కాలసర్ప యోగముః మనకు సంవత్సరములో ఉత్తరాయణము,దక్షిణాయనము,ఉఉత్తరాయణము మనకు సకల శుభకార్యములకు అనువైనది అలాగే దక్షిణాయనం కొంత కష్టకాలం అలాగే భూ గమనంలో దానియొక్క ఆక్షాంశములు ఏదైతే ఛాయను రాహువు,కేతువులుగా తెలుపుతున్నామో ఆ రాహువు_కేతువుల మధ్య ఉత్తరంలో గాని దక్షిణంలో గాని 7 గ్రహములు స్థితి పొంది యున్న దానిని సవ్య లేదా అపసవ్య కాలసర్పయోగము అంటారు ఇది సిధ్ధాంత భాగములో గుర్తిస్తారు లౌకిక విషయాలలో మాత్రమే దీని ప్రభావము ఉంటుందని కొందరు తెలిపితే మరికొందరు మనిషియొక్క వ్యక్తిగత జీవనం పై కూడ ఉంటుందని తెలుపుతారు.
బావత్రయములో ముందుగా వర్గవిభజన గావించినపుడు గురు వర్గము మరియు శని వర్గముగా ఏర్పడుతుది దానిలో గురు వర్గమునకు రవి,చంద్ర,కుజ,గురు,కేతువు ఇవి ఐదు మిత్ర గ్రహాలు ఇక శని వర్గమున శని,శుక్ర,బుధ,రాగువులు ఇలా వర్గ విభజన జకిగినపుడు గురువర్గము వారికి కాలసర్ప దోషం ఆపాదించబడినపుడు కేతువు మితృడు అనుగ్రహం తప్ప పరిహారం ఉండదు కావున గురువర్గ జాతకపలకు కేతుదోషం ఏ భావములో స్థిపొందిన ఉండదు ఇక శని వర్గ జాతకులకు రాహువు మితృడు మరి పరిహారం ఉండదు అనుగ్రహం మాత్రమే మరి దీని మధ్యలో జాతక ఫల విశ్వేషణ లో కాలసర్ప దోషము అనేది బావత్రయ విధానము నందు లేదని తెలియజేస్తున్నాను.
సర్పశాపం
ఒక మనిషి ప్రస్తుత జన్మలో గాని, గత జన్మలో గాని జతకట్టి ఆడుతున్న త్రాచుపాములపై రాళ్ళు విసరడం, త్రాచుపాములను హతమార్చడం, ఇలాంటివి చేయటం వలన తీవ్ర సర్పశాపం ఏర్పడుతుంది. మన పూర్వీకులు గాని, మనము గాని త్రాచుపాముని చంపినట్లైతే ఆ త్రాచుపాము చనిపోయిన తరువాత కొద్ది వారాలలో అస్థిపంజరముగా మారిపోయినప్పటికి ఆ అస్థిపంజరం చుట్టూ ఆ త్రాచుపాము యొక్క ప్రేతాత్మ శాపం 7 తరాల వరకు వారి పూర్వీకులను వేటాడి, వేధిస్తూ అన్నీ రకాల గ్రహాపీడలను, సంతానం కలుగకపోవటం, చర్మ సంబంధిత సమస్యలు, విపరీతమైన త్రాగుడికి బానిసలు కావటం, పరాయిస్త్రీ పురుషులతో సంభోగ వాంఛను కలిగించడం, వ్యాపారాలలో విపరీతమైన నష్టాలు రావటం , ఆకస్మిక మరణములు కలుగటం, ఎంత కష్టపడినా పెళ్లి సంబంధాలు కుదరకపోవడం లాంటి సమస్యలను ఈ సర్పశాపం కలుగచేస్తుంది.
సర్పశాప, నాగదోష విమోచన కాకుండా జీవితములో ఎలాంటి సంతృప్తి, అభివృద్ధి ఉండవు. సర్పశాపం వలన భార్యా భర్తల మధ్య విపరీతమైన గొడవలు వస్తాయి. వివాహం అయిన కొద్ది కాలానికే విడిపోవడం జరుగుతుంది. సంతానము కలుగదు. స్త్రీలకు గర్భసంచి సంబంధిత సమస్యలు వస్తాయి. చాలా మండి భావించినట్లుగా కాలసర్పదోషము మరియు సర్పశాపము రెండు ఒకటి కాదు. ఎవరి జన్మకుండలిలో అయితే పంచమములో రాహువు లేదా కేతువు ఉన్నట్లైతే వారికి నాగదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. పంచమములో రాహు లేదా కేతు ఉన్నవారికి పిల్లలు పుట్టరు. పుట్టినా బ్రతకరు. ఈ నాగదోషము ఉన్నవారు చెప్పటానికి వీలు కానీ అనేక రకాల సమస్యలతో బాధపడతారు. అంతేకాకుండా సంతానము వలన బాధలు కలుగటం లాంటివి జరుగుతాయి. ఈ నాగశాపమునకు మరియు కాలసర్పదోషమునకు పరిహారముగా ఆశ్లేషబలి, నవనాగమండలం, నారాయణ నాగబలి, మహాసర్పబలి . ఈ నాలుగు హోమాది కార్యక్రమములు వలన మాత్రమే ఈ దోషముల విముక్తి కలుగుతుంది. సర్పశాపముకు, కాలసర్పదోషముకు కాళహస్తిలో రాహుకేతు పూజలు చేయటం, పుట్టలో పాలు పోయటముతో సరిపోదు. ఈ కార్యకరములు కచ్చితంగా జరిపించుకోవాలి.
ఎవరి జన్మకుండలిలో అయితే మేషరాశిలో లేదా వృశ్చిక రాశిలో, లగ్నములో గాని, చతుర్థ భావములో గాని, ద్వాదశ భావములో గాని రాహు, కేతు, శని ఉన్నట్లైతే అది పరిపూర్ణ సర్పశాపం అని తెలుసుకోవాలి.
స్త్రీలకు జన్మకుండలిలో లగ్నములో కేతువు ఉంటే వారికి నాగదోషం ఉన్నట్టు గుర్తించాలి. ఈ లగ్న కేతువు వలన నాగదోషముతో పాటు మాంగల్య దోషము కూడా ఉంటుంది. ఇలాంటి మాంగల్య దోషం ఉన్న వారికి వివాహము జరుగటం కష్టం అవుతుంది. అంతేకాకుండా కేతువు 2వ భావములో ఉన్నవారికి ‘ఆయుర్భావ నాగదోషం’ ఉన్నట్టు గుర్తించాలి. వీరికి అకాలమరణం ప్రాప్తించే అవకాశం ఉంటుంది.
దోషాలు ఎలా ఉన్నా నలుగురుకి సహాయం మీరు చేయగలిగితే అన్ని దోషాలు పోతాయి.
అందుకే మానవ సేవే మాధవ సేవ అన్నారు మన పెద్దలు.
మన మనసులో దోషాలు ఉండకుంటే అంతా మంచే జరుగుతుంది.
అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయం తెలియచేయండి.