11 September 2016

పంచాంగం ప్రకారం

పంచాంగం ప్రకారం యోగ నామములు: 27. విష్కంభము ప్రీతి ఆయుష్మాన్ సౌభాగ్యము శోభనము అతిగండము సుకర్మము ధృతి శూలము గండము = గండ యోగం వృద్ధి ధ్రవము వ్యాఘాతము హర్షణము వజ్రము సిద్ధి= సిద్ధి యోగం వ్యతీపాతము పరియాన్ == పరీయాన్ పరిఘము = పరిఘ శివము సిద్ధము సాధ్యము శుభము శుక్రము == శుక్లము బ్రహ్మము ఐంద్రము వైదృతి

స్త్రీలు గాజులు మన ఆచారాలు

స్త్రీలు గాజులు మన ఆచారాలు  గాజులు..స్త్రీకి రక్షాకంకణం వంటిది. ఈ గాజులు ధరించడం వెనుక సాంప్రదాయబద్ధమైన ఎన్నో ప్రయోజనాలు దాగివున్నాయి. అప్పుడే పుట్టిన పసిబిడ్డలకు దిష్టి తగలకుండా ఉండడానికి నల్లగాజులు వేస్తారు. ఆ పసిబిడ్డ మెలుకువగా ఉన్నప్పుడు చేతులు ఆడిస్తూంటే.. ఆ చేతులకు ఉండే గాజులు..లయబద్ధంగా చేసే చిరుసవ్వడులు..ఆ పసివాణ్ణి పలకరిస్తాయి. అవి వింటూ..ఆ చిన్నారి ఆడుకుంటాడు. ఇలా ప్రారంభమైన గాజుల ప్రస్థానం..జీవితం చివరి వరకూ కొనసాగుతూనే ఉంటుంది. ప్రాచీనకాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ గాజులు ధరించేవారు. వీటిని ధరించడం వల్ల మనకు తెలియకుండానే నడకలో ఒక లాలిత్యం, లయ ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా చిన్నతనంనుంచే ఈ గాజుల వాడకాన్ని అలవాటు చేస్తారు. ‘జీవితం చాలా విలువైనది..ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. గాజులాగే ఫగిలిపోతుంది’ అనే జీవన సత్యాన్ని చిన్నతనం నుంచే తెలిసేలా చెయ్యడం కోసమే.. ఆడపిల్లలకు ఈ గాజులు ధరింపజేసే ఆచారాన్ని అలవాటు చేసారు. అయితే..‘ఆడపిల్లకే ఈ జాగ్రత్త అవసరమా..మగవాడికి అవసరం లేదా’ అనే సందేహం నేటి ఆధునిక స్త్రీలకు కలగడం తప్పు కాదు. కానీ..ప్రాచీనకాలం నుంచీ, నేటి వరకూ..స్త్రీని ‘గృహలక్ష్మి’ అని గౌరవించారేగానీ.. పురుషుని ‘గృహవిష్ణువు’ అని గౌరవించిన దాఖలాలు ఎక్కడా లేవు. అందుకే.. ఇల్లాలిని చూసి ఇంటిని చూడమన్నారు...పెద్దలు. మగవాడు..దుబారా మనిషి అయినా.. ఆ ఇంటి ఆడది జాగ్రత్తపరురాలైతే..ఆ ఇంట్లో ఏ లోటు ఉండదు. అందుకే చిన్నతనం నుంచీ ఆడపిల్లకు జాగ్రత్త అలవాటు చెయ్యడం కోసమే..గాజులు వేసేవారు. రెండు చేతుల నిండా గాజులేసుకుని, పట్టుపరికిణీ కట్టుకుని.,సాక్షాత్తు లక్ష్మీదేవిలా..ఆడపిల్ల నట్టింటిలో తిరుగుతూంటే..చూడడానికి శోభాయమానంగా ఉంటుంది కానీ... బోసి చేతులేసుకుని..నడకలో ఓ లాలిత్యం లేకుండా పెద్ద పెద్ద అంగలేస్తూ, రాక్షసిలా ఆడపిల్ల తిరిగితే ఏం బావుంటుంది చెప్పండి. సరే...గాజుల విషయానికొద్దాం. గాజులు అందానికే కాదు.,సౌభాగ్యానికి కూడా చిహ్నం. గాజులు...తమ రంగునుబట్టి రకరకాల అర్థాలను తెలియచేస్తాయి. ఎరుపురంగు గాజులు శక్తిని, నీలంరంగు గాజులు విఙ్ఞానాన్ని, ఊదారంగు గాజులు స్వేచ్ఛను, ఆకుపచ్చరంగు గాజులు అదృష్టాన్ని, పసుపురంగు గాజులు సంతోషాన్ని, నారింజరంగు గాజులు విజయాన్ని, తెల్లరంగు గాజులు ప్రశాంతతను, నలుపురంగు గాజులు అధికారాన్ని, వెండి గాజులు బలాన్ని, బంగారు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి. పెళ్లయిన ఆడపిల్ల...కడుపు పండి, పురిటికని పుట్టింటికి వచ్చిన వేళ.. ఐదోనెలలో గాని, ఏడోనెలలో గాని, సీమంతం చేస్తారు. ఈ కాలంలో తొమ్మిదో నెలలో కూడా చేస్తున్నారనుకోండి. అది వేరే సంగతి. ఈ సీమంతోత్సవంలో..పేరంటానికి వచ్చిన ప్రతి ముత్తయిదువు...ఆ సీమంతవధువు చేతులకు తలో జత మట్టిగాజులు తొడగడం అనాదినుంచి వస్తున్న ఆచారం. ఇలా గాజులు తొడగడం ఎందుకు అంటే... ఐదో నెలలోనే గర్భస్థ పిండానికి ప్రాణం వస్తుంది. అప్పటినుంచి ఆ స్త్రీ మరింత జాగ్రత్తగా ఉండాలి. గాజులేస్తే జాగ్రత్త వస్తుందా.? వస్తుంది. గాజులు ఫగలడాన్ని అమంగళంగా, అశుభంగా భావిస్తారు మన భారత స్త్రీలు. అందుకే గాజులు ఫగలడాన్ని ఇష్టపడరు. గాజులు ఫగలకుండా నడవడం కోసమే.. సీమంతంలో గాజులువేసే సాంప్రదాయాన్ని ప్రతిపాదించింది మన శాస్త్రం. ధనవంతులు రెండు చేతులనిండా ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా..ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టి (గాజు)గాజులు వేసుకోవాలని శాస్త్రం చెప్తోంది. అమ్మవారి పూజల్లో పసుపు, కుంకుమలతోపాటు గాజులను కూడా ఉంచి పూజించడం మన ఆచారం. ముత్తయిదువులకు గాజులిచ్చి గౌరవించే సాంప్రదాయం మనది. ఎంత పేదింటి అన్నయినా..చెల్లెలిని చూడడానికి వచ్చి, తిరిగి వెడుతున్నప్పుడు..ఓ పదో, పరకో చేతిలోపెట్టి..‘గాజులేయించకోమ్మా’ అంటాడు. ఇలా స్త్రీ జీవితంలో గాజులు చోటుచేసుకుని, వారికి అందాన్నిస్తూ, జాగ్రత్తలు నేర్పుతూ, తాము ఫగలకుండా, మన సాంప్రదాయాలు ఫగలకుండా కాపాడుతూ వస్తున్న గాజులను గౌరవిస్తే మన సాంప్రదాయాలను గౌరవించినట్టే.

స్త్రీలు చేయ కూడని పనులు

స్త్రీలు చేయ కూడని పనులు

స్త్రీలు ఎప్పుడు గుమ్మడి కాయను కొట్టరాదు ఎందుకంటె గర్భ సంచి కిందికి జారిపోయే అవకాశములు ఎక్కువ.

గర్భిణి స్త్రీలు శూర టెంకాయ, తమిళంలో చిదరు కాయ్ అంటారు దానిని కొట్ట కూడదు ఎందుకంటె అదురుడుకు గర్భము జారిపోవచ్చు, అదే మాదిరి శూర టెంకాయ కొట్టే స్తలములో కూడా ఉండకూడదు.

గ్రహణ సమయమందు భూమ్యాకర్షణ శక్తి మార్పు చెందుతుంది. దాని పరిమాణము మనపై చాల ఉంటుంది ముఖ్యముగా మన కడుపులో ఆహార పదార్థములు జీర్ణమవ్వడానికి కావలసిన ఆమ్లములు ఉండవు అందువల్ల జీర్ణము కాదు ఈ కారణముగానే గ్రహణ సమయమునకు ముందుగ మూడు గంటలకు పూర్వమే మన కడుపులో ఏమి ఉండకూడదు అంటారు.

మీ భర్త పిల్లలు మంగళ వారము నాడు క్షవరము గడ్డము గీసుకోవడము చేయనీయ వద్దు. ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింప చేయును.

మంచి పనులను శుక్ల పక్షము నందే అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయ వలెను.

మీరు మీ పిల్లలు దిండు పైన కూర్చో వద్దు ఐతే ఈ కాలములో అందరూ దీనిని తప్పక చేస్తుంటారు.

స్త్రీలు రాత్రి సమయమున గాజులు కమ్మలు తీయరాదు. దుఃఖము విచారణ చేయ వచ్చిన వారిని ఆహ్వానించ కూడదు. అలాగే వారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్ప కూడదు.
ఈ మధ్య కాలంలో దుఃఖము విచారించ వచ్చిన వారిని రండి రండి అంటూ సాదరముగా ఆహ్వానించి స్థలము ఇచ్చి కూర్చోపెట్టి కాపీలు ఇచ్చి చాల అతిథి మర్యాదలు చేస్తారు .అపరోక్షముగా మనము అశుభములను కోరుకోవడానికి ఇది నాంది అవుతుంది.

కొత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక మూల రాయాలి, పసుపు క్రిమి నాసిని.

ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోడదు అయితే ఈ మధ్య కాలములో ఈ పని చాల చోట్లలో సహజమై పోయింది.

నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించ కండి ఈ మధ్య కాలంలో సువాసిని స్త్రీలుకుడా నలుపు రంగు వస్తువులు ధరించడం ఎక్కువై పోయింది.

ఉప్పు మిరప చింతపండు వీటిని ఎవరికి ఇచ్చిన చేతిలో ఇవ్వకూడదు ,కింద పెట్టండి వాళ్ళే తీసుకొంటారు .ఈ మద్య కాలంలో ఉప్పు చేతితో వడ్డించడం చాల చోట్లలో గమనిస్తాము.

ప్రతి రోజు భోజనమునకు ముందు కాకికి అన్నము పెట్టండి, ఇది పితృ దేవతలకు ప్రీతి .కాకికి మనము భోజనము చేయుటకు ముందు కుక్కకు మనము తిన్న తర్వాత పెట్టాలి.

అయితే కుక్కలను ఎల్లప్ప్పుడు కన్న సంతానానికంటే ఎక్కువగా లాలిస్తూ దాని నోటికి ఆకులోంచి అందిస్తూ భోజనము చేయడము ఎక్కువై పోయింది.

టెంకాయ చిప్ప తామ్బులము ఇచ్చేటప్పుడు మూడు కండ్లు వుండే భాగము మీరు ఉంచుకొని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను.

స్త్రీలు ఎప్పుడు జుట్టు విరపోసుకొని ఉండకూడదు .ఇది జ్యేష్టాదేవి స్వరూపము ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది. ఈ చర్య ప్రతి గృహములో ఇప్పుడు ఒక తప్పని సరి అయిపొయింది.

శుక్రవారమునాడు గాని ,జీతము రాగానే గాని ఆ డబ్బుతో మొట్ట మొదటి సారి ఉప్పు కొనండి ఈ చర్య పై పై డబ్బులు చేరటానికి అవకాశము ఎక్కువ.

కాలిపైకాలు వేసుకొని కుర్చోవడము, కాళ్లాడిస్తూ కూచోవడం, ఒంటి కాలితో నిలవడం, స్తిరముగా నిలవక ఉగుతుండడం లాంటి పనులు చేయకూడదు ఇందువల్ల ఒకటి దారిద్ర హేతువు మరియొకటి ఆ ప్రదేశములు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ.

ఎల్లప్పుడు ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేయాలి ,ఎడమ చేతిని ఉపయోగించ కూడదు.

సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ,ఆహారము తినకుండా నిద్రించ కూడదు.

స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు. పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పు రాదు ,రేపు తీసుకుంటాను అని అనవలెను.

ఎప్పుడు మన నోటినుండి పీడ ,దరిద్రం, శని పీనుగా కష్టము, అనే పదములను ఎప్పుడు ఉపయోగించ కూడదు.

ఇంటిలో దుమ్ము ధూళి, సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర హేతువులు, పదిరోజులకు ఒకమారు మంగళ శుక్ర వారములు కాకుండా దులిపి శుభ్రము చేయవలెను.

శ్రాద్ధ దినమందు ఇంటి ముందు ముగ్గు శ్రాద్ధము అయ్యేవరకు వేయకూడదు, శ్రాద్ధానంతరము ముగ్గు వేసి తర్వాత ఇంటిలోని వారు భోజనము చేయవలెను.

దిండులు, ఓర దుప్పట్లు అప్పుడప్పుడు ఉతుకుతూ వాడాలి .మనకు తెలియని సుక్ష్మ క్రిములు చాల ఉంటాయి దాని వాల్ల మనకు హాని జరుగును

నవరత్నాలు

నవరత్నాలు BIRTH STAR [జన్మ నక్షత్రము] STONE [రత్నము]

ASHVINI [అశ్వని] CAT’S EYE [వైడూర్యము]

BHARANI [భరణి] DIAMOND [వజ్రము]

KRITIKA [కృత్తిక] RUBY [కెంపు]

ROHINI [రోహిణి] PERAL [ముత్యము]

MRIGASIRA [మృగశిర] CORAL [పగడము]

ARUDRA [ఆరుద్ర] SARDONYX [గోమేదికము]

PUNARVASU [పునర్వసు] CARBUNCLE

[కనక పుష్యరాగము] PUSHYAMI [పుష్యమి]
SAFIRE [నీలము]

ASLESHA [ఆశ్లేష]
GREEN [ఆకుపచ్చ]

MAGHA [మఖ] CAT’S
EYE[వైడూర్యము]

PURVAPALGUNI [పుబ్బ] DIAMOND [వజ్రము]

UTTARAPALGUNI [ఉత్తర] RUBY [కెంపు]

HASTA [హస్త] PEARL [ముత్యము]

CHITTA [చిత్త] CORAL [పగడము]

SWATHI [స్వాతి] SARDONYX [గోమేధికము]

VISHAKAH [విశాఖ] CARBUNCLE [కనక పుష్యరాగము]

ANURADHA [అనురాధ] SAFIRE [నీలము]

JESTA [జ్యాస్ట] GREEN [ఆకుపచ్చ]

MOOLA [మూలా] CAT’S EYE[వైడూర్యము]

PURVASHADA DIAMOND [వజ్రము]

UTTARASHADA [ఉత్తరాషాడ] RUBY [కెంపు]

SRAVANAM [శ్రవణం] PEARL [ముత్యము]

DHANISHTA [ధనిష్ట] CORAL [పగడము]

SATABHISHAM [శతభిషం] SARDONYX [గోమేధికము]

PURVABHADRA [పూర్వాభాద్ర] CARBUNCLE [కనక పుష్యరాగము]

UTTARABHADRA [ఉత్తరాబాద్ర] SAFIRE [నీలము]

RAVATI [రేవతి] GREEN [ఆకుపచ్

నవరత్నాలు ధరించే విధములు నవగ్రహాలకు సంబంధించి అంతర్ధశలు ఉన్నట్టే గ్రహ మహర్ధశ ఉంటుంది. అంతర్ధశకు సంబంధించి ఆ కాలంలో వివిధ రత్నాలను ధరించిన ట్లే మహర్ధశలోనూ రత్నాలను ధరిస్తే శుభం చేకూరుతుంది. రవి మహర్ధ్థశ ఆరేళ్లకాలంపాటు ఉంటుంది. ఈ మహర్థశ కాలంలో రవి జపం చేయించిన తర్వాత కెంపును వెండిలో ధరించాలి. దీనిని ఉంగరపు వేలికి మాత్రమే పెట్టుకోవాలి. చంద్ర మహర్థశ పదేళ్ల కాలం ఉంటుంది. ఈ మహర్ధశ కాలంలో చంద్ర జపం చేయించి ముత్యాన్ని వెండిలో ధరించాలి.దీనిని ఉంగరపు వేలికి ధరించాలి. కుజ మహర్థశ ఏడేళ్ల కాలం ఉంటుంది. ఈ మహర్థశ కాలంలో కుజ జపం చేయించిన తర్వాత పగడాన్ని వెండిలో ఉంగరపు వేలికి ధరించాలి. బుధ మహర్ధశ పదిహేడేళ్ల పాటు ఉంటుంది. ఈ కాలంలో బుధ జపం చేయించిన తర్వాత జాతిపచ్చను బంగారముతో చేయించి చిటికెన వేలు పెట్టుకోవాలి. గురు మహర్ధశ పదహారేళ్ల పాటు ఉంటుంది.ఈ మహర్ధశ కాలంలో గురు జపం చేయించిన త ర్వాత కనక పుష్యరాగం అనే రత్నాన్ని బంగారంతో చేయించి చూపుడు వేలికి పెట్టుకోవాలి. శుక్ర మహర్ధశ ఇరవై ఏళ్ల పాటు ఉంటుంది. శుక్ర జపం చేయించిన వజ్రాన్ని బంగారంలో చేసి ఉంగరపు వేలికి పెట్టుకోవాలి. శని మహర్ధశ పందొమ్మిదేళ్ల పాటు ఉంటుంది. ఈ కాలంలో శని జపం చేయించిన నీలాన్ని వెండిలో మధ్య వేలికి ధరించాలి.రాహు మహర్ధశ పద్దెనిమిదేళ్ల పాటు ఉంటుంది. ఈ మహర్ధశ కాలంలో రాహు జపం చేయించిన గోమేధికాన్ని వెండిలో ధరించాలి. ఈ ఆభరణాన్ని మధ్య వేలికి ధరించాలి. కేతువు మహర్ధశ ఏడేళ్ల కాలం ఉంటుంది. కేతు జపం చేయించిన వైఢూర్యాన్ని వెండిలో మధ్య వేలికి పెట్టుకోవాలి. నవరత్నములు ధారణా లాభములు నవగ్రహ వైభవం లో చెప్పిన విధంగా మధుమేహము[చెక్కెర వ్యాధి] కలవారు,స్త్రీ లోలురు,రాజకీయవేత్తలు,ఆకర్షణ లోపము వున్నవారు వజ్రము ధరిచుతుపయుక్తము. నీలం రాయి కలిగిన ఉంగరాన్ని దరిద్రముతో బాధపడుచున్న వారు, కీళ్ళ నొప్పులు కలవారు, గ్యాస్ ట్రబుల్, కుసుమ వ్యాధులు కలిగిన వారు దీన్ని ధరించాలి. వైఢూర్యానికి విష జంతు బాధా నివారణము అనే పేరుకూడా ఉంది. ప్రతివాద భయము తొలగుటకు, సంతాన లోప నివారణకు ఉపయోగించపచ్చు. గోమేధకమును నరాల సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ధరించవచ్చు. వ్యాపారములందు రాణించి, లాభాలను పొందలేని వారు గోమేధికమును ధరించాలి. పుష్యరాగ ఉంగరాన్ని దేవభక్తి, సూక్ష్మజ్ఞానము కలగాలంటే ధరించవచ్చు. పగడమును రాజకీయ వేత్తలు, శత్రుభయంతో బాధపడుతున్నావారు, దీర్ఘవ్యాధి గలవారు ఈ ఉంగరాన్ని ధరించడం మంచిది. అలాగే ముత్యమును అన్ని సమయాలందు, ప్రతి ఒక్కరు ధరించవచ్చును. కుటుంబ సౌఖ్యములేని వారు సోమవారము రోజున ముత్యముతో కూడిన ఉంగరాన్ని ధరిస్తే మంచిది

హస్త నక్షత్రం

హస్త నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు నక్షత్రములలో ఇది 13వ నక్షత్రము. హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రగ్రహం. రాశ్యాధిపతి – బుధుడు. అధిదేవత – సూర్యుడు. జంతువు – మహిషి(గేదె). హస్తనక్షత్రము నవాంశ విషయానికి వస్తే మొదటి పాదము – మేషరాశి, రెండవ పాదము – వృషభరాశి, మూడవ పాదము – మిధునరాశి, నాలుగవ పాదము – కర్కాటకరాశిలో ఉంటాయి. హస్తా నక్షత్ర మొదటి పాదము హస్తా నక్షత్ర అధిపతి చంద్రుడు. దేవగణ నక్షత్రం. కాబట్టి వీరు సాత్విక గుణం కలిగి ఉంటారు. భావోద్వేగాలు మారుతుంటాయి. అవేశపూరిత స్వభావం కలిగి ఉంటారు. ప్రేమ, ఆగ్రహం, అలక, అభిమానం వంటి భావాలు పరిస్థితులను బట్టి మార్చి ప్రదర్శిస్తారు. తరచూ అభిప్రాయాలూ కూడా మార్చుకుంటారు. 15 ఏళ్ల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత వచ్చే రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఉంటాయి. ప్రయత్నా పూర్వకంగా వీటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిరపడాలి. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహు దశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం జరుగుతుంది. హస్త నక్షత్ర మొదటి పాదములోని జాతకులకు ఆయుర్వేద వైద్యం, హోమియోపతి వంటి వైద్య సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. సైనిక పరమైన ఉద్యోగాలు కూడా అనుకూలం. బియ్యం, పాలు, డైరీ ఉత్పత్తులు, కాగితం వంటి వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం. భూ సంబంధిత, అగ్ని సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. 33 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి మొదలవుతుంది. సంపాదించిన సొమ్ము పదిల పరచుకుంటే ఇబ్బందులు ఎదురు కావు. 49 సంవత్సరాలకు మొదలయ్యే శని దశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. 68 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తరువాత జీవితం సాఫీగా జరిగిపోతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా ఉంటుంది. హస్తా నక్షత్ర రెండవ పాదము ఆధ్యాత్మికం, ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఉద్రేకపూరిత స్వభావులైనా స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. 13 సంవత్సరాల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత వచ్చే రాహు దశ కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఎదురవుతుంటాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిరపడాల్సి ఉంటుంది. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం ఉంటుంది. ఇక వీరు సౌందర్య పోషణ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అలంకరణ వస్తువులను సేకరించడం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. కళారంగం వీరికి అనుకూలం. కళారంగం వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం. ఆయుర్వేద వైద్యం, హోమియోపతి వంటి వైద్య సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. 31 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి మొదలవుతుంది. సంపాదించినది పదిల పరసుచుకుంటే ఇబ్బందులు ఉండవు. 47 సంవత్సరాలకు ఆరంభం అయ్యే శని దశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి . 66 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తరువాత జీవితం సాఫీగా సాగిపోతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా జరిగిపోతుంది. హస్తా నక్షత్ర మూడవ పాదము 11 సంవత్సరాల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత వచ్చే రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఎదురవుతుంటాయి. ప్రయత్నా పూర్వకంగా వీటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిరపడాలి. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం ఉంటుంది. 29 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి ఆరంభమవుతుంది. సంపాదించిన సొమ్ము పదిలపరచుకుంటే ఇబ్బందులు ఉండవు. ఇక బియ్యం, పాలు, డైరీ ఉత్పత్తులు, కాగితం వంటి వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం. ఔషధ తయారీ, ఔషధ విక్రయశాల నిర్వహణ వంటి వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. మేధో సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. భూ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. 45 సంవత్సరాలకు ఆరంభం అయ్యే శనిద శ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. 64 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తరువాత జీవితం సుఖంగా జరిగిపోతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా జరిగిపోతుంది. హస్తా నక్షత్ర నాలుగవ పాదము వీరికి తల్లి అంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. మాతృ వర్గంతో అనుబంధం అధికంగా ఉంటుంది. 9 సంవత్సరాల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత వచ్చే రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఉంటాయి. ప్రయత్నా పూర్వకంగా వీటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం కొనసాగుతుంది. 27 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి మొదలవుతుంది. సంపాదించిన సొమ్ము పదిల పరచుకుంటే ఇబ్బందులు ఉండవు. వీరికి ఔషధ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. బియ్యం, పాలు, డైరీ ఉత్పత్తులు, కాగితం.. వంటి వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం. 43 సంవత్సరాలకు ఆరంభం అయ్యే శనిదశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. 61 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తరువాత జీవితం సుఖంగా జరిగిపోతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా సాగిపోతుంది. హస్తా నక్షత్ర జాతకుల గుణగణాలు ఈ నక్షత్ర జాతకులు ఆకర్షణ కలిగి ఉంటారు. కోమలమైన శరీరం, పొడగైన ముఖ రూపం ఉంటుంది. అనుకున్న సముయములో ఇష్టమైన విద్య అభ్యసిస్తారు. చంచల స్వభావం కారణంగా తరచూ అభిప్రాయాలు మార్చుకుంటారు. ఎదుటి వారి కష్టాలను సులువుగా అర్ధం చేసుకుని అడగగానే వారికి, సహాయము చేస్తారు. మంచి స్నేహితులు ఉంటారు. ప్రేమ వివాహాలు జీవితములో ప్రధాన ప్రస్తావన అవుతుంది. వ్యుహాలు రహస్యం అయినా కొందరికి మాత్రమే చెబుతారు. దూరప్రాంత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, జీవితంలో మంచి మలుపులు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో శక్తి సామర్ధ్యాలకు గుర్తింపుకు కొంత కాలం వేచి చూడాలి. న్యాయ స్థానాలను కూడా ఆశ్రయించాల్సి ఉంటుంది. సొంత తెలివి తేటలతో వ్యాపారాలను అభివృద్ధిపరచి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు. సహోదరీ వర్గము పట్ల అభిమానము కలిగి ఉంటారు

ఉత్తర ఫల్గుణీ నక్షత్రం

ఉత్తర ఫల్గుణీ నక్షత్రం- గుణగణాలు, ఫలితాలు ఉత్తర ఫల్గుణి నక్షత్రాన్ని ఉత్తర అని కుడా అంటారు. నక్షత్రములలో ఇది 12వది. ఉత్తర ఫల్గుణీ నక్షత్రముకు అధిపతి సూర్యుడు. అధిదేవత ఆర్యముడు. గణము మనుష్య. రాశ్యాధిపతులు సూర్యుడు, బుధుడు. జంతువు గోవు. ఉత్తర ఫల్గుణి నక్షత్రము నవాంశ విషయానికి వస్తే.. మొదటి పాదములో ధనసురాశి, రెండవ పాదములో మకరరాశి, మూడవ పాదములో కుంభరాశి, నాలుగవ పాదములో మీనరాశి. ఉత్తర ఫల్గుణీ మొదటి పాదము మొదటి పాదములో జన్మించిన వారైతే.. వెండితో పొదిగించిన కెంపును ధరించాలని రత్నాల శాస్త్రం చెబుతోంది. కెంపును ధరించడం ద్వారా ఉన్నత స్థానాలను అలంకరించడం, వ్యాపారాభివృద్ధి చేకూరుతుంది. ఉత్తర నక్షత్రంలో జన్మించిన జాతకులు 6 నుంచి 16 సంవత్సరాల వరకు వీరికి చంద్ర మహర్ధశ ఉంటుంది. కాబట్టి ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 16 నుంచి 23 సంవత్సరాల వరకు ఈ జాతకులకు కుజ మహర్దశ కలగటం వల్ల పగడమును బంగారంతో పొదిగించుకుని ధరించడం ద్వారా సుగుణవతి అయిన భార్య లభిస్తుందని రత్నాల శాస్త్రం చెబుతోంది. పగడమును ధరించడం ద్వారా సుఖసంతోషములు చేకూరుతాయి. ఇక 41 నుంచి 57 సంవత్సరాల మధ్యలో గురు మహర్ధశ నడవటంతో ఈ జాతకులు పుష్యరాగంను బంగారముతో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించాలి. ఇక 57 నుంచి 76 సంవత్సరాల మధ్య శని మహర్ధశ. కాబట్టి నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం శ్రేష్టము. అలాగే 76 సంవత్సరాల తర్వాత ఉత్తర నక్షత్రం తొలి పాదంలో జన్మించిన జాతకులకు బుధ మహర్ధశ. కాబట్టి పచ్చను బంగారుతో పొదిగించి చిటికెన వేలుకు ధరించాలి. ఈ నక్షత్రములో పుట్టిన జాతకులకు ఈతి బాధలు తొలగిపోవాలంటే ప్రతి శనివారం విష్ణుమూర్తికి నువ్వుల నూనెతో దీపమెలిగించడం మంచిది. ఇలా 9వారాలు చేయడం ద్వారా ఈతిబాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయి. ఉత్తర ఫల్గుణీ రెండవ పాదము ఉత్తర నక్షత్రము రెండో పాదములో జన్మించిన జాతకులకు తొలి 4 సంవత్సరముల నుంచి 6 నెలల వరకు రవి మహర్దశ. కాబట్టి కెంపును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది. 4 సంవత్సరముల 6 నెలల వరకు, 14 సంవత్సరముల వయస్సు నుంచి 6 నెలల వరకు చంద్ర మహర్దశ.. వస్తుంది కావున ముత్యంను వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి. 14 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 21 సంవత్సరముల 6 నెలల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించాలి. 21 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 39 సంవత్సరముల 6 నెలల వరకు రాహు మహర్దశ. కాబట్టి గోమేధికంను వెండిలో మధ్య వేలుకు ధరించాలి. 39 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 55 సంవత్సరముల 6 నెలల వరకు గురు మహర్దశ. కాబట్టి కనక పుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించడం మంచిది. ఇక 55 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 74 సంవత్సరముల 6 నెలల వరకు శని మహర్దశ. కావున నీలమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు. 74 సంవత్సరాల 6 నెలల వయస్సు నుంచి 91 సంవత్సరాల 6 నెలల వరకు బుధ మహర్దశ. కాబట్టి పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించడం శ్రేయస్కరం. ఉత్తర ఫల్గుణీ మూడవ పాదము వీరికి స్థాయికి మించిన వ్యాపార వ్యవహారాలు కలసి వస్తాయి. స్థిరాస్థులు, ధనము అధికంగా గుప్తంగా ఉంటాయి. తనకు అంతగా పరిచయం లేని మార్గములో కూడా ఉన్నత స్థితి సాధిస్తారు. పరోపకారము చాలా తక్కువ. తక్కువ ధరల్లో ఆస్తులు కొనుగోలు చేస్తారు. సంపాదనలో బంధుత్వానికి, పాపభీతికి చోటు ఉండదు. ధనం విషయములో వీరు ఉదారులని భావిస్తారు కాని వీరు అనవసరంగా ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్టిన దానికి వంద రెట్లు ఫలితం ఉంటేనే ఖర్చు చేస్తారు. ఇతరులను అవమానించి ఆనందిస్తారు. ఉత్తర ఫల్గుణీ నాలుగవ పాదము ఉత్తర నక్షత్రం నాలుగో పాదములో జన్మించిన జాతకులు జన్మించిన ఒక సంవత్సరం నుంచి 6 నెలల వరకు రవి మహర్దశ. కాబట్టి కెంపును వెండిలో ఉంగరపు వేలును ధరించాలి. ఒక సంవత్సరము 6 నెలల వయస్సు నుంచి 11 సంవత్సరాల 6 నెలల వయస్సు వరకు చంద్ర మహర్దశ. కాబట్టి ముత్యంను వెండిలో ఉంగరము వేలుకు ధరించాలి. 11 సంవత్సరాలు 6 నెలల వయస్సు నుంచి 18 సంవత్సరాల 6 నెలల వరకు కుజ మహర్ధశ. కాబట్టి పగడంను బంగారములో ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 18 సంవత్సరములు 6 నెలల వయస్సు నుంచి 36 సంవత్సరాల 6 నెలల వరకు రాహు మహర్దశ. కాబట్టి గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం శ్రేయస్కరం. 30 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 32 సంవత్సరముల 6 నెలల వరకు గురు మహర్ధశ. కాబట్టి కనక పుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించాలి. 52 సంవత్సరములు 6 నెలల వయస్సు నుంచి 71 సంవత్సరముల 6 నెలల వరకు శని మహర్ధశ. కాబట్టి నీలంను వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది. ఉత్తర ఫల్గుణీ నక్షత్ర జాతకుల గుణగణాలు ఈ నక్షత్ర జాతకులకు సకాలంలో వివాహమవుతుంది. భార్య ఆధిపత్యం అధికం. అదృష్టానికి దగ్గరగా జీవితము సాగుతుంది. ఈ జాతకులు ముఖ్యంగా తండ్రి వలన ప్రయోజనము పొందుతారు. తేనెటీగ లాగా కూడబెడతారు. నైతిక బాధ్యతలు అధికం. ఇక వైవాహిక జీవితంలో సంతానము వలన చిక్కులు ఎదుర్కొంటారు. సంఘ వ్యతిరేక, చట్ట వ్యతిరేక పనులకు భయపడరు. లోలోపల పిరికి వారుగా ఉంటారు. రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు కలసి వస్తాయి. జీవితము మీద ఉన్న భయము వీరిని అడ్డదారులలోకి వెళ్ళేలా చేస్తుంది. రాహు, గురు దశలు వీరికి యోగిస్తాయి.

పూర్వఫల్గుణీ నక్షత్రం

పూర్వఫల్గుణీ నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు పూర్వఫల్గుణీ నక్షత్రములలో ఇది 11వ నక్షత్రము. దీనికి పుబ్బ అని ఇంకొక పేరుంది. ఈ నక్షత్రము అధిపతి శుక్రుడు. రాశ్యాధిపతి సూర్యుడు, గణము మానవ గణము. జాతి పురుష జాతి. జంతువు సింహం, ఆధిదేవత భర్గుడు, రాశి సింహా రాశి. పూర్వ ఫల్గుణి నక్షత్రము నవాంశ విషయానికి వస్తే.. మొదటి పాదము సింహరాశి, రెండవ పాదము – కన్యారాశి, మూడవ పాదము – తులారాశి, నాలుగవ పాదము – వృశ్చికరాశి. పూర్వఫల్గుణీ మొదటి పాదము ఈ నక్షత్రములోని ఏ పాదంలో శిశువు జన్మించినా, సామాన్య దోషం కలుగుతుంది. ఈ దోష శాంతికి సామాన్య శాంతికి శిశువు ముఖాన్ని తండ్రి నూనెలో చూడాలి. అబ్బాయి పుడితే ధనవంతుడు, ధర్మాత్ముడు, కార్య విచారమును ఎరిగిన వాడుగా, నృత్య శాస్త్రమున సమర్థుడుగా అవుతాడు. స్త్రీ పుడితే ఉత్తమమైన సంతానం కలిగినదిగా, ధనవంతురాలుగా, శతృజయం పొందినదిగా అవుతుంది. పూర్వఫల్గుణీ రెండవ పాదము పూర్వఫల్గుణీ రెండో పాదములో జన్మించిన జాతకులకు 15 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ ఉంటుంది. అందువల్ల వజ్రమును బంగారమును ఉంగరపు వేలుకు పొదిగించుకుని ధరించాలి. 15 సంవత్సరముల నుంచి 21వ సంవత్సరముల వయస్సు వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరం. 21 సంవత్సరముల నుంచి 31 సంవత్సరముల వరకు ఈ జాతకులకు చంద్ర మహర్దశ ఉంటుంది. కనుక ఈ సమయాన ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 31 నుంచి 38 సంవత్సరముల వరకు కుజ మహర్దశ ఉంటుంది. కాబట్టి పగడమును బంగారముతో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి. 38 నుంచి 56 సంవత్సరముల వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు. 56 సంవత్సరము వయస్సు నుంచి 72 సంవత్సరముల వరకు గురు మహర్దశ. కాబట్టి కనుక పుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించాలి. 72 సంవత్సరముల నుంచి 91 సంవత్సరముల వరకు శని మహర్దశ ఉంటుంది. కాబట్టి నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలని రత్నాల శాస్త్రం చెబుతోంది. పూర్వఫల్గుణీ మూడోపాదము పూర్వఫల్గుణీ మూడో పాదములో జన్మించిన జాతకులైతే.. జన్మించిన 10 సంవత్సరముల వయస్సు వరకు ఈ జాతకులకు శుక్ర మహర్దశ ఉంటుంది. అందువల్ల వజ్రమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం ఉత్తమం. ఇక 10 సంవత్సరముల నుంచి 16 సంవత్సరముల వరకు రవి మహర్దశ. అందువల్ల కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 16 సంవత్సరముల నుంచి 26 సంవత్సరముల వరకు చంద్ర మహర్దశ ఉంటుంది. కాబట్టి ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 26 నుంచి 33 సంవత్సరముల వరకు కుజ మహర్దశ. అందువల్ల పగడమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 33 సంవత్సరముల నుంచి 51 సంవత్సరముల వరకు రాహు మహర్దశ ఉంటుంది. కనుక గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలి. 51 నుంచి 67 సంవత్సరముల వరకు గురు మహర్దశ. అందువల్ల కనక పుష్యరాగమను బంగారములో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించడం మంచిది. 67 సంవత్సరముల నుంచి 86 సంవత్సరముల వరకు శని మహర్దశ ఉంటుంది. కాబట్టి మీరు నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది. పూర్వఫల్గుణీ నాలుగో పాదము పుబ్బ నక్షత్రం 4వ పాదములో జన్మించిన జాతకులైతే జన్మించిన 5 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ ఉంటుంది. కాబట్టి వజ్రమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించాల్సి ఉంటుంది. 5 సంవత్సరముల నుంచి 11 సంవత్సరముల వరకు శని మహర్దశ. కాబట్టి కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించాలి. 11 సంవత్సరముల నుంచి 21 సంవత్సరముల వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు. 21 నుంచి 28 సంవత్సరముల వయస్సు వరకు కుజ మహర్దశ ఉంటుంది. కాబట్టి పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించాలి. 28 నుంచి 46 సంవత్సరాల వరకు రాహు మహర్దశ. కాబట్టి గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించాలి. 46 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు గురు మహర్దశ. అందువల్ల కనకపుష్యరాగమును బంగారములో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించాలి. 62 ఏళ్ల వయసు నుంచి 81 సంవత్సరముల వరకు శని మహర్దశ. కాబట్టి నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది. పూర్వఫల్గుణి నక్షత్రము – గుణగణాలు పూర్వఫల్గుణీ నక్షత్రము అధిపతి శుక్రుడు. అందువల్ల వీరి బాల్యం సుఖమయంగా గడుస్తుంది. విద్యాభ్యాసముకు ఎలాంటి ఆటంకం కూడా రాదు. సౌమ్యత కలిగి ఉన్నా ఇతరులకు మనసులో అయినా తల వంచరు. సమయానుకూలముగా ప్రవర్తించే స్వభావం వల్ల అధికారులుగాను, నాయకులుగానూ రాణిస్తారు. ఇక ఎవరు ఏమనుకున్నా లెక్క చేయరు. సమాజానికి వ్యతిరేకులు కాదు కాని, సమాజ స్పృహ ఉండదు. దానధర్మాలు, అన్నదాన సత్రములు, విద్యా దానము చేస్తారు. స్వయంకృతాపరాధము వలన తాను శ్రమించి సంపాదించిందంతా వైరి వర్గానికి ధారపొస్తారు. మిత్రుల ఉచ్చు నుంచి కొందరు జీవితకాలమంతా బయటపడని సందర్భం ఎదురు కావొచ్చు. బయటకి కనిపించే జీవితము కాక రహస్య జీవితము వేరుగా ఉంటుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా వీరి లోపాలాను ఎదురుగా చెప్ప లేరు. ఆర్ధిక పురోగతి బాగుంటుంది. అన్య భాషలు సైతము అనర్గళంగా మాట్లాడగలరు. తమ జీవన శైలికి భిన్నముగా సమ్తానాన్ని వేరు రంగాలలో ప్రోత్సహిస్తారు. సమాజములో చురుకైన పాత్ర పోషిస్తారు. దేశ విదేశాలలో పేరు తెచ్చుకుంటారు.

మఖ నక్షత్రం

మఖ నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు మఖ నక్షత్ర అధిపతి కేతువు. మేషరాశి అధిపతి కుజుడు. ఇది రాక్షసగణ నక్షత్రం. నక్షత్రాధిపతి సూర్యుడు. మఖ నక్షత్రము నవాంశ విషయానికి వస్తే.. మొదటి పాదములో మేష రాశి ఉంటుంది. రెండవ పాదములో వృషభ రాశి, మూడవ పాదములో మిధున రాశి, నాలుగవ పాదములో కర్కాటక రాశి ఉంటుంది. మఖ నక్షత్ర మొదటి పాదము కుజుడి ప్రభావం వీరిని మరింత ప్రభావితం చేస్తుంది. అనుకున్న కార్యం వీరు అనుకున్నంత వేగంతోనే పూర్తిచే స్తారు. కేతు గ్రహ ప్రభావంతో వీరికి ఆద్యాత్మిక చింతన ఉంటుంది. ఏ కార్యమైనా దైవ నమ్మకంతో పూర్తి చేస్తారు. రాజ్యాంగ సంబంధిత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. భూ సంబంధిత వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. బాల్యంలోనే శుక్ర దశ రావడంతో వీరికి విద్య మీద కంటే అలంకరణ సౌందర్య పోషణ మీద ఆసక్తి చూపిస్తారు. ఈ సమయంలో మనసును విద్య వైపు మళ్ళించి విద్యాభ్యాసం విజయవంతంగా పూర్తి చేయవలసిన ఉంటుంది. 26 సంవత్సరాల వరకు జీవితం సుఖ సౌఖ్యాలతో సాగుతుంది. తరువాత కొంత సుఖం తగ్గినా జీవితం సాఫీగా జరిగిపోతుంది. 49 సంవత్సరాల తరువాత వచ్చే రాహుదశ కొన్ని సమస్యలను తీసుకువచ్చే అవకాశం ఉంది. 18 సంవత్సరాల రాహుదశ అనంతరం వచ్చే గురు దశ కారణంగా 67 సంవత్సరాల తరువాత జీవితం తిరిగి గాడిలోకి పడుతుంది. వృద్ధాప్యం ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగిపోతుంది. మఖ నక్షత్ర రెండవ పాదము వీరికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి. ఒక సారి ఏర్పరచుకున్న అభిప్రాయాలు అంత త్వరగా మార్చుకోలేరు. అలంకరణ వస్తువుల సేకరణ అంటే విపరీతమైన ఆసక్తి కనబరుస్తారు. బాల్యంలో వచ్చే శుక్రదశ కారణంగా కళారంగం అబ్బుతుంది. ఈ రంగంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. కళా సంబంధిత వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి. ఈ జన్మ నక్షత్రంలోని రెండవ పాదము వారికి 24 సంవత్సరాల వరకు సౌఖ్యవంతమైన జీవితం సాగుతుంది. ఆ తరువాత కొంత సుఖం కాస్త తగ్గినా 47 సంవత్సరాల వరకు సాఫీగా సాగిపోతుంది. తరువాత 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురైనా 65 సంవత్సరాల తరువాత జీవితంలో సౌఖ్యం తిరిగి మొదలవుతుంది. వృద్ధాప్యం సౌఖ్యవంతంగా జరిగి పోతుంది. మఖ నక్షత్ర మూడవ పాదము వీరు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. కనుక వీరు ఒక్కసారి ఏర్పరచుకున్న అభిప్రాయాలు అంత త్వరగా మార్చుకోలేరు. మేధో సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. భూ సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. కేతు గ్రహ ప్రభావం వలన వీరు అత్యంత ఆధ్యాత్మికత కలిగి ఉంటారు. వీరికి వ్యాపార, ఉద్యోగాల, వ్యవసాయం మీద సమానమైన ఆసక్తి ఉంటుంది. మూడవ పాదములో జన్మించిన వారికి కూడా చిన్న వయసులో శుక్రదశ కారణంగా విద్య కంటే సౌందర్య పోషణ, సౌఖ్యవంతమైన జీవితం మీద ఆసక్తి ఉంటుంది. ప్రయత్న పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించవలసిన అవసరం ఉంది. 22 సంవత్సరాల వరకు శుక్రదశ ఉంటుంది కనుక జీవితం అప్పటి వరకు సౌఖ్యవంతంగా సాగుతుంది. తరువాత కాస్త సౌఖ్యం తగ్గినా 45 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత 18 ఏళ్ల రాహుదశ కారణం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ 63 ఏళ్ల కాలంలో సమస్యలు తగ్గు ముఖం పట్టి తిరిగి సుఖసంతోషాలు మొదలవుతాయి. దీంతో వృద్ధాప్యం సాఫీగా సాగిపోతుంది. మఖ నక్షత్ర నాలుగవ పాదము వీరికి పట్టుదల అధికం. వీరికి తల్లి అంటే అభిమానం అధికంగా ఉంటుంది. కేతు గ్రహ ప్రభావం వల్ల వీరికి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వీరికి పాలు, పాల ఉత్పత్తులు, బియ్యం, ముత్యం, కాగితం, ఔషధ తయారీ విక్రయం వంటి వృత్తులు, ఉద్యోగాలు వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి 21 ఏళ్ల వరకు శుక్ర దశ ఉండటంతో జీవితం అప్పటి వరకు సాఫీగా సాగుతుంది. తరువాత కొంచెం సాఫీగా తగ్గినా 44 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ, 62 సంవత్సరాల సమయంలో సమస్యలు తగ్గు ముఖం పట్టి తిరిగి సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి. కనుక వృద్ధాప్యం సంతృప్తిగా జరిగిపోతుంది. మఖ నక్షత్రము గుణగణాలు ఈ నక్షత్ర జాతకులకు ఆధ్యాత్మిక భావం అధికంగా ఉంటుంది. కేతువు ఆధిపత్యము, రాక్షస గనముల చేరిక కారణముగా పట్టుదల, ప్రతీకారము వంటివి అధికము. వీరికి పొదుపు చేసే గుణం ఉంటుంది. జీవితంలో అభద్రతా భావం ఉంటుంది. ఈ నక్షత్రాధిపతి సూర్యుడు కావడము వలన ఈ రాశి వారికి ఆధిపత్య గుణము ఎక్కువే. మంచి మనుషులుగా పేరుతెచ్చుకునే ఈ నక్షత్ర జాతకులు సౌమ్యులుగా ఉంటారు. వీరికి గృహోపయోగం, విదేశీయాన యోగం మొదలైనవి కలిసి వస్తాయి. జీవితంలో ఎలాంటి లోటు వీరికుండదు. వీరు ఇతరుల సొమ్మును ఆశించే రకం కాదు. ఉదయం నుంచి రాత్రి వరకు అనుక్షణం శ్రమించే నైజం ఉంటుంది. అయితే.. నిద్రలేమిని మాత్రం భరించలేరు. జరిగిన పోయిన సంఘటనలను అంత సులువుగా మరిచిపోరు. అప్పుడప్పుడు వాటిని తలచుకుని బాధపడతారు. ఇక ఇతరులు ఆపదలో ఉన్నారంటే వారికి ముందు జాగ్రత్తలు చెబుతారు. కానీ ఆపద వస్తే మాత్రం ఆదుకునే స్థితిలో ఉండరు. ఈ నక్షత్ర జాతకులకు ఆదివారం కలిసి వస్తుంది. బుధవారం, శనివారం సామాన్య ఫలితాలు కలుగుతాయి. మంగళవారం మాత్రం ఎలాంటి కార్యాన్ని ప్రారంభించ వద్దు. వీరి అదృష్ణ సంఖ్యలు 1, 4. ఎరుపు రంగు ఈ జాతకులకు శుభ ఫలితాలను అందిస్తాయి.

అశ్లేష నక్షత్రం

అశ్లేష నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు ఆశ్లేష నక్షత్రం గణము రాక్షస గణము. అధిదేవత పాము. రాశ్యాధిపతి చంద్రుడు. నక్షత్రాధిపతి బుధుడు. ఆశ్లేష నక్షత్ర మొదటి పాదము ఆశ్లేష నక్షత్ర మొదటి పాదం అధిపతి బుధుడు.అంసాదిపతి గురుడు కనుక వీరి మీద గురు, బుధగ్రహ ప్రభావం ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులకు విద్యా సంబంధిత ఉద్యోగాలలో వీరికి ఆసక్తి ఉంటుంది. మేధా సంబంధిత ఉద్యోగాలలోనూ వీరు బాగా రాణించగలరు. విద్యాసంస్థలు స్థాపన, నిర్వహణలో వీరు సమర్థులు. వీరికి నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. వీరు విద్యారంభంలోనే ప్రతిభను ప్రదర్శిస్తారు. 15 సంవత్సరాల సమయంలో హైస్కూల్ చదువు పూర్తి చేసే సమయంలో ఏడు సంవత్సరాల కేతుదశ కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అయినప్పటికీ ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమిస్తే తప్పక విజయం సాధిస్తారు. కేతువు అనుకూలంగా ఉన్న వారు సొంత ఊరికి దూరంగా (బయట ఊర్లలో లేక విదేశాలలో) విద్యాభ్యాసం చేయగలుగుతారు. తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా విద్య పూర్తి కాగానే జీవితంలో స్థిరపడతారు. వీరు చిన్న వయసులోనే జీవితంలో స్థిరపడతారు. భూ, విద్యా, ఆభరణ సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలిస్తాయి. తరువాత వీరికి జీవితం సాఫీగా జరిగిపోతుంది. ఆశ్లేష నక్షత్ర రెండవ పాదము ఆశ్లేష నక్షత్ర రెండవ పాదము అధిపతి బుధుడు. అంసాదిపతి శని కనుక వీరి మీద బుధ,శని గ్రహ ప్రభావం ఉంటుంది. వీరువ్యాపారం అంటే ఇష్టపడతారు. బుధ గ్రహ ప్రభావం కారణంగా మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఇనుము సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు కూడా అనుకూలిస్తాయి. 11 సంవత్సరాల వయసులో హైస్కులు విద్య ముందే వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా వీరికి కొన్ని ఆటంకాలు ఎదురౌతాయి. ప్రయత్నా పూర్వకంగా వాటిని అధిగమించి విజయం సాధించవచ్చు. 18 సంవత్సరాల వయసులో శుక్ర దశ మొదలవుతుంది. ఉన్నత విద్యాభ్యాస కాలంలో మనసు విలాసాల వైపు మళ్లే అవకాశం.. కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. విద్య పూర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. మిగిలిన జీవితం 51 సంవత్సరం వరకు వీరికి సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల కలం సాగే రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. రాహువు అనుకూలంగా ఉంటే విదేశీవాసం, విదేశీయాత్ర చేయడానికి అవకాశం కూడా ఉంది. వృద్ధాప్యం ఇబ్బందులు లేకుండా సాఫీగా జరుగుతుంది. ఆశ్లేష నక్షత్ర మూడవ పాదము ఆశ్లేష నక్షత్ర మూడవ పాదము అధిపతి బుధుడు. అంసాదిపతి శని కనుక వీరి మీద బుధ శని గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే ఇష్టం. బుధగ్రహ ప్రభావం కారణంగా మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. వీరు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. శ్రమించి పనిచేసే గుణం కలిగి ఉంటారు. వీరికి వ్రుత్తి, వ్యాపారం, ఉద్యోగాల మీద సమానంగా ఆసక్తి ఉంటుంది. మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఇనుము సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. విద్యా ఆరంభంలోనే ఆటంకాలు ఎదురౌతాయి. వాటిని అధిగమించి ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఏడు సంవత్సరాల వయసులో వచ్చే ఏడు సంవత్సరాల కేతుదశ కారణంగా విద్య లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. 14 సంవత్సరాలకే శుక్రదశ వస్తుంది కనుక కళాశాల చదువుల కాలంలో విద్య కంటే అలకరణ అంటేనే ఇష్టముంటుంది. కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మనసును మళ్ళించి విద్యాభ్యాసం పూర్తి చేయాలి. విద్యాభ్యాసం పూర్తి కాగానే జీవితంలో స్థిరపడతారు. సకాలంలో పెళ్లి జరిగే అవకాశాలు ఉంటాయి. 34 సంవత్సరాల వరకు సాగిన సౌఖ్యవంతమైన జీవితంలో తరువాత కొంత సౌఖ్యం తగ్గినా జీవితం సాఫీగా జరిగిపోతుంది. ఆశ్లేష నక్షత్ర నాలుగవ పాదము ఆశ్లేష నక్షత్ర నాలుగవ పాదం అధిపతి బుధుడు. అంసాదిపతి గురువు. ఆశ్లేష నక్షత్ర బుధుడు. వీరి మీద గురు బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. విద్యాసంబంధిత ఉద్యోగాలలో వీరికి ఆసక్తి ఉంటుంది. మేధా సంబంధిత ఉద్యోగాలలో రాణించగలరు. విద్యా సంస్థలు స్థాపన, నిర్వహణ వీరు సమర్ధవంతంగా చేస్తారు. వీరికి నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. వీరు విద్యారంభంలోనే మూడు సంవత్సరాల నుండి వచ్చే ఏడు సంవత్సరాల కేతుదశ కారణంగా విద్యారంభంలో ఆటంకాలను ఎదుర్కొంటారు. వాటిని అధిగమించి ముందుకు సాగవలసిన అవసరం ఉంది. తరువాత 10 సంవత్సరాలకు వచ్చే శుక్రదశ కారణంగా విద్య కంటే అలకరణ అంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది. కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మనసును మళ్ళించి విద్యాభ్యాసం పూర్తి చేసి విజయం సాధించవలసిన అవసరం ఉంది. నాలుగవ పాదములో జన్మించిన వారు కూడా విద్యాభ్యాసం పూర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. 30 సంవత్సరాల వరకు సాగిన సౌఖ్యవంతమైన జీవితంలో తరువాత కొంత సౌఖ్యం తగ్గినా జీవితం సాఫీగా జరిగి పోతుంది. 53 సంవత్సరాల అనంతరం వచ్చే రాహు దశ కాలమో కొన్ని సమస్యలను ఎదుర్కోనవలసిన అవసరం ఉంది. రాహు దశ అనుకూలిస్తే విదేశీయానం చేసే అవకాశం ఉంటుంది. వృద్ధాప్యం సౌఖ్యవంతంగా జరిగిపోతుంది. ఆశ్లేష నక్షత్ర జాతకుల గుణగణాలు ఆశ్లేష నక్షత్ర జాతకులు ఏ విషయంలోనైననూ పట్టుదల కలిగి ఉంటారు. వీరి పట్టుదల వీరిని ఉన్నత స్థితికి తీసికొని పోతుంది. శతృవుల విషయంలో పగతో ఉంటారు. వీరికి రాజకీయాలపై ఆసక్తి ఉంటుంది. వర్గ రాజకీయాలను సమర్ధతతో నడపగలరు. ప్రజా జీవితములో మంచి పేరు తెచ్చుకుంటారు. అడ్డంకుల నడుమ వీరి చదువులు కొనసాగుతాయి, ఏది ఏమి అయిన సరే వీరు ఆయా అడ్డగింపులని దాటి పై చదువులను పూర్తి చేస్తారు. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వీరు ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణించగలరు. కష్టపడి సుఖజీవితాన్ని అలవరచుకున్నా పొరపాటుగా ఉండే ఊహాల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. స్త్రీల వలన పెద్దల వలన జీవితములో ఇబ్బందులకు గురవుతారు. నమ్మకము లేని వ్యక్తులతో సహజీవనము సాగిస్తారు. ఉద్యోగములో నిపుణత సాధిస్తారు. ఉన్నతాధికారుల వలన, ఉన్నత స్థాయిలో ఉన్న వారి వలన ఇబ్బందులు ఎదురౌతాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో ఓర్పు వహిస్తారు. లక్ష్యసాధన కొరకు ఎంత కాలమైనా ఎదురు చూస్తారు. వయసు గడిచే కొద్దీ సుఖమయ జీవితానికి చేరువవుతారు. నమ్మకద్రోహులు స్నేహితులుగా ఉండడం దురదృష్టముగా పరిణమిస్తుంది. స్థిరాస్థులు దక్కించుకోగలుగుతారు. వీరికి ఆయుర్వేద మందులు, బియ్యం, పాల వ్యాపారం, పెట్రోలు బంకులు, బట్టల వ్యాపారము లాభిస్తాయి.

ఆశ్లేష నక్షత్ర మొదటి పాదం:- ఆశ్లేష నక్షత్ర మొదటి పాదం ధనసురాశిలో ఉంటుంది.  ధనసురాశి అధిపతి గురువు,           
ఆశ్లేష నక్షత్ర అధిపతి బుధుడు. వీరి మీద  గురు బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. విద్యాసంబంధిత ఉద్యోగాలలో వీరికి ఆసక్తి ఉంటుంది. మేధా సంబంధిత ఉద్యోగాలలో వీరు రాణించగలరు. విద్యాసంస్థలు స్థాపన, నిర్వహణ వీరు సమర్ధవంతంగా చేస్తారు . వీరికి నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. వీరు విద్యారంభంలోనే ప్రతిభను ప్రదర్శిస్తారు. 15 సంవత్సరాల సమయంలో హైస్కూల్ చదువు పూర్తి చేసే సమయంలో 7 సంవత్సరాల కేతుదశ కొన్ని అడ్డంకులు ఎదురౌతాయి. అయినప్పటికీ ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమిస్తే తప్పక విజయం సాధిస్తారు. కేతువు అనుకూలంగా ఉన్న వారు బయట ఊర్లలో లేక విదేశాలలో విద్యాభ్యాసం చేయగలుగుతారు. తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా విద్య పూర్తి  కాగానే జీవితంలో స్థిరపడతారు.  వీరు చిన్న వయసులోనే జీవితంలో స్థిరపడతారు. భూ, విద్యా, ఆభరణ  సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలిస్తాయి.
తరువాత వీరికి జీవితం సాఫీగా జరిగి పోతుంది.

ఆశ్లేష నక్షత్ర రెండవ  పాదం:-  ఆశ్లేష నక్షత్ర రెండవ  పాదం మకరరాశిలో ఉంటుంది. మకరరాశి అధిపతి శని . ఆశ్లేష నక్షత్ర అధిపతి బుధుడు. కనుక వీరి మీద బుధ శని గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది. బుధ గ్రహ ప్రభావం కారణంగా మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఇనుము సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. 11 సంవత్సరాల వయసులో హైస్కులు విద్య ముందే  వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా వీరికి కొన్ని ఆటంకాలు ఎదురౌతాయి. ప్రయత్నా పూర్వకంగా వాటిని అధిగమించి విజయం సాధించవచ్చు.  18 సంవత్సరాల వయసులో శుక్రదశ వస్తుంది. ఉన్నత విద్యాభ్యాస కాలంలో మనసు విలాసాల వైపు మళ్ళుతుంది కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి .విద్య పూర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. మిగిలిన జీవితం 51 సంవత్సరం వరకు వీరికి సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల కలం సాగే రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. రాహువు అనుకూలంగా ఉంటే  విదేశీవాసం,  విదేశీయాత్ర  చేయడానికి అవకాశం ఉంది . వృద్ధాప్యం సౌఖ్యంగా జరుగుతుంది.

ఆశ్లేష నక్షత్ర మూడవ పాదం:- ఆశ్లేష నక్షత్ర మూడవ పాదం కుంభరాశిలో ఉంటుంది. కుంభరాశి అధిపతి శని .  ఆశ్లేష నక్షత్ర  బుధుడు . కనుక వీరి మీద బుధ శని గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది. బుధ గ్రహ ప్రభావం కారణంగా మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. వీరు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. శ్రమించి పనిచేసే గుణం కలిగి ఉంటారు. వీరికి వ్రుత్తి, వ్యాపారం, ఉద్యోగాల మీద సమానంగా ఆసక్తి ఉంటుంది. మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఇనుము సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. విద్యా ఆరంభంలోనే ఆటంకాలు ఎదురౌతాయి. వాటిని అధిగమించి ముందుకు సాగవలసిన అవసరం ఉంది. 7 సంవత్సరాల వయసులో వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా విద్య లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. 14 సంవత్సరాలకే శుక్రదశ వస్తుంది కనుక కాలేజ్ చదువుల కాలంలో విద్య కంటే అలకరణ అంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది. కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మనసును మళ్ళించి విద్యాభ్యాసం పూర్తీ చేసి విజయం సాధించవలసిన అవసరం ఉంది. విద్యాభ్యాసం పూర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం  జరిగే అవకాశాలు ఉంటాయి. 34 సంవత్సరాల వరకు సాగిన సౌఖ్యవంతమైన జీవితంలో  తరువాత కొంత సౌఖ్యం తగ్గినా జీవితం సాఫీగా జరిగి పోతుంది.

  ఆశ్లేష నక్షత్ర నాలుగవ పాదం:- ఆశ్లేష నక్షత్ర నాలుగవ పాదం మీనరాశిలో ఉంటుంది.  మీనరాశి అధిపతి గురువు. ఆశ్లేష నక్షత్ర  బుధుడు . వీరి మీద  గురు బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. విద్యాసంబంధిత ఉద్యోగాలలో వీరికి ఆసక్తి ఉంటుంది. మేధా సంబంధిత ఉద్యోగాలలో వీరు రాణించగలరు. విద్యాసంస్థలు స్థాపన, నిర్వహణ వీరు సమర్ధవంతంగా చేస్తారు . వీరికి నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. వీరు విద్యారంభంలోనే 3 సంవత్సరాల నుండి వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా విద్యారంభంలో ఆటంకాలను ఎదుర్కొంటారు. వాటిని అధిగమించి ముందుకు సాగవలసిన అవసరం ఉంది. తరువాత 10 సంవత్సరాలకు వచ్చే శుక్రదశ కారణంగా విద్య కంటే అలకరణ అంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది. కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మనసును మళ్ళించి విద్యాభ్యాసం పూర్తీ చేసి విజయం సాధించవలసిన అవసరం ఉంది. విద్యాభ్యాసం పూర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం  జరిగే అవకాశాలు ఉంటాయి. 30 సంవత్సరాల వరకు సాగిన సౌఖ్యవంతమైన జీవితంలో  తరువాత కొంత సౌఖ్యం తగ్గినా జీవితం సాఫీగా జరిగి పోతుంది.  53 సంవత్సరాల అనంతరం వచ్చే రాహుదశ కాలమో కొన్ని సమస్యలను ఎదుర్కోనవలసిన అవసరం ఉంది. రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం చేసే అవకాశం ఉంటుంది. వృద్ధాప్యం సౌఖ్యవంతంగా జరిగి పోతుంది.