20 October 2018

హిందూ కాలగణన

హిందూ కాలగణన
శతాబ్దము -
శతాబ్దము లేదా శతాబ్ది (Centuary) అనేది 100 సంవత్సరములకు సమానమైన ఒక కాలమానము. ప్రస్తుతం మనము క్రీ.శ. 21 వ శతాబ్దం (2001 - 2100) లో ఉన్నాం.









ఝాము
ఝాము ఒక కాలమానము. ఒక ఝాము 3 గంటలు లేదా 7 1/2 ఘడియలకు సమానము. ఎనిమిది ఝాములు ఒక రోజుగా పరిగణిస్తారు.









నిమిషము: -
నిమిషము అనేది ఒక కాలమానము. ఒక గంటలో 60 వ భాగం నిముషం. ఇది 60 సెకండ్ల కాలానికి సమానము.
నిముషం కోణానికి కూడా ఒక కొలమానం. కోణాన్ని కొలిచేటపుడు ఒక నిముషం అంటే డిగ్రీలో 60 వ వంతు. ఇది 60 ఆర్కు సెకండ్లకు సమానం.










విఘడియ -
విఘడియ ఒక కాలమానము. ఒక విఘడియ ఆరు రెప్పపాటులతో సమానం. 60 విఘడియలు ఒక ఘడియ.







ఘడియ -
ఘడియ ఒక కాలమానము. ఒక ఘడియ 60 విఘడియలతో సమానం. రెండున్నర ఘడియల కాలం ఒక గంట.
రోజు -
రోజు లేదా దినము అనేది ఒక కాలమానము. ఒక రోజు 24 గంటల కాలానికి సమానము.
రోజు అను పదము ఇండో యూరోపియను భాషా వర్గమునకు చెందిన పదము, దీనికి తెలుగు పదము దినము, కానీ నేడు రోజు అనే పదమే విరివిగా వాడుకలో ఉంది. తెలుగు కాలమానం ప్రకారం ఒక రోజును ఎనిమిది ఝాములుగా విభజించారు.
సాంప్రదాయికంగా ఒక పగలు, ఒక రాత్రిని కలిపి ఒక 'రోజు' అంటారు. రోజు అనేది సూర్యోదయంతో మొదలై సూర్యోదయంతో ముగుస్తుంది. తిథులకు, నక్షత్రాలకు సూర్యోదయ సమయమే ఇప్పటికీ ప్రామాణికం. అంటే ఈ రోజు సూర్యోదయమప్పుడు ఏ తిథి, ఏ నక్షత్రం ఉంటే అదే తిథి, నక్షత్రం ఈ రోజంతటికీ (అంటే రేపటి సూర్యోదయం దాకా) వర్తిస్తాయి. జ్యోతిశ్శాస్త్రంలో వారం కూడా సూర్యోదయంతోనే మారుతుంది.
ఒక రోజులో ఉదయం, మధ్యాహ్మం, సాయంత్రం మరియు రాత్రి అను నాలుగు భాగులుగా చేయడం ఆనవాయితీ.
కొన్ని ముఖ్యమైన రోజుల్ని స్మారక దినాలుగా ఉత్సవాలు లేదా పండుగలు జరుపుకుంటాము.







వారము -
వారము అనేది ఏడురోజులకు సమానమైన ఒక కాలమానము. ఒక సంవత్సరములో 52 వారాలు మరియు ఒకటి లేదా రెండు రోజులు ఉంటాయి. సంవత్సరపు మొదటి వారం లో గురువారము ఉంటుంది.











పక్షము
పక్షము అనగా 15 రోజులకు (లేదా కచ్చితంగా 14 రాత్రులకు) సమానమైన ఒక కాలమానము. ప్రతి నెలలో రెండు పక్షాలుంటాయి:
1. శుక్ల పక్షం (అమావాస్య నుంచి పున్నమి వరకు) : రోజు రోజుకూ చంద్రుడితో బాటే వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).
2. కృష్ణ పక్షం (పున్నమి నుంచి అమావాస్య వరకు) : రోజు రోజుకూ చంద్రుడితో బాటే వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).
తిథి
వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉంది. ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.
పక్షంలోని తిథులు
పాడ్యమి (అధి దేవత - అగ్ని)
విదియ (అధి దేవత - బ్రహ్మ)
తదియ (అధి దేవత - గౌరి)
చవితి (అధి దేవత - వినాయకుడు)
పంచమి (అధి దేవత - సర్పము)
షష్ఠి (అధి దేవత - కుమార స్వామి)
సప్తమి (అధి దేవత - సూర్యుడు)
అష్టమి (అధి దేవత - శివుడు)
నవమి (అధి దేవత - దుర్గా దేవి)
దశమి (అధి దేవత - యముడు)
ఏకాదశి (అధి దేవత - శివుడు)
ద్వాదశి (అధి దేవత - విష్ణువు)
త్రయోదశి (అధి దేవత - మన్మధుడు)
చతుర్దశి (అధి దేవత - శివుడు)
పున్నమి/పూర్ణిమ/పౌర్ణమి లేక అమావాస్య (అధి దేవత - చంద్రుడు)









 
నెల -
నెల లేదా మాసము (ఆంగ్లం: Month) అనేది ఒక కాలమానము. చంద్రమానంప్రకారం ఒక నెల 30 రోజుల కాలానికి సమానము. అయితే సూర్యమానం ప్రకారం 28-31 రోజులు వుండవచ్చును. ఒక సంవత్సర కాలంలో 12 నెలలు ...
నెల:
నెల అంటే 30 రోజుల కాలము.రెండు పక్షాల కాలము ఒక నెల. ఒక సంవత్సరములో 12 వ భాగము.
అధికమాసము -
పంచాంగ గణనం ప్రకారం సౌరమాన సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీ పదకొండుంబావు రోజులు తేడా ఉంది. చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కన్నా చిన్నది. ఇదే మాదిరిగా చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది. ఇందువల్ల ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం కావడం జరగకుండా పోతుంది. అటువంటప్పుడు సూర్యసంక్రాంతి లేకుండా పోయిన చాంద్రమాసానికి అధికమాసం అని పేరుపెట్టారు.
ఇలా అధికంగా వచ్చే అధికమాసం శుభకార్యాలకు, ముఖ్యమైన దైవకార్యాలకు పనికిరాదని నిషేధించారు.
వివరణ
సూర్యుని చుట్టూ భూమి చుట్టివచ్చే కాలాన్ని సౌర సంవత్సరం అంటారు. కాని ఈ భ్రమణం వల్ల నెలలు ఏర్పడవు. నెలలను కొలవడానికి చంద్ర భ్రమణమే మూలం. భూమి చుట్టు చంద్రుని ప్రదక్షిణాకాలాన్ని నెల అంటారు. దాన్నే చాంద్ర మాసమని అంటారు. ఆ విదంగా ఏర్పడిన 12 చాంద్ర మాసాలను కలిపి ఒక సంవత్సరం అని అనలేము. సూర్యుడు .... మేషం, వృషభం వంటి 12 రాశులలో ఒక్కో రాశిలో ఒక్క నెల సంచరించడాన్ని సౌర మాసం అని అంటారు. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోనికి ప్రవేశించ డాన్ని రాశి సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం ప్రతి నెలలోను జరుగుతుంది. కాని మనం మకర రాశి సంక్రమణాన్ని మాత్రమే మకర సంక్రాంతిగా గుర్తిస్తున్నాము. ఒక్కో రాశిలో ఒక నెలపాటు తిరగాల్సిన సూర్యుడు...... రెండు నెలల పాటు ఒకే రాశిలో వుండటం వల్ల ఏర్పడేదే అధిక మాసం. ఇందులో మొదటి నెలలో రవి సంక్రాంతి వుండదు. దాన్నే అధిక మాసం అంటారు.
అధిక మాసము చంద్ర మానము ద్వారానే వస్తుంది. చాంద్ర మానం అంటే చంద్ర కళలను (తిథులను) ఆదారంగా ఒక నెల రోజులను లెక్కించడము. సూర్యుడు ఏడాదిలో 12 రాశుల చక్రాన్నిపూర్తి చేస్తే చంద్రుడు రోజుకు ఒక నక్షత్రం చొప్పున నెలకు 27 నక్షత్రాల దగ్గరే వుంటాడు. అనగా 12 x 27 = 354 రోజులు. సూర్యుడి చుట్టు భూమి తిరగడానికి 365 రోజులా, 6 గంటలు, 11 నిముషాలు 31 సెకెండ్లు పడుతుంది. చంద్రునికైతె 354 రోజులె పడుతుంది. వీరిద్దరి మధ్య సుమారు 11 రోజులు తేడా ఉంది. ఈ వ్యత్యాసం వల్ల భూమి సూర్యుని చుట్టు 19 సార్లు తిరిగితే చంద్రుడు 235 సార్లు తిరుగుతున్నాడు. దాని వలన 19 సంవత్సరాలకు..... ఏడాదికి 12 మాసాల చొప్పున 238 మాసాలు రావలసి వుండగా 235 మాత్రమే వస్తున్నాయి. అనగా చంద్రుడు 7 నెలలు అధికంగా తిరుగు తున్నాడని అర్థం. ఆ లెక్కన ప్రతి ముప్పై రెండున్నర సౌర మాసాలకు ఒక చంద్ర మాసం అధికంగా వస్తుంది. ఈ విషయాన్ని మొట్టమొదట గ్రహించిన వారు భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞలే.
ఈ అధిక మాసము ఎప్పుడూ చైత్రమాసము నుండి ఆశ్వయుజమాసము మధ్యలోనే వస్తుంది. ఒక సారి అధిక మాసము వచ్చాక తిరిగి 28 నెలలకు మరోసారి వస్తుంది. ఆ తర్వాత 34, 34, 35, 28 నెలలకు వస్తుంది. అధిక మాసం ముందు వచ్చి ఆతర్వాత నిజ మాసం వస్తుంది. ఈ అధిక మాసాన్ని మైల మాసం అని అంటారు. అనగా ఈ అధిక మాసంలో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు.
సంవత్సరము -
సంవత్సరము అనేది ఒక కాలమానము. భూమి సూర్యుని చుట్టూ తిరిగే భ్రమణ క్రమంలో ఒక స్థానానికి భూమి తిరిగి రావడానికి పట్టే కాలాన్ని (సమయాన్ని) సంవత్సరం అంటారు. ఇదే నిర్వచనాన్ని ఇతర గ్రహాలకూ విస్తరించవచ్చును. ఉదాహరణకు సూర్యుని చుట్టూ అంగారక గ్రహం ఒకమారు తిరగడానికి పట్టే కాలాన్ని "అంగారక సంవత్సరం" అనవచ్చును.
ఒక సంవత్సరంలో 365 రోజులు (12 నెలలుగా విభజించబడి) ఉన్నాయి. తెలుగు కేలండర్ ప్రకారం అరవై సంవత్సరాలు ఉన్నాయి. ఇవి చక్రంలాగా మారుతూ ఉంటాయి.
కేలెండర్‌లో రెండు ఒకే తేదీల మధ్య కాలాన్ని "కేలెండర్ సంవత్సరం" అంటారు. గ్రిగేరియన్ కేలెండర్ ప్రకారం vernal equinox మార్చి 21న గాని, అంతకు కొంచెం ముందుగాని వస్తుంది. కనుక గ్రిగేరియన్ కేలెండర్ "tropical year" లేదా "vernal equinox year"ను అనుసరిస్తాయి. ఒక కేలెండర్ సంవత్సరం సగటు పరిమాణం 365.2425 "సగటు సౌర దినాలు" (mean solar days). అంటే ప్రతి 400 సంవత్సరాలకు 97 సంవత్సరాలు లీప్ సంవత్సరాలు అవుతాయి. vernal equinox year సంవత్సరం పరిమాణం 365.2424 రోజులు.
ప్రస్తుతం ఉన్న సౌర కాలమానాలలో పర్షియన్ కేలెండర్ చాలా ఖచ్చితమైనవాటిలో ఒకటి. అంకెల లెక్కలో కాకుండా ఈ విధానంలో క్రొత్త సంవత్సరం టెహరాన్ నగరంలో టైమ్ జోన్ ప్రకారం vernal equinox సంభవించిన రోజున మొదలవుతుందని విపులమైన ఖగోళశాస్త్రపు లెక్కలద్వారా నిరూపించారు.
ఖగోళ కొలమాన సంవత్సరం (సౌరమానం గాని, చాంద్రమానం గాని) దేనిలోనైనా సరైన పూర్ణసంఖ్యలో రోజులు గాని నెలలు గాని ఉండవు. కనుక లీప్ సంవత్సరం విధానం వంటివాటితో లో ఈ కొలతను సరిచేస్తుంటారు. (system of intercalation such as leap years).










జూలియన్ కేలెండర్ ప్రకారం సగటు సంవత్సరం పొడవు 365.25 రోజులు. లీప్ సంవత్సరంలో 366 రోజుఉ, మిగిలిన సంవత్సరాలలో 365 రోజులు ఉంటాయి.
కొన్ని సంవత్సరాల పరిమాణాలు
346.62 రోజులు — కొన్ని septenary కేలండర్లలో ఒక draconitic year
353, 354 or 355 రోజులు — కొన్ని చాంద్ర, సౌరమాన కేలండర్లలో ఒక సామాన్య సంవత్సరం కాలం.
354.37 రోజులు (12 చాంద్రమాన మాసాలు) — చాంద్రమాన కేండర్లలో ఒక సాధారణ సంవత్సర కాలం.
365 రోజులు — చాలా సౌరమాన కేలండర్లలో ఒక సాధారణ సంవత్సర కాలం.
365.24219 రోజులు — 2000 సంవత్సరం సమయానికి ఒక సగటు tropical సంవత్సరం.
365.2424 రోజులు — ఒక vernal equinox సంవత్సరం.
365.2425 రోజులు — గ్రిగోరియన్ కేలండర్లో ఒక సగటు సంవత్సర కాలం.
365.25 రోజులు — జూలియన్ కేలండర్లో గ్రిగోరియన్ కేలండర్లో ఒక సగటు సంవత్సర కాలం.
365.2564 రోజులు — ఒక sidereal సంవత్సరం.
366 రోజులు — చాలా సౌరమాన కేలండర్లలో లీప్ సంవత్సరం.
383, 384 లేదా 385 రోజులు — కొన్ని చాంద్రసౌరమాన కేలండర్లలో లీప్ సంవత్సరాల కాలాలు.
383.9 days (13 చాంద్రమాన మాసాలు) — కొన్ని చాంద్రసౌరమాన కేలండర్లలో లీప్ సంవత్సరం.
ఒక సగటు గ్రెగోరియన్ సంవత్సరం = 365.2425 రోజులు = 52.1775 వారములు, 8,765.82 గంటలు = 525,949.2 నిమిషములు = 31,556,952 సెకండులు . ఇది సగటు సౌరమాన సంవత్సరం - mean solar year - (SI సంవత్సరం కాదు).
ఒక సాధారణ సంవత్సరం = 365 రోజులు = 8,760 గంటలు = 525,600 నిముషాలు = 31,536,000 సెకండులు.
ఒక లీప్ సంవత్సరం = 366 రోజులు = 8,784 గంటలు = 527,040 విముషాలు = 31,622,400 సెకండులు.
గ్రిగోరియన్ కేలండర్‌లో 400 సంవత్సరాల cycleలో 146,097 రోజులు ఉంటాయి. అనగా సరిగగా 20,871 వారాలు.











కాలమానము -
కాలమానము అనగా కాలాన్ని కొలుచుటకు లేదా వ్యక్తపరచుటకు ఉపయోగించే పదము
సెకను అతి చిన్న ప్రమాణము
నిమిషము = 60 సెకనులు
గంట = 60 నిమిషాలు
రోజు = 24 గంటలు
వారము = 7 రోజులు
పక్షము = 15 రోజులు
నెల = 30 రోజులు
సంవత్సరము = 12 నెలలు
10 సంవత్సరములు = దశాబ్ధము
40 సంవత్సరములు = 1 రూబీ జూబ్లి
25 సంవత్సరములు = రజత వర్షము
50 సంవత్సరములు = స్వర్ణ వర్షము
60 సంవత్సరములు = వజ్ర వర్షము
75 సంవత్సరములు = అమృత వర్షము
100 సంవత్సరములు = శత వర్షము లేదా శతాబ్దము
1000 సంవత్సరములు = సహస్రాబ్ధి
తెలుగు కాలమానము
క్రాంతి = 1 సెకనులో 34,000వ వంతు
తృటి = 1 సెకెనులో 300వ వంతు
తృటి = 1 లవము లేదా లేశము
2 లవాలు = 1 క్షణం
30 క్షణాలు = 1 విపలం
60 విపలాలు = 1 పలం
60 పలములు = 1 చడి(24 నిమిషాలు)
2.5 చడులు = 1 హోర
24 హోరలు = 1 దినం
రెప్పపాటు అతి చిన్న ప్రమాణము
విఘడియ = 6 రెప్పపాట్లు
ఘడియ = 60 విఘడియలు
గంట = 2 1/2 ఘడియలు
ఝాము = 3 గంటలు లేదా 7 1/2 ఘడియలు
రోజు = 8ఝాములు లేదా 24 గంటలు
వారము = 7 రోజులు
పక్షము = 15 రోజులు
మండలము = 40 రోజులు
నెల = 2 పక్షములు లేదా 30 రోజులు
ఋతువు = 2 నెలలు
కాలము = 4 నెలలు
ఆయనము = 3 ఋతువులు లేదా 6 నెలలు
సంవత్సరము = 2 ఆయనములు
పుష్కరము = 12 సంవత్సరములు
ఆయనము -
ఆయనము ఒక కాలమానము. ఒక ఆయనము 3 ఋతువులు లేదా 6 నెలలకు సమానము. ఒక సంవత్సరములో రెండు ఆయనాలు వస్తాయి. అవి ఉత్తరాయనము మరియు దక్షిణాయనము.
ఋతువు (భారతీయ కాలం) -
భారతదేశంలోని ఋతువులు,అవి ఏ మాసంలో వస్తాయో, వాటి లక్షణాలను తెలియజేస్తుంది. సంవత్సరమునకు ఆరు ఋతువులు
ఋతువు కాలం హిందూ చంద్రమాన మాసములు ఆంగ్ల నెలలు లక్షణాలు ౠతువులో వచ్చే పండగలు
1 వసంతఋతువు Spring చైత్రమాసము మరియు వైశాఖమాసము. చెట్లు చిగురించి పూవులు పూయును.  మార్చి 20నుండి మే 20 సుమారు 20-30 డిగ్రీల ఉష్ణోగ్రత; వివాహాల కాలం ఉగాది, శ్రీరామ నవమి, వైశాఖి, హనుమజ్జయంతి, ఈ ౠతువులో వచ్చే పండగలు.
2 గ్రీష్మఋతువు Summer జ్యేష్ఠమాసము మరియు ఆషాఢమాసము. ఎండలు మెండుగా ఉండును.   మే 20 నుండి జూలై 20 బాగా వేడిగా ఉండి 40 డిగ్రీల ఉష్ణోగ్రత, వటపూర్ణిమ, రధాయాత్ర, గురుపూర్ణిమ,  ఈ ౠతువులో వచ్చే పండగలు.
3 వర్షఋతువు Monsoon శ్రావణమాసము మరియు భాద్రపదమాసము. వర్షములు విశేషముగా ఉండును.  జూలై 20 నుండి సెప్టెంబరు 20 చాలా వేడిగా ఉండి అత్యధిక తేమ కలిగి భారీ వర్షాలు కురుస్తాయి. రక్షా బంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, ಓಣಂ, ఈ ౠతువులో వచ్చే పండగలు.
4 శరదృతువు Autumn ఆశ్వయుజమాసము మరియు కార్తీకమాసము. మంచి వెన్నెల కాయును.  సెప్టెంబరు 20 నుండి నవంబరు 20 తక్కువ ఉష్ణోగ్రత నవరాత్రి, విజయదశమి, దీపావళి, శరద్ పూర్ణిమ, బిహు, కార్తీక పౌర్ణమి, ఈ ౠతువులో వచ్చే పండగలు.
5 హేమంతఋతువు Winter మార్గశిరమాసము మరియు పుష్యమాసము. మంచు కురియును, చల్లగా నుండు కాలము.  నవంబరు 20 నుండి జనవరి 20 చాలా తక్కువ ఉష్ణోగ్రతలు (20-25 డిగ్రీలు) పంటలు కోతల కాలం పంచ గణపతి భోగి, సంక్రాంతి,కనుమ, ఈ ౠతువులో వచ్చే పండగలు.
6 శిశిరఋతువు Winter & Fall మాఘమాసము మరియు ఫాల్గుణమాసము. చెట్లు ఆకులు రాల్చును.










కాలము -
సూర్య చంద్ర్రుల గమనము కాలము ఇది ఒక ప్రామాణము. పనుల మధ్య జరిగిన కాల భేదమును చెప్పటానికి వాడుతారు. భౌతికశాస్త్రములో మరియు సామాన్యశాస్త్రములో కాలమును ఆతి ప్రాథమిక పరిమాణముగా పరిగణిస్తారు. కాలమును ఇతర పరిమాణాలను కొలవటానికి కూడా వాడుతారు. ఉదాహరణకి వేగము. కాలానికి ఆతి చిన్న ప్రమాణము సెకను. కాలవిభజనను తెలుసుకొనుటకు కాలమానమును చూడండి.
భారతీయ కాలగణన
మాసం, పక్షం, రోజు, ఘడియ, విఘడియ, నిమిషం, పగలు, దినం, ఝాము, ఋతువు, క్షణం, ముహూర్తం, లగ్నం, సంవత్సరం, దశాబ్ధం, శతాబ్దం, శకం, వారం, తిథి.
త్రికాలములు
భూతభవిష్యద్వర్తమాన కాలాలనే త్రికాలములు అంటారు.
భూతకాలం - గతించిన కాలం.
వర్తమాన కాలం - జరుగుతున్న కాలం.
భవిష్యత్ కాలం - రాబోవు కాలం.
ప్రస్తుత కాలం తర్వాత జరగబోయే అనంతమైన కాలాన్ని భవిష్యత్తు అంటారు. భవిష్యత్తులో పలానా సమయానికి ఈ విధంగా జరుగుతుంది అని ముందుగానే చెప్పడాన్ని జ్యోతిషం అంటారు.
తెలుగు నెలలు -
తెలుగు నెలలు : తెలుగు నెలలు పన్నెండు. నెలకు ముప్పై రోజులు. పదిహేను రోజులు ఒక పక్షం. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.
ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:
1. శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు) : రోజు రోజుకూ చంద్రుడితో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్లం అంటే తెలుపు అని అర్థం).
2. కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు) : రోజు రోజుకూ చంద్రుడితో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).
చైత్రము.
వైశాఖము.
జ్యేష్ఠము.
ఆషాఢము.
శ్రావణము.
బాధ్రపదము.
ఆశ్వీయుజము.
కార్తీకము.
మార్గశిరము.
పుష్యము.
మాఘము.
ఫాల్గుణము.
ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు.
పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల చైత్రము .
పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల వైశాఖము.
పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల జ్యేష్ఠము .
పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాషాఢా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల ఆషాఢము.
పౌర్ణమి రోజున శ్రవణం నక్షత్రం (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల శ్రావణము .
పౌర్ణమి రోజున పూర్వాబాధ్ర్హ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాబాధ్రా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల బాధ్రపదము.
పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల ఆశ్వయుజము.
పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల కార్తీకము.
పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం (అనగా చంద్రుడు మృగశిరా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల మార్గశిరము .
పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం (అనగా చంద్రుడు పుష్యమీ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల పుష్యము.
పౌర్ణమి రోజున మఖ నక్షత్రం (అనగా చంద్రుడు మఖా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల మాఘము.
పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి (ఉత్తర) నక్షత్రం (అనగా చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల ఫాల్గుణము.












05 August 2018

గ్రహములలో శుభులు పాపులు మిత్రువులు శత్రువులు

ప్రస్తుత జ్యోతిష గ్రంథములలో చంద్రుడిని శుభుడిగా పేర్కొన్నారు. ఒక చోట చంద్రుడు శుభునిగా చూపిస్తూ శత్రువులు లేరని మరల శని,శుక్ర,బుధ,రాహువు,కేతువులకు చంద్రుడు శత్రువని చెప్పారు.
చంద్రునికి శత్రువులు లేరని వీరికి చంద్రుడు ఎలా శత్రువవుతాడు అన్న విషయము ఆలోచించాలి.
గ్రహ మైత్రి పట్టికను వివరించాము.











ప్రస్తుత జ్యోతిష శాస్త్రములలో ప్రమానమయిన లగ్నమును అనుసరించి గ్రహములలో శుభులు పాపులు మిత్రువులు శత్రువులు వస్తారు అన్న విషయము తెలియక పోవడము చేతనో లేక చెప్పే వారు చెప్పలేదనో తెలుస్తున్నది కావున ఇప్పటి శాస్త్రములు చక్కటి మార్గము చూపలేక ప్రజలకు నమ్మకము పోతున్నది.







శుభ గ్రహము :
పూర్వ జన్మలలో చేసిన పుణ్య కర్మల (మంచి పనులు - ధర్మమయినవి) యొక్క పుణ్య ఫలమును ఏ గ్రహము ప్రసాదిస్తుందో ఆ గ్రహము శుభ గ్రహము అని అన్నారు.
అలాగే
పాప గ్రహము :
పూర్వ జన్మలలో చేసిన పాప కర్మల (చెడు పనులు-
అధర్మమయినవి) యొక్క పాప ఫలమును ఏ గ్రహము ప్రసాదిస్తుందో ఆ గ్రహము పాప గ్రహము అని అన్నారు
ఏ గ్రహము శుభుడో లేక పాప గ్రహమో ఎలా తెలుస్తుంది?
ప్రతీ లగ్నమును (మేష లగ్నం , వృషభ లగ్నం ) అనుసరించి ఆ లగ్నమునకు కొన్ని శుభ గ్రహములు కొన్ని పాప గ్రహములు నిర్ణయించబడినవి. ఆయా లగ్నములను అనుసరించి మాత్రమే శుభ పాప గ్రహములు వచ్చును కాని నిజముగా గ్రహములలో పాపులు ఎవ్వరూ లేరు.
ఉదా 1 : -
రాసి చక్రములో మకర లగ్నమునకు సప్తమ స్థాన అధిపతి అవడం వలన చంద్రుడు ఆ మకర లగ్నమునకు పాప గ్రహము అయ్యెను.
వరుసగా
1. మకరము 2. కుంభము 3. మీనము 4. మేషము 5.వృషభము 6.మిథునము 7. కటకము
ప్రతీ లగ్నమునకు సప్తమ స్తానము పాప స్తానం కావున ఆ సప్తమ స్థానము యొక్క అధిపతి అయిన గ్రహము ఆ లగ్నమునకు పాప గ్రహము అవుతున్నాడు. కావున చంద్రుడు మకర లగ్నమునకు స్తిర పాప గ్రహము అయ్యాడు.
ఉదా 2 :-
రాసి చక్రములో కటక/కర్కాటక లగ్నమునకు అధిపతి చంద్రుడు . కటక లగ్నమునకు స్థిర పుణ్యుడు కావడము చేత చంద్రుడు కటక లగ్నమునకు శుభ గ్రహము.
ఈవిధముగా లగ్నమును అనుసరించి కొన్ని శుభ గ్రహములు కొన్ని పాప గ్రహములు అవుతున్నవి కాని నిజముగా గ్రహములలో ఎవ్వరూ పాపులు లేరు అన్న విషయము అర్థము చేసుకోవాలి.














చంద్ర గ్రహ కారకత్వములు కొన్ని తెలుసుకుందాము .
చంద్ర గ్రహ కారకత్వములు : -
బుద్ధి, జలము , గాలి , వేగము, సుగంధములు, క్షీరము (పాలు), తెలుపు, సంతోషము, వడ్లు, సౌందర్యము, శిరోబలము, చెవుల బలము, మాత్రురూపము (గర్భము), గౌరవము, రాజ ముద్ర, పక్షులు, గగనము, శయన గృహము, శీతలము(చల్లని), కీర్తి, స్త్రీ, నిద్ర, పుష్పములు, శ్వాస , దూర దేశ ప్రయానములు, సముద్రము, నదులు, చెరువులు, చిరునవ్వు .....
చంద్రుడు బ్రహ్మ అంశన జనించిన వాడు మనము చంద్రుడికి నమస్కరించిన బ్రహ్మ కు నమస్కరించినట్లు.










సృష్టి-స్తితి-లయ లలో సృష్టి కర్త అయిన బ్రహ్మ తన అంశతో ఈ లోకమును పాలించుటకు నియమించిన వాడే ఈ చంద్రుడు.
ఒక్క చంద్రుడిని గూర్చి చెప్పవలనన్న ఒక గ్రంథమే వ్రాయ వచ్చు.
12 రాసులలో కర్కాటక/కటక రాశికి అధిపతి ఈ చంద్రుడు.
వారములలో చంద్రుని వారము సోమ వారము.
ఒక స్త్రీ ఘర్భము ధరించవలేనన్న, ఒక శిశువుకు జన్మ నీయ వలెనన్న అందుకు ఈ చంద్రుడి యొక్క అనుగ్రహము ఉండాలి.
చంద్రుడు శుభుడై శుభ స్తానములో ఉన్నవారికి మంచి సంతానము కలుగుతుంది. ఆ చంద్రుడే పాప గ్రహమై తాను ఉన్న స్తానము ననుసరించి కొంత సంతాన పరమయిన ఇబ్బందులు / లోపము కలిగిస్తాడు.










చంద్రుడు శుభ గ్రహమయిన 
చంద్రుడు రూపమున పురుషుడే అయినా స్త్రీ కారకత్వము కలవాడు కావున స్త్రీ పోషకుడు శుభుడై స్త్రీలకు మంచి రూపము , శరీర సౌష్టవము ఇచ్చును. మంచి నిద్ర , ఆనందమును, బంధు మిత్రులతో సంతోషము కలిగించును.
గగనమునకు మరియు జలమునకు అధిపతి కావున దేశ విదేశములకు వాయు , జల మార్గము ద్వారా ప్రయాణమును ఎటువంటి ఆటంకములు లేకుండా చేయును. రాజ ముద్ర కు కారకుడు కావున ప్రభుత్వ రంగమున అధికారిగా చేయును. ప్రభుత్వ అధికారుల వలన లాభము చేకుర్చును.
భార్య, భర్తల మధ్య మంచి సఖ్యతను ప్రేమ అనురాగములను పెంచి వారి సంతానముతో సుఖముగా జీవింపచేయును.








చంద్రుడు బాల్యదశ(20 సం. వరకు) కారకుడు కావున బాల్యమును చక్కగా పోషించి సంతోషము నిచ్చును. బాల్యములో చిక్కులు చిద్రములు లేకుండా చక్కగా కాలము సాగును.
మనసుకు అధిపతి కావున మనసునందు సద్బుద్దిని కల్పించును. కననివి విననివి మనసునందు కల్పించి కొత్త వస్తువులు, కొత్త మార్గములు, కొత్త విధానములను సృష్టింప చేస్తాడు. ఈ రోజు కనిపెట్టిన వస్తువులు(టెక్నాలజీ) అన్నియు ఆ చంద్రుడి అనుగ్రహము వలెనే కలుగు తున్నవి.
స్త్రీలయందు, మాతృమూర్తి యందు గౌరవము కలిగించి వారి మన్ననలను పెంపొందింప చేయును.
వస్త్రములకు అధిపతి కావున చక్కని వస్త్రములు పొందేట్లు చేయును. వస్త్రములు తయారు చేయడములో నైపుణ్యము గడింపచేయును. వస్త్ర వ్యాపారము వలన లాభము కలిగిస్తాడు.
గర్భమునందు గల శిశువునకు ఎటువంటి ఆటంకములు రాకుండా కాపడును. సుఖ ప్రసవము కలుగునట్లు చేయును.
గృహమునందు సర్వ వస్తు సముదాయము(గృహములో వాడు వస్తువులు) దిన దినాభి వృద్ది చేయును. మంచి ఆహారము భుజింపచేయును.
యాత్రలు చేయిన్చును పుణ్యము చేయు మార్గము చూపించును. దైవ దర్శనము చేయించి దైవానుగ్రహము కలిగించును.
విలాసములకు తగు ధనము ఖర్చు చేసి వృధా కాకుండా నిలవచేయించి సంతోషము కలిగించును.
ఇదంతా వారు చేసుకొన్న పుణ్యమును అనుసరించి ఆ చంద్రుడు కలిగించును.









చంద్రుడు పాప గ్రహము అయిన
చంద్రుడు పాప గ్రహ మయిన పైన చెప్పిన వాటిని లోపింప చేయును. వాటికి విరుద్ధముగా చేయును.
శ్వాస యందు, తలయందు లోపము, నాలుక యందు లోపము కల్పించి శ్వాస సంబంధించి తలకు సంబంధించి వ్యాధులు కలిగించును.
బాల్య పోషకుడు కావున బాల్యము చక్కగా సాగక ఇబ్బందులు కలిగించును.
స్త్రీ సుఖము దూరము చేయును స్త్రీ ద్వేశిగా చేయును.
గగనమునకు, సముద్రమునకు అధిపతి కావున ఆకాశ మార్గమున కాని జల మార్గమున కాని ప్రయాణ ఇబ్బందులు కలిగించును.
గృహములో సరియగు వస్తు వులు లేకుండా చేయును ఒకటి ఉంటె మరొకటి ఉందన్నట్టు చేయును.










నాలుకలో లోపము కల్పించి మాటలు సరిగా రాకపోవడము స్పష్టత లేకుండా చేయును.
సరియగు నిద్ర పట్టక అనారోగ్యము కల్పించును. విపరీతమయిన మానసిక ఆందోళనతో దుఖింప చేయును.
అధిక మయిన విలాస వంత మయిన కోరికలు కల్పించి ధనము వ్యర్థము చేసి ఇబ్బందులకు గురి చేయును.
చదువు నందు, పనులయందు మనసు నిలువక జ్ఞాన హీనత్వము కల్పించి పెద్దలచేత తిట్లు తినునట్లు చేయును.
జలముఉన్న చోట ప్రమాదములు లేదా గండములు కల్పించును.
తల్లి ప్రేమను దూరము చేయను, ఇంటికి దూరముగా బ్రతుకునట్లు చేయును.
విదేశ సంచారమునందు ఇబ్బందులు గురిచేయును లేదా వేదేశం వెల్లవలేనని ఆశచూపి ప్రయత్నములను విఫలము చేయును.
ఈ విధముగా ఎవరు చేసుకున్న పాప ఫలములను అనుసరించి వారికీ ఆ చంద్ర కారకత్వము లోపము చేయును.

పూర్వ జన్మలో పాపాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని వదిలి వేసి కనీసం ఈ మానవ జన్మలో మంచి పనులు చేస్తూ నలుగురుకి ఉపయోగపడగలరు, అంతా మంచే జరుగుతుంది.
గ్రహాలకి గ్రహాలు శత్రువులు కాదు, మనషులకి మనషులు శత్రువులు కావద్దని నా మనవి.
మంచి వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది.
మనం మారాలి.













అభిజిత్ లగ్నం అంటే ఏమిటి.

అహస్సు 60 ఘటికలులేక 24 గంటలున్నప్పుడు 30 ముహుర్తముల వ్యవస్థ ఏర్పడును అంటే ఒకొక్క ముహుర్తము రెండు ఘటికలు అనగా నలుభది ఎనిమిది నిమిషాల ప్రమాణము.పగలు ఎనిమిదవ ముుర్తము "అభిజిత్ ముహుర్తము"అని దీనినే "విజయ ముహుర్తము"అని కొందరి అభిప్రాయము.
"అష్టమే దివస స్వార్దేత్వభిజిత్ సంజ్ఞకఃక్షణం"









మధ్యాహ్నము గం!! 11:45 ని!! నుండి గం!!12:30ని!! వరకు అభిజిత్ ముహుర్తము అని అంటారు. నారద పురాణం ప్రకారం మధ్యాహ్నం
గం!!12:00లకు పూర్వము ఒక ఘడియ తరువాత ఒక ఘడియ అనగా ఉదయం గం!!11:36 ని!! నుండి మధ్యాహ్నం గం!!12:24 ని!! వరకు అభిజిన్ముహుర్తము.ప్రకారాంతముగ సూర్యోదయం నుండి నాల్గవ లగ్నం అభిజిత్ లగ్నము అభిజిత్ కాలము సుదర్శన చక్రము వలె సర్వ దోషములను నశింపజేస్తుందని చెప్పబడినది.
"దిన మధ్య గతే సూర్యే ముహుర్తే హ్యాభిజిత్ ప్రభు! చక్రమాదాయ గోవిందః సర్వాన్ దోషాన్ నికృన్తతి" 








కాని బుధవారము అభిజిత్ నింద్యము కాని దక్షిణ దిశకు ప్రయాణం చేయరాదు.
"అభిజిన్ని బుధే శస్తం యామ్యంతం గమనే తథా"
#నారద సంహిత తొమ్మిదవ అద్యాయం దివారాత్రి ముహుర్త విచారణ అందలి ఆరవ శ్లోకము #
శ్లో!!పౌరాణికా రౌద్ర సిత మైత్ర వారభవాఃక్షణాః
సావిత్రవైరాజికాఖ్యో గంధర్వాశ్చష్టమోభిజిత్!!
తాత్పర్యముః- పౌరాణికుల మతము నందు దివా ముహుర్తములు ఈ విధముగా చెప్పిరి.రౌద్ర,సిత,మైత్ర,సూర్య,సావిత్ర,వైరాజిక, గంధర్వ,అభిజిత్ అని ఎనిమిదవ ముహుర్తమే కాంతపకాలమని చెప్పిరి.








తరువాత పదవ శ్లోకము నందు నక్షత్రాధిపతులు ముహుర్తములలో శుభకాములు చేయవచ్చని చెప్పుచున్నారు.
శ్లో!!అభిజిద్భలయుక్తాస్తే సర్వ కార్యేషు సిద్ధిదాః!
ఏషు చుక్షేషు యత్కర్మ కథితం నిఖిలం చయత్!!
తదైవత్యే తన్ముహుర్తే కార్యే యాత్రాధికం సదా!!
తాత్పర్యంః-
దినమందు ఎనిదవ ముహుర్తమగు అభిజిత్ ముహుర్తము మిక్కిలి బలమైనది మరియు సకల కార్యములను చేయునది అగుచున్నది.అని చెప్పిరి ఆయా నక్షత్రములయందు విధింపబడిన ఆయా కార్యములు చేయుట కుదరక పోయినచో ఆ నక్షత్రమునకు తగిన ముహుర్తమున ఆ కార్యమును చేయవచ్చని చెప్పిరి.








వశిష్ఠ సంహిత
వివాహాధ్యాయంలో రెండు వందల ఇరవై ఆరవ శ్లోకము
శ్లో!!మధ్యం దినగతే భానౌ ముహుర్తో2భిజిదాహ్వయః!
యో2అష్టమః సర్వదోషఘ్నస్త్వం
థకారంయథా రవిః!!
తాత్పర్యముః
సూర్యుడు
ఆకాశ మధ్య భాగములో వచ్చినప్పుడు అభిజిత్ ముహుర్తమంటారు.ఇది రోజులో ఎనిమిదవ ముహుర్తము,సూర్యుడు ఏ విధముగా నైతే చీకటిని నశింపచేయునో అలాగే అభిత్ ముహురేతం సర్వ దోషములను నశింపజేయును.
శ్లో!!సూర్యచ్ఛతుర్థం యల్లగ్నమభిజిత్సంజ్ఞకం యతత్!
సర్వ దోషం నిహంత్యాశు,పినాకే త్రిపురం యథా!!
తాత్పర్యముః
సూర్యోదయమునుండి నాల్గవ ముహుర్తము అభిజిత్ ముహుర్తము అందురు.పినాకపాణి త్రిపురాసురున్ని నశింపజేసినట్టు ఈ లగ్నము కూడ సర్వ దోషములను నశింజేయును.
శ్లో!!సర్వదేశేష్విదం ముఖ్యం సర్వ వర్ణేషు సర్వదా!
సర్వ దోష హరః యద్వద్ధరిత్యక్షర ద్వయమ్!!
తాత్పర్యముః
శ్రీ హరి నామ స్మరణ ఏ విధముగా దోషములను తొలగించునో అదేవిధముగా ఈ అభిజిత్ ముహుర్తము సర్వ దోషములు తొలగించును ఇది సమస్త దేశీయులకు,సమస్త వర్ణములవారికి ప్రశస్తమైనది.








ముహుర్త రత్నావళి
యాత్రా ప్రకరణము నందు
యాత్రాభిజిత్ర్సాశన్త్యము అను అంశము నందు
శ్లో!!అష్టయోహ్యభిజి దాహ్వాయక్షజో!దక్షిణాభిముఖ యనమమతరా!!
కీర్తతో2వరక కుప్సు సూరిభి!ర్యాయినామభిమతర్ష సాధనే!!
తాత్పర్యముః
యాత్రా సమయము నందు దక్షిణ దిక్కుకు తప్ప చక్కిన దిక్కులకు పగలు పదనాలుగు ఘడియల పిదప పదహారు ఘడియల వరకు అభిజిన్ముహుర్తము మిక్కిలి ప్రశస్తమైనదని ఇష్ట సిద్ధిని ఇచ్చునని శ్రీ పతి వచనము.






నారద సంహిత
యాత్రా ప్రకరణ మందు
శ్లో!!అభిజిక్షణ యోగో2యమ చేష్ఠా ఫల సిద్ధిదః!
పంచాంగ శుద్ధ రహితే దివసే2పి ఫలప్రదః!!
తాత్పర్యముః
యాత్రాకాలము నందు అభిజిత్ కాల మైనచో పంచాంగ శుధ్ధి లేనిదైనా శుభకరమే అగును.
శ్లో!!అభిజిత్ సర్వ కార్యేషు శస్తం నాత్రోపనయనమ్!!
తాత్పర్యముః
అభిజిత్ ముహుర్తమందు అన్ని కార్యములకు ప్రశస్త్యం కాని ఉపనయనమునకు పనికిరాదు.







ముహుర్త వల్లరి
అనే సంకలనము గ్రంధ మందు ఈ విధముగా కలదు
"అభిజిత్ సర్వ దోషఘ్నం" అనే వచనము ప్రయాణమునకు మాత్రమే వర్తించును.మిగిలిన అన్ని శుభకార్యములకు దానిని వర్తిప జేయుట తగదు.
ఈ అభిజిత్ లగ్నము సర్వ దోషములను నశింపజేయును కాని వివాహం,ఉపనయనం,గర్భాధానము తప్ప మిగిలిన సర్వ శుభకార్యముల యందు ప్రశస్తమైనది అని మహర్షుల వాక్యము.ఈ అభిజిత్ లగ్నము "అశేష దోష పహరు" అని ఋషి వాక్యం.ఈ లగ్నం సుమారుగా మిట్ట మధ్యహ్నము ఉండును ఈ లగ్నములో వివాహము చేసినచో నష్టము వాటిల్లునని బ్రహ్మ శపించునట్లు నారద సంహిత నందు గలదని వ్రాసినారు.










నారద సంహిత వివాహ ప్రకరణము నందు
శ్లో!!చతుర్థ అభిజిల్లగ్నముదయరాక్షత్తు ఏప్తియమ్!
గోధూలికం తదుభయం వివాహేపుత్ర పౌత్ర దమ్!!
తాత్పర్యముః
సూర్యోదయము నుండి నాల్గవ లగ్నం అభిజిత్ ఏడవ లగ్నం గో ధూలి లగ్నం వీని యందు వివాహం చేసిన దంపతులు పుత్ర పౌత్రాభివృద్ధిగా నుండును.
శ్లో!!ప్రాచ్యానాంచ కలింగానాం ముఖ్యం గోధూలికం స్మృతమ్!
అభిజిత్ సర్వదేశేషు ముఖ్యం దోష వినాశకృత్!!
తాత్పర్యముః
తూర్పు దేశీయులకు,కళింగ దేశీయులకు గోధూలి సమయం ప్రశస్తయము మిగిలిన దేశాలవారికి అభిజిత్ లగ్నము ప్రశస్త్యము.
శ్లో!!మధ్యం దినగితేభానౌ ముహుర్తో2భిజిదాహ్వయః!
నాశయత్యఖిలాన్దోషాన్పినాకీత్రిపురం యథా!!
తాత్పర్యముః
సూర్యని మధ్యాహ్న కాలసమయమే అభిజిల్లగ్న కాలము.ఇది పినాకపాణి త్రిపురాసురున్ని ఏ విధముగా నాశనం చేశాడో అదేవిధముగా అభిజిత్ లగ్నము సమస్త దోషములను నాశనము చేయును.
శ్లో!!మధ్యందినే భానౌ సకలం దోషనమచయమ్!
కరోతి మభిజిత్తూలరాశిమివానలః!!
తాత్పర్యముః
మధ్యాహ్నకాలమందలి అభిజిత్ లగ్నము దూదిరాశి యందు నిప్పుకణం వలె సర్వ దోషాలను దహింపజేయును.











జ్యోతిష్య రత్నమాల యందు ప్రయాణమునకు అభిజిత్ ప్రశంస.
శ్లో!!అష్టమోహ్యాభిజిదాహ్వాయఃదక్షిణాభిముఖ
యాన మంతరా కీర్తితో పరకకువ్సు సూరిభిర్యాయినా మభమతర్ష సిధ్ధిదః!!
ఉత్పత విష్టి వ్యతిపాత పూర్వాన్ నిహమతి
దోషానభిజిన్ముహుర్తః కరోతి యమోయపహయ కాష్టాం దిగంతరాణి ప్రజతోర్ష సిద్ధం!!
తాత్పర్యః
ఎనిమదవ ముహుర్తమయిన అభిజిత్ ప్రయాణానికి సిద్ధినిచ్చునది అని,వ్యతీపాత, విష్ఠి కరణ,ఉత్పాతములయందు సర్వ దోషములను పోగొట్టునని మరియు అభిజిత్ దక్షిణదిక్ప్రయాణమునకు నిషేధించబడినది. 








వాస్తు దుందుభి
ఈ గ్రంధము నందు అభిజిత్ లగ్నము గూర్చి ప్రస్తావన
శ్లో!!ఉత్పాత విష్ఠి వ్యతిపాత పూర్వాన్నిహంతే దోషానభిజిన్ముహుర్తేః!
వ్రతంచ యమ్యామపహాయ కార్యకర్తుఃప్రయాతర్దిశతి స్వహృదయమ్!!
తాత్పర్యముః
ఈ అభిజిన్ముహుర్తము ఉత్పాతాదులు,విష్ఠి కరణాలు,వ్యతిపాత యోగాలుమొదలుగా గల దోషములు అన్నింటిని హరించును.ఈ అభిజిల్లగ్నమున ఉపనయనము,దక్షిణ దిక్కు ప్రయాణము,వ్రతము గాక ఏ కార్యమును గావించినను ఏ దిక్కునకు ప్రయాణించినను కార్య కర్తకును,ప్రయాణికునకు ను మనస్సునందు యేయే కోరికలు కలవో ఆ కోరికలన్ని వెరవేరును.








 జ్యోతిర్విదా భరణము
వివాహ ప్రకరణోత్తరార్దము నందలి పదవ శ్లోకము.
శ్లో!!భగోడు వాల్మీకిరిహాహసౌమ్యం సీతా నిషేవేన దుఃఖం తదూడ!
భైమే తథైవాభిజిధృక్ష మత్రిస్తచ్ఛాపమాపోడుతదేయమస్మాత్!!
తాత్పర్యముః
వాల్మీకి మహర్షి సీతా వివాహము ఫల్గునీ నక్షత్రమున జరుగుటచే వైవాహిక సౌఖ్యము అబ్బలేదని.అదేవిధముగా అత్రి మహర్షి అభిజిత్ మంచిది కాదని తెలిపిరి ఎందుకనగా ఆ నక్షత్రమున నలునికి దమయంతితో వివాహము జరిగెను అందుచే ఆమెకు కూడ వైవాహిక జీవితము సుఖము కలుగలేదు.అందువలన పూర్వఫల్గుణి,అభిజిత్ నక్షత్రాలను ప్రజల వివాహమునకు వాడకుండ త్యజించినారు.ఆ మహాత్మురాండ్ర శాపమానక్షత్రములకు తగిలిందట అని వ్యాఖ్యానమలో నున్నది.









కాలామృతము
పంచమ బిందు 177 వ శ్లోకము
శ్లో!!స్యాధ్భంగో2భిజిదాహ్వయేచనిలయేధిష్ష్యే ముహుర్తే తథా!
రోగస్స్యాధ్వనుభన్యచోత్తర దళా దృక్షేషు పంచన్వివి,
ధుఖం దక్షిణ దిక్పయాతురథవా నాన్యత్ర యాతు స్త్వయం మిానేచేదథ సర్వ దిక్షు గమనం యాతుశ్చ వక్రిం భవేత్!!
తాత్పర్యముః
అభిలగ్నము నందు,అభిజిన్నక్షత్రము నందు,అభిజిన్ముహుర్తమందు ప్రయాణము చేయు వారికి శుభకరంబనియు,దక్షిణ దిక్కు ప్రయాణము చేయు వారలకు రోగకరమనియు అని ఉన్నది.
#వాల్మీకి రామాయణము#
వాల్మీకి రామాయణము నందు యుధ్ధ కాండ నాలుగవ సర్గ మూడవ శ్లోకము నందు గోవింద రాజు వ్యాఖ్యానం నందు
శ్లో!! అస్మిన్ ముహుర్తే సుగ్రీవ ప్రయాణ మభిరోచయే!
యుక్తో ముహుర్తో విజయః ప్రాప్తో మధ్యం దివాకరః!!
వ్యాఖ్యానంః-
సుగ్రీవుడా ఈ ముహుర్తము నందే (దండయాత్ర)
ప్రయాణమునకు ఇష్టపడుచున్నాను,ఈ ముహుర్తము ప్రయాణమునకు తగినది,విజయం కలిగించునది,సూర్యుడు దినమున నడి భాగము పొందినాడు,దండయాత్రకు విజయము కలుగు కారణము చెప్పు చున్నారు,దినమందు రవి నడిమి భాగమున ఆకాశ మధ్య భాగమున పొందినాడు,దినమందు!రాత్రికి పదునైదు ముహుర్తములు పగటికి పదునైదు ముహుర్తములు కలిసి ముప్పై ముహుర్తములు రెమడు ఘడియలకొక ముహుర్తము ఇరువది నాలుగు నిమిషములకొక ఘడియ! అర్ద్రో,రోగ,మిత్ర,వసు,జల,విశ్వ,భిజిద్వెరించేంద్రాఃఐంద్రాగ్నిమూలం వరుణార్యయ భగతారా దివా ముహుర్తాస్స్యుః!!
ఆరుద్ర,అశ్రేష,అనూరాధ,మఖ,ధనిష్ఠ,పూర్వాషాఢ,ఉత్తరాషాఢ,అభిజిత్ రోహిణి,జ్యేష్ఠా,విశాఖ,మూల,శతభిషము,ఉత్తర ఫాల్గణి,పూర్వఫాల్గుని అను నక్షత్రములకు చెందినవి పగటి పదునైదు ముహుర్తములు అని "విద్యా మాధవీయం"అనే జ్యోతిష్య గ్రంధమందు చెప్పబడినవి,వీనిలో దినము నడిభాగము నున్న ముహుర్తము అభిజిన్ముహుర్తము అగును ఇది విజయావహము.
అభిజిన్ముహుర్తములు దక్షిణయాత్రలందు విశిష్ఠములని"జ్యోతిష్య రత్నాకరము" నందు "భుక్తా దక్షిణ యాత్రాయాం ప్రతిష్ఠాయాం ద్విజన్మని!అథానేచ ధ్వజారోహే మృత్యుదస్స్యాత్సదా2భిజిత్.
(భుక్తి,దక్షిణ యాత్రా,దేవతా ప్రతిష్ఠా,ఉపనయనము,అథానము,ధ్వజారోహణము అను కర్మలయందు ఎల్లప్పుడు మృత్యువు కలిగించును.)అని చెప్ప బడినది మరి అభిజిత్ ముహుర్తము దక్షిణ యాత్రకు ఎట్లు పనికి వచ్చును అని ఆక్షేపణ రాగా లంకా నగరము కిష్కిదకు దక్షిణ పూర్వము గలదు అనగా ఆగ్నేయదిశయందున్నది దక్షిణ దిశ కాదు కావున చెెప్పబడిన దోషము లేదు.
విశేషముః సర్వ సాదారణముగా ప్రయాణమందు యోగ్యమైన కాలమని ఆయా ఋషుల మతమిట్లున్నవి.
"గార్గ్య సిధ్ధాంత ముషః కాలకలన శకుటముానుటయది బృహస్పతి మతంబు!విప్రజన వాక్యమరయంగా విష్ణు మతము సర్వసిద్ధాంత మభిజిత్తు సమ్మతంబు"
(ప్రాతః కాలమున ప్రయాణము మంచిదని గార్గముని మతం,శకునము చూచి ప్రయాణము చేయుట మంచిదని బృహస్పతి మతము,(బ్రాహ్మణ వాక్యమును బట్టి ప్రయాణము చేయుట మంచిదని విష్ణు మతము) అభజిన్ముహుర్త ప్రయాణము చేయుట అందరికి సమ్మతమైన మతము.
#ముహుర్త చంద్రిక#
ముహుర్త చంద్రిక యందు అభిజిత్ విశేషము
శ్లో!!ఉత్పాత విష్ఠి వ్యతిపాపూర్వం నిహంతి దోషానభిజిన్ముహుర్త!
కరోతి యమ్యమసహాయ కాష్టాదిగంత చాణి వ్రజతోర్థసిద్దిం!!
తాత్పర్యముః
అభిజిన్ముహుర్తము ఉత్పాత దోషము విష్ఠి దోషము వ్యతిపాత ప్రముఖ దోషము ఇత్యాది దోషములు పరిహారింప జేయును ప్రయాణములందు దక్షిణ దిక్కుకు తప్ప తదితర దిక్కులకు అర్ష లాభము చేయునని అర్థము.
#ముహుర్త మార్తండము#
అభిజిత్ లక్షణం తత్ఫలం
శ్లో!!మిశ్రాఖైరువభైర్దనాదిమలవే తేక్ష్టేర్ది తే యన్తి మేక్షిప్రైర్నక్రమశో మృదూగ్ర చరభై రాత్రి త్రిభాగేష్వియాత్!
శ్రుత్యర్కేజ్యమృగేష్వయంపనియోవైశస్త్వపాదశ్ర
ఏస్తిథ్యక శన్త్విధిజిద్గ మేసఫలదో యామిం వినావీక్షణః!!
తాత్పర్యంః
అభిజిన్ముహుర్తమందు దక్షిణ దిక్కు తప్ప మిగిలిన దిక్కులకు పోవటం వలన సకల విధములకు శుభకరము విశేషఫలం అభిజిల్లక్షణ కాల సమాప్తం
(తాత్పర్యం సూక్ష్మంగా విశ్లేషణ చేడమైనది)
#ముహుర్త దర్పణము#
అభిజిత్ మరియు గోధూళి సమయాలు
శ్లో!!మధ్యందిన గతే భానో ముహుర్తో2భితదహ్వయః!
సర్వదోషన్నిహంత్సాశు పినాకీ త్రిపురం యథా!!
శ్లో!!సూర్యచ్ఛతుర్థం యల్లగ్ననుభిజిత్సంజ్ఞకం చతత్!
సర్వ దేశేత్వదం ముఖ్యం సర్వ వర్ణేషు సర్వదా!!
శ్లో!!అశేషదోషపహారం శుభప్రదం జగుర్మనీంద్రా అభిజిన్ముహుర్తం తధైవ గోధూళికనామధేయం వివాహ యాత్రాద్యాఖిలోత్సవేషు!!
తాత్పర్యముః
అభిజిన్ముహుర్తం విష్ఠి,వ్యతిపాత,దోషాలు అపహరించును వివాహము ప్రయాణము గృహప్రవేశము,వాస్తు కర్మ మొదలయిన శుభ కార్యాలయందు శ్రేష్ఠమైనది అని చెప్పబడినది.
శ్లో!!అభిజిత్సర్వ కార్యేషు శస్తం నాత్రోపనాయనం!
సూర్యాత్సప్తలగ్నం మేద్గోధూళిక మితి స్మృతమ్!!
తాత్పర్యముః
అభిజిత్ ముహుర్తము ఉపనయనమునకు త్ప్ప మిగిలిన అన్న శుభకార్యములకు ప్రసిద్దము,విశేషమైనది ప్రాశస్త్యమైనది.
#రత్నమాలా#
శ్లో!!యస్మిన్ ధిష్ణ్వే యఛ్ఛ కర్మోపధిష్టం తద్దైవత్యే తన్ముహుర్తేపి కార్యమ్!!
తాత్పర్యముః
ఏ నక్షత్రమున ఏకర్మ చేయుట చేయుట శ్రేష్ఠమని చెప్పబడినదో ఆ నక్షత్రాధి దేవత యొక్క ముహుర్త మందు ఆ శుభ కర్మ చేయుట మంచిది.
*సర్వ దేశములయందును సర్వ వర్ణములమదును ఉపనయనము తప్ప సర్వ శుభకర్మలయందును,సర్వ శుభ కార్యములయందును ప్రశస్తమైనది అని మహర్షులు చెప్పుచున్నారు.
*దైవజ్ఞులు నిశ్చయించెడి సుముహుర్తములు లగ్న బల సమపదచే స్వల్పదోషములు నశించును మహా దోషములు తొలుగుట గూర్చి చెప్పుట లేదు.ఈ అభిజిల్లగ్నము గూర్చి శాస్త్రము "అశేష దోషాపహంగ"అని చెప్పు చన్నది.
*కావున దైవజ్ఞ భారము వహిపలేని వారు ఈ అభిజిల్గ్నమును సర్వ కార్యములయందు ఆశ్రయించుట మంచిది.
ఎక్కువగా యాత్రలకు శుభప్రదమని ప్రమాణాలున్నవి.


















కాలసర్ప యోగము

కాలసర్ప యోగముః మనకు సంవత్సరములో ఉత్తరాయణము,దక్షిణాయనము,ఉఉత్తరాయణము మనకు సకల శుభకార్యములకు అనువైనది అలాగే దక్షిణాయనం కొంత కష్టకాలం అలాగే భూ గమనంలో దానియొక్క ఆక్షాంశములు ఏదైతే ఛాయను రాహువు,కేతువులుగా తెలుపుతున్నామో ఆ రాహువు_కేతువుల మధ్య ఉత్తరంలో గాని దక్షిణంలో గాని 7 గ్రహములు స్థితి పొంది యున్న దానిని సవ్య లేదా అపసవ్య కాలసర్పయోగము అంటారు ఇది సిధ్ధాంత భాగములో గుర్తిస్తారు లౌకిక విషయాలలో మాత్రమే దీని ప్రభావము ఉంటుందని కొందరు తెలిపితే మరికొందరు మనిషియొక్క వ్యక్తిగత జీవనం పై కూడ ఉంటుందని తెలుపుతారు.










బావత్రయములో ముందుగా వర్గవిభజన గావించినపుడు గురు వర్గము మరియు శని వర్గముగా ఏర్పడుతుది దానిలో గురు వర్గమునకు రవి,చంద్ర,కుజ,గురు,కేతువు ఇవి ఐదు మిత్ర గ్రహాలు ఇక శని వర్గమున శని,శుక్ర,బుధ,రాగువులు ఇలా వర్గ విభజన జకిగినపుడు గురువర్గము వారికి కాలసర్ప దోషం ఆపాదించబడినపుడు కేతువు మితృడు అనుగ్రహం తప్ప పరిహారం ఉండదు కావున గురువర్గ జాతకపలకు కేతుదోషం ఏ భావములో స్థిపొందిన ఉండదు ఇక శని వర్గ జాతకులకు రాహువు మితృడు మరి పరిహారం ఉండదు అనుగ్రహం మాత్రమే మరి దీని మధ్యలో జాతక ఫల విశ్వేషణ లో కాలసర్ప దోషము అనేది బావత్రయ విధానము నందు లేదని తెలియజేస్తున్నాను.








సర్పశాపం
ఒక మనిషి ప్రస్తుత జన్మలో గాని, గత జన్మలో గాని జతకట్టి ఆడుతున్న త్రాచుపాములపై రాళ్ళు విసరడం, త్రాచుపాములను హతమార్చడం, ఇలాంటివి చేయటం వలన తీవ్ర సర్పశాపం ఏర్పడుతుంది. మన పూర్వీకులు గాని, మనము గాని త్రాచుపాముని చంపినట్లైతే ఆ త్రాచుపాము చనిపోయిన తరువాత కొద్ది వారాలలో అస్థిపంజరముగా మారిపోయినప్పటికి ఆ అస్థిపంజరం చుట్టూ ఆ త్రాచుపాము యొక్క ప్రేతాత్మ శాపం 7 తరాల వరకు వారి పూర్వీకులను వేటాడి, వేధిస్తూ అన్నీ రకాల గ్రహాపీడలను, సంతానం కలుగకపోవటం, చర్మ సంబంధిత సమస్యలు, విపరీతమైన త్రాగుడికి బానిసలు కావటం, పరాయిస్త్రీ పురుషులతో సంభోగ వాంఛను కలిగించడం, వ్యాపారాలలో విపరీతమైన నష్టాలు రావటం , ఆకస్మిక మరణములు కలుగటం, ఎంత కష్టపడినా పెళ్లి సంబంధాలు కుదరకపోవడం లాంటి సమస్యలను ఈ సర్పశాపం కలుగచేస్తుంది. 










సర్పశాప, నాగదోష విమోచన కాకుండా జీవితములో ఎలాంటి సంతృప్తి, అభివృద్ధి ఉండవు. సర్పశాపం వలన భార్యా భర్తల మధ్య విపరీతమైన గొడవలు వస్తాయి. వివాహం అయిన కొద్ది కాలానికే విడిపోవడం జరుగుతుంది. సంతానము కలుగదు. స్త్రీలకు గర్భసంచి సంబంధిత సమస్యలు వస్తాయి. చాలా మండి భావించినట్లుగా కాలసర్పదోషము మరియు సర్పశాపము రెండు ఒకటి కాదు. ఎవరి జన్మకుండలిలో అయితే పంచమములో రాహువు లేదా కేతువు ఉన్నట్లైతే వారికి నాగదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. పంచమములో రాహు లేదా కేతు ఉన్నవారికి పిల్లలు పుట్టరు. పుట్టినా బ్రతకరు. ఈ నాగదోషము ఉన్నవారు చెప్పటానికి వీలు కానీ అనేక రకాల సమస్యలతో బాధపడతారు. అంతేకాకుండా సంతానము వలన బాధలు కలుగటం లాంటివి జరుగుతాయి. ఈ నాగశాపమునకు మరియు కాలసర్పదోషమునకు పరిహారముగా ఆశ్లేషబలి, నవనాగమండలం, నారాయణ నాగబలి, మహాసర్పబలి . ఈ నాలుగు హోమాది కార్యక్రమములు వలన  మాత్రమే ఈ దోషముల విముక్తి కలుగుతుంది. సర్పశాపముకు, కాలసర్పదోషముకు కాళహస్తిలో రాహుకేతు పూజలు చేయటం, పుట్టలో పాలు పోయటముతో సరిపోదు. ఈ కార్యకరములు కచ్చితంగా జరిపించుకోవాలి.
ఎవరి జన్మకుండలిలో అయితే మేషరాశిలో లేదా వృశ్చిక రాశిలో, లగ్నములో గాని, చతుర్థ భావములో గాని, ద్వాదశ భావములో గాని రాహు, కేతు, శని ఉన్నట్లైతే అది పరిపూర్ణ సర్పశాపం  అని తెలుసుకోవాలి.








స్త్రీలకు జన్మకుండలిలో లగ్నములో కేతువు ఉంటే వారికి నాగదోషం ఉన్నట్టు గుర్తించాలి. ఈ లగ్న కేతువు వలన నాగదోషముతో పాటు మాంగల్య దోషము కూడా ఉంటుంది. ఇలాంటి మాంగల్య దోషం ఉన్న వారికి వివాహము జరుగటం కష్టం అవుతుంది. అంతేకాకుండా కేతువు 2వ భావములో ఉన్నవారికి ‘ఆయుర్భావ నాగదోషం’ ఉన్నట్టు గుర్తించాలి. వీరికి అకాలమరణం ప్రాప్తించే అవకాశం ఉంటుంది.









దోషాలు ఎలా ఉన్నా నలుగురుకి సహాయం మీరు చేయగలిగితే అన్ని దోషాలు పోతాయి.
అందుకే మానవ సేవే మాధవ సేవ అన్నారు మన పెద్దలు.
మన మనసులో దోషాలు ఉండకుంటే అంతా మంచే జరుగుతుంది.
అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి.

















గోచార రీత్యా వక్రించే గ్రహాలు

మీ జాతక చక్రం లో ఎవైనా కొన్ని గ్రహాలు వక్రించి ఉన్నాయా అని చూడండి. గ్రహాలు "ఆర్" అనే సంకేతం తో ఉంటాయి. అలంటి గ్రహాలు మీ జాతకం లో ఉంటే వాటి ఫలితాలు తెలుసుకోండి. వాస్తవానికి గ్రహాలు వెనుకకు నడవడం (వక్రించడం) అంటూ ఉండదు. భూమి చలనం వల్ల మనకు అలా అనిపిస్తుంది అంతే. నిజానికి కొన్ని గ్రహాలు కొంత నిర్ణీత సమయాల్లో వక్రిస్తూ ఉంటాయి. శని గ్రహం 36.39%, గురు గ్రహం 30.24%, బుధ గ్రహం 19.76 %, కుజ గ్రహం 9.33% మరియూ శుక్ర గ్రాహం7.43% గ్రహం సమయం తమ మొత్తం సమయం లో వక్రిస్తూ ఉంటాయి. రాహు కేతు గ్రహాలు ఎల్లప్పుడూ వెనక్కు నడుస్తూనే ఉంటాయి. సూర్య మరియూ చంద్ర గ్రహాలు అసలు వక్రించం ఎప్పుడూ ఉండదు. మొదట గా రాహు కేతు గ్రహాల గురించి చూద్దాము. ఆ గ్రహాలు ఎప్పుడూ వెనక్కు నడవడమే గానీ ముందుకు నడవడం ఉండదు. ఐతే అవి చూసే దృష్టి మాత్రం చాల వై విద్యం తో ఉంటుంది. జాతకుని ఉన్నత స్థానాలకు వూ హించని విధంగా తీసుకుని వెళ్తుంది. రాహు, కేతు గ్రహాలు సాధారణం గా నే వెనక్కు నడవడం వల్ల, జాతకునికి కీడు చేయడం ఉండదు. ఎందుకంటే వాటి స్వభావం రెట్రోగ్రేడ్ (వక్ర గమనం) కాబట్టి. ఇక పోతే మిగతా 5 గ్రహాల సంగతి మాత్రం కాస్త పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. కుజ , బుధ , గురు , శుక్ర మరియూ శని గ్రహాలు. అవి వక్రిస్తే మన జాతకం మీద ప్రభావం చూపుతాయి. ఈ గ్రహాలే మనకు పంచ మహా పురుష యోగాలను సిద్ధింప చేస్తున్నాయి అనే విషయం కాస్త గుర్తు పెట్టుకోవాలి. సృష్టి లోని పంచ మహా శక్తులకు ఇవే నిలయం అని తెల్సు కోవాలి. గురు ఆకాశానికి, శని వాయువుకు, కుజ అగ్ని కి, శుక్రుడు నీటికి, బుధ భూమికి ప్రతీక గా చెప్తారు. ప్రతి గ్రహం ఏదో ఒక పంచ భూతానికి నిలయం కనుక మనం ఎ గ్రహం వక్రించిందో తెలుసుకొని వ్యవహరిస్తే సత్ఫలితాలు ఉంటాయి. వక్ర గ్రహాలు ముఖ్యం గా మనవ సంభంధాలు వారి మధ్య గల జీవన భంధవ్యాలపై ప్రభావం చూపుతుంది. వేద జ్యోతిషం ప్రకారం వక్రించిన గ్రహాలు మంచి బలవంత మైనవి గ ఉంటాయి. ఈ గ్రహాలు భూమికి దగ్గర గా ఉండడం వల్ల మానవుల పైన ఎక్కువ ప్రభావం చూపుతాయి. అంటే ఎంత ఏవిధంగా అనేది తరచి చూడ వలసిన విషయం. ఈ విషయం లో రెండు విధాలుగా చూడవలసి ఉంటుంది. ఒకటి గోచార రీత్యా వక్రించే గ్రహాలు మరియూ మన జాతక చక్రం లో వక్రించిన గ్రహాలు. గోచార రీత్యా వక్రించే గ్రహాలు ఆ యా వ్యక్తులపైన ఎలానూ సాధారణం గ ప్రభావం చూపుతాయి కాబట్టి ప్రత్యేకం గ ఏమీ సమస్యలు ఉండవు. జాతక రీత్యా చక్రం లో ఉండే వక్ర గ్రహాల విషయమ చాల జాగ్రతగా చూడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడూ ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి ఒక్కోసారి తిక్కగా మాట్లాడాడంటే దానికి కారణం వక్రించిన బుధుడు అని గ్రహించాలి. అందువల్ల మనం తెలుసు కావలసింది ఏమిటంటే వక్రించిన గ్రహాల విషయం అంత తేలిక గ తీసిపారెయ్యడానికి వీలు లేదు. ఆలోచనలు మొదలైనవి బుధ గ్రహ లక్షణాలు ఐతే, క్రియేటివిటీ లేక సాంఘిక పరమైన ఆలోచనలు శుక్ర గ్రహం వల్ల సంభవిస్తాయి. తమపైన తమకు నమ్మకము గురు గ్రహం వల్ల కలుగుతాయి. ఇవన్నీ వక్రించినప్ప్డు వ్యతిరేక ఫలితాలనిస్తాయని అనుభవజ్ఞులు అంటారు. ఏదైనా ఒక గ్రహం వక్రించినట్లైతే జాతకునికి అన్నీ కష్ట నష్టాలె వస్తాయని, జీవన గమనం లొ కొంచెం కుంటు బడుతుందని అని కూడ అంతా అనడం సబబు. దాన్ని ఇంకా కొంచెం వివరం గా ఛూసి నిర్ణయించుకొవాలి. ఊదాహరణకు గురు గ్రహం వక్రిస్తే ఆ వ్యక్తి ఒక విధమైన ఆత్మాభిమనాన్ని పెంపొందించుకుని తను ఒక ప్రత్యేమైన వ్యక్తి గ అనుకుని వ్యవహరించడం జరుగుతుంది. ఒక్కొ గ్రహం వక్రిస్తే వొక్కో రకమైన గుణ గణాలు జాతకుని లో కనిపిస్తాయి. బుధ గ్రహం వక్రిస్తే ఆలొచన, తెలివి తేటలు మొదలైనవటిపైన ప్రభావం ఉంటుంది. శుక్రుడు వక్రిస్తె శ్రుజనాత్మకత, సాంఘిక కర్యకలాపాలు, కుజుని వల్ల మనిషి తనను తాను వ్యక్తీకరించు కొవడం భిన్నమైన ఆలొచనలు ఉంటె, శని వల్ల ఆత్మ నిగ్రహమూ వస్తాయి.






వక్ర గ్రహ విశ్లేషణ
విధి వక్రించింది అంటూ ఉంటారు చూడండి అలాగే గ్రహాలు కూడా వొక్కో సారి వక్రించడం ఉంటుంది. దాన్ని గురించి తెలుసుకోండి. మీ జాతక చక్రం లో ఎవైనా కొన్ని గ్రహాలు వక్రించి ఉన్నాయా అని చూడండి. గ్రహాలు "ఆర్" అనే సంకేతం తో ఉంటాయి. అలంటి గ్రహాలు మీ జాతకం లో ఉంటే వాటి ఫలితాలు తెలుసుకోండి. వాస్తవానికి గ్రహాలు వెనుకకు నడవడం (వక్రించడం) అంటూ ఉండదు. భూమి చలనం వల్ల మనకు అలా అనిపిస్తుంది అంతే.
నిజానికి కొన్ని గ్రహాలు కొంత నిర్ణీత సమయాల్లో వక్రిస్తూ ఉంటాయి. శని గ్రహం 36.39%, గురు గ్రహం 30.24%, బుధ గ్రహం 19.76 %, కుజ గ్రహం 9.33% మరియూ శుక్ర గ్రాహం7.43% గ్రహం సమయం తమ మొత్తం సమయం లో వక్రిస్తూ ఉంటాయి. రాహు కేతు గ్రహాలు ఎల్లప్పుడూ వెనక్కు నడుస్తూనే ఉంటాయి. సూర్య మరియూ చంద్ర గ్రహాలు అసలు వక్రించం ఎప్పుడూ ఉండదు.
మొదట గా రాహు కేతు గ్రహాల గురించి చూద్దాము. ఆ గ్రహాలు ఎప్పుడూ వెనక్కు నడవడమే గానీ ముందుకు నడవడం ఉండదు. ఐతే అవి చూసే దృష్టి మాత్రం చాల వై విద్యం తో ఉంటుంది. జాతకుని ఉన్నత స్థానాలకు వూ హించని విధంగా తీసుకుని వెళ్తుంది. రాహు, కేతు గ్రహాలు సాధారణం గా నే వెనక్కు నడవడం వల్ల, జాతకునికి కీడు చేయడం ఉండదు. ఎందుకంటే వాటి స్వభావం రెట్రోగ్రేడ్ (వక్ర గమనం) కాబట్టి. ఇక పోతే మిగతా 5 గ్రహాల సంగతి మాత్రం కాస్త పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. కుజ , బుధ , గురు , శుక్ర మరియూ శని గ్రహాలు. అవి వక్రిస్తే మన జాతకం మీద ప్రభావం చూపుతాయి. ఈ గ్రహాలే మనకు పంచ మహా పురుష యోగాలను సిద్ధింప చేస్తున్నాయి అనే విషయం కాస్త గుర్తు పెట్టుకోవాలి. సృష్టి లోని పంచ మహా శక్తులకు ఇవే నిలయం అని తెల్సు కోవాలి. గురు ఆకాశానికి, శని వాయువుకు, కుజ అగ్ని కి, శుక్రుడు నీటికి, బుధ భూమికి ప్రతీక గా చెప్తారు. ప్రతి గ్రహం ఏదో ఒక పంచ భూతానికి నిలయం కనుక మనం ఎ గ్రహం వక్రించిందో తెలుసుకొని వ్యవహరిస్తే సత్ఫలితాలు ఉంటాయి. వక్ర గ్రహాలు ముఖ్యం గా మనవ సంభంధాలు వారి మధ్య గల జీవన భంధవ్యాలపై ప్రభావం చూపుతుంది. వేద జ్యోతిషం ప్రకారం వక్రించిన గ్రహాలు మంచి బలవంత మైనవి గ ఉంటాయి. ఈ గ్రహాలు భూమికి
దగ్గర గా ఉండడం వల్ల మానవుల పైన ఎక్కువ ప్రభావం చూపుతాయి. అంటే ఎంత ఏవిధంగా అనేది తరచి చూడ వలసిన విషయం. ఈ విషయం లో రెండు విధాలుగా చూడవలసి ఉంటుంది. ఒకటి గోచార రీత్యా వక్రించే గ్రహాలు మరియూ మన జాతక చక్రం లో వక్రించిన గ్రహాలు. గోచార రీత్యా వక్రించే గ్రహాలు ఆ యా వ్యక్తులపైన ఎలానూ సాధారణం గ ప్రభావం చూపుతాయి కాబట్టి ప్రత్యేకం గ ఏమీ సమస్యలు ఉండవు. జాతక రీత్యా చక్రం లో ఉండే వక్ర గ్రహాల విషయమ చాల జాగ్రతగా చూడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడూ ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి ఒక్కోసారి తిక్కగా మాట్లాడాడంటే దానికి కారణం వక్రించిన బుధుడు అని గ్రహించాలి. అందువల్ల మనం తెలుసు కావలసింది ఏమిటంటే వక్రించిన గ్రహాల విషయం అంత తేలిక గ తీసిపారెయ్యడానికి వీలు లేదు. ఆలోచనలు మొదలైనవి బుధ గ్రహ లక్షణాలు ఐతే, క్రియేటివిటీ లేక సాంఘిక పరమైన ఆలోచనలు శుక్ర గ్రహం వల్ల సంభవిస్తాయి. తమపైన తమకు నమ్మకము గురు గ్రహం వల్ల కలుగుతాయి. ఇవన్నీ వక్రించినప్ప్డు వ్యతిరేక ఫలితాలనిస్తాయని అనుభవజ్ఞులు అంటారు. ఏదైనా ఒక గ్రహం వక్రించినట్లైతే జాతకునికి అన్నీ కష్ట నష్టాలె వస్తాయని, జీవన గమనం లొ కొంచెం కుంటు బడుతుందని అని కూడ అంతా అనడం సబబు. దాన్ని ఇంకా కొంచెం వివరం గా ఛూసి నిర్ణయించుకొవాలి.








ఊదాహరణకు గురు గ్రహం వక్రిస్తే ఆ వ్యక్తి ఒక విధమైన ఆత్మాభిమనాన్ని పెంపొందించుకుని తను ఒక ప్రత్యేమైన వ్యక్తి గ అనుకుని వ్యవహరించడం జరుగుతుంది. ఒక్కొ గ్రహం వక్రిస్తే వొక్కో రకమైన గుణ గణాలు జాతకుని లో కనిపిస్తాయి. బుధ గ్రహం వక్రిస్తే ఆలొచన, తెలివి తేటలు మొదలైనవటిపైన ప్రభావం ఉంటుంది. శుక్రుడు వక్రిస్తె శ్రుజనాత్మకత, సాంఘిక కర్యకలాపాలు, కుజుని వల్ల మనిషి తనను తాను వ్యక్తీకరించు కొవడం భిన్నమైన ఆలొచనలు ఉంటె, శని వల్ల ఆత్మ నిగ్రహమూ వస్తాయి.



మంచి ఆలోచనలు ఉంటే మనకు అంతా మంచే జరుగుతుంది. గ్రహాలగురించి ఆలోచన మాని, నలుగురికి మంచి చేయాలని ఆలోచన చేయగలరు.

అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి.



శ్రీఫలము

లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. 

అందుకే ఆ చెట్టుకు పండిన కాయను ‘శ్రీఫలము’ అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. 


 మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగ పడుతుంది. ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది. అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం! త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!! అని తలుస్తాము. దళములు దళములుగా ఉన్నవాటినే కోసి పూజ చేస్తారు. ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు, తొమ్మిది కూడా ఉంటాయి. పుష్పములను పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. 


మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది. అందుకే , ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా,పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగుఇబ్బందులుఉన్నా మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు.  శివుడిని మారేడు దళంతో పూజ చేయగనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట. బాల్యం, యౌవనం, కౌమారం ఈ మూడింటిని నీవు చూస్తావు’ అని ఆశీర్వదిస్తాడుట.  కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది.  శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తీ మూడు గుణములకు అతీతుడు అవుతాడు.






మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే, జ్ఞానం సిద్ధిస్తుంది. ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి "శ్రీసూక్తం"లో అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే’ అమ్మా అలక్ష్మిని= దరిద్రమును పోగొట్టెదవుగాక) అని చెప్తాము. మనిషికి మూడు గుణములు, మూడు అవస్థలు ఉంటాయి. నాల్గవదానిలోకి వెళ్ళడు. నాల్గవది తురీయము. తురీయమే జ్ఞానావస్థ.. అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది. మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే. 

ఇంట్లో మారేడు చెట్టు ఉంటె , ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా>> అపారమయిన సిద్ధి కలుగుతుంది.

 యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టుక్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది.

శాస్త్రము మనకు లఘువులు నేర్పింది. మారేడు చెట్టు అంత గొప్పది.

మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది.

అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది. ‘మా-రేడు’ తెలుగులో రాజు ప్రకృతి, ,రేడు వికృతి. మారేడు అంటే మా రాజు. ఆ చెట్టు పరిపాలకురాలు. అన్నిటినీ ఇవ్వగలదు. ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు. అది పువ్వు పూయవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు. అందుకే మీకు ఏది చేతనయినా కాకపోయినా >>మీ జీవితమును పండించుకోవడానికి వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపొతే మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి. అందులో 1మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం, 2 రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట, 3 మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట. ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు. గోసేవ సంరక్షణ సమితి ,కడప
లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు.
అందుకే ఆ చెట్టుకు పండిన కాయను ‘శ్రీఫలము’ అని పిలుస్తారు.
సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. 
మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు.
మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగ పడుతుంది.
ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది. అందుకే
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం!
త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!!
అని తలుస్తాము.
దళములు దళములుగా ఉన్నవాటినే కోసి
పూజ చేస్తారు.
ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది.
అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు,
తొమ్మిది కూడా ఉంటాయి.
పుష్పములను పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి.
కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు.
మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి.
మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె
శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది.
అందుకే , ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా,పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగుఇబ్బందులుఉన్నా
మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు. 
శివుడిని మారేడు దళంతో పూజ చేయగనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట.
బాల్యం, యౌవనం, కౌమారం ఈ మూడింటిని నీవు చూస్తావు’
అని ఆశీర్వదిస్తాడుట.
కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది. 
శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తీ మూడు గుణములకు అతీతుడు అవుతాడు.
మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే, జ్ఞానం సిద్ధిస్తుంది.
ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి "శ్రీసూక్తం"లో
అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే’
అమ్మా అలక్ష్మిని= దరిద్రమును పోగొట్టెదవుగాక) అని చెప్తాము.
మనిషికి మూడు గుణములు, మూడు అవస్థలు ఉంటాయి.
నాల్గవదానిలోకి వెళ్ళడు. నాల్గవది తురీయము.
తురీయమే జ్ఞానావస్థ..
అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది.







మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే
మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే. 
ఇంట్లో మారేడు చెట్టు ఉంటె ,
ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా>> అపారమయిన సిద్ధి కలుగుతుంది.
యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు
ఆ మారేడు చెట్టుక్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి
భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది.
శాస్త్రము మనకు లఘువులు నేర్పింది.
మారేడు చెట్టు అంత గొప్పది.
మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది.
అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది.
‘మా-రేడు’
తెలుగులో రాజు ప్రకృతి, ,రేడు వికృతి.
మారేడు అంటే మా రాజు. ఆ చెట్టు పరిపాలకురాలు.
అన్నిటినీ ఇవ్వగలదు.
ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు.
అది పువ్వు పూయవలసిన అవసరం లేదు.
ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా
మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది.
అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.
అందుకే మీకు ఏది చేతనయినా కాకపోయినా >>మీ జీవితమును పండించుకోవడానికి వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపొతే మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి.
అందులో
1మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం,
2 రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట,
3 మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట.
ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.








23 April 2018

జన్మ రాశిని బట్టి ఏ రత్నం ధరించాలి

మీ జన్మరాశికి ఎటువంటి రత్నము ధరించడం మంచిదో తెలుసుకుని ధరిస్తే దానివలన విశేష ఫలితాలను పొందవచ్చును.

1. మేషం మరియు వృశ్చిక రాశుల వారికీ
మేషం మరియు వృశ్చిక రాశులకు అధిపతి కుజుడు. వీరు పగడాన్ని ధరించడం శ్రేయస్కరం.

2. వృషభ మరియు తుల రాశుల వారికి
వృషభ మరియు తుల రాశులకు అధిపతి శుక్రుడు. వీరు పూర్తిగా తెలుపు లేకుండా లేత గోధుమ రంగులోని ముత్యాలను గానీ, వజ్రాన్నిగానీ ధరించవచ్చు.

3. మిథున మరియు కన్యారాశుల వారికి
మిథున మరియు కన్యారాశులకు అధిపతి బుధుడు. వీరు పచ్చను ధరించడం వలన మేలుకలుగుతుంది.

4. కర్కాటక రాశి వారికి
కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. వీరు మంచి ముత్యాలను ధరించడం శ్రేయస్కరం.

5. సింహరాశి వారికి
సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ రాశివారు మాణిక్యాన్ని ధరించడం మంచిది.

6. ధనూ రాశి మరియు మీనరాశుల వారికి
ధనూ రాశి మరియు మీనరాశులకు అధిపతి గురువు. ఈ రాశివారు పుష్యరాగాన్ని ధరించడం మేలుచేస్తుంది.

7. మకర కుంభ రాశుల వారికి
మకర కుంభ రాశులకు అధిపతి శని. వారు నీలాన్ని ధరించడం వలన శుభాలను పొందగలరు.

ఇవి కాకుండా ప్రతి రాశివారికీ ఆ సమయం లో గ్రహగతులనుబట్టి, స్థానాధిపతులు మారుతారు. ఇందు కొరకు జన్మకుండలిని, నవాంశను బట్టి జ్యోతిష్యులు రత్నాలను సూచిస్తారు.

నవగ్రహాలు రత్నాలు ధారణ

నవగ్రహాలు రత్నాలు ధారణ:

01. ఆదిత్యుడు : సూర్యుడు.
కశ్యపుని కుమారుడు సూర్యుడు. భార్య అదితి. అందుకేఆదిత్యుడు అని పిలుస్తాము. సప్త అశ్వాలతో ఉన్న రధం అతనివాహనం. ఆ సప్త అశ్వాలు ఏడు చక్రాలకు ( మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆగ్య్హ్నా చక్రం, సహస్రారం )

వివాహ పరిబంధన దోషం, పుత్ర దోషం, పుత్ర పరిబంధన దోషం, విద్యా పరిబంధన దోషం, ఉద్యోగ పరిబంధన దోషం, సూర్యదోషం మొదలైన దోషాలతో బాధ పడే వారు సూర్యునిపూజించటం వలన ఫలితం పొందుతారు.

సింహరాశి కి అధిష్టాన దేవుడు సూర్యుడు. నవగ్రహాలలో మద్య స్థానం ఆదిత్యుడిది.అధిదేవత అగ్ని, ప్రత్యధి దేవత రుద్రుడు. ఆదిత్యుడు ఎరుపు వర్ణం లో ఉంటాడు.
ఇష్టమైన ధాన్యం : గోధుమలు

పుష్పం : తామర

వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం

జాతి రాయి : కెంపు

నైవేద్యం : గోధుమలు, రవ చక్కర పొంగలి

02. చంద్రుడు :
చాల అందమైన వాడిగా మనం వర్ణిస్తూ ఉంటాం. వర్ణనలకుకంటే మిన్నగా చంద్రుడు చాల అందమైన వాడు. పది తెల్లటిగుర్రాలతో ఉన్న రధాన్ని అధిరోహిస్తాడు. నిశాదిపతి ( రాత్రికి రాజు), క్షుపరక (రాత్రిని కాంతివంతం చేసే వాడు) అనిపేర్లు కూడా కలవు. ఇరవైఏడు నక్షత్రాలను సూచిస్తునట్టు,ఇరవైఏడు మంది భార్యలను కలిగి ఉన్నాడు. తండ్రి సోమతల్లి తారక.

అనారోగ్యం తో బాధ పడుతూ ఉన్న తల్లి, చర్మ వ్యాధులు మొదలైన సమస్యలు కలవారుచంద్రుని పూజ వలన ఫలితం పొందగలరు.

కుంభ రాశి కి అధిపతి చంద్రుడు. తూర్పు - దక్షిణ అభిముఖుడై ఉంటాడు.

అధిదేవత : నీరు.

ప్రత్యధిదేవత : గౌరి

వర్ణం : తెలుపు

ధాన్యం : బియ్యం / వడ్లు

పుష్పం : తెల్లని తామర

వస్త్రం : తెల్లని వస్త్రం

జాతి రత్నం : ముత్యం

నైవేద్యం : పెరుగన్నం

03. మంగళ : అంగారకుడు. కుజుడు.
అంగారకుడు ( ఎర్రని వర్ణం కలవాడు) అని కూడా పిలుస్తాం.ఇతను భూదేవి కుమారుడు. మేష, వృశ్చిక రాసులకిఅధిపతి. దక్షినాభిముఖుడు. రుచక మహాపురుష యోగవిద్యను భోదిస్తాడు. తమోగుణ వంతుడు.
భార్య / పిల్లలు / అన్నదమ్ముల వాళ్ళ సమస్యలు ఉండేవారు,స్నేహితులతో శత్రుత్వం, సంపదను కోల్పోయిన వారు మంగళ దేవుడిని పూజించటంవలన సత్ఫలితాలను పొందుతారు.

అధిదేవత : భూదేవి

వర్ణం: ఎరుపు

ధాన్యం : కందిపప్పు

పుష్పం : సంపంగి మరియు తామర

వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం

జాతి రత్నం : ఎర్రని పగడం

నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం

04. బుధుడు :
తార, చంద్రుల పుత్రుడు బుధుడు. రజోగుణవంతుడు. పుత్రదోషం, మంద విద్య, చంచలమైన మనసు కలవారు బుధునిపూజలు చేసి ఉపసమనం పొందుతారు. తెలివితేటల వృద్ధి,సంగీతం, జ్యోతిష్యం, గణితం, వైద్యం వంటి వాటిలోరానిచాలంటే బుధుడి అనుగ్రహం పొందాలి.

మిధున మరియు కన్యారాశి కి అధిపతి బుధుడు. తూర్పు -ఉత్తర ముఖుడై ఉంటాడు.

అధిదేవత : విష్ణు

ప్రత్యధిదేవత : నారాయణుడు

వర్ణం : చిగురాకు పచ్చ

వాహనం : సింహం

ధాన్యం : పచ్చ పెసర పప్పు

వస్త్రం : పచ్చని రంగు వస్త్రం

జాతి రత్నం : పచ్చ

నైవేద్యం : పెసరపప్పు తో కూడిన అన్నం

05. గురువు : బృహస్పతి.
బృహస్పతి అని కూడా అంటాము. దేవతలకు, దానవులగురువైన శుక్రాచారుడికి గురువు ఇతను. సత్వగుణసంపన్నుడు. పసుపుపచ్చ / బంగారు వర్ణం లో ఉంటాడు.

పేరు ప్రఖ్యాతులు, సంపద, తోడ బుట్టినవారి క్షేమము కొరకుగురువు ని పూజించాలి

ధన్నురాశి, మీనా రాశిలకు అధిపతి. ఉతరముఖుడైఉంటాడు.

అధిదేవత : బ్రహ్మ

ప్రతదిదేవత : ఇంద్రుడు

వర్ణం: పసుపు

వాహనం : గజరాజు

ధాన్యం : వేరుసెనగ పప్పు

పుష్పం : మల్లె

వస్త్రం : బంగారు రంగు వస్త్రం

జాతి రత్నం : పుష్య రాగం

నైవేద్యం : సెనగపప్పు తో కూడిన అన్నం

06. శుక్రుడు :
ఉషన, బృగు మహర్షి ల సంతానం. అసురులకుగురువు ఇతను. రజోగుణ సంపన్నుడు. ధవళ వర్ణంతో మద్యవయస్కుడిగా ఉంటాడు. ఒంటె / గుఱ్ఱము /మొసలి వాహనంగా కల్గి ఉంటాడు.

అనుకోని పరిస్థితుల వల్లనా కుటుంబాలు విడిపోవడంలేక తగాదాలు రావడం , బాగా కలిసి ఉండేవారిమద్యలో శత్రుత్వం కలగడం మొదలైన విపత్కరపరిస్థితులనుండి శుక్రాచార్యుని పూజ వలన బయటపడే అవకాశం ఉంది.

వృషభ, తులరాశులకు అధిపతి.

అదిదేవత : ఇంద్రుడు

వర్ణం : తెలుపు

వాహనం : మొసలి

ధాన్యం : చిక్కుడు గింజలు

పుష్పం : తెల్లని తామర

వస్త్రం : తెల్లని వస్త్రం

జాతి రత్నం : వజ్రం

నైవేద్యం : చుక్కుడు గింజల తో కూడిన అన్నం

07. శని :
సూర్యభగవానుడి పుత్రుడు శని. భార్య ఛాయా దేవి (నీడ). నల్లని వర్ణం తో, నలుపు వస్త్రదారనతో, కాకివాహనంగా కలిగి ఉంటాడు.

శని దేవుడిని అందరు తిడ్తూ ఉంటారు. నిజామే అలంటిబాధలు పెడతాడు శని. మనల్ని ఎంతగా బాధ పెట్టికస్టాలు పెడతాడో, అంతకంటే ఎక్కువ మంచి చేసివెళ్తాడు.

కుంభ, మకర రాసులకి అధిపతి. పడమటి వైపు ముఖాసీనుడై ఉంటాడు.

అదిదేవత : యముడు

ప్రతదిదేవత : ప్రజాపతి

వర్ణం : నలుపు

ధాన్యం : నల్ల నువ్వులు

వస్త్రం : నల్లని వస్త్రం

జాతి రత్నం : నీలం

నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం

08. రాహువు :
సూర్య చంద్ర గ్రహాణాలకు కారకుడు గా చెప్పబడేరాహువు ను ఒక పాము రూపం లో వారిన్స్తారు. ఒకకత్తి ని ఆయుధంగా చేసుకొని, ఎనిమిది నల్లటిగుర్రాలను అధిరోహిస్తూ ఉంటాడు.

పుత్ర దోషం, మానసిక రోగాలు, కుష్టు మొదలైనవిరాహు ప్రభావములే.

పడమర - దక్షినాభిముఖుడై ఉంటాడు.

అదిదేవత : దుర్గ

ప్రత్యధిదేవత : పాము

వర్ణం : నలుపు

వాహనం : నిలపు సింహం

ధాన్యం : మినుగులు

పుష్పం : అడవి మందారం

జాతిరత్నం : గోమేధుకం

వస్త్రం : నల్లటి వస్త్రం

నైవేద్యం : మినుగులతో కూడిన అన్నం

09. కేతువు :
భార్య చిత్రలేఖ. ఆస్తి నష్టం, చెడు అలవాట్లు, పుత్ర దోషంమొదలైనవి తొలగాలంటే కేతు పూజలు చేయాలి.
ఉత్తరం - పడమటి ముఖాసీనుడై ఉంటాడు.

అదిదేవత : చిత్రగుప్తుడు

ప్రత్యధిదేవత : బ్రహ్మ

వర్ణం : ఎరుపు

వాహనం : గద్ద

ధాన్యం : ఉలవలు

పుష్పం : ఎర్రని కలువ

వస్త్రం : రంగురంగుల వస్త్రం

జాతి రత్నం : వైడుర్యం

నైవేద్యం : ఉలవల అన్నం.