20 February 2016

మన సంస్కృతి

కీర్తి, అధికారం, ధనం ఈ మూడిటినీ కోరుకోని మానవుడు ఉండడు.









అయితే, వీటిని సంపాదించడంలో మనిషి తనకు తాను కొన్ని పరిమితులు విధించుకోవాలి.

ఈ మూడు విషయాలలో ఒక స్థాయిని పొందిన తరువాత తృప్తి చెందాలి. అలాకాక, ఇంకా ఇంకా కావాలకునే వారు ఆ దాహంలో వాటి పరిమితులు తెలియక నష్టపోతారు.






ఎందుకంటేఉన్నత స్థాయిని చేరిన తరువాత క్రిందకి దిగటమే కాని, పైకి ఎక్కడానికి మరి సోపానాలు ఉండవు. క్రిందకి దిగడం మొదలుపెట్టామో, అవి జారుడుమెట్లను తలపిస్తాయి.

కీర్తి దాహం, అధికార దాహం, ధన దాహం ఈ మూడూ ఒక స్థాయిని దాటిన తరువాత అడ్డదారులు తొక్కుతాయి. మనిషి సన్మార్గాన్ని వీడిపోతాడు. దుష్ట ఆలోచనలు ప్రవేశిస్తాయి. ఈ మూడిటినీ పొందడానికి, పొందిన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. ఆ క్రమంలో ఎన్నో పాపాలు, దుర్మార్గాలు చేస్తాడు. మనశ్శాంతిని పోగొట్టుకుంటాడు. మనిషికి అన్నిటికన్నా ముఖ్యమైనది, అలవరచుకోవలసినది మన:తృప్తి...ఇది తెలిసిన వాడు పై మూడిటినీ తన చెప్పుచేతల్లో ఉంచుకోగలుగుతాడు. అతడే ఉత్తమ మానవుడు.










No comments:

Post a Comment

మీ అభిప్రాయం తెలియచేయండి.