మన హిందూ సాంప్రదాయంలో ప్రతి రోజు స్త్రీలు ఉదయం ఇళ్ళముందు ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేయమని చెప్పడానికి ఆరోగ్య కారణాలున్నాయి. శరీరంలో నడుము భాగానికి తగిన వ్యాయామం లేకపోతే అది దీర్ఘకాలంలో అనేకానేక వెన్ను సమస్యలకు దారి తీస్తుంది. రాత్రంతా పడుకున్న సమయంలో వెన్ను నిటారుగా ఉంటుంది. ఉదయం లేవగానే నడుముకు సంబంధించిన వ్యాయామం చేయడం సత్ఫలితాలనిస్తుందని గమనించారు మన పెద్దలు. ఉదయమే నడుముకు సంబంధించిన వ్యాయామంలో భాగమే స్త్రీలు ముగ్గు వేయడం. ముగ్గులు వేయాలంటే నడుమువంచాలి. చుక్కలు పెడతారు, అవి కలపడానికి అటు, ఇటు చేతులు, నడుము కదపాలి. ఈ విధంగా నడుముకు సంబంధించిన వ్యాయమం చేసినవారవుతారు. దీని కారణంగా దీర్ఘకాలంలో నడుము నొప్పులు రావు. అందుకే ఉదయమే ముగ్గులు వేయడం మన సంప్రదాయంలో భాగంగా పెట్టారు.
ఈనాటి కాలంలో ఒక్కసారి గమనిస్తే, మనమూ, మన పిల్లలు కూడా శరీరంలో అన్ని భాగాలకు తగిన వ్యాయామం అందివ్వడంలేదు. పిల్లలు పొద్దున బడికి వెళ్తే, ఏ రాత్రో ఇంటికి వస్తున్న రోజులివి. ఇంట్లో సౌకర్యాలు అన్ని ఉండడం వల్ల అసలు నడుము ఒంచి పని చేసే అవకాశం ఉండడంలేదు. ఇది దీర్ఘకాలంలో వెన్నుపూసకు సంబంధించిన రుగ్మతలను కారణం అవుతుంది. వారు ఆ కాలంలో ఆలోచించి వాడుకలోకి తెచ్చిన ఈ సంప్రదాయం ఈ కాలం వారికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? పెయింట్లు పెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నాం.
స్త్రీలే వేయాలా అంటే కాదు అనే చెప్పాలి. గర్భగుడిలో భగవంతుని వద్దకు పూజారి మాత్రమే వెళ్తాడు. దేవుడి వద్ద శుభరపరిచి, ఆయనే వేస్తారు(ఎందుకంటే గర్భ గుడిలోనికి పూజారి తప్ప వేరేవారు ప్రవేశించరు కనుక). అలాగే సూర్య భగవనుడికి సంబంధించిన పూజలు చేసే సమయంలో, ఇతర దేవతాపూజలలోనూ కొన్ని రకాల యంత్రాలను వేయవలసి ఉంటుంది. అప్పుడు కూడా ఉపాసకులే వేస్తారు.
ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి. ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి.
ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.
తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి.
యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి.
దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.
నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.
దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.
ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవరు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైదవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి. .
ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి. నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.
నుదుటన కుంకుమ బొట్టును ధరిస్తే అక్కడి నరాలు ఉత్తేజితమై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయట. దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయట. లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది.
పసుపుతో చేసిన కుంకుమ శ్రేష్టమైనది.
ప్రభావాన్ని చూపుతుంది.
రక్తాన్ని శుభ్రపరిచి శరీరకాంతిని
ఇనుమడింప జేస్తుంది.
కురుపులను, గాయాలను మాన్పుతుంది.
కుష్ఠు రోగాన్ని కూడా రూపుమాపే శక్తి పసుపుకు ఉంది.
కఫాన్ని అరికడుతుంది.
కుంకుమను అమ్మవారి ప్రసాదంగా
భావించి,
శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరి
నారాయణీ నమోస్తుతే
నుదుటన పెట్టుకుంటే సమస్త
మంగళాలు కలుగుతాయి.
పెట్టుకుంటే శాంతి చేకూరుతుంది.
నడిమి వేలితే పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది.
బొటన వేలుతో పెట్టుకుంటే పుష్ఠి
కలుగుతుంది.
చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి
కలుగుతుంది.
కర్మేంద్రియాలన మిగిలిన
అవయవాలకు ఒక్కొక్క
అధి దేవత ఉన్నారు.
పరమ ప్రమాణములైన వేదాలు
బ్రహ్మ ముఖకమలం నుండి
వెలువడ్డాయి.
అందుకే బొట్టు పెట్టుకోవడానికి
బ్రహ్మ స్థానమైన లలాటం స్థానమైంది.
కనీసం బొట్టు అయినా
పెట్టుకోవాలి.
అప్పుడు దేవుని పూజించినట్లే
అవుతుంది.
అందుకే బ్రహ్మస్థానమైన నొసటిపై
ఎరుపురంగు వ్యాప్తిలోకి వచ్చింది.
మనలోని జీవుడు జ్యోతి
స్వరూపుడు.
ఆ జీవుడు జాగ్రదావస్థలో
భ్రూమధ్యంలోని ఆజ్ఞాచక్రంలో
సంచరిస్తుంటాడు.
కుంకుమబొట్టుపైన సూర్యకాంతి
ప్రసరిస్తే, కనుబొమల మధ్య నుండే
ఇడా పింగళ నాడులు సూర్యశక్తిని
గ్రహించి శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి.
ప్రాణశక్తికి కారణమైన నరాలకు
కేంద్రస్థానము కనుబొమల
మధ్య నుండే ఆజ్ఞాచక్రము.
వల్ల ఆజ్ఞాచక్రాన్ని పూజించినట్లే
అవుతుంది.
మానసిక ప్రవృత్తులను
నశింపజేసేదే ఆజ్ఞాచక్రమని
అంన్నారు.
ఆషాఢ మాసం మనసులో మెదిలిందంటేనే గుర్తుకొచ్చేది గోరింటాకు. ఆడవాళ్ల చేతులు ఎర్రగా, అందంగా పండిపోతూ దర్శనమిస్తాయి ఈ నెల్లాళ్లు. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ మగాళ్లను సైతం ఇంట్లో పెద్దలు పోరుతూ ఉంటారు. కారణమేమంటే జ్యేష్ఠ మాసంలో మొదలైన వర్షాల ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. దీంతో కాళ్లు చేతులు రోజూ తడిచే ప్రమాదం ఉంది. దీంతో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం జరిగుతుంటాయి. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది.
గోరింటాకు పెట్టుకోవడం వల్ల తలనొప్పి, జ్వరం, ఒత్తిడి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
అందాన్ని, ఆరోగ్యాన్నీ ఇచ్చే పసుపు పారాణి స్త్రీలకు సంబంధించిన ఆచారాలు, అలవాట్లలో పసుపు, కుంకుమలకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పెళ్ళి, పేరంటం లాంటి శుభ సందర్భాల్లో కాళ్ళకు పసుపు రాసుకోవడం తప్పనిసరి. పారాణి పెట్టుకోవడం ఆనవాయితీ. పసుపు కుంకుమలను నీళ్ళతో కలిపి పారాణిగా తీర్చిదిద్దుకుంటారు మహిళలు. పసుపుకుంకుమలు శుభ సంకేతం. పసుపు కుంకుమలవల్ల ప్రత్యేకతను సంతరించుకోవడమే కాకుండా అందం, ఆరోగ్యం ఇనుమడిస్తాయి. పూజలు, వ్రతాలు లాంటి శుభ కార్యాల్లో పసుపుకుంకుమలకు చాలా ప్రాధాన్యత ఉంది. పండుగలు, పెళ్ళిళ్ళ లాంటి విశేష దినాల్లో గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడమే కాకుండా స్త్రీలు కాళ్ళకు తప్పకుండా పసుపు రాసుకుంటారు. ముఖాన చిటికెడు కుంకుమ లేకపోతే ఎంత బోసిగా, అందవిహీనంగా ఉంటుంది. పూజలు మొదలు పెళ్ళి పేరంటాల పిలుపుల వరకూ అంతా పసుపు కుంకుమలతోనే ముడిపడి ఉంటుంది. స్నానం చేసేముందు ముఖానికి, చేతులకు పసుపు పట్టించి కొంతసేపయ్యాక స్నానం చేస్తారు. దీనివల్ల శరీర ఛాయ పెరుగుతుందని, ముఖంలో మంచి వర్చస్సు వస్తుందని, అన్నిటినీ మించి ఆరోగ్యానికి మంచిది.
హిందువుల్లో అధిక శాతం మంది రావి చెట్టుకు పూజలు చేస్తారు. ఈ చెట్లయితే ఎక్కువగా దేవాలయాల్లోనే ఉంటాయి. అయితే సాధారణంగా చెట్లన్నీ పగటి పూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తే ఈ చెట్టు మాత్రం రాత్రి పూట కూడ ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది అందుకే రావి చెట్టును పూజిస్తారు.
ఎదురుగా ఉన్న వారికి రెండు చేతులతో నమస్కరిస్తే మనం వారిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామట. ఎలాగంటే రెండు చేతులను జోడించినప్పుడు చేతి వేళ్లన్నీ కలిసిపోయి ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి మన జ్ఞాపకశక్తిని పెంచుతాయట. దీంతోపాటు మెదడు పనితీరు కూడా మెరుగు పడుతుంది.
నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల పద్మాసనం భంగిమ వస్తుంది. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయట. కారమైన ఆహారం ముందు, స్వీట్లు తరువాత తినడం… భోజనం చేసినప్పుడు ముందుగా కారంగా ఉండే ఆహారం తినడం వల్ల జీర్ణాశయంలో జీర్ణక్రియకు అవసరమైన ఆమ్లాలు బాగా ఉత్పత్తి అవుతాయట. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందట. అయితే భోజనం మొదట్లోనే స్వీట్లు తింటే అది మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయనీయదు.
ఉపవాసము అనగా ఉప=స్వామి సమీపము నందు, వాసః=నివసించుట. అనగా స్వామి యొక్క గొప్పదనమును తెలుసుకొను . అంతే కాని ఆకలి వేయుచుండగా జీవుని బాధించుకొనుట కానేకాదు. మధ్య మధ్యలో క్షీరపానము చేయవలయునని అర్ధము. దీనిచే శక్తి లభించును. మరియు పాలు సులభముగా జీర్ణమగుట వలన తమో గుణమైన మత్తురాదు. ఫలములు కూడా పాల వంటివే. ఆ విధముగా ఎవరు రోజంతయును సత్సంగములతో భజనలతో గడుపుదురో శక్తి కొరకు పానీయములను మాత్రము నోటిద్వారా తీసుకొందురో వారినే ఉపవాసము చేయువారందురు . ఉపవాసం ఉండడం… హిందువుల్లో అధిక శాతం మంది వారంలో ఏదో ఒక రోజు దేవుడికి ఉపవాసం ఉంటారు కదా. ఆయుర్వేద ప్రకారం అలా ఉపవాసం ఉండడం మంచిదేనట. ఎందుకంటే ఉపవాస సమయంలో మన జీర్ణవ్యవస్థకు పూర్తిగా విశ్రాంతి లభించి శరీరంలో ఉన్న పలు విష పదార్థాలు బయటకు వెళ్లగొట్టబడతాయట. దీంతోపాటు దేహం తనకు తాను మరమ్మత్తులు చేసుకుంటుందట. ఉపవాసం ఉండడం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు రావట. ఉపవాసము లో రకాలు : సంపూర్ణ ఉపవాసము : ఈ తరహా ఉపవాసము చేసేవారు మంచి నీళ్ళు కూడా తాగరు . పానీయాలతో ఉపవాసము : ఇందులో ఘనపదార్ద ఆహారానికి బదులు మంచి నీళ్ళు , పండ్లరసాలు , టీలు , కాఫీలు , పానకము మున్నగు ద్రవరూప ఆహారం తీసుకుంటారు .
వండని పదార్దాలలో ఉపవాసము ఇందులో ఆహారానికి బదులుగా పండ్లు , పచ్చి కూరలు , వడపప్పు , చెరుకు ముక్కలు … వండని ద్రవపదార్దములతో కలిపి (సహా) తీసుకుంటారు . వండిన , ఉడికించిన పదార్దాలు తీసుకోరు . వండిన ఆహారముతో ఉపవాసము : ఈ తరహా ఉపవాసము లో ఉడికించిన కూరగాయలు , గింజలు తో సహా అన్ని పానీయాలు తీసుకుంటారు . ఉపవాస విధానాలు : ఉపవాసము ఒకరోజు నుంచి అనేక రోజులు చేయవచ్చును . ముందు తక్కువ సమయం ఉపవాసము చేసి ఆ తర్వాత ఎక్కువ రోజులు చేయడానికి ప్రయత్నించాలి . భోజనము లేదా ఆహారము లో కొన్ని పదార్ధాలను మినహాయించుకొని ఉపవాసం చేయుట . రోజులో ఒక పూట ఉపవాసము , ఒక రోజు అంతా ఉపవాసము చేయుట , వారాంతం ఉపవాసాలు … వారానికి ఏదో ఒకరోజు ఉపవాసము చేయుట-క్రమము తప్పకుండా చేయుట , పండగ , పుణ్య . పవిత్ర దినాలలో ఉపవాసము చేయుట – ఇది ఒక క్రమ (regular) పద్దతి లో ఉండదు , ఉపయోగాలు : లంకణం పరమౌషధం కాబట్టి …మన జీర్నశాయానికి కొంచెం విశ్రాంతి ఇవ్వడం ద్వారా అది మరింత చక్కగా పనిచేయడానికి దోహదపడం.. ఉపవాస కాలము లో శరీరము స్వస్థత పొందడం ప్రారంభమవుతుంది , జీర్ణ వ్యవస్థ , జీర్ణక్రియ మెరుగు పడుటుంది . , రోగనిరోధక వ్యవస్థ ప్రచ్చన్నమవుతుంది.
సమస్త పూజాదికాలు నిర్వహించే టప్పుడు, దానాలు,ధర్మాలు చేసే సమయాన భార్య, భర్త ఎడమవైపున ఉండాలి.
ఆడవారు గాజులు ధరించడం వెనుక… పురాతన కాలంలో కేవలం మగవారే బయటికి వెళ్లి శారీరక శ్రమ చేసేవారు. దీంతో వారు ఆరోగ్యంగా ఉండేవారు. అయితే మహిళలు ఎప్పుడూ ఇంటి పట్టునే ఉండి తక్కువగా శ్రమిస్తారు కాబట్టి వారికి గాజులను ధరింపజేసే వారు. దీంతో ఆ గాజుల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట. గాజులు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండడం వల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుందట. అంతే కాకుండా ఆడ వారి శరీరం నుంచి విడుదలయ్యే నెగెటివ్ శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా గాజులను ధరింపజేసే వారు.
ముక్కుకి ఎడమ వైపున చంద్ర నాడి ఉంటుంది.కనుక ముక్కుకు ఎడమ వైపున అర్థ చంద్రాకారంలోని బేసరి ధరించాలి. కుడివైపు సూర్యనాడి ఉంటుంది. కాబట్టి కుడి వైపున మండలాకారమైన ఒంటి రాయి బేసరి ధరించాలని శాస్త్రోక్తం. మధ్యలో ముక్కెర ధరించాలి. ఇది సాధారణంగా ముత్యం లేదా కెంపు ని బంగారం తో చుట్టించి ధరిస్తారు. ముక్కుకి ఎడమవైపున ధరించే ముక్కు పుడక లేదా ముక్కు బేసరి వల్ల ఆడవారికి గర్భకోశ సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి. పురుటి నొప్పులు ఎక్కువగా కలుగకుండానే సుఖప్రసవం అవుతుంది. కన్ను, చెవి కి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయి. చెవిపోటు, చెవుడు వంటివి కలుగ కుండా ముక్కుపుడక కాపాడుతుంది. శ్వాస సంబంధమైన వ్యాధులు కలుగవు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ మెరుగు పడుతుంది .
పిల్లలకు చెవులు కుట్టించడం:-
హిందూ సాంప్రదాయంలో పెళ్లయిన మహిళలు కాలికి మెట్టెలను ధరిస్తారు. ఇలా ధరించడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి వారి గుండె నుంచి గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుందట. దీంతో వారి రుతు క్రమం సరిగ్గా ఉంటుందట. అయితే వెండి మెట్టెలు ధరిస్తే ప్రకృతిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వారి శరీరంలోకి ప్రవేశిస్తుందట. వివాహిత స్త్రీలు కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవడం ఆచారం. వాడుకలో 'మెట్టెలు'గా ఉన్న ఈ పదం నిజానికి 'మట్టెలు'. కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువుపట్టు వంటిది. దాని నుంచి విద్యుత్తు ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదు. అలా తగలకుండా ఉండటానికే మెట్టెలు ధరించే సంప్రదాయం ఏర్పడిందని పండితులు అంటారు. ఇలా అనుకోవడానికి కారణం ఓ పురాణగథ. దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానిస్తాడు. తన భర్తకు జరిగిన అవమానాన్ని చూసి కోపోద్రిక్తురాలైన దాక్షాయణి, తన కాలివేలిని భూమిపై రాసి నిప్పు పుట్టించి, అందులో తాను దహనమయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. దీనిని అనుసరించే పై నమ్మకం ఏర్పడింది. అందుకే వివాహిత స్త్రీలు మెట్టెలు పెట్టుకునే ఆచారం వచ్చింది.