21 May 2020

క్షణికావేశం మనిషిని చంపేస్తుందా

ఓపికగా చదవండి.

అన్యోన్యత - అలక = ఆత్మహత్య

పెద్ద పెద్ద చదువులు గొప్ప ఉద్యోగాలే మనషుల నాశనానికి కారణం అవుతున్నాయా?

క్షణికావేశం మనిషిని చంపేస్తుందా?  

ప్రతి చిన్న విషయాన్ని రెచ్చగొట్టుకొని  రాజీ పడలేక తనువు చాలించుట అవసరమా?

"పెళ్లయిన 4నెలలకే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి విషాదాంతం..

చావుకు భార్యే కారణమని సూసైడ్‌నోట్‌.

జూన్22.2019 రాజేంద్రనగర్ హైదరాబాద్ లో జరిగిన సంఘటన పరిశీలిస్తే.












-----------–------------------------------
1. నాణానికి మొదటి వైపు పరిస్థితి

ఆ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దంపతులది అబ్బురపడేంత అన్యోన్యత పెళ్లయి నెల గడిచిన సందర్భాన్నే పెద్ద వేడుకగా నిర్వహించుకున్నారు. పెళ్లయిన 12 రోజులకే భర్త పుట్టినరోజును అన్నీతానై నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతలా పెనవేసుకుపోయిన అనుబంధంలో చిన్న పొరపొచ్చాలొచ్చాయి. అవి కొన్ని వారాల్లోనే మనస్పర్థలుగా వేళ్లూనుకున్నాయి. దీంతో ఆ దంపతులు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఫోన్‌ చేసుకున్నా. ఒకరి మీద ఒకరు అరుచుకున్నేంతగా కోపతాపాలను ప్రదర్శించుకున్నారు. చివరికి పెళ్లయిన నాలుగు నెలలకే వారి వివాహ బంధం విషాదంగా ముగిసింది. మనస్పర్థలతో తాను బతకలేనంటూ ఆ భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ప్రవర్తన కారణంగానే చనిపోతున్నానంటూ సూసైడ్‌ నోట్‌ రాశాడు. 















హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని హైదర్‌గూడలో ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్‌గల్‌ గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డి కుమారుడు సుమంత్‌రెడ్డి (27)కి శంషాబాద్‌కు చెందిన స్వప్నారెడ్డితో గత ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. హైదర్‌గూడ జనప్రియ ఉటోపియా సమీపంలోని న్యూ ఫ్రెండ్స్‌ కాలనీ లహరి ఫోర్ట్‌ అపార్ట్‌మెంట్‌లో కాపురం పెట్టారు. సుమంత్‌, స్వప్నారెడ్డి ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లే.
పరస్పరం ఫోన్లు లిఫ్ట్‌ చేసుకోకపోవడమే  ఆత్మహత్యలకు కారణం అయింది.















వారం క్రితం స్వప్నకు ఫుడ్‌ఫాయిజన్‌ కావడంతో సుమంత్‌ ఆమెను శంషాబాద్‌లోని అత్తారింట్లో వదలి వచ్చాడు. ఉద్యోగానికి వెళ్లవద్దని, విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడు. స్వప్న మాత్రం ఉద్యోగానికి వెళ్లినట్లు తెలిసింది. ఈనెల 20న స్వప్నకు ఫోన్‌ చేయగా ఆమె లిఫ్ట్‌ చేయలేదు. తర్వాత సుమంత్‌కు ఆమె ఫోన్‌ చేయగా అతడూ ఫోన్‌ తీయలేదు. అదేరోజు ఇద్దరూ ఫోన్లో మాట్లాడకుని పెద్దగా అరుచుకున్నారు. ఆ తర్వాత స్వప్న ఎన్నిసార్లు ఫోన్‌చేసినా సుమంత్‌ లిఫ్ట్‌ చేయలేదు. ఆందోళన చెందిన ఆమె ఇంటి సమీపంలో ఉండేవారిని అప్రమత్తం చేసింది. వారు వెళ్లి తలుపు తట్టగా స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల సమక్షంలో తలుపులు తెరిచి చూడగా ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో సుమంత్‌ కనిపించాడు. తన మరణానికి భార్య స్వప్న, అత్త పద్మ, స్వప్న కజిన్‌ శ్రీ, స్వప్న బాబాయి కారణమంటూ సూసైడ్‌ నోట్‌లో ఆరోపించాడు. తనను క్షమించాలని అమ్మానాన్నలను కోరాడు. తమ్ముడు శ్రవంత్‌ను ఉద్దేశించి ఐ లవ్‌యూ అమ్మానాన్నలను మంచిగా చూసుకో’ అని రాశాడు. తన మరణానికి కారణమైన వారెవరూ అంత్యక్రియలకు రావద్దని, వాళ్లు వస్తే తన ఆత్మకు శాంతి కలగదని రాశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్యోన్యత- అలక= ఆత్మహత్య
హార్మోన్ల లోపాలు+అవగాహన లోపాలు= రెండు కుటుంభాల నష్టం















2.నాణానికి రెండవ వైపు ఆలోచిస్తే
హార్మోన్ల లోపాలు.

మనిషి జీవించటానికి శ్వాస ఎంత ముఖ్యమో మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు అంతే ముఖ్యం. గర్భాశయంలో పిండముగా ఏర్పడినప్పటి నుంచి మనిషి కన్నుమూసేంత వరకు శరీరం మీద హార్మోన్ల ప్రభావము ఉంటుంది. శరీరంలోని ఒక కణము నుంచి మరొక కణానికి రసాయనిక సమాచారం అందజేసే, సంకేతాలను తెలిపే కెమికల్స్‌ను హార్మోన్లు అంటారు. మెదడు భాగంలోని హైపోథాలమస్‌, పిట్యూటరి గ్రంథి హార్మోన్ల ఉత్పత్తికి దోహదపడి శరీరంలోని కణాల క్రమబద్ధతకు ప్రాముఖ్యత వహిస్తాయి. ఈ హార్మోన్లు శరీర ఉష్ణోగ్రతను, ఆకలిని, మానసిక స్థితిని, నిద్రను, దాహము, కామక్రోధమును అదుపులో ఉంచుతాయి.















ఈ మధ్య కాలంలో హైపోథైరాయిడ్‌, సిసిఒడి, సంతానలేమి, డయాబెటిస్‌ వంటి దీర్ఘకాలిక జబ్బులన్నీ హార్మోన్‌ అసమతుల్యత వల్ల వచ్చేవి. చాలా రకాల హార్మోన్లు మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. హార్మోన్లు పాలిపెప్లైడ్‌తో నిర్మితమైన రసాయన వాహకాలు. ఇవి శరీరంలో ఒక ప్రాంత కణజాలం, అవయవాల నుంచి ఉత్పత్తి అయి, వివిధ శరీర భాగాలకు రక్తం ద్వారా ప్రవహించి నిర్దిష్ట అవయవాలను ప్రభావితం చేసి జీవప్రక్రియల సమతుల్యతకు తోడ్పడతాయి. హార్మోన్ల సమతుల్యం దెబ్బతిన్నప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల బారిన

పడతారు. ఈ హార్మోన్లు ఎండోక్రైన్‌, ఎక్సోక్రైన్‌ గ్రంధుల నుంచి ఉత్పత్తి అవ్ఞతాయి. శరీరంలో ఇవి సూక్ష్మమోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణ జీవక్రియలైన జీర్ణక్రియ, శారీరక, మానసిక ఎదుగుదల, మానసిక సమతుల్యం దెబ్బతిన్నప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు.

ఈ హార్మోన్లు ఎండోక్రైన్‌, ఎక్సోక్రైన్‌ గ్రంథుల నుంచి ఉత్పత్తి అవ్ఞతాయి. శరీరంలో ఇవి సూక్ష్మమోతాదులో ఉత్తత్తి అయినప్పటికీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణ జీవక్రియలైన జీర్ణక్రియ, శారీరక, మానసిక ఎదుగుదల, మానసిక సమతుల్యత జీవక్రియలకు తోడ్పడతాయి. థైరాయిడ్‌ హార్మోన్ల టి3, టి4 ఇవి థైరాయిడ్‌ గ్రంథి నుంచి ఉత్పత్తవ్ఞతాయి. వాటి అసమతుల్యత వల్ల హైపోథైరాయిడ్‌, హైపర్‌థైరాయిడ్‌, గాయిటర్‌ అనే దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి. ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌, ప్రొలాక్టిన్‌, ఆక్సిటోసిన్‌ హార్మోన్లు స్త్రీలలో నెలసరి, సంతానోత్పత్తి, ప్రసవంలో ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత వల్ల స్త్రీలలో నెలసరి సమస్యలు, అవాంచిత రోమాలు, సంతానలేమి, సమస్యలు వస్తాయి.















స్త్రీలలో మెనోపాజ్‌, నెలసరి వచ్చే సమయంలో హార్మోన్లలో హెచ్చుతగ్గుల వల్ల వేడి ఆవిర్లు, మానసిక అశాంతి, నీరసం కీళ్లనొప్పులు వస్తాయి. 

మగవాళ్లలో ముఖ్యంగా టెస్టోస్టిరాన్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి అయి ఎముకల సాంద్రతకు, కండరాల పటుత్వానికి, వీర్యకణాల వృద్ధికి దోహదపడుతుంది. ఈ టెస్టోస్టిరాన్‌ లోపం వల్ల కండరాల పటుత్వం తగ్గిపోవటం, డిప్రెషన్‌, టైప్‌ 2 డయాబెటిస్‌ అంతేకాక ఎల్‌హెచ్‌, ఎఫ్‌ఎస్‌హెచ్‌ డెఫీషియెన్సీ వలన హై పోగొనాజిజమ్‌ వచ్చే అవకాశం ఉంది. టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ అసమతుల్యత వల్ల సంతానలేమి సమస్యల వస్తాయి. పిల్లల బరువ్ఞ, ఎత్తు, ఎదుగుదల సమస్యలు వస్తాయి. హార్మోన్ల ప్రభావము శరీరము మీద ఎంతో ఉంటుంది. థైరాయిడ్‌ సమస్యలతో బాధపడేవారు జీవితాంతము మందులు వాడాల్సి వస్తుందని వాపోతుంటారు.














హార్మోన్లు లోపిస్తే
గ్రంథులకు సంబంధించిన సమస్యలు వాటి స్రావాలో హెచ్చుతగ్గుల వల్లే తలెత్తుతాయి. అంటే అవసరానికి మించి ఎక్కువగా స్రవించినా లేదా అవసరానికి సరిపడా స్రవించకపోయినా ఆరోగ్య సమస్యలు తప్పవు. కాబట్టి లక్షణాలను బట్టి ఏ హార్మోన్‌ స్రావంలో తేడాలున్నాయో కనిపెట్టి ఆ హార్మోన్‌ స్రవించే గ్రంథుల్లో సమస్యను సరిదిద్దే చికిత్స తీసుకోవాలి. వయసు, ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం, వంశపారంపర్యం గా హార్మోన్లలో అవకతవకలు తలెత్తవచ్చు.


 ఆలస్యంగా పడుకోవటం వల్ల చర్మం పొడిబారటం, గోర్లు బలహీనంగా ఉండటం, వెంట్రుకలు రాలిపోవటం, చుండ్రు సమస్యలు వస్తాయి. ఎందుకంటే నిద్ర సరిగ్గా లేకపోతే శరీరంలో హార్మోన్ల పని విధానం అసమత్యులంగా ఉంటుంది.

మనం ఒత్తిడికి గురైనప్పుడు కార్టిజోల్‌ హార్మోన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మెదడులోని నాడీకణాలను దెబ్బతీసే అవకాశముంది.

నవ్వటం వల్ల మెదడులో ఎండార్ఫిన్లు, డొపమైన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి సంతోషాన్ని, హుషారును తెచ్చిపెట్టటమే కాదు గామా తరంగ ఫ్రీక్వెన్సినీ మెరుగుపరుస్తాయి.

మనలో ఉత్పన్నమయ్యే భావోద్వేగాలకు మెదడులోని బాదం షేపులో ఉండే ‘అమిగ్దలా’ కారణం. మనకు ఏదైనా అప్రియమైన ఘటన జరుగుతుందని తెలిసిన వెంటనే ఈ అమిగ్దలా ప్రేరేపితమవుతుంది. అయితే మనకు జరగబోయే అసలు నష్టాన్ని తార్కికంగా ఆలోచించే భాగం ‘కార్టెక్స్‌’. ఈ కార్టెక్స్‌ కంటే ముందుగానే అమిగ్దలా రంగంలోకి దిగిపోవడంతో ఒంట్లో అడ్రినలీన్, కార్టిసోల్, టెస్టోస్టెరాన్‌ వంటి హార్మోన్లు స్రవిస్తాయి. అడ్రినలిన్‌ రక్తంలోకి చాలా ఎక్కువ మోతాదులో పంప్‌ అవుతుంది. అడ్రినలిన్‌ ఎంత ఎక్కువగా ఉంటే కోపం తీవ్రత అంత ఎక్కువన్న మాట. అదే సందర్భంలో ఆ కోప సమయాన్ని ఎదుర్కునేందుకు అవసరమైన శక్తి కోసం రక్తంలోకి గ్లూకోజ్‌ కూడా ఎక్కువగా పంప్‌ అవుతుంది. అంతేకాదు అన్ని కణాలకూ ఆ శక్తి చేరడానికి వీలుగా రక్తనాళాలూ విప్పారతాయి. ఇలా విప్పారడం వల్ల రక్తం జివ్వున ఎగజిమ్మడం వల్లనే కొందరిలో కోపం వచ్చినప్పుడు ముఖం, శరీరం ఎర్రబారతాయి. అయితే సమన్వయ వ్యవస్థలో భాగంగా  మెదడులోని విచక్షణాæ కేంద్రమైన కార్టెక్స్‌ రంగంలోకి దిగి క్రమంగా పరిస్థితిని అవగతం చేసి పారాసింపాథెటిక్‌ నర్వస్‌ సిస్టమ్‌ ద్వారా వ్యక్తిని క్రమంగా నార్మల్‌ స్థితికి తెస్తుంది. ఇదీ కోపంలో జరిగే మెకానిజమ్‌.
















ఆగ్రహ వ్యక్తీకరణల్లో అనేక రకాలు  
కోపం వ్యక్తమయ్యే తీరును బట్టి దానికి పేరు పెట్టారు మానసిక నిపుణులు. కోపం యొక్క లక్షణాలు, వాటి పేర్లు ఇలా ఉన్నాయి. 

షౌటింగ్‌ స్పెల్స్‌ : తీవ్రస్వరంతో గొంతు చించుకుని అరవడం. ఇలా అదుపు కోల్పోయి అరవడం వల్ల కొన్నిసార్లు కొందరిలో స్వరపేటిక దెబ్బతింటుంది. గొంతు బొంగురుబోతుంది. చాలా రోజులు మామూలుగా మాట్లాడలేరు కూడా. ఇలాంటి కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘షౌటింగ్‌ స్పెల్స్‌’గా చెప్పవచ్చు. 

బ్యాంగింగ్‌ ఆఫ్‌ హెడ్‌  : తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోతూ తలను గోడకేసి బాదుకోవడాన్ని ‘బ్యాంగింగ్‌ ఆఫ్‌ హెడ్‌’ అని అంటారు. 

డెలిబరేట్‌ సెల్ఫ్‌ హార్మ్‌ (డీఎస్‌హెచ్‌) :  ఇది కోపంలో తమకు తాము హాని చేసుకునే స్థితి.

ఉదాహరణకు బైక్‌పై వెళ్తున్నప్పుడు రాయి అడ్డం పడి బండి పక్కకు ఒరిగిపోయిందనుకోండి. కోపంతో వాహనదారుడు కాలు చిట్లి రక్తం వచ్చేంత తీవ్రతతో ఆ రాయిని తంతాడు. గాయపడతాడు. ఆత్మహత్యకంటే ఒక మెట్టు తక్కువ స్థాయి ఆగ్రహప్రకటన ఇది. 

డెలిబరేట్‌ ఇన్‌సామ్నియా : కొందరు తమ ఆగ్రహాన్ని నిద్ర మీద చూపిస్తారు. తమకు ఎంతగా నిద్రవస్తున్నా నిద్రపోకుండా తమను తాము హింసించుకుంటారు. దీన్ని వైద్యపరిభాషలో ‘డెలిబరేట్‌ ఇన్‌సామ్నియా’గా చెబుతారు. 

డెలిబరేట్‌ నాన్‌ కో–ఆపరేషన్‌: గాంధీమార్గంలో కోపం వ్యక్తం చేసే రూపమిది. బాగా కోపం వచ్చిన వారు దాన్ని తమ రోజువారీ కార్యకలాపాల మీద చూపిస్తారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లరు. పెద్దలైతే ఆఫీసుకు వెళ్లరు. బాస్‌ పిలిచినా ఆఫీసు సమావేశాలకు అటెండ్‌ కారు. 

చేతిలోని వస్తువు విసిరి కొట్టడం : టీవీలో మనం సపోర్ట్‌ చేస్తున్న టీమ్‌ ఓడిపోయిందనుకోండి. టీవీని బద్దలు కొట్టేస్తాం. అలాగే కొందరు కళ్లజోడునూ, చేతిలోని మొబైల్‌నూ విసిరివేయడం చాలా కుటుంబాల్లో చూసే దృష్టాంతమే. ఇది ఆర్థికంగా చేసుకునే హాని. 

జుట్టు పీకేసుకోవడం : ఆగ్రహంతో జుట్టుపీకేసుకోవడం చేస్తారు. కేవలం తలపైని జుట్టు కాకుండా కొందరు కనురెప్పల్లోని వెంట్రుకలు మీసంలోని వెంట్రుకలు పీకేసుకుంటుంటారు. ఇలా జుట్టు పీకేసుకునే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘ట్రైకోటిల్లోమేనియా’ అంటారు.

















ఆగ్రహాన్ని అదుపు చేసుకొనే మార్గాలు (యాంగర్‌ మేనేజ్‌మెంట్‌)
కోపం ఎప్పుడూ మన అదుపులోనే ఉండాలి. దాని అదుపులోకి మనం వెళ్లకూడదు. కోపాన్ని నివారించుకునేందుకు అనుసరించదగిన కొన్ని మార్గాలివి...  
►కోపంతో ఏదైనా పనికి పూనుకునే ముందు దానిని వాయిదా వేయాలి. ఒకటికి రెండు సార్లు చేయబోయే పని మంచిదేనా అని ఆలోచించాలి. ఆ పని చేసే ముందర శ్రేయోభిలాషితో తప్పక సంప్రదించాలి. 
►జీవితంలో అన్నీ తాత్కాలికమైన పరిణామాలే. కోపం ఒక ఉద్వేగం. అది క్షణికం మాత్రమే. ఆ స్థితి దాటిన తర్వాత పరిస్థితి మామూలైపోతుంది అని గ్రహించాలి. 
►ప్రతిసారీ మనదే గెలుపు కాదు. కొన్నిసార్లు అవతలి వాళ్లూ గెలవవచ్చు. ఇది చాలా సహజం. క్రీడాస్ఫూర్తితో ఈ వాస్తవాన్ని ఆమోదించాలి. 
►మీరు ఎంతగా మన శ్రేయోభిలాషుల మాటలు వింటుంటే, మీలోని ఆగ్రహం అంతగా తగ్గుతుంది.  
► జీవితంలో ప్రతిదీ మీకు తెలిసి ఉండాలనే లేదు. మీకు తెలియని అంశాలూ ఉండవచ్చు. అందుకోసం చిన్నబుచ్చుకోవడం, కోపం తెచ్చుకోవడం తగదు. 
►నిద్రపోవడం, విశ్రాంతి తీసుకోవడం, రిలాక్స్‌ కావడం. జీవితంలో ఇవీ చాలా ప్రధానమైనవే అని గుర్తుంచుకోండి. 
►కోపాన్ని సమర్థంగా నియంత్రించగలవాడు అని మీరు నమ్మినవాళ్లను మీ రోల్‌మోడల్‌గా ఎంచుకోండి. వాళ్లను అనుసరించడానికి ప్రయత్నించండి. వారంలో కనీసం కొద్దిసేపు వాళ్లతో గడపండి.
►మీకు కోపం వచ్చినప్పుడు మీరు గెలవవచ్చు. కానీ మీ కుటుంబ సభ్యులు ఓడిపోతుంటారన్న విషయాన్ని గ్రహించండి. 
► మీ మాట నెగ్గుతోందా, మీ పంతం నెరవేరుతోందా, లేక మీరు గెలుస్తున్నారా అన్న అంశంపై స్పష్టత తెచ్చుకోండి. 
►ఏయే సమయాల్లో మీకు కోపం వస్తుందో గ్రహించి, మీ వృత్తి బాధ్యతలలో కోపం వల్ల మీరేమి కోల్పోతున్నారో, దానిని అధిగమించడం వల్ల మీరు గెలవగలిగేదేమిటో రాసుకొండి. దాన్ని మాటిమాటికీ చదువుకోండి.














శరీరంపై హార్మోన్ల ప్రభావం వల్లనే తమ పిల్లల జీవితాలను కాపురాలను నాశనము చేసుకుంటున్నారనే సత్యం ఎంతమందికి  తల్లిదండ్రులకు తెలుసు.

మీకు దేవుడిచ్చిన తెలివిని వాడండి. ఎవడో చెప్పిన మాయమాటలను కాదు.

కేవలం జాతకంను  మాత్రమే నమ్ముకోవడము , ఆరోగ్యానికి సంభందించిన విషయాలు విస్మరించటం కరక్టే కాదు. 

సర్వేతు సుఖిన శాంతి, సర్వే సంతు నిరమాయ
సర్వే భద్రాని పాశ్యాంతు, మా కష్చిత్ దుహ్ఖభ్ఘాగ్ భవేత్ ||
ఓం శాంతిహ్, శాంతి, శాంతిహ్ ||

అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి



గ్రహదోషాల పేరుతో మొసపోతున్న  వేలాది మందికి నాకు తెలిసిన శాస్త్ర పరిజ్ఞానాన్ని మీకు తెలియజేస్తూన్నాను.












No comments:

Post a Comment

మీ అభిప్రాయం తెలియచేయండి.