జ్యోతిష్యం "శాస్త్రం". సూర్యోదయం ప్రభావంతో మన శరీరాలు హార్మోన్లను విడుదల చేయడంతో మనం మేల్కొంటాం. అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, దూరంగా జరగడం వంటి మార్పుల వల్ల సముద్రపు అలల్లో తేడాలు వస్తాయి. అందువల్లనే మనవ మరియు ప్రకృతిలో విపరీత ధుర్ఘటనలు చూస్తున్నాము. పౌర్ణమి అమావాస్య ఎప్పుడు వస్తుందో మూడనమ్మకము అన్నవాడు చెప్పలేడు. మనపై మనకు విశ్వాసం లేకపోతే, ఇతరత్రా విషయాలేవీ పెద్దగా పనిచేయవు. అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి. సర్వే జనా సుఖినోభవంతు.
09 September 2016
పుట్టిన రోజు చేసుకునే విధానం.
హనుమంతునికి తమలపాకుల పూజ.
అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ కలుగు లాభాలు.
సీతమ్మతల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు, రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని రంచేసినవాడు, రామలక్ష్మణులు నీకు మిత్రులే కాని, వాలి పంపగా వచ్చినవారు కారని సుగ్రీవునికి శాంతిని కలుగచేసినవాడు, నీ అహంకారం, నీ పరదారాపేక్షే నీకు మృత్యువును తెచ్చిపెడుతుంది అని నిర్భయంగా రావణునికి చెప్పినవాడు ఆంజనేయుడు. ఆంజనేయుడు శివాంశసంభూతుడని శాస్త్ర వచనం. శివుని 11వ అవతారంగాను, వైశాఖ మాస బహుళ దశమి తిథి హనుమజ్జయంతిగాను పరాశర సంహిత తెలియచేస్తుంది. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు కనుక వాయుసుతుడని పేర్గాంచాడు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ అఖ్ఖర్లేదు. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది.అదేంటంటే- ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దక వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు.అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.
మరో కథ ప్రకారం.. అశోకవనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు. అంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితం.
శతవృద్ధ జిల్లేడు, తెల్లజిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటితోటలో పూజించుట వలన సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితాలను ఇస్తుంది. అరటిపండ్ల నివేదన, సింధూర సమర్పణ, శని, మంగళవారములలో తమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి. హస్తమృగశీర్షానక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు. భూత, ప్రేత పిశాచాది బాధలు, రోగాలు, కష్టాలు తొలగడానికి అభీష్టసిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణములు శ్రేష్ఠం. స్వామి మహిమలు పరాశర సంహిత, ఉమాసంహిత, హనుమ సంహిత తదితర గ్రంథాలు చెబుతున్నాయ. హనుమారాధన భోగ, మోక్షములను రెండింటినీ ఇస్తుంది. రామ భజన ఎక్కడ జరుగుతున్నా హనుమంతుడు వచ్చి కూర్చుంటాడని భక్తుల విశ్వాసం. ఆంజనేయుని చూసి మానవులు పట్టుదల కార్యదీక్షాదక్షత, మాట నేర్పు ఇలాంటివెన్నో తెలుసుకోవాలి.
అంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన కలుగు ప్రయోజనాలు.
1. ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది. 2. ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబందమైన పీడలు తొలగిపోతాయి. 3. సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లబిస్తుంది. 4. కొందరు చిన్న పిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు. చాలా నీరసంగా కనిపిస్తుంటారు. ఇలాంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు. 5. వ్యాపారంలో చాల నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. 6. ఏ వ్యక్తి అయితే హీనంగా చుడబడుతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది. 7. శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది 8. వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు నయమవుతాయి. 9. సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది. 10. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్ధించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం కలుగుతుంది. 11. వాద ప్రతివాదాల్లో స్వామిని ప్రార్ధించిచి తమలపాకుల హరాన్ని సమర్పించి, ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది. 12. తాంబూల దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది. పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దేనికి కూడా పర్ణ ప్రసాదమనే పేరు.
బొట్టు అనేది పార్వతీదేవి చిహ్నం.
'బిందు' అనే సంస్కృత పదం నుండి 'బిందీ' వచ్చింది, దీని అర్థం బొట్టు. సాధారణంగా ఇది కుంకుమ పౌడర్ నుండి తయారు చేయబడిన ఒక ఎర్రటి బొట్టు బిళ్ళ. హిందూ ధర్మానికి చెందిన మహిళలు దీనిని తమ నుదుటి మీద, రెండు కనుబొమ్మల మధ్య పెట్టుకుంటారు. దీనిని పార్వతీదేవి చిహ్నంగా పరిగణిస్తారు.
ఉంగరపు వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే…! నుదుట బొట్టుపెట్టుకునేందుకు పసుపుతో చేసిన కుంకుమ శ్రేష్టమైనది. పసుపు మన శరీరంపై అమితమైన ప్రభావాన్ని చూపుతుంది. రక్తాన్ని శుభ్రపరిచి శరీరకాంతిని ఇనుమడింప జేస్తుంది. కురుపులను, గాయాలను మాన్పుతుంది. కుష్ఠు రోగాన్ని కూడా రూపుమాపే శక్తి పసుపుకు ఉంది. కఫాన్ని అరికడుతుంది. కుంకుమను అమ్మవారి ప్రసాదంగా భావించి, సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే అని జగన్మాతను ప్రార్థిస్తూ, నుదుటన పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగుతాయి. ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి చేకూరుతుంది. నడిమి వేలితే పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది. బొటన వేలుతో పెట్టుకుంటే పుష్ఠి కలుగుతుంది. చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అసలు నొసటన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? మన శరీరంలో జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలన మిగిలిన అవయవాలకు ఒక్కొక్క అధి దేవత ఉన్నారు. వారిలో లలాట అధిదేవత బ్రహ్మ. పరమ ప్రమాణములైన వేదాలు బ్రహ్మ ముఖకమలం నుండి వెలువడ్డాయి. అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మ స్థానమైన లలాటం స్థానమైంది. ద్వాదశ పుండ్రాలను పెట్టుకోక పోయినా, కనీసం బొట్టు అయినా పెట్టుకోవాలి. అప్పుడు దేవుని పూజించినట్లే అవుతుంది. చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైన నొసటిపై ఎరుపురంగు వ్యాప్తిలోకి వచ్చింది. ఇందులో నిగూఢార్థముంది. మనలోని జీవుడు జ్యోతి స్వరూపుడు. ఆ జీవుడు జాగ్రదావస్థలో భ్రూమధ్యంలోని ఆజ్ఞాచక్రంలో సంచరిస్తుంటాడు. మన నొసటిపై పెట్టుకున్న కుంకుమబొట్టుపైన సూర్యకాంతి ప్రసరిస్తే, కనుబొమల మధ్య నుండే ఇడా పింగళ నాడులు సూర్యశక్తిని గ్రహించి శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి. ప్రాణశక్తికి కారణమైన నరాలకు కేంద్రస్థానము కనుబొమల మధ్య నుండే ఆజ్ఞాచక్రము. కుంకుమ బొట్టును పెట్టుకోవడం వల్ల ఆజ్ఞాచక్రాన్ని పూజించినట్లే అవుతుందని పెద్దలంటారు. మానసిక ప్రవృత్తులను నశింపజేసేదే ఆజ్ఞాచక్రమని పురోహితులు అంటున్నారు.
ఈ బొట్టు మహిళలను మరియు వారి భర్తలను కాపాడే స్త్రీ శక్తిని సూచిస్తుందని హిందువులు నమ్ముతారు. సాంప్రదాయకంగా ఇది పెళ్ళి అయిపోయిందని సూచించే ఒక చిహ్నం. దీనిని హిందూ వివాహిత స్త్రీలు పెట్టుకుంటారు. దీనిని టిక్క అని కూడా పిలుస్తారు. ఈరోజుల్లో ఆకర్షణీయమైన బొట్టు బిళ్ళలు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్ గా మారి పోయింది మరియు పెళ్ళికాని కన్యలు మరియు స్త్రీలు కూడా దీనిని పెట్టుకుంటున్నారు. ఈనాటి బొట్టు వృత్తాకారానికే పరిమితం కాకుండా అండాకారం, నక్షతాకారం, గుండె ఆకారం మొదలైన వివిధ ఆకారాల్లో లభిస్తున్నది. అంతేకాక, అది నీలిరంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, నారింజ రంగు మొదలైన వివిధ రంగుల్లో కూడా లభిస్తున్నది. అలాగే కేవలం కుంకమ పౌడర్ తో మాత్రమే తయారు చేసే పద్ధతికి స్వస్తి చెప్పి, ఈరోజుల్లో దీనిని రకరకాల పదార్థాలతో తయారు చేస్తున్నారు. ఇంకా ఇది రకరకాల డిజైన్లలో మరియు గాజు, తళతళలాడే ఇతర పదార్థాలతో తయారు అవుతున్నది. మంగళసూత్రం మంగళసూత్రం అంటే శుభాన్ని కలుగజేసే ఒక దారపు తాడు. ప్రత్యేకంగా దీనిని తమ పెళ్ళి అయిందని సూచించే చిహ్నంగా హిందూ ధర్మ స్త్రీలు మెడలో ధరిస్తారు. నల్లపూసలతో నిండిన రెండు దారపు తాళ్ళు కలిగి ఉండి మధ్యలో మామూలుగా ఒక బంగారం బిళ్ళ ఉంటుంది. చెడు నుండి కాపాడే రక్షణ కవచంగా నల్లపూసలు పనిచేస్తాయని వారి నమ్మకం. ఇంకా అవి ఆ స్త్రీ వివాహాన్ని మరియు ఆమె భర్త ప్రాణాన్ని కాపాడతాయని వారి నమ్మకం. దక్షిణ భారతదేశంలో, మంగళసూత్రాన్ని తాళి అని పిలుస్తారు. ఒక సన్నటి బంగారు ఛైను లేదా దారపు త్రాడుకు వ్రేలాడదీసిన ఒక చిన్న బంగారు నగ. హిందూ వివాహిత స్త్రీలు ఎట్టి పరిస్థితులలోనూ మంగళసూత్రాన్ని తొలగించకూడదు. ఆమె విధవరాలు అయినప్పుడు మాత్రమే అది కత్తిరించబడుతుంది.
చర,స్ధిర,ద్విస్వభావ రాశులు
మేషం,కర్కాటకం,తుల,మకర రాశులు చర రాశులు.
జోతీష్యంలో కాలం
సబ్బు (Soap)
*ఈ సారి సబ్బు (Soap) కొనేటప్పుడు ప్యాకెట్ మీద రాసి ఉన్న ఈ విషయాన్ని గమనించండి.*
శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మనకు అత్యంత అవసరం. ఈ నేపథ్యంలోనే రోజుకి కనీసం రెండు సార్లయినా స్నానం చేయాలని చెబుతారు. అయితే రెండుసార్లు కాకున్నా ఒకసారి చేసినా శరీరాన్ని మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే ఇందుకోసం ఎవరైనా సాధారణంగా ఏం వాడతారు? సబ్బు లేదా బాడీ వాష్. బాడీ వాష్ అనేది హై క్లాస్ వర్గీయులు ఎక్కువగా వాడేది.
ఇక సబ్బు విషయానికి వస్తే దీన్ని అత్యధిక శాతం మంది వాడతారు. అయితే ఏ సబ్బు వాడినా అది శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుతుందని ఎలా చెప్పగలరు? సదరు కంపెనీ ఇచ్చే యాడ్‌ని చూసా? కాదు. అలా చెప్తే మీరు పొరపాటు పడినట్టే. ఎందుకంటే లాభాపేక్ష కోసం కంపెనీలు ఎన్నో రకాల ప్రకటనలు ఇచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటాయి. అయితే సబ్బు ఎంత సమర్థవంతమైనది, ఎంత నాణ్యంగా పనిచేస్తుంది, ఎంతటి శుభ్రతనిస్తుంది ఎలా తెలుసుకోవడం? అందుకోసమే టీఎఫ్‌ఎం అనే పదం ఉపయోగపడుతుంది.
మీరు వాడుతున్న సబ్బు ప్యాకింగ్‌ను ఒక్క సారి సరిగ్గా గమనించండి. దానిపై టీఎఫ్‌ఎం 70శాతం, 67 శాతం, 82 శాతం అని రాసుందా? ఆ అదే! ఇప్పుడదే సబ్బు నాణ్యతను ధ్రువీకరిస్తుంది.అసలు టీఎఫ్‌ఎం అంటే ఏమిటి? టీఎఫ్‌ఎం (TFM) అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్. అంటే ఈ టీఎఫ్‌ఎం శాతం ఎంత ఎక్కువగా ఉంటే ఆ సబ్బు అంతటి నాణ్యమైన గుణాలను కలిగి ఉంటుందని అర్థం.భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) ప్రకారం సబ్బులను 3 రకాలుగా విభజించారు. అవి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3.76 అంతకు మించి శాతం ఉన్నవి
గ్రేడ్ 1 సబ్బులు. 70 నుంచి 75 వరకు టీఎఫ్‌ఎం ఉంటే అవి గ్రేడ్ 2 సబ్బులు. 60 నుంచి 70 శాతం మధ్యలో టీఎఫ్‌ఎం ఉన్నవి గ్రేడ్ 3 సబ్బులు. గ్రేడ్ 2,3 సబ్బుల్లో ఫిల్లర్లు అధికంగా ఉంటాయి.
ఇవి సబ్బు రూపంలో మామూలుగానే కనిపిస్తాయి. కాకపోతే వీటిలో శరీరానికి హాని కలిగించే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సబ్బుల్లో ఆస్బెస్టాస్ వంటి రసాయనాలు కూడా అధికంగానే ఉంటాయి. వీటిని వాడితే చర్మానికి హాని కలుగుతుంది.గ్రేడ్ 2,3 సబ్బులు నీటిలో కలిసిప్పుడు మెత్తగా అయిపోయి చాలా త్వరగా అరిగిపోతాయి. నురగ ఎక్కువ వచ్చినా వాటిని నాసిరకం సబ్బులుగానే పరిగణించాలి. ఎలాంటి చర్మం ఉన్నవారికైనా గ్రేడ్ 1 సబ్బే మంచిది. ఎందుకంటే ఈ సబ్బులు చర్మానికి మృదుత్వాన్ని ఇస్తాయి. దీంతోపాటు అధిక శుభ్రతను కలగజేస్తాయి. అదనపు కెమికల్స్ లేకుండానే సువాసనను ఇస్తాయి.
నాగులచవితి
కార్తీక మాసము
కార్తీక మాసము-
-తులసి పూజ కార్తీక మాసము
--తులసి పూజ కార్తీక మాసమంతా పరమ పుణ్యప్రదము. ఇందులో అతి ముఖ్యమైనవి కార్తీక శుక్ల ద్వాదశి , పౌర్ణమి మరియూ అమావాస్య. కార్తీక సోమవారాలు శివప్రీతి కరమైనవి అయితే ఏకాదశి , ద్వాదశులు విష్ణువుకు ప్రీతి పాత్రమైనవి . బిల్వపత్రములు శివుడికైతే , తులసీ దళములు , ఉసరి ఫలములు విష్ణువుకు. ఇంక కార్తీక మాసములో విడువ వలసినవి , నల్లావాలు , కందులు , మినుములు ,పెసలు , నువ్వుల నూనె మరియూ బహుబీజకములైన వంకాయలు , మెంతులు , మొదలగునవి.
కార్తీకమాసములో కేశకర్తనము [ క్షవరము ] చేసుకొనరాదు. పూజా ప్రతీకగా విష్ణు సంబంధమైన సాలగ్రామము అగ్రగణ్యమైతే , పూజాద్రవ్యములలో తులసిది అగ్ర స్థానము. సాలగ్రామము లేనిదే పుణ్య తీర్థము లేనట్టే , తులసి లేనిదే పూజ లేదు. జంతువులలో గోవు , మనుషులలో జ్ఞాని , సస్యములలో తులసి ప్రత్యేకమైనవి. దేవతలు లేని ప్రదేశమే లేదు , భగవంతుడు లేని చోటే లేదు. అయినా , సకల దేవతలు వెలసిన చోట్లు రెండే రెండు. ఒకటి గోవు , రెండు తులసి. తులసిలో సకల దేవతలే కాక పుష్కర క్షేత్రములు , గంగాది సకల తీర్థములు కూడా ఉన్నాయని పురాణములలో వర్ణించబడినది. చరించు దేవాలయం గోవైతే , సస్యరూపమైన దేవాలయమే తులసి. తులసి అంటేనే ’ తులనము లేని సస్యము ’ అనగా , దేనితోనూ సమానము కాని సస్యము. తులసికి అధిదేవత సాక్షాత్తూ మహా లక్ష్మియే !
తులసి గురించి , " తులస్యుపనిషత్ " అను యొక ఉపనిషత్తే ఉన్నతర్వాత , తులసి మాహాత్మ్యము ఎంత గొప్పదో అర్థము చేసుకోవచ్చు. మహాలక్ష్మి సాన్నిధ్యము వల్లనే తులసి కూడా ఐశ్వర్యప్రదమైనది. పద్మ పురాణము , స్కంధ పురాణము , బ్రహ్మాండ పురాణము మొదలగువాటిలో తులసి మహిమ కీర్తించబడినది. యే దానము చేయవలెనన్నా తులసి ఉండవలెను. జపతపములు పూర్ణముగా ఫలించవలెనంటే తులసిమాల అత్యావశ్యకము. తులసి ఎక్కడుంటే అక్కడే విష్ణువు సన్నిధానముండును.
తులసి మాలలేకున్నచో ఒక ఆకైనా చాలు. తులసీ కాష్టము కూడా శ్రేష్టమే. తులసి ఎండిపోయి ఉన్ననూ యే దోషమూ లేదు. అనివార్యమైనపుడు , నిర్మాల్య తులసిని కూడా మరలా కడిగి , పూజకు ఉపయోగించవచ్చును. అథమ పక్షము తులసీ నామమును జపించినా విశేష ఫలమే. ఈ తులసి , దర్శనమాత్రము చేతనే సకల పాపములనూ పరిహరించును. స్పర్శనము చేత శరీరమును పావనమొనరించును. నమస్కారము చేత రోగములను పోగొట్టును, తులసినీటిని ప్రోక్షణ చేసుకున్నంత మాత్రమున మృత్యు భయమును పోగొట్టును , తులసి మొక్కను ఇంటిలో పెంచుకొనుట వలన కృష్ణ భక్తిని పెంపొందించును. శ్రీహరి పాదార్పణము చేసినంతనే ముక్తి ఫలము దొరకును. ఈ తులసి , రాక్షస శక్తులను కూడా నశింపజేయగల పరిణామకారి. ఆ కారణమువల్లనే పురాణములన్నీ , ’ సదా తులసి ఇంటియందు ఉంచుకోతగినది ’ యని ఘోషిస్తాయి.
ఈ తులసికి పురాణములలో అనేక నామములు గలవు. తులసిని బృందావనములో పెంచి పూజించుటవలన విశేష పుణ్యము దొరకును. కార్తీక పౌర్ణమినాడు తులసి ప్రాదుర్భవించినది కాబట్టి ఆ దినమే తులసీ జయంతి. ఆ దినము తులసిని భక్తితో పూజించువారు సకల పాపములనుండీ ముక్తిని పొంది విష్ణులోకాన్ని చేరగలరని బ్రహ్మ వైవర్తస పురాణము తెలుపుతుంది. కార్తీకమాసము తులసి జన్మ మాసము కాబట్టే ఆ మాసములో తులసి పూజకు అంత ప్రాముఖ్యము. ఉత్థాన ద్వాదశి నాడే తులసీ వివాహమైన పుణ్యతిథి. ఆనాడు విష్ణువును ఉదయమే పూజించి తులసీదళాన్ని సమర్పించవలెను. సాయంత్రము , తులసి సాన్నిధ్యములో ధ్వజపతాక రంగవల్లుల అలంకారము గావించి , దామోదర రూపుడైన ఆ శ్రీహరిని పూజించాలి. తోరణములతో శోభించే మంటపమునేర్పరచి , ముత్యాల మాలలతో అలంకృతమైన సింహాసనములో దామోదర మూర్తిని పంచరాత్ర విధానముతో భక్తితో పూజించవలెను. మనోహరములైన రకరకాల పూలమాలలతోను , అనేక విధములైన రత్నములతోను , అసంఖ్యాకమైన నేతిదీపాలతోను శ్రీహరిని ఆరాధించవలెను. పాలు , వెన్న , పెరుగు , నేయిలను , వాటితో చేసిన పంచ భక్ష్యాలను , సుగంధ ద్రవ్య పూరితమైన జలములను , లవంగ సహితమైన తాంబూలమును , దక్షిణతో పాటు సమర్పించవలెను. పరిమళభరితములైన వివిధ పుష్పాలతో సమర్చించవలెను. తులసీ దళములచేతను , ఉసరిక ఫలముల చేతను , పూజింపవలెను. ఉసరికలు మహా విష్ణువుకు ప్రీతి పాత్రమే కాదు , సర్వ పాపములనూ పరిహరించగలదు. అందుకే , ఉసరి చెట్టు నీడలో పిండదానమాచరించినవాని పితరులు మాధవుని అనుగ్రహము వలన ముక్తి పొందుతారు. కార్తీకమాసములో శరీరం నిండా ఉసరిఫలాల గుజ్జును పూసుకొని , ఉసరికాయలతో అలంకరించుకొని , ఎండిన ఉసరి ఫలాలను ఆహారముగా స్వీకరించిన నరులు నారాయణులే అవుతారు. ఉసరి చెట్టు నీడలో విష్ణువును అర్చిస్తే వారు అర్పించిన ప్రతి పుష్పం వల్లనూ అశ్వమేధ ఫలం లభిస్తుంది. కార్తీక మాసములో ధాత్రీ వృక్షములు[ ఉసరి చెట్లు ] గల వనములో విష్ణువును చిత్రాన్నములతో సంతోషపరచి , బ్రాహ్మణులను భుజింపజేసి , తాము భుజించాలి.
కార్తీక మాసములో రోజు విడచి రోజు మూడు రాత్రులు ఉపవాసము చేసిన కానీ , ఆరు , పన్నెండు , లేదా పక్షము రోజులు లేదా నెలరోజులూ , ఒంటిపూట భోజనము చేసి గడపినవారు పరమపదాన్ని చేరుకుంటారు. ప్రతి సాయంకాలమూ ఇంటి బయట నువ్వులనూనెతో ఆకాశదీపమును పెట్టవలెను. చతుర్దశి , అమావాస్యలలో ప్రదోషకాలపు దీపము పెట్టటం వలన యమ మార్గాధికారులనుండీ విముక్తుడౌతాడు. కృష్ణ చతుర్దశి యందు గోపూజ చేయాలి. కార్తీక పౌర్ణమిలో దేవాలయములలో దీపాలు పెట్టాలి. పురుగులు , పక్షులు , దోమలు , వృక్షములు, మరియూ నీటిలోను , భూమియందు తిరుగుతున్న జీవులూ-- ఈ దీపాలను చూస్తే తిరిగి జన్మను పొందవు. చండాలులు , విప్రులూ కూడా ఈ దీపాలను చూస్తే మరుజన్మను పొందరు. కార్తీకమాసమందు కృత్తికా నక్షత్రము రోజున కార్తికేయుని దర్శనము చేసుకున్నవారు ఏడు జన్మలు విప్రులౌతారు. ధనవంతులూ , వేదపారగులూ అవుతారు.
వివాహానికి అనుకూలమైన వ్యక్తి ఎవరు?
ఒక స్త్రీ, ఒక పురుషుడి అలవాట్లు, అభిరుచులు, ఇష్టాలు కలిస్తేనే వారు దంపతులుగా జీవితాంతం సుఖంగా జీవిస్తారని అందరూ చెబుతారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తూ వారిరువురూ కలకాలం ఎంతో అన్యోన్యంగా ఉంటారని అంటారు. అయితే కేవలం అలవాట్లు, అభిరుచులే కాదు జ్యోతిషశాస్త్రం ప్రకారం దంపతుల రాశులు మ్యాచ్ అయినా కూడా వారు జీవితాంతం సుఖంగా కలిసిపోయి ఉంటారట. ఈ క్రమంలో దంపతులకు ఏయే రాశులు ఉంటే మంచిదో, ఏయే రాశులు ఉన్న వారికి మ్యాచింగ్ కరెక్ట్‌గా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులను కలిగి ఉన్న దంపతులు సామాజికంగా ఎక్కువ ఉత్తేజంగా ఉంటారట. వీరు ఎక్కడ ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారట. ఎల్లప్పుడూ ఓపెన్‌గా ఉంటారట. దంపతుల్లో ఒకరికి సింహ రాశి ఉంటే వారు డిమాండింగ్‌గానూ, తుల రాశి ఉన్న వారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే వారు గానూ ఉంటారట.
మేషం – కుంభ రాశులు…
దంపతుల్లో ఒకరికి మేషం, మరొకరికి కుంభ రాశి ఉంటే వారు ఎల్లప్పుడూ సాహస కార్యాలంటే ఇష్ట పడతారట. కొత్త వాటిని కనిపెట్టడంలో సృజనశీలురై ఉంటారట. దంపతులిరువు ఒకరికి ఒకరు స్వేచ్ఛను, ప్రేమను ఇచ్చి పుచ్చుకుంటారట.
లైఫ్ పార్ట్‌నర్స్‌లో ఒకరికి మేషం, మరొకరికి కర్కాటకం ఉంటే వారు ఎల్లప్పుడూ ధైర్యవంతులుగా ఉంటారట. ఏ పని చేసేందుకైనా వెనుకాడరట. జీవితంలో ముందుకు వెళ్లే కొద్దీ మరింత శక్తిశీలురవుతారట.
మేషం, మీన రాశులు ఉన్న దంపతులు మంచి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటారట. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అన్న భేద భావాలు వారిలో రావట. ఒకరితో ఒకరు సులభంగా సర్దుకుని పోతారట. వారి సంబంధం జీవితాంతం కొనసాగుతుందట.
ఈ రాశులు ఉన్న దంపతులు ఒకరినొకరు గౌరవించుకుంటారట. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకుంటారట. వీరిద్దరూ జీవితాంతం అన్యోన్య దాంపత్యం కొనసాగిస్తారట.
ఈ రాశులు ఉన్న దంపతులు ఒకరినొకరు సులభంగా అర్థం చేసుకుంటారట. ఒకరినొకరు ఎల్లప్పుడూ గౌరవించుకుంటూ, పొగుడుకుంటూ ఉంటారట. వీరిది కూడా అన్యోన్య దాంపత్యమేనట.
ధనుస్సు, మేష రాశులను కలిగి ఉన్న దంపతులు అత్యంత అన్యోన్యంగా ఉంటారట. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ, ఆప్యాయత ఉంటుందట.
ఈ రాశులు ఉన్న దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకుని జీవిస్తారట. ఎవరినీ నొప్పించని రీతిలో వ్యవహరిస్తూ ముందుకు సాగుతారట.
ఈ రాశులు ఉన్న జీవిత భాగస్వాములు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసే ధోరణిని కలిగి ఉంటారట. ఒకరిపై ఒకరికి బాగా నమ్మకం ఉంటుందట. వారు తమకు తామే సమస్యలను పరిష్కరించుకుంటారట.
ఈ రాశులు ఉన్న దంపతులకు ఒకరంటే ఒకరికి ఆకర్షణ కలుగుతుందట. అదే వారిని జీవితంలో ముందుకు తీసుకెళ్తుందట. ఎల్లప్పుడూ ఓపెన్‌గానే మాట్లాడుకుంటారట.
సింహం, మిథున రాశులను కలిగి ఉన్న దంపతులు సాహస కృత్యాలంటే ఇష్టపడతారట. వీరు తమ తమ జీవిత భాగస్వాములను అత్యంత ఎక్కువగా ప్రేమిస్తూ ముందుకు సాగుతారట.
ఈ రాశులను కలిగి ఉన్న దంపతులు తమ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా నిబ్బరంగా ఉంటారట. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారట. ఒకరికి మరొకరు సహాయం చేసుకుంటూ జీవనం సాగిస్తారట.
ఈ రాశులు ఉన్న దంపతులు తమ వ్యక్తిత్వాలు, స్వభావాలతో మంచి సంబంధాలను కలిగి ఉంటారట. వృశ్చికం రాశి వారిని సింహ రాశి వారు అన్ని విషయాల్లోనూ సంతృప్తి పరుస్తారట.
దంపతులిద్దరిలో ఒకరికి మిథునం, మరొకరికి తుల రాశి ఉంటే వారు లైంగిక పరంగా మంచి సంబంధాలను కలిగి ఉంటారట. వారిరువురు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారట.
అరుంధతి
అరుంధతి భారత పురాణాలలో వశిష్ట మహాముని భార్య మరియు మహా పతివ్రత. భారతీయుల వివాహములో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఒక ముఖ్యవిధి.
అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహా పతివ్రత అని ఆకాశం వంక పెళ్లి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెబు తారు.
మాఘమాసాది పంచ మాసాల కాల మందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కానరాదు. రాత్రిపూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం, శిశిర, వసంత, గ్రీష్మ రుతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుజామున కనిపిస్తుంది.
అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి. '?' మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది. చిన్న పిల్లాడిని ? మార్కు గీయమంటే ఎలా గీస్తాడో అలా ఉండే సప్తర్షి మండలంలో పక్కపక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి, వశిష్ఠులవారివి. అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది.
జ్యోతీష్యంలో నక్షత్రాలపేర్లు.
వీరిలో రోహిణి, అనూరాధ, ధనిష్ఠ అతి సుందరమైనవారు. రోహిణి ఈ ముగ్గురిలోనూ కూడా అందగత్తె. వారందరిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు.
ఆ నక్షత్రముల పేర్లు - అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాబాధ్ర, ఉత్తరాబాధ్ర, రేవతి.
ఆ బిడ్డలకు తగిన వరునికొఱకు దక్షుడు మునులను సంప్రదించాడు. మునుల సలహా ప్రకారం దక్షుడు తన కుమార్తెలను చంద్రునికిచ్చి పెండ్లి చేశాడు. అందరిచేతను ఒక పూలమాల తయారు చేయంచి చంద్రుని మెడలో వేయించాడు.
చంద్రునకు క్షయ వ్యాధి కలుగుట ఇరువదియేడుగురు భార్యలలో అత్యంత సుందరాంగియైన రోహిణిపట్ల చంద్రుడు ఎక్కువ అనురాగం చూపుతూ తక్కినవారిపట్ల అనాదరం ప్రదర్శించాడు. అప్పుడు వారు దుఃఖించి తమ తండ్రితో తమ బాధను చెప్పుకొన్నారు. దక్షుడు సహజంగానే కోపిష్టి గనుక చంద్రుని క్షయవ్యాధితో కృశింపమని శపించాడు. క్రమంగా చంద్రుడు కళావిహీనుడు కాసాగాడు. పరమేశ్వరుని ప్రార్ధించాడు. దక్షుడినే ఉపాయం అడుగమని శివుడు చెప్పాడు. చంద్రుడు దక్షునికి నమస్కరించి "తమ ఆశీర్వచన ప్రభావంచేత ఇప్పటికిలా ఉన్నాను" అన్నాడు. అందరు భార్యలను సమముగా ఎందుకు చూచుకోవడంలేదని దక్షుడు అడిగాడు. సృష్టిలో వైవిధ్యం ఉన్నపుడు అందరినీ ఒకేలా ఎలా చూసుకోగలమని చంద్రుడు ప్రశ్నించాడు. రూపమునకే ప్రాధాన్యత ఇవ్వడం తగదని దక్షుడు తెలిపాడు. అందరిలోకి రోహిణి అందగత్తె అని తాను భావిస్తున్నానని చంద్రుడు చెప్పాడు.
దేవ, రాక్షస, మానవ గణములు దక్షుడు ఇలా చెప్పాడు - రూపములో తరతమ భేదాలు ఉండడం సాధారణం. నా పుత్రికలలో తొమ్మిది మంది (అశ్వని, మృగశిర, పుష్యమి, స్వాతి, హస్త, పునర్వసు, అనూరాధ, శ్రవణము, రేవతి) దేవతా స్వభావులు,
మరి తొమ్మిది మంది (రోహిణి, ఆరుద్ర, భరణి, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాబాధ్ర, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాబాధ్ర) మానవ స్వభావులు,
తక్కిన తొమ్మిది మంది (కృత్తిక, మఖ, ఆశ్లేష, విశాఖ, శతభిష, ధనిష్ఠ, చిత్త, జ్యేష్ట, మూల ) రాక్షస స్వభావులు.
కనుక వారి గుణాలలో భేదాలున్నాయి. అయినాగాని అగ్ని సాక్షిగా చేసుకొన్న ప్రమాణాలు తప్పరాదు. అందువలన అసత్యదోషం కలుగుతుంది. వివాహ సమయంలో చేసే ప్రమాణములు చంద్రుని కోరికపై దక్షుడు పెండ్లినాటి ప్రమాణాలను ఇలా వివరించాడు - మంగళసూత్ర ధారణకు ముందు బ్రహ్మ చూపిన అన్నంమీద, దోసిళ్ళతో బియ్యం శిరసులపై పోసికొనేముందు ఆ బియ్యం మీద, ప్రధాన హోమానికి ముందు చేతిలో పేలాలు ఉంచుకొని, ఆ తరువాత సప్తర్షులను అరుంధతిని చూపించేటపుడు అనేక ప్రమాణాలు చేశారు. ఎన్ని ఇక్కట్లు వచ్చినా భార్యను విడువనని ప్రమాణం చేసినాక భార్యను నిరాదరిస్తే అది దోషం అవుతుంది. ప్రమాణ హక్కులు లేకుండా వివాహం ఎక్కడా జరుగదు. ఆ ప్రమాణాలను వధూవరులతో సరిగా పలికింపకపోవడం పురోహితుల దోషం అవుతుంది.
చంద్రునకు దక్షుని జ్ఞానోపదేశము.
చేసినా, తెలియక చేసినా గాని సుకృతాలకు, దుష్కృతాలకు ఫలితం అనుభవింపక తప్పదు. కనుక యుక్తాయుక్తాలను తెలిసికొని కర్మలు చేయాలి. మానవేతర జంతుజాలానికి గత జన్మ పాపాలను అనుభవించడమే గాని ఆ జన్మలో క్రొత్తగా చేసే పాపాలేవీ ఉండవు. గతజన్మలో జీవులు చేసిన కర్మఫలాలు (ముందు జన్మలలో అనుభవించడానికి నిలువ చేసుకొన్నవి) తరువాతి జన్మలలో అనుభవించాలి. వీటిలో ఆరుజన్మలనుండి ప్రోగైనవి సంచితములు. ఏడు జన్మల క్రింద చేసినవి ప్రారబ్ధములు
ఈ జన్మలో చేసిన కర్మలకు ముందు జన్మలలో అనుభవింపవలసిన ఫలాలు ఆగామి వీటిలో తెలియక చేసిన అపరాధములకు పశ్చాత్తాపం పొంది, సన్మార్గాన్ని అలవరచుకోవడం వలన జీవులు క్షంతవ్యులు అవుతారు. అంటే పారి పాపాలనుండి విముక్తి లభిస్తుంది. అంతే కాకుండా జ్ఞానం ద్వారా సంచితములు, ఆగామి నుండి విడుదల పొందవచ్చును. ప్రారబ్ధం మాత్రం అనుభవించి తీరవలసిందే. కనుక పశ్చాత్తప్తుడై, సన్మార్గం అవలంబించి, జ్ఞానాన్ని వృద్ధి చేసుకొని జీవుడు సంచితములనుండి, ఆగామినుండి విముక్తుడై, ప్రారబ్ధాన్ని మాత్రం అనుభవించి, కర్మశూన్యుడై ముక్తిని పొందవచ్చును.
బ్రహ్మజ్ఞాని కూడా ప్రారబ్దాన్ని అనుభవించి తీరాల్సిందే. జ్ఞానియైనవాడు తన కర్మలనన్నింటిని హరింపజేసుకొని, శ్రీహరి పంకేరుహ ధ్యానైక చిత్తుడై, జనన మరణములు లేని స్థితిని పొందుటయే మోక్షము. కర్మమేమాత్రము శేషించినా గాని జన్మము తప్పదు. ఈ ప్రపంచం సమస్తమూ పరమాత్మ స్వరూపమే అని తెలిసికొని, సకల జీవులపట్ల సమభావంతో వర్తించడం సామాన్య జ్ఞానం. సామాన్య జ్ఞానాన్ని క్రమంగా అభివృద్ధి చేసుకోవడం ద్వారా బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. అప్పుడు భేదబుద్ధి తొలగి, సర్వ ప్రపంచంలో పరబ్రహ్మమే నిండియున్నదన్న జ్ఞానం ఆత్మకు లభిస్తుంది. దానివలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.
చంద్రుని క్షయరోగ విముక్తి. భార్యలను (అనగా చంద్రుని భార్యలు, దక్షుని పుత్రికలు అయిన వారిని) చంద్రుడు క్షోభకు గురి చేశాడు గనుక అతనికి క్షయరోగం కలిగిందని దక్షుడు తెలిపాడు. అందరిపట్ల పక్షపాత బుద్ధి లేకుండా మెలగమని చెప్పాడు. అందుకొరకు దినమునకొక భార్యతో ఉండమని, ఆ 27 దినములు 27 యోగములు అవుతాయని దక్షుడు చెప్పాడు. - అవి విష్కంభము, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యము, శోభనము, అతిగండము, వృద్ధి, ధృవము, వ్యాఘాతము, హర్షణము, వజ్రము, సిద్ధి, వ్యతీపాతము, పరియాన్, పరిఘము, శివము, సిద్ధము, సాధ్యము, శుభము, శుక్రము, ఇంద్రము, వైధృతి. అలా ఉండడం వలన క్రమంగా రోగం క్షీణిస్తుందని, శుక్లపక్షంలో వృద్ధిని పొందుతూ కృష్ణపక్షంలో కళావిహీనుడు అవుతుంటాడని దక్షుడు ఉపాయం చెప్పాడు. తన శాపం అమోఘం గనుక దానిని తొలగించడం సాధ్యం కాదని, కాని మదోన్మత్తుడైన రాజు (చంద్రుడు) క్రమంగా జరిగినదానిని మరిచిపోయే ప్రమాదం ఉంది గనుక ఆ విధాన్ని అలా ఉండనీయమని చెప్పాడు. దక్షునికి నమస్కరించి, అతని ఆనతి తీసికొని చంద్రుడు అతని ఆజ్ఞ ప్రకారం నడుచుకోసాగాడు.
మహా పాతకము, పుణ్యములో పాపము,
చంద్రుని కథ విన్న తరువాత జైమిని వ్యాసుని "మహాపాతకములు" అంటే ఏమిటని అడిగాడు. అందుకు వ్యాసుడిలా చెప్పాడు - పాతకాలలో ఐదింటిని "మహాపాతకాలు" అంటారు. ఆ పాపాలకు నిష్కృతి లేదు. వాటి ఫలితాలను అనుభవించే తీరాలి. ఆ మహాపాతకాలు - స్త్రీ హత్య శిశు హత్య గో హత్య బ్రహ్మ హత్య స్వర్ణస్తేయము ఇక బుద్ధి పూర్వకంగా చేసిన పుణ్యపాపముల ఫలితాన్ని అనుభవించి తీరాలి. అలా కాకుండా తెలియక,
ప్రమాద వశాత్తూ చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా విముక్తి సాధనాలున్నాయి. శాస్త్ర ప్రకారంగా, భక్తిపూర్వకంగా ప్రాయశ్చిత్తం చేసుకొంటే ఆ పాలు క్రమంగా హరిస్తాయి. ఇందుకు ఉదాహరణగా కోసల దేశపురాజు గోహత్యాపాతకంలో ఇరుక్కొన్న వైనం చెప్పాడు వ్యాసుడు. ఒకప్పుడు కోసలదేశంలో క్షామం సంభవించినపుడు రాజు భీమసేనుడు నగరం వెలుపల ఒక బావి త్రవ్వించాడు. కాని ఆ నూతి చుట్టూ గోడ కట్టించలేదు. దాహం గొని ఉన్న ఒక ఆవు దూడ ఆ నూతిలోపడి మరణించింది. బావిచుట్టూ తిరుగుతూ ఆవు అరుస్తున్నది. ప్రోగైన జనులు దూడ కళేబరాన్ని బయటకు తీశారు. ఈ పాపం ఎవరిదనే చర్చ సాగింది. అజాగ్రత్తగా ఉన్న పశువులకాపరిధి తప్పన్నారు కొందరు. దూడ యజమాని తప్పు అని కొందరన్నారు. బావికి గోడ కట్టించని వారిది తప్పని మరి కొందరన్నారు. ఈ సంగతి తెలిసి రాజు పండితులను సంప్రదించాడు. వారు రాజుకు చెప్పిన విషయం ఏమంటే - రాజా బావి త్రవ్వించి అనేకుల ప్రాణాలను రక్షించిన పుణ్యం నీకు చెందుతుంది. అలాగే గోడ కట్టించాలని తెలియక ఒక ఆవుదూడ మరణానికి కారణమైన పాపం కూడా నీకు చెందుతుంది. కాని ఇది తెలియక చేసిన తప్పు కనుక ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చును. పది దినములు దీక్షతో ఉండి, పుణ్యక్షేత్రాలు దర్శించి, ఉత్తమ దానములు చేయుము - అని చెప్పారు. రాజు అలాగే చేశాడు.
గోవు పుట్టుక
గోవుకు అంత పవిత్రత ఎందుకు కలిగిందని జైమిని అడిగాడు. శ్వేతవరాహకల్పంలో విరాట్పురుషుడైన పరబ్రహ్మ యోగనిద్రనుండి లేచి ముందుగా తన నాభి కమలంనుండి బ్రహ్మను పుట్టించాడు. అనంతరం తనయందున్న ప్రకృతినుండి విష్ణువును, మహేశ్వరుని సృజింపజేశాడు. అనంతరం ప్రకృతి చేసిన ఒక తప్పిదం కారణంగా ఆమెను "పశువు" అన్నాడు. కాని మరల కరుణించి - నీ ముఖంలో పంచమహాపాతకాలుంటాయి. అయినా నీవు అతిపవిత్రవై యుందువు. నీ మలమూత్రములు కూడా పవిత్రములు. నీ దర్శనము సకల పాపములు పోగొట్టును. నిన్ను దానమిచ్చేవారి శరీరంలో ఎన్ని వెండ్రుకలుంటాయో అన్నివేల దివ్యాబ్ధములు వాఱు గోలోకంలో నివశిస్తారు.- అని చెప్పెను.
గాయత్రి గురించి తెలుపమని జైమిని వ్యాసుని ప్రార్ధించాడు - అందుకు వ్యాసుని ఉత్తరం: పరబ్రహ్మ నాభి కమలంనుండి జనించిన నాలుగు ముఖాల బ్రహ్మకు "ఓం" అనే ప్రణవనాదం వినిపించింది. అప్పుడు బ్రహ్మ ఒకోముఖంనుండి ఆరు అక్షరాలు కలిగిన గాయత్రి మంత్రం (మొత్తం నాలుగు ముఖాలనుండి 24 అక్షరాలు) వెలువడింది. కనుక అన్ని వేదములకు ఈ మంత్రము మాతృక. అన్ని మంత్రములకు తల్లివంటిది. ఈ మంత్రాన్ని ఉపాసించేవారి కోరికలు ఈడేరును. బ్రహ్మమును ఉపాసించేవారికి ఇది ముఖ్యసాధనమైన బ్రహ్మవిద్య. ఉపనయనార్హత కలిగిన ద్విజులు తప్ప అన్యులు దీనిని జపించరాదు, ఉపాసింపరాదు