21 May 2020

మనమే అసలు గ్రహాలం కాదా?

దయచేసి పూర్తిగా చదవగలరు.  

మనమే అసలు గ్రహాలం కాదా?
మనం మారాలి మన మనస్సులు మారాలి .

హైదరాబాద్ :- భార్యాభర్తలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో చోటు చేసుకుంది.

విడాకులు అడిగితే ఇవ్వడం లేదని భర్తతో విసిగిపోయిన ఓ భార్య అతన్ని దారుణంగా గన్‌తో కాల్చి చంపించింది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన గ్రేటర్ నోయిడా సమీపంలో వెలుగుచూసింది.

విడిపోయిన భార్యాభర్తలను కలిపిన ఎంపీటీసీ టికెట్
News18  3 May. 2019 21:38
గత ఐదేళ్లుగా మనస్పర్థలతో దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఎంపీటీసీ అభ్యర్థిత్వం వల్ల కలిసిపోయారు. ఇప్పుడు చిలక గోరింకల్లా కలసి ప్రచారం చేస్తున్నారు.

చెన్నై భర్తలూ జాగ్రత్త. అన్నం వండలేదా  గరిటెతో భర్తపై భార్య దాడి...

కూతురిని వేధిస్తున్నాడని అల్లుడిని హత్యచేసిన అత్త

భార్యను, మామను, ఇద్దరిని చంపబోయాడు కారణమదే!

ముదినేపల్లి :-  వివాహిత ఆత్మ‌హ‌త్య‌
Prabhanews 03 May. 2019 16:39










వివాహం చేసుకోవాలి అని నిశ్చయించుకున్నటువంటి యువతీ యువకులలో అనేక కోరికలు ఉంటాయి. అమ్మాయిలయితే నాకు రాకుమారుడు కావాలని, అదే అబ్బాయిలయితే నాకు రాకుమారి కావాలి అని. కాని, ఎవరు కోరుకున్న వారు ఎవరికీ పూర్తిగా వారు కోరుకున్న లక్షణాలతో దొరకరు. అందుకనే వివాహము అంటేనే సర్దుకుపోవడం మరియు ఒకరికొకరు అర్ధం చేసుకోవడం. 

పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా
ప్రస్తుత సమాజములో పంచాగమునందు చూపబడిన వధూవర గుణమేళన చక్రప్రకారము ఎవరికి వారు చూసుకుని 18 పాయింట్లు తగ్గితే వచ్చిన సంబంధం వదులుకుని 18 పాయింట్సుకి పెరిగితే వారే కన్ఫార్మ్ చేసుకొనటము జరుగుతోంది. అనుభవంలో 18కన్నా తగ్గినవారు ఆనందంగా ఉండడం చూస్తున్నాము. అలాగే 18 పాయింట్లకన్నా పెరిగినవారు ఇబ్బందులు పడటము చూస్తున్నాము. ఈపొంతన విషయంలో చాలా మంది సందిగ్ధంలో చాలా కన్య్ఫూజ్ అవతున్నారు. 

నానమ్మ తాత గారికి ఎవరూ పూర్తి జాతకం చూడలేదే అయినా వారు అన్నోన్యంగా ఉంన్నారు కదా!

మీరు మొదట స్వచ్ఛంగా అంతరంగంలోను, బాహ్యంలోను స్వచ్ఛంగా ఉండాలి. 

అయితే మీరు నేనే అత్యంత స్వచ్ఛమైన మనిషిని నాకే చక్కని హృదయం, మనస్సుఉన్నాయి.ఇలా అనుకో వడం మొదలుపెడితే అది అహంకారానికి దారితీసే ప్రమాదం ఉంది. ఆ అహంకారం మిమ్మల్ని త్వరలోనే పతనం చేరుస్తుంది. 












ఆమెకి అత్తగారితో అస్సలు పడటం లేదు.
ఆమెతో నిత్యం వాదులాటే రోజూ మాటలయుద్ధమే
ఇక ఉండలేననుకుంది.
తండ్రి దగ్గరకి వచ్చి నాన్నా ఈ అత్తని అంతం చేసెయ్యాలి అది బతికున్నంతకాలం నాకు శాంతి లేదు.

కొత్త కోడలు అత్తవారింటికి వెళ్ళగానే ముందుగా అందరి యొక్క మనస్తత్వాలను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారి మనసుకు అనుగుణంగా నడుచుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే వివాహము తరువాత ఇక ఈ కుటుంబమే నా కుటుంబము. కాబట్టి మన కుటుంబంలోని వారి కోసము మన యొక్క చిన్న చిన్న అలవాట్లను వారి కోసమే మార్చుకోవడంలో కూడా ఎంతో ఆనందం ఉంటుంది. ఇలా మార్చుకోవడం వలన కూడా మనము ఆనందాన్ని వెతుక్కుంటే ఆ జీవితము స్వర్గతుల్యమే. 















వీళ్ళతో నేను సర్దుకు పోవడమేమిటి, వాళ్ళే సర్దుకుపోవాలి అని అనుకుంటే మాత్రము పైకి చాలా గంభీరంగా కనిపించినప్పటికీ మనసులో ఎదో ఒక అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది. 

ఆత్మహత్యలకు కారణం పేదరికం కాదు. ప్రజలలో పరస్పర విశ్వాసం, సమాజంపై విశ్వాసం కోల్పోవడమే దీనికి కారణం. ప్రతీ విషయము మోసంగా ,ప్రతీ వ్యక్తిని స్వార్ధపరులుగా చూడటం, ఏ ఒక్కరిని మంచివారుగా చూడకపోవడం ఇలా ఒక విధమైన అభద్రా తాభావం సమాజంలో సృష్టించబడింది. 














దాంతో నేడు పెళ్లైన కొత్త దంపతులు కూడా తమ సామాన్లు అన్నీ విడివిడిగా ఉంచుకుంటు న్నారు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకే ఇంట్లో కలిసి జీవిస్తూ కూడా నీవి నువ్వు వేరే ఉంచుకో,నీ మనసెప్పుడు ఎలా మారు తుందో ఎవరికి తెలుసు అంటున్నారు.

దీని అర్ధం నీ సహధర్మ చారిణి యొక్క మంచితనాన్ని కూడా నువ్వు నమ్మలేకపోతున్నావన్న మాట. నీస్వంత పిల్లల మంచితనా న్నే నువ్వు నమ్మలేకపోతున్నావు. దుష్టసాంగత్యం ఆ విధంగా ప్రజలపై నీకు గల విశ్వాసాన్ని నాశనం చేస్తుంది. అంతిమంగా నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.














వ్యవస్థలో ఇబ్బందులు పడుతూ సౌఖ్యానికి నోచుకోక భార్యాభర్తల పరిస్థితి నటనా జీవితంగా మారిపోతుంటే రాబోయే తరాల పరిస్థితులు ఏమిటని ఆలోచించకుండా కుజగ్రహ ప్రభావం ఎలా ఉంటుంది అని అంటున్నాం. ఇది ఎంతవరకు సమంజసం. అలాగే నూతన వధూవరులకు క్రొత్తలోనే చిన్నచిన్నఇబ్బందులు వస్తే ఒకరు కుజగ్రహ ప్రభావము అంటారు, మరొకరు మరోదోషము ఉంది అంటారు. వేరొకరు అదేంకాదు ముహూర్తదోషము అంటారు. అన్నీ ఎవరికి వారు సొంతంగా ఊహించేసి ఏదోఒకటి మాట్లాడేయటమే. ఏమి చేయలేకపోతే ఇంకొంచెం గిల్లేసి వెళ్లిపోవటమే.












ఒకవేళ ఆ దోషాలు ఉన్నాయి వాటివల్లే ఇట్లా జరుగుతోంది అని అనుకునే వ్యక్తులు అపోహపడితే ఆ జాతకాలు ఎప్పటికి మారే అవకాశమే ఉండదు. ఎందుకంటే అవి జాతకంలో ఉన్నాయి అంటే అవి పర్మనెంటే కదా అంచేత గ్రహాల మీద అభాండాలు వేసేకంటే మనమే అసలు గ్రహాలని గుర్తుంచుకుని దంపతులు ఇరువురు నెగ్గినప్పుడు పొగుడుకుంటూ ఓడినప్పుడు ఓదార్చుకుంటూ జీవనం సాగించాలి.

 భార్యాభర్తలు అసౌఖ్యానికి గురి అయినప్పుడు ఆత్మపరిశీలన చేసికొని దానికి గల కారణాలను అవగాహన చేసికొని సరిదిద్దుకొని ప్రయాణం చేస్తే అంతా ఆనందమే. దానికి తల్లిదండ్రులు, అత్తమామలు నిస్వార్ధంగా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.














కొందరు స్ర్తీ లు ప్రతి రోజు పూజ చేస్తుంటారు భర్త నో అత్తా మామనో ఇంట్లో ఉన్న వారిని లేక ఇంటి పక్కన ఉన్న వారి నో తిడుతూ నే ఉంటారు.  కొంతమంది పిల్లలను తండ్రి , నానమ్మ తాత మీదకు ఉసిగోల్పుతారు. ఇలాంటి పూజల వలన ఎం వస్తుందో గాని దైవం మీద ఇతరులకు విరక్తి వస్తుంది.  అందుకే మనం మారాలి మన మనస్సులు మారాలి .  మీరు మారనంతవరకు జాతక పరిహారం శాంతి చేయటం వల్ల న గాని , రత్నం ధరించటం వలన గాని, పూజలు చేయడం వల్ల గాని మనలో మార్పు రానంతవరకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు.

జ్యోతీష్యం అనేది గైడ్ మాత్రమే, జీవితం అనేది టెక్ట్స్ పుస్తకం. టెక్ట్స్ చదివిన వారికి పరిక్షలు రాయడం తేలిక. 
 జీవితంలో  జీవించటం  అనేది కొంత మన మీదనే ఉంటుందని గమనించాలి.  అయితే జ్యోతీష్యం కూడా అవసరమే కానీ ముందు మనం మారాలి మన మనస్సులు మారాలి . మనం మారనంతవరకు ఏ జ్యోతీష్యుడు చెప్పిన  ఏ రత్నం ధరించిన  ఏ పూజ చేసిన ఉపయేగం ఉండదు. ఇది నిజం.










 




 

ఒక చిన్న ఉదాహరణ 
నా కళ్ల ముందు మా దూరపు బంధువు కదలాడుతున్నది ఇది జరిగి రెండేళ్ళు అవుతుంది. నాకు వరుసకి  మరదలు అందముగా ఉంటుంది, మా మేనమామ గారాలపట్టి. ఆర్దికముగా పరవాలేదు. ఉన్నంతలో గుట్టుగా సంసారము చేసుకుంటున్నారు. అందరిలాగానే రాగిణీకి యుక్తవయస్సు రాగానే ఉన్నవాళ్ళింటిలోనే ఇచ్చి వివాహము చేశారు.

రాగిణి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెల్లిందే కాని అక్కడ సర్దుకుపోలేకపోయింది. తల్లి చేసిన గారాభము వలన అత్తింట్లో ఏది కోరినా వెంటనే దక్కకపోయేసరికి ,తనను నిర్లక్ష్యము చేస్తున్నారంటూ భర్త మీద అలిగేది. 

మొదట్లో భర్త పోనీలే పెళ్లి అయిన కొత్త కదా అని సరిపెట్టుకున్నాడు. కానీ రాగిణి ప్రవర్తన రోజు రోజుకీ భర్తకి వింతగా అనిపించసాగింది. తను కోరిన ప్రతీదీ  తీర్చాలంటూ  మొండికేసేది.  ప్రొద్దున్నే లేచేది కాదు. భర్త ఆఫీసుకి బయలుదేరుతుంటే లేచేది. అత్త కూడా కొత్త కోడలు కదా అని ఊరుకునేది. కొన్నిసార్లు తొందరగా లేవాలి అని నచ్చజెప్పేది. కాఫీ కలుపుకోవడము రాదు. అత్త కలిపి ఇస్తే మా అమ్మలాగా చెయ్యలేదంటూ విసుగుకునేది.రాత్రి పూట అందరూ కలిసి భోజనము చేస్తుంటే ,అలా నచ్చక ఏదో ఒక గొడవ పెట్టుకునేది. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని అనేది మాటిమాటికి. వాళ్ళ తల్లి తండ్రులు చేసిన గారాభము వలన కోరినవన్నీ వెంటనే ఇవ్వడము , సుకుమారముగా పెంచడము వలనే కూతురు ఈ రోజు ఇలా అంటున్నదని అర్దము కాలేదు. అలా అని కూతురికి సర్దుకుపోవాలని చెప్పనూలేదు.

 ఏపని చెయ్యమని చెప్పినా ‘’నేనెవరనుకున్నారు,మా తాత ఎవరో తెలుసా ,అతను ఎంత ధనవంతుడో తెలుసా మేము ఒకప్పుడు ఎలా బ్రతికేవాళ్ళమో తెలుసా ,నేను పని చెయ్యాలా " ఇలా మాట్లాడేది .భర్త ,అత్త రాగిణి ప్రవర్తనతో విసిగిపోయారు. ఒక రోజున రాగిణిని పుట్టింట్లో దించి, ‘’మీ అమ్మాయిని మీ ఇంట్లోనే ఉంచుకోండి’’ అని చెప్పి వెళ్లిపోయాడు. భర్త వదిలిన కొద్దిరోజులకే తెలిసింది రాగిణికీ తను గర్భవతినని. అమ్మాయి తల్లి తండ్రులు ఎన్ని సంప్రదింపులు జరిపినా ఆమెను తీసుకువెళ్ళటానికి ఆమె భర్త అంగీకరించలేదు. విడాకులు కోరాడు. ఇంత జరిగినా ఆమెలో ఎటువంటి మార్పు రాలేదు. 















కోర్టు విడాకులు మంజూరు చేసింది.ఆమెకి ఆడపిల్ల పుట్టింది. తను పుట్టింట్లో తన అన్న భార్య వదినతో కూడా ఉండలేక,చిన్న గది అద్దెకు తీసుకుని తను చిన్న పాప తో వంటరిగా ఉంటుంది. ఆమె భర్త కోర్టులో కేసు వేశాడు, తన బిడ్డను తనకు ఇప్పించమని, తన జీవితాన్నే సరిగ్గా చూసుకోలేని అమ్మాయి తన బిడ్డని సరిగ్గా ఎలా పెంచుతుందని. ప్రస్తుతము ఆకోర్టు కేసులు ,వాయుదాలు జరుగుతున్నాయి. 

కూతురిని నేను అల్లరుముద్దుగా,ఏ కష్టము రాకుండా పెంచుతున్నానని ,అనుకున్నానే కానీ, జీవితములో నలుగురితో ఎలా కలిసి మెలసి ఉండాలి. ఎలా సర్దుకుపోవాలి,ఇలాంటి జీవిత సత్యాలను చెప్పడము మరిచాను అని ఏడ్చుకుంటూ చెప్పింది 
ప్రవర్తన మార్చుకోమని,యోగ్యుడైన భర్త, ప్రేమించే అత్తామామలు చక్కటి సంసారము  వీటిని మూర్కత్వముతో మిడిసిపాటుతో దూరము చేసుకోవద్దని జీవితము అన్నాక ‘’సర్దుకుపోవాలి’
అని చెప్పాలి.. అనుకుంటూ నా దినచర్యలో మునిగిపోయాను .

నేను రాసినది మీకు  నచ్చినట్లయితే షేర్ చేయగలరు. 
గ్రహదోషాల పేరుతో మొసపోతున్న  వేలాది మందికి నాకు తెలిసిన శాస్త్ర పరిజ్ఞానాన్ని మీకు తెలియజేస్తూన్నాను.














No comments:

Post a Comment

మీ అభిప్రాయం తెలియచేయండి.