16 September 2016

భరణి నక్షత్రము 1234 మేషరాశి

భరణి నక్షత్రము
మేషరాశి లో భరణినక్షత్రము

నక్షత్రం అధిపతి గణము జాతి వృక్షం జంతువు నాడి పక్షి అధిదేవత రాశి భరణి శుక్రుడు మానవ స్త్రీ దేవదారు ఏనుగు మధ్య కాకి యముడు మేషం

నక్షత్రములలో ఇది రెండవది.
భరణి నక్షత్రము నవాంశ
1 వ పాదము - మేషం .
2 వ పాదము - మేషం .
3 వ పాదము - మేషం .
4 వ పాదము - మేషం .

భరణినక్షత్రము గుణగణాలు భరణి నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యధిపతి కుడా కుజుడూ కనుక వీరు అందంగా ఉంటారు. ఇది మానవగణ నక్షత్రము కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ. పరిశుభ్రతకు ప్రాధాన్యము ఇస్తారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయానుకూలముగా అభిప్రాయాలు మార్చుకుంటారు. ఎదుటి వారిని ఎంత గొపాగా పొగుడుతారో అదే విధంగా అంత కఠినంగా విమర్శిస్తారు. రెండు వాదనలను సమర్ధించుకుంటారు. స్వార్ధము కొంత సహజమే. తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు. వైఖరిలో మార్పు తెచ్చుకోలేక పోవడముతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించ లేరు. వృద్ధాపయములో సుఖజీవనము చేయడనికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. సంఘములో పేరు, ప్రతిష్థ వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు. సౌందర్యము, విలాసవంతము అయిన సామానుల అందు ఆసక్తి ప్రదర్శిస్తారు. సుగంధద్రవ్యాలు, సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికము. కళత్రము వలన కలసి వస్తుంది. విభేదాలు ఉంటాయి. విరు వ్యూహరచన గొప్పగా ఉంటుంది. వీరు భాగస్వామ్యానికి అర్హులు. వీరు సలహాదారులుగా రాణిస్తారు. బాల్యము సుఖవంతముగా జరుగుతుంది. ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల తరువాత కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు.ఇందులో జన్మించిన నక్షత్రపాదాలు, జాతక చక్రంలో గ్రహస్థి వలన మార్పులు ఉంటాయి. ఫలితాలు సాధరణంగా అందరికీ సమానమైనా పుట్టిన సమయము గ్రహస్థితులు నవాంశము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు సంభవము. వీరు వృద్ధాప్యము సుఖవంతంగా ఉంటుంది.

భరణి రవి ఆకాశనీలం వజ్రం లీ,లూ,లే,లో మానవగణం ఏనుగు మధ్య .

భరణి నక్షత్ర వృక్షము దేవదారు

భరణీ నక్షత్ర జంతువు ఏనుగు

భరణీ నక్షత్ర జాతి స్త్రీ

భరణి నక్షత్ర పక్షి కాకి.

భరణి నక్షత్ర అధిపతి శుక్రుడు.

భరణి నక్షత్ర అధిదేవత యముడు.

నక్షత్రం భరణి అధిదేవత రవి

వర్ణం ఆకాశనీలం

రత్నం వజ్రం

నామం లీ,లూ,లే,లో

నాడిమధ్య.

గణం మానవగణం జాతి పురుష పక్షి కాకి జంతువు ఏనుగు నాడి మధ్య. భరణి రవి ఆకాశనీలం వజ్రం లీ,లూ,లే,లో మానవగణం ఏనుగు నాడిమధ్య.

ఆరుద్ర నక్షత్రము1234 మిధునరాశి

ఆరుద్ర నక్షత్రము

ఆరుద్ర నక్షత్రములలో ఆరవ నక్షత్రం. ఇది పరమశివుని జన్మ నక్షత్రం.

నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి ఆరుద్ర రాహువు మానవ స్త్రీ శునకము రేల ఆదినాడి. పింగళ రుద్రుడు మిధునము.

ఆరుద్ర నక్షత్రము నవాంశ
1 వ పాదము -మిధునరాశి.
2 వ పాదము - మిధునరాశి .
3 వ పాదము - మిధునరాశి .
4 వ పాదము - మిధునరాశి .

ఆరుద్ర నక్షత్రమునందు ఈ నక్షత్రములో జన్మించిన వారు మాటలాడుటలో నేఱ్పరితనమును, మించిన జ్ఞాపక శక్తియు కలిఁగియుండెదరు, గొప్ప గమ్మత్తుఁగా మాట్లాడఁగలరు. వ్యాపార పరమైన నైపుణ్యము ఉంటుంది. పలు రంగాలలో పరిచయము ఉంటుంది. ఇతరుల అభివృద్ధికి ఇటుక రాళ్ళవలె సహాయపడతారు. ఎన్ని సార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. డబ్బులకు చెందునట్టి నిర్ణయాలను సరిగా చేయలేరు. తప్పుడు సలహాలు, శక్తిసామర్ధ్యాలు, పగ తీఱ్చుకోవాలనెడి కోరిక, మొండి పట్టుదల జీవితములో ఒడిదుదుకులకు దారి తీయ వచ్చును. తొందఱపాటుతో ముందు-వెనుక మంచి-చెడు అనేవి చూడకుండనే నిర్ణయాలను వెంతనే అమలు పరుస్తారు. అవమానాన్ని ఓర్చుకొన లేరు. లౌక్యము తెలివితేఁటలు కనబఱఁచుతారు. తల్లిఁదండ్రులు, తోడఁబుట్టువుల మీద గొప్ప ప్రేమను కలిఁగియుంటారు. రాత్రి పూఁట నిర్ణయాలు తీసుకుంటారు. మొదట తనలోతాను అందఱిలో తక్కువ అని పదేపదే అనుకొనవలసి వచ్చిన కూడను ఆ తరువాత అధిక్యతా భావములోకి మారి పోతారు. నిండు నూఱేండ్లు బ్రతికెదరు సంపూర్ణ ఆయుర్ధాయము కలిగి ఉంటారు. ఆడవారిపట్ల గౌరవ భావము కలిగి ఉంటారు. మూకలని నమ్మించ కలిగిన ఆకట్టుకొనఁగలిగిన శక్తిని వీరు కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా ఎనలేని శక్తి సామర్ధ్యాలతో మఱల వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు. వీరి వీరి బ్రతుకులలో ఏభై రెండు నుండి అరవై ఆరు సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం – గుణగణాలు, ఫలితాలుఆరుద్ర నక్షత్రాన్ని పరమేశ్వరుని జన్మ నక్షత్రంగా ప్రతీతి. ఆధిపత్య దేవుడు పరమేశ్వరుడు. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు. గోమేధికం రాయి పెట్టుకోదగినది. వీరు వస మొక్కలు పెంచుకోవాలి. దర్భ సమిధలతో హోమం చేస్తే మంచిది.ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు మిథున రాశిలోనే ఉంటాయి.

ఆరుద్ర మొదటి పాదము
ఆరుద్ర మొదటి పాదములో జన్మించిన వారు అదృష్టంపైనే నమ్మకం పెట్టుకుంటారు. అదృష్టంతోనే నెగ్గుకు రావాలనే మనస్తత్వం. వస్తు, విషయ జాగ్రత్తలు ఎక్కువ. ఈ విషయంలో ఒక్కోసారి శృతిమించుతుంటాయి కూడా. దీని వల్ల ఇబ్బందులు తప్పవు. పారదర్శక వైఖరితో కలుపుకునే స్వభావం ఉంటుంది. లోకాన్ని పరిశీలించే స్వభావం ఉండటంతో అవకాశాలపై పట్టు నిలుపుకుంటారు. సంస్కృతి, సాంప్రదాయలపై, ఆచార వ్యవహారాలపై ఆసక్తి, శ్రద్ధ ఉంటుంది.ఆరుద్ర మొదటి పాదములో గ్రహ దశలు ఈ పాదములో జన్మించినవారికి ముందుగా రాహు మహర్దశ 18 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.

ఆరుద్ర రెండో పాదము
ఆరుద్ర రెండో పాదములో జన్మించిన వారిలో పట్టుదల, తీక్షణత ఎక్కువగా ఉంటాయి. అంతిమ లక్ష్యం మీద దృష్టి పెడతారు. ఆలోచనల్లో భిన్నత్వాన్ని గుర్తించలేరు. దీంతో కోరి కష్టాలు తెచ్చుకుంటారు. పలు విషయాలందు ఆసక్తి ఎక్కువ. ఒక్కోసారి చేతులు కాల్చుకుంటారు. సమస్యలను గుర్తించటంలో ఇబ్బంది ఉంటుంది. మధ్యలో ఏర్పడే పరిణామాలతో కొంచెం గందరగోళానికి గురవుతారు.ఆరుద్ర రెండో పాదములో గ్రహ దశలు రెండో పాదములో జన్మించినవారికి రాహు మహర్దశ 13 సంవత్సరాల ఆరు నెలలు ఉంటుంది. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.

ఆరుద్ర మూడో పాదము
ఆరుద్ర మూడో పాదములో తరచూ సమస్యలు ఎదుర్కొంటారు. చురుకుదనం వల్ల ఒక్కోసారి హద్దు మీరుతుంది. దీంతో సమస్యలు ఎదుర్కొనక తప్పదు. వేగంతో ముందుకెళ్లబోయి తల బొప్పి కట్టించుకుంటారు. వాయుతత్వ స్వభావం ఉండటంతో నిర్ణయాల్లో నిలకడ లోపిస్తుంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. సర్దుకొనే స్వభావం ఉండటం కలిసి వచ్చే లక్షణం. కానీ సమస్యను నిజాయితీగా అర్థం చేసుకుంటేనే ఫలితముంటుంది.

ఆరుద్ర మూడో పాదములో గ్రహ దశలు మూడో పాదములో జన్మించినవారికి ముందుగా రాహు మహర్దశ 9సంవత్సరాలు, తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.

ఆరుద్ర నాలుగో పాదము
ఆరుద్ర నాలుగో పాదమున జన్మించిన వారు నిదానంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా లౌక్యం, చాకచక్యం మిగిలిన లక్షణాలను ప్రభావితం చేస్తాయి. దూరదృష్టితో వ్యవహరించాలి. నిలకడ సాధించడం కూడా ముఖ్యమే. నిదానమే ప్రధానం అన్న సూక్తి వర్తిస్తుంది. అందరిని కలుపుకుపోయే స్వభావం ఉంటుంది. దీంతోపాటు ఫలితాన్ని పంచుకొనే వైఖరికూడా అవసరం. అనవసరపు కోపానికి సంకెళ్లు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అన్నింటా గెలిచి రావాలన్న వ్యూహాన్ని సమర్థంగా అమల్లో పెట్టాల్సి ఉంటుంది.ఆరుద్ర నాలుగో పాదములో గ్రహ దశలు నాలుగో పాదములో జన్మించిన వారికి ముందుగా రాహు మహర్దశ 4 సంవత్సరాల 6 నెలలు ఉంటుంది. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.

ఆరుద్ర నక్షత్రము – గుణగణాలుఈ నక్షత్రములో జన్మించిన వారిది అనుకొన్న దానిని సాధించేదాకా నిద్రపోని తత్వం. మాటల్లో నేర్పరితనమును, మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది. పట్టుదల కూడా ఉంటుంది. కార్యసాధనలో ఎన్నిసార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. డబ్బుల విషయంలో నిర్ణయాలు సరిగా ఉండవు. తప్పుడు సలహాలు, శక్తిసామర్ధ్యాలు, పగ తీఱ్చుకోవాలనే కోరిక, మొండి పట్టుదల జీవితంలో ఒడిదుదుకులకు దారి తీయవచ్చును. తొందరపాటుతో ముందు వెనుక మంచి-చెడు అనేవి చూడకుండనే నిర్ణయాలను వెంటనే అమలు పరుస్తారు. అవమానాన్ని ఓర్చుకొనలేరు.ఆయుస్సు కూడా ఎక్కువే. ఆడవారిపట్ల గౌరవ భావం కలిగి ఉంటారు. మూకలని నమ్మించ కలిగిన ఆకట్టుకొనగలిగిన శక్తిని వీరు కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా ఎనలేని శక్తి సామర్ధ్యాలతో మరల వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు. వీరి వీరి బ్రతుకులలో ఏభై రెండు నుంచి 26 సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి.ఈ నక్షత్రము వారు ఆలోచనలు, నిర్ణయాలు చకచకా మార్చేసుకుంటారు. క్రయ విక్రయాలయందు ఆసక్తి ఉంటుంది. దీంతో వ్యాపారమందు దూసుకెళ్లే స్వభావం కనిపిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించకపోతే వీరితో పాటు వెంట ఉన్నవారికికూడా ఇబ్బంది తప్పదు.

నక్షత్రం ఆరుద్ర

అధిదేవత కాళి

వర్ణం ఎరుపు

రత్నం గోమేధికం

నామం కూ,ఘ,బ,చ

గణం మానవగణం

జాతి పురుష

పక్షి కాకి.

జంతువు కుక్క .

కాళి ఎరుపు గోమేధికం కూ,ఘ,బ,చ మానవగణం కుక్క ఆది ఆరుద్ర నక్షత్రపు చెట్టు రేల ఆరుద్ర నక్షత్రపు జంతువు కుక్క. ఆరుద్ర నక్షత్రపు జాతి - ఆడ ఆరుద్ర నక్షత్ర పక్షి కాకి. ఆరుద్ర నక్షత్ర అధిపతి రాహువు. ఆరుద్ర నక్షత్ర అధిదేవత రుద్రుడు ఆరుద్ర నక్షత్ర గణము మానవగణము

13 September 2016

చిత్త నక్షత్రము

చిత్త నక్షత్రము చిత్తానక్షత్ర జాతకుల గుణగణాలు చిత్తా నక్షత్రముకు అధిపతి కుజుడు, గణము రాక్షస , జంతువు పులి, వృక్షము తాటి చెట్టు, రాశ్యధిపతులు బుధుడు శుక్రుడు, అధిదేవత త్వష్ట.

బాల్యములో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దత్తు పోవుట లెక స్వజనులకు దురముగా పెరుగుటకు అవకాశము ఉంది. ఇతరుల ఆర్ధిక సాయముతో జీవితములో ముఖ్యఘట్టాలు పూర్తి చేసుకుంటారు. తాను అనుభవించిన కష్టాలు జీవితములో మరెవ్వరు అనుభవించ కూడదని అహర్నిశలు కష్టపడతారు. అర్ధరహితమైన క్రమశిక్షణ కారణంగా స్వజనులు దారి తప్పుతారు. ఎక్కువగా అభిమానించి ప్రాణప్రథముగా భావించిన వారు జీవితములో దూరము ఔతారు. వాదనా పఠిమ కారణముగా న్యాయస్థానాలలో, ప్రజాబాహుళ్యములో అనుకూల ఫలితాలు సాధించినా కుటుంబములో అందుకు ప్రతికూల పరిస్తితులను ఎదుర్కొంటారు. సహచరులంతా ఒక్కటిగా ఈ నక్షత్ర జాతకులను దూరముగా ఉంచుతారు. పెద్దలు, ఉన్నత స్థానాలలో ఉన్న వరి నుడీ ప్రతికూలమైన తీర్పులను ఎదుర్కుంటారు. విపరీతమైన కోపము, పోరుబెట్టడము, జరిగిపోయిన వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడము వలన కావలసిన వారికి అమ్దరికీ దురము ఔతారు. ప్రయోజనము లేని చర్చలు, కోపతాపాలు జీవితములో చేదు అనుభవాలకు దారి తీస్తాయి. సంతానము ఉన్నత స్థితికి వస్తారు. విదేశీవ్యవహారాలు ఆలస్యముగా కలసి వస్తాయి. వస్తువలను బాగు చేయడము(రిపేరు వర్క్), సాహసకృత్యాలు, సాంకెతిక పరిజ్ఞానము, అగ్నికి సంబంధించిన వ్యాపారాలు కలసి వస్తాయి. అందరిలో ప్రత్యేకత సాధించాలన్న కోరిక వలన వివాదాస్పదమై అనుకూల ఫలితాలను ఇస్తుంది.

జీవితములో అన్నిటికీ సర్దుకు పోయే భార్య లభిస్తుంది. జీవిత మధ్య భాగములో స్థిరాస్థులు కలిసి వస్తాయి. పాడి పంత వ్యవసాయము పట్ల ప్రత్యేక అభిరుచి ఉంటుంది.

చిత్తా నక్షత్ర నక్షత్రములలో ఇది 14వ నక్షత్రం. నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి చిత్త కుజుడు రాక్షస స్త్రీ పులి తాటి మధ్య గరుడ త్వష్ట్ర 1,2 కన్య ,3,4 తుల .

చిత్తా నక్షత్ర జాతకుల తారా ఫలాలు
తార నామం తారలు ఫలం జన్మ తార మృగశిర, చిత్త, ధనిష్ట శరీరశ్రమ సంపత్తార ఆర్ద్ర, స్వాతి, శతభిష ధన లాభం విపత్తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర కార్యహాని సంపత్తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర క్షేమం ప్రత్యక్ తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి ప్రయత్న భంగం సాధన తార అశ్విని, మఖ, మూల కార్య సిద్ధి, శుభం నైత్య తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ బంధనం మిత్ర తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ సుఖం
అతిమిత్ర తార రోహిణి, హస్త, శ్రవణం సుఖం, లాభం.

చిత్తానక్షత్రము నవాంశ 1 వ పాదము - కన్యరాశి. పే అక్షరము.

2 వ పాదము - కన్యరాశి . పో అక్షరము.

3 వ పాదము - తులారాశి. రా అక్షరము.

4 వ పాదము - తులారాశి . రి అక్షరము .

చిత్త నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు నక్షత్రములలో చిత్త నక్షత్రము 14వది. చిత్తా నక్షత్రముకు అధిపతి కుజుడు. గణము రాక్షస. జంతువు పులి. వృక్షము తాటి చెట్టు. రాశ్యధిపతులు బుధుడు, శుక్రుడు. అధిదేవత త్వష్ట.

చిత్తానక్షత్రము నవాంశ విషయానికి వస్తే.. మొదటి పాదము – కన్యరాశి ,
రెండవ పాదము – కన్యరాశి ,
మూడవ పాదము – తులారాశి,
నాలుగవ పాదము – తులారాశి ఉంటాయి.

చిత్త నక్షత్రము మొదటి పాదము చిత్తా నక్షత్ర అధిపతి కుజుడు. వీరు రాక్షసగణ ప్రధానులు. ఆవేశం, అతిశయం, పట్టుదల, మొండితనం వీరి లక్షణాలు. ఈ జాతకులకు ఆరు సంవత్సరాలకు రాహుదశ వస్తుంది.. కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించాలి. రాహుదశలో ఉన్న ఉరుకు దూరంగా విద్యాభ్యాసం చేసే అవకాశాలు అధికం. 24 సంవత్సరాలకు గురుదశ వస్తుంది కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. సంపాదించినది జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకుంటే 40 సంవత్సరాలకు వచ్చే 19 సంవత్సరాల శనిదశలో ఖర్చులు అధికమవుతాయి. 59 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది. మిగిలిన జీవితం సాఫీగా కొనసాగుతుంది. ఇక వీరికి విద్యుత్, అగ్ని, భూ సంబంధిత ప్రభుత్వ ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. యునియన్ లీడర్లుగా ఉండడమంటే వీరు ఆసక్తి. కార్య సాధకులుగా ఉంటారు. అధికారులుగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. నిర్వహణ సామర్ధ్యం కూడా అధికమే.

చిత్త నక్షత్రము రెండవ పాదము చిత్తా నక్షత్ర రెండవ పాదము వీరు ఆవేశం, పట్టుదల వీరికి అత్యధికం. నాలుగు సంవత్సరాలకు రాహుదశ వస్తుంది కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా విద్యలో విజయం సాధించాలి. రాహు దశలో ఉన్న సొంత ఊరుకు దూరంగా విద్యాభ్యాసం చేసే అవకాశాలు అధికం. 22 సంవత్సరాలకు గురుదశ వస్తుంది కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. సంపాదించినది జాగ్రత్తగా పోది చేసుకోవాలి. లేదంటే 38 సంవత్సరాలకు వచ్చే శని దశ కాలంలో ఖర్చులు అధికమవుతాయి. దీంతో ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. 57 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది. ఇక ఈ నక్షత్ర జాతకులకు భూ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం వీరికి అనుకులిస్తుంది. వీరు మేధావంతులు, ఆవేశపూరితులుగా ఉంటారు. కనుక సైనిక పరమైన వృత్తులు వీరికి అనుకూలిస్తాయి.

చిత్త నక్షత్రము మూడవ పాదము చిత్త నక్షత్ర మూడవ పాదము వీరు వీర విద్యలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. అంతేకాదు కళా రంగంలో ప్రవేశించే అవకాశం ఉంది. స్టంట్ ఆర్టిస్ట్ స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. వీరు విద్యా శిక్షకులుగా రాణించగల అవకాశం ఉంది. వీరికి పట్టుదల అధికం. ధైర్య సాహసాలతో కూడిన ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. 3 సంవత్సరాలకు రాహు దశ వస్తుంది. కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించాలి. వీరికి కూడా రాహుదశలో సొంత ఊరికి దూరంగా విద్యాభ్యాసం చేసే అవకాశాలున్నాయి. 21 సంవత్సరాలకు గురు దశ వస్తుంది. కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం అవుతుంది. సంపాదించినది దాచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. లేకుంటే 37 సంవత్సరాలకు వచ్చే శనిదశ లో ఖర్చులు అధికమవుతాయి. ఈ కారణాల వల్ల ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. 56 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది మిగిలిన జీవితం సుఖంగా సాగుతుంది.

చిత్త నక్షత్ర నాలువ పాదము వీరు రాక్షసగణ ప్రధానులు. విరు ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీరు సైనిక పరమైన ఉద్యోగాలమతే బాగా రాణించగల అవకాశం బాగా ఉంది. భూ సంబంధిత సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అత్యధికంగా అనుకూలిస్తాయి. ధైర్య సాహసాలు వీరికి అధికమే. మొదటి ఏడాది తరువాత రాహుదశ వస్తుంది కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించాలి. 19 సంవత్సరాలకు గురుదశ వస్తుంది కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. సంపాదించినది జాగ్రత్తగా దాచుకోవాల్సిన పరిస్థితి. లేకుంటే 36 సంవత్సరాలకు వచ్చే శని దశలో ఖర్చులు అధికమవుతాయి కనుక ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. 55 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది. చిత్త నక్షత్రము జాతకుల గుణగణాలు కుజ గ్రహాధిపత్య నక్షత్రమైన చిత్త నక్షత్రంలో జన్మించిన జాతకులు తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే తరహా. తన నిర్ణయమే సరైనదని వాదిస్తారు. ఇతరుల ద్వారా సహాయంను పొందే వీరు.. ఇతరులకు సహాయం చేసే విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తారు. ప్రయోజనము లేని చర్చలు, కోపతాపాలు జీవితంలో చేదు అనుభవాలకు దారి తీస్తాయి. తాను చేసిన సహాయాన్ని భూతద్దంలో చూపించేందుకు ప్రతిసారి ప్రయత్నిస్తారు. భార్య, లేక ఓ స్త్రీ సహకారం లేనిదే జీవితంలో రాణించలేరు. స్థిరాస్థులు వంశపారంపర్యంగా లభించినా.. సొంతంగా అంతకంటే ఎక్కువ కూడబెడతారు. రాజకీయంలో ప్రవేశిస్తే ఉన్నత పదవులను అలంకరించవచ్చే అవకాశం. అంతేకాకుండా సాంకేతిక, వైద్య రంగాల్లో ఆర్థిక పరమైన వ్యాపారాల్లో మంచి పట్టు సాధిస్తారు. మంచి సలహాదారులు చెంతనే ఉండటం ద్వారా అధిక లాభాలు పొందుతారు. ఇక ఈ నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణాలు లేకుండా ఆవేశానికి గురవుతారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నించడానికి ఏ మాత్రం వెనుకాడరు. అలాగే చిత్తా నక్షత్రంలో జన్మించిన మహిళా జాతకులు మధ్య వయస్సు వరకు సుఖ భోగాలను అనుభవిస్తారు. ఆ తర్వాత ఈ జాతకులకు మితమైన భోగభాగ్యాలు చేకూరుతాయి. చిత్తా నక్షత్ర వృక్షము తాటి చెట్టు చితా నక్షత్ర జంతువు పులి చిత్తా నక్షత్ర జాతి స్త్రీ చిత్తా నక్షత్ర పక్షి కుకుటము. చిత్తా నక్షత్ర అధిపతి అంగారకుడు.కుజుడు. చిత్తా నక్షత్ర అధిదేవత తృష్ట.విశ్వకర్మ. చిత్తా నక్షత్ర గణము రాక్షస గణము రాక్షసరాజు రావణుడు. వర్ణము ఎరుపు. రత్నము పగడము.

12 September 2016

నక్షంత్రాలు-నక్షత్రపాద దోషాలు.

నక్షత్రాలు  (జ్యోతిషం)
ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షం లో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం.
మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వం లో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి. కొన్నినక్షత్ర వివిరాలు జ్యోతిష నక్షత్రాలకు గ్రహాలు అధిపతులుగా ఉంటారు. దేవతలు అది దేవతలుగా ఉంటారు. నక్షత్రాలు దేవ, రాక్షస. మానవ. గణాలుగా మూడు రకము లయిన గణాలుగా విభజించ బడి ఉంటాయి.
జ్యోతిష శాస్త్రంలోగణాలను అనుసరించి గుణగణాలను గణిస్తారు. అలాగే ఆది నాడి, అంత్య నాడి, మధ్య నాడి అని మూడు విధముల నాడీ విభజన చేయబడుతుంది.
అలాగే ఒక్కో నక్షత్రానికి ఒక్కో జంతువు, పక్షి, వృక్షము ఉంటాయి.
నక్షత్రాలను స్త్రీ నక్షత్రాలు పురుష నక్షత్రాలుగా విభజిస్తారు.
జ్యోతిష్యాస్త్ర ప్రకారం నక్షత్రాలు 27.
నక్షత్రం
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
----------------------------------------------------








1.నక్షత్రం అశ్విని.
నక్షత్రాధిపతి కేతువు
అధిదేవత అశ్వినీదేవతలు
గణము దేవగణము
జాతి పురుష
జంతువు గుర్రము
పక్ష గరుడము
వృక్షము అడ్డసరం ,విషముష్టి జీడిమామిడి
రత్నం వైడూర్యం
నాడి ఆదినాడి
రాశి మేషరాశి.
వరుసగా చదవాలి.
1.అశ్విని  కేతువు   అశ్వినీదేవతలు  దేవగణము  పురుష  గుర్రము. గరుడము. అడ్డసరం ,విషముష్టి జీడిమామిడి   వైడూర్యం  ఆదినాడి 1234పాదములు  మేషరాశి.
------
----------------------------------------------------













2.నక్షత్రం భరణి.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
2.భరణి   శుక్రుడు.  యముడు మానవగణము. స్త్రీ  ఏనుగు   పింగళ. దేవదారు ,  ఉసిరిక. వజ్రము. మధ్యనాడి 1234 పాదములు  మేషరాశి
------
----------------------------------------------------











3.నక్షత్రం కృత్తిక.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
3.కృత్తిక. సూర్యుడు సూర్యుడు  రాక్షసగణము. పురుష  మేక  కాకముబెదంబర ,  అత్తి  , కెంపు. అంత్యనాడి 1 పాదము  మేషరాశి-2-3-4 పాదములు  వృషభరాశి.
-----------------------------------












4.నక్షత్రం రోహిణి.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
4.రోహిణి. చంద్రుడు   బ్రహ్మ  మానవగణము  పురుష  సర్పం   కుకుటము. జంబు ,(నేరేడు  ముత్యం    అంత్యనాడి   1234 పాదములు
వృషభరాశి.
----------------------------------------------------









5.నక్షత్రం మృగశిర.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
5.మృగశిర.  కుజుడు  దేవగణం. ఉభయ. సర్పం. మయూరము   చండ్ర , మారేడు  పగడం మధ్యనాడి12 వృషభరాశి. 12 పాదములు మిధునరాశి.
----------------------------------------------------











6.నక్షత్రం ఆరుద్ర
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
6.ఆరుద్ర   రాహువు  రుద్రుడు  మానవగణం. పురుష  శునకం   గరుడ. మురేల ,చింత.  గోమేధికం  ఆదినాడి1234 పాదములు మిధునరాశి.
----------------------------------------------------









7.నక్షత్రం పునర్వసు.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
7.పునర్వసు   గురువు   అధితి    దేవగణం. పురుష మార్జాలం(పిల్లి)   పింగళ   వెదురు ,  గన్నేరు   కనక పుష్యరాగం    ఆదినాడి.  1-2-3 పాదములు  మిధునరాశి .4 పాదము  కటకం రాశి.
----------------------------------------------------








8.నక్షత్రం పుష్యమి.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
8.పుష్యమి   శనిగ్రహం  బృహస్పతి. దేవగణం. పురుష   మేక   కాక. ముపిప్పిలి. నీలం మధ్యనాడి  1234 పాదములు  కటకంరాశి.
----------------------------------------------------









9.నక్షత్రం ఆశ్లేష.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
9.ఆశ్లేష   బుధుడు   జ్యోతిషం   సర్పము రాక్షసగణం.   స్త్రీ   మార్జాలం    కుకుటము. నాగకేసరి ,  సంపంగి ,. చంపక   పచ్చ  అంత్యనాడి.   1234 పాదములు కటకం రాశి.
----------------------------------------------------









10.నక్షత్రం మఖ.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
10.మఖ  కేతువు  పితృ దేవతలు  రాక్షసగణం. పురుష. మూషికం. మయూరము. మర్రి. వైడూర్యం. అంత్యనాడి.  1234 సింహరాశి .
----------------------------------------------------









11.నక్షత్రం పూర్వఫల్గుణి(పుబ్బ).
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
11.పూర్వఫల్గుణి(పుబ్బ)  శుక్రుడు భర్గుడు. మానవసగణం  స్త్రీ. మూషికం. గరుడ. ముమోదుగ. వజ్రం. మధ్యనాడి.  1234 సింహరాశి.
----------------------------------------------------









12.నక్షత్రం ఉత్తర.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
12.ఉత్తర.  సూర్యుడు  ఆర్యముడు  మానవగణము. స్త్రీ    గోవు .  పింగళ.  జువ్వి    కెంపు  ఆదినాడి   12సింహం  3-4కన్యరాశి.
----------------------------------------------------












13.నక్షత్రం హస్త.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
13.హస్త   చంద్రుడు. సూర్యుడు. దేవగణం. పురుష. మహిషము.  కాకము. కుంకుడు ,జాజి. ముత్యం. ఆదినాడి  1234 కన్యరాశి.
----------------------------------------------------















14.నక్షత్రం చిత్త
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
14.చిత్త. కుజుడు. త్వష్ట్ర  రాక్షసగణం. వ్యాఘ్రం(పులి)    కుకుటము   తాటిచెట్టు ,మారేడు.  పగడం  మధ్యనాడి   1 2 పాదములుకన్యరాశి.     3  4 పాదములు  తులా రాశి.
----------------------------------------------------










15.నక్షత్రం స్వాతి.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
15.స్వాతి.  రాహువు. వాయు దేవుడు. దేవగణం. మహిషి  మయూరము. మద్ది  గోమేధికం. అంత్యనాడి  1234తుల
----------------------------------------------------









16.నక్షత్రం విశాఖ.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
16.విశాఖ  గురువు  ఇంద్రుడు,  అగ్ని  రాక్షసగణం.  స్త్రీ   వ్యాఘ్రము(పులి). గరుడము. నాగకేసరి ,  వెలగ ,  మొగలి. కనక పుష్యరాగం.  అంత్యనాడి. 1-3తుల.  4వృశ్చికం.
----------------------------------------------------









17.నక్షత్రం అనూరాధ.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
17.అనూరాధ  శని  సూర్యుడు. దేవగణం. పురుష. జింక. పింగళ. పొగడ.  నీలం. మధ్యనాడి  1234వృశ్చికం
----------------------------------------------------














18.నక్షత్రం జ్యేష్ట.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
18.జ్యేష్ట  బుధుడు ఇంద్రుడు  రాక్షసగణం... లేడి  కాకము  విష్టి  పచ్చ  ఆదినాడి  1234వృశ్చికం
----------------------------------------------------









19.నక్షత్రం మూల.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
నాడి
రాశి
వరుసగా చదవాలి.
రత్నం
19.మూల కేతువు నిరుతి  రాక్షసగణం  ఉభయ. శునకం  కుకుటము  వేగిస  వైడూర్యం  ఆదినాడి 1234ధనస్సు .
----------------------------------------------------












20.నక్షత్రం పూర్వాఆషాఢ.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
20.పూర్వాఆషాఢ  శుక్రుడు  గంగ  మానవగణం  స్త్రీ  వానరం  మయూరము  నిమ్మ ,అశోక. వజ్రం  మధ్యనాడి. 1234ధనస్సు .
----------------------------------------------------













21.నక్షత్రం ఉత్తరాషాఢ.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
21.ఉత్తరాషాఢ  సూర్యుడు  విశ్వేదేవతలు  మానవగణం  స్త్రీ  ముంగిస  గరుడము. పనస  కెంపు.  అంత్యనాడి  1ధనస్సు2-3 4మకరం .
----------------------------------------------------












22.నక్షత్రం శ్రవణము.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
22.శ్రవణము  చంద్రుడు  మహావిష్ణువు  దేవగణం. పురుష  వానరం. పింగళ. ముత్యం  జిల్లేడు  అంత్యనాడి 1234మకరం.
----------------------------------------------------











23.నక్షత్రం ధనిష్ట.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
23.ధనిష్ట  కుజుడు  అష్టవసుడు. రాక్షసగణం. స్త్రీ  సింహము  కాకము  జమ్మి  పగడం  మధ్యనాడి  2మకరం 2కుంభం.
----------------------------------------------------













24.నక్షత్రం శతభిష.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
24.శతభిష  రాహువు జ్యోతిషంవరుణుడు. రాక్షసగణం. ఉభయ. అశ్వం(గుర్రం). కుకుటము  అరటి ,  కడిమి. గోమేధికం. ఆదినాడి  1234కుంభం.
----------------------------------------------------













25.నక్షత్రం పూర్వాభద్ర
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
25.పూర్వాభద్ర  గురువు. అజైకపాదుడు. మానవగణం. పురుష  సింహం  మయూరము. మామిడి  కనక పుష్యరాగం ఆదినాడి  3కుంభం1మీనం.
----------------------------------------------------












26.నక్షత్రం ఉత్తరాభద్ర
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
26.ఉత్తరాభద్ర  శని  అహిర్పద్యువుడు. మానవగణం  పురుష. గోవు. మయూరము. వేప. నీలం. మధ్యనాడి  4మీనం .
----------------------------------------------------












27.నక్షత్రం రేవతి.
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
వరుసగా చదవాలి.
27.రేవతి బుధుడు  పూషణుడు. దేవగణం  స్త్రీ  ఏనుగు. మయూరము  విప్ప. పచ్చ  అంత్యనాడి  4మీనం.
----------------------------------------------------









శిశు జనన నక్షత్ర పాదదోషాలు
నక్షత్రములు1వ పాదం2వ పాదం3వ పాదం4వ పాదం వరుసగా....
అశ్వని 1 శిశువునకు,  2 తండ్రికిదోషంలేదు 3దోషంలేదు  4 సామాన్యదోషం.


భరణి  1సామాన్యదోషం  2 దోషంలేదు 3  మగ-తండ్రికి,  4 ఆడ-తల్లికిశిశువునకు.


కృత్తిక  1మంచిది  2మంచిది 3 మగ-తండ్రికి,
4 ఆడ-తల్లికితల్లికి.


రోహిణి 1 మేనమామకు, 2 తల్లికిమేనమామకు,  3  తల్లికిమేనమామకు, 
4 తల్లికిమేనమామకు,తండ్రికి.



మృగశిర  1మంచిది  2 మంచిది   3మంచిది  4మంచిది.


ఆరుద్ర  1మంచిది 2 మంచిది 3 మంచిది 4 తల్లికి.


పునర్వసు  1మంచిది  2మంచిది  3మంచిది  4 మంచిది.


పుష్యమి  1సామాన్యదోషంపగలు-తండ్రికి,  2 రాత్రి-తల్లికిపగలు-తండ్రికి,  3రాత్రి-తల్లికి 4సామాన్యదోషం.


ఆశ్రేష 1దోషంలేదు  2 శిశువునకు,  3 ధనమునకు 4 తల్లికితండ్రికి.


మఖ 1 శిశువుకు, 2 తండ్రికిమగ-తండ్రికి,  3  ఆడ-తల్లికిమగ-తండ్రికి,  4 ఆడ-తల్లికిమంచిది.



పూర్వఫల్గుణి  1 మంచిది  2మంచిది  3మంచిది  4తల్లికి.


ఉత్తరఫల్గుణి  1మగ-తండ్రికి 2 మంచిది  3మంచిది   4 మగ-తండ్రికి.


హస్త  1మంచిది  2 మంచిది  3మగ-తండ్రికి,  ఆడ-తల్లికి  4 మంచిది.



చిత్త  1మగ-తండ్రికి  2తండ్రికి  3తండ్రికి   
4 సామాన్యదోషం.



స్వాతి  1మంచిది  2మంచిది  3మంచిది  4 మంచిది.


విశాఖ  1 మగ-బావమరది,  2ఆడ-మరదలుమగ-బావమరది,  3 ఆడ-మరదలుమగ-బావమరది,  ఆడ-మరదలుమగ-తల్లికి,  4 బావమరది,ఆడ-మరదలు.


అనూరాధ 1 మంచిది  2మంచిది  3మంచిది
4 మంచిది.


జ్యేష్ట  సౌఖ్యహాని, 1 తల్లికిసోదరులకు,   2 మేనమామ
శిశువుకు,  3 తల్లికి,పెదతండ్రికితండ్రికి,
4 అన్నకు.


మూల 1 తండ్రికి  2తల్లికి  3ధనమునకు   4మంచిది.


పూర్వాషాఢ  1మంచిది 2 మంచిది 3 మగ-తండ్రికి,  4 ఆడ-తల్లికిమంచిది.


ఉత్తరాషాఢ  1మంచిది 2మంచిది  3మంచిది 4మంచిది.


శ్రవణం  1మంచిది  2మంచిది 3 మంచిది  4మంచిది.


ధనిష్ట 1 మంచిది 2 మంచిది  3మంచిది 4 మంచిది.


శతభిషం  1మంచిది  2మంచిది 3 మంచిది  4మంచిది.


పూర్వాభద్ర  1మంచిది 2 మంచిది  3మంచిది 4మంచిది.


ఉత్తరాభద్ర  1మంచిది  2మంచిది  3మంచిది  4మంచిది.


రేవతి  1మంచిది  2మంచిది 3 మంచిది
4 తండ్రికిదోషం.




తారలుతార నామందినాధిపతిఫలితం
1 తారజన్మ తారశనిశరీర శ్రమ
2. తారసంపత్తారగురువుధనలాభం
3. తారవిపత్తారకుజుడుకార్యహాని
4. తారక్షేమ తారసూర్యుడుక్షేమం
5. తారప్రత్యక్ తారరాహువుప్రయత్న భంగం
6. తారసాధన తారశుక్రుడుకార్యసిద్ధి, శుభం
7. తారనైత్య తారకేతువుబంధనం
8. తారమిత్ర తారచంద్రుడుసుఖం
9. తారఅతి మిత్ర తారబుధుడుసుఖం, లాభం నక్షత్రాలు
మరికొన్ని వివరాలు  పురుష నక్షత్రాలు :- అశ్వని, పునర్వసు, పుష్యమి, హస్త, శ్రవణము, అనూరాధ, పూర్వాభద్ర, ఉత్తరాభద్ర.
స్త్రీనక్షత్రాలు :- భరణి, కృత్తిక, రోహిణి, ఆర్ద్ర, ఆస్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, చిత్త, స్వాతి, విశాఖ, జ్యేష్ట, పూర్వాషాఢ, ధనిష్ట, రేవతి.
నపుంసక నక్షత్రాలు :- మృగశిర, మూల, శతభిష.