జ్యోతిష్యం "శాస్త్రం". సూర్యోదయం ప్రభావంతో మన శరీరాలు హార్మోన్లను విడుదల చేయడంతో మనం మేల్కొంటాం. అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, దూరంగా జరగడం వంటి మార్పుల వల్ల సముద్రపు అలల్లో తేడాలు వస్తాయి. అందువల్లనే మనవ మరియు ప్రకృతిలో విపరీత ధుర్ఘటనలు చూస్తున్నాము. పౌర్ణమి అమావాస్య ఎప్పుడు వస్తుందో మూడనమ్మకము అన్నవాడు చెప్పలేడు. మనపై మనకు విశ్వాసం లేకపోతే, ఇతరత్రా విషయాలేవీ పెద్దగా పనిచేయవు. అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి. సర్వే జనా సుఖినోభవంతు.
09 September 2016
పుష్కరాల అపోహాలు.
ఆది కవి మరియు మహాకవి శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్రామయణంలో
పుష్కర ప్రశంశ లేనే లేదు
ఆకాలంలో మహా నదులు లేవా?
శ్రీరామడు తనరాజధానిగాచేసుకుని
పాలించిన అయోధ్య చెంతనే ప్రవహించుచున్న సరయూనదికి
పుష్కరము లెందుకు లేవు?
వ్యాసవిరచిత మహాభారతములో కూడా
పుష్కర ప్రశంశలేదు ఎందువలన?
మహాభారతకాలమున ఈనదులులేవా?
శ్రీమద్భావతము దశమ స్కందమందు
శ్రీకృష్ణుడు సకుటుంబముగా గ్రహణ
స్నానము చేయుటకు వెళ్ళెనని చెప్పబడినది......
పుష్కరములు ఆశేతుహిమాచల పర్యంతముగల కొన్ని నదీనదముకు
ఆ సమీపమునందును..సుదూరప్రాంతములందునివసించు వారలు కనీసం 12సంవత్సరముకొకమారైననూ కలసికొని
సామాజిక సంబంధమును ధృడపరచుకొనుటకు.......
సౌరకుటుంబములోని గ్రహములలో
శుభగ్రహముగా పరిగణించబడిన
బృహస్పతి భచక్రములోని పన్నెండు రాశులలో సంచరిచుకాలమును ననుసరించి
ఒకరాశినుండి మరోరాశి ప్రవేకాలమున
కొన్ని ముఖ్య జీవనదులకు...మరికొన్ని
ఉపనదులకు కూడా పుష్కర ప్రాధాన్యమును
ఆధ్యత్మికతతోజోడించి ,ఆచరిచ ప్రారంభించినారు......
లలితా సహస్రనామములో152వ.శ్లోకము
వ్యాఖ్యానము పరిసీలించిన'పుష్కర'
పుష్కరేక్షణా'
జగన్మాత జలస్వరూపనియు. భాస్కరుని విపుల వ్యాఖ్యానమున్నది. సంస్కృతమున
పుష్కర పదమునకు అమరకోశమందు వివిధ
అర్థములివ్వబడినవి......
కాబట్టి
వైదిక,పౌరాణి క ప్రాధాన్యతకన్నా...
ఆస్తికులు ప్రకృతి ఆరాధలో జీవాధారమైన
జలములకు వాటి శ్రోతములకు అధికప్రాధన్యతనిచ్చినారు.
పిండప్రదానాదులు...ఆస్తికుల ఆసక్తి
శ్రధ్ధాభక్తులవిషయము.
స్నాన,పిండ ప్రదానాదులు చేసినవారికి
పుణ్యము రావచ్చును.రాక పోవచ్చును.
చేయనివారికి,చేయలేనివారికి పాపము
మాత్రము రాదు.
ప్రజలను వుపన్యాసప్రవచనములతో
భయభ్రాతులను చేయుట నిందనీయము.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
మీ అభిప్రాయం తెలియచేయండి.