14 October 2016

ఎంత సంపాదించినా ధనం ఉండక పోవడానికి కారణాలు.



అయితే ఎంత సంపాదించినా ఒక్క రూపాయని కూడా నిలుపుకోలేని పరిస్థితి కొందరి ఇళ్ళల్లో కనుపిస్తుంటుంది. అందుకు కారణాలు అనేకం. ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టకపోవడం, అనవసర ఖర్చులు చేయడం వంటివే కాక ఇంటికి సరైన వాస్తు లేకపోవడం కూడా ఈ పరిస్థితికి దోహదం చేస్తుంది అంటున్నారు వాస్తు నిపుణులు. సంపాదించిన డబ్బును పొదుపు చేయడం లేదా మరింత డబ్బు సంపాదించాలనుకోవడానికి వాస్తు పరమైన మార్పులను కొన్నింటి ని సూచిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం…









ఇంటికి నైరుతి మూలను తమిళులు కుబేర స్థానమంటారు. ఇక్కడ ఎటువంటి సంప్‌ కా నీ, సెప్టిక్‌ టాంక్‌ కానీ బోర్‌వెల్‌ కానీ భూమిలోపల ఎటువంటి నిర్మాణం లేకుండా చూసుకోవడం వల్ల ఇంట్లో ధనం నిలుస్తుంది.
నగలు, ఇతర విలువైన పత్రాలు పెట్టే బీరువాలను, లాకర్లను వాస్తు ప్రకారం పెట్టుకోవాలి. తూర్పు ముఖంగా తలుపు తెరుచుకునే పశ్చిమపుగోడకు వీటిని పెట్టడం మంచిది. లేదా తూర్పు లేదా ఉత్తర ముఖంగా తలుపు తెరుచుకునేలా నైరుతి మూల ఉంచాలి.






లాకర్లు ఉత్తర ముఖం తెరుచుకునేలా దక్షిణపు గోడకు పెట్టడం కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది. లాకర్‌ తలుపులు ఉత్తరముఖంగా తెరుచుకోవడం మంచిది. ఎందుకంటే వాస్తు ప్రకారం ఈ దిక్కుకి కుబేరుడు అధిపతి.
బీరువాను ఈశాన్య మూలలో ఎప్పుడూ పెట్టకూడదు. ఎందుకంటే దీనివల్ల సంపద నష్టం జరుగుతుంది. ఆగ్నేయ, వాయువ్య దిక్కులు కూడా మంచివి కావు ఎందుకంటే దీనివల్ల అనవసర ఖర్చులు అధికమవుతాయి. డబ్బులు పెట్టుకునే బీరువాను ఎప్పుడూ దూలం కింద ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఆర్థిక స్థిరత్వం మీద ఎక్కువ ఒత్తిడి పెడుతుంది.ఈశాన్య మూల కూడా సంపద వృద్ధికి తో డ్పడుతుంది.




ఇంటికి ఈ మూలన సంప్‌, బోర్‌వెల్‌ లేదా బావి నిర్మిస్తే అభివృద్ధి, స్థిరత్వం వస్తాయి. ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిల్వ ఉండకపోవడం లేక అది వృద్ధి జరగకపోవడం వంటివి ఎదుర్కొంటుంటే ఇంట్లో రాత్రంతా కనీసం ఒక దీపానై్ననా వెలగని స్తూ ఉండాలిట. ఎందుకంటే కాం తి కూడా ఒక రకమైన శక్తే. ఫెంగ్‌షూయ్‌ ప్రకారం దీన్ని యాంగ్‌ శక్తి అం టారు. ఇది చలనం తీసుకువస్తుంది.
ఇంట్లో చేపల అక్వేరియం పెట్టుకోవడం సంపద వృద్ధి కావడానికి దోహదం చేస్తుందిట. ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండే చేపలను ఎం చుకొని ఇంటికి తెచ్చుకోవాలి. నీటిని శుభ్రం గా, గాలిపోయేలా ఉంచాలి. చేపలు అక్వేరియంలో తిరుగుతూ ఉంటే ఆ శక్తి ఇంట్లో సం పద వృద్ధి కావడానికి దోహదం చేస్తుందిట. దీ నిని గదిలో నైరుతి దిక్కున ఉంచడం మంచిది.






మీ అపార్ట్‌మెంట్‌ ముఖద్వారం పొడవైన కా రిడార్‌ చివర ఉన్నప్పుడు అక్కడ ప్రవహించే శ క్తి చాలా ఉధృతంగా ఉంటుంది. ఇది మీ ఆర్థిక పె ట్టుబడులకు రిస్క్‌ కాగలదు. దీనిని తగ్గించేందుకు కారిడార్‌ మధ్యలో అంటే దారికి అడ్డంగా కాదు గాని ఒక వైపు ఒక మొక్కను పె డితే ఆ ఉధృతి తగ్గుతుంది.






ఇంటి ముఖ ద్వారానికి మంచి రంగులు వేయడం ద్వారా సంపదను ఆహ్వానించవచ్చు. పక్కింటివారి గోడలకు, ముఖద్వారాలకు భిన్నంగా, ఆకర్షణీయమైన రంగులు వేసుకోమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా జీవితంలో ఆర్థికాంశాల పట్ల మరింత స్పష్టత కావాలనుకున్నప్పుడు మీ ఇం ట్లో గాజు వస్తువులను ఒకసారి పరిశీలించండి. ముఖ్యంగా ఇంటికి గాజు కిటికీ తలుపులు వుంటే అవి ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. మురికిగా ఉన్న అద్దపు తలుపులు సంపదను లోనికి రానివ్వవట.కిటికీకి క్రిస్టల్స్‌ వేలాడదీయడం వల్ల శక్తి చురుకుగా ప్రవహిస్తుంది. సూర్యకిరణాలు వా టిని తాకినపుడు అవి రంగు రంగుల అద్భుత ఇంద్రధనస్సులను సృష్టిస్తాయి. నేరుగా సూర్యకిరణాలు ప్రసరించే కిటికీని ఎంచుకుని అక్క డ ఒక క్రిస్టల్‌ను వేలాడదీస్తే మీ కెరీర్‌ వృద్ధికి అది దోహదం చేస్తుందంటున్నారు.







ఆదాయానికన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటే మొక్కలను కానీ విత్తనాలను కానీ టాయిలెట్లలో ఉంచాలి. ఇది ధన ప్రవాహం వృధా కావడాన్ని నిరోధిస్తుంది. ఎందుకంటే ఎదిగేవి ఏవైనా నీటి శక్తిని తిరిగి పీల్చుకొని రీసైకిల్‌ చేస్తుంటాయి.


మీ క్యాష్‌ బాక్స్‌ను లేదా లాకర్‌ను ప్రతిఫలించేలా బీరువాలో ఒక అద్దాన్ని పెట్టండి. ఇది మీ సంపదను సంకేతాత్మకంగా రెట్టింపు చేస్తుంది.ఇంట్లో అస్సలు డబ్బు నిలబడకుండా జీవితంలోంచే అదృశ్యమైపోతున్నట్టు అనిపించినపుడు ఇంటి ఎడమ మూలన బాగా బరువుగా ఉండే వస్తులను పెట్టండి. దానితో పాటుగా బాగా వెలుతురు వచ్చేలా చూడండి.సంపదను పెంచుకోవాలంటే ఆహ్లాదకరంగా నీరు పారే శబ్దం వినిపించేలా చిన్న ఫౌంటెన్‌ ఇంట్లో పెట్టుకోండి. అది డెస్క్‌ మీద పెట్టుకునేదైనా పర్లేదు. వాటర్‌ ఫౌంటెన్‌లా డబ్బును, సంపదను ఆకర్షించే శక్తి మరేదీ లేదు. నీరు పారే శబ్దం ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుంది.




జీవితంలో మరపురానిది పెళ్ళి. ఇది స్త్రీ పురుషులకు జీవన మైత్రి నిచ్చునది. శారీరక మానసిక స్థితి గతులలో విడదీయరానిది. వివాహము సర్వమతాల వారికి, వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఆమోదయోగ్యమైనది. హంగులతో ఆర్భాటాలతో వివాహము చేసుకొని ఆనందము పొందుట మన సామాజిక లక్షణము. వివాహం వల్ల ఆడ మగా ఇద్దరూ శారీరకంగాను, మానసికంగాను సుఖాన్నిపొందుతారు. పిల్లల కోసం, ఆస్తిపాస్తుల రక్షణ కోసం, వంశాభి వృద్ది కోసం పెళ్ళి అవసరం అవుతంది. " భార్యా భర్తలు నిత్యము గొడవలు పెట్టుకుంటే ఆ ఇంట్లో లక్ష్మి నిలవదు.




నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉభయసంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం- అని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. 'ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని వెలిగించి- ఖర్జూరమో, ఎండుద్రాక్షో లేదో ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు' అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతోంది. ఇలా దీపారాధన చేయడంవల్ల ఏ ప్రయోజనమైనా పొందవచ్చు- అన్నది శాస్త్రోక్తి.
మనం చేసే పనిని అనుసరించి మన విలువ ఉంటుంది. సమాజంలో తరతరాల నుంచి పిల్లలకు పెద్దలు పద్ధతులను, సం ప్రదాయాలను, మర్యాదలను, కట్టుబాట్లను, నియమాలను వినయ విధేయతలను నేర్పిస్తూ, వివరిస్తూ మన సంస్కృతి విశిష్టతను, వార సత్వంగా అందిస్తున్నారు. తరువాతి తరాల వారు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతున్నారు.


ఎవరి బాధ వారికి ఎక్కువ. ఎవరి దుఃఖం వారికి దుర్భరం. ఎవరి వేదన వారికి భారం. ఇంకెవరైనా ఓదార్చబోతే 'అనుభవిస్తే కాని నా బాధ నీకు తెలిసిరాదు' అని అంటుంటారు. నిస్పృహలో ఎలాంటి మాటైనా వస్తుంది. అది సహజం.
కష్టాలు, దుఃఖాలు, బాధలు- అందరివీ ఒక్కలా ఉండవు. పెద్దగీత, చిన్నగీతల అంతరాలతో ఉన్నట్టుంటాయి. కష్టాల్లో ఉన్నప్పుడు మనిషికి ఆశాజీవిగా బతకటం ఎంత అవసరమో, ఇంకొకరి బాధ చూసినప్పుడు తమ బాధను మరచి వారికొక ప్రోత్సాహకరమైన మాట చెప్పటం అంత అవసరం.
దైవ ప్రసాదితమైన ఈ జీవితంలో మనకు అవకాశాలు ఎప్పుడో కాని రావు. ఎన్నో కాని రావు. వచ్చినప్పుడు వాటిని చటుక్కున అందిపుచ్చుకోవాలి. ఒకర్ని సాంత్వనపరచి సేదతీర్చడంలోని ఆనందాన్ని తనివితీరా అనుభవించాలి. ప్రతి జీవితానికీ ఒక అర్థముందని తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేకపోతున్న వాళ్లకు తెలియజెప్పాలి.








మనస్సే సర్వస్వం
ఏది లేకుంటే మనిషి ఒక్కక్షణమైనా జీవించలేడో అది- 'మనస్సు'.  జీవిత సర్వస్వంగానూ చెప్పారు.
'మనస్సే ఈ సమస్త జగత్తు. అందువల్ల ఈ మనస్సును ప్రయత్నపూర్వకంగా సంస్కరించుకొంటూ జీవనాన్ని సాగించాలి. మనస్సు ఏ విధంగా ఉంటే ఫలితం ఆ విధంగానే ఉంటుంది. ఇది సనాతన రహస్యం. ఎప్పుడు మనస్సు సంపూర్ణంగా ప్రశాంత స్థితికి చేరుతుందో అప్పుడు అశుభకర్మలన్నీ నశించిపోతాయి. ప్రశాంతచిత్తంతో ఉండేవారే జీవితానందాన్ని అనుభవించగలుగుతారు. అప్పుడే తరగని ఆనందం వశమవుతుంది. 







అదృష్టం వరించాలంటే :-
 నెలలో వచ్చేమోదటి సోమవారం,తెల్లవారుజామునే నిద్ర లేచి, స్నానంచేసి, తెల్లని వస్త్రాలు ధరించి, పావుకిలో సగ్గుబెయ్యంతో పాయసం తయారుచేసి,అలాచేసే టప్పుడు 11- ఆకుపచ్చ యాలకులు వెయ్యాలి,  ఈ నైవేద్యాన్ని విష్ణుమూర్తి ఆలయంలో నివేదించండి, అందు కొండభాగాన్ని గోమాతకి తినిపించండి. 


11 రూపాయలు పురోహితునికి దక్షిణ ఇచ్చి కాళ్ళకు దణ్ణం పెట్టండి.

 మీఇంట్లో  దేవి ఫోటో లు ఉంటే ( దుర్గాదేవి,బాలాంబిక ,లలితాదేవి ), సాయం సంధ్యా సమయంలో దీపారాదనచేసి " దుర్గే స్ప్ర్తుతా, హరసభీతి మసేస జంతో, త్వస్త్వి సుధా , మతిమతీమ్ శుభాం దదాసి దారిద్రాయః దుఃఖ భయ హారిణి కాత్పదన్యా, సర్వోపకారణాయ  పదార్ధ చిత్తా ".

 ఇది ప్రతీనెలలో మొదటి శుక్రవారం ఈ ఆచరణ చేయండి.

 రవి పుష్యమి,గురు పుష్యమి  యోగంలో తెల్ల జిల్లేడు వేరును  పచ్చటి దారంతో కట్టి మీరు మేడలో కాని, చేతికి కాని కట్టిన మేకు అదృష్టం కలుగును.


పెరుగు, పాలకోవా, ఇటువంటి తీపి పదార్ధాలని పిల్లలకి ఉదయానే తినిపించండి. 2 వెండి గిన్నెలలో ఒకదానిలో పాలకోవా , మరో దానిలో పెరుగు ఉంచండి.  ఆ గిన్నెలను సరస్వతి దేవి కి నైవేద్యం పెట్టి , పిల్లలు పరిక్షలలో విజయం సాధించాలని కోరుకోండి. పిల్లలు పరిక్షకి వెళ్ళే సమయంలో మూడు గంటల ముందే ఒక గిన్నెలో ప్రసాదం తినిపించండి.  పరిక్షకి వెళ్ళే  ముందు మరో దానిలోది తినిపించండి. కుంకుమ పువ్వుతో తిలకం పెట్టి, నాలుక పై కేసరాన్ని ఉంచండి. ఇలా చేస్తే చదివిన వాణ్ణి గుర్తుకు వచ్చే అవకాసం చాలాఉన్నది.

3 గవ్వలను కుంకుమపువ్వుతో  కలిపి, నల్లటి వస్త్రం లో కట్టి , మీరు గనక మీ ఇంటిముందు తగిలించి , సాయం సమయంలో వాటిని నదిలో పారవేసిన మీకు వాహనం లభించును.

రోజు  శంకు పూలతో సాయం సమయంలో  పరమశివుని " నమశ్శివాయ ఓం " అని ధ్యానం చేసిన వాహనం లభించును.

ఏదయినా కొత్త వాహనం కొన్నప్పుడు ఆ వాహనంలో 5 గవ్వలను కుంకుమపువ్వుతో  కలిపి, నల్లటి వస్త్రం లో కట్టి  మీ వాహనంలో ఉంచండి. దానివలన వాహన రుగ్మతలు ఉండవు.

నిరంతరం  భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుని చాంటింగ్ చేస్తే, మన పనులు మనం చేసుకుంటుపోతే  నర   ద్రుష్టి ఉండదు ( అంటే వ్యాపార సంస్థలో, మీ ఇంటిలో భగవత్ చాంటింగ్ వినిపించాలి).  




వారానికి  ఒక సారి వ్యాపార సంస్థలో, మీ ఇంటిలో తడిగుడ్డతో తుడవాలి, పసుపు నీళ్ళు  జల్లాలి. 


మీ ఇంటి గృహిణి  ప్రతి నిత్యం కాకపోయినా గురువారం, శుక్రవారం, ఇంటి లేక షాపు ద్వారా బంధానికి పసుపు రాసి కుంకం, బొట్టులు  పెట్టిన మీ నరదిస్టి  పోతుంది.

నిమ్మకాయలతో మీ  వ్యాపార సంస్థకి కానీ , మీ ఇంటి కి కాని మూడు సారుల, అలా కుడినుండి ఎడమకి తిప్పి, ఎడమకాలితో కనక ఆ నిమ్మ కాయను తొక్కినా లేక రొడ్డుమేద పడవేసిన మీ నరద్రుస్టి పోవును. 


దేవీ ఖడ్గమాలా స్తోత్రం చదువుతూ, ఒక బూదిగ గుమ్మడి కాయకి పసుపురాసి కుంకుమ బొట్టు పెట్టి ,దానితో పాటు పట్టిక నల్లటి దారంతో చుట్టి ఉంచిన ,మీ నరద్రుస్టి పోవును. 


 ఇనుము, నూనె వ్యాపారస్థులు, తప్పనిసరిగా 19 శనివారాలు శనికి   తైలాభిషేకం చేఇంచవలెను.


మంగళ వారం, శుక్రవారం కాని,ఆదివారం కాని, అమావాస్య రోజున కాని , మీ వ్యాపారం చేసి షాపు మూసినతరువాత ముద్డ కర్పూరం వెలిగించి ఆ వ్యాపారసస్త ముందు పదవేయాలి.    

తులసి మొక్క ప్రత్యేకంగా ఏ ఇంట్లో పూజించబడునో ఆ ఇంట సర్వసంపదలు కలుగును.తులసి మొక్క లేని ఇంట్లో సమస్త సమస్యలు ఏర్పడును.రోజు ఒక తులసిదళం నమిలిమింగితే సమస్తరోగాలకు నివారణ కలుగును.
తులసి మొక్కలపై నుండి వచ్చే గాలి పీల్చిన చాలా ఆరోగ్యప్రదం.లక్ష్మీదేవికి ప్రతిరూపమే తులసి.విష్ణుమూర్తికి ప్రీతికరమైనది.అందుకే ఆమెకు హరిప్రియ అనే మరోపేరు కూడా ఉంది.సత్యభామ నిలువెత్తు బంగారం ఉంచినా తూగని ఆ విష్ణువు రూపుడైన ఆ శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవి సమర్పించిన ఒకే ఒక్క తులసీదళానికి వశుడయ్యాడు.
చాలా దేవాలయాల్లో తులసి నీరే తీర్ధంగా ఇస్తారు.ప్రతి రోజు నీళ్ళుపోసి, భక్త్, శ్రద్ధలతో తులసిమాతను ఆరాధిస్తే ఇంట్లో లక్ష్మీకళ తాండవించి, సకలసంతోషాలను మనకు ప్రసాదిస్తుంది.











శ్రావణమాసం లో శ్రావణ అష్టమి, నవమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ అమ్మ వారి పూజకు ముఖ్యమైన దినములుగా ఈ మాసం లో లక్ష్మీదేవిని ఆరాధించేవారి సకల సంపదలు మరియు శ్రావణ సోమవారములు శివునికి జరుపు అభిషేకముల వల్ల అనేక శుభములు చేకూరుతాయి.














పుట్టు మచ్చలు - శుభ అశుభ ఫలితములు

పుట్టు మచ్చల ఫలితములు
ముక్కుమీద – కోపము, వ్యాపార దక్షత
కుడికన్ను – అనుకూల దాంపత్యము
ఎడమకన్ను – స్వార్జిత ధనార్జన
నుదిటి మీద – మేధావి, ధన వంతులు
గడ్డము – విశేష ధన యోగము
కంఠము – ఆకస్మిక ధన లాభం
మెడమీద – భార్యద్వారా ధనయోగం
కుడి కణత - ధన లాభం, కీర్తి , ప్రతిష్టలు
ఎడమ కణత - అపజయాలు, దుర దృష్టం
కుడి కనుబొమ్మ - ధన వంతులతో వివాహం
ఎడమ కనుబొమ్మ - దూర దృష్టం
చెక్కిలి యందు - సకల భోగాలు
ముక్కు మీద - కార్య సిద్ది
పెదవులందు - చమత్కారులు
గడ్డమందు - ధనము ,కీర్తి
గళము నందు -వివాహం వలన ధన ప్రాప్తి
ముక్కు ప్రక్కల యందు - దేశ సంచారి
మోచేయి - వ్యవసాయ దృష్ట్యా ధనప్రాప్తి
కుడిచేయి మణికట్టునందు- విశేష బంగారు ఆభరణములు ధరించుట
కుడి ఎడమ ప్రక్కలు - ఆరోగ్య భంగం, ధన వ్యయం
ఉదరము - తిండి పోతూ, దురాశ కలవారు
పొట్టి కడుపు - బల హీనతలు కలవారు
కుడి భుజం - వివేకులు, వినయము కలవారు
ఎడమ భుజం - మూర్ఖత్వానికి గుర్తు
కుడి బాహువు - బల ధైర్యవంతులు
ఎడమ బాహువు - కార్య సిద్ది
మోచేయి దగ్గర - చంచలత్వం
మోచేయి క్రింద - జీవితాన్తమున ధన లాభము
చేతి బ్రొటన వ్రేలు – స్వతంత్ర విద్య, వ్యాపారం
కుడి చేయి చూపుడు వ్రేలు – ధనలాభము, కీర్తి
పాదముల మీద – ప్రయాణములు
మర్మస్థానం – కష్ట సుఖములు సమానం
ఎడమ మోకాలు (పురుషులకు ) - అల్ప బుద్ధి.








కుడి తోడ - అదృష్టము ధనవంతులు
ఎడమ తోడ - దారిద్యము
కుడి మోకాలు - భార్య వలన గృహ సౌక్యము
పిక్కల యందు - అలసత్వం
పాదాల యందు - ఆకస్మిక అనారోగ్యం, ఆకస్మిక మరణం
పొట్టమీద - భోజనప్రియులు
పొట్టక్రింద - అనారోగ్యం
పొట్టమీద – భోజనప్రియులు
పొట్టక్రింద – అనారోగ్యం
కుడి భుజం – త్యాగము,విశేష కీర్తి ప్రతిష్ట్రలు
బొడ్డులోపల – ధనలాభములు
ఎడమతొడ – సంభోగం
కుడి భుజం - త్యాగము,విశేష కీర్తి ప్రతిష్ట్రలు
బొడ్డులోపల - ధనలాభములు
కుడితొడ - ధనవంతులు
ఎడమతొడ - సంభోగం
చేతి బ్రొటన వ్రేలు - స్వతంత్ర విద్య, వ్యాపారం
కుడి చేయి చూపుడు వ్రేలు - ధనలాభము, కీర్తి
పాదముల మీద - ప్రయాణములు
మర్మస్థానం - కష్ట సుఖములు సమానం.









బల్లి పడుట వలన కలుగు శుభాశుభములు.
పురుషులకు
తలమీద - కలహం
పాదముల వెనక -  ప్రయాణము
కాలివ్రేళ్లు - రోగపీడ
పాదములపై - కష్టము
మీసముపై - కష్టము
తొడలపై - వస్త్రనాశనము
ఎడమ భుజము - అగౌరవము
కుడి భుజము -  కష్టము
వ్రేళ్ళపై - స్నేహితులరాక
మోచేయి - ధనహాని
మణికట్టునందు - అలంకారప్రాప్తి
చేతియందు - ధననష్టం
ఎడమ మూపు - రాజభయం
నోటియందు - రోగప్రాప్తి
రెండు పెదవులపై - మృత్యువు
క్రింది పెదవి - ధనలాభం
పైపెదవి - కలహము
ఎడమచెవి - లాభము
కుడిచెవి - దుఃఖం
నుదురు - బంధుసన్యాసం
కుడికన్ను - అపజయం
ఎడమకన్ను - శుభం
ముఖము - ధనలాభం
బ్రహ్మరంద్రమున - మృత్యువు.









స్త్రీలకు
తలమీద - మరణసంకటం
కొప్పుపై - రోగభయం
పిక్కలు - బంధుదర్శనం
ఎడమకన్ను - భర్తప్రేమ
కుడికన్ను- మనోవ్యధ
వక్షమున - అత్యంతసుఖము,పుత్రలాభం
కుడి చెవి - ధనలాభం
పై పెదవి - విరోధములు
క్రిందిపెదవి నూతన - వస్తులాభము
రెండుపెదవులు - కష్టము
స్తనమునందు - అధిక దుఃఖము
వీపుయందు - మరణవార్త
గోళ్ళయందు - కలహము
చేయుయందు - ధననష్టము
కుడిచేయి - ధనలాభం
ఎడమచేయి - మనోచలనము
వ్రేళ్ళపై - భూషణప్రాప్తి
కుడిభుజము -కామరతి, సుఖము
బాహువులు - రత్నభూషణప్రాప్తి
తొడలు - వ్యభిచారము,కామము
మోకాళ్ళు - బంధనము
చీలమండలు -  కష్టము
కుడికాలు - శత్రునాశనము
కాలివ్రేళ్ళు - పుత్రలాభం.
దవడల యందు  - దుఖ: వంతులు
ఎడమ మోకాలు  - అధిక సంతానం

మన ఇంట్లో దీపారాధనకు చేయడానికి నియమాలు


దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి.
ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి.








ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన ఆ ఇంట లక్ష్మీ ఎప్పటికి నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపారస్థలంలో దీపారాధాన చేయడం వలన కలిగే మార్పు స్వయంగా గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో, వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమవల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.








దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు.
దీపం సకల దేవతాస్వరూపం
దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపారాధన జరిగే ప్రదేశంలో మహాక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇళ్ళు కళావిహీనమై, అలక్ష్మీస్థానం అవుతాయని చెప్పారు. దీపారాధన లేకుండా దేవతారాధన చేయరు. దీపం సకల దేవతా స్వరూపం.






ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి, దానిపై ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట, నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి (చిన్నదైనా సరే), కొద్దిగా పసుపుకుంకుమ చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి, దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి, వేరే చిన్నవత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో, ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి.








దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు. అది అశుభసూచకం. కనీసం రెండు వత్తులైనా వేయాలి, అనగా రెండు వత్తులని కలిపి వేయాలి, విడివిడిగా కాదు.. రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు.దీపారాధానకు ఆవునెయి ఉత్తమం, తరువాత నువ్వులనూనె. దీపం వెలిగించాక, ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి, పూలు సమర్పించాలి. సర్వదేవతస్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి. చిన్న బెల్లం ముక్క కానీ, పటికబెల్లం పలుకులు కానీ, ఏదో ఒక పండుగానీ, లేక అందుబాటులో ఉన్నది దీపానికి నివేదన చేయాలి.




దీపంలో దేవతలున్నారు, వేదాలు ఉన్నాయి, శాంతి ఉంది, కాంతి వుంది. ఇంతటి విశిష్ట దీపాన్ని నేరుగా అగ్నిపుల్లతో వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి.


ఐదు వత్తులు :
దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్త మామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాల్గవది గౌరవం, ధర్మవృద్ధిలకూ, అయిదోది వంశాభివృద్ధికి అని చెప్తారు. దీపారాధన ఎవరు చేసినా రెండు వత్తులు తప్పనిసరిగా వుండాలి.

ఓ పక్క ఆవునేతితో, మరో పక్క నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్ఠం. ఆవునెయ్యిలో సూర్యశక్తి నిండి వుంటుంది. దీనివల్ల ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆవునెయ్యిలో నువ్వులనూనె, వేపనూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి.
వేప నూనె రెండు చుక్కలు ఆవునెయ్యి కలిపి పరమ శివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది. కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరునికి చేయడం వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరినూనె ఉపయోగిస్తే మంచిది.
నూవ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. దుష్పలితాలు దూరం చేసి సకలశుభాలూ ఇవ్వగలదు. నువ్వుల నూనె విష్ణ్వాంశమూర్తులకు అత్యంత ప్రీతికరం. వేరుశెనగ నూనెను దీపారాధనకు అస్సలు వాడరాదు.
దీపం వెలిగించే కుంది కింది భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణుమూర్తి, ప్రమిద శివుడు, కుందిలో వేసే వత్తి వెలుగు సరస్వతి, విస్ఫలింగం లక్ష్మీ దేవి. దీపారాధనలో వెండి కుందులు విశిష్టమైనవి. పంచలోహ కుందులు, మట్టికుందులది తర్వాతి స్థానం. దీపారాధన స్టీలు ఇనుప కుందిలో చేయకూడదు. కుంది కింద మరో ప్రమిదను తప్పనిసరిగా పెట్టాలి.



మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారీ తలంటుస్నానం చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది.













రజస్వల శుభ అశుభ విషయములు

రజస్వల విషయములు ప్రధమ రజస్వల ప్రాతః కాలమునుంచి మధ్యాహ్నములోపు అయిన శుభము. మిగిలిన కాలము అశుభము. ప్రాత కాలము అయినచో నిత్య సుమంగళి గానూ, మథ్యాహ్నం పూట అయినచో గొప్ప ధనవంతురాలవుతుంది. అర్థ రాత్రి అయితే గ్రహ తిథిలను బట్టి శాంతులు చేయించాలి. రజస్వల సరిసంఖ్య తేదీ కన్నా బేసి సంఖ్యా తేది మంచిది.








 చిరుగులు లేనివీ, శుభ్రమైనవీ, రంగు గలవి అయిన దుస్తుల్లో ప్రధమ రజస్వల అయితే శుభప్రదములు. 






రజస్వల సమయం మంచిది కాకపోతే నవగ్రహ శాంతితొ పాటు గౌరీదేవి కుంకుమార్చన చేయించుట మంచిది. రాజస్వలకు దుష్ట తిధులు: అమావాస్య, ఉభయ పాద్యమిలు, షష్టి, అష్టమి, ద్వాదశి తిదుల యందును పరిఘ యోగముల పూర్వార్ధమునండును, వ్యతీపాత, వైధృతి యోగాములండును, సంధ్యా కాలమునండును, ఉప్పెన, భూకంప మొదలైన వుపద్రవ కాలమండును భద్ర కారణమూ నందును మొదటిసారి రజస్వల అయిన శుభకరము కాదు.










  సోమ, బుధ, గురు, శుక్ర వారములందు ప్రధమ రజస్వల అయిన శుభ ఫలము, ఆది, మంగళ, శని వారములందు అశుభ ఫలము కలుగుతుంది. శుభ నక్షత్రములు: అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ , శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి యీ నక్షత్రములందు ప్రధమ రజస్వల అయిన సౌభాగ్యము, సౌఖ్యము, సంతానము, ఆయువు, ధనము కలుగుతుంది. మిగిలిన నక్షత్రములు అశుభ ఫలములు ఇచ్చును. కావున శాంతి చేయాలి.

  గ్రహణ సమయములందు, సంక్రాంతి యందు, అశుభమైన నిద్రా సమయములందు, అర్ధరాత్రి యందు ప్రధమ రజస్వల అయినచో యుక్తమైన శాంతులు నిర్వహించాలి.




 శుభ తిధులు: తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిధులు శుభము. లగ్న గ్రహ ఫలము: ప్రదమ రాజోదర్శన సమయమున కేంద్ర, కోణ, లాభ స్థానములందు శుబ గ్రహములు, తృతీయ, షష్ట లాభ స్థానములందు క్రూర గ్రహములు శుభ ఫలములిస్తాయి. చంద్రుడు అష్టమ స్థానమునందు వుండిన పతి నాశనము కలుగ జేస్తాడు. కాని చంద్ర తారాబలములు సంపన్నమైనపుదు పుత్ర, ధన సంపత్తులు కలుగుతాయి. కుజుడైనాను లేక చంద్రుడైనాను లగ్నమునకు 3, 6, 10 స్తానములన్డున్నచో సంపంనులగు కుమారులు కలుగుతారు. నక్షత్ర గ్రహ ఫలము: రజస్వలా సమయ నక్షత్రమందు గురుడుగాని, శనిగాని వున్నాను, యే గ్రహము లేకున్నను శుభము. 



రజస్వలా సమయ నక్షత్రము నందు కుజుడున్నను బుధ శుక్రులు కలిసి వున్నాను, రవి వున్నాను రాహు కేతువులున్నను అశుభము.





  తన యింటి యందును, గోడల చావిదియండును, స్వగ్రామ మధ్యమందు, జల సమీపమున, ఇంటి ఆవరణ మధ్య ప్రధమ రజస్వల అయిన శుభము.


 గ్రామము బయట, ఇతర గ్రామములందు, నగ్నముగా వున్నపుడు ఇతరుల యిండ్లలోను ప్రదమ రజస్వల అయిన అశుభము.


 వేళా విశేషములు: ప్రాతః కాలం చిర సౌభాగ్యం, ఉషః కాలం శోవ్భాగ్య లోపం, పూర్వాహ్నం పుణ్య క్షేత్ర దర్శనం,

 మధ్యాహ్నం ధనవతి, పుత్రవతి, సాయంత్రం జారగునం, సంధ్యలందు చేడుప్రవర్తన కలది,


 అర్ధరాత్రి బాల వైధవ్యం కలుగును. రాత్రి వేళ నిర్ణయం: రాత్రి రజస్వల అయినచో రాత్రిని మూడు భాగాలుగా చేసి రెండు భాగముల కాలము పూర్వదినము, మూడవ భాగాకాలమున తదుపరి దినమునకు చెందుతుంది.



 వస్త్రఫలము: తెల్లబాట్ట కట్టుకొని రజస్వల అయిన సౌభాగ్యవతి, గట్టి బట్ట కట్టుకొని రజస్వల అయిన పతివ్రతయు, దుకూల వస్త్ర దారియైన పట్టపురాణి యగును, నూతన వస్త్రము ధరించాగానే శుభ సంపన్నురాలగును, చిరిగినా బట్ట కట్టుకొనిన దౌర్భాగ్య రాలగును, యెర్రని బట్టకట్టుకోనిన వ్యాధి గ్రస్తురాలగును, నల్లని వస్త్రము ధరించినదైన దరిద్రురాలగును.




 రసజ్వలకు నక్షత్ర ఫలములు
 అశ్వని: భోగభాగ్యములు పొందును. మొదటి సంతానం నష్టం.

భరణి :అనారోగ్యము, భీతి, అల్పాయువు.

 కృత్తిక: కష్టనష్టములు అల్పసంతానం కలది చంచలము.

రోహిణి : ధనధాన్యవృద్ధి, పుత్ర సంతావంతురాలు.

మృగశిర : సుఖసౌఖ్యాదులు, దైవభక్తి కలది, యోగ్యురాలు.

ఆర్ద్ర : నీతినియమములు లేనిది, దురదృష్టవంతురాలు.

 పునర్వసు : స్వగృహమును విడిచిపెట్టునది.


పుష్యమి : పతిభక్తి గలది, సంతానం కలది యోగ్యురాలు.

ఆశ్రేష : దుష్టసంతానం కలది పతి సౌఖ్యము తక్కువ కలిగినది.

మఘ : తండ్రి యింటి వద్ద ఉండునది, భర్తకు కష్టం తెచ్చునది.

 పుబ్బ : గర్భస్రావం కలది దీనురాలు అనారోగ్యం కలది.

ఉత్తర : సంతానం కలది. మంచిసౌఖ్యముగలది.

హస్త : మంచిపుత్రికలు కలది. బందువులను ఆదరించునది.

చిత్త : పతిభక్తిగలది. లలితకళల యందు ఆశక్తికలది.

స్వాతి : పుత్రసంతానంగలది, పతివ్రత, భోగి.

విశాఖ : ధనధాన్యములు లది విలాసవమ్తురాలు, భోగి.


 అనూరాధ : పుత్రసంతానంకలది పవిత్రురాలు.

 జ్యేష్ఠ : దుష్ఠ ప్రవర్తనకలది. పతినిపోగొట్టుకొనునది.

మూల : పుణ్యక్షేత్రసంచారి, ధర్మంచేయుట యదిష్టతకలది.


పూర్వాషాడ : వైధ్యవ్యము పొందునది. హంతకురాలు అగును.


ఉతరాషాడ : పుణ్యకార్యములు చేయునది. సంపదలు గలది, భోగి శ్రవణం : దీర్ఘాయుర్దాయం కలది. పుత్రసంతానం కలది.



 ధనిష్ఠ : ధనధాన్యములు స్త్రీ సంతానం కలది. శతబిషం : సుఖ సౌఖ్యములు, ధన వృద్ధి కలది.


పూర్వాభాద్ర : మూర్ఖత్వము కలది. అనారోగ్యము గల భర్త కలది.


 ఉత్తరాభాద్ర : జ్ఞానము కలది. బంధువర్గము కలది. పవిత్రురాలు.


రేవతి : ధనవంతురాలు. పుణ్యకార్యములు చేయునది. మంచిజీవనము చేయునది.











 ప్రధమ రజస్వల అయిన కన్యకు అక్షతలు తలపై వేసి ఆసనమేసి కూర్చుండ బెట్టాలి. దీపమున్న గదిలోనే కన్యను ఉంచాలి. సువాసినులకు శ్రీ గంధము, పుష్పములను, తమ్బూలములను లవణము, పెసలు మొదలగునవి ఇవ్వాలి. ప్రధమ రజస్వల అయిన వస్త్రముతోనే మూడు రోజులు ఉంచాలి. ఎవరిని తాకకుండా జాగ్రత్త గా, ప్రశాంతముగా, ఉండునట్లు చూడాలి. భోజన విషయంలో పులగము, నెయ్యి, పాలు వంటి సాత్విక ఆహారము ఉప్పు, పులుపు, కారము లేకుండా ఇచ్చుట మంచిది, నాలుగవ రోజు స్నానము చేయించి నూతన వస్త్రములు కట్టించాలి. మూడు దినములు ఎవరిని తాకకూడదు. అభ్యంగనము, కాటుక, స్నానము, పగలు నిద్రించుట , అగ్ని ముట్టుట, ప్రాసనము, సూర్యావలోకనము, భూమిపై గీతాలు గీయుట చేయుట చేయకూడదు. క్రింద పడుకోవాలి, ఆవుపాలు, పెరుగు, మజ్జిగ, తాంబూలము, గంధమాల్యములు ఉపయోగించరాదు.







 రజస్వలా అయిన స్త్రీ మొదటి దినమునండు చండాల స్త్రీ సమానురాలు, రెండవ దినమందు పతితురాలితో సమానురాలు, మూడవ దినమునండు చాకలి స్త్రీతో సమానము, నాలుగవ దినమున కూడా శూద్ర స్త్రీ సమానురాలు, ప్రధమ రజస్వల అయిన స్త్రీ అయిదవ దినమందు దేవ పితృ కార్యములందు పరిశుద్దురాలూ అన్నారు. నాలుగవ దినమందు స్నాముచేత శుచి కాగలదు. బహిష్టు అయిన స్త్రీ మూడు రోజుల తరువాత శుద్ధి అవుతుంది. తిరిగి మల్లి పంతొమ్మిది రోజులలో బహిష్టు అయిన ఒక దినముతో శుద్ధి అట్లుగాక ఇరవై రోజుల అనంతరము ఎప్పుడైనా బహిష్టు అయిన మూడు రోజుల తరువాత శుద్ధి అగును.















11 October 2016

వివాహానికి స్ర్తీ పురుషుల అష్ట కూటాలు.

వివాహానికి స్ర్తీ పురుషుల అష్ట కూటాలు.
శ్లో॥ గుణైక వర్ణం ద్విగుణంచ వస్యం,త్రిభిశ్ఛ తారా చతురస్తుయోనిః। పంచః ఖగ షడ్గుణతో గణాశ్చ భకూట సప్తాష్ట గుణాళి నాడిః॥
1. వర్ణ కూటం గుణములు. 
2. వస్య కూటం గుణములు.
  3. తారా కూటం గుణములు.
4. యోని కూటం గుణములు.
  5. గ్రహ కూటం గుణములు.
6. గణ కూటం గుణములు.
  7. రాశీ కూటం గుణములు.
  8. నాడి కూటం గుణములు.


  మొత్తము గుణములు 36.కనీసం 18 పైన ఉండవలెను.
1.వర్ణ కూటముః-
శ్లో॥కర్క్యాంత్యే వృశ్చికే విప్ర, క్షత్రిస్సింహ ధనుష్వజా। వైశ్యో వృష మృగః కన్య,శూద్రో యుగ్మ తులాఘటాః॥ వర్ణ శ్రేష్టంతు యా నారీ వర్ణ హీనంతు యఃపుమాన్, వివాహమేతయో కుర్యాత్ తస్య భర్తా వినస్యతి॥


కర్కాటకము, మీనము, వృశ్చికము బ్రాహ్మణ వర్ణము,


సింహము,ధనుస్సు మేషము క్షత్రియ రాశులు

వృషభము,కన్య మకరము వైశ్య రాశులు

మిధునం,తులా కుంభం శూద్ర రాసులు.


వరుని వర్ణము వధువు వర్ణము కన్న పెద్దది గా ఉండవలెను.




2.వస్య కూటముః-
శ్లో॥మేషస్య సింహౌ వస్యాళి-వృషస్య తుల కర్కటౌ।మిధునస్యబలా వస్యం కర్కటస్యాళి కార్ముకం,సింహస్య క్రియ భావస్యం,మీనస్య మకరస్తధా॥


మేషం, వృషభం చతుష్పాద రాశులు (2).

మిధునము,కన్య, ధనుస్సు, తుల,కుంభం మానవ రాశులు(5).

కర్కాటకం,మకరం, మీనం జలచర రాశులు (3).
వృశ్చికం కీటక రాశి,(1) .
సింహం వన చర రాశి(1).




3.తారాకూటముః-
వధునక్షత్ర మారభ్య, వర నక్ష్త్రత్ర గణ్యతే। నవభిః పర్యాయేణ తారాకూటం ప్రగణ్యతే॥ వధువు నక్షత్రము నుండి వరుని నక్షత్రము తొమ్మిది నవకములుగా లెక్కించగా 2, 4,6,8,9 శుభప్రదము,1,3,5,7,పనికి రావు.


4.యోని కూటము.
 నక్షత్రము…………….యోని అశ్విని………………………..గుఱ్ఱం భరణి…………………..ఏనుగు 
కృత్తిక……………మేక 
రోహిణి, మృగశిరలు……………పాము ఆరుద్ర……………………..కుక్క
 పునర్వసు…………పిల్లి 
పుష్యమి----మేక
 ఆశ్రేష…..గండు పిల్లి 
మఘ,పుబ్బలు ….ఎలుకలు
 ఉత్తర……………….ఆవు
 హస్తమి…………………….గేదె 
చిత్త……………………పులి
 స్వాతి…………ఎనుపోతు 
విశాఖ ........ పులి.
 అనూరాధ, జ్యేష్టలు …లేడి 
మూల…………………కుక్క 
పూర్వాషాడ…….కోతి 
ఉత్తరాషాడ, (అభిజిత్)……..ముంగిసలు
 శ్రవణం……కోతి 
ధనిష్ట……సింహం
 శతభిషం…..గుర్రం 
పూర్వాభాద్ర…..సింహం 
ఉత్తరాభాద్ర…..ఎద్దు 
రేవతి…………….ఏనుగు.

 వైరి వర్గాలు ఆవు………x………………పులి ఏనుగు……x……….సింహం 
గుఱ్ఱం……x………..గేదె 
కుక్క……x……లేడి 
కోతి……x…………మేక
 ముంగిస…x…పాము 
ఎలుక…x……పిల్లి 







5. గ్రహ కూటం(గ్రహమైత్రుత్వం)ః- 
రాశ్యాధిపత్యంః-శ్లో॥ సింహస్యాధిపతి సూర్య చంద్రః కర్కట ప్రభూ। మేష వృశ్చిక యోర్భౌమా- కన్యా మిధునయోర్భుధః। ధనుర్మీన ద్వయోర్మంత్రీ,తులా వృషభయోర్బృగుః। మకరే కుంభ రాశౌచ నాయకః సూర్య నందనః॥ 
సింహ రాశికి సూర్యుడు, 
కర్కాటక రాశికి చంద్రుడు అధిపతులు.
 మేష వృశ్చిక రాశులకు కుజుడు, 
కన్యా మిధున రాశులకు బుధుడు, 
ధనుస్సు మీన రాశులకు బృహస్పతి, 
తులా వృషభ రాశులకు శుక్రుడు
 మకర కుంభ రాశులకు శని అధిపతులు.







 శత్రు మిత్రుత్వాలుః-

శ్లో॥అర్క మందస్తధా వైరమ్, కుజ మందస్తధైవచ। గురు భార్గవ యోర్వైరం,వైరంతు బుధ్ సోమయో।సోమస్య సోమపుత్రస్య మహావైరీ ప్రకీర్తితాః॥ శ్లో॥ఆదిత్య సోమ గురు మంగళ యోస్సఖిత్వం, అత్యంత మైత్రి బుధ శుక్ర శనైశ్చరాణాం, వైరం రవే రవి సుతస్య బుధస్య సోమా। శుక్ర ప్రకోప కురుతే రవి జీవ భౌమౌ॥ రాశి నాధే విరుద్ధేచ మిత్రే హంశాధిపే సతి। హంస నాయక మిత్రుత్వం వివాహం సర్వ సమ్మతం॥ పితా పుత్రో న శత్రుత్వం కర్మణా బాహ్యతే రిపుః।అర్కార్కి బుధ సోమస్య వైరీ దోషో నవిద్యతే॥





 6.గణ కూటముః- 
గణములు 3 విధములు.1 దేవ గణం 2. మనుష్య గణము 3.రాక్షస గణము.

 దేవ గణంః- శ్లో॥అశ్విని మృగశిరో హస్తా స్వాతి పుష్య పునర్వసు। మైత్రా శ్రవణ రేవత్యాం ఏతే దేవ గణా స్మృతాః॥ 

అశ్విని,మృగ శిర హస్త, స్వాతి పుష్యమి పునర్వసు, అనూరాధ(మైత్ర).

శ్రవణం మరియు రేవతి నక్షత్రములు దేవ గణములు.(9 నక్షత్రములు).

 మనుష్య గణంః-శ్లో॥రోహిణీ త్రీణి పూర్వాణీ భరణి రౌద్రమేవచ।త్రివుత్తరాశ్చ విఙ్ఞేయ । మానుషాశ్చ ప్రకీర్తితాః॥

 రోహిణి, పుబ్బ,పూర్వాషాడ, పూర్వాభాద్ర,భరణి,ఆరుద్ర,ఉత్తర ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర, నక్షత్రములు మనుష్య గణములు (10). 

రాక్షస గణంః-
శ్లో॥అగ్నిర్మఘ విశాఖాచ అశ్రేషా శత తారకా। ధనిష్టా చిత్ర సంయుక్తం జ్యేష్ట మూలంతు రాక్షసం. కృత్తిక(అగ్ని),మఘ,విశాఖ, ఆశ్రేష,శత భిషమ్ ధనిష్ట చిత్త మరియు జ్యేష్ట నక్షత్రములు రాక్షస నక్షత్రములు (8 నక్ష్త్రములు). 



నక్షత్రము……………గణము 
అశ్విని……………దేవ గణం 
భరణి……………మనుష్య గణం
 కృత్తిక……………రాక్షస గణం 
రోహిణి, మనుష్య గణం మృగశిరలు………దేవ గణం ఆరుద్ర……………… మనుష్య గణం
 పునర్వసు…………దేవగణం
 పుష్యమి---- దేవగణం ఆశ్రేష…..రాక్షస గణం మఘ….., రాక్షస గణం పుబ్బ … మనుష్య గణం ఉత్తర………… మనుష్య గణం హస్తమి…………దేవ గణం చిత్త…………………రాక్షస గణం 
స్వాతి………దేవ గణం 
విశాఖ రాక్షస గణం 
అనూరాధ….. దేవ గణం 
జ్యేష్ట …రాక్షస గణం
 మూల………రాక్షస గణం
 పూర్వాషాడ……. మనుష్య గణం
 ఉత్తరాషాడ, మనుష్య గణం శ్రవణం…… దేవ గణం ధనిష్ట…… రాక్షస గణం
 శతభిషం…..రాక్షస గణం
 పూర్వాభాద్ర….మనుష్య గణం
 ఉత్తరాభాద్ర…..మనుష్య గణం
 రేవతి…………….దేవ గణం. 

గణ కూటం చూడడానికి శ్లో॥ స్వగణం చోత్తమం ప్రీతి।మధ్యమం దేవ మానుషం,అధమం దేవ దైత్యానాం మృత్యోర్మానుష రాక్షసం॥ శ్లో॥ స్త్రీ రాక్షసం న కర్తవ్యం, కర్తవ్యం పురుష రాక్షసం।సద్భకూట యోనిసిద్ధి, గ్రహ సఖ్యం గుణ త్రయం,।యేష్వైక తమ సద్భావో। కన్యా రాక్షో గణా శ్శుభాః॥ ఇంద్రాగ్నిరసుర సార్పా।త్వష్టుర్ జ్యేష్టాచ వారుణీ॥ స్త్రీ రాక్షసం శుభం ప్రోక్తం అన్య రుక్షం వివర్జయేత్॥ 




7.రాశీ కూటంః- 
స్త్రీ రాశ్యాధి ప్రయత్నేన పురుష రాశ్యాంత గణ్యతే।క్రమేణ ద్వాదశం చైవ రాశీ కూటం ప్రగణ్యతే॥ రాశీకూట గణన పలితం తెలుసుకోవటానికి శ్లో॥ ద్విర్ద్వాశకే మృత్యు, ఆయుర్ద్వాదశకే శుభం। త్రీణి ఏకాదశీ సౌఖ్యం దుఃఖమేకాదశత్రికం। చతుర్థ దశమమ్ ప్రీతి అప్రీతి ర్దశ చతుర్థకం। పంచమన్నవ సౌభాగ్యం,వైధవ్యం నవ పంచమం షష్టాష్టకే దరిద్రత్వం పుత్ర లాభోష్ట షష్టకే। సమ సప్త సుభం ప్రోక్తం రాశీ కూటం ఫలం లభేత్॥ 
2-12 ….మృత్యువు.
 12-2 శుభం
 3-11 సౌఖ్యం.
 11-3 దుఃఖం.
 4-10 ప్రీతి.
 10-4 అప్రీతి.
 5-9 సౌభాగ్యం.
 9-5 వైధవ్యం.
 6-8 దరిద్రం.
 8- 6 పుత్ర లాభం.
 7-7 శుభం.
 7-7 శుభం.





 8.నాడీ కూటంః-
శ్లో॥అశ్విన్యాది క్రమాత్రీణీ। పర్యాయాశ్చ పునఃపునః॥అనులోమ విలోమాభ్యాం నాడీ కూటం ప్రగణ్యతే॥ ఆదినాడి మధ్య నాడి అంత్యనాడి .

అశ్విని భరణి కృత్తిక ఆరుద్ర మృగశిర రోహిణి పునర్వసు పుష్యమి ఆశ్రేష ఉత్తర పుబ్బ మఘ హస్తమి చిత్త స్వాతి జ్యేష్ట అనూరాధ విశాఖ మూల పూర్వాషాడ ఉత్తరాషాడ శతభిషం ధనిష్ట శ్రవణం పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి. 

నాడీ కూట పలితం ః-శ్లో॥ ఏక నాడీ పతిం హంతి, పార్శ్వనాడీతు కన్యకా। ఉభయోర్మధ్య నాడీచ భిన్న నాడీ శుభావహం॥ 

అన్ని కూటాలు కలిపిః- గుణైష్షోడశభర్నిందం।మధ్యమం తురగిందమం।వింశత్యూర్ద్వం శుభం ప్రోక్తం। వివాహం సర్వ సమ్మతం॥ చాతుర్వర్ణములకు ముఖ్యమైన కూటములు.శ్లో॥గ్రహమైత్ర ద్విజాతీనాం క్షత్రియాణాం గణస్తధా।వైశ్యానాం రాశీకూటంచ, శూద్రాణాం యోనిమేవచ॥ 








09 October 2016

మీనరాశి PISCES

మీనరాశి.

 మీన రాశి జాతక చక్రంలో ఆఖరుది మరియు చివరిది. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి సరి రాశి, ద్విస్వభావ రాశి, స్త్రీ రాశి, శుభ రాశిగా వ్యవహరిస్తారు. ఈ రాశి జలతత్వం కలిగిన రాశి. శబ్దం నిశ్శబ్దం, సమయం పగటి సమయం, పూర్ణ జలరాశి, ఉభయోదయ రాశి, పరిమానం హస్వం, జాతి బ్రాహ్మణ, జీవులు జల జీవులు, దిక్కు ఉత్తర దిక్కు, ప్రకృతి కఫం, సంతానం అధికం, వర్ణం స్వచ్ఛం, కాల పురుషుని శరీరంలో పాదాలను సూచిస్తుంది.



ఈ రాశి అధిపతి గురువు. పూర్వాబాధ్ర నక్షత్రము నాల్గవ పాదము, ఉత్తరాబాధ్ర నక్షత్రము 1,2,3,4 పాదములు రేవతి నక్షత్రము 1,2,3,4 పాదములు, మొత్తము 9 పాదములు కలసి మీన రాశి యగును. నిరయన రవి ఈ రాశిలో మార్చి పదిహేడవ తేదీన ప్రవేశిస్తాడు. ఈ రాశిలో పదిహేను డిగ్రీలలో బుధుడు నీచను పొందగా ఇరవై ఏడు డిగ్రీలలో శుక్రుడు ఉచ్ఛను పొందుతాడు. ఈ రాశి వారు వైద్యశాలలు, రాయబార కార్యాలయాలు, చేపల వ్యాపారం మొదలైనవి. జాలరులు, సముద్రమందలి అన్ని పదార్ధాలు, రత్నములు, పగడములు, ముత్యములు, నదులకు ఈ రాశి కారకత్వం వహిస్తుంది.






 మీనం: భాహాద్రేకం, బలహీనత, కీళ్ళజబ్బులు, పాదములు, కాలివేళ్ళు నీరు పట్టడం, మద్యపానాదుల వల్ల వచ్చే అనారోగ్యం, కణతులు, మలకోశం, ఆమకోశం మొదలైన వానికి సంబంధించిన అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది.



 జాగ్రత్తలు: 1. మొలకలు వచ్చిన శనిగలు, మితహారం 2. పసుపు ఆహారంలో తీకుకోవటం 3. కవితా రచన భావోద్రేకాలను అదుపు చేస్తుంది 4. ఫెర్రంపాసు (హోమియో) వీరికి తగినది.


 మీనరాశి పూర్వాభద్ర 4వ పాదం ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదాలు  రేవతి 1,2,3,4 పాదాలు










కుంభరాశి AQUARIUS

కుంభరాశి.

కుంభరాశిలో జన్మించిన వారికి బంధాలు అనుభంధాలు ఎక్కువ. మేలు చెసిన వ్యక్తులను గుర్తుంచుకుంటాఆరు. కొత్త వారు ఎందరు పరిచయము అయినా పాత స్నెహాలను, బంధుత్వాలను మరువరు.






ఇంటి భోజనము అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నుతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు. కాని ఎక్కువ కాలము క్రమశిక్షన నిలవని పరిస్థితులు ఎదురౌతాయి. అవేశము, ఇతరులు రెచ్చగొదితే రెచ్చి పోయె స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తాయి. తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించరు. బధను అధికముగా మనసులో దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మొహమాతముగా చెప్పడము వలన విరోధాలు వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడనికి ప్రయత్నించి విఫలము ఔతారు. మధ్యవర్తిత్వానికి ముమ్దు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు.










 సాంకెతిక విద్య, వైద్య విద్యలలో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్రవిచిత్ర వ్యాపారాలు అనుభవము నెర్పు కలిగి ఉంటారు. కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటాయి. అవసర సమయాలలో ధనము లభించక పొయినా అవసరము లెనప్పుదు ధనము అధికముగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గము అవసరాలకు ధనము సర్ధుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు. సమాజములో ఉన్నత స్థానాలలో , గౌరవ స్థానాలలో ఉన్న వారి వలన అన్యాయానికి గురి ఔతారు. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపొతారు. అకస్మాత్తుగా రాజకీయాధికారము చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు యోగిస్తాయి. ఏకపక్షముగా పొరబాటుగా తిసుకున్న నిర్నయాల వలన ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చెస్తాయి.









సమాజములో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి ఔతారు. తన సంతానము, ఆత్మీయులు, స్వంత వారు చెసే తప్పులు తప్పులుగా కనిపించవు. వారిని సమర్ధించడానికి రక్షించడానికి అధికముగా ధనమును పలుకుబడిని ఉపయోగిస్తారు. వ్యాపారములో అంచనాలు నిజమై లాభము పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి ఔతారు. భుములు విలువ పెరగడము వలన ధనవంతులు ఔతారు. వ్యాపారకూడలిని అద్దెకు ఇచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. సంతానము అదృష్టము వలన మంచి స్థితికి చేరుకుంటారు.









స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికము. జీవిత ప్రారమ్భములో తెలిసి తెలియక చెసిన నిర్ణయాలు మంచికి దారి తిస్తాయి. వీరు అందలము ఎక్కించి బలోపేతము చేసిన అసమర్ధులైన చిన్నపాటి వ్యక్తులే విరికి ప్రత్యర్ధులు ఔతారు. పోటీ లేని చోట్ల కూడా వీరి మమ్చితనము వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలరు. అయినా స్వయంకృతాపరాధాన్ని సరి దిద్దుకోలేరు. మీరు కొల్పోయిన ధనము, పదవి ఇతరులు మీ కారణంగానే పొందారని పేరు వస్తుంది. భాగస్వామ్యము కొంత కాలమే లాభిస్తుంది. హస్తవాసి మంచిదని పేరు వస్తుంది.సొదర సోదరీ వర్గానికి సహాయము చేయడము వలన మరో వర్గము దూరము ఔతారు. పైస్థాయి మరియు కిమ్దస్థాయి వారి వలన ఏకకాలములో ఇబ్బందులు ఎదురౌతాయి. ఋణల విషయములో అసత్య ప్రచారాలు ఎదురౌతాయి. కోర్టు వ్యవహారాలలో అపజయము ఎదురౌతుంది. ఆత్మీయ వర్గము ద్రోహము చెస్తే తప్ప ఏ విషయమునకు లోటు ఉండదు. ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవము గడిస్తారు. ఎదుటి వారి మనస్తత్వము తేలికగా గ్రహిస్తారు. విరి కంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా దీర్గకాలములో వారిని వీరు అధిగమించగలరు. పెద్దలు ఇచ్చిన స్థిరాస్థులు పోగొట్టుకున్నా స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు. శత్రు వర్గము మీద విజయము సాధిస్తారు వారి వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయి వారి వలన ఇబ్బందులురాకుండా జాగ్రత్త వహిస్తారు. అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.





 పడమర, దక్షిణం, ఉత్తర దిశలు యోగిస్తాయి. వీరికి ఏదిక్కూ దోషమైనది కాదు. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్త్రోత్ర పారాయణము మేలు చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా జీవితము నడుస్తుంది. కుంభరాశి కొన్నిజ్యోతిష విషయాలు కుంభ రాశి జాతకచక్రంలో పదకొడవ స్థానంలో ఉంది. ఈ రాశ్యధిపతి శని భగవానుడు. ఈ రాశి 300 డిగ్రీల నుండి 330 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ రాశి బేసి రాశి, క్రూర రాశి, పురుష రాశి, స్థిర రాశిగా వ్యవహరిస్తారు. ఈ రాశి తత్వం వాయుతత్వం, శబ్దం అర్ధ శబ్దం, అర్ధ జల రాశి, జీవులు మానవులు, జాతి వైశ్య జాతి, సంతానం సమ సంతానం, సమయం పగటి సమయం, పరిమాణం హస్వం, ఉదయం శీర్షోదయం, దిక్కు పడమర దిక్కు, ప్రకృతి వాత, కఫ, పిత్త ప్రకృతి, కాలపురుషుని శరీరావయవం పిక్కలు. ఇది విషమ రాశి. నిరయన రవి ఈరాశిలో ఫిబ్రవరి పదిహేన తేదీలో ప్రవేశిస్థాడు. ఈ రాశిని రాహువుకు స్వస్థానంగా కొందరు భావిస్తారు. సహజంగా ఛాయా గ్రహమైన రాహుకు జాతక చక్రంలో స్థానం లేదని పండితులు భావిస్తారు. ఈ రాశి గూఢాచారులను, వ్యాపారులను సూచిస్తుంది, గృహంలో నీటి పారలు, నీరు ఉండే ప్రదేశాలు ఈ రాశికి స్థానాలు.






ఈ రాశిలో జన్మించిన వారు లౌక్యం తెలిసిన వారు, అల్పసంతోషులు, దానధర్మములు చేయు వారు, ఎవరిని నొప్పించ మాటాడని వారు, సామాన్యులుగా ఉంటారు. సన్నని వారై ఉంటారు.








ఈ రాశి వారికి అయిదు, పన్నెండు, ఇరవై ఎనిమిది సంవత్సరాలలో ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. ఈ రాశికి అంటు వ్యాధులు, నేత్ర వ్యాధులు, చర్మరోగములకు కారకత్వం వహిస్తాడు. కుంభం: నంజువ్యాధి, కంటి జబ్బు, నరాల జబ్బు, రక్తప్రసారదోషాలు, గుండెజబ్బు, బెణుకు నొప్పులు, కాళ్ళు, సీల మండల వ్యాధులు, అంటువ్యాధులు, జలోదరం, మలేరియా, నిద్రలేమి, రక్తపోటు మొదలైన అనారోగ్యాలకు అవకాశం ఉంది.









 జాగ్రత్తలు: 1. మకరరాశి వలె వీరు కూడా నువ్వుల నూనె మసాజ్‌, ఆహారంలో నువ్వులపొడి వాడటం, సూర్య నమస్కారాలు చెయ్యటం చేయాలి. 2. నేత్రం మూరు వాడడం మంచిది 3. ప్రతిపనిలోను చురుకుదనం అలవర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తిని సమకూర్చుకోగలరు.



 కుంభరాశి

 ధనిష్ట 3,4 పాదాలు

 శతభిష 1,2,3,4 పాదాలు

పూర్వాభద్ర 1,2,3,పాదాలు
















మకరరాశి CAPRICORN

మకరరాశి.

మకరరాశి కాలపురుషుని కర్మ స్థానము. సూర్యుడు ఈ రాశి లో ప్రవేశించినప్పుటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమౌతుంది. వెంఖటేస్వరస్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము ఈ రాశిలోనిదే. ఈ రాశి వారు జీవితములో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని స్వంతము చేసుకుంటారు. ఇతరులు మొసము చెయ్యనంత వరకు ఇతరులను మోసము చెయాలన్న తలంపు రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడము వీరి స్వభావము బలహీనత కూడా. పక్కవాళ మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారి తీస్తుంది. తన లొపము తెలిసిన తరువాత తమ తప్పును అంగీకరించడానికి వెనుకాడరు. చేసిన పొరపాటు తిరిగి చెయ్యరు.





 అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా పద్ధతి మార్చుకోరు. సాత్విక స్వభావము మాట మిద నిలబడే తత్వము ఉంటాయి.






 స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికముగా ఉంటుంది. సంతానము వీరి అభీష్టము ప్రకారము నడవక వీరిని ఇబ్బందులకు గురి చేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికముగా శ్రమిస్తారు. చిన్నతనము నుండి అధికముగా శ్రమపడి చిన్నతనములోనే అధికముగా శ్రమించి అవి సాధించడానికి కృషిచేస్తారు. అనుకున్న దానిని ఎదొ ఒక విధంగా సాధిస్తారు. పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము అధికముగా ఉంటుంది. అధికమైన జ్ఞాపక సక్తి, సాధారణమైన ఆకారము కలవారై ఉంటారు. రచనా వ్యాసమ్గము, పరిశోధనా, నతన, కళాఅ సంబంధమైన నైపుణ్యము విశేషముగా ఉంటుంది. వీరు చేసే పనులకు సమానంగా ఇతరులు అనుసరించ లేరు. విరి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకొనబడుతుంది. విరి ప్రతిభ వెలుగులోకి రావడము కష్టము.








ధన సంపాదనే ధ్యేయముగా జీవించరు. ఎదో విధముగా ధనము సర్ధుబాటు అయి అవసరాలు గడిచి పొతాయి. అభిమానించే నమ్మిన అనుచర వర్గము వెంట ఉంటారు. కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు. స్త్రీల వలన అదృష్టము కలసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు. చాలా మందికి తండ్రి వలన మేలు జరగదు. ప్రజాభిమానముతో ఊన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహము అధికముగా ఉంటుంది. బంధువర్గము కంటే బయటి వారి సహాయము అధికముగా అందుతుంది. అంచనాలు చక్కగా పొరబాట్లు లేకుండా వేస్తారు.







 ఊహలు నిజము ఔతాయి.శని, శుక్ర, బుధదశలు యొగిస్తాయి. ఆధ్యతమక విషయాలలో అమ్కితభావముతో ఉంటారు. సామాజిక సేవ, సామాజిక న్యాయము దైవముగా భావిస్తారు.





జివిత మధ్యకాలములో మోకాల్ల నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటివి వస్తాయి. జ్యోతిష విషయాలు రాశి చక్రంలో పదవ స్థానంలో ఉన్న మకర రాశిని 270 డిగ్రీల నుండి 300 డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది. ఈ రాశిని సరి రాశిగాను, శుభ రాశి గాను, స్త్రీరాశిగాను, చర రాశిగానూ వ్యవహరిస్తారు. తత్వం భూమి, శబ్దం అర్ధ శబ్దం, రాత్రి సమయంలో బలం కలిగిన రాశి, పూర్ణ జల రాశి, ఊదయం పృష్టోదయం, సమయం రాత్రి, జాతులు పశువులు, పరిమాణం సమపరిమాణం, జాతి శూద్ర జాతి, సంతానం అల్పం, ప్రకృతి వాతం, వర్ణం కపిల, శ్వేత వర్ణాలు, కాల పురుషుని శరీరభాగాలలో మోకాళ్ళను సూచిస్తుంది.






 ఈ రాశి సౌమ్య రాశి. ఈ రాశి అధిపతి శని భగవానుడు. నిరయన రవి ఈ రాశిలో పదునాలుగు, పదహైదు తేదీలలో ప్రవేశిస్తాడు. ఈ రాశిలో అయిదవ డిగ్రీలో గురువు నీచ స్థిని పొందగా ఇరవై ఎనిమిదవ డిగ్రీలో కుజుడు ఉచ్ఛస్థితిని పొందుతాడు. ఈ రాశి పాలకులను, పాలనాధికారులను, హస్వ స్వరూపులను సూచిస్తుంది. ఈ రాశి నదులు వన ప్రాంతములను సూచిస్తుంది. ఈ రాశి వారు సౌందర్యవంతులు, ధైర్యవంతులు, ఆలోచనాపరులు, దానపరులై ఉంటారు.





 ఈ రాశి వారికి రెండు, ఏడు, పన్నెండు, ఇరవై, ఇరవై అయిదు, ముప్పై రెండు సంవత్సరాలలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ రాశి వారికి జలగండం కలిగే అవకాశం ఉంది. ఈ రాశి బొల్లి, వాతము, మానసిక రోగములకు కారకత్వం వహిస్తుంది.



 మకరరాశి

 ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు

 శ్రవణం 1,2,3,4 పాదాలు

 ధనిష్ట 1,2 పాదాలు


 మకరరాశి వారి అదృష్ట సంఖ్యలు 8, 3, 4, 5, 9. సోమ, మంగళ, శుక్రవారములు మంచివి.












ధనూరాశి SAGITTARIUS

ధనూరాశి.

 ధనూరాశి వారికి అత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి అధికము. స్వ విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. స్వ విషయాలలో ఇతరుల జోక్యము అంగీకరించరు. ఆధునిక విద్య, విద్యలపట్ల ఆసక్తి, వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్ఠలు కలిగి వింటారు. దైవ భక్తి, మంత్రోపాసన మొదలైన విషయాల అందు ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధముగా ఏమీ చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగిఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నింటిని పరిగణకి తీసుకుంటారు. అవకాశము ఉండీ సహాయము చేయ లేదన్న నింద భరించవలసి వస్తుంది. ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్ళకు ఏమి చేయలేక పోయామన్న భావన కలుగుతుంది.







సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయము చెయ్య లేరు. ఆత్మీయుల ప్రతిభా పాతవాలను సాధించాలని కోరిక ఉన్నా వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానము సాధించ లేరు. వారిని ఏ విధముగా అందలము ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు. స్వంత వారితోనె బద్ధ వైరము ఏర్పడుతుంది. వారు మిమ్మలను ఆర్ధికముగా అధిగమించి కయ్యానికి కాలు దువ్వుతారు. ధన సంపాదన కంటే మించినవి చాలా ఉనాయి అన్న వీరి భావన చెతకాని తనముగా భావించబడుతుంది. ఏ రంగములో అయినా ఎవరికైనా మీరు ఆదర్శముగా ఉండాలని విరు భావిస్తారు. మితో మమ్చిగావ్యవహరించి పనులు సాధించుకున్న వారు తరువాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించ లేని విషయముగా మారుతుంది. దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు అందుకుంటారు. ధనము కొరకు తాపత్రయ పడక వృత్తిలో గౌరవము పేరు ప్రతిష్ఠలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ధనము కొరకు ప్రాధెయ పడరు. ధనమె విరి చుట్టూ తిరగాలని అనుకుంటారు.





 ఆడ మగ అన్న తేడా లేక సంతానాన్ని సమంగా చుస్తారు. జ్యేష్ట సంతానము విషయములో జాగ్రత్త అవసరము. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సహాలను పాటించాలని ఒత్తిడి చెయ్యక వారి విచక్షణకు వదిలి వెస్తారు. స్వంత వారిని రక్షించే ప్రయత్నము చెయ్యరు. ఏ విషయములో అతిగా కలుగ చెసుకోరు. వీరి మాట దిక్కరిమ్చిన వారిని జీవిత కాలము శత్రులుగా భావిస్తారు. ఆత్మీయ బమ్ధువర్గము కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు, ప్రతిష్ఠలు దెబ్బ తింటాయి. స్వంత వాళ్ళు స్థాయిని మరచి కలహించుకుని నోరు పారేసు కోవడము ఇబ్బందిని కలిగిస్తాయి.  నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు.






సహొదర, సహోదరీ వర్గానికి చెసే సహాయము విపరీతాలకు దారి తిస్తుంది. ఎవరు ఏమనుకున్నా ధనూరాశి వారు మారక వారి సిద్ధామ్తాల కొరకు జీవిస్తారు. అధికార పదవులకు ఎంపిక ఔతారు. సమాజములో ఎందరికో జీవనోపాధి కల్పిస్తారు. వీరి మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు, సేవ ఎమ్దరికో ఆదర్శము ఔతాయి. అందరికీ మంచి చెస్తారు దాదాపు అందరికీ మంచి ఔతారు. స్వంత వారికి మంచి చేసే అవకాసము ఉండదు కనుక వరికి మంచి కాలేరు. వారసుడిని వీరు అనుకున్న విధముగా తీర్చి దిద్దడములో విఫలము ఔతారు.




 కుజ, రవి, రాహు, గురు దశలు యోగిస్తాయి. శుక్రదశా కాలములో కళత్రముతో విబేధాలు వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది. ధనూరాశి వారి జ్యోతిష విషయాలు ధనస్సు రాశి రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవ రాశి. ఈ రాశి బేసి రాశి, పురుష రాశి, అశుభరాశి, ద్విస్వభావ రాశి, అధిక శబ్దం కలిగిన రాశి, అగ్నితత్వ రాశి, రాత్రి వేళ బలము కల రాశి, పృష్టోదయ రాశి, అర్ధజాల రాశి, మనుష్య రాశి, సమ పరిమాణం కలిగిన రాశి, క్షత్రియ రాశిగా వ్యవహరిస్తారు. అల్ప సంతానం, ప్రకృతి ఉష్ణ ప్రకృతి, కాలపురుషుని శరీర భాగంలో తొడ భాగం, కపిల వర్ణం, క్రూర రాశిగా వ్యవహరిస్తారు. ఈ గ్రహానికి అధిపతి గురువు. ఈ రాశిలో ఏ గ్రహం ఉచ్ఛ, నీచాలను పొందదు. ఈ రాశిలో నిరయన రవి దిసెంబర్ పదిహేనవ తేదీన ప్రవేశిస్తాడు.





ఈ రాశి విద్యాలయాలు, న్యాయస్థానములు, ధర్మస్థాపనలు, చర్చీలు, మసీదులు, శరణాలయాలు, సత్రములు మొదలైన దైవీక విద్యా సంబంధిత ప్రదేశాలను సూచిస్తుంది. ఈ రాశి ప్రొఫెసర్లు, న్యాయమూర్తులు, మతభోదకులను మొదలైన వారిని సూచిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడగరులుగా, వినయ సంపన్నత, పెద్దల ఎడ గౌరవ భావం, మంచి మైత్రీ భావం, శీఘ్రకోపం, ఉపన్యాసకులు, ఉపన్యాసకులుగా ఉంటారు.






 ఈ రాశి వారికి పద మూడవ సంవత్సరంలో ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. ఈ రాశి కీళ్ళ వాతం, వాతం, ఊపిరితిత్తుల వ్యాధి, నడుము నొప్పి, ఎముకలు చిట్లుట మొదలైన రోగములకు కారకత్వం వహిస్తుంది. ధనుస్సు: ప్రమాదాలకు గురికావడం, తొడలు, పిరుదులు, నరములు వీటికి సంబంధించిన అనారోగ్యములు, గాయాలు, రక్తదోషము అనారోగ్యము, చర్మవ్యాధులు, స్థూల శరీరం వలన కలిగే ఇబ్బందులు, ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహం.. మొదలైనవి కలిగే అవకాశం వుంది.



 జాగ్రత్తలు: 1. వ్యాయామం, ప్రాణాయామం 2. తగిన మోతాదులో ఆహరం 3. మొలకలొచ్చిన శనిగలు, అల్పహారం 4. ఎక్కువ బాధ్యతలు తలపైనే వేసుకోకుండా మానసిక ప్రశాంతి కోసం రెండుసార్లు ధ్యానం చేయటం మంచిది.


 ధనూరాశి

 మూల 1,2,3,4 పాదాలు

 పూర్వాషాఢ 1,2,3,4 పాదాలు

 ఉత్తరాషాఢ 1 పాదం

 కన్యారాశి వారి అదృష్ట సంఖ్యలు 5, 1, 3, 4, 6. ఆది, శుక్ర, సోమ వారాల్లో శుభకార్యాలు తలపెట్టడం మంచిది.













వృశ్చికరాశి SCORPIO

వృశ్చికరాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సెకరణకు విలక్షణ పద్దతులు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడము కష్టము. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు.





భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారి వలన జీవితములో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకు ఒక సారి మార్చుకునే మనస్తత్వము వీరికి లేదు. జీవితములో మంచి స్థితికి రావడానికి ఇది కారణము ఔతుంది. జీవితములో ఎదగక పోవడానికి ఇదే కారణము. మంచితనము, పట్టుదల అధికముగా ఉండడానికి ఇదే కారణము.





 వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితములో మంచికి దారి తీస్తాయి. సహోదర, సహోదరీ వర్గము ఎదుగుదలలో ముఖ్యపాత్ర వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరిపట్ల చుపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది. వీరు అనేక మందికి శత్రువు ఔతారు. బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది. ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితములో మంచి మలుపుకు దారి తీస్తాయి. మీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. జరిగిన సంఘటనలను మరచి పోరు. తగిన సమయము వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. దూరప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు.








భూములు పెరగడము వలన జీవితములో చక్కని మలుపుకు దారి తీస్తాయి. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికముగా శ్రమిస్తారు. ఈ స్థితి జీవిత కాలము కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధము ఏర్పడుతుంది. జివితాశయ సాధనకు, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండ లేకుండా శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు. ముఖ్యమైన సమయాలలో బంధువర్గము వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురుచూసిన సహాయము అందదు. ఈ కారనముగా అభివృద్ధి కుంటువడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పేరు సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజాసంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. పోలీసు అధికారులుగా, న్యాయముర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు.









బంధువులవుతో వైరము, స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురి చేస్తాయి. గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి, గ్రహణాల సమయములో జాగ్రత్త వహించడము అవసరము. ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యము, ఇతరులను లక్ష్యపెట్టకుండా మీ అభిప్రాయాలను అమలు చెయ్యడము నష్టాన్ని కలిగిస్తుంది. సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల వలన ఇబ్బందులు ఎదురౌతాయి. ఈ విషయము ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది. వచ్చిన సదవకాశాలను వినియోగించుకుని కుటుంబసభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితము ఒడిదుడుకు లేకుండా సాగి పోతుంది.







వృశ్చికరాశి కొన్ని జ్యోతిష విషయాలు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది. ఈ రాశి రాశ్యధిపతి కుజుడు. ఈ రాశి సమ రాశి, శుభరాశి, స్త్రీరాశి, సరి రాశి, స్త్రీరాశి, స్థిర స్వభావరాశి, జలరాశి, కీటకరాశిగాను వ్యవహరిస్తారు. తత్వం జలతత్వం, సమయం పగటి సమయం, శబ్దం నిశ్శబ్దం, పరిమాణం దీర్ఘం, జాతి బ్రాహ్మణ, జీవులు కీటకములు, దిక్కు ఉత్తర దిక్కు, పాద జలతత్వం, సంతానం అధికం, ప్రకృతి కఫం, కాలపురుషుని శరీరాంగం మర్మ స్థానం, వర్ణం బంగారు వర్ణం.










ఈ రాశిలో చంద్రుడు నీచను పొందుతాడు. ఈ రాశి 210 డిగ్రీల నుండి 240 డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది. ఈ రాశిలో 3వ డిగ్రీలో చంద్రుడు నీఛను పొందుతాడు. నిరయన రవి ఈరాశిలో నవంబర్ పదిహేనున ప్రవేశిస్తాడు. ఈ రాశి విద్యుత్ కేంద్రాలు, శ్మశానాలు, ఇంటిలోని ఖాళీ ప్రాంతములను సూచిస్తుంది. విషము, విముతో కూడిన మందులు, పాములు పట్టువారి సూచిస్తుంది. ఈ రాశి వేరుశనగ, దుంపకూరలు లాంటి భూ అంతర్భాగాన పండే పంటలను సూచిస్తుంది. పాములు, పుట్టలు, విషకీటకములు,









ఈ రాశి గుణగణాలు తగాదాలకు సంసిద్ధత, కోపము, గూఢమైన కార్యాచరణ, పరస్త్రీ వ్యామోహం, ఇతరులను ద్వేషించుట, ఇతరుల కార్యములను చెడగొట్టుట, ధైర్యము కల వారుగా ఉంటారు. వీరిని సంతోషపెట్టుట కష్టం.





 జాతకం : వృశ్చికరాశి లక్షణాలు వీరికి మనస్సు చంచలంగా ఉంటుంది. ఊహాశక్తి మాత్రం అధికంగానే ఉంటుంది. ఇతరులు చేసే పనిని చూడగానే చక్కగా అనుక రించగల శక్తి వీరికుం టుంది. దానధర్మాలలో ఆసక్తి ఉంటుంది. ఇతరులు చేసిన తప్పులను కూడా క్షమిస్తారు. ఒకసారి ధైర్యం, మరోసారి చికాకు, అధైర్యం, ఒకసారి పనిని సక్రమంగా నెరవేర్చ డం, మరోసారి మధ్యలో మానేయడం ఇలా ఉంటుంది వీరి వ్యవహారం. అంటువ్యా ధులకు వీరు దూరంగా ఉండాలి. వీరికి తేలికగా కోపం వస్తుంది. ఆ కోపంలో ఎలా మాట్లాడుతు న్నారో గుర్తించకుండా మాట్లాడి ఇబ్బందుల నెదుర్కొంటారు. వీరి ఆకారం కొంచెం పొడవుగా ఉండి అమరిన శరీర సౌష్ఠవంతో అందంగా కనిపిస్తారు.









వీరి స్వభావంలో ఇతరుల దోషాలను హేళన చేసే తత్త్వం ఉంటుంది. తాము నిర్వహించే కార్యా లను పట్టుదలతో ఇతరులచే వేలెత్తి చూపించు కొనని రీతిలో నిర్వహించి అందరికంటె నేనే ఘ నుడను అనే భావాన్ని పొందుతారు. మనోభా వాలు బైట పడకుండా చక్కగా నటించగలరు. వీరికి కోపం ఎక్కువ. దైవ సంబంధమైన విష యాల్లో ఆసక్తి ఉంటుంది. వీరిలో స్వార్థచింతన ఇతరులు గుర్తించలేని రీతిలో ఉంటుంది. కాని మొండిగా ప్రవర్తించే తీరు ఇతరులకు బాధ కలిగి స్తుంది. రహస్యాలు గుర్తిస్తారు. తమను తామ కాపాడు కొనుటలో నేర్పు కలిగి ఉం టారు. ఇతరులను తమకు అనుకూలంగా మలచుకొంటారు. సంభాషణా నైపు ణ్యము, లేఖన నైపుణ్యము కలిగి ఉంటారు. ఎటువంటి వాతావరణంలోనైనా చక్కగా ఇమిడి పోగలరు.









దుష్టులతో స్నేహం వలన వీరు జీవి తంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు ఉపకారం చేసినా అది మరొకరికి తెలియడం వీరికి ఇష్టం ఉండదు. వీరి మనస్సులోని భావా లు గ్రహించడం కష్టం. వీరి జీవిత భాగస్వామికి అనారోగ్యావకాశాలు ఉంటాయి. వీరు ప్రతి పనిని స్వయంగా పరిశీలించుకొనినగాని తృప్తి పడరు. ఇతరులు చేసే పనులు వీరికి నచ్చవు. ఇతరులకు నీతిబోధ చేస్తారు. వీరికి పనులయందు శ్రద్ధ ఎక్కువ. ఆ శ్రద్ధ తీవ్రస్థాయి చేరుకొని ఆ శ్రమవల్ల అనారోగ్యం కలిగేవరకూ శ్రమ పడతారు. సుఖములనుభ వించడం విషయంలో కూడా అట్టి తీవ్ర స్వభా వమే కలిగి ఉంటారు. వీరి తీవ్ర స్వభావానికి తట్టుకొనలేక కొందరు మిత్రులు కూడా శుత్రు వులుగా మారతారు. వీరి మనస్సు లోతైన విష యాలు కలిగి ఉంటుంది. ఆ శక్తిని శ్రాస్తీయము లైన విషయములలో వినియోగించినచో గొప్ప పాండిత్యం సంపాదించగలరు. అలా కాకపోతే ఇతరుల తప్పులను గ్రహించుటయందే కాలం గడిచిపోతుంది. వీరికి పోటీలో విజయం సిద్ధి స్తుంది. విద్యా విషయంలో ఇట్టి పోటీ వీరిని ఉత్తమ స్థాయిలో నిలబెడుతుంది.







 ఈ రాశి వారికి మూడు, అయిదు, పదిహేను, ఇరవై అయిదు  చివర అంకెలుగల సంవత్సరాలలో ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. ఈ రాశి వారికి సుఖరోగములు, తెల్లపు విడుదల, మూలశంఖ, మూత్రకోశంలో రాళ్ళు, విషప్రయోగము వలన కలుగు వ్యాధులు, మూత్రకోశంలో రాళ్ళు.


 వృశ్చికం
 విశాఖ 4వ పాదం
 అనూరాధ 1,2,3,4 పాదాలు
 జ్యేష్ట 1,2,3,4 పాదాలు


 వృశ్చికరాశి వారి అదృష్ట సంఖ్యలు 9, 1, 2, 3.

ఆది, సోమ, గురు వారాలు యోగప్రదాలు.



తులారాశి LIBRA

తులారాశి

 తులారాశి వారి గుణగణాలు తులారాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. జీవితములో ప్రారంభములో ఎదురైన అపజయాలకు క్రుంగి పోక ఉపాయముతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు. తమ ఆలోచనను బయటకు చెప్పరు. ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఎత్తులకు పై ఎత్తులు వేయడములో నేర్పు కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు.







 ప్రజాకర్షణ అధికముగా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యొగ, వ్యాపార, వ్యాపకాలలొ రాణిస్తారు. ఆర్ధిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరాస్థులని అభివృద్ధి చెస్తారు. అనువంశికముగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. అలంకార ప్రియులు. ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలరు. కళా, సాహిత్య, రాజకీయ రంగాలలో రాణిస్తారు. యవ్వన ప్రాయములో అదృష్టము కలసి వస్తుంది. జీవితములొ అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంముగా నిలుస్తారు. బంధు వర్గముతొ విబేధాలు దీర్గ కాలము కొనసాగుతాయి. ఏ విషయములో రాజీ లేకుండా శ్రమిస్తారు.








 కూతురుకి మాత్రము అన్ని విషయాలలొ మినహాయింపు ఉంటుంది. వ్యక్తిగత సామర్ధ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చెసుకుంటూనే ఉంటారు. ఒక స్థాయికి వచ్చినా పాత పద్దతులు పొవు. అత్మీయులతో విబెధాలు వస్తాయి. గతము మరిచారన్న విమర్శను ఎదుర్కొంటారు. విదేశీయానము లాభిస్తుంది. సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. శని మహర్ధశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగము ఉంటుంది.








 జీవితములో నిందారోపణలు బాధ కలిగిస్తాయి. వైరి వర్గము సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి ఒక్కుమ్మడిగా వ్యతిరేకము ఔతారు. వైరి వర్గము ఒక్కటి కానంత వరకు వీరికి ఇబ్బంది లేదు. స్వంత వర్గము భయపడకుండా జాగ్రత్త వహిస్తారు. అంతర్యాన్ని గ్రహించే ప్రయత్నము చెయ్యక స్వజనుల అసమ్మతికి తగిన కాణనము కనుగొనడములో విఫలము ఔతారు. ఉన్నత స్థానములో ఉన్న వారి వలన అన్యాయపు తీర్పులు అమలౌతాయి. ముఖ్యముగా బాల్యములో ఉన్నత స్థానాలలో ఉన్న వారి వలన కుటుంబానికి అన్యాయము జరుగుతుంది.





న్యాయపరమైన విషయాలు జివితములో ప్రాధాన్యత సంతరించికోకుండా జాగ్రత్త వహించాలి. సాహసోపేతమైన నిర్ణయాలు కలసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వాచ్చిన విభేదాలు ఇబ్బందికి గురి చేస్తాయి. విలాసవంతమైన జీవితానికి కావలసిన సామగ్రికి అధికముగా ఖర్చు చేస్తారు. పడమర, దక్షిణ దిక్కులు లాభిస్తాయి. శుక్ర మైఢ్యమి కాలములో జాగ్రత్త వహించడము మంచిది. ప్రజాబలము, సన్నిహిత వర్గము అండదండలు, సంఘంలో మంచి పేరు ఉంటాయి.







దీపావళి నాడు చేసే లక్ష్మీ పుజ మేలు చేస్తుంది.

మేధస్సు, సాంకెతిక పరిజ్ఞానము, స్వీయ విద్య అక్కరకు వస్తాయి. బాల్యములో మిశ్రమ ఫలితాలు ఉన్నా స్వయంకృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు.




తులారాశి కొన్ని జ్యోతిష విషయాలు రాశి చక్రంలో ఈ రాశి ఏడవది. ఈ రాశిని పురుష రాశి గాను, విషమ రాశిగానూ, క్రూర రాశిగానూ, అశుభరాశి గానూ, చర రాశిగానూ, బేసి రాశిగానూ వ్యవహరిస్తారు. తత్వం వాయు తత్వం, శబ్దం నిశ్శబ్దం, సమయం పగటి సమయం, జాతి వైశ్యజాతి, అధిపతి శుక్రుడు. సూర్యుడు ఈ ర్శిలో నీచ స్థితిని పొందుతాడు. ఉదయం శీర్షోదయం, పాదజల తత్వం, జీవులు మానవులు, దిక్కులు పడమర, వర్ణం నీల వర్ణం, పరిమాణం దీర్ఘం, ప్రకృతి వాత ప్రకృతి, సంతానం అల్పం. నిరయన రవి ప్రవేశం సెప్టంబర్ పదహేను. ఈ రాశిలో పది డిగ్రీలలో రవి నీచను పొందుతాడు. ఈ రాశిలో ఇరవై డిగ్రీలలో శని పరమోచ్ఛను పొందుతాడు. ఈ రాశి వారి వృత్తులు వ్యాపారం, న్యాయశాలలు, భోజన శాలలు. ఈ రాశి ప్రదేశములు పట్టాణములు, దుకాణములు.






 ఈ రాశి వారి గుణగణాలు

 సుఖములు అనుభవించుట. సమాజంలో గుర్తింపు, పెద్దల ఎడ గౌరవం, సమాజంలో గుర్తింపు, పాండిత్యం, కళాభిమానం, కళత్రం మీద అభిమానం, ద్వికళత్రం, దానగుణం, వ్యాపారం చేసి ధనార్జన మొదలైన ప్రత్యేక గుణాలు.






 హెర్నియా, వరబీజం, కీళ్ళవాతం నడుము నొప్పికి తులారాశి కారకత్వం వహిస్తుంది. తుల... ఆందోళన, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, మూత్ర సమస్యలు, శోష, కీళ్ళవాతం, పైత్యం, శిరోవ్యాధులు, మలబద్ధకం, రక్తహీనత కలిగే అవకాశాలు
ఎక్కువ.








 జాగ్రత్తలు: 1) బొబ్బర్లు ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. 2) యోగా, వ్యాయామం తప్పనిసరి. 3) అందరూ మీరు చెప్పినట్టే వినాలి అనే ధోరణి వదిలేయండి.




 తులారాశి

 చిత్త 3,4 పాదాలు

 స్వాతి 1,2,3,4 పాదాలు

 విశాఖ 1,2,3 పాదాలు



 తులారాశి వారి అదృష్ట సంఖ్యలు 6, 2, 7, 9. సోమ, శుక్ర, శని వారాలు వీరికి అనుకూలిస్తాయి.









కన్యారాశి VIRGO

కన్యారాశి -

కన్యారాశి వారి గుణగణాలు కన్యారాశిలో జన్మించిన వారు స్వయముగా ప్రతిభ కలిగి ఉండడమే కాక ఇతరుల ప్రభను గుర్తించగలరు. ఎ పనుకి ఎవరు సమర్ధులో వీరు చక్కగా నిర్ణయించగలరు. బధుప్రితి అధికముగా ఉంటుంది.







 గణితములో ప్రజ్ఞ అధికముగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కలిగిఉంటారు. సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము వీరికి ఉంటుంది. ఇతరుల నెర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నెర్పు ఉన్నా దానిని ఋజువు చేసే ప్రయత్నము చేయలేరు. రచయితగా, లేఖికునిగా రాణిస్తారు. పత్రికా రంగములో రాణించగలరు. అకౌంటు, ఆర్ధిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యము కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించగలిగిన నేర్పరులు.








 ప్రభుత్వరంగములో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి. అర్ధికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది. ధనమును చక్కగా వినియోగంచగలిగిన నేర్పరితనము ఉంటుంది. మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండుట వంటివి వీరికి నష్టము కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మక పోయినా ఇతరులను నమ్మి మోసపోతారు. అధ్యాత్మిక గురువులకు సమ్బంధించిన వ్యవహారాలు మెలు చీస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగములో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి.







 వివాహజీవితములో ఒడి దుడుకులు ఊండక పోయినా స్వయంకృత అపరాధము వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. శుక్రదశ యోగిస్తుంది. మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితము గడుపుతారు. ఆపదలలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బదుల్లుకు గురి ఔతారు. ముద్రణ, టెండర్లు, ఒప్పంద పనులు కలిసి వస్తాయి. సినీ, కళా రంగాలలు ప్రతిభను నిరూపించుకుంటారు. వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును ఏర్పరచుకుంటారు. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు. నష్టములో ఉన్న సంస్థలను కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగిన దక్షత వీరికి ఉంటుంది. హాస్యము, అంచనాలకు సంబంధిచిన రచనలు చేయగలరు. ఏ పని అయినా చివరి వరకు కొనసాగవలసి ఉంటుంది. పనులు చక్కదిద్దటములో కొద్దిపాటి నిర్లక్ష్యము చుపించినా నష్తపోగల అవకాశము ఉంది.






 పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయములో వివ్వాదాలు తల ఎత్త వచ్చు. ఆస్తులు అన్యాక్రాంతము అయ్యే అవకాశము ఉంది. గృహము మీకు నచ్చిన విధముగా తీర్చి దిద్దుకుంటారు. ఉత్తర, దక్షిణ దిక్కులు కలసి వస్తాయి. కుజదశలో రవాణా వ్యాపారము కలసి వస్తుంది. విష్ణు ఆరాధనా, గణపతి ఆరాధనా వలన సమస్యలను అధిగమించ వచ్చు.




 కన్యారాశి జ్యోతిష విషయాలు రాశి చక్రంలో కన్యారాశి ఆరవది. ఈ రాశి అధిపతి బుధుడు.ఈ రాశిని స్త్రీ రాశి, శుభరాశి, సమ రాశిగా వ్యవహరిస్తారు. స్వభావం ద్విస్వభావం, తత్వం భూతత్వం, శభ్ధములు అర్ధ, ఉదయం శీర్షోదయం, జీవులు మనుష్య, నిర్జల తత్వం, పరిమాణం దీర్ఘం, వర్ణములు చిత్రవర్ణం, జాతులు శూద్ర, దిక్కు దక్షిణం, ప్రకృతి వాతం, సంతానం అల్పం,






కాలపురుషుని శరీర భాగం ఉదరం. వ్యాధులు :- డయేరియా, నులి పురుగులు, ఏలిక పాములు, కలరా, అజీర్ణము, టైఫాయిడ్. కన్య... పొట్ట, నాభి ప్రదేశం, వెన్నెము కింది భాగాలకు అనారోగ్యం, అజీర్ణం, విరేచ నాలు, అతిసారం, జీర్ణకోశ వ్యాధులు కలిగే అవకాశం ఉంది.







 జాగ్రత్తలు: 1) సమయానికి మితాహారం తీసుకోవడం. 2) వ్యాయామం, మొలకెత్తిన పెసలు. 3) ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గింపు. 4) ఆత్మవిశ్వాసం పెంచుకోవడం.



కన్యారాశి

 ఉత్తర ఫల్గుణి 2,3,4 పాదాలు

 హస్త 1,2,3,4 పాదాలు

 చిత్త 1,2 పాదాలు

 కన్యారాశి వారి అదృష్ట సంఖ్యలు 5, 1, 3, 4, 6.

 ఆది, శుక్ర, సోమ వారాల్లో శుభకార్యాలు తలపెట్టడం మంచిది.










సింహరాశి LEO

సింహరాశి

సింహరాశి వారి గుణగణాలు ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖజీవితానికి దూరము చేస్తుంది.





వ్యక్తిగత ప్రతిష్ఠకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్ధిక విషయాలలో సమర్ధులుగా పేరు గడీస్తారు. వంశప్రతిష్ట, కులగౌరవాలకు ప్రాధానయత ఇస్తారు. ఇతర కుల, మత, వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారము రాదు. కఠిన మైన స్వభాము కలవారన్న ముద్ర పడుతుండి. సన్ని హితులు, సేవకా వర్గము వీరి చేత కొంత ఆలస్యముగా అయినా పని చేయించుకోగలుగుతారు. వీరిని భయ పెట్తి లొంగదీసు కోవడము దాదాపు అసాధ్యము. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మక పోయినా లక్ష్యపెట్టరు. వీరి అంచనా నూటికి తొంభై పాళ్ళు నిజము ఔతాయి. వైఫల్యము చెందిన పది శాతం గుర్తించ తగిన నష్టాన్ని కలిగిస్తుంది.










 సన్నిహితులు, బంధువులు, రక్తసంబంధీకులు, స్త్రీల వలన అధికముగా నష్టపోతారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము, అల్పులను ఆశ్రయించుట తప్పక పోవచ్చు. రాజకీయ రంగములో ప్రారంభములోనే ఊన్నత స్థితి సాధిస్తారు. సాధారన స్థితిలో ఉన్నప్పుడు ఉన్నతవర్గాల వారికి దురము ఔతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరము చేస్తారు. శి







రోవేదన, పాఋశ్య వాయువు, కీళ్ళ నొప్పులు వేధిస్తాయి. సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయముగా వ్యవహరిస్తారు. ఉద్యోగుల పత్ల వారి విధుల పత్ల వీరికి ఉన్న స్పష్ట మైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. పైన అధికారములో ఉన్న వారు వీరి ధనముతో ప్రోత్సాహముతోనే ఇతరులను బలవంతులను చేసి చివరకు వీరికె పోటీగా నిలుపుతారు. కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురౌతాయి. స్వంత వారు వదిలి వేసిన బాధ్యతలన్ని వీరి తల మీద పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తరువాత స్వమ్త వాళ్ళ వలన సమస్యలు ఎదురౌతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగి పోతారు. రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యొగిస్తాయి. శని దశ కూడా బాగానే ఉంటుంది. స్నేహితులు మరచి పోలేని సహాయాలు చేస్తారు. వ్యతిరేకముగా ఆలోచిమ్చనమ్త కాలము మెలు గుర్తుంటుంది. కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యహారాలు లాభిస్తాయి. ప్రయోజనము లేని శ్రమకు దూరముగా ఉండాలి. వీరి ఉద్దేశ్యాలు మంచివే అయినా ఆచరనలో పెట్టదము కష్టము అని గుర్తించ వలసి ఉంటుంది.










 శివార్చన, ఆంజనేయార్చన మేలు చేస్తుంది. సింహరాశి జ్యోతిష విషయాలు సింహ రాశి రాశి చక్రంలో అయిదవ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఇది పురుష రాశి, విషమ రాశి, స్థిర రాశి, అగ్ని తత్వ రాశి, అశుభ రాశి, పురుష రాసి అని వ్యవహరిస్తారు. జాతి క్షత్రియ జాతి, శబ్దం అధికము, ప్రదేశము నిర్జల ప్రదేశములు, జీవులు పశువులు, వర్ణము పాండు వర్ణం ధూమ్ర వర్ణం, దిక్కు తూర్పు, పరిమాణం దీర్ఘం, ప్రకృతి పిత్త ప్రకృతి, సంతానం అల్పం, కాల పురుషుని అంగం గుండె, సమయము దినం, జీవులు పశువులు. కొండలు, నిర్జన ప్రదేశములు, ఏడారులు, కొండలు, నీటి ఎద్దడి కలిగిన అడవులు ఈ రాశి ప్రభావిత ప్రాంతములు. ఈ రాశి పొడుగు రాశి.










సింహం... వీపు, వెన్నెముక, హృదయం సంబంధించిన వ్యాధులు, హృదయ దేర్భల్యం, గుండెదడ, నడుము నొప్పి, పండ్ల నొప్పి, ముఖవ్యాధి మొదలనవి సంభవించవచ్చు.








 జాగ్రత్తలు: 1) తమ మనసులోని భావాలు బహిరంగపరచడం. 2) సూర్యనమస్కారాలు, ప్రాణాయామం. 3) తమ పనులు తామే నిర్వహించడం. 4) పండ్లు వాడడం మంచిది.



 సింహరాశి

మఖ 1,2,3,4 పాదాలు

 పూర్వఫల్గుణి 1,2,3,4 పాదాలు

 ఉత్తర ఫల్గుణి 1 పాదం

 సింహరాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 2, 3, 5, 9.


ఆది, మంగళ, గురువారములు వీరికి అనుకూలం.










కర్కాటకరాశి CANCER

కర్కాటకరాశి

కర్కాటకరాశి వారు మనోధైర్యము కలిగిన ఉంటారు. జల సంబంధిత విషయాఒలు ఇబ్బందులకు గురి చేసినా అవే జీవితములో పురోగతిని కలిగిస్తాయి. అన్ని విషయాలకు పోరాటము ఉంటుంది. ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు మార్లు కష్టపడ వలసి వస్తుంది. సన్నిహిత వర్గములో నిజాయితీపరులు ఉన్నంత వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు.




రాజకీయరంగములో చక్కగా రాణిస్తారు. మహాలక్ష్మీ పుజ వలన ఆటంకాలను అధిగమించగలరు. లలితకళలలో ప్రవేశము ఉంటుంది. కళా సమ్బంధిత వృత్తి వ్యాపారాలలో రాణించగలరు. సంతానము పురోగతి సాధిస్తారు. ప్రారమ్భములో సమస్యలు ఉన్నా నిదానముగా వాతిని అధిగమిస్తారు. రాణించలేమని భావిమ్చిన రంగాలలో రాణిస్తారు. హాస్యము పత్ల ప్రత్యేకమైన అవగాహన ఉంటుంది. కార్యనిర్వహనకు చక్కని పధకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు. నిష్కారణ శతృ వర్గము ఎప్పుడూ పొంచి ఉంటుంది.  ఊపిరి తిత్తుల మీద ప్రత్యేక శ్రద్ధ అవసరము. ఇతరుల పేరు మీద చెసే వ్యాపారాలలో ద్రోహము ఎదురౌతుంది. టెండర్లు, ముద్రణా పనులు, చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి. ధనము నిలువ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికముగా శ్రమపడవలసి వస్తుంది. నిందలు పుకార్లను ఎదుర్కొంటారు. అయినా ప్రజాకర్షణ బాగా ఉంటుంది. పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు. పట్టువిడుపు లౌక్యము ప్రదర్శించుట వలన ప్రయోజనము ఉంటుంది. వివాదాలు ముదరకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము.











 సన్నిహిత వర్గాన్ని మితి మీరి ప్రోత్సహించడము వలన వారి వలన పోటీ ఏర్పడుతుంది. చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాట్ల వలన అధికముగా నష్టపోతారు.






 అనుకున్న వివాహము ఒకటి చెసుకున్నది మరొకతి ఔతుంది. శని గ్రహ అనుకూల పరిస్తితులు ఉన్న అనుకున్న వివాహము జరిగినా వివ్వహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. సంబమ్ధబాంధవ్యాలు లెని వారు ప్రోత్సహిమ్చి ఆశ్రయము ఇవ్వదము జీవితములో మలుపుకు దారి తీస్తుంది. విదేశీ, విద్య, ఉద్యోగము, విదేశీ యానము కలసి వస్తాయి.







భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి. అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవదము కష్తము. స్వార్జితము నిలబడుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు. ఏమాత్రము సంబంధము లెని విషయాలలో ఎదురైయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి. దైవానుగ్రహము అప్రతిష్ఠ రాకుండా కాపాడుతుంది. అహంభావము లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. ఉన్నత స్థానము కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది.






భొగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని మరచి పోరు. రవి, చంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుంది. కర్కాటకరాశి జ్యోతిష విషయాలు కర్కాటక రాశి అన్నది రాశి చక్రంలో నాలుగవది. రాశి అధిపతి చంద్రుడు. ఈ రాశి అందు ఉచ్ఛ స్థితిని, కుజుడు నీచ స్థితిని పొందుతాడు. దీనిని సమ రాశి, జలరాశి, శుభ రాశి, స్త్రీ రాశి, సౌమ్య రాసి, చర రాశి, కీటక రాశిగా వ్యవహరిస్తారు. ప్రకృతి కఫము, సమయము రాత్రి, సంతానము అధికం, శభదం నిశ్శబ్ధం, దిశ ఉత్తరం, ఉదయం పృష్టోదయ రాశి, వర్ణం పాటల వర్ణం (లే గులాబి), జాతి శూద్ర, జీవులు జల జీవులు, కాల పురుషుని అంగములు వక్షస్థలం, తత్వం పూర్ణ జల తత్వం.రస తత్వము కలిగిన బత్తాయి, నిమ్మ, నారంజ, కమలా, చెరకు, కొబ్బరి ఫలాలకు ఈ రాశి కారకత్వము వహిస్తుంది. బావులు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రములు, ఇతర జలాశయములకు ఈ రాశి కారకత్వము వహిస్తుంది.






ఈ రాశి కఫ సంధిత రోగములు, అజీర్ణము, పిత్తాశయంలో రాళ్ళు, కామెర్లు వంటి వ్యాధులకు కారకత్వము వహిస్తుంది. కర్కాటకం... రొమ్ము, జీర్ణకోశం, హృదయనాళాల సంబంధిత వ్యాధులు, నీరుపట్టడం, కఫం, కేన్సర్‌, హిస్టీరియా, కీళ్ళనొప్పులు, శోష, గొంతులో బాధ, మానసిక శారీరక బలహీనతలు, కంటికి సంబంధించిన అనారోగ్యాలు, అజీర్ణం, వరిబీజం వంటివి వచ్చే అవకాశం ఉన్నది.




 జాగ్రత్తలు: 1) ఎక్కువ ఆలోచనలు మానాలి. 2) యోగాసనాలు చెయ్యాలి. 3) తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనే అనుమానాలు విడనాడితే మంచిది. 4) మెడి టేషన్‌ చేయాలి.


 కర్కాటకరాశి
 పునర్వసు 4వ పాదం
పుష్యమి 1,2,3,4 పాదాలు
 ఆశ్లేష 1,2,3,4 పాదాలు

 కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్యలు 2 మాత్రమే. మంగళ, శుక్రవారములు మంచివి.














మిథునరాశి GEMINI

మిథునరాశి
మిధునరాశి వారి గుణగణాలు

 మిధున రాశి వారు హాస్యప్రియులు. తాము అనుకున్నది సామరస్యముగా సాధించడానికి ప్రయత్నిస్తారు. వ్యవహార విషయాలను కూడా తమ శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు ప్రణాళిక చక్కగా వేస్తారు. 





సమయానుకూలముగా మాట్లాడే నేర్పు ఉంటుంది. ఉన్నత స్థానాలలో ఉనా వారు, బంధు వర్గము, స్వజాతి వారు ముఖ్యమైన సందర్భాలలో మోసము చెస్తారు. బాల్యము నుండి కష్టాలు ఎత్తు పల్లాలు చూస్తారు. జీవితానుభవము, అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనము నుండి అలవడుతుంది. 








వివాహము, సంతానప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచి పోతుంది. మాట తప్పె మనుషుల వలన జీవితములో పని చేయించుకుని ప్రత్యుపకారము చేయని వారి వలన ఇబ్బందులు ఎదురౌతాయి. వంశపారంపర్యముగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలసి రాదు. ఇతరుల సొమ్ము మీద బమ్ధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు. స్వార్జితము మీదే అధికముగా దృష్టి సారిస్తారు. పధకము రచించడములో దానిని అమలు చేయదములో నైపుణ్యము ఉంటుంది. కార్యక్రమాలను అమలు చేయడానికి తోడు కావాలి. ఇది వీరికి చెప్పుకోతగినంత నష్టము కలిగిస్తుంది. 









ఆదర్శముగా ఉండే వీరి భావాలు పలువురుకి అయిష్టత కలిగిస్తుంది. అవకాశాలను సద్వినియోగము సామధ్యము కలిగి ఉంటుంది. రాజకీయము పత్ల విపరీతమైన ఆసక్తి కలిగి ఉంటారు. శుక్రదశ, శనిదశ యోగవంతమైన కాలము. ఈ దశలలో మంచి ఫలితాలు సాధిస్తారు. జీవితములో జరిగిన నిరాదరణ భవిష్యతూకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు. తాను పడిన కష్టాలు ఇతరులు పదకూడదని భావిస్తారు. సత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయము వచ్చినప్పుడు మాత్రము ప్రతీకారము తీర్చుకోరు.









 సంతానముతో చక్కని అనుబంధము ఉన్నా తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నము మాత్రము చేయరు. వీరి సామర్ధ్యాన్ని, నైపుణ్యాన్ని, ఆలోచనలను ఇతరులు తిరస్కరిస్తారు. సమస్యలను పరిష్కరించే వ్యక్తుల సహకారము వీరికి ఉంటుంది. ప్రభుత్వపరముగా, చట్టపరముగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్ధము చేసుకుంటారు. చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు. అన్ని లెక్కలు వ్రాత పుర్వకముగా లేకున్నా చక్కగా గుర్తు ఉంటుంది. వివాదాలకు దూరముగా ఉంటారు కాని సమస్యలకు దూరముగా పారి పోరు. ప్రతిఘటించే తత్వము అధికముగా ఉంటుంది. వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడములో శ్రద్ధ వహిస్తారు.










 స్త్రీల వలన పురుషులకు పురుషుల వలన స్త్రీలకు పకారము జరుగుతుంది. ఐకమత్యము కొరకు గ్రూఫు రాజకీయాలను రూపుమాపడనికి అధికముగా శ్రమిస్తారు. జీవితములీ రెండు విధముల వృత్తి ఉద్యోగాలను చేసే నైపుణ్యము ఉంటుంది. ప్రధాన విద్యకంటే మధ్యలో నెర్చుకున్న విద్య జీవితానికి అధికముగా ఉపయోగపదుతుంది.







 సన్నిహితుల వలన, బంధువుల వలన ఇబ్బమ్దులకు గురి ఔతారు. గతాన్ని గురిమ్చి అధికముగా ఆలోచించడము తగ్గించుకుంటే ఉన్నత స్థితికి చేరుకుంటారు. శివార్చన, శివభక్తి, రుద్రకవచ పారాయనము వలన మెలు జరుగుతుంది. 







మిధునరాశి జ్యోతిష వివషయాలు మిధున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి. జూన్ మాసం సగము నుండి జూలై మాసం సగం వరకు దినంలో లగ్నారంభ రాశి. దీనికి అధిపతి బుధుడు, స్వభావం ద్వి స్వభావం, లింగం పురుష, సమయము రాత్రి, ఉదయం శీర్షోదయం, జీవులు మానవులు, శబ్దం అధిక, తత్వం వాయువు, వర్ణం ఆకుపచ్చ, పరిమాణం సమ, జాతి వైశ్య, దిక్కు పడమర, సంతానం సమ , కాలపురుషుని అంగము బాహువులు, రాశి పురుష, విషమ, ప్రకృతి వాతం.




 ఈ రాశి సంబంధిత వృత్తులు సాంకేతికములు, వార్తలు మొదలైనవి. అంటే టెలి ఫోన్లు, సమాచార కేంద్రములు, రేడియోలు ఆకాశవాణి కేంద్రములు, విమానములు విమానాశ్రయాలు, వాతావరణంఅ కేంద్రములు, వాణిజ్య కేంద్రములను, రైల్వేలు రైల్వే వాణిజ్య విభాగంలను సూచిస్తుంది. వార్తలు, వారపత్రికలు, ప్రచురణాధిపతులను సూచిస్తుంది. 





ఈ రాశి వారు పొడగరులు. ఈరాశి ఉబ్బసము, క్షయ, దగ్గు, ఫ్లూ జ్వరము మొదలైన రోగాలకు కారణము. మిథునం... విశ్రాంతి లేకపోవడం, ఊపిరితిత్తుల వ్యాధులు, మనోవ్యాధి, ప్రాణవాయువు (ఆక్సిజన్‌ లేకపోవుట), మూలవ్యాధి, న్యుమోనియా, క్షయ, ఫ్లూ, అండవ్యాధులు, మానసిక రోగాలు, చెవుడు, తలనొప్పి, ఉన్మాదం (పిచ్చి) మొదలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. 





జాగ్రత్తలు: 1) పౌష్టికాహారం తీసుకోవడం. 2) గాలి, వెలుతురు ఉన్న గృహ నివాసం. 3) క్రీడలు, వ్యాయామం తప్పనిసరి. 4) కాలీమూరు (ఆయుర్వద మందు) వాడాలి. అంతేకాకుండా ఆరోగ్యాన్ని ప్రసాదించే మొలకెత్తిన పెసలు పండ్లు ఫలాలు  తినడం చాలా మంచిది. 

మిథునరాశి 

మృగశిర 3,4 పాదాలు.

 ఆరుద్ర 1,2,3,4 పాదాలు 

పునర్వసు 1,2,3 పాదాలు 

మిధునరాశి వారి అదృష్ట సంఖ్యలు 5, 1, 6, 7, 8. ఆది, శుక్ర, శని వారాలు వీరికి అదృష్టాన్నిచ్చే రోజులు.












02 October 2016

వృషభరాశి TAURUS

వృషభరాశి రాశిగుర్తు ఎద్దురాశి.
 చక్రంలో సంఖ్య 2

 నక్షత్రములు కృతిక 2,3,4పాదములు, 

రోహిణి 4పాదములు, 

మృగశిర 1,2 పాదములు 





అధిపతి శుక్రుడు పూజించవలసిన దేవత లక్ష్మీదేవి .
అదృష్ట విషయాలు అదృష్ట రంగు : తెలుపు .

సరిపడని రంగు : ఎరుపు.

 అదృష్ట సంఖ్య : ఆరు .

వారం : శుక్రవారం.







 వృషభం అనగా ఎద్దు. వృషభం అనునది రాశి చక్రం లో రెండవ రాశి.. కృత్తికా నక్షత్రంలోని మూడు పాదాలు, రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు, మృగశిరా నక్షత్రంలోని రెండు పాదాలు కలిసి వృషభరాశిగా వ్యవహరిస్తారు. వృషభరాశికి అధిపతి శుక్రుడు. ఇది ఆంగ్ల మాసంలో మే మాసం సగము నుండి జూన్ మాసం సగము భాగం వరకు ఉంటుంది.







వృషభ రాశికి చెందిన పురుషులు ధృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్నిఆరాధించే హృదయం కలిగి, సంగీతాన్ని ఆస్వాదిస్తారు. తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదేస్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు. ఈ రాశి పురుషులు సహనమనే గుణం అలంకారం అని చెప్పవచ్చు. ఈ గుణం వల్ల వీరు ఫలితాలకోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు. 













స్త్రీలు వృషభరాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే, ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ, దృఢ సంకల్పం గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. అనుకున్న పనిని సాధించే వరకూ తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. సంగీతం, సౌందర్యాలంటే వృషభరాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం. అతిజాగ్రత్త, ప్రేమ మనస్తత్వాలు కలిగిన వృషభరాశి స్త్రీ తన భాగస్వామి నుంచి ప్రేమాభిమానాలు దక్కాలని భావాలతోనే తెలియజేస్తుంది. అదే సమయంలో తన భాగస్వామిని అంతే ప్రేమాభిమానాలతో ఆరాధిస్తుంది. మొండితనం, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ఈమెకు కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు. దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మరిచిపోతారు.





వృషభరాశి వారి గుణగణాలు 

వృషభరాశి వారికి మధ్య వయసు నుండి జీవితము యోగవంతముగా ఉటుంది. ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు. శ్రమ పడవలసిన వలసిన సమయములో శ్రమ పడని కారణముగా ఇబ్బమ్దులను ఎదుర్కొంటారు. అందరి మాటలను విని తుదకు తాము అనుకున్నదే చెస్తారు. భాగస్వాములు, మిత్రులు ధైర్యవంతులు, ప్రతిభావంతులు ఉండరు. తాత ముత్తాతలు ప్రతిష్ఠ కల వారుగా ఉంటారు. కుటుంబ ప్రతిష్ఠ విరికి అధికముగా ఉంటుంది. విలునామాలు లాభిస్తాయి. వంసపారపర ఆస్థులు అభివృద్ధి ప్రారంభములో కుంటువడుతుంది. వీరికి వంశ పారంపర్యంగా లభించే అస్తులకన్నా ప్రచారము అధికముగా ఉంటుంది. ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వ్యాపార విస్తరణలో భార్య వైపు బంధువుల సహకారము లభిస్తుంది. లెక్కల విషయములో ఎవరికీ మినహాయింపులు ఉండవు. 








కూతురు విషయములో కొంత వెసులుబాటు ఉంటుంది. కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు. అదృష్టానికి దగ్గరగా జీవితము నడుస్తుంది. మీ ప్రతి విజయానికి వేరొకరిని కారణంగా ప్రజలు భావిస్తారు. సన్నిహితులు సహితము విమర్శిస్తారు. మంచి సలహాదారులుగా రాణిస్తారు. కొన్ని విషయాలలొ వీరి సలహాలను పొందిన వారు వీరిని సర్వస్వముగా భావిస్తారు. విలాసవంతమైన జీవితము గడుపుతారు. ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధము ఉండదు.










 వివాహానంతర జీవితము బాగుంటుంది. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచ లేరు. ఒక్క జ్యేష్ట కుమార్తె విషయములో మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జివితములో ప్రధాన పాత్ర వహిస్తాయి. వీరి స్వంత మనుషులె విరి విషయాలను బయత పెట్టనంత వరకు విరికి ఇబ్బందులు ఎదురు కావు. మాట సహాయము చేసి ఇబ్బందులను విమర్శలను ఎదుర్కొంటారు. వీరికి శని దశ యోగిస్తుంది.







వృషభరాశి వారి వివరాలు గుణము:-శుభరాశి, రాశి:-సమ రాశి, స్త్రీ రాశి అంటారు, ఇది స్థిర రాశి, తత్వము:- తత్వం భూతత్వం, శబ్ధము:-శబ్దం అధికం, సమయము:-సమయం రాత్రి, పరిమానము:- పరి మాణం హస్వ, జీవులు:-జీవులు పశువులు, ఉదయము:- ఉదయం పృష్ట, దిక్కు:- దిశలు దక్షిణ, వ వర్ణము:- వర్ణం శ్వేతం, జాతి:- జాతి బ్రాహ్మణ, అధిపతి:- అధిపతి శుక్రుడు, సంతానము:- సంతానం సమ, అంగం;- కాల పురుషుని అంగము .
వృషభరాశి
కృత్తిక 2,3,4 పాదాలు
రోహిణి 1,2,3,4 పాదాలు
మృగశిర 1,2 పాదాలు
వృషభరాశి వారి అదృష్ట సంఖ్యలు 6, 5, 8, 9. 

మంగళ, శుక్రవారాలు వీరికి మంచివి.













మేషరాశి ARIES

మేషరాశి రాశులలో ఇది మొదటిది. 

సూర్యుడు మేషం సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు. అశ్వని నక్షత్రము నక్షత్ర నాలుగు పాదాలు, భరణి నక్షత్రము నక్షత్ర నాలుగు పాదాలు మరియు కృత్తిక నక్షత్రము నక్షత్రంలోని ఒక పాదం మేషరాశిగా వ్యవహరిస్తారు. 









ఈ నక్షత్ర సమూహం మేక ఆకారంలో ఉంటుంది కనుక మేషం అంటే మేక అని మరో అర్థం కనుక ఇది మేషరాశి అయింది. సూర్యుడు ఒక మాసకాలం ఈ రాశిలో ఉండి ఆతరువాత వృషభరాశిలో ప్రవేసిస్తాడు. మేషరాశి వారి గుణగణాలు మేషరాశి వారి జీవితములో ఒడిదుడుకులు ఎక్కువ. అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. బాల్యములో కష్టాలు అనుభవిస్తారు. 







యవ్వనములో స్నేహితులకు బంధువులకు దూర ప్రాంతాలకు వెడతారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురౌతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా అర్ధిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే అవగతమౌతుంది. స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు. అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని బంధువులు ఎదురు చూస్తారు. బంధువర్గములో అస్థుల కొరకు వేచి ఉండే వారు అధికము. 








భార్య వైపు బంధువులు కొంత కాలము పెత్తనము సాగిస్తారు. అనేక కారణాల వలన మంచి వారిని ఆదరించ వలసిన అవసరము ఏర్పడుతుంది. పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురి ఔతారు. సాహస క్రీదల పట్ల అభిమానము మెండు. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. భాగస్వాములతొ కలిగే విబేధాలు జీవితములో మలుపును తెస్తాయి. లిఖిత పుర్వకమైన విషయాలను ఇతరులకు చెప్పింనంతగా తాము ఆచరించరు. మనోధైర్యముతో తిసుకునె సాహస నిర్నయాలు కలిసి వస్తాయి. అనుభ్వ లేకుండ చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి. వైద్యరంగములో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడనికి ఇష్టపడరు. సొమరితనమంటే అయిష్టము. కుటుంబములో ఐక్యత ప్రశాంతత ఉన్నంత కాలము వెలుపలి ప్రపంచములో విజయపధంలో మనగలరు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితములో రాణిస్తారు.






సుభ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పుజల వలన సమస్యలను అధిగమించగలరు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు ప్రతిష్తకు భంగము లేదు. స్త్రీలకు సంతానము, జీవిత భాగస్వామి విషయములో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసి పోతాయి. జ్యేష్ట సంతానము విషయములో జాగ్రత్త వహించాలి. ఆడంబరము లేని పూజలు, గుప్తదానాలు, మనోధైర్యము మేలు చేస్తాయి. సహాయ సహకారాలు కోరేవారు అందరూ అవకాస వాదులు కారని గుర్తించాలి.






తూర్పు, ఉత్తర సింహద్వారాలు కలసి వస్తాయి. గురువారము చెసే విష్ణు పూజలు మేలు చెస్తాయి. మేషరాశి వారి లక్షణాలు రాశులవారీగా తీసుకుంటే ప్రథమ రాశి మేషం. ఈ రాశిని అగ్నితత్త్వంతో పోలుస్తారు. భగభగమండే తత్త్వంతో ఉండి, కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. తోచిన విధంగా ప్రవర్తించడం వంటి లక్షణాలతో ఉంటారు. ఈ రాశికి కుజుడు అధిపతి. చర రాశి అయినందున స్థిరమైన ఆలోచన ఉండదు. చకచకా ఆలోచనలు, నిర్ణయాలు మారిపోతుంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అగ్నితత్త్వం అయినందున ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశివారిలో అత్యంత సహజం. నాయకత్వం వహించాలనే తపన, తొందరపాటుతనం కనిపిస్తాయి. చురుకుదనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు. క్షత్రియ రాశి కూడా అయినందున పురుషాహంకారంతో శక్తిమంతుడుగా ఉంటారు. పట్టుదల, కార్యసాధన లక్షణం కలిగి ఉంటారు. దీనివల్ల మొండితనం అబ్బుతుంది. మాట నెగ్గించుకోవడంకోసం క్రూరత్వం వహించే అవకాశం ఉంది.





జ్యోతిష సమాచారము-
మేషరాశి లక్షణము. తత్వముమేషరాశి అగ్ని తత్వం అగ్ని. లింగముపురుష రాశి రాశిచర రాశి రాశివిషమ రాశి జంతువుపశు రాశి అని ఇతర నామాలు దీనికి ఉన్నాయి.
స్వభావముచతుష్పాద రాశి, క్రూర రాశిగా కూడా వ్యవహరిస్తారు. రత్నముఈరాశ్యధిపతి కుజుడు కనుక రత్నము పగడము. రూపముఈ రాశితో సంబంధం ఉన్న వారు మితమైన ఎత్తు కలిగి ఉంటారు. జాతిజాతి క్షత్రియ శబ్ధముశబ్ధములు అధిక శబ్దం జీవులుజీవులు పశువులు వర్ణం వర్ణమురక్త వర్ణం దిక్కుదిశ తూర్పు దిశ ప్రకృతిశరీర ప్రకృతి పిత్తం సంతానంసంతానం అల్పం అంగంకాల పురుషుని అంగం శిరస్సు ఉదయముఉదయం పృష్ఠ సమయముసమయం రాత్రి అని జ్యోతిష శాస్త్ర వివరణ.
మేషం... సాధారణంగా ఈ రాశివారికి తల, ఉదరం, పైత్యం, నత్తి, మూత్రపిండాలు, అగ్ని ద్వారా ఇబ్బందులు, కురుపులు (వ్రణాలు), చర్మా నికి సంబంధించిన విచిత్ర వ్యాధులు కలిగే అవకాశం ఉన్నది. అంతేకాకుండా... అండవ్యాధులు, ఉష్ణంతో కూడిన కఫం, రక్తసంబంధ వ్యాధులు హెచ్చు.
జాగ్రత్తలు: 1) ధ్యానం చేస్తూ ఉండాలి. 2) చల్లదనాన్ని ఇచ్చే పూలు (పూల సువాసన). 3) పసుపు, తేనె పరగడపున తీసుకోవాలి. 4) ఆహారంలో కందిపప్పు ఎక్కువగా ఉండాలి.




రాశినక్షత్రపాదాలు 

మేషరాశి అశ్విని 1,2,3,4 పాదాలు

 భరణి 1,2,3,4 పాదాలు

 కృత్తిక 1 పాదం.

మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు 9, 1, 2, 3.


ఆది, సోమ, గురు శుక్రవారాలు మంచి రోజులు. ఈ రోజుల్లో ఏ పనినైనా ప్రారంభించినా మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.









01 October 2016

అనురాధ నక్షత్రం

అనూరాధా నక్షత్రము అధిపతి శని. ఇది దేవగన నక్షత్రము. అధిదేవత సూర్యుడు. జంతువు జింక, రాశ్యధిపతి కుజుడు. 





ఈ నక్షత్రములో జన్మించిన వారు జలక్రీడల అమ్దు ఆసక్తులై ఉంటారు. నైతిక ధర్మము, పెద్దలు, వృద్ధుల పట్ల గౌరవము కలిగి ఉంటారు. అవసరాలకు తగినంత మాత్రమె ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకుంటారు. జీవితములో స్థిరపడడానికి సమయము పడుతుంది. విద్యలలో రాణించడానికి కొంత సమయము కావాలి. ఆరంభములో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా తరువాత కాలములో నిరాటంకముగా విద్యలను అభ్యసిస్తారు. 






ఉద్యోగజీవితములో మొదట ఒడిదుడుకులను ఎదుర్కొన్నా తరువాత నిలదొక్కుకుని ముందుకు విజయవంతముగా సాగి పోతారు. ప్రేమవివాహాలు చేసుకుంటారు. గుర్తిపు పత్రాలు లేకున్నా కొన్ని విద్యలలో పురోగతి సాధిస్తారు. విద్యలపత్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత పదవులు అధిరోహిస్తారు. పెద్దల ద్వారా స్వల్పముగా అయినా ఆస్తులు లభిస్తాయి. కుటుంబ స్రేయస్సు కొరకు కొన్ని పదవులు చేపడతారు.








 కీలక సమయంలో బంధువర్గము నుండి నమ్మకద్రోహము ఎదురౌతుంది. తండ్రి పద్దతులు నచ్చవు. తల్లి మీద విశేషమైన అనురాగము ఉంటుంది. సహోదర సహోదరీ వర్గము బాధ్యతలను నెత్తిన వేసుకుంటారు. యంత్రాలు, భూములు, గృహాలు, వాహనాలకు సంబంధించిన విదేశీయానము, దూరప్రాంత ఉద్యోగము, దూరప్రాంత విద్యా విధానము మీద ఆసక్తులై ఉంటారు. సలహాలు చెప్పి, మార్గాలు చూపి అనేక మంది పురోగతికి తోడ్పడతారు. ఆత్మీయులు ఎంత మంది ఉన్నా ఏకాంతముగా ఉన్న అనుభూతి కలిగి ఉంటారు. 








సాహిత్య, కళారంగాలను వైరాగ్యము మిశ్రమము చేసి ప్రయోగా లు చేస్తారు. వైద్య విద్యలలో రాణిస్తారు. సంతానము వలన ఖ్యాతి లభిస్తుంది. ఎవరిపట్ల శాశ్వత అనుబంధము ఉన్నట్లు భావించరు. ఒకసారి లాభము సంపాదించిన రంగములో తిరిగి ప్రవేశించరు. నిలకడగా, నికరముగా ఉండే ఉద్యోగాలలో స్థిరపడతారు. వృద్ధాప్యము అన్ని విధాలుగా బాగుంటుంది.





నక్షత్రములలో ఇది 17వ నక్షత్రం.
నక్షత్రంఅధిపతిగణముజాతిజంతువువృక్షమునాడిపక్షిఅధిదేవతరాశి
అనూరాధ శని దేవ పురుష జింక  పొగడ. మధ్య సూర్యుడు  వ్రృశ్చికము
అనూరాధా నక్షత్ర జాతకుల తారా ఫలాలు:-
తార నామంతారలుఫలం
జన్మ తారపుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్రశరీరశ్రమ
సంపత్తారఆశ్లేష, జ్యేష్ట, రేవతిధన లాభం
విపత్తారఅశ్విని, మఖ, మూలకార్యహాని
సంపత్తారభరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢక్షేమం
ప్రత్యక్ తారకృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢప్రయత్న భంగం
సాధన తారరోహిణి, హస్త, శ్రవణంకార్య సిద్ధి, శుభం
నైత్య తారమృగశిర, చిత్త, ధనిష్టబంధనం
మిత్ర తారఆరుద్ర, స్వాతి, శతభిషసుఖం
అతిమిత్ర తారపునర్వసు, విశాఖ, పూర్వాభద్రసుఖం, లాభం
అనూరాధనక్షత్రము నవాంశ:-
1 వ పాదము - వ్రృశ్చికరాశి.
2 వ పాదము - వ్రృశ్చికరాశి
3 వ పాదము - వ్రృశ్చికరాశి
4 వ పాదము - వ్రృశ్చికరాశి
నాలుగు పాదాలు కూడ వ్రృశ్చికరాశి.




అనూరాధ నక్షత్ర వృక్షము పొగడ
అనూరాధ నక్షత్ర జంతువు
అనూరాధ నక్షత్ర జాతి(పురుష)
అనూరాధ నక్షత్ర పక్షి
అనూరాధ నక్షత్ర అధిపతి శని.
అనూరాధ నక్షత్ర అధిదేవత
అనూరాధ నక్షత్ర గణము దేవగణము దేవగణాధిపతి.










నక్షత్ర మొదటి పాదం :- 
అనురాధ నక్షత్ర మొదటి పాదం  వ్రృశ్చికరాశి   లో ఉంటుంది .  నక్షత్ర అధిపతి శని . ఇది దేవగణ నక్షత్రం. కనుక సాత్విక గుణం, ధర్మ పక్షపాతం కలిగి ఉంటారు. బద్ధకం ఉంటుంది అయినా  చేయాలనుకున్న పనిని శ్రమకు ఓర్చి పనిచేస్తారు. అన్యాయాన్ని సహించలేరు. మంచివే అయిన తమ అభిప్రాయాలను తీవ్రంగా తెలియజేస్తారు. తండ్రితో అభిప్రాయభేదాలు కలుగ వచ్చు. తల్లితో ఎకీభవిస్తారు. వీరికి ఆత్మవిశ్వాసం, అతిశయ భావం ఉంటాయి. ప్రభుత్వపరమైన కర్మాగారాలు , పరిశ్రమలలో పని చేసే అవకాశాలు ఉంటాయి. అగ్ని సంబంధిత, వాయు సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. 17 సంవత్సరాల కాలం జీవితం సాధారణంగానే జరుగుతుంది. విద్యలో మందకొడితనం ఉంటుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కారణంగా కాలేజ్ చదువులలో  అభివృద్ధి ఉంటుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. 34 సంవత్సరాల అనంతరం వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతుదశ అనుకూలిస్తే విదేశీఉద్యోగాలు అనుకూలిస్తాయి. 41 సంవత్సరాల కాలంలో వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో అభివృద్ధి ఉంటుంది. జీవితం సౌఖ్యంగా జరుగుతుంది. మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది.











అనురాధ నక్షత్ర రెండవ పాదం :- 
అనురాధ నక్షత్ర రెండవ పాదం వృశ్చిక రాశి లో ఉంటుంది. 
 అనురాధ నక్షత్ర  అధిపతి శని  కనుక సాత్విక గుణం, ధర్మ పక్షపాతం కలిగి ఉంటారు. బద్ధకం ఉంటుంది అయిన చేయాలనుకున్న పనిని శ్రమకు ఓర్చి పనిచేస్తారు. అన్యాయాన్ని సహించలేరు. వీరికి మేధో సంబంధమైన వృ త్తి ఉద్యోగాలు అనుకులోస్తాయి. వీరికి బుధదశ అనుకూలిస్తుంది కనుక విద్యలో ఉన్నతిని సాధించగలరు.  13 సంవత్సరాల కాలం జీవితం సాధారణంగానే జరుగుతుంది. విద్యలో మందకొడితనం ఉంటుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కారణంగా మాధ్యమిక తరగతి నుండి చదువులలో  అభివృద్ధి ఉంటుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. 34 సంవత్సరాల అనంతరం వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతుదశ అనుకూలిస్తే విదేశీఉద్యోగాలు అనుకూలిస్తాయి. 37 సంవత్సరాల కాలంలో వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో అభివృద్ధి ఉంటుంది. జీవితం సౌఖ్యంగా జరుగుతుంది. మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది.













అనురాధ నక్షత్ర  మూడవ పాదం :- 
అనురాధ నక్షత్ర  మూడవ పాదం వృశ్చిక రాశిలో ఉంటుంది.   అనురాధ నక్షత్ర శని.  వీరు ప్రజాకర్షణ కలిగి ఉంటారు.   తమ అభిప్రాయాలను ఆకర్షణీయంగా చెప్పగలరు. కనుక సాత్విక గుణం, ధర్మ పక్షపాతం కలిగి ఉంటారు. బద్ధకం ఉంటుంది అయినా  చేయాలనుకున్న పనిని శ్రమకు ఓర్చి పనిచేస్తారు. అన్యాయాన్ని సహించలేరు. కళాత్మకమైన వస్తువులను సేకరించడానికి ఆసక్తి కలిగి ఉంటారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఉండడానికి ఆసక్తి కలిగి ఉంటారు. ఇనుము, వెండి, ముత్యం సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలం. పరిశ్రమలు, కర్మాగారం, విమానాశ్రయాలు,హార్బర్లలో  వంటి వాటిలో పనిచేసే అవకాశాలు ఉంటాయి.  వీరికి బుధదశ  బాగా అనుకులిస్తుంది కనుక విద్యావంతులై ఉన్నత స్థితికి చేరుకుంటారు.  8 వరకు మందకొడి తనంగా సాగే విద్యాభ్యాసం  తరువాత వచ్చే సంవత్సరాల  17 సంవత్సరాల బుధదశ కాలంలో బాగా రాణిస్తుంది. కనుక వీరు ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడతారు. 25 సంవత్సరాల తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. 32 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా జీవితంలో చక్కని అభివృద్ధి ఉంటుంది. 75 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరిగి పోతుంది.













అనురాధ నక్షత్ర నాలుగొవ  పాదం :- వృశ్చిక రాశి.
ఇది దేవగణ నక్షత్రం. కనుక సాత్విక గుణం, ధర్మ పక్షపాతం కలిగి ఉంటారు. బద్ధకం ఉంటుంది అయినా  చేయాలనుకున్న పనిని శ్రమకు ఓర్చి పనిచేస్తారు. అన్యాయాన్ని సహించలేరు. వీరు తమ అభిప్రాయాలను మంచివే అయినా తీవ్రంగా, ఆవేశంగా  తెలుయజేస్తారు. వీరు యూనియన్ల కార్యకలాపాలలో ఉత్సాహంగా పాటుపడతారు.  సంప్రదాయేతరమైన వాయు సంబంధిత విద్యుత్ రంగంలో ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. వాయు సంబంధిత, అగ్ని సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.  వీరికి ఆరంభం నుండి విద్య అనుకూలంగా ఉంటుంది.  4 సంవత్సరాల  తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో బాగా రాణిస్తుంది.  21 సంవత్సరాల తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయత్నపూర్వకంగా విద్యలో విజయం సాధించవలసిన అవసరం ఉంది. కేతుదశ అనుకూలిస్తే విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. 28 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా జీవితంలో చక్కని అభివృద్ధి ఉంటుంది. 71 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరిగి పోతుంది.