29 February 2016

పిల్లలకు పేర్లు మరియు అన్నప్రాసన.

జ్యోతిష్య శాస్త్ర నియమం ప్రకారం చిన్న చిన్న పేర్లు మాత్రమే పెట్టాలి.

ఆడవాళ్ళకి తొమ్మిది, 

మగవాళ్ళకి ఎనిమిది అక్షరములు దాటకూడదు. 

యుగయుగాలు ఉన్న పేర్లలో చిన్నచిన్న పేర్లే తప్ప చాంతాడంత పేర్లు పెట్టమని ఎక్కడా చెప్పలేదు. పెద్ద పేర్లు పెట్టడం వలన ప్రమాదం కూడా.

ఎనిమిది అక్షరములు దాటకూడదు మగవారికి. అత్యంత ఆవశ్యకత వస్తే సూర్యుడికి నమస్కరించి మగవారికి 12 అక్షరములు దాటకుండా చూడమన్నారు.
ఆడపిల్లలకి 9 అక్షరములు దాటకూడదు. 
మరీ తీవ్రమైన మొక్కులు ఉంటే సూర్యుడికి మ్రొక్కి ఇంకొక్క రెండు అక్షరములు మాత్రమే జతచేసి పదకొండు అక్షరములు మాత్రమే పెట్టాలి. వీటికి మించి దాటితే ప్రమాదం.

బృహస్పతి, శుక్రాచార్యుల వంటి వారు పేర్లు విషయంలో బాగా నియమాలు పెట్టారు.











అన్నప్రాసన
మగపిల్లలకు 6,8,10,12 నెలలలోను,

ఆడపిల్లలకు 5,7,9,11 నెలలోను
అన్న ప్రాసనము చేయాలి.

లగ్న శుద్ధి, దశమ శుద్ది వృషభ, మిధు, కటక, కన్య, ధనుస్సు, మీనరాసుల లగ్నములలో చేయవలెను.

అశ్విని, రోహిణి, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి, అనురాధా, శ్రవణం, ధనిష్ఠ, శతబిశం రేవతి, ఉత్తరాభాద్ర మొదలగు నక్షత్రాలు మంచివి.

ముందుగా గణపతి పూజ చేసి తరువాత పరమేశ్వరుని, విష్ణుమూర్తిని సూర్య చంద్రులను అశ్తదిక్పలకులొఅను భూదేవిని పూజించవలెను.

బిడ్డ తల్లిదండ్రులు తూర్పు ముఖముగా చాప పై కుర్చున్దవలెను. శిశువును తల్లి ఒడిలో కూర్చోబెట్టు కావలెను. బంగారము, వెండి, కంచు మొదలగు ఏ పాత్రలలోనైనా పాలతో వండిన పాయసమును ఆ పాత్రలో వుంచి, పెరుగు, తేనే ఆ పాయసంలో కలుపవలెను.

తండ్రి కుడిచేతితో బంగారం ఉంగరం పట్ట్టుకుని దానితో ఆ పాత్రలతో పాయసమును శిశువునకు తినిపించవలెను ఈ విధంగా మూడుసార్లు తినిపించిన తరువాత నాల్గోసారి చేతితో తినిపించవలెను.

ఆ తరువాత తల్లి, మిగతా పెద్దలు అదే విధంగా చెయాలి. అన్నప్రాసన కార్యక్రమము ఈ విధంగా పూర్తి చేయాలి.










No comments:

Post a Comment

మీ అభిప్రాయం తెలియచేయండి.