09 September 2016

శనిత్రయోదశి

శనిత్రయోదశి నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. 

సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు. 













ఏ త్రయోదశి అయితే శనివారము తో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని ' శనీశ్వరుడు 'గా సంబోదించి పరమశివుడు వరము ఇచ్చాడు . శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనేశ్వరుడు. శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చినది సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడునే ఆ శని ప్రభావమునకు లోనయ్యాను. 


సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు , శని... " నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీ కిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖు పుష్పములు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో .. వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరము ఇస్తునానని తెలిపాడు.





 ఆ తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు. 

శనివారం త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం. 

"శని" భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం న త్రయోదశి రోజు . 

శనిత్రయోదశి పూజ కోసము వారు కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.

 1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగినవారు ఆరోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము 8గంటలతరువాత భోజనాదులను చేయటము.

 2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు. 

3. వీలైన వారుశివార్చన స్వయముగా చేయటము.

 4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు (నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం) అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం. 

5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.

 6. ఆరోజు (కుంటివాళ్ళు,వికలాంగులకు) ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం.

 7. ఎవరివద్దనుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి. 













శని మహత్యం శనిభగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోపబడి, పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు నరికివేయబడ్డాడు. చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్ధించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు. 


శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి. 

శనిమహాత్మ్యం, కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్దలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది . 

బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి మోదం కలిగించారు. శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడాలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి పై సారించలేదు. తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి. 





శనీశ్వర జపం-శనీశ్వరుడి జప మంత్రాలు నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం, తమ్ నమామి శనైశ్చరం || ఓం శం శనయేనమ:|| || ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ || || ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః || శని గాయత్రీ మంత్రం: ఓం కాకథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్. || ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ || బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన "నవగ్రహ పీడహర స్తోత్రం": ||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మే శని: || ||ఓం శం శనైస్కర్యయే నమః|| ||ఓం శం శనైశ్వరాయ నమః|| ||ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః || ||కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:|| ఓం నమో శనైశ్వరా పాహిమాం, ఓం నమో మందగమనా పాహిమాం, ఓం నమో సూర్య పుత్రా పాహిమాం, ఓం నమో చాయాసుతా పాహిమాం, ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం, ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం, ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం.








శని మహాదశ
జాతకంలో శని అనుకూలంగా ఉన్న యెడల ఈ శని మహాదశలో వృత్తిలో ఉన్నత స్థాయికి ఎదగటం, శతృభయ నివారణ, సమస్యలు తొలగి పోవటం, సహోద్యోగుల నుంచి సహకారం, విదేశీయానం, ఆద్యాత్మికత పెరగటం మొదలైన ఫలితాలుంటాయి.


 శని జాతకంలో అనుకూలంగా లేనియెడల ఈ శని దశయందు మీకు గానీ, మీ కుటుంబ సభ్యులకు గానీ వాత సంబంధ రోగాలు (కీళ్ళ నోప్పులు ఇత్యాది) బాధించును. ఆర్థిక నష్టం, పంట నష్టం, నీచ జాతీయులుతో విరోధం, దుర్మార్గులతో స్నేహ సంబంధములు, పనివాళ్ళతో గొడవలు, దూర ప్రదేశములో నివాసం, ఊహించని ధన నష్టాలు, మొదలైన ఫలితాలుంటాయి. శనిదశలో కలిగే చెడుఫలితాలు తగ్గటానికి శని స్తోత్ర, మంత్రాలను చదవటం, హనుమాన్ చాలీసా చదవటం, హనుమాన్ ఆరాధన చేయటం మంచిది.


శని భుక్తి
శని మహాదశలో శనిభుక్తిలో అనుకూల ఫలితాలుంటాయి. ఆలస్యమవుతున్న పనులు త్వరగా పూర్తవటం జరుగుతుంది. ఉద్యోగంలో, ఆర్థికంగా, అన్ని విధములుగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. శని కర్మ కారకుడు కాబట్టి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. బద్ధకం తొలగి కార్యోన్ముఖులవుతారు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విదేశీయానం చేస్తారు. అయితే జాతకంలో శని అనుకూలంగా లేనట్టయితే ఇది పరీక్ష సమయంగా ఉంటుంది. ప్రతి పనిలో అడ్డంకులు పెరుగుతాయి. బద్దకం, నిరాశ, నిస్పృహలు పెరుగుతాయి. చేయగలిగే పనులుకూడా చేయకుండా వాయిదా వేస్తుంటారు. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. శనిగ్రహ దోష నివారణకుగాను రోజు శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా చదవటం, వృద్దులకు, వికలాంగులకు సేవచేయటం మంచిది.













No comments:

Post a Comment

మీ అభిప్రాయం తెలియచేయండి.