడు. ప్రత్యేకంగా దీనిని తమ పెళ్ళి అయిందని సూచించే చిహ్నంగా హిందూ ధర్మ స్త్రీలు మెడలో ధరిస్తారు. నల్లపూసలతో నిండిన రెండు దారపు తాళ్ళు కలిగి ఉండి మధ్యలో మామూలుగా ఒక బంగారం బిళ్ళ ఉంటుంది. చెడు నుండి కాపాడే రక్షణ కవచంగా నల్లపూసలు పనిచేస్తాయని వారి నమ్మకం. ఇంకా అవి ఆ స్త్రీ వివాహాన్ని మరియు ఆమె భర్త ప్రాణాన్ని కాపాడతాయని వారి నమ్మకం. దక్షిణ భారతదేశంలో, మంగళసూత్రాన్ని తాళి అని పిలుస్తారు. ఒక సన్నటి బంగారు ఛైను లేదా దారపు త్రాడుకు వ్రేలాడదీసిన ఒక చిన్న బంగారు నగ. హిందూ వివాహిత స్త్రీలు ఎట్టి పరిస్థితులలోనూ మంగళసూత్రాన్ని తొలగించకూడదు. ఆమె విధవరాలు అయినప్పుడు మాత్రమే అది కత్తిరించబడుతుంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయం తెలియచేయండి.