22 October 2016

నీలం – Sapphair

నీలము నీలాకాశంలో నీలి రంగు వెలుగొందే శని గ్రహానికి నీలరత్నమంటే ప్రీతి. అందున మహానీలము స్వచ్ఛమైన శనిగ్రహ వర్ణమే కలిగియుండుట వలన ఈ గ్రహ రత్నములకు రెండిటికి స్పర్శగుణం ప్రధానము వాయుత్వము కలిగి యుండుట వలన మహా నీల మాదిరిగా గల నీల రత్నములు శని గ్రహ సంబంధించిన రత్నములుగా పేర్కొన బడినవి. ఈ రత్నము స్త్రీ జాతికి సంభంధించినవి శరీరమునందలి పంచ ప్రాణములలో ఉదానమను ప్రాణము యొక్క లక్షణములు కలిగియున్నది. త్రిదోషములందలి వాత దోషమును తొలగించి ఆరోగ్యము నొసంగుటలో ఈ రత్నము చాలా గొప్పది. శరీరంలో జగన్మాత కాలరాత్రి యనబడే శక్తిరూపముతో అధిసించియున్న అనాహత చక్రమునందలి పసుపు, ఎరుపు, నలుపు రంగులు కాలసిన కాంతి కిరణాలు నీల రత్నానికి దగ్గర సంభంధం కలవు. అనాహత కాంతులు తమ సహజ శక్తిని కోల్పోయినప్పుడు శరీరంలో సంభవించే అలజడి అనారోగ్యాలకు నీలధారణచాలా మంచిది. నీల రత్నములోని కాంతి కిరణాలు చర్మరంద్రాల గుండా పయనించి శరీరాంతర్భాగాలలో వ్యాపించి యున్న అనాహత కాంతి కిరణాలు దీప్తిని కలిగించడం ద్వారా ఆ సంభంధమైన బాధలు అంతరించగలవు.








పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాధ్ర అను నక్షత్రములందు జన్మించిన వారు ఏసమయమునందైనను నీలమును ధరించవచ్చును.

మిగిలిన నక్షత్రములలో ఉత్తర, ఉత్తరాషాడ, కృత్తిక నక్షత్రముల వారు తప్ప మిగిలిన అందరూ వారి వారి జన్మ జాతక గ్రహస్థితి ననుసరించి శని గ్రహం బలహీనిడై దోషప్రదునిగా నున్నప్పుడు నీల రత్నమును ధరించిన అశుభములు తొలగిపోయి శుభఫలితాలను పొంది సుఖించగలరు.













 జన్మ సమయంలో ఏ ర్పడిన గ్రహములయొక్క స్థితి ననుసరించి శని గ్రహము లగ్నము నుండి 6-8-12 స్థానములందుండుట, ఆ స్థానాధిపత్యములు కలుగుట మరియు ఆ స్థానాధిపతుల యొక్క కలయిక , వీక్షణమునొందియుండుట దోషప్రదము.

సప్తమ స్థానంలో బలవంతుడైన శని గ్రహము ఉన్నప్పుడు వివాహ కార్యమునకు కనేకాటంకములు కలిగి కల్యాణము కానేరదు.

 పాపగ్రహములతోకూడి బలవంతుడైన శని గ్రహమునకు కోణాదిపత్యము కలిగి కేంద్రములందున్నను షష్ఠాధిపత్యముకలిగి 2-4-7-10 స్థానములందున్నను, అష్టమాధి పత్యము కలిగి 3-5-9 స్థానములందున్నను , వ్యయాధిపత్యము కలిగి 1-2-5-9-10 స్థానములందున్నను దోషప్రదుడు అట్టి సమయములలో ఆ శనిగ్రహము వక్రగమనము నందుండిన దోషమధికముగా నుందుగలదు. గోచారమునందుండి 3-6-11 స్థానములు దప్ప మిగిలిన అన్ని స్థానములు శని గ్రహానికి దోష స్థానములనే చెప్పబడ్డాయి.

జాతక, గోచారములందు స్థానాది షడ్బలములు, అష్టకవర్గ బిందుబలము కలిగిన శనిగ్రహము పాపసంభంధము అధికముగా కలిగి దుష్ఠస్థాన స్థితుడై వ్యతిరేకముగా నున్నప్పుడు, మిక్కిలి కష్టములు సంప్రాప్తించగలవు.

తెలియబడని వ్యాధులు,

 భూత పిశాచ బాధలు.

 చోరాగ్నిభీతి,

 అవమానములు అపకీర్తి,

కార్య విఘ్నము,

 మగోలిచారము,

 రాజదండన,

 బంధన దరిద్రము,

హీనజీవితము,

ఆపదలు గండములు,

 దీర్ఘవ్యధులు వాత ప్రకోపము,

 కళత్ర, పుత్ర, బంధునష్టము,

 మాతా పితారుల మరణము,

 ఋణబాధలు, దాస్యము,

మొదలగు ఫలితములేగాక, మరణము కూడా సంభవించగల అవకాశములున్నవి.

ఇట్టి చెడు కాలములందు ఉత్తమమైన జాతికి చెందిన ఇంద్రనీలము, మహా నీలము, నీలమణి అను రత్నములు ధరించిన యెడల శనిగ్రహ దోషములంతరించి ఆయుర్భాగ్య సంపదలు కలుగగలవు.










 నీలము వల్ల కలిగే శుభయోగాలు :-

 నీలమణి, మహామణి, ఇంద్రనీలము మొదలగా గల నీలరత్నములను ధరించుట వలన శరీరమునందు ఓజశ్శక్తి అభివృద్ధి జెందటమే కాకుండా నూతనోత్సాహము ధైర్యము,

 కార్యదక్షత కలుగగలవు.

 నీలము ధరించిన వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయాది వృత్తులలో అనుకూలత కలిగి పురోభివృద్ది నుండగలదు.

ఆదాయాభివృద్ది, ధనలాభము, సంఘమునుండి గౌరవ మర్యాదలు పెరుగుట,

వివాహాది ఆటంకములు తొలగి పెండ్లి కాగలదు.

మానసిక వ్యాధులు నివారింపబడి చిత్త స్థిరత్వము లభించగలదు.

శనిగ్రహ దోషముచే కలుగు అనేక దుష్ఫలితాలనుంచి రక్షణ కలుగగలదు.

పిత్తకోశమునందలి దోషములు,

వాత ప్రకోపములవలన జనించు రోగములు,

కీళ్ళ నొప్పులు,

పక్షవాతము,

నరముల దుర్భలత్వము,

 అజీర్ణ వ్యాధులు.

 కాళ్ళు, కాళ్ళ పిక్కలకు సంబంధించిన రోగములు,

త్రాగుడు,

 వ్యభిచారమువలన కలుగు బాధలు,

 ఊపిరి తిత్తుల వ్యాధులు,

 మందబుద్ది మొదలగు అనేక విధములైన రుగ్మతలు సమూలంగా నశింపబడి ఆరోగ్యవంతులుగాకాగలరు.

 బాలారిష్టములు,

 దృష్టిదోషములు,

 తాంత్రిక కృత్రిమ క్షుద్రగ్రహబాధ లంతరించగలవు. జీవితమునందు సంభవించిన పలువిధములైన గండములు తొలగిపోగలవు.

 అపమృత్యు దోషములంతరించి ఆయుర్దాయాభివృద్ధి కలుగగలదు.నీలము ఆధ్యాత్మికాభివృద్ధికి దోహదపడగలదు.

నీలధారన వలన చిత్తచాంచల్యము తొలగి ఏకాగ్రత లభించగలదు.

ఆధ్యాత్మిక జీవన ప్రగతి ఆరోహనక్రమంలో దిన దినాభివృద్ది నొందగలరని బౌద్దుల నమ్మిక. అందువల్లనే వారు జాతి నీలముకంత ప్రాధాన్యత నిచ్చుచుండెదరు.

ముఖ్యముగా దరిద్ర బాధలు కష్టనష్టములు మానశిక చికాకులు రూపుమాపి సంతోషము సుఖసౌఖ్యములు, ధనధాన్యములు భాగ్యసంపదలు స్థిరమైన జీవనములు సిద్ధించగలవు.









 నీలము ధరించు విధానము :

 దోషములేని ఉత్తమ మైన జాతినీలము పంచలోహం లేక బంగారమును దిమిడ్చి ధరించడం శ్రేష్టము ఉంగరం యొక్క అడుగుభాగం రంద్రముగా నుంచి పైభాగంలో ధను (విల్లు) ఆకారముగా తీర్చబడిన పీఠము యొక్క మధ్యభాగాన నీలంను బిగించి శుద్ధియెనర్చి షోడశోపచార పూజలు నెరవేర్చిన పిదప శుభముహూర్తములో ధరించాలి పుష్యమీ నక్షత్రముతో కూడి యున్న శనివారము త్రయోదశి తిధియందు గానీ లేక త్రయోదశీ శని వారమందుగానీ చంద్రగ్రహణము సమయమందుగానీ చిత్తా నక్షత్రము 3,4 పాదములందు గానీ శని సంచారం గల కాలంలో పూర్వాషాఢ నక్షత్రం ప్రాప్తించిన శనివారమందుగానీ (శని అస్తంగతుడు కాకయున్నప్పుడు) శనిహోర జరిగే సమయంలో గానీ ఉంగరమునందు నీలరత్నము బిగించి తదుపరి ఒక దినము గోమూత్రమునందు. రెండవదినము పంచగవ్యములందు, మూడవ దినము నల్లనువ్వులయందు ఆ ఉంగరమును అధివాసము చేయించి పంచామృతాలతో శుద్ధోదక స్నానములు చేయించి, శాస్త్రోక్తముగా షోఢశోపచార పూజలు నిర్వహించిన శుద్ది కాగలదు. ధరించెడి వారికి తారాబలం చంద్రబలములు కలిగి మంగళ, శుక్ర, శని వారములయందు శుభతిధులు కలిగియున్నప్పుడు వర్జ్య దుర్ముహుర్తాలు లేని కాలంలో వృషభ, తులా ధను, కుంభ లగ్నములందు తొలుత పూజలు జరుప బడిన ఉంగరమును ధరించవలెను. ధరింపబోవు సమయమునకు ముందు ఉంగరమును కుడిహస్తము నందుంచుకొని పడమర ముఖముగా దిరిగి నిలబడి గురువుని, గణపతిని ధ్యానించి "ఓం హ్రీం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయ నిర్మాంస శుష్క దేహాయ సర్వసిద్దిం దేహి దేహి స్వాహా" అను మంత్రమును గానీ లేక "ఓం శన్నో దేవీ రభిష్టయ అసోభవంతు పీతయే శంయోరభి స్రవంతునః" అనే మంత్రమును గానీ 108 పర్యాయాలు జపించి ఉంగరమును ముమ్మరు కనుల కద్దుకొని కుడిచేతి నడిమివ్రేలికి ధరించాలి కొందరు పెద్దలు ఎడమ చేతి నడిమి వ్రేలికి ధరించవచ్చును అని చెబుతారు కావున వారి ఆచారం ఏ ప్రకారంగా ఉంటే ఆ విధంగా నడిమి వ్రేలికి మాత్రం ధరించాలి.

 నీల రత్నము ఉంగరపు వ్రేలికి (అనామిక)మాత్రం ధరించకూడదు.

నవరత్నములను గాక ఇతర రత్నములు చేయించుఉంగరములో నీలముతో బాటుగా కెంపులను, పచ్చలను జేర్చి ఉంగరమును ధరించకూడదు.

కెంపు అవసరము గలిగి నప్పుడు కెంపు నీలము లేదా కాకి నీలమును, పచ్చల అవసరమున్నప్పుడు, మయూర నీలము ధరించిన శ్రేయస్కరముగా నుండగలదు.










  నీలం – Sapphair
 8, 17, 26 తేదీలలో జన్మించినవారు, జ్యోతిష్య శాస్త్రప్రకారం శనిదశ జరుగుతున్నవారు, వృషభ,తుల,మకర, కుంభ లగ్నములలో పుట్టినవారు ధరించాలి. పుష్యమి, అనురాధ, ఉత్తరభాధ్ర, నక్షత్ర జాతకంలో పుట్టినవారు. పక్షవాతం, పిచ్చి, ఊపిరితిత్తుల వ్యాధులు తగ్గుదల. మానసిక ఉత్తేజం. పైత్య నివారణ.ఉధ్యగ, వ్యవసాయ లాభం. స్త్రీలలో సంతానోత్పత్తి. తేలుకాటు వేసినచోట నీలాన్ని ఉంచిన నీటితో కడిగితే తేలువిషం విరిగిపోతుంది. ఏకాగ్రత పెరుగుదల. శారీరక, మానసికి ఉత్తేజం.














1 comment:

మీ అభిప్రాయం తెలియచేయండి.