14 October 2016

ఎంత సంపాదించినా ధనం ఉండక పోవడానికి కారణాలు.



అయితే ఎంత సంపాదించినా ఒక్క రూపాయని కూడా నిలుపుకోలేని పరిస్థితి కొందరి ఇళ్ళల్లో కనుపిస్తుంటుంది. అందుకు కారణాలు అనేకం. ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టకపోవడం, అనవసర ఖర్చులు చేయడం వంటివే కాక ఇంటికి సరైన వాస్తు లేకపోవడం కూడా ఈ పరిస్థితికి దోహదం చేస్తుంది అంటున్నారు వాస్తు నిపుణులు. సంపాదించిన డబ్బును పొదుపు చేయడం లేదా మరింత డబ్బు సంపాదించాలనుకోవడానికి వాస్తు పరమైన మార్పులను కొన్నింటి ని సూచిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం…









ఇంటికి నైరుతి మూలను తమిళులు కుబేర స్థానమంటారు. ఇక్కడ ఎటువంటి సంప్‌ కా నీ, సెప్టిక్‌ టాంక్‌ కానీ బోర్‌వెల్‌ కానీ భూమిలోపల ఎటువంటి నిర్మాణం లేకుండా చూసుకోవడం వల్ల ఇంట్లో ధనం నిలుస్తుంది.
నగలు, ఇతర విలువైన పత్రాలు పెట్టే బీరువాలను, లాకర్లను వాస్తు ప్రకారం పెట్టుకోవాలి. తూర్పు ముఖంగా తలుపు తెరుచుకునే పశ్చిమపుగోడకు వీటిని పెట్టడం మంచిది. లేదా తూర్పు లేదా ఉత్తర ముఖంగా తలుపు తెరుచుకునేలా నైరుతి మూల ఉంచాలి.






లాకర్లు ఉత్తర ముఖం తెరుచుకునేలా దక్షిణపు గోడకు పెట్టడం కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది. లాకర్‌ తలుపులు ఉత్తరముఖంగా తెరుచుకోవడం మంచిది. ఎందుకంటే వాస్తు ప్రకారం ఈ దిక్కుకి కుబేరుడు అధిపతి.
బీరువాను ఈశాన్య మూలలో ఎప్పుడూ పెట్టకూడదు. ఎందుకంటే దీనివల్ల సంపద నష్టం జరుగుతుంది. ఆగ్నేయ, వాయువ్య దిక్కులు కూడా మంచివి కావు ఎందుకంటే దీనివల్ల అనవసర ఖర్చులు అధికమవుతాయి. డబ్బులు పెట్టుకునే బీరువాను ఎప్పుడూ దూలం కింద ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఆర్థిక స్థిరత్వం మీద ఎక్కువ ఒత్తిడి పెడుతుంది.ఈశాన్య మూల కూడా సంపద వృద్ధికి తో డ్పడుతుంది.




ఇంటికి ఈ మూలన సంప్‌, బోర్‌వెల్‌ లేదా బావి నిర్మిస్తే అభివృద్ధి, స్థిరత్వం వస్తాయి. ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిల్వ ఉండకపోవడం లేక అది వృద్ధి జరగకపోవడం వంటివి ఎదుర్కొంటుంటే ఇంట్లో రాత్రంతా కనీసం ఒక దీపానై్ననా వెలగని స్తూ ఉండాలిట. ఎందుకంటే కాం తి కూడా ఒక రకమైన శక్తే. ఫెంగ్‌షూయ్‌ ప్రకారం దీన్ని యాంగ్‌ శక్తి అం టారు. ఇది చలనం తీసుకువస్తుంది.
ఇంట్లో చేపల అక్వేరియం పెట్టుకోవడం సంపద వృద్ధి కావడానికి దోహదం చేస్తుందిట. ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండే చేపలను ఎం చుకొని ఇంటికి తెచ్చుకోవాలి. నీటిని శుభ్రం గా, గాలిపోయేలా ఉంచాలి. చేపలు అక్వేరియంలో తిరుగుతూ ఉంటే ఆ శక్తి ఇంట్లో సం పద వృద్ధి కావడానికి దోహదం చేస్తుందిట. దీ నిని గదిలో నైరుతి దిక్కున ఉంచడం మంచిది.






మీ అపార్ట్‌మెంట్‌ ముఖద్వారం పొడవైన కా రిడార్‌ చివర ఉన్నప్పుడు అక్కడ ప్రవహించే శ క్తి చాలా ఉధృతంగా ఉంటుంది. ఇది మీ ఆర్థిక పె ట్టుబడులకు రిస్క్‌ కాగలదు. దీనిని తగ్గించేందుకు కారిడార్‌ మధ్యలో అంటే దారికి అడ్డంగా కాదు గాని ఒక వైపు ఒక మొక్కను పె డితే ఆ ఉధృతి తగ్గుతుంది.






ఇంటి ముఖ ద్వారానికి మంచి రంగులు వేయడం ద్వారా సంపదను ఆహ్వానించవచ్చు. పక్కింటివారి గోడలకు, ముఖద్వారాలకు భిన్నంగా, ఆకర్షణీయమైన రంగులు వేసుకోమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా జీవితంలో ఆర్థికాంశాల పట్ల మరింత స్పష్టత కావాలనుకున్నప్పుడు మీ ఇం ట్లో గాజు వస్తువులను ఒకసారి పరిశీలించండి. ముఖ్యంగా ఇంటికి గాజు కిటికీ తలుపులు వుంటే అవి ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. మురికిగా ఉన్న అద్దపు తలుపులు సంపదను లోనికి రానివ్వవట.కిటికీకి క్రిస్టల్స్‌ వేలాడదీయడం వల్ల శక్తి చురుకుగా ప్రవహిస్తుంది. సూర్యకిరణాలు వా టిని తాకినపుడు అవి రంగు రంగుల అద్భుత ఇంద్రధనస్సులను సృష్టిస్తాయి. నేరుగా సూర్యకిరణాలు ప్రసరించే కిటికీని ఎంచుకుని అక్క డ ఒక క్రిస్టల్‌ను వేలాడదీస్తే మీ కెరీర్‌ వృద్ధికి అది దోహదం చేస్తుందంటున్నారు.







ఆదాయానికన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటే మొక్కలను కానీ విత్తనాలను కానీ టాయిలెట్లలో ఉంచాలి. ఇది ధన ప్రవాహం వృధా కావడాన్ని నిరోధిస్తుంది. ఎందుకంటే ఎదిగేవి ఏవైనా నీటి శక్తిని తిరిగి పీల్చుకొని రీసైకిల్‌ చేస్తుంటాయి.


మీ క్యాష్‌ బాక్స్‌ను లేదా లాకర్‌ను ప్రతిఫలించేలా బీరువాలో ఒక అద్దాన్ని పెట్టండి. ఇది మీ సంపదను సంకేతాత్మకంగా రెట్టింపు చేస్తుంది.ఇంట్లో అస్సలు డబ్బు నిలబడకుండా జీవితంలోంచే అదృశ్యమైపోతున్నట్టు అనిపించినపుడు ఇంటి ఎడమ మూలన బాగా బరువుగా ఉండే వస్తులను పెట్టండి. దానితో పాటుగా బాగా వెలుతురు వచ్చేలా చూడండి.సంపదను పెంచుకోవాలంటే ఆహ్లాదకరంగా నీరు పారే శబ్దం వినిపించేలా చిన్న ఫౌంటెన్‌ ఇంట్లో పెట్టుకోండి. అది డెస్క్‌ మీద పెట్టుకునేదైనా పర్లేదు. వాటర్‌ ఫౌంటెన్‌లా డబ్బును, సంపదను ఆకర్షించే శక్తి మరేదీ లేదు. నీరు పారే శబ్దం ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుంది.




జీవితంలో మరపురానిది పెళ్ళి. ఇది స్త్రీ పురుషులకు జీవన మైత్రి నిచ్చునది. శారీరక మానసిక స్థితి గతులలో విడదీయరానిది. వివాహము సర్వమతాల వారికి, వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఆమోదయోగ్యమైనది. హంగులతో ఆర్భాటాలతో వివాహము చేసుకొని ఆనందము పొందుట మన సామాజిక లక్షణము. వివాహం వల్ల ఆడ మగా ఇద్దరూ శారీరకంగాను, మానసికంగాను సుఖాన్నిపొందుతారు. పిల్లల కోసం, ఆస్తిపాస్తుల రక్షణ కోసం, వంశాభి వృద్ది కోసం పెళ్ళి అవసరం అవుతంది. " భార్యా భర్తలు నిత్యము గొడవలు పెట్టుకుంటే ఆ ఇంట్లో లక్ష్మి నిలవదు.




నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉభయసంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం- అని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. 'ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని వెలిగించి- ఖర్జూరమో, ఎండుద్రాక్షో లేదో ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు' అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతోంది. ఇలా దీపారాధన చేయడంవల్ల ఏ ప్రయోజనమైనా పొందవచ్చు- అన్నది శాస్త్రోక్తి.
మనం చేసే పనిని అనుసరించి మన విలువ ఉంటుంది. సమాజంలో తరతరాల నుంచి పిల్లలకు పెద్దలు పద్ధతులను, సం ప్రదాయాలను, మర్యాదలను, కట్టుబాట్లను, నియమాలను వినయ విధేయతలను నేర్పిస్తూ, వివరిస్తూ మన సంస్కృతి విశిష్టతను, వార సత్వంగా అందిస్తున్నారు. తరువాతి తరాల వారు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతున్నారు.


ఎవరి బాధ వారికి ఎక్కువ. ఎవరి దుఃఖం వారికి దుర్భరం. ఎవరి వేదన వారికి భారం. ఇంకెవరైనా ఓదార్చబోతే 'అనుభవిస్తే కాని నా బాధ నీకు తెలిసిరాదు' అని అంటుంటారు. నిస్పృహలో ఎలాంటి మాటైనా వస్తుంది. అది సహజం.
కష్టాలు, దుఃఖాలు, బాధలు- అందరివీ ఒక్కలా ఉండవు. పెద్దగీత, చిన్నగీతల అంతరాలతో ఉన్నట్టుంటాయి. కష్టాల్లో ఉన్నప్పుడు మనిషికి ఆశాజీవిగా బతకటం ఎంత అవసరమో, ఇంకొకరి బాధ చూసినప్పుడు తమ బాధను మరచి వారికొక ప్రోత్సాహకరమైన మాట చెప్పటం అంత అవసరం.
దైవ ప్రసాదితమైన ఈ జీవితంలో మనకు అవకాశాలు ఎప్పుడో కాని రావు. ఎన్నో కాని రావు. వచ్చినప్పుడు వాటిని చటుక్కున అందిపుచ్చుకోవాలి. ఒకర్ని సాంత్వనపరచి సేదతీర్చడంలోని ఆనందాన్ని తనివితీరా అనుభవించాలి. ప్రతి జీవితానికీ ఒక అర్థముందని తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేకపోతున్న వాళ్లకు తెలియజెప్పాలి.








మనస్సే సర్వస్వం
ఏది లేకుంటే మనిషి ఒక్కక్షణమైనా జీవించలేడో అది- 'మనస్సు'.  జీవిత సర్వస్వంగానూ చెప్పారు.
'మనస్సే ఈ సమస్త జగత్తు. అందువల్ల ఈ మనస్సును ప్రయత్నపూర్వకంగా సంస్కరించుకొంటూ జీవనాన్ని సాగించాలి. మనస్సు ఏ విధంగా ఉంటే ఫలితం ఆ విధంగానే ఉంటుంది. ఇది సనాతన రహస్యం. ఎప్పుడు మనస్సు సంపూర్ణంగా ప్రశాంత స్థితికి చేరుతుందో అప్పుడు అశుభకర్మలన్నీ నశించిపోతాయి. ప్రశాంతచిత్తంతో ఉండేవారే జీవితానందాన్ని అనుభవించగలుగుతారు. అప్పుడే తరగని ఆనందం వశమవుతుంది. 







అదృష్టం వరించాలంటే :-
 నెలలో వచ్చేమోదటి సోమవారం,తెల్లవారుజామునే నిద్ర లేచి, స్నానంచేసి, తెల్లని వస్త్రాలు ధరించి, పావుకిలో సగ్గుబెయ్యంతో పాయసం తయారుచేసి,అలాచేసే టప్పుడు 11- ఆకుపచ్చ యాలకులు వెయ్యాలి,  ఈ నైవేద్యాన్ని విష్ణుమూర్తి ఆలయంలో నివేదించండి, అందు కొండభాగాన్ని గోమాతకి తినిపించండి. 


11 రూపాయలు పురోహితునికి దక్షిణ ఇచ్చి కాళ్ళకు దణ్ణం పెట్టండి.

 మీఇంట్లో  దేవి ఫోటో లు ఉంటే ( దుర్గాదేవి,బాలాంబిక ,లలితాదేవి ), సాయం సంధ్యా సమయంలో దీపారాదనచేసి " దుర్గే స్ప్ర్తుతా, హరసభీతి మసేస జంతో, త్వస్త్వి సుధా , మతిమతీమ్ శుభాం దదాసి దారిద్రాయః దుఃఖ భయ హారిణి కాత్పదన్యా, సర్వోపకారణాయ  పదార్ధ చిత్తా ".

 ఇది ప్రతీనెలలో మొదటి శుక్రవారం ఈ ఆచరణ చేయండి.

 రవి పుష్యమి,గురు పుష్యమి  యోగంలో తెల్ల జిల్లేడు వేరును  పచ్చటి దారంతో కట్టి మీరు మేడలో కాని, చేతికి కాని కట్టిన మేకు అదృష్టం కలుగును.


పెరుగు, పాలకోవా, ఇటువంటి తీపి పదార్ధాలని పిల్లలకి ఉదయానే తినిపించండి. 2 వెండి గిన్నెలలో ఒకదానిలో పాలకోవా , మరో దానిలో పెరుగు ఉంచండి.  ఆ గిన్నెలను సరస్వతి దేవి కి నైవేద్యం పెట్టి , పిల్లలు పరిక్షలలో విజయం సాధించాలని కోరుకోండి. పిల్లలు పరిక్షకి వెళ్ళే సమయంలో మూడు గంటల ముందే ఒక గిన్నెలో ప్రసాదం తినిపించండి.  పరిక్షకి వెళ్ళే  ముందు మరో దానిలోది తినిపించండి. కుంకుమ పువ్వుతో తిలకం పెట్టి, నాలుక పై కేసరాన్ని ఉంచండి. ఇలా చేస్తే చదివిన వాణ్ణి గుర్తుకు వచ్చే అవకాసం చాలాఉన్నది.

3 గవ్వలను కుంకుమపువ్వుతో  కలిపి, నల్లటి వస్త్రం లో కట్టి , మీరు గనక మీ ఇంటిముందు తగిలించి , సాయం సమయంలో వాటిని నదిలో పారవేసిన మీకు వాహనం లభించును.

రోజు  శంకు పూలతో సాయం సమయంలో  పరమశివుని " నమశ్శివాయ ఓం " అని ధ్యానం చేసిన వాహనం లభించును.

ఏదయినా కొత్త వాహనం కొన్నప్పుడు ఆ వాహనంలో 5 గవ్వలను కుంకుమపువ్వుతో  కలిపి, నల్లటి వస్త్రం లో కట్టి  మీ వాహనంలో ఉంచండి. దానివలన వాహన రుగ్మతలు ఉండవు.

నిరంతరం  భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుని చాంటింగ్ చేస్తే, మన పనులు మనం చేసుకుంటుపోతే  నర   ద్రుష్టి ఉండదు ( అంటే వ్యాపార సంస్థలో, మీ ఇంటిలో భగవత్ చాంటింగ్ వినిపించాలి).  




వారానికి  ఒక సారి వ్యాపార సంస్థలో, మీ ఇంటిలో తడిగుడ్డతో తుడవాలి, పసుపు నీళ్ళు  జల్లాలి. 


మీ ఇంటి గృహిణి  ప్రతి నిత్యం కాకపోయినా గురువారం, శుక్రవారం, ఇంటి లేక షాపు ద్వారా బంధానికి పసుపు రాసి కుంకం, బొట్టులు  పెట్టిన మీ నరదిస్టి  పోతుంది.

నిమ్మకాయలతో మీ  వ్యాపార సంస్థకి కానీ , మీ ఇంటి కి కాని మూడు సారుల, అలా కుడినుండి ఎడమకి తిప్పి, ఎడమకాలితో కనక ఆ నిమ్మ కాయను తొక్కినా లేక రొడ్డుమేద పడవేసిన మీ నరద్రుస్టి పోవును. 


దేవీ ఖడ్గమాలా స్తోత్రం చదువుతూ, ఒక బూదిగ గుమ్మడి కాయకి పసుపురాసి కుంకుమ బొట్టు పెట్టి ,దానితో పాటు పట్టిక నల్లటి దారంతో చుట్టి ఉంచిన ,మీ నరద్రుస్టి పోవును. 


 ఇనుము, నూనె వ్యాపారస్థులు, తప్పనిసరిగా 19 శనివారాలు శనికి   తైలాభిషేకం చేఇంచవలెను.


మంగళ వారం, శుక్రవారం కాని,ఆదివారం కాని, అమావాస్య రోజున కాని , మీ వ్యాపారం చేసి షాపు మూసినతరువాత ముద్డ కర్పూరం వెలిగించి ఆ వ్యాపారసస్త ముందు పదవేయాలి.    

తులసి మొక్క ప్రత్యేకంగా ఏ ఇంట్లో పూజించబడునో ఆ ఇంట సర్వసంపదలు కలుగును.తులసి మొక్క లేని ఇంట్లో సమస్త సమస్యలు ఏర్పడును.రోజు ఒక తులసిదళం నమిలిమింగితే సమస్తరోగాలకు నివారణ కలుగును.
తులసి మొక్కలపై నుండి వచ్చే గాలి పీల్చిన చాలా ఆరోగ్యప్రదం.లక్ష్మీదేవికి ప్రతిరూపమే తులసి.విష్ణుమూర్తికి ప్రీతికరమైనది.అందుకే ఆమెకు హరిప్రియ అనే మరోపేరు కూడా ఉంది.సత్యభామ నిలువెత్తు బంగారం ఉంచినా తూగని ఆ విష్ణువు రూపుడైన ఆ శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవి సమర్పించిన ఒకే ఒక్క తులసీదళానికి వశుడయ్యాడు.
చాలా దేవాలయాల్లో తులసి నీరే తీర్ధంగా ఇస్తారు.ప్రతి రోజు నీళ్ళుపోసి, భక్త్, శ్రద్ధలతో తులసిమాతను ఆరాధిస్తే ఇంట్లో లక్ష్మీకళ తాండవించి, సకలసంతోషాలను మనకు ప్రసాదిస్తుంది.











శ్రావణమాసం లో శ్రావణ అష్టమి, నవమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ అమ్మ వారి పూజకు ముఖ్యమైన దినములుగా ఈ మాసం లో లక్ష్మీదేవిని ఆరాధించేవారి సకల సంపదలు మరియు శ్రావణ సోమవారములు శివునికి జరుపు అభిషేకముల వల్ల అనేక శుభములు చేకూరుతాయి.














No comments:

Post a Comment

మీ అభిప్రాయం తెలియచేయండి.