జ్యోతిష్యం "శాస్త్రం". సూర్యోదయం ప్రభావంతో మన శరీరాలు హార్మోన్లను విడుదల చేయడంతో మనం మేల్కొంటాం. అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, దూరంగా జరగడం వంటి మార్పుల వల్ల సముద్రపు అలల్లో తేడాలు వస్తాయి. అందువల్లనే మనవ మరియు ప్రకృతిలో విపరీత ధుర్ఘటనలు చూస్తున్నాము. పౌర్ణమి అమావాస్య ఎప్పుడు వస్తుందో మూడనమ్మకము అన్నవాడు చెప్పలేడు. మనపై మనకు విశ్వాసం లేకపోతే, ఇతరత్రా విషయాలేవీ పెద్దగా పనిచేయవు. అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి. సర్వే జనా సుఖినోభవంతు.
Showing posts with label దశావతారములు. Show all posts
Showing posts with label దశావతారములు. Show all posts
09 September 2016
శ్రీ హరి దశావతారములు
శ్రీ హరి దశావతారములు
1 .మత్స్యావతారము
వైవస్వత మను వొకనాడు నదిలో సూర్యునికి అర్ఘ్య మిచ్చు చుండగా ఒక చేప పిల్ల అతని చేతిలో బడెను . అది పెరిగి పెద్ద దగుచుండగా గంగాళము లోను ,చెరువులోను, సరస్సులోను వేసెను .
అప్పుడా చేప మనువుతో " ప్రళయ కాలమున ఒక నావ వచ్చును. దానిలో సప్త మహర్షులను నీవును ఎక్కి కూర్చుండుడు . ప్రళయాంతము వరకును ఆ నావను మహా సముద్రములో నా కొమ్మునకు గట్టుకుని లాగుకొని పోవుచునే యుందు, " నని చెప్పెను. మనువట్లే చేసి ఆ ప్రళయమును దాటెను. మరల బ్రహ్మ సృష్టి చేయుటకు పూను కొన్నప్పుడు హయగ్రీవుడను రాక్షసుడు (ఇతనినే సోమకాసురుడని కూడా అందురు ) వేదముల నపహరించి సముద్రములో దాగి యుండగా శ్రీ మన్నారాయణుడు మత్స్యావతారమును మరల ధరించి ,వానిని సంహరించి వేదములను మరల బ్రహ్మ దగ్గరకు చేర్చెను .
2 . కూర్మావతారము
దూర్వాసుని శాపముచే ఇంద్రుని సంపద లన్నియు సముద్రములో గలిసిపోగా ,విష్ణు మూర్తి సలహా మీద దేవ దానవులు సముద్రమును మదించిరి .
ఈ పాల సముద్రమును మదించుట కారంబించినపుడు కవ్వముగా వేసిన మందర పర్వతము మునిగిపోసాగెను . అప్పుడు నారాయణుడు కూర్మావతారమును ధరించి దాని క్రింద ఆధారముగా నిలువబడెను . దానితో సముద్ర మధనము జరిగి సర్వ వస్తువులను ,అమృతమును పుట్టెను.
3 .వరాహావతారము
హిరణ్యాక్షుడు దేవతలను గెలిచి స్వర్గ మాక్రమించిన ప్పుడు అతనిని యజ్ఞ వరాహ రూపముతో సంహరించెన
4 . నృసింహావతారము
అతని సోదరుడు హిరణ్య కశిపుడు తరువాత దేవలోకము నాక్రమించి యజ్ఞ భాగములను కాజేయగా నార సింహ రూపము ధరించి అతనిని సంహరించెను.
5 .వామనావతారముబలి చక్రవర్తి ఇంద్రుడై దేవతలను స్వర్గము నుండి తరిమి వేయగా శ్రీ హరి వామనుడై పుట్టి , బలిని మూడడుగుల నేల యడిగి , వామనుడు అవామనుడై రెండడుగులలో భూమ్యాకాశముల నాక్రమించి అతనిని పాతాళమునకు త్రొక్కి వేసెను .
6 .పరశురాముడుశ్రీ హరి తన అంశము తో జమదగ్నికి పరశురాముడై పుట్టి మదాంధులైన రాజులను ఇరువది యొక్క సారులు దండ యాత్రలు చేసి సంహరించెను. చివరికి దశరధ రాముని చేతిలో ఓడి తపమునకు బోయెను.
7 . శ్రీరాముడు
రావణ కుంభ కర్ణులను సంహరించుట కై దేవతలు ప్రార్ధించిన మీదట దశరధునకు రామునిగా పుట్టి ,సీతను పెండ్లాడి , సీతా లక్ష్మణులతో అరణ్య వాసము చేసి అనేక రాక్షసులను వధించెను .రావణుడు సీత నెత్తికొన పోగా సుగ్రీవుని సహాయముతో లంకకు వెళ్లి రావణ కుంభ కర్ణాది రాక్షసులను సంహరించి ,అయోధ్యకు వచ్చి పట్టము గట్టు కొనెను . లోకాపవాద మునకు భయపడి సీతను అడవిలో వదలగా ఆమె వాల్మీకి ఆశ్రమమునకు జేరెను. అప్పటికే గర్భవతి యైన సేత ,అక్కడ కుశలవులను ఇద్దరు కొడుకులను గనెను. రాముడు పదునొక్క వేల యేండ్లు రాజ్యము చేసి కుశునికి పట్టాభిషేకము చేసి, సీతా సమేతుడై అయోధ్యా పుర వాసులతో సహా పరమ పదమునకు వేంచేసెను .
8 .శ్రీ కృష్ణావతారము
ఇరువది ఎనిమిదవ ద్వాపర యుగములో అధర్మ ప్రవృత్తు లైన రాజుల వలన భూభారము పెరిగినప్పుడు భూదేవి కోరికపై శ్రీ హరి ,కృష్ణావతారము నెత్తెను.
దేవకీ వసుదేవులకు అష్టమ గర్భమున జన్మించి ,వ్రేపల్లెలో నంద యశోదల యింట పెరిగి బాల్య క్రీడలచే వారిని అలరించి , దుష్ట రాక్షసులను సంహరించెను.
మధురా పురమునకు పోయి కంసుని సంహరించి ,మాతామహుని రాజ్యమున నిలిపి, బలరామునితో గలిసి శత్రువులను నిర్మూలించెను. రుక్మిణ్యాది అష్ట మహిషులను వివాహ మాడెను. నరకుని జంపి 16000 మందిని వాని చెర నుండి విడిపించి పెండ్లాడెను. ద్వారకా నగరమును నిర్మించి బార్యా పుత్ర బంధు మిత్ర పరివారముతో నూట పాతిక యేండ్లు భూలోకమున నివసించెను . భారత యుద్దములో పాండవుల పక్షమున నుండి అధర్మ పరులను నాశనము చేసెను. తరువాత యాదవులు మదించి అధర్మముగా ప్రవర్తించు చుండగా ముసలము వంకతో వారిని గూడా సంహరించి తాను పరమ పదమునకు చేరెను .
9 బుద్దావతారముఒకప్పుడు రాక్షసులు విజ్రుంభించి దేవలోకము పై దండెత్తి దేవతల నోడించి తరిమివేసిరి ,దేవతలు ప్రార్ధింపగా మాధవుడు, మాయా మోహ స్వరూపముతో శుద్దో దనుని కుమారుడుగా జన్మించెను. వేద విరుద్దములైన బోధలతో రాక్షసుల నందరును సమ్మోహ పరచి వారిని వేద బాహ్యులను జేసెను.ఒక్క రాక్షసులనే కాక భూలోక వాసులను గూడా భ్రమింపజేసెను . రాక్షసులు పాషండులై బలమును తేజమును కోల్పోయిరి. అప్పుడు దేవతలు వారి నోడించి స్వర్గమును చేజిక్కించు కొనిరి.
10 కల్కి తారముబుద్దుని బోధనల ప్రభావము భూలోకమున రాజులపై ప్రసరించును .వారు ధర్మ పరులై ప్రజా కంటకులై ప్రవర్తింతురు. ప్రజలు కూడా అన్యాయ ప్రవర్తనులై వేద కర్మల నాచరింపక యుందురు. అప్పుడు కలియుగములో విష్ణు యశుడను వానికి శ్రీ హరి ,కల్కి రూపముతో జన్మించును .ధర్మమును తిరిగి ప్రతిష్టించును .
ఈ దశావతారముల కధను విన్నవారికి అనంతమైన పుణ్యము గలుగును.
Subscribe to:
Posts (Atom)