30 October 2016

బాత్‌రూమ్‌ - లావేట్రీ వాస్తు

బాత్‌రూమ్‌ - లావేట్రీ వాస్తు

 1. గతంలో స్నానాల గది లేవట్రీలను విడివిడిగా నిర్మించుకోవడం జరిగేది. ప్రస్తుత కాలంలో ఈ రెంటినీ కల్పి నిర్మించడమే అధిక శాతం జరుగుతోంది. సాధ్యమైనంత మేర బాత్‌రూమ్‌, లావెట్రీలు మరీ ఇరుకుగా ఉండకుండా చూసుకోవాలి. వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలి.












 2. బాత్‌రూమ్‌, లేవెట్రీలు ఆగ్నేయం, నైఋతీలలో నిర్మించుకోవడం శ్రేష్ఠం. వాయువ్యంలో కూడా బాత్‌రూమ్‌, లేవెట్రీలను నిర్మించుకోవచ్చు. ఎట్టి పరిస్థితులలో ఇంటికి ఈశాన్య దిశలో బాత్‌రూమ్‌ లావెట్రీలు నిర్మించడం తగదు.
3. బయటవైపున బాత్‌రూమ్‌లు లేవెట్రీలు ఏర్పాటు చేసుకునే సమయంలో ఇవి ఉత్తరం, తూర్పు గోడల్ని తాకకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి. పడమర, దక్షిణ గోడలకు ఆనించి బాత్‌రూమ్‌లు ఏర్పాటు చేసుకోవడం చేయవచ్చు.

 4. బాత్‌రూమ్‌లో ఎగ్జాస్ట్‌ ఫ్యాన్స్‌ ఏర్పాటు చేసుకోవడం మంచి పద్ధతి. వెంటిలేటర్స్‌ ఉన్నా ఎగ్జాస్ట్‌లు బాగా పనిచేసి, బాత్‌రూమ్‌ లేవెట్రీలను దుర్వాసన రహితంగా ఉంచగుల్గుతాయి.

 5. బాత్‌రూమ్‌ లేవెట్రీల విషయంలో వాస్తు నియమాలు పాటించకపోతే, ఆర్ధికంగా ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తప్పవని వాస్తు చెెబుతుంది.

 6. దక్షి నైఋతి, పడమర నైఋతి బాత్‌రూమ్‌ లేవెట్రీల నిర్మాణానికి నెంబర్‌వన్‌ ప్లేస్‌. ఇక ఉత్తర వాయువ్యం, పడమర వాయువ్యంలు కూడా బాత్‌రూమ్‌ నిర్మాణానికి సెకండ్‌ బెస్ట్‌గా భావించాలి..










జాతకం ప్రకారం పిల్లలకు పేర్లు పెట్టటానికి అక్షరాలు

పిల్లలకు పేర్లు నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టటానికి అక్షరాలు జన్మ నక్షత్రాల ఆధారంగా పేర్లను నిర్ణయించడం జనన సమయంలో ఏ నక్షత్రం వున్నదో, ఆ నక్షత్రంలో ఎన్నో పాదం నడుస్తున్నదో చూసి ఆ పాదానికి సూచించిన సంకేతాక్షరం ముందు వచ్చే విధంగా చిన్నారు పేర్లను నిర్ణయించడం శుభప్రదం.







 అశ్విని - చూ - చే- చో - ల

 భరణి - లి - లూ - లే - లో

 కృత్తిక - ఆ - ఈ- ఊ - ఏ

 రోహిణి - ఓ - వా - వీ - వూ

 మృగశిర - వే - వో - కా - కి

 ఆరుద్ర - కూ - ఖం - జ్ఞా- చ్చా

 పునర్వసు - కే - కో - హా - హీ

 పుష్యమి - హూ - పే - హో- డ


 ఆశ్లేష - డి - డు - డె - డో

 మఖ - మా - మీ - మూ - మే

 పుబ్బ - మో - టా - టీ - టూ

 ఉత్తర - టే - టో - పా - పీ

 హస్త - పూ - ష - ణా - ఠా

 చిత్త - పే - పో - రా - రీ

 స్వాతి రూ రే - రో - త

 విశాఖ - తీ - తూ - తే - తో

 అనూరాధా - నొ - నీ - నూ - నే

 జ్యేష్ఠ - నో - యా - యీ - యూ

 మూల - యే - యో - బా - బి

 పూర్వాషాఢ - బూ - ధా - భా - ధా

 ఉత్తరాషాఢ - బే - బో - జా - జీ

 శ్రవణం - జూ - జే - జో - ఖా

 ధనిష్ట - గా- గీ - గూ - గే

 శతభిషం - గో - సా - సీ - సూ

 పూర్వాభాద్ర - సే - సో దా - దీ

 ఉత్తరాభాద్ర - దు - శ్యం - ఝూ - థా

 రేవతి - దే - దో - చా - చీ.



  మగ పిల్లల పేర్లు

 అంకుర్, అంజనానంద, అంజన్, అంజన్న, అంజయ్య, అక్షయ్, అక్షిత్, అచ్చిబాబు, అచ్చిదానంద, అచ్యుతానంద, అజయ్, అజిత్, అజీజ్, అతులానంద, అతుల్, అద్వైత, అనంతమూర్తి, అనంతానంద, అనంత్, అనీజ్, అనీల్, అనీష్, అనుభవ్, అన్నమయ్య, అన్వర్, అప్పలకొండ, అప్పారావ్, అబ్దుల్, అభిమన్యు, అభిరాం, అమరేంద్ర, అమర్, అమర్నాద్, అమితాబ్, అమితోష్, అమిత్, అమీర్, అమృత్, అయ్యప్ప, అరవింద్, అరుణానంద, అర్చితానంద, అర్జున్, అలాన్, అలెక్స్, అవధూత్, అవనీంద్ర, అవినాష్, అశోక్, అహీంద్ర, ఆకాష్ ,








 ఆత్మానంద, ఆత్రష్, ఆదశ్, ఆదిత్య, ఆదిత్యమూర్తి, ఆదినారాయణ, ఆదిమూర్తి, ఆనందమూర్తి, ఆనందసాగర్, ఆనంద్, ఆరుద్ర , ఆలోక్, ఆసిష్.







ఇంతియాజ్, ఇందిరారాజు, ఇందివర్, ఇందీవరానంద్, ఇందీవరాశ్యాం, ఇందుమిత్ర, ఇందుమూర్తి, ఇందుమౌళి, ఇందురమణ, ఇందువదన్, ఇందుశేఖర్, ఇంద్, ఇంద్రజిత్, ఇంద్రదాస్, ఇంద్రరూప్, ఇంద్రసేన్, ఇంద్రా, ఇంద్రేశ్వర్, ఇంద్రేష్, ఇక్బాల్, ఇక్షుధ్వన్, ఇజ్యుడు, ఇద్రిస్, ఇనయన్, ఇనుడు, ఇబ్రహీం, ఇభ్యుడు, ఇర్ఫాన్, ఇష్వంత్, ఇస్మాయిల్,







ఈశమిత్ర, ఈశ్వరయ్య, ఈశ్వరేశ్వర్, ఈశ్వరరావు, ఈశ్వరనాధ్, ఈశ్వరానంద్, ఈశ్వరచంద్ర, ఈశాసన్, ఈశ్వర ప్రసాద్, ఈశ్వరన్, ఈశ్వరదత్త, ఈసోఫలి, ఈశ్వర్, ఈశుడు, ఈమాన్.









ఉదయరవి, ఉత్తంకుమార్, ఉజ్వల్, ఉదయ్, ఉమాచంద్ర, ఉమేష్, ఉత్కంఠ్, ఉభయనాధ్ , ఉదయభిరాం, ఉదయాచలం, ఉదయసూరి, ఉమేష్, ఉమామహేశ్వర, ఉమాపతి, ఉషాకిరణ్, ఉపేందర, ఉమాచంద్ర, ఉత్తం, ఉదయకిరణ్, ఉదయశేఖర్, ఉరన్, ఉత్తేజ్, ఉమాదత్తు, ఉభయనాధ్, ఉదయతేజ, ఉదయకేసరి, ఉపకార్, ఉమాపతి, ఉషాకిరణ్, ఉమాకాంత్, ఉదయశీల్.









 ఎల్లయ్య, ఎవర్ టోన్, ఎల్లన, ఎమర్సన్, ఎడ్గార్, ఎల్డన్, ఎకార్ణవ్, ఎల్విస్, ఎరిక్, ఎర్రబాబు, ఎవాన్స్, ఎడ్విన్, ఎతిరాజ్, ఎస్మోనద్, ఎల్సన్, ఎగ్‌బర్టు, ఎలియట్, ఎల్లోరా, ఎఱ్రన్న, ఏంటోని, ఏకదంతేశ్వర్, ఏకదక్షు, ఏకదేవ్, ఏకపింగళ్, ఏకముఖ్, ఏకరాజ్, ఏకలవ్య, ఏకలింగం, ఏకవీరచంద్ర, ఏకాంబరం, ఏకాంబరమూర్తి, ఏకేంద్ర, ఏకేశ్వర్, ఏడుకొండలు, ఏలియా, ఏలేశ్వర్, ఏల్లియాస్, ఏశుమలై, ఏసు.








 ఓ ఓం రాజ్ , ఓంకారయ్య, ఓంకారేశ్వర్, ఓంకార్, ఓంకిరణ్, ఓంనమశ్శివాయ, ఓంపురి, ఓంప్రకాష్, ఓంప్రదీప్, ఓంశక్తిప్రసాద్, ఓంశక్తివంత్, ఓజా ఓనతెన్, ఓబులేష్, ఓబుల్‌చంద్ర, ఓబుల్‌రాం, ఓమన, ఓమర్, ఓవివల్, ఓషదీశ్.








 కనకారావు, కమలనాధ, కనకరాజు, కంచనాద్రి, కామకోటేశ్వర్, కృష్ణ, కుణాల్, కృప, కన్నప్ప, కనకాచల్, కైఫి, కాంతిశ్రీరాం, కోయిల్‌కుమార్, కోటివేల్, కేశవకుమార్, కుసుమచంద్ర, కాంతారావు, కల్యాణ్‌రాం, కాంచన్, కేతన్, కృపాకిరణ్, కరుణాకర్, కాంతి, కాశీం, కలాం, కరీం, కాశీచంద్ర, కేదార్ నాధ్, కోటినాగులు, కైలాసపతి, కాశీవిశ్వనాధ్, కాళిదాసు, కనకరత్న, కుమార్, కామేష్, కుమారస్వామి, కనకాంబర్, కేశవులు.







 గంగరాజు, గగన్‌కుమార్, గజబ్, గజానన్, గణపతి, గణేశ్, గణేశ్వరప్రసాద్, గవాస్కర్, గాంగేయన్, గాంధీ, గాటింగ్, గాబ్రియేల్, గిరీష్‌చంద్ర, గిలోరి, గుంజన్, గుండురావు, గుగోరి, గుగ్లాని, గుణశేఖర్, గుఫార్‌ఖాన్, గురుగోవింద్, గురుచరణ్, గురుప్రకాశ్, గురుమీత, గురుమూర్తి, గులిస్తాన్, గుస్తాద్, గోపాలకృష్ణ, గోపాల్, గోలావ్, గౌతమకుమార్, గౌరీనాధ్, గౌరీమానస్, గ్లెన్ కరమ్.












 చందన, చందనమిత్ర, చందనశేఖర్, చంద్రశేఖర్, చందూ, చంద్రబోసు, చంద్రమణి, చంద్రవర్ధన్, చంద్రసింహా, చక్రి, చమ్మౌళి, చరక్, చరణ్‌జిత్, చలపతి, చలమాద్రి, చలమేశ్వర్, చవనమహర్షి, చారుశీలన్, చార్లెస్, చింతయ్య, చింతాద్రి, చిత్తరంజన్, చిత్రానంద్, చిన్నరాజా, చిన్మయానంద, చిరంజీవి, చెన్నకేశవ, చేతన్, చేతన్యకృష్ణ, చైతన్యప్రభు, చైతన్యశ్రీ, చైతన్యసింధు, చౌడయ్య.










జక్కన్న, జగదీష్, జగన్, జగపతి, జగమిత్ర, జగ్గన్న, జగ్గయ్య, జగ్‌జిత్, జనార్ధన్, జమీల్, జయంత్, జయకాంత్, జయక్రిష్ణ, జయచైతన్య, జయజిత్, జయదీవ్, జయదేవరాజు, జయదేవ్, జయనాగ్, జయబాల, జయభరత్, జయమిత్ర, జయవల్లభ్, జయశేఖర్, జయసూరి, జయేంద్ర, జయేంద్రసరస్వతి, జయేష్, జలాల్, జలీల్, జస్వంత్, జహంగీర్, జహీర్, జాకబ్, జాకీ, జానకీచంద్ర, జానకీచరణ్, జానకీనాధ్, జానకీప్రసాద్, జాన్, జాబాలీనంద, జాయిల్, జార్జి, జాలన్న, జిందా, జితమొహన్, జితేంద్ర, జితేంద్రకుమార్, జిన్నీ, జీవన్, జీవరాజ్, జూలియస్, జూసబ్, జోగినాధం, జోగేంద్ర, జోగేశ్వర, జోగేష్, జోసెఫ్, జోహార్, జ్యోతిదత్తు, జ్యోతీరాం, జ్వాలానరేష్.









 టయికోస్, టాజ్‌దిన్, టామోలి, టార్టాన్, టింకూ, టిటో, టిప్యూ, టెరినర్, టెరెన్స్, టెర్రి, టైరస్, టోని, టోన్య, ట్రెవర్, ఠాగూర్.







  డాన్, డాన్‌స్టాన్, డామియన్, డారియన్, డారెల్, డార్విన్, డార్సీ, డిక్కీ, డిసెల్వా, డెంగ్, డెన్‌జెల్, డెన్నిస్, డెరిక్, డేనియల్, డేనీడిప్రీటస్, డేవిడ్, డేవిశ్, ఢిల్లే.







తంగవేల్, తంపి, తంబి, తజిం, తనోజ్, తన్వీర్, తపన్, తమ్మయ్య, తరస్వీ, తరుణ్, తస్కీర్, తాజుద్దీన్, తాతారావు, తారక ప్రభు, తారిక్, తాలిబ్, తాలీం, తాషీన్, తాహిబ్, తాహిర్, తిక్కన, తిమ్మన్న, తిమోతి, తిరుమల, తిరువెంకట్, తిరువెంగడం, తులసీదాస్, తుషార్, తేజేశ్వర్, తేజేష్, తోమన్, త్యాగరాజ్, త్యాగేంద్ర, త్యాగేష్, త్రికాల్, త్రిపురారి, త్రిమూర్తి, త్రిలోక్, త్రిలోచన, థామస్, ధాంసన్.







 దత్తుడ, దన్వంత, దయాళ్, దయాళ్‌సాహిం, దయాశేఖర్, దయాసింధు , దరోగరాయ్, దర్శన్, దలీత్, దినకరానంద్, దినేష్, దిలావన్‌ఖాన్, దిలీప్, దిలీప్‌రాజు, దిల్‌కుష్, దిల్‌రాజ్, దిల్వర్, దివ్యకిషోర్, దివ్యానంద్, దీదార్, దినకర్‌రాజు, దీనప్రకాష్, దీపకనంద, దీపక్, దీపన్, దుర్గాకల్యాణ్, దుర్గాదత్తు, దుర్గాదాసు, దుర్గామల్లు, దుర్గామల్లేశ్వర్, దుర్గేష్‌దత్తు, దీనదయాళ్, దేవవ్రత, దేవిచంద్, దేవీదాసు, దేవేబ్, దేవ్, దౌలత్, ధనకోటేశ్వర్, ధనరాజ్, ధనుంజయ్, ధరణేష్, ధర్మపాల్, ధర్మారావు, ధీమన్, ధృవ, ధ్వారకనాధ.









 నంద, నందకుమార్, నందనన్, నందనార్, నందికేశవ్, నందీష్, నందు, నకులేష్, నకుల్, నగేష్, నజాకత్, నజీం, నధీర్, నరసింహ, నరసింహమూర్తి, నరేంద్ర, నరేన్, నరేష్, నవనీత్, నవభరత్, నవాజ్, నవీన్, నవేంద్ర, నసిర్, నాంచార్, నాకిబ్, నాకేష్, నాగచంద్ర, నాగానంద్, నాగప్రసాద్, నాగవసంత్, నాగసాయి, నాగసూరి, నాగిల్, నాగేష్, నాదముని, నానర్, నాని, నారద్, నారాయణ, నిఖిలానంద, నిఖిలేషు, నిఖిల్, నిగమ్, నిగల్, నితిన్, నితేజ్, నిత్యానంద, నిరుపమానంద్, నిర్గుణ్, నిర్మలానంద్, నిర్మలేశ్వర్, నిర్మల్, నిశాంత్, నిషాంత్, నిస్సార్, నీరధ్, నీలరాంత్, నీలేక్, నీలోచన్, నీల్, నూకరాజు, నూర్, నెలిల్, నెహ్రు.








 పంకజ్, పంకజ్‌కుమార్, పకీరయ్య, పద్మనాభు, పరంజీత, పరంధామ, పరమాత్మ, పరమేశ్వర, పరశురాం, పరిమళ్, పరేష్, పవన్, పవిత్రన్, పశుపతి, పానకాలు, పాపారాయుడు, పీతాంబరం, పుఖరాజ్, పునీత్, పురుషోత్తం, పుల్లన్న, పూర్ణచంద్ర, పూలరవింద్, పెర్సి, పేటన్, ప్రకాశచంద్ర, ప్రకాష్, ప్రదీప్, ప్రపుల్, ప్రపుల్లకుమార్, ప్రమోద్, ప్రసన్న, ప్రశాంత్, ప్రసాద్, ప్రసేనన్, ప్రహ్లాద, ప్రేం, ప్రేమప్రకాష్, ఫణేంద్ర, ఫరీందర్, ఫరూక్, ఫాబియస్, ఫినోజ్, ఫిరోజ్, ఫుల్‌చంద్, ఫెలిక్స్.








 బంగారు, బంటీ, బదరి, బదరీ నారాయణ, బన్నీ, బరున్, బలరామన్, బలరామమూర్తి, బలరామయ్య, బల్వంత్, బషీర్, బస్వంత్, బహుగుణ, బాకుల్, బాదల్, బాపినీడు, బాబుసాహెబ్, బాబూలాల్, బాబ్జీ, బాలకొండ, బాలక్రిష్ణమూర్తి, బాలగంగాధర్, బాలచందర్, బాలచందిరిన్, బాలచైతన్య, బాలతిలక్, బాలనాగేంద్ర, బాలన్, బాలమురళి, బాలాప్రసాదు, బాలు, బాలేందుశేఖర్, బాలేంద్ర, బాసిల్, బిజు, బిజెయ్, బిపలాబ్, బిలాన్, బిశ్వజిత్, బిస్మిల్లా, బీరేంద్ర, బీర్జూ, బ్రహ్మయ్య, బ్రహ్మానంద, భగవాన్, భట్టారక, భపర్‌లాల్, భరత్, భల్వంత్, భవానీశంకర్, భాను, భార్గవరాం, భాస్కరరావు, భాస్కరసూరి, భాస్కర్, భువనానంద, భూపేష్, భూషణ్, భోలానాధ్.










 మంగేష్‌కర్, మంజుకుమార్, మణి, మణి ఈశ్వర్, మణిరత్నం, మదన్, మధుసూధన్, మనోజ్, మనోరంజన్, మన్మధ, మన్మోహన్, మన్సూర్, మయూర్, మల్లీనాధ్, మస్తానయ్య, మస్తాన్, మహతీనంద, మహతీస్వామీ, మహర్షి, మహాత్మా, మహీచంద్, మహేంద్ర, మహేశ్వర్, మహేష్, మాణిక్యరావు, మాధవరావు, మాధవ్, మానన్, మానవ్, మానిక్, మారన్న, మారవి, మార్కస్, మాలిక్, మాల్కోమ్, మిధిలేష్, మినాల్, మిలిందు, మిహిర్, ముకుంద్ , ముకుల్, మునీర్, మురళి, మురళీధర్, మురళీమోహన్, మురాద్, ముష్తాక్, ముస్తాఫా, మెహర్, మెహ్రూన్, మైకెల్, మొహిందర్, మోతియ, మోతీరావు, మోనిష్ మోయ్‌రా, మోహనచందు, మోహనచంద్ర, మోహన్, మోహన్‌లాల్.








 యక్షరాజ్, యతన్, యతిరాజారావు, యతిరాజ్, యతీంద్ర, యతీన్, యతీష్‌చంద్ర, యతీష్‌బాబు, యదునందన్, యదునారాయణ, యదుశేఖర్, యల్లమంద, యశస్వి, యశోదానంద, యశోధన్, యస్వంత్, యహూది, యాకుల్, యాగుష్, యాచేంద్ర, యాదగిరి, యాదయ్య, యాదవ్, యామల్, యామాతి, యాష్, యువరాజ్, యుస్తాన్, యూమిన్, యూసూఫ్, యేసుదాసు, యోగి, యోగినాధం, యోగీందర్, యోగేష్.







 రంగనాధ్, రంగరాజు, రంగరాజు, రంజన్, రఘు, రఘువీర్, రజనీష్, రజిత్, రజినీకాంత్, రజినీనాధ్ , రతీషు , రతీష్, రత్నశేఖర్, రత్నాకర్, రత్నేశ్వర్, రమణ , రమేష్, రవళి, రవి, రవికాంత్, రవికిరణ్, రవిక్రిష్ణ , రవిచంద్, రవిచంద్ర, రవితేజ్, రవినందన్, రవిప్రకాష్, రవిప్రేమ్, రవిరాజ్, రవివర్మ, రవీంద్ర, రషిత్, రసిక్, రహంతుల్లా, రహీమ్, రాంబాబు, రాంబో, రాకేష్, రాఘవేంద్ర, రాఘవ్, రాజగోపాల్, రాజన్, రాజర్షి, రాజశేఖర్, రాజారాం, రాజీవ్, రాజీవ్‌కుమార్, రాజు, రాజేంద్ర, రాజేష్, రాజేష్‌ఖన్నా, రాజ్‌కిషోర్, రాజ్‌కుమార్, రాణా, రాధాకాంత్, రాధాక్రిష్ణ, రాధామనోహర్, రాధేశ్యామ్, రాధేష్, రామక్రిష్ణ, రామచంద్, రామదాస్, రామలింగం, రామశేషు, రావ్, రాహుల్, రికి , రిఖిల్, రిత్విక్, రిషి, రిషేంద్ర, రుస్తుం, రూపక్, రూపేందర్, రూపేంద్ర, రూపేశ్వర్, రూపేష్, రెమో, రెహ్మత్, రొనాల్డ్, రోషన్, రోహన్, రోహిత్.










 లక్ష్మణదాస్, లక్ష్మణమూర్తి, లక్ష్మణ్, లక్ష్మీకాంత్, లక్ష్మీధర్, లక్ష్మీనాధ్, లక్ష్మీపుత్ర, లక్ష్మీరామ్, లతాకర్ , లలితేంద్ర, లలితేశ్, లలిత్, లల్లూరాం, లవకుమార్, లవకుమార్, లవకుశ్, లారెన్స్, లాలా, లాల్, లాహిర్, లింగం, లింగనాధ్, లింగమూర్తి, లింగరాజు, లింగేశ్వర్, లిన్, లీలానాధ్, లూధర్, లూయిస్, లోకనాధం, లోకనాధ్, లోకపతి, లోకమాన్య, లోకేశ్వర్, లోకేష్, లోకేష్‌చంద్ర, లోచన్, లోహితకుమార్, లోహిత్.










 వందన్, వంశాకుర్, వంశీక్రిష్ణ, వంశీధర్, వంశీ, వజీర్, వజ్రేశ్వర్, వత్సవ్, వరచంద్ర, వరదన్, వరదరాజ్, వరదేశ్వర్, వరుణ్, వర్ధన్, వల్లభరాం, వల్లభ్, వసంతరావ్, వసంత్, వసంత్‌కుమార్, వసుదేవన్, వాహిద్, వామన్, వారణాసి, వాలి, వాల్మీకి, వాసు, వాసుదేవ్, వికాస్, విక్కి, విక్టర్, విక్రం, విక్రాంతి, విక్రాంత్, విగ్నాన్, విఘ్నేష్,
విజయచందర్, విజయరాం, విజయరామరాజు, విజయసాయి, విజయసారధి, విజయానంద్, విజయేష్, విజయ్, విటోభా, విఠల్, విదుర్, విద్యాదేవ్, విద్యాసాగర్, వినయ్, వినాయక్, వినీత్, వినీల్‌కుమార్, వినోద్, విమలేందర్, విమల్, విలాస్, విల్సన్, విశాల్, విశ్వంత్, విశ్వతేజ, విశ్వనాధబాబు, విశ్వనాధ్, విశ్వపతి, విశ్వామిత్ర, విశ్వాస్, విశ్వేశ్వర్, విశ్వోదయ్, విష్ణు, విష్ణుకుమార్, విష్ణువికాస్, విష్ణుశ్రీ, విష్ణుశర్మ, విహారీ, వీరబాబు, వీరభద్రం, వీరరాఘవ, వీరాంజనీయం, వీరేంద్ర, వీరేశం, వీరేశలింగం, వీరేష్, వీర్, వెంకటపతి, వెంకటేశ్వర్, వెంకట్, వెంకట్రామయ్య, వెంకీ, వేణు, వేణుమాధవ్, వేమన, వైద్యనాధ్, వైభవ్, వ్యాస్.










 శంకర్, శంభు, శింభు, శక్తేశ్వర్, శత్రుంజయ్, శమీంద్ర, శరణ్, శరత్, శరత్చంద్ర, శరత్‌బాబు, శశాంక్, శశికర్, శశిచంద్ర, శశిధర్, శశివ్, శాంతిస్వరూప్, శాంభవ్, శాయిచంద్ర, శివ, శివం, శివకోటి, శివనాధ్, శివరాజన్, శివరాజ్, శివరామ్, శివశంకర్, శివాజి, శివానంద్, శివేంద్ర, శివేష్, శుభాకర్, శేఖర్, శేషగిరి, శేషాద్రి, శేషారావ్, శేషు, శైలపతి, శైలేష్, శోభన్, శ్యాంకుమార్, శ్యాంప్రసాద్, శ్యాంబాబు, శ్యామలారావు, శ్యామల్, శ్యామ్, శ్రవణకుమార్, శ్రవణ్, శ్రీకుమార్, శ్రీ శ్రీ, శ్రీకంఠం, శ్రీకాంత్, శ్రీకార్, శ్రీచంద్ర, శ్రీచరణ్, శ్రీధర్, శ్రీనివాస్, శ్రీవత్యా, శ్రీశాయి, శ్రీహరి.








 షకీల్, షణ్ముఖం, షణ్ముఖశర్మ, షరీఫ్, షహీర్, షాజహాన్, షాజిన్, షేక్‌మస్తాన్.







 సమీర్, సిద్దార్ధ, సాగర్, సందీప్, సిద్దాంత్, సిద్దు, సత్య, సౌరభ్, సంగమేశ్వర్, సంజయ్, సంజీవరావు, సంజీవ్, సంతోషకుమార్, సంతోష్, సంపత్, సచిన్, సత్యనాధ్, సత్యసాయి, సదాశివన్, సదాశివ్, సన్నీ, సమరసింహ, సర్వేశ్వర్, సలీం, సహదేవ్, సాంబమూర్తి, సాంబశివ, సాంబు, సాకేత్, సాగరకుమార్, సాయి, సాయిక్రిష్ణ, సాయిచంద్, సాయిప్రసాద్, సాయిమోహన్, సాయివిజయ్, సాయివెంకట్, సాయిసత్య, సుందర్, సుజిత్, సుదర్శన్, సుధీర్, సుధేష్, సునీల్, సుమిత్, సురేంద్ర, సులేమాన్, సుల్తాన్, స్టాలిన్, స్టీవెన్, స్వామి.



హరీష్ హితేష్, హరున్, హఫీజ్, హర్ష, హృదయ్, హరి, హృషికేష్, హమీర్, హేన్రీ, హిరణ్‌మై, హర్బన్స్, హర్డీ, హరికృష్ణ, హరీష్, హరేష్, హరీగ, హర్వే, హస్రత్, హేమంత్, హర్షవర్థన్.



 ఆడ పిల్లల పేర్లు

 అంకిత అంజన అంజనా కుమారి అంజలి అంజలీ దేవి అక్షత అక్షిణ అక్షిత అఖిల అఖిలేశ్వరి అచిరహాస అచ్చమ్మ అచ్యుత అజిత అతిరమ్య అతులిత అత్యుజ్వల అత్రి అనంత అనంత నాగిని అనంత వల్లి కుమారి అనంత హర్ష అనన్య అనల్ప అనసూయ అనామిక అనిత అనీష అనుఙ్ఞ అనుపద్య అనుపమ అనుప్రియ అనురంజని అనురక్త అనురాగ అనులేఖ అనుష్క అనూజ అనూరాధ అనూష అన్నపూర్ణ అన్మిష అన్వేష అపరంజి అపర్ణ అపూర్వ అప్సర అబిదా అబ్దిజ అభిన అభిసారిక అభీష్ట అమరకుమారి అమరాంబిక అమరేశ్వరి అమల అమిత అమృత అమృతవల్లి అమ్రేషి అరణి అరవింద అరుంధతి అరుణ అరుణిమ అర్చన అర్పణ అర్పిత అర్బుదా అలంకృత అలకా నంద అలిమేలుమంగ అలివేణి అలేఖ్య అలోత్తమ అల్తియా అల్పన అవంతి అవతరిణి అవధి అశేష అశ్విని అశ్వినీకుమారి అషిత అష్మిత అహిరేశ్వరి ఆకర్షిణి ఆకాంక్ష ఆకృతి ఆదర్శ ఆదర్శ లక్ష్మి ఆదిలక్ష్మి ఆనంద చంద్రిక ఆనందినీ ఆమని ఆరతి ఆర్తి ఆశా గీతి ఆశా జ్యోతి ఆశారాణి ఆశారేఖ ఆశాలత ఆశ్రిత ఆశ్లేషని ఆహ్లాదినీ.








 ఇంతి ఇందిర ఇందిరామణి ఇందిరావతి ఇందీవరాక్షి ఇందు ఇందుజ ఇందుబాల ఇందుమణి ఇందుమతి ఇందుమైత్రి ఇందురమణి ఇందులక్ష్మి ఇందులత ఇందులలిత ఇందులేఖ ఇందువదన ఇందువాణి ఇందుశేఖరి ఇందూరాణి ఇంద్రగమన ఇంద్రజాల ఇంద్రనీల ఇంద్రమ్మ ఇంద్రాణి ఇంద్రాయణి ఇంద్రి ఇంద్రేశ్వరి ఇనముక్త ఇనశేఖరి.








 ఈక్షిత ఈశ్వరమ్మ ఈశ్వరాంబ ఈశ్వరి ఈశ్వరీ దేవి ఈశ్వరీవదన ఈషానంద



ఉజాలా ఉజ్వల ఉజ్వలరేఖ ఉతాలిక - కెరటం ఉత్కళ ఉత్తర ఉత్పల ఉత్ప్రేక్ష ఉత్సాహిత ఉత్సాహిని ఉదయ ఉదయకుమారి ఉదయబాల ఉదయభాను ఉదయరాణి ఉదయరూప ఉదయరేఖ ఉదిత ఉద్యమ ఉద్యరంజని ఉన్నత ఉన్నతి ఉన్నిత ఉపధృతి - కిరణం ఉపమన్యు ఉపేక్ష ఉభయకుమారి ఉమాంగిని ఉమాకాంత ఉమానాయకి ఉమామహేశ్వరి ఉమారమ్య ఉమాలత ఉమాశంకరి ఉర్విజ ఉల్పియ ఉషశ్విని ఉషాబాల ఉషాభాను ఉషారాణి ఉషారోహిణి ఉషాశాలిని ఉషాశోభ ఉషాసంధ్య ఉషాసుందరి ఉషేశ్వరి ఉషోదయ ఉస్రా - మొదటి వెలుగు ఊర్మిక ఊర్మిళ ఊర్వశి ఊర్షిల ఊహ.









 ఋచిత ఋతు ఎకిష - ఒక దేవత ఎరీన ఎర్రమ్మ ఎలిలీ - అందమైన ఎల్లమ్మ ఏకదీప ఏకావళి ఏకేశ్వరి ఐరావతి ఐశ్వర్య ఐశ్వర్యారాయ్



ఓం హారిక ఓంకారమాలిన

కనకం కనకదుర్గ కనకబాల కనకరేఖ కనకవల్లి కనకాంజలి కన్నమ్మ కన్య కన్య కుమారి కన్యక కన్యకాంబ కన్యకాపరమేశ్వరి కమనీయ కమల కమలదీప కమలాక్షి కరుణ కల్పలత కల్పవల్లి కళాంజలి కళాప్రియ కళావల్లి కవిత కస్తూరి కాంచన కాంతం కాంతమ్మ కాత్యాయని కాదంబరి కామాక్షి కామిని కామేశ్వరి కారుణ్య కాళిక కాశ్వీర కిన్నెర కిరణ్మయి కిషోరి కీర్తిక కుంజల కుంతల కుందన కుమారి కుముద కుయలి కుశల కుశాలి కుసుమ కుసుమదుర్గా కృపాలత కృపాలిని కృష్ణ కుమారి కృష్ణ ప్రియ కృష్ణజ కృష్ణవేణి కేతిక కేదారేశ్వరి కేళని కేసరిరమ్య కొమిల్లా కోకిల కోమల కోమలాలత కోమలి కోవిద కౌమారి కౌసల్య ఖ్యాతి











గంగ గంగన గంగమ్మ గంగాప్రియ గంగోత్రి గంభీర గజకేసరి గజలక్ష్మి గజాల గాంధర్వి గాంధారి గాజులమ్మ గాయత్రి గాయని గిరిజ గిరిజానందిని గిరిజాబాల గిరిదుర్గ గిరిదేవి గిరీశ్వరి గిరీష - పార్వతీదేవి గీత గీతగోవిందం గీతబాల గీతమాలిక గీతాంజలి గీతామల్లిక గీతారంజని గీతాలత గీతావని గీతాశ్రీ గీతిక గుణ గుణప్రియ గుణరత్న గుణవతి గుణశీలి గుణసుందరి గుణాళి గురుకృప గురువర్దని గొంగేశ్వరి గోకర్ణ గోదాదేవి గోపబాల గోపాంబిక గోపాలరమ్య గోపాలి గోపిక గోపికానందిని గోపికారాణి గోపిచందన గోపెమ్మ గోమతి గోమతీలత గోవర్దని గోవిందమ్మ గౌతమి గౌతమిదేవి గౌరవల్లి గౌరి గౌరినాయకి గౌరిలక్ష్మి








 ఘటిక ఘనతన్వి ఘనప్రియ.

చంచల చంచిత చంటీ చండిక చండీప్రియ చందనాంజలి చందిని చంద్ర చంద్రకాంత చంద్రధార చంద్రముఖి చంద్రశేఖరి చంద్రసుధ చంద్రా చంద్రాకలి చంద్రిక చంప చంపకరత్న చంబలరాణి చకోరి చక్ర చరణి చరిత చర్చిత చాందిని చాతురి చామంతి చామరి చాముండి చాముండేశ్వరి చాయ చారుమతి చారుశీల చారుహాస చార్మి చింతన చింతాణి చింతామణి చిందేశ్వరి చిట్టి చిట్టిబాల చిత్ర చిత్రమేఖల చిత్రాంగి చిత్రావతి చినబాల చిలకమ్మ చెంచులక్ష్మి చెండేశ్వరి చెల్లమ్మ చేతన చైతన్య చైతన్యలక్ష్మి చౌడేశ్వరి ఛాయని ఛాయాదేవి ఛాయాలత.











 జగదాంబ జగదీశ్వరి జనప్రియ జమీల జమున జయ జయ కుమారి జయంతి జయంతీదేవి జయచిత్ర జయదీప జయనరసి జయపద్మ జయప్రద జయప్రియ జయభారతి జయమాల జయమ్మ జయరాణి జయలక్ష్మీ జయవర్ణ జయవర్ధిని జయవాణి జయశీల జయశ్రీ జయశ్రీచిత్ర జయసునీత జయసురేఖ జరీనా జలజ జలసుందరి జశ్వంతి జస్మిత జాగృతజ్యోతి జాగృతి జానకి జానక్య జాస్మిన్ జాహ్నవి జీవనజ్యోతి జీవిత జెహానా జైనీ జోగేశ్వరి జ్ఞానజ్యోతి జ్ఞానప్రసూన జ్ఞానాంబిక జ్ఞానేశ్వరి జ్యోతి జ్యోతిక జ్యోతిరాత్మ జ్యోతిర్లత జ్యోతిష్య జ్వాల జ్వాలరేఖ.












 ఝష్ణ ఝాన్సీ ఝాన్సీరాణి.








తనూజ తనూలత తన్మయత తన్మయి తపతి తమన్నా తమలి తరంగణి తరీక తస్వీర తానూజిని తాన్య తాపసి తారక తారకలీల తారకేశ్వరి తారా తారాజ్యోతి తారాదేవి తారాబలి తారామతి తారాయిణి తిరుమలమ్మ తిరుమలేశ్వరి తిరువనంత తిలోత్తమ తీర్ధ తులశమ్మ తులసి తులసిమోహిని తులసీబృంద తులసీలత తృప్తి తృష్ణ తేజస్విని తేజస్విని కుమారి తేజోవతి తేజ్వంతి తోరణి త్రయంబిక త్రినేత్ర త్రినేత్రిక త్రిపురసుందరి త్రిపురేశ్వరి త్రివేణి త్రివేదిక.










దమయంతి దర్పణ దర్శన దాక్షాయిణి దానమ్మ దానవతి దిగ్న దిలీప దివ్య దివ్యజ్యోతి దివ్యదిలీప దివ్యదీప దివ్యనయన దివ్యభాను దివ్యభారతి దివ్యమంజరి దివ్యమంజుల దివ్యరమ దివ్యరాణి దివ్యవందన దివ్యవదన దివ్యవాణి దివ్యసుందరి దివ్యాంజలి దివ్యానంత దిసుమతి దీనమ్మ దీనా దీప దీపకుమారి దీపజ్యోతి దీపనందిని దీపవిత్ర దీపసుందరి దీపాంజలి దీపిక దీపికామణి దీపికాముంజు దీప్తి దీమ దుర్గమ్మ దుర్గా దుర్గానందిని దుర్గాభాయి దుర్గాలీల దుర్గాశంకరి దుహిత దేదీప్య దేవయాని దేవి దేవిక దేవిబాల దేవిశ్రీ దేవీప్రియ దేవేరి ద్రౌపతి ద్విపద ధనమ్మ ధనలక్ష్మి ధన్య ధన్యసుధ ధరంధరి ధరణి ధరణిబాల ధరమిత్ర ధరిత్రి ధర్మి ధాత్రి ధారణి ధీరజ ధీరబాల ధీరసుధ ధృవతార ధృవిత ధైర్యలక్ష్మి .












నందన నందనారాయణి నందాదేవి నందిత నందిని నగ్మా నజరానా నజియ నటవసంత నటాషా నమిత నమ్రత నయన నర్మద నలంద నళిన నవత నవనీత నవమ్మ నవీన నవీనలత నవ్య నవ్యతేజ నవ్యాధర్మ నాగజమున నాగజ్యోతి నాగదుర్గ నాగప్రియ నాగమణి నాగమల్లి నాగమ్మ నాగరత్నం నాగరాణి నాగరోజా నాగలక్ష్మి నాగలింగేశ్వరి నాగవరలక్ష్మి నాగవల్లి నాగవసంత నాగశ్రీ నాగసీత నాగిని నాగేంద్రమ్మ నాగేశ్వరమ్మ నాగేశ్వరి నారమ్మ నారాయణి నాళిక నిఖిత నిఖిల నిజీమ్ నిత్య నిత్యతేజ నిమీష నిమ్మి నిమ్షిత నిరంజని నిరీక్షణ నిరుపమ నిరుపమలీల నిరూప నిరోష నిర్జల నిర్మల నిర్మిత నిర్మోహన నివేదన నివేదిత నిశాంతి నిషా నిషిత నిషిమి నీత నీతిక నీరజ నీరజాంబ నీరా నీల నీలమణీ నీలవతి నీలవేణి నీలాంబరి నీలాంబిక నీలాక్షి నీలిమ నేత్ర నేహ నైత్రిక నైవేదిత.












                పద్మ పద్మకేసరి పద్మజారాణి పద్మాదేవి పద్మానంద పద్మావతి పరమేశ్వరి పరిమళ పరీక్షిత పల్లవి పల్లవిక పల్లవికుమారి పవిత్ర పాండురంగమ్మ పాదుక పాప పాపమ్మ పాపాయమ్మ పార్వతి పావనశ్రీ పావని పుల్లమ్మ పుష్పమాల పుష్పలత పుష్పావతి పుష్య పూజా పూజిత పూనం పూర్ణ పూర్ణమ్మ పూర్ణరేఖ పూర్ణవేఖరి పూర్ణిమ పేరమ్మ పౌర్ణమి ప్రకృతి ప్రగతి ప్రజ్ఞ ప్రణతి ప్రణవ ప్రణవకుమారి ప్రతిభ ప్రతిభాకుమారి ప్రతిమ ప్రదీపిక ప్రపూర్ణ ప్రబుద్ది ప్రమీల ప్రమోదిని ప్రవళిక ప్రవీణ ప్రవీణిత ప్రశాంతి ప్రసూన ప్రసూనాంబ ప్రియంవద ప్రియదర్శిని ప్రియవందన ప్రియవర్ధని ప్రీతి ప్రీతిజంగానియ ప్రీతిజింత ప్రేమ ప్రేమకుమారి ప్రేమదేవి ప్రేమలత ఫణి ఫణిదీపిక.








బంగారమ్మ బందన బందిని బదనిక బబిత బలదేవనందిని బసంతి బసవమ్మ బానూ బాపనమ్మ బాల బాలకోటమ్మ బాలగంగ బాలత్రిపురి బాలమణి బాలమ్మ బాలరంజని బాలరత్న బాలరత్నం బాలాత్రిపుర బాలామణీ బిందు బినీత బిబూతి బీనా బృంద బైదేహి బోనిత బోస్కి బ్రమర బ్రాహ్మి బ్రితి - బలం భగవతి భగవతిమిత్ర భద్ర భద్రావతి భరణి భవాని భవానిదుర్గ భవానీకుమారి భవ్య భాగవతి భాగ్య భాగ్యమ్మ భాగ్యలక్ష్మి భానుమతి భామా భామామణి భామిని భారతి భార్గవి భావన భావనకుమారి భావనరత్న భావనలత భావి భువనమోహన భువనేశ్వరి భైరవి భ్రమరగీత.












 మంగ మంగతాయారు మంజరి మంజీర మంజుబాయి మంజుల మంజులత మంజూష మందిర మనోజ్ఞ మమత మరాళి మహంతి మహిమ మాణిక్యం మాధురి మాధుర్య మానస మాల్యద మిధుల ముక్త ముగ్ద మృదుల మేఖల మేఘన మేఘల మైత్రి మైత్రేయ మైన మోహిత మౌక్తిక మౌనిష మౌష్మి.











       యక్షణ యక్షిణి యమున యల్లమ్మ యవ్వని యశస్విని యశోద యశోధర యశ్వంత యహ్వి - స్వర్గం యాగ్నిక యాఘ్న యాదగిరమ్మ యాదమ్మ యామిని యామినీపుష్ప యాషిత - కీర్తి యువతి యువరాణి యోగకుసుమ యోగప్రియ యోగమల్లిక యోగలక్ష్మి యోగవల్లి యోగానందిత యోగిత యోగిని యోగేశ్వరి యౌష - యువతి.









రంగమణి రంగమ్మ రంజని రంభ రక్షా రచిత రజనీప్రియ రజనీవందన రజిత రజిని రతి రతీకుమారి రత్న రత్నాంబ రమ రమణి రమాదేవి రమాప్రభ రమ్య రమ్యకృష్ణ రమ్యరస రాగిణి రాఘవమ్మ రాజకుమారి రాజమ్మ రాజశ్రీ రాజ్యం రాజ్యలక్ష్మి రాణి రాధ రాధాదేవి రాధిక రామప్రియ రామరత్న రామలక్ష్మి రామలింగేశ్వరి రామిని రాములమ్మ రామేశ్వరి రావమ్మ రాశి రిచా రిత్యా రీనా రూప రూపచిత్ర రూపవతి రూపిని రేఖ రేణుక రేవతి రేష్మ రోజా రోజామణి రోజారమణి రోషి రోషిణి రోహిణి.






 లకుమా లకుమాదేవి లక్కీ లక్య లక్ష్మణకుమారి లక్ష్మి లక్ష్మికళ లక్ష్మిచంద్ర లక్ష్మిదేవమ్మ లక్ష్మిదేవి లక్ష్మినరసమ్మ లక్ష్మిరమ్య లక్ష్మీకనక లక్ష్మీకాంత లక్ష్మీకాంతి లక్ష్మీదీప లక్ష్మీదుర్గ లక్ష్మీరంజని లక్ష్మీవాణి లక్ష్మీహేమ లక్ష్య లత లతంగి లతాంగి లతిక లలిత లలితమ్మ లలితాంజలి లలితాంబ లలితాంబిక లలితాదేవి లలితారమ లలితాసాగరి లాచిన లాలస లాలిత్య లావణ్య లావణ్యజ్యోతి లిఖిత లిల్లీ లీనా లీలమ్మ లీలా లీలాకుమారి లీలాగోవింద లీలాజ్యోతి లీలాపద్మజ లీలాబృంద లీలాభాస్కర లీలామంగళ లీలామల్లిక లీలారమ లీలావని లీలాసరస్వతి లీలాసుధ లీస లేఖ లైలా లోకవందిత లోకేశ్వరి లోచన లోచని లోలకి లోలిత.







 వందన వత్సల వనకమల వనజ వనపద్మ వనమాలి వనరఖ వరమ్మ వరలక్ష్మి వరాలు వల్లభవసంత వసుధ వసుమతి వహీదా వాసంతి వాసవి వాసవిదత్త వాహిని విఘ్నేశ్వరి విజయ విజయదుర్గ విజయలక్ష్మి విజయవర్ధని విజయశాంతి విజయశ్రీ విజయసాగరి విజయేశ్వరి విద్య విద్యాభారతి విద్యావతి విద్యావాహిని విద్యావిజయ వినయ వినీల వినూత్న వినోదిని విన్ని విభూతి విమల విమ్మి వివేక విశాలి విష్ణుప్రియ విహారి వీణా వెంకటపద్మ వెంకటమ్మ వెన్నెల వేదవతి వైజయంతి వైదేహి వైవిజయ వైశాలి వైష్ణవి.











 శంకరమ్మ శంకరి శకుంతల శతావరి శబరి శమంత శరణ్య శర్వాణి శశి శశిప్రభ శశిరేఖ శశివదన శాంతమ్మ శాంతి శాంతిప్రియ శారద శార్వాణి శాలిని శిరీష శివప్రియ శివలీల శీల శుభనయన శుష్మ శృతి శేషాంబ శైలజ శోధన శోభ శోభన శోభిత శ్యామ శ్రద్ధ శ్రావణి శ్రావ్య శ్రీకన్య శ్రీజ శ్రీనిథి శ్రీలత శ్రీలేఖ శ్రీవల్లి శ్రీవాణి శ్రీవాసవి శ్రీహిత శ్వేత.










 షర్మిల షామిలి షాలిని.


 సత్యకమల సత్యదీప సత్యమణి సత్యముత్తు సత్యవతి సత్యసుందరి సత్యాంబకి సరోజనమ్మ సరోజని సాయిసుధ సాహితి సింగారి సింధు సింధూర సింధూరి సినీల సిమ్రాన్ సీత సీతమ్మ సీతామహాలక్ష్మి సీతారావమ్మ సీతాలత సీతాలు సీమ సుజాత సుజిత సుధ సునీత సుమతి సుమతీనంద సుమిత్ర సూరమ్మ సోని సోమ సోమలత సౌజన్య .



హంస హంసగామి హంసవాహిని హరిత హర్షి హర్షిణి హర్షిత హానిక హారతి హారిక హాస హాసిక హాసిని హిందూజ హిత హిమ హిమజ హిమజ్వాల హిమద హిమబాల హిమబిందు హిమవతి హృదయ.




















26 October 2016

కుజ దోషములో పంచ బావములు, కుజగ్ర దోష శాంతి విధానాలు.

కుజ దోషము :-
 కుజుడు ఉష్ణ ప్రకృతి గల గ్రహము. దీనిని పాప గ్రహముగా చెప్పబడును.


వివాహము మరియు వైవాహిక జీవితములో కుజుని యొక్క అశుభ ప్రభావము అధికముగా కనిపించును.

 కుజ దోషము కలవారిని మాంగళీకునిగా చెప్పబడును. ఈ గ్రహ దోషము కారణముగా అనేక మంది స్త్రీ పురుషులు జీవితాంతము అవివాహితులుగా వుండిపోయెదరు. ఈ దోషము వలన గల భయమును తొలగించుటుకొనుటకు దీని గురించి పూర్తిగా తెలుసుకొనుట అవసరము.



 జ్యోతిష్య శాస్త్ర ప్రకారము కుజ దోషము  జాతకం లో కుజుని లగ్నము, ద్వితీయ, చతుర్ధ, సప్తమ, అష్టమ మరియు ద్వాదశ బావములో దోష పూరితముగా చెప్పబడును. ఈ బావములలో ఉపస్థితిలో వున్న కుజుడు వైవాహిక జీవితము కొరకు అనిష్టాకారకముగా చెప్పబడును.











జన్మ కుండలిలో ఈ పంచ బావములు కుజునితో పాటు ఎంత క్రూరమైన గ్రహములుగా కూర్చొని వున్నవో కుజుడు అంతే దోషపూరితముగా వుండును. అనగా రెండ బావము క్రూరమువా వుండిన రెండింతలు, నాల్గవ బావము క్రూరముగా వుండిన నాల్గింతలు. కుజుని పాప ప్రబావములు వేరు వేరు విధములుగా ఐదు బావములలో దృష్టి కలిగి వుండును.




 లగ్న బావములో కుజుడు (Mangal in Ascendant) లగ్న బావము నుండి వ్యక్తి యొక్క శరీరము, ఆరోగ్యము, వ్యక్తిత్వము యొక్క విచారణ చేయబడును. లగ్న బావములో కుజుడు వున్న ఎడల వ్యక్తి క్రోదము మరియు ఉగ్ర స్వబావము కలవారై వుండును. ఈ కుజుడు వ్యక్తిని మొండిగాను మరియు ఎప్పుడూ గొడవపడే స్వబావము గలవాడుగా చేయును.





 ఈ బావములో ఉపస్థితిలో వున్న కుజుని దృష్టి చతుర్ధ బావ దృష్టి సుఖ స్థానములో వుండిన ఎడల గృహస్థ సుఖములలో లోపము ఏర్పడగలదు.

 సప్తమ దృష్టి జీవిత బావస్వామి స్థానములో వుండిన ఎడల భార్యా భర్తల మద్య విరోధములు మరియు దూరము కలుగుచుండును.


 అష్టమ బావముపై కుజుని యొక్క పూర్ణ దృష్టి జీవిత బాగస్వామికి సంఘటములను కలిగించును. ద్వితీయ బావములో కుజుడు (Mangal in Second Bhava) బావదీపిక నామక గ్రహములో ద్వితీయ బావస్థ కుజుడు కూడా కుజదోషము వలన పీడించబడగలడు. ఈ బావము కుటంబము మరియు ధనమునకు స్థానముగా వుండును. ఈ కుజుడు కుటుంబము మరియు బందుమిత్రులతో విరోధములను శృష్టించును. కుటుంబములో కలతలను ఏర్పరచి దాని కారణముగా బార్యా భర్తలలో అశాంతిని కలిగించును. ఈ బావము యొక్క కుజుడు పంచమ బావము, అష్టమ బావము మరియు నవమ బావమును చూస్తున్నాడు. కుజుని ఈ బావములలో దృష్టి కారణముగా సంతాన పక్షములో విపరీత ప్రభావము కలుగును. భాగ్యము యొక్క ఫలితములు బలహీన పడును.






 చతుర్ధ బావములో కుజుడు (Mangal in Fourth Bhava) చతుర్ధ స్థానములో కూర్చొని వున్న కుజుడు సప్తమ, దశమ మరియు ఏకాదశ బావములను చూస్తున్నాడు. ఈ కుజుడు మంచి స్థాయి, సంపత్తిని ప్రదానించును కాని గృహస్థ జీవితమును కష్టమయముగా చేయును. కుజుని యొక్క జీవిత బాగస్వామి యొక్క గృహముపై వుండిన వైచారికమైన మతబేదములు కలిగి వుండెదరు. మతబేదములు మరియు ఇరువురి మద్య అశాంతి కలిగి వుండుట వలన జీవిత బాగస్వామి యొక్క సుఖములలో లోపము ఏర్పడును. కుజ దోషము కారణముగా బార్య భర్తల మద్య వొడిదుడుకులు పెరిగి దూరముగా వుండవలసి వచ్చును. ఈ కుజుడు జీవిత బాగస్వామికి సమస్యలను కలిగించడు.







 సప్తమ బావములో కుజుడు (Mangal in Seventh Bhava) సప్తమ బావములో జీవిత బాగస్వామి యొక్క గృహముగా వుండును. బావములో కూర్చొని వున్న కుజుడు వైవాహిక జీవితము కొరకు అధికముగా దోషపూరితముగా వుండును. ఈ బావములో కుజ దోషము వుండుట కారణముగా జీవిత బాగస్వామి యొక్క ఆరోగ్యములో వొడిదుడుకులు వుండగలవు. జీవిత బాగస్వామి ఉగ్రముగాను మరియు క్రోదస్వబావము కలవారై వుండును.


 ఈ కుజుడు లగ్న స్థానము, ధన స్థానము మరియు కర్మ స్థానముపై పూర్ణ దృష్టిని ప్రదానించును. కుజుని యొక్క దృష్టి కారణముగా ఆర్ధిక సంఘటము, వర్తక వ్యాపారములలో హాని లేదా దుర్గటనలు కలుగుట అవకాశములు వుండును. ఈ కుజ గ్రహము చరిత్రపై కూడా కలంకములను తీసురావచ్చును. సంతానము యొక్క సందర్బములో కూడా ఇది కష్టకారిగా వుండును. కుజుని అశుభ ప్రభావము కారణముగా బార్యా భర్తల మద్య వడిదుడుకులు ఏర్పడి వారు ఇరువురు విడిపోయే అవకాశములు ఏర్పడవచ్చును. కుండలిలో యది కుజుడు ఈ బావములలో కుజదోషము కారణముగా పీడించబడి వున్న ఎడల దీనికి ఉపాయములను చేయవలసి వుండును.










 అష్టమ బావములో కుజుడు (Mangal in Eigth house) అష్టమ బావము దు:ఖము, సంఘటము, ఆయువు యొక్క గృహముగా చెప్పబడుతున్నది. ఈ బావములో కుజుడు వైవాహిక జీవితములోని సుఖములను నాశనము చేయును. అష్టమస్థ కుజుడు మానసిక పీడ మరియు కష్టములను ప్రదానించువాడగును. జీవిత బాగస్వామి యొక్క సుఖములో బాదలను కలిగించును. ధన బావములో దీని దృష్టి వుండుట కారణముగా ధన హాని మరియు ఆర్ధిక కష్టము కలుగును. రోగముల కారణముగా దాంపత్య సుఖము బాదించబడును. జ్యోతిష్య విధానమునకు అనుసారముగా ఈ బావములో కూర్చొని వున్న అమంగళ కారుడైన కుజుడు శుభగ్రహములను కూడా శుభకరమును ప్రదానించుటలో సమస్యలను కలిగించును.


 ఈ బావములో కుజుడు యది వృషభము, కన్యా లేదా మఖర రాశిలో వుండిన ఎడల దీని అశుభత కొంతవరకు తగ్గవచ్చును. మఖర రాశిలో కుజుడు వుండిన ఎడల సంతాన సంబందమైన కష్టములు కలుగును.



 ద్వాదశ బావములో కుజుడు (Mangal in Twelth Bhava) ద్వాదశ బావము కుండలిలో సుఖము, బోగము, నిద్రా, యాత్ర మరియు వ్యయమును నిర్దేశించును. ఈ బావములలో కుజుని ఉపస్థితిలో వుండిన ఎడల కుజ దోషము కలుగును. ఈ దోషము కారణముగా బార్యా భర్తల మద్య గల సంబందములలో వొడిదుడుకులు ఏర్పడగలవు. వ్యక్తిలో కామ ప్రధమైన కోరికలు అధికముగా వుండును. యది గ్రహముల శుభ ప్రభావము లేని ఎడల వ్యక్తి నడవడికలో దోషము కూడా కలుగవచ్చును. ఆవేశలోకి వచ్చి జీవిత బాగస్వామికి నష్టములను కూడా కలిగించవచ్చును. వీరిలో గుప్త రోగములు మరియు రక్త సంబంద దోషములకు అవకాశములు వుండును.














 కుజ, పుత్ర దోషాలు :-

 ఏలినాటి శని ప్రభావం తరహాలో కుజ దోషమంటేనే అందరూ భయపడటం సహజం. కానీ కుజదోషం ఉన్న జాతకులు వివాహం చేసుకునే సమయంలో జ్యోతిష్య నిపుణుల సూచనలు పాటిస్తే సరిపోతుంది. సాధారణంగా కుజ దోషమంటే కుజుని ఆధిపత్యంతో కలిగే దోషం. కుజునికి అంగారకుడు అనే మరో పేరున్న విషయం తెలిసిందే. ఈ దోషం ఉన్న జాతకులు వివాహం చేసుకునే సమయంలో, చేసుకోబోయే వారి జాతక ఫలితాలపై ఆధార పడాల్సి ఉంటుంది.

ఒకవేళ కుజదోష జాతకులిరువురు వివాహం చేసుకోదలచుకుంటే జాతకాల్లోని కుజుని దశాకాలం, ఆధిపత్యం ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఒకే విధమైన ఆధిపత్యంతో గల కుజదోష జాతకులు వివాహం చేసుకోవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.


జాతకంలో కుజుడు 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజ దోషం తప్పక ఉన్నట్టే. పై స్థానాల్లో కుజుని ఆధిపత్యం మాత్రమే కాకుండా సూర్య, గురు, రాహు, కేతువులతో పాటు కుజుడు ఆధిపత్యం వహించినట్లయితే.., లేదంటే ఆ గ్రహాల దృష్టి కుజునిపై పడే విధంగా ఉంటే కుజదోషానికి పరిహారాలున్నాయి.












 కుజదోషం ఉన్న జాతకులు వివాహం చేసుకోవాలంటే:-

 1. జాతకం ప్రకారం స్త్రీ, పురుషులిద్దరికి ఒకే విధమైన పూర్ణవంతమైన దోషాన్ని కలిగి ఉండాలి.

 2. స్త్రీ , పురుషులకు ఎటువంటి పూర్ణవంతమైన దోషం ఉండకూడదు.

 3.పై రెండు లేని పక్షంలో ఇద్దరికి కుజదోషపరిహారం చేసుకునే మార్గమైనా ఉండితీరాలి. ఇంకా కుజుని దశ ఇద్దరికి ముగించే స్థాయిలోనైనా కుజదోషస్థులు వివాహం చేసుకోవచ్చు.


  పుత్ర దోషం - పుత్ర సంతానం ఉందా లేదన్న విషయాన్ని జాతకపరంగా తెలుసుకోవాలంటే పురుషుని జాతకాన్నిబట్టి చూడటం పరిపాటి.

ప్రతి జాతకునికి ఐదోస్థానం పుత్ర స్థానంగా పరిగణించబడుతుంది. పుత్రకారకునిగా బుధుడు ఆధిపత్యం వహిస్తాడు. గురువు శుభస్థాన ఆధిపత్యం వహిస్తే జాతకులకు పుత్రప్రాప్తి తప్పకుండా లభిస్తుంది.


ఐదో స్థానంలో రాహు- కేతులుంటే పుత్రదోషం ఉంటుంది. దీనికే "నాగదోషమని" పేరు. ఈ దోషం గల జాతకులు తప్పకుండా నాగదోష పరిహారం చేయాలి. అలా చేసిన పక్షంలో నాగదోషం తొలగిపోవటంతో పాటు పుత్రప్రాప్తి లభిస్తుంది.






కుజదోష పరిహారాలు :-

1. పుత్ర దోషం కలవారు నాగ విగ్రహ సమేతంగా గల వేపచెట్టు, మర్రి చెట్టులను 41 రోజులు ప్రదక్షిణ చేయాలి. 41 వరోజు అర్చన చేయాలి.

 2. వెండితో నాగ ప్రతిమను తయారు చేసి ఒక మండలం (41రోజులు) పూజచేసి శివాలయాల్లో సమర్పించటమో లేక హుండీలలో వేయటమో చేయాలి.

 3. రామేశ్వరం, శ్రీ కాళహస్తి లాంటి పుణ్యక్షేత్రాలలో నాగదోష నివారణకు పూజలు చేసి పరమేశ్వరుని ధ్యానించటం ద్వారా పుత్రప్రాప్తి లభించటంతో పాటు పుత్రదోషం తొలగిపోతుంది.

  కుజ దోషము-పరిహారములు:-

ఎరుపుకి, ఇనుములోని శక్తికి అధిపతి అయిన కుజుడు గ్రహ రాజ్యంలో సైన్యాధ్యక్షుడు అని జ్యోతిషంలో శాస్త్రజ్ఞులు చెప్పారు.వినయంగా నమస్కరించే వారికి కోరికలు తీర్చే కల్ప వృక్షం కుజుడు.

మంగళవారము కుజునకు చెందినది.ఎరుపు వర్ణము కలిగి, ఎరుపు వస్త్రములు ధరించి, శంఖంలాంటి మెడ, సుందరమైన పాదాలు, పొట్టేలు వాహనము, చేతిలో శులాయుధం కల మంగళుడు నిజంగా మంగలప్రదాయుడే. కేవలం గ్రహాల మంచి అయినా, చేదు అయినా వాణి పేరు బట్టి నిర్ణయించ కూడదు. కొన్ని అంశములు, వాటి స్తితి గతుల బట్టి నిర్ణయించాలి. కేవలం కుజుడే కాదు, ఏ గ్రహము అయినా సుభ, అశుభ ఫలితములు కలిగి ఉంటాయి.


అలాగే శని ఇతర గ్రహాలూ కూడా.. మరి వివాహ విషయములో కుజగ్రహ దోషము గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తారు అంటే... స్త్రీల జతకములో కుజుని స్థానం బట్టి వరుని పరిగణిస్తారు. మాంగల్యం అనేసౌభాగ్యము స్త్రీలకు సంబంధించినది కావటంవల్ల కుజదోషం వివాహాల విషయంలో చూడటం సంభవిస్తున్నది. మరి ఈదోషం పురుషులకు పురుషులకు కూడా అప్పదించి కుజ దోషం కల స్త్రీకి కుజదోషం కల పురుషునికి వివాహం చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు,



జాతక పొంతనాలు చూడకకుండ చేసిన సరికాదు. ఇక్కడ వివాహ కారకుడు అయిన శుక్రుడు కుజునికి శత్రువు. శాస్త్రరిత్య వివాహ కారకుడు అయిన శుక్రుడు ప్రమాద రహిత స్తానాలలో ఉండుట ఉత్తమం.

 కుజ దోషంగా చెప్పబడే స్థానాలు: రెండవ ఇంట, నాలుగవ ఇంట, ఏడవ ఇంట, ఎనిమిదవ ఇంతద, పన్నెండవ ఇంట కుజుడు ఉండకూడదని.
కాని కుజనక్షత్రాలలోగాని, రాశులలోగాని, ఉచ్చ రాశులలోగాని, కుజ దోషం ఉండదు. అల్లానే, బుధ, రవి, గురు దృష్టులు ఉంటె దోషము ఉండదు. అవి పరిశీలించి, జాతక పొంతనలు చూసి వివాహము చేయాలి. అలా చేయనిచో భార్య,భర్తల అన్యోన్యత లోపించుట, తరచుగా కలహాలు, భర్తకు నీచ సంబంధము లుండుట, దాంపత్య సుఖము లోపించుట, భర్త నిర్వహించావలైన బాధ్యతలకు దూరంగా సన్యాసి మనస్తత్వము కలిగి ఉండుట,సంతన హీనత , దుర్వర్తనం, ఇళ్ళ సంసారంలో అనేక లోపాలు ఉంటాయి కాబట్టి కుజ దోషం గురించి వివాహాలలో తరచి చూడటం జరుగుతుంది. ఏయే గ్రహాలతో ఉంటె ఏయే ఫలితాలోగుడా చెప్పబడింది వీటి గురించి అనేక పరిహారాలు శాస్త్రం నందు చెప్పబడినాయి కావున భయ పడవలసిన అవసరం లేదు.ఈ పరిహారక క్రియలు సమస్య యొక్క స్వరూపం బట్టి,జాతక పరిశీలనా చేసిన తరువాత చేయ వలసి ఉంటుంది. ఈ పరిహారాలు అందరికి ఒకలాగేనే ఉండవు. ఈ పరిహారాలు ఎవరికీ వారు ఆచరిస్తేనే మంచిది వ్యక్తి చేయలేని పరిస్తితిలో ఇంకా ఎవరైనా చేయవచ్చు. పరిహరక క్రియ ఏదైనా మనస్సు కేంద్రీకరించటం,నమ్మకము,విశ్వాము,




భగవంతునికి సంపూర్ణ సమర్పణ ఉండాలి.భగవంతుడే ఈ క్రియలు జరుపుతున్నడన్నా భావన రావాలి. ఎవరికీ ఏది వీలు అయితే దాని ఆచరించచ్చు.

కుజగ్ర దోష శాంతి విధానాలు :-

 1. సుభ్రహ్మన్యస్వామి కుజుని అధిపతి కావున అయన షష్టి నాడు సుబ్రహ్మన్యష్టకం ఏడు సార్లు పారాయణ చేయాలి.

 2. ఏడు మంగళ వారాలు ఉపవాసం ఉంది కుజ గాయత్రి డెభై సార్లు పారాయణం, చేసి ఆఖరి వారము కందులు దానం ఇవ్వాలి.

 3.కుజ శ్లోకం ప్రతి రోజు డెభై మార్లు పారాయణం చేయాలి. కుజ జపం చేయించి కందులు ఒకటింపావు ఎర్రని వస్త్రములో మూట కట్టి దక్షిణ, తాంబూలాలతో దాన మివ్వాలి.


 4 .స్త్రీలు పగడపు మాల, ఎర్రని వస్త్రాలు, ఎర్రగాజులు, కుంకుమ ధరించి ఎర్రని పూలతో పూజించాలి.

 5.ఎర్రని పండ్లు, ఎర్రని వస్త్రాలు దానం చేయటం అదియును సుబ్రహ్మణ్య స్వామీ ఆలయంలో ఇచ్చిన మంచి ఫలితము ఇస్తుంది.


 6. పురుషులు కుడి స్త్రీలు ఎడమ చేతి ఉంగరం వేలికి వెండిలో పొదిగిన పగడపు ఉంగరము ధరించాలి.సుబ్రహ్మణ్య ఆలయాలు స్తుతి, అష్టకాలు నిరంతరం చేయాలి.


 7.ప్రతి రోజు సుబ్రహ్మణ్య, దుర్గ, గణపతి స్తోత్రాలు చేయచ్చు.

 8. పిల్లలు లేని దంపతులు ఏడు ఆదివారాలు డెభై ప్రదక్షిణాలు చొప్పున చేయాలి.

 9. షష్టి, సుబ్రహ్మణ్య షష్టి, కృత్రిక నక్షత్రం వచ్చిన రోజున ఏడు మంగలవారాలు ఆవు పాలతో అభిషేఖం చేయాలికుజ దోషాలు సంపూర్ణంగా నివారించాబడతాయి.

 10. కుజ దోషం పరిహారార్థం బలరామ ప్రతిష్టిత పంచలింగాల క్షేత్ర దర్శనం (నాగావళి నదీ తీరంనండు).


  11. కుజ కవచం, మంత్రం, స్తోత్రం, అష్టకం, అష్టోత్తరం,కుజ మంగలాష్టకం మొదలైనవి చేయాలి.


 12. రామాయణంలో కుజ దశ అంతర్దశ లకు పారాయణ ఘట్టాలు చెప్పబడినాయి.,

 13. కుజదోషము నివారించుటకు రామాయణములో చేయదగు పారాయణ క్రమములు.

 14. కుజదశలో కుజుని అంతర్దశకు....ఉత్తరకాండ ఇరవై ఆరవ సర్గ పారాయణ, కందిపపు పొంగలి, బెల్లం నైవేద్యము.


 15. కుజ దశలో రాహు అంతర్దశకు -- యుధకాండ యాభై ఎనిమిదవసర్గ, తేనే న ఎండుద్రాక్ష నైవేద్యము.


 16. కుజ దశలో కేతు అంతర్దశకు-- యుధకాండ నూట పదహారు సర్గ , ఖర్జూరం, కొబ్బరికాయ నైవేద్యము.


17. కుజ దశలో శని అంతర్దశకు -- అరణ్యకాండ డెభై వ సర్గ -- నేరేడు, నల్లద్రాక్ష నైవేద్యము.


 18. కుజుదశలో బుధ అంతర్దశ --- బాలకాండ పదహారవసర్గ -- ఆకుపచ్చ ద్రాక్ష, తాంబూలం.



 19. కుజు దశలో గురు అంతర్దశ సుందర కాండ యాభై ఒకటి సర్గం అరటిపండ్లు నైవేద్యము.


 20. కుజ దశలో శుక్ర అంతర్దశకు సుందరాకాండ యాబై మూడు సర్గం పాతిక బెల్లం, కారెట్.నైవేద్యం.


 21 . కుజ దశలో రవి అంతర్దశకు బాలకాండ ఇరై మూడు సర్గం. చామ కారెట్ దుంప నైవేద్యము.


 22. కుజదశలో రవి అంతర్దశకు బాలకాండ పదిహేడవ సర్గం. పాలు, పాయేసం నైవేద్యము.












 కుజ గ్రహ దోషానికి మామూలు పరిహారములు:-
  1. సింధూర వర్ణ ఆంజనేయ స్వామికి ఏడు మంగళ వారములు ప్రదక్షిణాలు చేయాలి.

               2. ఎర్రని పుష్పాలు మాల సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి అలంకరించాలి.


 3.బెల్లం కలిపిన యెర్రని కందిపప్పు గోవుకు తినిపించాలి.
4. మంగళవారము రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి.

 5.స్త్రీలు ఏడు మంగలవారాలు ఏడుగురు ముతైదువులకు ఎర్రని పూలు , ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు, ఎర్ర కుంకుమ, దానం చేయాలి.

 6. ఎర్ర చందనం, కందులు, ఎర్ర మేక, దానిమ్మ పండ్లు ఎర్రవస్త్రాలలో కట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో వీలు అయితే, లేదా ఇన్న్తి వద్ద అయిన సరే దానం ఇవ్వాలి.

 7.కోతులకు తీపి పదార్థములు తినిపించాలి.

 8. రాగి పాత్రలో నీరు తాగటం, రాగి పాత్రలు వాడటం మంచిది.


 9. పోట్లకాయలు తరగటం, మంచిది కాదు.

 10.రక్త దానము చేయుట చాల మంచిది.

 11. అమ్మవారికి (దుర్గ) ఎర్ర చీర సమర్పించటం, నవగ్రహ గుడిలో కుజ విగ్రహం వద్ద ఎర్రపులతో పూజ పగడ దానం, ఎర్రరవికలగుడ్డ దానం మంచిది.

 12. కుజుని అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉంది, కండి పప్పుతో చేసిన పదార్ధాలు తినాలి.

 13.రాగిపళ్ళెంలో కందులు, కందిపప్పు పోసి దక్షిణ తామ్బులంతో మంగళవారం మధ్యాహ్నం ఒక యువకుడికి దానం చేయాలి.

 14. కుజగ్రం వల్ల కలిగే రోగములకు ఎర్రటి కుండలో అన్నం వండి, ఎర్రవస్త్రంలో మూట కట్టి, దాని మీద దీపం వెలిగించి రోగికి దిష్టి తీసి కుక్కలకు అన్నం పెట్టుట ద్వార నయం అవుతుంది. కాని డాక్టర్ దగ్గర మందులు మానేయ కూడదు.


 15. కుజుడు అన్నదమ్ములకు కారకుడుగా చెప్తారు, మూడవ ఇంట్లో ఉంటె ఎన్నో చిక్కులు వస్తాయి. ఏనుగు దంతం వస్తువు ఇంట్లో దక్షిణం పక్క ఉంచి కుజుని ఆరాధించాలి.

 16. ఏడు, ఎనిమిది స్థానాలలో కుజుడు ఉంటె డబ్బు ఉన్న సుఖము ఉండదు, అందుకని ఏడు మంగళ వారాలు సిరా స్నానం చేసి దక్షిణ దిశలో మూడు వాతుల దీపం వెలిగించి సాయంకాలాలు కుజ స్తోత్రము, సుబ్రహ్మణ్య పారాయణం చేయాలి, ఉపవాసం ఉండి కందిపప్పుతో తాయారు చేసిన ఆహారము తీసుకుంటే భార్య భర్తలు గూడా సంతోషంగా ఉంటారు, సమయాని డబ్బు అందుతుంది.

 17. కుజుని వలన స్వర పేటికకు సంబంధించిన వ్యాధులు వ్దస్తే మంగళ వారం, క్రుత్హిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించి గంట, దీప దానము చేసిన సమస్య తొలగును.









 వివిధ భావాలలో కుజదోషం ఉంటె తీసుకోవలసిన జాగ్రతలు:-

             1. వీరు అబద్ధములు ఆడకూడదు, దంతముతో చేసిన వస్తువులు ఇంటిలో ఉంచరాదు, ఏ వస్తువైనా దానం తీసుకుంటాడు.

 2.వీరు ఆర్థిక బాధలతో బాధలు పడుతుంటే (కుజుడు బలహీనుడు అయితే) ఒక ఎర్రరుమాలు జేబులో ఉంచు కోవాలి, ఆరు మంగళ వారాల పాటు చిన్నపిల్లలకు బెల్లము, గోధుమతో చేసిన తీపి పదార్థములు తినిపించాలి.

 3. వీరు ప్రయాణాలలో జాగ్రతలు పడాలి, పొరుగు వారితో గొడవలు పెట్టుకోరాదు, వెండి ఉంగరంలో పగడం వేసి ఎడమ చేతికి ధరించాలి.

 4. వీరు పంచదార, తీపి వ్యాపారము చేయాలి, కోతులకు, సాధువులకు, తల్లిగారికి భోజనములు పెట్టాలి.

 5. వీరు రాగి చెంబులో నీరు పోసి నిద్రిచే ముందు తల వైపు పెట్టుకుని, ఉదయమే అనీరు పచ్చని చెట్టులో పోయాలివేప చెట్టు దక్షిణం వైపు నాటాలి.

6. అంగారక మంత్రము జపించాలి, ఇందుప వస్తువులు ఇంట్లో పెట్టుకో కూడదు, పడిన వస్తువులు ఇంట్లో ఉంచరాదు.


 7. మరదలు, పిన్ని, అక్క, చెల్లెలు, అత్తా వీరిని గౌరవించాలి, తీపి తినిపిస్తూ ఉండాలి, వారిచే తిట్టించుకో కూడదు.


 8.నాలుగు, ఆరు భావాల్లోని రేమేడీలు చేసుకోవాలి, విధవ స్త్రీల ఆశీర్వాదం తీసుకోవాలి.


 9.కుడిచేతి ఉంగరం వేలికి వెండి పగడపు ఉంగరము ధరించాలి, వదినగారిని గౌరవించాలి, ఎర్రగుడ్డ జేబునండు పెట్టుకోవాలి, అన్నగారు చెప్పినవి చేయాలి.


 10.ఆఫీసులో కాని, వ్యాపార స్థలమునందు కాని సుబ్రహ్మణ్య స్వామీ ఫోటో తగిలించండి, పగడము ఉంచండి, పాలు పొంగి పొయ్యిలో పదనీకండి.


 11.చిన్న మట్టి పాత్రలో తెనేకాని, సిన్దురంకాని వేసి ఉంచండి

 12. ఉదయము పరగడుపున తేనే తాగండి, సుబ్రహ్మణ్య స్వామీ ఫొటోకు ధూప, దీప, నైవేద్యములు సమర్పించండి.







 అన్ని రోజులు పాటించవలసిన నియమములు కుజ దోషం నివారణ మార్గం :-

 మన పురాణాలలో కుజ గ్రహం ను,అంగారకుడు అని,మంగళుడు అనే నామాలు ఉన్నాయి.అలాగే కుజుడు భూమి పుత్రుడు అని కూడా తెలుసు..ఒక సారి కుజుడు తన తల్లి తండ్రుల అనుమతి తీసుకోని వినాయకుడి గురించి తపస్సు చేయడానికి నర్మదా నది తీరంలో ఒక ప్రదేశంను ఎంచుకొని నిరాహారంగా 1000 సంవత్సరాలు గణపతి గురించి తపస్సు చేసినాడు.అలా 1000 సంవత్సరాలు కుజుడు తపస్సు చేసినా తరువాత మాఘ బహుళ చవితి చంద్రోదయం నాడు వినాయకుడి ప్రతక్ష్యమయ్యాడు.అలా ప్రతక్ష్యమైన వినాయకుడు ఎలా ఉన్నాడు అంటే దశా భుజాలు కలిగి బాలుడి గా ఉన్నాడు.అదే విధంగా వినాయకుడి తలమీద ఒక చంద్ర వంక కూడా ఉన్నదీ. వినాయకుడు,అంగారకుడు తో ఇలా అన్నాడు." నీ తపస్సుకు మెచ్చితిని నీకు ఏమి వరం కావాలో అని కోరుకొమ్మన్నాడు.అప్పుడు అంగారకుడు ఎంతో సంతోషించి ఆ వినాయకుడిని ఎన్నో విధములుగా స్తుతించాడు.అలా ప్రతక్ష్యమైన వినయకుడ్నిని అంగారకుడు తనకు " అమృతం" కావాలని,అదే విధంగా నేను ఎప్పడు నీ నామ స్మరణ చేస్తుండాలని అని వరమియమని అంగారకుడు కోరుకొన్నాడు అప్పుడు వినాయకుడు తదాస్తు అని దీవించి ,నీవు ఎర్రని రంగులో ఉన్నావు ఎర్రని వస్త్రం కట్టుకోన్నావు,ఈ దినం మంగళవారం.కనుక ఇక నుంచి నీ పేరు మంగళుడు అని వరం ఇచ్చి వినాయకుడి అంతర్ధానం అయ్యాడు.ఆ తర్వాత అంగారకుడు(మంగళుడు) అమృతం ప్రాప్తిస్తుంది అమృతం సేవించిన తరువాత కుజుడు(మంగళుడు) ఒక ఆలయం కట్టించి అందులో వినాయకుడిని ప్రతిష్టించి ,ఆ వినాయకుడిని శ్రీ మంగళమూర్తి అని పేరు పెట్టాడు.ఈ ఆలయం ఇప్పటికి మన భారత దేశంలో ఉంది.







 వినాయకుడు ఇంకొక వరం కుజుడికి ప్రసాదించాడు. ఎవరైతే అంగారక చతుర్ధి రోజు( బహుళ చతుర్ధి ,కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధి లేదా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధి రోజు) మంగళవారం రోజున ఉపవాసం ఉండి వినాయకుడికి భక్తి శ్రద్దలతో పూజచేస్తారు వారికీ ఉన్న అన్ని కుజగ్రహ దోషాలు అన్ని తొలగిపోతాయి.అని వరం ప్రసాదించాడు అలాగే వినాయకుడి అనుగ్రహం కూడా కలుగుతుంది.ఈ పూజా ఫలం ఎటువంటిది అంటే ఒక సంవత్సరం సంకష్టి వ్రతం అంటే ఒకక్క నెలలో ఒక చతుర్ద్ది వస్తుంది..అలా 12 నెలలు ఎవరు వ్రతం చేస్తారో?అలా చేయడం వల్ల ఎలాంటి పుణ్య ఫలం వస్తుందో ఈ ఒక్క అంగారక చతుర్ధి రోజున చేసీ వినాయకుడి వ్రతం వల్ల కలేగే ఫలితం సమానం..అలాగే అన్ని దోషాలు,ముఖ్యంగా కుజ దోషాలు సంపూర్ణంగా నివారించాబడతాయి.










22 October 2016

నీలం – Sapphair

నీలము నీలాకాశంలో నీలి రంగు వెలుగొందే శని గ్రహానికి నీలరత్నమంటే ప్రీతి. అందున మహానీలము స్వచ్ఛమైన శనిగ్రహ వర్ణమే కలిగియుండుట వలన ఈ గ్రహ రత్నములకు రెండిటికి స్పర్శగుణం ప్రధానము వాయుత్వము కలిగి యుండుట వలన మహా నీల మాదిరిగా గల నీల రత్నములు శని గ్రహ సంబంధించిన రత్నములుగా పేర్కొన బడినవి. ఈ రత్నము స్త్రీ జాతికి సంభంధించినవి శరీరమునందలి పంచ ప్రాణములలో ఉదానమను ప్రాణము యొక్క లక్షణములు కలిగియున్నది. త్రిదోషములందలి వాత దోషమును తొలగించి ఆరోగ్యము నొసంగుటలో ఈ రత్నము చాలా గొప్పది. శరీరంలో జగన్మాత కాలరాత్రి యనబడే శక్తిరూపముతో అధిసించియున్న అనాహత చక్రమునందలి పసుపు, ఎరుపు, నలుపు రంగులు కాలసిన కాంతి కిరణాలు నీల రత్నానికి దగ్గర సంభంధం కలవు. అనాహత కాంతులు తమ సహజ శక్తిని కోల్పోయినప్పుడు శరీరంలో సంభవించే అలజడి అనారోగ్యాలకు నీలధారణచాలా మంచిది. నీల రత్నములోని కాంతి కిరణాలు చర్మరంద్రాల గుండా పయనించి శరీరాంతర్భాగాలలో వ్యాపించి యున్న అనాహత కాంతి కిరణాలు దీప్తిని కలిగించడం ద్వారా ఆ సంభంధమైన బాధలు అంతరించగలవు.








పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాధ్ర అను నక్షత్రములందు జన్మించిన వారు ఏసమయమునందైనను నీలమును ధరించవచ్చును.

మిగిలిన నక్షత్రములలో ఉత్తర, ఉత్తరాషాడ, కృత్తిక నక్షత్రముల వారు తప్ప మిగిలిన అందరూ వారి వారి జన్మ జాతక గ్రహస్థితి ననుసరించి శని గ్రహం బలహీనిడై దోషప్రదునిగా నున్నప్పుడు నీల రత్నమును ధరించిన అశుభములు తొలగిపోయి శుభఫలితాలను పొంది సుఖించగలరు.













 జన్మ సమయంలో ఏ ర్పడిన గ్రహములయొక్క స్థితి ననుసరించి శని గ్రహము లగ్నము నుండి 6-8-12 స్థానములందుండుట, ఆ స్థానాధిపత్యములు కలుగుట మరియు ఆ స్థానాధిపతుల యొక్క కలయిక , వీక్షణమునొందియుండుట దోషప్రదము.

సప్తమ స్థానంలో బలవంతుడైన శని గ్రహము ఉన్నప్పుడు వివాహ కార్యమునకు కనేకాటంకములు కలిగి కల్యాణము కానేరదు.

 పాపగ్రహములతోకూడి బలవంతుడైన శని గ్రహమునకు కోణాదిపత్యము కలిగి కేంద్రములందున్నను షష్ఠాధిపత్యముకలిగి 2-4-7-10 స్థానములందున్నను, అష్టమాధి పత్యము కలిగి 3-5-9 స్థానములందున్నను , వ్యయాధిపత్యము కలిగి 1-2-5-9-10 స్థానములందున్నను దోషప్రదుడు అట్టి సమయములలో ఆ శనిగ్రహము వక్రగమనము నందుండిన దోషమధికముగా నుందుగలదు. గోచారమునందుండి 3-6-11 స్థానములు దప్ప మిగిలిన అన్ని స్థానములు శని గ్రహానికి దోష స్థానములనే చెప్పబడ్డాయి.

జాతక, గోచారములందు స్థానాది షడ్బలములు, అష్టకవర్గ బిందుబలము కలిగిన శనిగ్రహము పాపసంభంధము అధికముగా కలిగి దుష్ఠస్థాన స్థితుడై వ్యతిరేకముగా నున్నప్పుడు, మిక్కిలి కష్టములు సంప్రాప్తించగలవు.

తెలియబడని వ్యాధులు,

 భూత పిశాచ బాధలు.

 చోరాగ్నిభీతి,

 అవమానములు అపకీర్తి,

కార్య విఘ్నము,

 మగోలిచారము,

 రాజదండన,

 బంధన దరిద్రము,

హీనజీవితము,

ఆపదలు గండములు,

 దీర్ఘవ్యధులు వాత ప్రకోపము,

 కళత్ర, పుత్ర, బంధునష్టము,

 మాతా పితారుల మరణము,

 ఋణబాధలు, దాస్యము,

మొదలగు ఫలితములేగాక, మరణము కూడా సంభవించగల అవకాశములున్నవి.

ఇట్టి చెడు కాలములందు ఉత్తమమైన జాతికి చెందిన ఇంద్రనీలము, మహా నీలము, నీలమణి అను రత్నములు ధరించిన యెడల శనిగ్రహ దోషములంతరించి ఆయుర్భాగ్య సంపదలు కలుగగలవు.










 నీలము వల్ల కలిగే శుభయోగాలు :-

 నీలమణి, మహామణి, ఇంద్రనీలము మొదలగా గల నీలరత్నములను ధరించుట వలన శరీరమునందు ఓజశ్శక్తి అభివృద్ధి జెందటమే కాకుండా నూతనోత్సాహము ధైర్యము,

 కార్యదక్షత కలుగగలవు.

 నీలము ధరించిన వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయాది వృత్తులలో అనుకూలత కలిగి పురోభివృద్ది నుండగలదు.

ఆదాయాభివృద్ది, ధనలాభము, సంఘమునుండి గౌరవ మర్యాదలు పెరుగుట,

వివాహాది ఆటంకములు తొలగి పెండ్లి కాగలదు.

మానసిక వ్యాధులు నివారింపబడి చిత్త స్థిరత్వము లభించగలదు.

శనిగ్రహ దోషముచే కలుగు అనేక దుష్ఫలితాలనుంచి రక్షణ కలుగగలదు.

పిత్తకోశమునందలి దోషములు,

వాత ప్రకోపములవలన జనించు రోగములు,

కీళ్ళ నొప్పులు,

పక్షవాతము,

నరముల దుర్భలత్వము,

 అజీర్ణ వ్యాధులు.

 కాళ్ళు, కాళ్ళ పిక్కలకు సంబంధించిన రోగములు,

త్రాగుడు,

 వ్యభిచారమువలన కలుగు బాధలు,

 ఊపిరి తిత్తుల వ్యాధులు,

 మందబుద్ది మొదలగు అనేక విధములైన రుగ్మతలు సమూలంగా నశింపబడి ఆరోగ్యవంతులుగాకాగలరు.

 బాలారిష్టములు,

 దృష్టిదోషములు,

 తాంత్రిక కృత్రిమ క్షుద్రగ్రహబాధ లంతరించగలవు. జీవితమునందు సంభవించిన పలువిధములైన గండములు తొలగిపోగలవు.

 అపమృత్యు దోషములంతరించి ఆయుర్దాయాభివృద్ధి కలుగగలదు.నీలము ఆధ్యాత్మికాభివృద్ధికి దోహదపడగలదు.

నీలధారన వలన చిత్తచాంచల్యము తొలగి ఏకాగ్రత లభించగలదు.

ఆధ్యాత్మిక జీవన ప్రగతి ఆరోహనక్రమంలో దిన దినాభివృద్ది నొందగలరని బౌద్దుల నమ్మిక. అందువల్లనే వారు జాతి నీలముకంత ప్రాధాన్యత నిచ్చుచుండెదరు.

ముఖ్యముగా దరిద్ర బాధలు కష్టనష్టములు మానశిక చికాకులు రూపుమాపి సంతోషము సుఖసౌఖ్యములు, ధనధాన్యములు భాగ్యసంపదలు స్థిరమైన జీవనములు సిద్ధించగలవు.









 నీలము ధరించు విధానము :

 దోషములేని ఉత్తమ మైన జాతినీలము పంచలోహం లేక బంగారమును దిమిడ్చి ధరించడం శ్రేష్టము ఉంగరం యొక్క అడుగుభాగం రంద్రముగా నుంచి పైభాగంలో ధను (విల్లు) ఆకారముగా తీర్చబడిన పీఠము యొక్క మధ్యభాగాన నీలంను బిగించి శుద్ధియెనర్చి షోడశోపచార పూజలు నెరవేర్చిన పిదప శుభముహూర్తములో ధరించాలి పుష్యమీ నక్షత్రముతో కూడి యున్న శనివారము త్రయోదశి తిధియందు గానీ లేక త్రయోదశీ శని వారమందుగానీ చంద్రగ్రహణము సమయమందుగానీ చిత్తా నక్షత్రము 3,4 పాదములందు గానీ శని సంచారం గల కాలంలో పూర్వాషాఢ నక్షత్రం ప్రాప్తించిన శనివారమందుగానీ (శని అస్తంగతుడు కాకయున్నప్పుడు) శనిహోర జరిగే సమయంలో గానీ ఉంగరమునందు నీలరత్నము బిగించి తదుపరి ఒక దినము గోమూత్రమునందు. రెండవదినము పంచగవ్యములందు, మూడవ దినము నల్లనువ్వులయందు ఆ ఉంగరమును అధివాసము చేయించి పంచామృతాలతో శుద్ధోదక స్నానములు చేయించి, శాస్త్రోక్తముగా షోఢశోపచార పూజలు నిర్వహించిన శుద్ది కాగలదు. ధరించెడి వారికి తారాబలం చంద్రబలములు కలిగి మంగళ, శుక్ర, శని వారములయందు శుభతిధులు కలిగియున్నప్పుడు వర్జ్య దుర్ముహుర్తాలు లేని కాలంలో వృషభ, తులా ధను, కుంభ లగ్నములందు తొలుత పూజలు జరుప బడిన ఉంగరమును ధరించవలెను. ధరింపబోవు సమయమునకు ముందు ఉంగరమును కుడిహస్తము నందుంచుకొని పడమర ముఖముగా దిరిగి నిలబడి గురువుని, గణపతిని ధ్యానించి "ఓం హ్రీం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయ నిర్మాంస శుష్క దేహాయ సర్వసిద్దిం దేహి దేహి స్వాహా" అను మంత్రమును గానీ లేక "ఓం శన్నో దేవీ రభిష్టయ అసోభవంతు పీతయే శంయోరభి స్రవంతునః" అనే మంత్రమును గానీ 108 పర్యాయాలు జపించి ఉంగరమును ముమ్మరు కనుల కద్దుకొని కుడిచేతి నడిమివ్రేలికి ధరించాలి కొందరు పెద్దలు ఎడమ చేతి నడిమి వ్రేలికి ధరించవచ్చును అని చెబుతారు కావున వారి ఆచారం ఏ ప్రకారంగా ఉంటే ఆ విధంగా నడిమి వ్రేలికి మాత్రం ధరించాలి.

 నీల రత్నము ఉంగరపు వ్రేలికి (అనామిక)మాత్రం ధరించకూడదు.

నవరత్నములను గాక ఇతర రత్నములు చేయించుఉంగరములో నీలముతో బాటుగా కెంపులను, పచ్చలను జేర్చి ఉంగరమును ధరించకూడదు.

కెంపు అవసరము గలిగి నప్పుడు కెంపు నీలము లేదా కాకి నీలమును, పచ్చల అవసరమున్నప్పుడు, మయూర నీలము ధరించిన శ్రేయస్కరముగా నుండగలదు.










  నీలం – Sapphair
 8, 17, 26 తేదీలలో జన్మించినవారు, జ్యోతిష్య శాస్త్రప్రకారం శనిదశ జరుగుతున్నవారు, వృషభ,తుల,మకర, కుంభ లగ్నములలో పుట్టినవారు ధరించాలి. పుష్యమి, అనురాధ, ఉత్తరభాధ్ర, నక్షత్ర జాతకంలో పుట్టినవారు. పక్షవాతం, పిచ్చి, ఊపిరితిత్తుల వ్యాధులు తగ్గుదల. మానసిక ఉత్తేజం. పైత్య నివారణ.ఉధ్యగ, వ్యవసాయ లాభం. స్త్రీలలో సంతానోత్పత్తి. తేలుకాటు వేసినచోట నీలాన్ని ఉంచిన నీటితో కడిగితే తేలువిషం విరిగిపోతుంది. ఏకాగ్రత పెరుగుదల. శారీరక, మానసికి ఉత్తేజం.














నవరత్నాలు పగడం Koral

పగడము ముదురు ఎరుపురంగు కలిగి నునుపుగా ఉండి ప్రకాశవంతమైన పగడాలు కుజగ్రహానికి చాలా ప్రీతి. కుజుడు రక్త వర్ణము కలిగి అగ్నితత్వం గల పురుషగ్రహము.




పగడముకూడా తేజోతత్వానికి సంబంధించినది. ఎర్రగా నుండుట వల్లనే కుజునుకి ఇష్టప్రదమైనది. ఈ పగడము త్రిదోషమునందలిపిత్తమను దోషమును హరింపగలదు. సమానవాయువు సంకేతముగా గలది, పురుషజాతికి, క్షత్రియత్వమునకు సంభంధించిన దగుటవలన చాలా కఠినముగా నుండి కోతకు స్వాధీనపడదు. శరీరమునందలి మూలాధార చక్రమునందలి వివిధ కాంతి విశేషములన్నియు ఈ పగడమునందు నెలకొని యుండుట వలన, మూలాధార చక్రమునందలి పసుపుపచ్చని రంగుగల కాంతి కిరణాల దేహతత్వంపై ఏ విధంగా పనిచేయగలవో ఈ పగడం ధరించడంవల్లకూడా అదేవిధంగా హరిత కిరణాలు దేహ రంద్రాలగుండా చొచ్చుకుపోయి, రక్త దోషాలు, లివర్, బ్లడ్ ప్రషర్, అల్సరు, జననేంద్రియ సంభంధిత వ్యాధులు, స్ఫోటకం వంటి అనేక అంటువ్యాధులు, కీళ్ళ బాధలు మొదలగు అనేక ఋగ్మతలు పారద్రోలి ఆరోగ్యవంతులను చేయగలదు.



మృగశిర, చిత్త, ధనిష్ఠ అను నక్షత్రములందు బుట్టిన వారు ఏ కాలమునందైనను మంచిపగడాలను ధరించవచ్చును.

 ఇతర నక్షత్రజాతకులలో ముఖ్యంగా పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రజాతకులు పగడం ధరించి సత్ఫలితలు పొందటం చాలా కష్టము, మిగిలినవారు తమ యొక్క జన్మకాలమునందలి జాతక చక్రము ననుసరించి గ్రహముల యొక్క దశాంతర్దశలను గమనించి కుజగ్రహము దోషప్రమాదముగా నున్న సమయములందే పగడము ధరించవలెను. అట్లు ధరించిన యెడల కుజగ్రహ దోషమువల్ల జీవితంలో సంభవించే అనేక అనర్థాలు, నివారింపబడి శుభము జయము కలుగును.






జన్మ సమయమున లేర్పడిన జాతక చక్రమునందు లగ్నము నుంచి, 6-8-12 స్థానములందు కుజుడుండిన లేక ఆ స్థానాధిపతులతో కలయిక గానీ, దృష్టిగానీ పొందియుండిన యెడల కుజగ్రహ దోషప్రమాదము, కుజునికి ద్వితీయ, సప్తమాధి పత్యములు గల్గుట 2-4-7-8 స్థానములందుట కూడా దోషప్రదమే! షడ్వర్గ బలము, అష్టక బలము, కలిగిన కుజ గ్రహము పైన దెల్పిన స్థానములందుండిన విశేషహాని జేయుటకు దుష్టలక్షణములు కలిగి బలవత్తరుడైయున్న అంగారక గ్రహము యొక్క మహర్దశలు, అంతర్దశలు సంభవించినపుడు మరియు గోచారమునందు కుజునికి దుష్టస్థానమునందు స్తంభనము వ్రక్రత్వము గ్రహయుద్దము, పాపగ్రహవేధలుసంభవించియున్న కాలమునందు శతృవృద్ది, పోట్లాట్లు, దరిద్రము ఉద్రేకము, రక్తహీనత, దీర్ఘరోగములు, శస్త్రచికిత్సలు, ఆకస్మిక ప్రమాదములు, అగ్నిభాధలు, విషపీడ, ఋణబాధ, దాయాది వైరము, భూనష్టము, అవమానము, కాలవిఘ్నము, నీచజన స్నేహము, నిత్యకలహము, దంపతులకెడబాటు, సుఖవ్యాధులచే బాధలు, మెదలగు దుఃఖ ప్రదమైన అనేక ఫలితాలు ప్రాప్తించును. అట్టి సమయమునందు ఉత్తమమైన పగడము ధరించిన అరిష్ట నివారణమై శుభం కలుగుతుంది.
















 పగడం ధరించడం వలన కలిగే శుభయోగాలు : బ్రహ్మజాతికి , క్షత్రియ జాతికి సంభంధించిన సంభంధించిన ఉత్తమమైన పగడాలను శాస్త్రీయ పద్ధతులననుసరించి ధరించిన యెడల చాలా శుభం జరుగుతుంది. ఆచరించే ప్రతికార్యంలో కలిగే విఘ్నాలు అంతరించి ఆయా పనులలో విజయం లభిస్తుంది. ఆ కారణముగా శత్రుత్వము తొలగిపోయి జనవశీకరణ లభించగలదు.


 పగడము అగ్నినుంచి, ఆయుధముల నుంచి కౄరశతృవుల నుంచి తగిన రక్షణ చేకూర్చగలదు.

ఆకస్మిక ప్రమాదములు,

గండములను తప్పించి క్షేమం కలిగించగలదు.

 చాలా కాలం బాధిస్తున్న ఋణ బాధలు, సూర్యోదయమునకు చీకట్లు తొలగి పోయినట్లు తొలగిపోవును.

వివాహ విషయములో కలిగే వివిధ ఆటంకములు అంతరించి శీఘ్రంగా వివాహం జరుగగలదు.

కుజదోషముల వలన కలిగే దాంపత్య జీవితంలో కలిగే కలహాలు, కలతలు కార్పణ్యాలు, పరస్పర వైషమ్యాలు, విడాకులలాంటి దుర్మార్గపు భావనలు, అంతరించి, అన్యోన్యప్రేమ పూరితమైన అనురాగంతో దంపతులు దీర్ఘకాలం సుఖసంసార జీవనం చేసుకొనుటకు తోడ్పడుతుంది.



భారీయంత్ర పరిశ్రమలో తరచుగా కలుగుచుండే అనేక ప్రమాదాలు, మోటారు వాహనములకు కలిగే నష్టాలు.


శతృవుల కుయుక్తులవల్ల సంభవించే రాజకీయ భాధలు, పోలీస్ కేసులు, ఇతర బాధలు.




 లివర్ వ్యాధులు,

 మూలశంక.

 రక్తపోటు,

 జ్వరము,

 దేహతాపము.

చర్మవ్యాధులు,

గడ్డలు వ్రణములు.

 వాపులు కీళ్ళబాధలు.

 జననేంద్రియములకు సంభంధించిన అన్ని రోగాములు.

కడుపునొప్పి కాన్సరు మొదలగు యింకా అనేక వ్యాధులను శీఘ్రంగా నివారించి సంపూర్ణ ఆరోగ్యవంతులగుటకు పరిపూర్ణ సంతోషముతో తృప్తిగల సుఖవంతమైన జీవితమును గడుపుటకు పగడము తోడ్పడగలదు.









పగడము ధరించిన వారికి జీవితంలో నైరాస్యం బద్దకం సోమరితనం అనేవి ఉండవు. సహనం సాహసం విజృంభణ అధికంగా నుంటవి. అన్యాక్రాంతంలో నున్న భూములు స్వాధీనమగుతవి. పశుసంపద వృద్దినొంది, వ్యవసాయరంగంలో విశేష లాభాన్ని పొందుతారు. మిలటరీ, పోలీస్ శాఖల్లో పనిచేసేవారు క్షత్రియ జాతి పగడాన్ని ధరించడం చాలా మంచిది. వారి వృత్తిలో అసాధారన ప్రతిభగలవారై ప్రతి పనియందు విజయాన్ని పొందుతారు.

పగడానికి అధిపతియైన కుజగ్రహం అనుగ్రహం కలిగి శుభగ్రహ స్థానల్లో ఉంటే ఎంత మంచి చేస్తాడో ఆ విధమైన బలం కలవాడై అశుభ స్థానాల్లో ఉంటే అంతటి కీడును కూడా కలిగిస్తాడు. ఆయనకు ప్రీతికరమైన పగడాన్ని ధరించడం వలన కుజగ్రహం ప్రసన్నుడై సకల ఆయురారోగ్యాలతో భోగ భాగ్యాలతో సంపదలతో, రాజ్యపూజ్యతల్ గౌరవం, ఆరోగ్యము, గౌరవం వంశాభివృద్ది, సకలసౌభాగ్యాలు కలుగచేస్తారు.

పగడపు పూస మాలలు ధరించడం వలన కూడా పై విధమైన ఫలితాలు కలుగుతాయి. రుద్రాక్ష మాలల యందు ఏడు పగడాలు గానీ కనీసం ఒకటి రెండు పగడాలుగానీ జేర్చి ధరించవలెను. ఇతర నవరత్నాలవలె పగడాలు అధిక ధరలుకలిగి యుండక అందుబాటు ధరల్లో లభిస్తాయి.






పగడము ధరించే పద్దతి :
 పరిశుభ్రమైన పగడాలు ధారణకు యోగ్యముగానుంటవి. బ్రహ్మ జాతి ప్రవాళం బరువుగా నుండి ప్రకాశవంతముగా నుంటుంది. క్షత్రియజాతికి బరువు మాత్రంలోపించగలదు. ఇట్టి పగడము ఏడు కారెట్లు (21 వడ్డగింజల బరువు)గలదానిని ధరించుట శ్రేష్ఠము. త్రికోణముగా నున్న పగడము విశేషఫలప్రదము, అట్లుకాని యెడల బాదంకాయవలే నున్న దానిని వాడవచ్చు. నలుచదరపు, వర్తులము విల్లువలె నుండునది. నక్షత్రాకారమును పోలిన పగడములు ధారణకు అంతగా ఉపయోగించవు. పగడము చిన్నదైనా దోషరహితంగా వుండాలి. బంతివలెనున్న ప్రవాళాలు మూలలయందు, ఆభరనములందు కూర్చోనుట ఉత్తమము పగడముకూర్చే ఉంగరము బంగారంతో గానీ లేక వెండితో గానీ, లేదా పంచలోహములతో గానీ తయారు చేయించాలి. ఈ ఉంగరం పీట భాగంలో ముక్కోణాకారములో ఉండి దానిచుట్టూ వలయ రేఖలను ఏర్పరచడం చాలా ముఖ్యము. కృష్ణపక్షంలో చదుర్దశీ మంగళవారం వచ్చిన దినమునందుగానీ, లేక కుజుడు మకర రాశిలో ధనిష్ఠా నక్షత్ర సంచారం చేసే కాలంలో గానీ ఏదో ఒక మంగళవారంనాడు గానీ, మధ్యాహ్నం 1గం-2 గం|| మధ్యకాలంలో గానీ లేక రాత్రి 2గం- 3గం మధ్యకాలంలో గానీ దక్షిణముఖంగా కూర్చొని పగడము ఉంగరములో బిగించవలెను. ఆ తర్వాత ఆ ఉంగరమునుఒక దిన మంతయు నవధాన్యాలలో ఉంచి మరుసటి దినమంతయు పంచగవ్యములు (ఆవుపాలు, పెరుగు, ఆవునెయ్యి, ఆవు పంచితం, గోమయం కలిసినది)యందుంచి, మూడవరోజున సుగంధ, ద్రవ్యాలతోడను, ఎర్రచందనపు నీళ్ళచేతను రుద్రాభిషేకం జరిపించి శుద్దిగావించవలెను. ధరించెడివాడు తమకు తారాబలం చంద్రబలం గలిగిన శుభతిదులయందు (శనివారం గాక)మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్మీన లగ్నములు వర్తించు వేళాలందు ఉంగరము కుడిచేతి ఉంగరపు వేలికి ధరించాలి. ధరించుటకు పూర్వమే షోఢశోపచార పూజలు జరిపి నమస్కరించి గురువులను గణపతిని ధ్యానించి దక్షిణ ముఖముగా నిలువడి ఉంగరము కుడి అరచేతియందుంచుకొని "ఓం లం ఐం హ్రీం శ్రీం మహిపుత్రాయ సకలారిష్ట వివారనాయ క్లీం క్లీం స్వాహా"అనే మంత్రాన్ని నిశ్చలంగా 108 పర్యాయాలు జపించి, ఉంగరము ముమ్మారు కనులకద్దుకొని వ్రేలికి ధరించవలెను.

 స్త్రీలు మాత్రం ఎడమ చేతికి అనామికా వ్రేలికి ధరించుట శుభప్రదము. మాలలు ఇతర ఆభరణమునందలి పగడములకు కూడా పైవిధంగా శుద్దిని పుణ్యకార్యములను నిర్వర్తించి ధరించుట శాస్త్ర సమ్మతము, ఉంగరము అడుగుభాగాన రంద్రము కలిగి యుండవలెను.















  పగడం – Koral 9, 18, 27 తేదీలలో జన్మించినవారు. మేష,కర్కాటక, ధనుస్సు, వృచ్చిక రాశివారు.మంగళవారం పుట్టినవారు. కుజమహాదశ నడుస్తున్నవారు ధరిస్తే మంచిది. స్త్రీలకు గర్భాశయ వ్యాధులనుండి విముక్తి. సంతాన ప్రాప్తి. ఉబ్బసం అల్సర్ వ్యాధులు తగ్గుదల.రక్త శుద్ధి. చర్మవ్యాధులు, పచ్చకామెర్లు కిడ్ని వ్యాధుల నివారణ. సెక్స్ సామర్ధ్యం పెంపుదల. అపాయ నివారణ. వివాహ యోగం కలుగును.















వైఢూర్యం – Cats Eye

వైడూర్యము
 వైడూర్య రత్నలు కేతు గ్రహానికి సంభంధించినవి. న్యాయాన్యాయ వివేచన, పుణ్యపాప వివక్షత, ధర్మాధర్మ పరిశీలనలు గల చిత్ర గుప్తుని అంశవల్ల ఈ వైడూర్య రత్నాలు పుట్టినట్లు కొందరు చెబుతారు. శరత్కాలంలో చంద్రుని యొక్క షోడస కళలు గల వెన్నెల కిరణలు కొన్ని రసాయన ధాతువులు కలిగిన శిలాభూములయందు ప్రవేశించి అచ్చట రసధాతువులు గల శిలాభూములయందు ప్రవేశించి అచ్చటి రసధాతువులుగల శిలలకు చంద్రకిరణములకు కలిగే పరస్పర సంయోగం వలన ఆశిలలు కొంత కాలానికి వైడూర్య రత్నాలుగా మారతున్నవని కొందరి అభిప్రాయము.










 అశ్వని, మఘ, మూల జన్మ నక్షత్రాలుగా కలిగియున్నవారువైడూర్యాన్ని ఏ సమయములో నైనను ధరించవచ్చును. మిగిలిన నక్షత్రములు గలవారు తమ జన్మ కాలమందలి గ్రహస్థితి ననుసరించి కేతువు యొక్క దోషప్రదమైన కాలము నందు ఈ రత్నము ధరించుట ఉత్తమము.










జన్మజాతకములందు శుభస్థానములందు కేతువు బలహీనుడై ఉన్నప్పుడు వైడూర్యధారన చేసిన ఆ కేతువు సకల శుభముల నొసగును. బలవంతుడైన కేతుగ్రహము 6-8-12 స్థానములందుండుట ఆ స్థానాధిపతులతో కలసి చూడబడుట చాలా దోషప్రదము. పాపగ్రహముల యతి, దృష్టి వేధల వంటి సంబంధములు కలిగియున్న కేతువు అపకారమును చేయగలడు, లగ్నము నుండి 2 వ స్థానమునందు పాపబలముగల కేతువుండుట, ఆ విధముగా పంచమ స్థానమందుండుట, ఏడవ స్థాన మునందుండుట 9 వ స్థానమునందుండుట కూడా దోషప్రదమే! జన్మ లగ్నము ననుసరించి ఏర్పడిన గ్రహములు బలాబలములందు కేతుగ్రహము పూర్తి బలవంతుడై దుష్ఠ స్థానములందుండగా అతని మహర్దశ, అంతర్దశలు, ఇతర యోగదశలలో ఇతని అంతర్దశలు, విదశలు సంభవించినప్పుడుషడ్వర్గబలము, అషటకవర్గ బిందు బలము కలిగి కేతువు గోచారము నందు దుష్టస్థానములందు సంభవించు గొప్ప భయముతో కూడిన కష్టములు ప్రాప్తించగలవు.

దోషప్రదమైన కేతు గ్రహానికి సంబంధించిన కాలంలో పిచ్చి ఉన్మాదము,

భిక్షుక వృత్తి,

కృరప్రదేశములందు నివాసము.

 సరియైన ఆహార నిద్రాదులు లేకుండుట,

 సిరి సంపదలు అకారణముగా తొలగిపోవుట,

 కృషి నాశనము.

ఉద్యోగ భంగము,

 కుటుంబకలహము విరక్తి,

 భార్య నష్టము.

 పితృమృతి, సంతాన కష్టనష్టములు,

 దుష్కీర్తి, అపజయము,

 వేదన,

శతృభీతి.

 విషజంతువులచే ప్రమాదము,

 ధన సంభంధమైన ఇబ్బండులు,

 కోర్టు వ్యవహారములు కోర్టు వ్యవహారములలో ప్రతికూలత,

 మనో వ్యద పిల్లల బాలారిష్టములు.

 కురుపులు మొదలగు చేమ వ్యాదులు కలరా,

 విడువని తల నొప్పి,

 అజీర్ణవ్యాధులు,

 దురదలు.
 ఆటలమ్మ,
తడపర, ఉబ్బాసం.

 కాన్సర్,

 ప్రసూతి బాధలు,
నొప్పులు సరిగారాక పోవడం, కష్టమైన కాన్పు,

 గుర్రపు వాతము.

 తీవ్రమైన దరిద్రము, మొదలగు అనేక విషమ పరిణామములు సంభవించి దుఃఖపెట్టగలవు.


అటువంటి సందర్భాలలో వైడుర్య రత్నము ధరించడం వలన సత్ఫలితాలు కలుగును.












వైడూర్యాల ద్వారా కలిగే శుభయోగాలు :
ఉత్తమ జతికి చెందిన దోషరహితమైన వైడూర్యమును ధరించిన యెడల జీవితం అభివృద్ది దాయకంగా నుండుటయే గాక ఆర్ధిక పుష్టి కృషిలో రాణింపు.

 ఉద్యోగ ప్రాప్తి.

 అధికారము.

 జనాదరణ పలుకుబడి,

 కీర్తి గౌరవ మర్యాదలు,

 భోగ భాగ్య సంపదలు.

 వాహన ప్రాప్తి.

గృహ లబ్ది,

 కళత్ర సౌఖ్యము,

కుటుంబ సుఖశాంతులు.

 శతృనాశనము,

జయము కార్యశిద్ది.

 దేహా రోగ్యము,

సకల వ్యాధినాశనము,

ఆయువృద్ది, అరిష్టనివారణ,

 దుష్టగ్రహ బాధా విముక్తి,

 దేవతానుగ్రహము సుఖము శాంతి సద్భావన,

 సజ్జన స్నేహము,

 సర్పదోష పరిహారము,

 సంతానప్రాప్తి,

వంశాభివృద్ది కలుగగలవు.









 వైడుర్యము అత్యంత మహిమాన్వితమైనదగుట వలన దీన్ని ధరించెడి వాడికి సకల క్షేమము కలుగ చేయగలదు. ప్రసవకాలంలో స్త్రీలకు కలుగు అనేక బాధలు నివారించి సుఖముగా శీఘ్రముగా ప్రసవము జేయింపగలరు. ఈ రత్నమును నీటియందుంచి ఆ నీటిని ప్రసవ స్త్రీలచే త్రాగించిన శీఘ్రముగా ప్రసవించుటయే గాక ప్రసవానంతరం సంభవించే దుష్టలక్షణముల నుండి పూర్తిగా రక్షణ కలిగించగలదు..



చర్మ వ్యాధులు గలవారు ఈ వైడుర్యము ఆదివాసము గావించిన నీటిచే స్నానము చేసిన అనతి కాలంలోనే చర్మ వ్యాధుల నుండి విముక్తులై ఆరోగ్యవంతులు కాగలరు.

గృహము నందలి సింహద్వారామునకు పైభాగమున వైడూర్యములు తాపటము జేయించిన ఆ గృహమునందు నివశించే వారికి అమ్మవారు ఆటలమ్మ, తడపర, కలరా, మొదలగు బాధించవు. వైడూర్య రత్నము అమోఘమైన శక్తి సంపన్నమై యున్నది. ఇది ధరించిన శతృవులు సైతం మితృలుగా మారిపోగలరు.


 పగవారు చేయు చేత బడి, ప్రయోగములు మొదలగు కృత్రిమములు భూత భేతాళ, యక్ష రాక్షస, శాకినీ, కామినీ మొహినీ, గ్రహబాధలు దరిజేరలేవు.

దీని వలన జీవితములో మంచి అభివృద్ది, మేధాశక్తి, ఆలోచనా పటిమను, కర్య సాధన, జనాకర్షన, జనరంజనలకీ వైడూర్యమును మించిన రత్నము మరొకటి లేదు.















 వైడూర్యము ధరించే పద్ధతి :
 రత్నాలకు గ్రహాలకు చాలా అవినాభావ సంభంధంఉంది. అదే విధంగా మానవ జీవితాలకు కూడా దగ్గర సంభంధం ఉన్నది.జీవితంలో కలిగే కష్టసుఖాలు, వ్యాధిబాధలు, దుఃఖసంతోషాలకు, గ్రహాలు మూల కారణమని జోతిష్యశాస్త్రం చెబుతుంది. ఈ మానవజీవితంలో కలిగే వ్యతిరేక ఫలితాలనుండి తప్పుకొని పూర్తి శుభఫలితాలు పొందడానికి గ్రహశాంతులతో బాటుగా రత్నములను ధరించే విధానాలు కుడా జ్యోతిశాస్త్ర పరమైనవే ! దోషరహితమైన ఉత్తమజాతికి చెందిన ప్రకాశవంతమైన వైడూర్యము, బంగారం లేదా వెండితో లేదా పంచలోహాలతో తయారు చేయ బడిన ఉంగరము నందు ఇమిడ్చి ధరించాలి ఉంగరము అడుగు భాగం రంద్రమును కలిగి ఉండే విధంగా పైభాగం ద్వజాకారం లేదా వర్తుల, చతురస్రాకారము గలిగిన పీఠమును ఏర్పరచి దాని మధ్యభాగంలో సూత్రం పైకి కనిపించే విధంగా వైడూర్యమును బిగించి, శుద్దిగావించిన పిమ్మట శాస్త్రోక్తముగా షోడశోపచార పూజలు నిర్వర్తించి శుభముహూర్తమున ధరించాలి కేతుగ్రహస్తమైన సూర్య చంద్రగ్రహణములు సంభవించిన కాలంలో వైడూర్య రత్నాన్ని ఉంగరంలో బిగించడం చాలా ఉత్తమం .

 మూలా, ఉత్తరాషాడ, ధనిష్ఠ అను నక్షత్రములచే కూడివచ్చిన అమావాస్య ఆదివారం యందు గానీ మృగశిర 1-2 పాదములయందు గానీ, ఉత్తర నక్షత్రములు గల సోమవారంగానీ శ్రావణమాసంలో శుక్లపంచమి, పూర్ణిమాతిదులయందుగానీ వర్జ్య దుర్ముహుర్తములు లేకుండా చూచి రవి లేదా చంద్ర హోరాలు జరిగే సమయంలో వైడూర్య ఉంగరమును బిగించాలి. ఆ తర్వాత దానిని ఒక దినమంతయు ఉలవ నీటియందుంచి, మరుసటి రోజు పంచ గవ్యములందు, మూడవదినము తేనెను కలిపిన నీటియందు నిద్ర గావింపజేసి శుద్ధోదకము చేత పంచామృతము చేత స్నానము గావింపజేసి ఆ ఉంగరమును శాస్త్రోక్తవిధిగా ధూపదీప నైవేద్యములచే షోడశోపచార పూజలు గావింపజేసిన పిమ్మట అనుకూలమైన శుభముహుర్తాన చేతికి ధరించవలెను. ధరించెడివాడు తమకు తారాబలం, చంద్రబలం కలిగిన శుభతిదులయందు, కృత్తిక, రోహిణి, మృగశిర, ఉత్తర, హస్త, చిత్త, శ్రవనం, ధనిష్ఠ, ఉత్తరాషాఢ నక్షత్రములు గల ఆదివారము, సోమవారము, మంగళవారములందు ధనుర్మీన కుంభరాసులు గల సమయంలో ఉంగరమును ధరించుట ప్రశస్తము, ధరించుటకు ముందుగా ఉంగరమును తన కుడిచేతి హస్తమునందుంచుకొని తూర్పు లేక ఉత్తర ముఖముగా నిలబడి గురువును, గణపతిని ధ్యానించి "ఓం హ్రీం క్రీం ఐం హ్రీం శ్రీం కేతవేఖండ శిరసే స్వాహా " అను మంత్రమునుగానీ, "సోమోధేనుగం"అను వేద మంత్రమునుగానీ 108 పర్యాయాలు జపించి ఉంగరమును ముమ్మారు కనుకద్దుకొని కుడిచేతి ఉంగరపు(అనామిక)వ్రేలికి ధరించాలి.

స్త్రీలు ఎడమ చేతికి ధరించినను దోషంలేదు. ఈ వైడూర్యమును బొటనవ్రేలికి ధరించినను దోషంలేదు. బొటన వ్రేలికి ధరించిన మంత్రసిద్ధులు చేకూరగలవు. చూపుడు వ్రేలికి ధరించిన ఆద్యాత్మికాభివృద్ది, వైరాగ్యము, మోక్షము, ప్రాప్తించగలవు.

నడిమి వ్రేలికి ధరించకూడదు.

చిటికెన వ్రేలికి ధరించిన వ్యాపారాభివృద్ది, ఉద్యోగప్రాప్తి, విద్యాజయము, కార్యసిద్ధి కలుగును. హస్తకంకణమునందిమిడ్చి మణికట్టునకు (గాజువలే)ధరించిన సర్వార్థ సాధనము కలుగును.














  వైఢూర్యం – Cats Eye
 7, 16, 25 తేదీలలో జన్మించినవారు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతుమహాదశ నడుస్తున్నవారు, అశ్విని, ముఖ, మూల నక్షత్రాలలో జన్మించినవారు చిటికెన వేలుకు ధరించాలి. మూర్చ, పక్షవాతం, క్యాన్సర్, స్పాండిలైటిస వ్యాధుల నిరోధం. నరదిష్టి, చేతబడి, ఇతర మంత్రాలు పారవు. ఉధ్యోగం లోబాధలు నివారణ, వ్యాపార వృద్ది. లక్ష్మీ కటాక్షం. శతృభవ నివారణ. ఆలోచనా శక్తి, ధైర్య వృద్ధి. స్త్రీలకు సుఖప్రసవం. ఆయువృధ్ధి.మానసిక ఆనందం.
















వజ్రం – Diamond

వజ్రము (రవ్వ)
 ఆకాశములో తూర్పునకు గానీ, పడమరకు గానీ శుక్రగ్రహం దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దీనినే "చుక్క" అనివాడుకలో సంభోధిస్తుంటారు. ఈ చుక్కవలే మరేచుక్క గూడా ప్రకాశించక పోవడం గమనార్హం, వజ్రంకూడా ఈ చుక్క వలే ప్రకాశిస్తూ మరియే రత్నమునకు లేనటువంటి కాంతి ప్రభలతో వెలుగొందుతూ ఉన్నందున వజ్రానికి శుక్రగ్రహము ఆదిపత్యము వహించుచున్నాడు.













 శుక్రుడు స్త్రీజలమై జలతత్వానికి సంభంధించిన వాడగుట వలన వజ్రముకూడా స్త్రీజాతి జతతత్వ రత్నమగుటవలన వజ్రాధిపతి శుక్రగ్రహము. పాంచభౌతికమయిన శరీరమునందు రూపము చల్లదనము అనునవి శుక్రగ్రహమునకు చెందినవి. శరీరమునందలి త్రిదోషములలో కఫదోషజన్యములైన అనేక అనారోగ్యములను వజ్రము నశింపజేయగలదు. పంచ ప్రానములందలి అపాన ప్రాణవాయువు సంకేతముగా గల వజ్రము పీతారుణ కాంతులు వజ్రంలో కూడా కలవు. కంఠ స్థనమునందలి విశుద్ధియందలి వెలువడే ఈ దివ్యకాంతుల ప్రభావము తగ్గినప్పుడు కఫము ప్రకోపమునొంది ధ్వని పేటిక ఉపిరితిత్తులు మూత్రపిండాలు, యోని మొదలగు అవయవాలకు సంభంధించిన అనేక వ్యాధులు బాధిస్తుంటాయి. ఆ సమయంలో ఉత్తమ మైన వజ్రాన్ని ధరించడం వలన శరీరంలో తరిగిన ఆయా కాంతులను వజ్రం సమకూర్చి రోగములను నశింపజేసి ఆరోగ్యం సమకూర్చగలదు. సాధారణముగా జాతకములో శుక్రగ్రహం బలహీనుడై యున్నప్పుడు కలిగే అరిష్టాలనన్నింటినీ వజ్రం తొలగించగల శక్తి కలిగి యున్నది.









జన్మకాలమునందేర్పడిన గ్రహస్థితి ననుసరించి శుక్రగ్రహ లగ్నమునుంచి 6-8-12 స్ఠ్నాములందున్నను ఆ స్థనాధిపత్యములు కల్గినను , ఆస్థానాధిపతులచే చూడబడి, కూడబడి యున్న దోషప్రదుడు మరియు కుజునితో కలసి 1-5-7 స్థానములందుండుట వలన లేక రవి చంద్రునితో కలసి 4-10 స్థానములందుండుట రాహువుతో కలసి ఒకే స్థానములో ఉండుట కూడా శుక్రగ్రహము దోషప్రదమై ఉన్నది. ఈ చెప్పబడిన స్థానములు శుక్రునుకి నీచక్షేత్రములైన కొంత దోషము తొలగిపోగలదు. జాతకమునందు గానీ గోచారమునందుగానీ శుక్రగ్రహము దుష్టస్థానములందుండి, షడ్వర్గ బలము, అష్టక బిందుబలము కలిగి యున్నప్పుడు అతనియొక్క మహర్దశ అంతర్దశలు ఇతర యోగ గ్రహములయొక్క దశలలో ఈతని భుక్తికాలములు, గోచారకాలము విపరీత దుష్పరిణామములు కలిగించగలదు.

వ్యసనములకు బానిసలగుట,

స్త్రీలోలత్వము వ్యభిచారదోషములు,

దంపతులకు నిత్యకలహము,

ప్రేమ నశించుట,

 దరిద్ర బాధలు,

కృషినష్టము,

 మానశిక అశాంతి.

 దేశదిమ్మరితనము,

 బాధలను సహింపలేకుండుట,

 స్త్రీకలహము,

 నష్టకష్టములు,

 జటిలమగురోగబాధలు,

  మర్మాయవముల వలన బాధలు,

రక్తస్రావము.

అతిమూత్రవ్యాధి,

కార్యవిఘ్నము,

 వివాహము కాకుండుట,

 వీర్య నష్టము,

 సోమరితనము, మొదలగు విపరీత ఫలితములు కలుగుచుంటవి. ఇట్టి సమయములందు యోగ్యమయిన వజ్రమును ధరించిన యెడల బాధలంతరించి ఆయుః ధన సమృద్దిగా లభించగలదు.

వజ్రము ద్వారా కలిగే శుభయోగాలు :

 ధరించే వ్యక్తి వజ్రం చిన్న దైనప్పటికీ దోషరహితంగా వుండటం చాలా ముఖ్యము ఉత్తమ లక్షణములు కలిగిన వజ్రమును ధరించడం వలన అనేక విధములైన శారీరక, మానశిక వైఫల్యాల రిత్యా కలిగే అలజడి అశాంతి నివారింపబడి సుఖ జీవనము లభిస్తుంది. అంతే గాక దరిద్ర బాధలు కష్ట నష్టములు తొలగిపోగలవు.

సంగీతము, సాహిత్యము, కవిత్వము, నటన నాట్యము, చిత్రలేఖనము మొదలగు అరువది నాలుగు కళలయందు సూక్ష్మ పరిగ్రహణ శక్తి కలిగి బాగా రాణీంచగలరు.


 సినిమా రంగమున ఉండు వారికి వజ్రధారణ చాలా అవసరం.

 సుఖరోగములు, ఇతర మర్మాయవ రోగములు నివారించగలదు.

శుక్రబలం లోపించిన వధూవరులకు వజ్రపుటుంగరమును ధరించిన యెడల వారి అన్యోన్య దాంపత్య జీవితం "మూడుపువ్వులు ఆరు కాయలు"గా ఉంటుంది.


వివాహాటంకములు ఏర్పడి ఎన్ని నాళ్ళకు వివాహం కాని వారికి వజ్రం ధరించిన తర్వాత వివాహం జరుగ గలదు.


బాలగ్రహ దోషములు, అనేక రకాల దృష్టి దోషాలు నివారింపబడుతవి.

పొడి దగ్గులు.
ఉబ్బసము వ్యాధి మూత్ర పిండాలకు సంబంధించిన దోషాలు.

 అకాల వృద్దాప్యపు లక్షణాలు వెంట్రుకలు చిన్నతనంలోనే తెల్లబడుట,


వ్యభిచార దోషాలు సంతాన దోషాలు స్త్రీల విషయంలో బెరుకుతనము, ఆహార అయిష్టత, ఊహా లోకాల్లో విహరిస్తూ సోమరితనంగా ఉండటం శరీర కృశత్వము మొదలగు శారీరక మానశిక వ్యాధుల నుంచి రక్షించి నిత్య యవ్వనులుగ తీర్చిదిద్ది నూతనోత్సాహంతో ఉల్లాసవంతమైన జీవిఉతం గడపడానికి ఈ వజ్ర ధారణ బాగా ఉపయోగపడుతుంది.



 స్త్రీలకు సంబందించిన కుసుమరోగాలు బహిష్ఠురోగాలు పోకార్చి ఆరోగ్యవంతులుగా నుంచగలదు.


వజ్రాన్ని ధరించే పద్దతి :

 వజ్రాన్ని వివిధ రూపాల్లో ధరిస్తుంటారు. కొందరు కంఠహారాల్లోను మరికొందరు హస్త కంకణాలలోను(గాజులు)చెవి కమ్మలు, ముక్కుపుడకలు షర్టు గుండీలు, యింకా అనేక విధాలుగా ధరిస్తుంటారు. సర్వసాధారనంగా వజ్రన్ని ఉంగరంలో ఇమిడ్చి ధరించడం ఎక్కువగా చేస్తుంటారు బంగారంతో చేయించిన ఉంగరానికి అడుగున రంధ్రం ఉంచి పైభగం ఐదు కోణాలు (నక్షత్రాకారం)గా తీర్చి దిద్ది దాని మద్యలో వజ్రాన్ని బిగించాలి. దిని బంగారం మినహా ఇతర లోహాలు పనికిరావు.


 భరణి పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలలో జన్మించిన వారికి వజ్రధారణ చాలా ముఖ్యము. ఇతర నక్షత్రాల వారు వారి జాతక ప్రభావాన్ని అనుసరించి శుక్రగ్రహం బలహీనంగా నున్నపుడు మాత్రమే వజ్రాన్ని ధరించాలి.


కృత్తిక, రోహిణి, ఉత్తరాషాడ, శ్రవణం ఈ ఆరు నక్షత్రాలు జన్మ నక్షత్రాలుగా గలవారు వజ్రాన్ని వాడడం అంత మంచిదికాదు.


అనూరాధ, ఉత్తరాభాధ్ర నక్షత్రాలు కలిగిన శుక్రవారం రోజునగానీ, రేవతీ నక్షత్రం గల శనివారమునందుగానీ, శుక్రుడు ఉత్తరాభాధ్ర, రేవతి నక్షత్రాలలో సంచరించే సమయంలో భరణి నక్షత్రంలో గల శుక్ర వారమునందుగానీ శుక్ర హోరాకాలం జరిగే టప్పుడు గానీ (వజ్ర దుర్ముహుర్తాలు లేకుండా చూచి) వజ్రాన్ని ఉంగరంలో బిగించాలి. ఆ తర్వాత ఆ ఉంగరాన్ని ఒక రోజంతా పంచగవ్యాలలో నిద్రగావింపజేసి, మరుసటి రోజు గుఱ్ఱము మూత్రమునందుంచి, మరొక దినము పసుపు నీటియందుంచి తిరిగి మంచి నీటి చేత పంచామృతములచేత శుద్ధిగావించాలి. ఈ ప్రకారం పరిశుద్ధమైన వజ్రపుటుంగరము (ఆభరణము)నకు శాస్త్రోక్తముగా పూజ జరిపించి ధూపదీప నైవేద్యములచే శాంతి జరిపించిన పిమ్మట ధరించెడు వాడికి తారా బలం చంద్రబలం కలిగిన శుభతిదుల యందు, బుధ, శుక్ర, శని వారాములలో మిధున, ధనుర్మీన లగ్నమునందు గల శుభముహుర్తంలో ధరించాలి. ఉంగరాన్ని లేక ఆభరనమును ధరించే ముందుగా దానిని కుడిచేతి హస్తము నందుంచుకొని తూర్పు ముఖముగా నిలబడి గురువుని, గణపతిని ధ్యానించి "ఓం శీం ఐం హ్రీం శ్రీం భృగుసూనవే శుక్రాయస్వాహా" అను మంత్రముతోగానీ లేక "వర్షంతుతే విభావరి దివో అభ్రస్య విద్యుతః రోహస్తు సర్వ బీజా న్యవ బ్రహ్మద్విషోజహి" అను మంత్రమును గానీ 108 సార్లు పఠించి శుక్రగ్రహమునకు నమస్కరించి కుడిచేతి నడిమి వ్రేలికి ఉంగరమును ధరించవలెను. (వజ్రమును ఉంగరపు వ్రేలికి ధరించుట పనికిరాదు). కొందరు చిటికెన వ్రేలుకి ధరించు చుండెదరు ఒకే ఉంగరమునందు వజ్రముతో బాటుగా కెంపు ముత్యమును జేర్చి బిగించ కూడదు. (ఇది తొమ్మిది రత్నాలు కూర్చునపుడు మాత్రంకాదు).





వజ్రమునకు ముఖ్యముగా గమనించవలసినవి పంచలక్షనములు అవి 1) దోషరహితము, 2) అధిక కోణములు, 3) కాంతిప్రకాశము 4) ఆకారము(జాతి) 5) రంగు ఇవి చాలా ముఖ్యము. 6. వజ్రం – Diamond వజ్ర శరీరం, ఆరోగ్యం కలుగుతాయని వజ్రాన్ని ధరించేవారు. శతృనిరోధం.











6, 14, 24 తేదీలలో జన్మించినవారు, శుక్రవారం జన్మించిన వారు, భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలలో పుట్టినవారు, శుక్రమహాదశ జరుగుతున్నవారు వజ్రాన్ని ధరించాలి. అంటువ్యాధి నిరోధం, భార్యభర్తల అన్యోన్యత.













పచ్చ – Emerald

పచ్చ మకరత రత్నాలు బుధగ్రహానికి చాలా ప్రీతికరమైనది. బుధగ్రహము పీత వర్ణము గలవాడు. భూతత్త్వ ప్రధానుడై ఘ్రూణేంద్రియమున కాధిపత్యము వహించుటవల్ల ఈ విశేషములు కల్గిన మకరతము బుధునుకి సంభంధించినదనడంలో ఎట్టిసందేహంలేదు. పచ్చ త్రిదోషములందలి కఫ దోషమును హరింపగలదు. పంచ ప్రాణములలో మొదటిదగు ప్రాణవాయువు సంకేతముగా గల్గియున్నది. ఇది స్త్రీజతికి సంభంధించినదని కొందరు, నపుంసక జాతికి చెందినదని కొందరు చెప్పుచున్నారు. బుధ గ్రహము మాత్రం నపుంసక గ్రహముగా జ్యోతిష్యశాస్త్రంళో వ్రాయబడినది.







శరీరమునందలి సహస్రార చక్రమునకు ఈ మకరతమునకు కాంతివర్ణ సామిప్యములు గలవు. పచ్చను ధరించిన యెడల అందలి ఆకుపచ్చ కాంతులు శరీరము నందలి వివిధ నాడీమండలములపై సకల అనారోగ్యములను వారించి అనారోగ్యమును నివారించి ఆరోగ్యమును ప్రసాదించగలదు.












 ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి అను నక్షత్రములందు జన్మించిన వారు ఏ సమయములందైనను పచ్చలను ధరించవచ్చును.


మిగిలిన నక్షత్ర జాతకులలో రోహిణి, హస్త, శ్రవణ, నక్షత్రములు గలవారు మినహా మిగిలిన అన్ని నక్షత్రములవారు ఈ పచ్చలను ధరించుట వలన శుభఫలితాలను పొందగలుగుతారు. పచ్ఛలను ధరించుట వలన జనన సమయము నందలి జాతక గ్రహముల యొక్క స్థితిగతులను విచారించి దశాంతర్దశలు, గోచారము బాగుగా పరిశీలించి బుధగ్రహము దోషప్రదునిగా నున్న సమయములందు మాత్రమే పచ్ఛను ధరించిన యెడల గ్రహముల వల్ల సంభవించే అన్ని విధములైన అరిష్టములు హరించుకొనిపోయి శుభఫలితాలు కల్గును.










 జన్మ సమయమున ఏర్పడిన జాతక చక్రము బుధగ్రహము 6-8-12 స్థానాధిపత్యములను పొందియుండుట ఆ స్థానాధిపతులతో కలసియుండుట, వారిచే చూడబడుట 6-8-12 స్థానమునందలి దోషప్రదము మరియు బుధుడు అష్టమ వ్యయాదిపత్యములు కలిగి , ద్వితీయ సప్తమ దశమ స్థానములందుండుట, యోగకారకుడై నీచ , శతృక్షేత్రములందుండుట, పాపగ్రహసహితుడై కేంద్రకోణ రాశులయందుండుట, పాపగ్రహ సహితుడై కేంద్ర కోణ రాశులయందుంచుట, షడ్వర్గ అష్టకవర్గ బలములను బుధుని దుష్టత్వము నధికము గావింపగలవు. బుధుడు దుష్ట లక్షణముతో కూడియుండి అతని యొక్క మహర్దశగానీ అంతర్దశగానీ సంభవించినప్పుడు, లేక గోచారమునందు దుష్టస్థాన సంచారము కలిగిన కాలము,

ఇతర రాజయోగ దశలయందు బుధుని అంతర్దశలు, విదశలు సంభవించిన కాలమునందు అనేక విధములైన కష్టనష్టములు ఆపదలు సంభవించగలవు. అట్టిచెడు సమయములందు ముఖ్యముగా కఫ పైత్య వికారములచే కలుగు వ్యాధులను.

బుద్ధిబలము లోపించుట,

 వ్యాపారాటంకములు,

వ్యాపార నష్టములు,

 కుటుంబకలహములు,

 దైవనింద వ్యవహార బాధలు,

నరముల బలహీనత,

 విధ్యార్థులకు పరీక్షలలో అపజయము,

గణిత విభాగమునందు పురోభివృద్దిలోపించుట.

 కృత్రిమ ప్రయోగాది బాధలు,

 మతి విభ్రమము,

విడువనట్టి జ్వరభాధ,

 కామెర్లరోగము.

 స్త్రీలకు సంభంధించిన వ్యాధులు.

 కష్ట ప్రసవము మొదలగు అనేక విధములైన వ్యాధి బాధ దుఃఖములు కలుగుచుండగలవు.


పచ్చ ద్వారా కలిగే శుభయోగాలు :

 శ్రేష్ఠమైన పచ్చలను ధరించిన యెడల, బుద్ధి జ్ఞానములు అభివృద్దినొందగలవు.

 విధ్యాజయము, పాండిత్యము, చక్కని వాక్కులు, జ్యోతిషశాస్త్రాభిరుచులు కలుగగలవు.

మాటలు సరిగారాని వారికి, నత్తి మాటలుగలవారు ఈ పచ్చను ధరించిన వారి వాక్కులు సుస్పాష్టములై యుంటవి.

తల్లివర్గీయులైన భంధువులతో గల స్పర్థలు అంతరించి వారివలన సహాయ సహకారములు పొందగలరు.

తాము చేయుచున్న వృత్తులలో కలిగే ఆటంకములు, అవాంతరములు తొలగిపోయి వారివారి వృత్తులు నిర్విఘ్నంగా కొనసాగ గలవు.

 కుటుంబములో సంభవించే గృహచ్ఛిద్రములు అంతరించి కుటుంబసౌఖ్యం లభిస్తుంది.

వ్యాపార వ్యవహారములందేర్పడిన స్తబ్దత తొలగిపోయి వ్యాపార విజయము చేకూరును.

 దైవభక్తి జ్ఞానాభివృద్ది,

 సత్కార్యచరణ సమాజంలో గౌరవ ప్రతిపత్తులు ధన సంపద ఐశ్వర్యాభివృద్ది కల్గుటయే గాక, శరీరమునందు కలిగే అనేక విధములైన జ్వరాతిసార కామిలాది బాధలు నివారణ కాగలవు.

 బి.పి అధికంగానున్న వారికిది దివ్యౌషధము,

  అంతభ్రమణము,

మూర్చరోగము,

కంఠమునందలి వొణుకు,

నాలుక యందలి దోషములు.

 స్త్రీల యొక్క ఋతు సంభంధమైన వ్యాధులు నివారింపగలదు.

ప్రసవవేదనజెందు స్త్రీలకు ఈ పచ్చను ధరింపజేసిన సుఖప్రసవము కాగలదు.

 వ్యాధి నివారణతో బాటు పరిపూర్ణ ఆరోగ్యమును కూడా ఈ పచ్చ ప్రసాదించగలదు.
















 పచ్చను ధరించే పద్దతి :

 పచ్చలను దోష రహితమైనవిగా చూచుకొని ధరించాలి. ఉత్తమ మైన మరకతాలు సత్ఫలితాలను కలిగించగలవు. మరకత రత్నాన్ని బంగారంతో పొదగబడిన బాణాకారంగల ఉంగరంలో ఇమిడ్చి ధరించడం శాస్త్రీయము.

 కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రములు కలిగిన బుధవారంగానీ, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రములు గల శుక్రవారం నాడు గానీ బుధుని యొక్క హోరాకాలంలో వర్జ దుర్ముహుర్తములు లేకుండా బోడి రత్నమును (పచ్చను) ఉంగరంలో బిగించాలి. ఆ తర్వాత ఆ ఉంగరమును ఒక దినము ఆవు పంచకంనందు ఉంచి రెండవదినము పశుపు నీటియందు నిద్ర గావింపజేసి పంచామృతములచే శుద్దిచేసి పూజించాలి. ధరించెడివారు తమకు తారాబలం చంద్రబలం కలిగిన శుభతిదులయందు, ఆది, బుధ, శుక్రవారములలో వృషభ, సింహ, కన్య, తులా లగ్నములుగల సమయమునందు ఉంగరము ధరించవలెను. ధారణకు ముందే శాస్త్రోత్తమముగా పూజలు జరిపి కుడి హస్తమునందుంచుకొని ఈ శాన్యదిశగా తిరిగి గురువుని, గణపతిని స్మరించి "ఓం శ్రీం ఐం హ్రీం శ్రీం సౌమ్యాయ సౌః క్లీం ఐం బుధాయస్వాహా" అను మంత్రమును 108 సార్లు జపించిన తర్వాత ఆ ఉంగరమును ముమ్మారు కనులకద్దుకొని కుడిచేతి చిటికెన వ్రేలునకు గానీ, లేక ఉంగరపు వ్రేలునకు గానీ ధరించవలెను.

 స్త్రీలు ఎడమ చేతి చిటికెన వ్రేలుకి ధరించుట ఆచారమై ఉన్నది.

ఉంగరము అడుగుభాగం మాత్రము రంద్రము కలిగి యుండాలి. కొందరు సిద్ద పురుషులు మరకత రత్నమును శివలింగములుగా దీర్చి దేవ తార్చనయందు నిత్య పూజలు నిర్వహించుచుండెదరు. అట్టివారి పుణ్యఫలితము అనంతము. వారికి త్వరగా మోక్షము ప్రాప్తించగలదు.












  పచ్చ – Emerald
 5, 14, 23 తేదీలలో జన్మించినవారు పచ్చను ధరించాలి.బుధవారం పుట్టినవారు. కన్యా రాశివారు. దీని రంగు ఆకుపచ్చ. జ్ఞాపకశక్తి వృధ్ధి. విద్య, వ్యాపార వృధ్ది. మానసిక వ్యధ నివారణ. గణిత శాస్త్రజ్ఞులు ధరించాల్సిన రాయి. బుధుడు పచ్చకు అధిపతి.కాలేయ వ్యాధులు, పుండ్లు, ఆస్మా, గుండె రోగాలు తగ్గుతాయి.













గోమేధికం – Jakarn

గోమేధికము

భూగోళానికి అనుసంధానమై నియమిత దూరాలలో పరిభ్రమించే గ్రహగోళాలు ఏడే ఐనా వాటి మధ్యలో ఛాయాగ్రాహకులుగా ప్రశిద్ధినొందిన రాహు-కేతువులనే గ్రహాలున్నట్లు పాశ్చాత్య ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అట్టి ఛాయాగ్రహమైన రాహువునకు, గోమేధికమునకు చాలా దగ్గర సంభంధములున్నవి. ఒక సిద్దాంతము ప్రకారం భూగోళము యొక్క కుడి ఎడమ భాగాలే రాహువు కేతువులని ప్రతీతి. అందువల్లనే భూమి యొక్క ఏ వైపు భాగం సూర్య చంద్రులకు అడ్డుగా వస్తుందో ఆ గ్రహ సంభంధిత గ్రహణం సంప్రాప్తిస్తున్నదని నవీన సిద్దాంతము. అట్టి గ్రహనకాలం పరమ పవిత్రమైనదిగా భారతీయుల నమ్మకం ఎప్పటికీ మార్పు లేనటువంటి భూమి యొక్క కుడి ఎడమల దూరం 180-0` డిగ్రీలైతే రాహువు కేతువు మధ్యగల దూరం కూడా 180-0’ డిగ్రీలే! భూమి యొక్క ఆగ్నేయ నైఋతీ భాగాలను కలిపే దక్షిణ దిక్కు రాహువైతే ఈశాన్య వాయువ్య భాగాలను కలిపే ఉత్తరదిక్కు కేతువనేది కొందరి సిద్దాంతము.


రాహుగ్రహాని కదిదేవత గోమాతగా వేదములందు తెలుపబడినది. అట్టిగోమాత యొక్క మూత్రము వంటి రంగు కల్గిన గోమేధికము రాహు సంభంధమనుటలో నిస్సందేహము లేదు. కావున రాహుగ్రహ ప్రీతికరమైన గోమేధికమును ధరించుట వలన జాతక గోచారములందలి రాహు దోషాలు నివారింపబడి సకల శ్రేయోభివృద్ధి జరుగ గలదు.











ఆర్ద్ర, స్వాతి, శతభిషం జన్మనక్షత్రాలవారు ఏ సమయమునందైనను గోమేధికమురత్నమును ధరించవచ్చును. మిగిలిన నక్షత్రములవారు మాత్రం తమ జన్మ సమయమునందలి గ్రహస్థితి ననుసరించిబలవంతుడైన రాహువు దుష్టస్థానములందున్న దశాంతర్దశ కాలమునందు మాత్రమే గోమేధికము ధరించుట ఉత్తమము. ఎవరికైనను వారి జన్మ జాతక ములందు రాహువు గ్రహము షడ్భలములు అషటకవర్గ బిందుబలము కలిగి జన్మలగ్నము నుండి 6-8-12 స్థానములందున్నను, ఆ అధిపతితోకూడుట చూడబడుట, తటస్థించినను, ఆ స్థానమునందు ఇతర పాపగ్రహ దృగ్యోగవేధా సంభంధము కలిగినను రాహువు బహుదోషప్రదుడుమరియు 2-5-7 స్తానములందు పాప గ్రహ సంభంధము కలిగి రాహువున్నను, గురు సంభంధమును కలిగి ధనుర్మీన రాశులయందున్నను, గురు సంభంధమును కలిగి రాహువు వున్నను, శని కుజుల సంభంధము కలిగి జన్మలగ్నమునందున్నను, అధిక దోషప్రదుడై అపకారముల నొనర్చును, చంద్రుడు బలహీనుడై యుండగా బలవంతుడైన రాహువు నవమస్థానము నందుండిన (శుభ దృష్టి లేక )బాలారిష్టములు కలుగ చేయ గలడు. రాహువునకు జాతకమునందలి అశుభ దశాంతర్దశలు ప్రప్తించినప్పుడు, గోచారమునందు రాహువు సంచారము దోషయుక్తమైన కాలమునందు ధరించాలి.








వివిధ రూపములలో కష్టనష్టములు,

 ఈతి బాధలు, దారున పరిస్థితులు తటస్థించి దుఃఖప్రదముగా నుండగలదు.

మరియు దుష్టగ్రహమైన రాహుగ్రహ ఫలికాలంలో కుటుంబకలహాలు,

అజన విరోధములు,

 ఆస్తినష్టము .

విద్యాభంగము,

వ్యాపార నష్టము.

 కోర్టు చిక్కులు.

 రోగచోరఋణబాధలు,

వృత్తి ప్రతికూలత,

 ఆర్థిక, సామాజిక బాధలు, దెయ్యములు, ప్రయోగాదిగాగల దుష్టగ్రహ బాధలు.

 ఆహారమునందయిష్టత.

 ఆత్మహత్యను గూర్చి ఆలోచించుట,

ఉన్మాదము,

మతిబ్రమ మొదలగు మానసిక వ్యాధులే గాక కీళ్ళవాతాలు నులి పురుగులు జేరుట,

 కడుపులో ఏలిక పాములు విరోచనాలు (అతిసారం) లివరు,

పశికర్లు,

గర్భకోశంలో వాపు, కాన్సర్,

 కడుపునొప్పి,

మలబద్దకము

 మెదడుకు సంభంధించిన అనేక వ్యాధులు.

 రహస్యముగా ఆచరించే చెడుపనులు,

 దుష్టుల స్నేహం వలన ఆపదవలు మొదలగు అనేక కష్ట నష్టములు దుఃఖబాధలు సంభవింపగలవు.


గోమేధికము వలన కలిగే శుభయోగాలు :

 ఇది రాహుగ్రహానికి సంభంధించిన రత్నమగుట వలన రాహుగ్రహ దోషములన్నింటినీ పరిహరింప జేయుటమే గాక కుటుంబసౌఖ్యము జనానుకూలత,

విధ్యాభివృద్ది,

కృషిలో విజయము ,

ఆర్ధికపుష్టి,

 వృత్తిలాభము,

 సమాజంలో గౌరవము,

ఆరోగ్యము,

స్త్రీమూలక ధనప్రాప్తి,

ఆకస్మిక ద్రవ్య లాభము,

వారసత్వపు ఆస్తిసంక్రమించుట.

 ఋణబాధలు తీరిపోవుట.

 బందువుల ఆదరణ కల్గుట.

మాతామహ వర్గీయుల ద్వారా ఉపకారము.

రాజకీయ, కోర్టు వ్యవహారములందు పరిష్కారము,

గంగా స్నానఫలము,

 దైవభక్తి.

స్థిరబుద్ది,

సన్మానమార్గము ధనాభివృద్ది,

ఆకస్మిక ప్రమాదములనుంచి, దుష్టగ్రహ పీడల నుంచి రక్షణ,

శతృనాశనము, మిత్రవర్గముల వారి సహాయ సంపత్తి లభించుట, గండములు తోలగిపోవుట,

దీర్ఘవ్యాధుల నుండి విముక్తి, సంపూర్ణారోగ్యము,

భూగృహక్షేత్ర సంపద కలుగుట, అఖండకీర్తి, జయము క్షేమము, ఉల్లాసము కలుగగలవు.

















గోమేధికము ధరించే పద్దతి :

దోషములు లేని ఉత్తమ లక్షణములు గల గోమేధికము బంగారం లేక పంచలొహముల ఉంగరమునందు బిగించిధరించిన యెడల అభీష్టము చేకూరగలదు. వెండి గోమేధికమును బిగించుటకు పనికిరాదు. ఈ రత్నమును బిగించు ఉంగరముపైభాగముపై చేట ఆకారముగా పీఠము నేర్పటుగావించి అడుగుభాగం మ్కాత్రం రంద్రమునుంచి గోమేధికమును పీఠము మద్యభాగములో బిగించి శుద్ది గావించి ధరించవలెను. రాహుగ్రహస్తమైన సూర్య లేక చంద్ర గ్రహణములు సంభవించిన కాలమునందుగానీ, ఆదివారము పుష్యమీహస్తా నక్షత్ర యుక్తమైనపుడు కానీ, సప్తమీ ఆదివారము వచ్చినప్పుడుగానీ అదే విధంగా అమావాస్య ఆదివారమ్నాడుగానీ మకర సంక్రాంతి పుణ్యకలమునందుగానీ సూర్యుని హోరా జరిగే సమయమునందుగానీ శాస్త్రీయంగా తయారు చేయబడిన ఉంగరము నందు గోమేధికమును బిగించాలి. ఆ తదుపరి ఉంగరమును ఒక దినము కాకరాకు పసరయందు మరుసటిరోజు గోమూత్రము నందు మూడవదినము ఆవుపాల యందు నిద్ర గావింపజేసిన పరిశుద్దము కాగలదు. అటుపిమ్మట పంచామృత స్నానముగావింపజేసి శాస్త్రోక్తకముగా షోడశోపచార పూజలు గావింపజేసి శుభముహుర్తమునందు వ్రేలికి ధరించుట శాస్త్రీయ సమ్మతము ధరించెడి వారికి తారాబలం చంద్రబలములు కలిగియున్న శుభతిధులు కలిగియున్నప్పుడు వర్జ్య దుర్ముహుర్తాలు లేని కాలంలో మృగశిర, ఉత్తర, చిత్త, శతభిషం, ఉత్తరాభాద్ర నక్షత్రములయందు వృషభ, మిధున, సింహం కుంభలగ్నములు జరుగు సమయములందు పూజించిన ఉంగరమును ధరించవలెను ధరింపబోవు సమయమునకు ముందు ఉంగరమును కుడిహస్తము నందుంచుకొని దక్షిణ ముఖముగా తిరిగి నిలబడి గురువుని, గణపతిని ధ్యానించి "ఓం భ్రీం ఐం హ్రీం శ్రీం తమోగ్రహాయ స్వాహా" అను మంత్రమును 108 పర్యాయాలు జపించి ఉంగరమును ముమ్మరు కనుల కద్దుకొని కుడిచేతి ఉంగరపు(అనామిక) వ్రేలికి ధరించాలి. స్త్రీలు ఎడమ వ్రేలికి ధరించుట ఆచారము గలదు. నవరత్నములను గాక ఇతర రత్నములు చేయించుఉంగరములో గోమేధికముతో బాటుగా ముత్యాలను, వైడూర్యములు జేర్చి ఉంగరమును ధరించకూడదు.









 గోమేధికం – Jakarn 4, 13, 22, 31 తేదీలలో జన్మించినారు. అరుద్ర, స్వాతి నక్షత్రాలలో పుట్టినవారు. ఆదివారం రోజున పుట్టినవారు. దీన్ని పంచలోహాలతో కలిపి ధరించాలి. ఇది గోవుమూత్రం రంగులో, చాక్లెట్ రంగులో ఉంటుంది. ఇది రాహువుకు సంబంధించిది. దీనివల్ల లాభాలు – సర్వజన వశీకరణ. ధనలాభం. శతృభాధ నివారణ. కార్యసిధ్ధి. మానసికరోగ నివారణ.జీర్ణకోశ ఇబ్భందులు తొలగుతాయి. శరీరానికి తేజస్సు. ఋణబాధ విముక్తి.














పుష్యరాగం – Topaz

పుష్యరాగం
 పుష్యరాగ రత్నాలు బృహస్పతి (గురు) గ్రహానికి విశేషమైన ప్రీతి గలవి. ఎందువలన అనగా ఖగోళంలో నున్న పుష్యమీ నక్షత్రానికి అధిపతి గురువు. ఈ నక్షత్రమువలే ప్రకాశించే పుష్యరాగం గురుగ్రహానికి అభిమాన పాత్రవంటే అతిశయోక్తి కాదేమో ? అదీగాక, కర్ణేంద్రియ ప్రధానమైన ఆకాశతత్వాధిపతి బృహస్పతి, ఆకాశము శబ్ధలక్షణము కలది. ఈ పుష్యరాగం కూగా పై లక్షణము కలిగియుండును. అందువలన గురు గ్రహమునకు సంభంధించిన రత్నము పుష్యరాగమని స్పష్టమగుచున్నది. పుష్యరాగము త్రిదోషము నందలి వాత దోషమును శమింపజేయగలదు.
ప్రాణపంచకములలో వ్యానమను ప్రాణవాయువునకు సంకేతమై ఉన్నది.












 ఇది పురుషజాతి రత్నము శరీరమునందలి అతి ప్రధానమైన అజ్ఞాచక్రమునందలి మహత్తరమైన ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయా కాంతులకు ప్రతీకమైనది పుష్యరాగము-- బృహస్పతి బ్రహ్మజ్ఞాన సమన్విటుడు బ్రహ్మజ్ఞాన ప్రతిపాదిత మయినది గాయత్రి, అట్టి గాయత్రి యొక్క ఐదు ముఖాములకు గల వర్ణములే బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించే భవామధ్య స్థానంలో గల అజ్ఞచక్రంలో నిబిడీకృతామై ఉన్నది. బృహస్పతి యొక్క రత్నమయిన పుష్యరాగం ఏ రంగులో నున్నప్పటికీ ఈ ఐదురంగుల యొక్క సమిష్టి ప్రభావము కలిగి వుంటుంది. అందువల్లనే ఈ రత్నము సత్కర్మలకు, బ్రహ్మజ్ఞాననిష్ఠులకు ఉపయోగార్ధమై రాణించుచున్నది.










పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్రములందు బుట్టిన వారు అన్ని వేళలయందు పుష్యరాగం ధరించవచ్చును. ఇతర నక్షత్రములలో జన్మించిన వారి విషయంగా భరణి, పుబ్బ, పూర్వాషాడ, నక్షత్రజాతకులు మినహా మిగిలిన అన్నినక్షత్రములవారు పుష్యరాగమును నిరభ్యరంతముగా ధరించవచ్చును.




ఈ రత్నమును ధరించుటకు జన్మకాలమునందు గ్రహముల యొక్క స్థితి గతులు విచరించి దశాంతర్దశల యందలి శుభాశుభములను గోచారము నందలి మూర్తి మరియు వేదలను బాగుగా విచారించి గురు గ్రహము దోషప్రదుడుగా నున్న సమయములందు

పుష్యరాగమును ధరించిన యెడల గురు గ్రహమువల్ల కలిగే అన్ని విధములైన కష్టనష్టములు దుఃఖములు పరిహరింపబడి సఖలైశ్వర్య భోగ భాగ్య సంపదలను ఆయురారోగ్యములను పొందగలరు.


జన్మ సమయమున లేర్పడిన జాతక చక్రమునందు గురుగ్రహము లగ్నము నుండి 6-8-12 స్థానములందున్నను, ఆ స్థానాధిపత్యములు కలిగినను, ఆ స్థానాధిపతులచే కలయుట లేక చూడబడుట యుండినను షష్ఠ్యాధిపత్యము కలిగి కోణరాశులయందున్నను, వ్యయాధిపత్యము కలిగి ద్వితీయ తృతీయ ఏకాదశ రాశులయందున్నను గురు గ్రహము బహుదోషప్రదుడు మరియు పాపగ్రహ వీక్షితుడైన క్షీణ చంద్రునితో గలసి లగ్నమునందున్నను, రాహుగ్రహ సహితుడై లేక వీక్షితుడై ఏ రాశియందున్నను గురువు గొప్ప దోషవంతుడు కాగలడు. ఇట్టి ధోషములు కలిగియున్న బృహస్పతికి స్థానాదిషడ్వర్గబలములు, అష్టకవర్గ బిందుబలము కలిగియున్న తన దోషములను వృద్ధి గావించుకొనగలడు. గురుడు దుష్ట లక్షణములతో గూడి యున్నప్పుడు అతని మహర్దశగానీ సంభవించినను లేక గోచారమునందు దుష్టన్థాన సంచారములు కలిగిన కాలము మొదలగు గురు సంభందితమైన అశుభ కాలములందు సర్వవిధములైన అరిష్టములు ప్రాప్తించగలవు.

 ముఖ్యముగా ఆర్దిక ఇబ్బందులు.

 కుటుంబకలహాలు,

పిల్లల ప్రవర్తన సరిగా లెకపోవుట.

 పుత్రవిచారము.

 భార్యతో కలహము,

దేశాటనము,

 ఋణబాధలు,

 అకారణ శతృత్వము నిందలు,

అవమానములు అగౌరవ పరిస్థితులు పరీక్షలలో అపజయము,

ఆకస్మిక ప్రమాదములు,

అజీర్ణ వ్యాధులు,

వాత ప్రకోపము,

 ఉబ్బులు,

చర్మరోగాలు,

మానసికవిచారము,

నష్టకష్టములు మొదలగు అనేక శుభఫలితములు కలుగుచుంటవి.


పుష్యరాగము ద్వారా కలిగే శుభయోగాలు : మల్లెపువ్వువంటి తెల్లని రంగు కలిగినవి గానీ, గోగు పువ్వువంటి పసుపు పచ్చని రంగుతో నున్నవి గానీ, పుష్యరాగములను శాస్త్రీయ పద్ధతుల ద్వారా ధరించిన వారికి విశేష పాండిత్యము మబ్చగలదు.

దరిద్రబాధ లంతరించి ధన సమృద్ధి కాగలదు,

విధ్యాలయందు ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణత.

సత్కర్మాచరణము, కుటుంబసౌఖ్యము,

గృహచ్ఛిద్రములంతరించి, దంపతుల అన్యోన్యత,,

వంశాభివృద్ది సంతానము ప్రయోజకులగుట.

 భంధువుల ఆదరణ, ప్రజాభిమానము,

 గౌరవము సభాపూజ్యత కీర్తి నిరాటంకము,

శతృవులు మితృలగుట, వారి వలన సహాయ సహకారములు .

సంతాన ప్రాప్తి.

అప్రయత్నముగా ధనలాభం.

 దైవభక్తి.

 దుర్వసనములందు అయిష్టత.

 జీర్ణశక్తి, వాత వ్యాధులు అంతరించుట,

మేధాశక్తి, వినయ వివేకములు,

 వ్యాధులు నివారింపబడుట.

శీఘ్రముగా ఆరోగ్యము,

 మనఃశ్శాంతి కార్యసాఫల్యత.

ఐశ్వర్యాభివృద్ది కలుగ గలవు.

యోగులు దీనిని ధరించిన యెడల పరిపూర్ణ యొగ ఫలసిద్దినొందగలరు. సత్కర్మాచరణులు నైష్టికులు ధరించిన ఆయా కర్మలందు సంపూర్ణ ఫలమునొంది ఇహపర సౌఖ్యములను పొందగలరు.

















 పుష్యరాగమును ధరించే పద్ధతి:

ఏ జాతికి చెందిన పుష్యరాగమైనప్పటికీ దోషరహితంగా చూచి బంగారు ఉంగరములో ధరించటం ఉత్తమము, వెండి యందు ధరించడం రెండవ పక్షము. ఇతర లోహములు పనికి రావు పంచలోహములలోను ఈ ఉంగరము ధరించవచ్చునని కొందరు చెప్పియున్నారు. బంగారం లేక వెండితో చేయబడిన ఉంగరము యొక్క పైపీఠము దీర్ఘచతురస్రాకారంగా చేయించి అందు పుష్యరాగ రత్నమును ఇమిడ్చి పూజించి ధరించవలెను.


మృగశిర పుష్యమి, ఉత్తర, పూర్వాభద్ర నక్షత్రములు కలిగియున్న గురువారం గానీ లేక పుష్యమీ నక్షత్ర గురు ఆది వారములందుగానీ సంభవించిననాడు గురు హోరకాలమునందు వర్జదుర్ముహుర్తములు లేకుండా చూచి పుష్యరాగమును ఉంగరమును బిగించలి ఆ తర్వాత ఉంగరమును ఒక దినమంతా పంచగవ్యములందుంచి, రెండవదినము మంచి గంధపునీటియందుంచి శుద్ధి గావించాలి. ఆ తదుపరి ఉంగరమునకు విధ్యుక్తముగా పూజ జరిపించాలి. ధరించెడువాడు తమకు తారాబలము చంద్రములు కల్గిన శుభతిదులయందు ఆది, మంగళ, గురువారములయందు సింహ, కటక ధనుర్మీన లగ్నములు జరుగుచున్నకాలమునందు ఈ ఉంగరము ధరించవలెను. ధారణకు పూర్వమే పూజాధికములను నిర్వర్తించి ఉంగరము తన కుడి హస్తమునందుంచుకొని ఉత్తరదిశాభిముఖులై గురువుని , గణపతిని ధ్యానించి "ఓం ఐం శ్రీం హ్రీం క్లీం బృహస్పతయే స్వాహా"అను మంత్రమును 108 పర్యాయములు జపించి ఆ తర్వాత ఉంగరమును ముమ్మారు కనులకద్దుకొని కుడిచేతి చూపుడు వ్రేలుకిగానీ, ఉంగరపు వ్రేలికిగానీ ధరించవలెను. స్త్రీలు కూడా ఈ పుష్యరాగ ముద్రికను కుడిచేతికి ధరించుటే శ్రేష్ఠము. ఉంగరమునకు అడుగుభాగం రంధ్రమును కలిగి వుండటం శాస్త్రీయము. అందువల్ల పుష్యరాగమునందలి వివిధకాంతులకు చెందిన కిరణశక్తి శరీరమునందు చొచ్చుకుపోయి అంతర్గత నాడీమండలములందు తమ శక్తిని ప్రభావితము గావించి దివ్యసిద్ధులను సత్ఫలితాలను కలుగచేయగలదు. పుష్యరాగ రత్నములచే చేయబడిన దేవతా విగ్రహములు నిత్యపూజలందు అత్యుత్తమ శుభఫలితములను గూర్చగలదు.







పుష్యరాగం – Topaz దీన్ని ధరించవలసినవారు. 3, 12, 21, 30 తేదీలలో జన్మించినవారు. మార్చి, సెప్టెంబర్, డిసెంబర్ నెలలో పుట్టినవారు. గురుదశ జరుగుతున్నవారు. కనక పుష్యరాగం కోరికలు తీర్చు కల్పవృక్షం. ఇది ధరిస్తే ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి. విజయం. సంతాన నష్ట నివారణ. చెడు అలవాట్లు దూరం. ఆరోగ్యం, మేధాశక్తి. ఇది గురుగ్రహానికి సంబంధించిందని ఈజిప్టులో కూడా నమ్మకం. దీని భస్మం వైన్ లో వేసుకుని తాగితే పిచ్చి, మూర్చలు తొలగిపోతాయి.




















మత్యం – Pearl

ముత్యము
మంచి జాతి ముత్యాలు చంద్రగ్రహానికి చాలా ప్రీతిప్రదము. చంద్రుడు జలగ్రహమై తెల్లని వర్ణము గలవాడగుట వలన జలము వల్ల పుట్టి సమాన వర్ణచ్ఛాయలు గల ముత్యములు చంద్ర సంభంధములై యున్నవి. అదీగాక పంచ భూతాలలో నీటికిసంభంధించిన విభాగమునందే చంద్రుడు ముత్యము గూడా నున్నవి. ఈ ముత్యము త్రిదోషములందలి కఫదోషములను పోగొట్టగలదు. అపానవాయువు సంకేతముగా గలది. స్త్రీజాతికి సంభంధించిన దగుటవలన బహుసుకుమారమై ఆకర్షణీయముగా వుంటుంది. శరీరమునందలి స్వాధిష్ఠాన చక్రమునందలి కాంతి పుంజము లేవికలవో అవి ఈ ముత్యంలో కూడాకలవని శాస్త్ర వచనము ముత్యము చూచుటకు తెలుపురంగు కలిగి ఉన్నప్పటికీ దీనినుండి వెలువడే కాంతితరంగాలు ఆకుపచ్చరంగులో నుంటవి. కావున స్వాధిష్ఠాన చక్రమునందలి ఆకుపచ్చరంగు కాంతికిరణాలు శరీరము నందంతటను వ్యాపించి, వాత దోషములు హృదయ దౌర్భల్యమును మానసిక చింతను పోకర్చి ఆరోగ్యము కలిగింపగలవు, ఈ కాంతి ప్రసారశక్తి సన్నగిల్లినప్పుడు, వాత ప్రకోపముచే అనేక వ్యాధులుత్పన్నములుకాగలవు.










 రోహిణి, హస్త, శ్రవణం అను నక్షత్రములందు పుట్టిన వారు ఏ సమయమునందైనను, ముత్యములను ధరించవచ్చును.


    ఇతర జాతకులలో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులు తప్ప తక్కిన వారందరూ ముత్యముధరించుట వలన ఇబ్బందియునుండదు.

 జన్మజాతక గ్రహములయొక్క స్థితిగతులను విచారించి దశాంతర్దశములు - గోచారము బాగుగా పరిశీలించి చంద్రగ్రహము దోషముగానున్న సమయములందీ ముత్యములను ధరించిన యెడల చంద్రగ్రహములవల్ల కలిగే సకల అరిష్టములు తొలగి శుభంకలుగుతుంది.
















 జాతక చక్రమునందు చంద్రగ్రహమునకు 6-8-12 స్థానాధి పత్యములు కల్గుట. లేక ఆస్థానములందుండుట, ఆ స్థాఅనాధిపతుల యొక్క దృష్టి, కలయిక సంభవించుటవల్ల దోషప్రదుడగుచున్నాడు. అంతేగాక రెండవస్థానమున కాధిపత్యముకలిగి ఎనిమిదవ స్థానమునందుండుట అష్టమాధిపత్యము వహించి ద్వితీయమునందుండుట వలన కూడా చంద్రుడు అపకార మొనర్చుట కవకాశములున్నవి. వీటికితోడుగా షడ్వర్గబలము లోపించుట, అష్టక వర్గమునందు హీనబిందువులు కలుగుట. కేమదృమాది దుర్యోగములు ప్రప్తించుట మొదలుగాగల లక్షణములు చంద్రుని దుష్టత్వమును అధికము గావించగలవు. చంద్రుడు దుష్టలక్షణములతో కూడియుండి అతని యొక్క దశగానీ, ఇతర శుభదశలం దాతని అంతార్దశలుగానీ సంభవించినకాలము మరియు గోచారవశమున కాలసర్ప యోగము సంభవించిన కాలమునందలి చంద్రగ్రహ సంచార సమయము బహుదుష్ట లక్షనములు గలిగి అనేక విషయ పరిణామములు, వ్యతిరేక ఫలితములు కలుగుచుండగలవు. ఆ దుష్ట సమయములందు
ముఖ్యముగా

 వ్యాపార స్థంభన నష్టము,

 ధనహీనత, భాగ్యనాశనము,

గృహకల్లోలములు దంపతులకు కలహము స్పర్థలు,

వివేక శూన్యత మనశ్శాంతి లోపించుట,

వాతాధిక్యత, నిద్రపట్టకపోవుట,

పిచ్చి పిచ్చి ఆలోచనలు,

భవిష్యత్ శూన్యంగా నుండుట,

మనోభయము,

 అజీర్ణ హృదయ సంభంధ వ్యాధులు, వివాహాటంకములు,

వృత్తిలో ప్రతికూలత, అపజయము, మాతృస్త్రీకలహములు

 మొదలగు దుఃఖజనకమైన ఫలితములు కలుగుచుంటవి. అట్టి సమయములందు మంచి ఆణిముత్యమును ధరించుటవల్ల చంద్రగ్రహ దుష్టత్వము నశించి శుభములు కలుగుతవి.


ముత్యముల ద్వారా కలిగే శుభయోగాలు : ముత్యములలో కల్లా శ్రేష్ఠమైనట్టి ఆణిముత్యమువంటి ఉత్తమజాతి ముత్యములను శాస్త్రీయ పద్ధతుల ననుసరించి ధరించిన యెడల

 ప్రశాంతత, మనశ్శాంతి,

వీర్యవృద్ది, దాంపత్య సౌఖ్యము. అన్యోన్యత,

అధిక జ్ఞాపకశక్తి, సద్భుద్ది, గౌరవ మర్యాదలు పొందగల్గుట,

స్త్రీ జనరంజనము, ధైర్యముగా పురోగమించుట,

కుటుంబ సుఖసంతోషాలు, ధన ధాన్యాభివృద్ధి, సౌభాగ్యసంపదలు కల్గుట, ఆటంకములంతరించి నిర్విఘ్నముగా అన్ని పనులు నెరవేరుట,


వివాహాది శుభకార్యములు కలసి వచ్చి సంతోషము కల్గుట జరుగగలవు.

 ఈ ముత్యధారణవల్ల కుష్ఠు, అపస్మారము, పిచ్చి, బొల్లి, చర్మవ్యాధులు, క్షయ, ఉబ్బసము, మేహవ్యాధి, కీళ్ళ వాతము, అజీర్ణ భాధలు మొదలగున వన్నియు నివారింపబడి శీఘ్రముగా ఆరోగ్యవంతులు కాగలరు.


చంద్రుడు వ్యాపారములకు కొంత సంభంధించి యుండుట వలన వ్యాపార నష్టములను నిరోధించి వ్యాపారాభివృద్ధిని కలిగించుటకు కూడా ముత్యధారణ ఉత్తమమై ఉన్నది.










ముత్యము ధరించే పద్ధతి :-

 ముత్యాలు అనేక రకాలుగా నున్నప్పటికీ నీటిచ్ఛాయలు గలిగి తెల్లనై గుండ్రంగా నుండి ప్రకాశించే ఆణిముత్యాలు ధరించడానికి బహుశ్రేష్ఠమైనవి. ముత్యమునకు బరువు ఇంత ఉండాలి అనే నియమం లేక పోయినప్పటికీ ఎంత పెద్దవిగా ఉంటే అంత మంచిది. అదీగాక ఒకే ముత్యం ముత్యం ధరించేటప్పుడు పెద్దదిగా చూచి ధరించడం అవసరం దండలు, మాలలుగా ధరించే ముత్యాలు అనేకంగాబట్టి అవి చిన్నా, పెద్దా వున్నాదోషంలేదు. ముత్యాలను బంగారం లేదా వెండి లోహాలతో చేయబడిన నలుచదరపు ఉంగరంలో ఇమిడ్చి ధరించాలి. శ్రావణశుద్ద పౌర్ణమినాడు శ్రవణ నక్షత్రంలో గానీ, లేక పూర్ణిమ సోమవారం గానీ, చంద్ర గ్రహణ సమయంలో గానీ, వృషభ రాశిలో చంద్రుడు ఏకదశస్థానంలో నుండగా గానీ, చంద్రహోర జరిగే సమయంలో గానీ, వర్జము దుర్ముహుర్తము లేకుండాచూచిమంచి ముత్యము ఉంగరమునందు బిగించాలి. ఆ తర్వాత ఆ ఉంగరము ఒక దినమంతయు ఆవుపాలలో ఉంచి మరుసటిరోజు మంచి నీటితో శుద్దిగావించాలి. ధరించేవాడు తమకు తారాబలము చంద్రబలములు బాగుగా నుండిన శుభతిధులలో సోమవారం లేక శుక్రవారం రోజున వృషభ, కర్కాటక, ధనుర్మీన లగ్నమునందు ఉంగరము (పూజించి) ధరించవలెను, ఉంగరమును నిర్ణయించిన శుభసమయమునందు ధరించుటకు ముందుగానే యధావిధిగా పూజించి, నమస్కరించి, గురువుని, గణపతిని, చంద్రగ్రహమును ధ్యానించి కుడివైపునగల అరచేతిలో నుంచుకొని "ఓం వం ఐం హ్రీం శ్రీం జూం సః చంద్రమనే స్వహా"అనే మంత్రాన్ని నిశ్చలంగా 108 పర్యాయములు జరిపించిన పిదప ఆ ఉంగరమును ముమ్మారు కనులకద్దుకొని కుడిచేతి ఉంగరపు వ్రేలికి ధరించాలి స్త్రీలు మాత్రం ఎడమ చేతి ఉంగరపు వ్రేలికి(అనామిక)ధరించడం చాలా విశేషము స్త్రీలుగాని, పురుషులు గానీ ముత్యములను మాలలుగా ఇతర ఆభరణములుగా గానీ ధరించుట గూడా పైవిధానము ప్రకారమే పూజించి ధరించవలెను. ఉండరమునందలి అడుగుభాగం రంద్రముగా నుండినయెడల ముత్యమునందలి శక్తి సంపన్నమైన దివ్యకిరణములు శరీరమునందు ప్రవేశించి ఫలసిద్దికి తోడ్పడగలదు.














మత్యం – Pearl 2, 11, 20, 29 సంఖ్యలలో జన్మించినవారికి. వృషభ, కర్కాటక రాశులవారు. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలలో పుట్టినవారు. సోమ, ఆదివారాల్లో పుట్టినవారు. నల్లముత్యం అన్నింటికన్నా విలువైంది. మానసిక ప్రశాంత్రత. సుఖనిద్ర. భార్యభర్తల మధ్య కలహాల నిరోధం. సంతానం లేనివారికి. కంటి వ్యాధులు నయం చేయడానికి.