22 October 2016

మత్యం – Pearl

ముత్యము
మంచి జాతి ముత్యాలు చంద్రగ్రహానికి చాలా ప్రీతిప్రదము. చంద్రుడు జలగ్రహమై తెల్లని వర్ణము గలవాడగుట వలన జలము వల్ల పుట్టి సమాన వర్ణచ్ఛాయలు గల ముత్యములు చంద్ర సంభంధములై యున్నవి. అదీగాక పంచ భూతాలలో నీటికిసంభంధించిన విభాగమునందే చంద్రుడు ముత్యము గూడా నున్నవి. ఈ ముత్యము త్రిదోషములందలి కఫదోషములను పోగొట్టగలదు. అపానవాయువు సంకేతముగా గలది. స్త్రీజాతికి సంభంధించిన దగుటవలన బహుసుకుమారమై ఆకర్షణీయముగా వుంటుంది. శరీరమునందలి స్వాధిష్ఠాన చక్రమునందలి కాంతి పుంజము లేవికలవో అవి ఈ ముత్యంలో కూడాకలవని శాస్త్ర వచనము ముత్యము చూచుటకు తెలుపురంగు కలిగి ఉన్నప్పటికీ దీనినుండి వెలువడే కాంతితరంగాలు ఆకుపచ్చరంగులో నుంటవి. కావున స్వాధిష్ఠాన చక్రమునందలి ఆకుపచ్చరంగు కాంతికిరణాలు శరీరము నందంతటను వ్యాపించి, వాత దోషములు హృదయ దౌర్భల్యమును మానసిక చింతను పోకర్చి ఆరోగ్యము కలిగింపగలవు, ఈ కాంతి ప్రసారశక్తి సన్నగిల్లినప్పుడు, వాత ప్రకోపముచే అనేక వ్యాధులుత్పన్నములుకాగలవు.










 రోహిణి, హస్త, శ్రవణం అను నక్షత్రములందు పుట్టిన వారు ఏ సమయమునందైనను, ముత్యములను ధరించవచ్చును.


    ఇతర జాతకులలో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులు తప్ప తక్కిన వారందరూ ముత్యముధరించుట వలన ఇబ్బందియునుండదు.

 జన్మజాతక గ్రహములయొక్క స్థితిగతులను విచారించి దశాంతర్దశములు - గోచారము బాగుగా పరిశీలించి చంద్రగ్రహము దోషముగానున్న సమయములందీ ముత్యములను ధరించిన యెడల చంద్రగ్రహములవల్ల కలిగే సకల అరిష్టములు తొలగి శుభంకలుగుతుంది.
















 జాతక చక్రమునందు చంద్రగ్రహమునకు 6-8-12 స్థానాధి పత్యములు కల్గుట. లేక ఆస్థానములందుండుట, ఆ స్థాఅనాధిపతుల యొక్క దృష్టి, కలయిక సంభవించుటవల్ల దోషప్రదుడగుచున్నాడు. అంతేగాక రెండవస్థానమున కాధిపత్యముకలిగి ఎనిమిదవ స్థానమునందుండుట అష్టమాధిపత్యము వహించి ద్వితీయమునందుండుట వలన కూడా చంద్రుడు అపకార మొనర్చుట కవకాశములున్నవి. వీటికితోడుగా షడ్వర్గబలము లోపించుట, అష్టక వర్గమునందు హీనబిందువులు కలుగుట. కేమదృమాది దుర్యోగములు ప్రప్తించుట మొదలుగాగల లక్షణములు చంద్రుని దుష్టత్వమును అధికము గావించగలవు. చంద్రుడు దుష్టలక్షణములతో కూడియుండి అతని యొక్క దశగానీ, ఇతర శుభదశలం దాతని అంతార్దశలుగానీ సంభవించినకాలము మరియు గోచారవశమున కాలసర్ప యోగము సంభవించిన కాలమునందలి చంద్రగ్రహ సంచార సమయము బహుదుష్ట లక్షనములు గలిగి అనేక విషయ పరిణామములు, వ్యతిరేక ఫలితములు కలుగుచుండగలవు. ఆ దుష్ట సమయములందు
ముఖ్యముగా

 వ్యాపార స్థంభన నష్టము,

 ధనహీనత, భాగ్యనాశనము,

గృహకల్లోలములు దంపతులకు కలహము స్పర్థలు,

వివేక శూన్యత మనశ్శాంతి లోపించుట,

వాతాధిక్యత, నిద్రపట్టకపోవుట,

పిచ్చి పిచ్చి ఆలోచనలు,

భవిష్యత్ శూన్యంగా నుండుట,

మనోభయము,

 అజీర్ణ హృదయ సంభంధ వ్యాధులు, వివాహాటంకములు,

వృత్తిలో ప్రతికూలత, అపజయము, మాతృస్త్రీకలహములు

 మొదలగు దుఃఖజనకమైన ఫలితములు కలుగుచుంటవి. అట్టి సమయములందు మంచి ఆణిముత్యమును ధరించుటవల్ల చంద్రగ్రహ దుష్టత్వము నశించి శుభములు కలుగుతవి.


ముత్యముల ద్వారా కలిగే శుభయోగాలు : ముత్యములలో కల్లా శ్రేష్ఠమైనట్టి ఆణిముత్యమువంటి ఉత్తమజాతి ముత్యములను శాస్త్రీయ పద్ధతుల ననుసరించి ధరించిన యెడల

 ప్రశాంతత, మనశ్శాంతి,

వీర్యవృద్ది, దాంపత్య సౌఖ్యము. అన్యోన్యత,

అధిక జ్ఞాపకశక్తి, సద్భుద్ది, గౌరవ మర్యాదలు పొందగల్గుట,

స్త్రీ జనరంజనము, ధైర్యముగా పురోగమించుట,

కుటుంబ సుఖసంతోషాలు, ధన ధాన్యాభివృద్ధి, సౌభాగ్యసంపదలు కల్గుట, ఆటంకములంతరించి నిర్విఘ్నముగా అన్ని పనులు నెరవేరుట,


వివాహాది శుభకార్యములు కలసి వచ్చి సంతోషము కల్గుట జరుగగలవు.

 ఈ ముత్యధారణవల్ల కుష్ఠు, అపస్మారము, పిచ్చి, బొల్లి, చర్మవ్యాధులు, క్షయ, ఉబ్బసము, మేహవ్యాధి, కీళ్ళ వాతము, అజీర్ణ భాధలు మొదలగున వన్నియు నివారింపబడి శీఘ్రముగా ఆరోగ్యవంతులు కాగలరు.


చంద్రుడు వ్యాపారములకు కొంత సంభంధించి యుండుట వలన వ్యాపార నష్టములను నిరోధించి వ్యాపారాభివృద్ధిని కలిగించుటకు కూడా ముత్యధారణ ఉత్తమమై ఉన్నది.










ముత్యము ధరించే పద్ధతి :-

 ముత్యాలు అనేక రకాలుగా నున్నప్పటికీ నీటిచ్ఛాయలు గలిగి తెల్లనై గుండ్రంగా నుండి ప్రకాశించే ఆణిముత్యాలు ధరించడానికి బహుశ్రేష్ఠమైనవి. ముత్యమునకు బరువు ఇంత ఉండాలి అనే నియమం లేక పోయినప్పటికీ ఎంత పెద్దవిగా ఉంటే అంత మంచిది. అదీగాక ఒకే ముత్యం ముత్యం ధరించేటప్పుడు పెద్దదిగా చూచి ధరించడం అవసరం దండలు, మాలలుగా ధరించే ముత్యాలు అనేకంగాబట్టి అవి చిన్నా, పెద్దా వున్నాదోషంలేదు. ముత్యాలను బంగారం లేదా వెండి లోహాలతో చేయబడిన నలుచదరపు ఉంగరంలో ఇమిడ్చి ధరించాలి. శ్రావణశుద్ద పౌర్ణమినాడు శ్రవణ నక్షత్రంలో గానీ, లేక పూర్ణిమ సోమవారం గానీ, చంద్ర గ్రహణ సమయంలో గానీ, వృషభ రాశిలో చంద్రుడు ఏకదశస్థానంలో నుండగా గానీ, చంద్రహోర జరిగే సమయంలో గానీ, వర్జము దుర్ముహుర్తము లేకుండాచూచిమంచి ముత్యము ఉంగరమునందు బిగించాలి. ఆ తర్వాత ఆ ఉంగరము ఒక దినమంతయు ఆవుపాలలో ఉంచి మరుసటిరోజు మంచి నీటితో శుద్దిగావించాలి. ధరించేవాడు తమకు తారాబలము చంద్రబలములు బాగుగా నుండిన శుభతిధులలో సోమవారం లేక శుక్రవారం రోజున వృషభ, కర్కాటక, ధనుర్మీన లగ్నమునందు ఉంగరము (పూజించి) ధరించవలెను, ఉంగరమును నిర్ణయించిన శుభసమయమునందు ధరించుటకు ముందుగానే యధావిధిగా పూజించి, నమస్కరించి, గురువుని, గణపతిని, చంద్రగ్రహమును ధ్యానించి కుడివైపునగల అరచేతిలో నుంచుకొని "ఓం వం ఐం హ్రీం శ్రీం జూం సః చంద్రమనే స్వహా"అనే మంత్రాన్ని నిశ్చలంగా 108 పర్యాయములు జరిపించిన పిదప ఆ ఉంగరమును ముమ్మారు కనులకద్దుకొని కుడిచేతి ఉంగరపు వ్రేలికి ధరించాలి స్త్రీలు మాత్రం ఎడమ చేతి ఉంగరపు వ్రేలికి(అనామిక)ధరించడం చాలా విశేషము స్త్రీలుగాని, పురుషులు గానీ ముత్యములను మాలలుగా ఇతర ఆభరణములుగా గానీ ధరించుట గూడా పైవిధానము ప్రకారమే పూజించి ధరించవలెను. ఉండరమునందలి అడుగుభాగం రంద్రముగా నుండినయెడల ముత్యమునందలి శక్తి సంపన్నమైన దివ్యకిరణములు శరీరమునందు ప్రవేశించి ఫలసిద్దికి తోడ్పడగలదు.














మత్యం – Pearl 2, 11, 20, 29 సంఖ్యలలో జన్మించినవారికి. వృషభ, కర్కాటక రాశులవారు. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలలో పుట్టినవారు. సోమ, ఆదివారాల్లో పుట్టినవారు. నల్లముత్యం అన్నింటికన్నా విలువైంది. మానసిక ప్రశాంత్రత. సుఖనిద్ర. భార్యభర్తల మధ్య కలహాల నిరోధం. సంతానం లేనివారికి. కంటి వ్యాధులు నయం చేయడానికి.
















No comments:

Post a Comment

మీ అభిప్రాయం తెలియచేయండి.