11 September 2016

జనాలు

*MUST READ*

కోట్ల ఆస్తి ఉండి కూడా రేషన్ బియ్యం కోసం కక్కుర్తి పడే జనాలు .,,

ప్రభుత్వ టీచర్ గా బతుకుతూ పిల్లల్ని ప్రైవేటులో చదివించే మేధావులు.

ఇల్లు, భూమి ఉండి కూడా ప్రభుత్వ పథకాలకి ఎగబడే గొప్ప వ్యక్తులు ,

పెంచి పోషించిన తల్లిదండ్రులని పెంచి పోషించే శక్తి ఉండి కూడా
ప్రభుత్వ పెన్షన్ ల కోసం కాపు కాస్తున్న రాకుమర రాబందులు ,,

మంచి ఉద్యోగం, మంచి భూమి, మంచి జీవితం ఉండి కూడా లేనోనికి
దక్కాల్సిన కార్డు ల కోసం కక్కుర్తి పడుతున్న బోగస్ బాగ్యవంతులు ,,,

తిండికే గతిలేని పేదవానికి రోగం వొస్తే ఉచితంగా నాణ్యమైన వైద్యం చేయాల్సింది పోయి అదే పేదల ప్రాణాల్ని కార్పొరేట్ గాలికి వొదిలేసి డబ్బుని ప్రేమిస్తున్న మన ప్రభుత్వ వైద్య నారాయణులు,,,

లంచం లేకుండా కంచం ముట్టుకోని మహా నీతి మంతులు ,

మాంసం లేకుండా ముద్ద దిగని మహా అహింసా వాదులు ,,,

అవినీతి రాక్షసులని ఉరి తీయాలి అని మైకలు విరగ గొట్టే ఈ అభినవ
భారతీయ వీరులు అవినీతి వ్యతిరేఖ పోరాటాలు చేస్తుంటారు,,

భారత దేశం ఇంకా అభివృద్ధి చెందకపోవటానికి కారణం ఈ మహానుభావులే.

అయితే వీళ్ళందరికీ ఈ నిజం ఒప్పుకునే దమ్ము లేక మంచి నాయకులు లేరు అనీ, రాజకీయం బురద గుంట అని స్పీచ్ లు దంచేస్తారు.
..
,అంతే కాని తమలో మంచి ఎంత ఉంది అని ఎవ్వరూ ఆలోచించరు.

ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందక పోవటానికి కారణం మంచి నాయకులు లేక కాదు మంచి ప్రజలు లేక మాత్రమే,,

తప్పుని నాయకుల మీదికీ,ప్రభుత్వాల మీదికీ తోసేయటం చాలా తేలిక కానీ అదే తప్పు ని తమలో చూడటానికీ, అవినీతి తమలోనే ఉంది అని ఒప్పుకోవటానికి మాత్రం చాలా ధైర్యం కావాలి,,
అది మనకు లేదు కాబట్టే మనలోనే విపరీతమైన అవినీతిని దాచి పెట్టుకుని మరీ మనం అంతా అవినీతి వ్యతిరేఖ పోరాటాలలో చురుగ్గా పాల్గొంటాం,,

మాలో తప్పుని ఒప్పుకోం వేరే వాళ్ళ తప్పుని ఎత్తి చూపే నిజమైన భారతీయులం మనమే

చిన్నప్పటి నుండి చూస్తున్న మనది అభివృద్ది చెందుతున్నదేశమే..

మన వాళ్ళు ఒకే మాట మీద ఉంటారు ఎన్ని సంవత్సరాలు అయినా ..
అభివృద్ది చెందుతున్న దేశం అంటే..మనదే..

ఎన్ని వందల సంవత్సరాలు అయినా///

No comments:

Post a Comment

మీ అభిప్రాయం తెలియచేయండి.