26 February 2016

భార్యాభర్తలమథ్య విరోథము.

పూర్వజన్మకృతం పాపం "కళత్ర" రూపేణ భాథితం
జాతకములో శుక్రుడు అనుకూలముగా ఉన్న జాతకురాలు ఇంట్లో అందరి పట్ల వీరు ప్రవర్తిస్తున్న తీరుకు ఇతరులపట్ల వీరి ప్రవర్తన తీరుకు చాలా తేడా ఉంటుంది.













మగ పిల్లలు ఏమడిగినా తర్వాత చూద్దాం,చేద్దాం అంత తొందర ఏమొచ్చింది అని ఎడ మొహము పెడ ముఖముగా సమాథానము చెపుతారు.కూతురు నాన్నా నాకు ఇది కావాలి అంటే ఎన్నిపనులైనా మానుకుని అ వస్తువును కొన్ని గంటల్లో వారిముందు ఉంచుతారు.
కూతురు సంతోషముగా,ఆరోగ్యముగా ఉంటే వాళ్ళ మనస్సు,ప్రవర్తన కూడా ఆహ్లాదముగా ఉంటాయి.ఒకవేళ కూతురుకు ఏమైనా బాగాలేక పోవడము,చికాకుగా ఉండడము జరిగితే ఆ రోజుకు జనం దుంప తెగిందే,ప్యూన్ దగ్గర నుండి కలెక్టర్ వరకూ అందరినీ తిట్టడమే.చాలా తొందరగా స్పందిస్తారు.ఎవ్వరినైనా,ఎందరినైనా దూరం చేసుకుంటారు.ఏదైనాభరిస్తారు,కానీ కూతురు కంట కన్నీరు మాత్రం భరించలేరు.అతలాకుతలం అయిపోతారు.















తండ్రిని,తల్లిని కాదని కూతురు ప్రేమ వివాహము చేసుకున్నావీరు సహించి ఊరుకుంటారు.శుక్ర గ్రహము జాతకములో అనుకూలముగా ఉంటే ఇలాంటి లక్షణాలు ఏర్పడతాయి.వీళ్ళ అతి ప్రేమ వల్ల కూతురుకి పెళ్ళి చేసిన తరువాత వాళ్ళ కాపురములో ఏమైనా విభేథాలు వస్తే అల్లుడిని,కూతురుని కూర్చోబెట్టి సంసారం బాగు చేసే యత్నాలు చేయరు.కూతురుని ఇంటికి తెచ్చుకుంటారు. అల్లుడిని,అతని కుటుంబాన్ని భ్రష్టు పట్టిస్తారు.












భార్యాభర్తలమథ్య విరోథము సమసి పోతుందని వీళ్ళు భావించరు.అల్లుడు కూతురుని తిట్టినా,కొట్టినా,కష్ట పెట్టినా అల్లుడి చరిత్ర వాస్తవాలు తెలుసుకోలేరు.తెలుసుకొనే ప్రయత్నాలు చేయరు.భార్యమాట బంథువుల మాట గడ్డిపోచ క్రింద తీసిపారేస్తారు.
భారత శిక్షాస్మృతిలో ఉన్నచట్టాలను ఉపయోగించి అల్లుడు,అతని కుటుంబ సభ్యులను వేథిస్తున్నారని కేసులు పెట్టి,లంచాలు ఇచ్చివాళ్ళను ప్రాథమికముగా జైలులో పెట్టిస్తారు.రాజీచేయడానికి వచ్చిన పెద్దమనుషులకు గౌరవము తగ్గదు.చివరకు అల్లుడేఇంటికి వచ్చి ప్రాథేయపడినా వీళ్ళు స్పందించరు.అల్లుడిని చెప్పుతో కొట్టడము,వీళ్ళ విషయములో సాథారణ అంశము.కూతురు సంసారాన్ని వీళ్ళ చేతులతో వీళ్ళే చెడగొడతారు.అమితమైన ప్రేమ వలన వాస్తవాలు,సామాజిక విషయాలు మరచిపోతారు.











మథ్యప్రదేశ్ లోని ఓ గౌరవనీయమైన కుటుంబ యాజమాని జిల్లా సెషన్స్ జడ్జి.ఆయన వాళ్ళ అబ్బాయికి పెళ్ళి చేశాడు.అబ్బాయికూడా మంచి ఉద్యోగములో స్థిర పడినవాడే.పెళ్ళి అయింది.అమ్మాయి అత్త వారింటికి వచ్చింది.ఓ రోజు అత్తగారు కోడల్ని వంట చేయమని చెప్పింది.నేనిక్కడకు వచ్చింది వంటల్ని చేయడానికి కాదు.నువ్వు చేసుకో ఆ వంటల పని అని సమాథానము చెప్పింది కోడలు. అత్తగారు ఏమనుకుందో ఏమో వంటతనే చేసింది.
వాళ్ళఅబ్బాయి రాగానే కోడలు మాట్లాడిన విషయాలు చెప్పింది.ఎందుకిలా చేశావని భార్యను అడిగాడు.పెద్దలను గౌరవించడం,ఇంటి పని చేసుకోవడము తప్పేంటని నిలదీశాడు.ఏదో ఇబ్బంది వచ్చి ఒక్కరోజు వంట చేయమంటే ఇలా మాట్లాడవచ్చా అని ప్రశ్నించాడు.అంతే ఆ అమ్మా యి అగ్గిమీద గుగ్గిలం అయ్యింది.అప్పటికప్పుడే పుట్టింటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో ఉన్నవీ, లేనివీ చెప్పింది.దాంతో అమ్మాయి తండ్రి రెచ్చిపోయాడు.అమ్మా నిన్ను ఇన్ని భాథలు పెట్టిన వాళ్ళను ఊరికే వదలను.వాళ్ళ అంతు తేలుస్తాను అని శపథంచేసి ఇంకేముంది అమ్మాయిని కట్నం కోసం వేథిస్తున్నారనీ,ఇందులో కుటుంబసభ్యులందరూ భాగస్వాములేనని కేసు పెట్టాడు.ఇంకేముంది.
శక్తివంతమైన చట్టం తనపని తాను చేసుకుపోసాగింది.గౌరవ ప్రదమైన కుటుంబం జైలు పాలైంది. అందరికీ న్యాయము చెప్పే మహానుభావుడు మంచివాడైన జడ్జీగారు కూడా రిమాండుకు తరలించబడ్డారు.ఈసంఘటనతో సంబంథములేని ఎక్కడో కాపురం చేసుకుంటున్న జడ్జీగారి కూతుళ్ళు కూడా జైలుకు తరలింపబడ్డారు.వాళ్ళ మంచితనము తెలిసిన వాళ్ళంతా కాల మహిమను చూచి నిర్ఘాంతపోయి ముక్కుమీద వేలేసుకున్నారు.









శుక్రుడు జాతకములో బాగా లేకపోతే భార్యవల్ల,స్త్రీల వల్ల అష్టకష్టాలు ఎదురవుతాయి.“ పూర్వజన్మకృతం పాపం కళత్ర రూపేణ భాథితం.”అనే సామెత నిజ జీవితములో అక్షరాలా వర్తిస్తుంది.శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు రోజుకి ఒకసారి "శుక్రకవచం" పఠిస్తే శుక్రగ్రహ దోష నివారణ నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.









నాగోబా జాతర


శిష్ట సంప్రదాయంలో నాగారాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది.
వైదిక ఆచారాల్లో సర్పారాధనకు అనేక పండుగలు ఉన్నాయి.
గిరిజనులు జాతర నేపథ్యంగా అయిదు రోజులపాటు సర్పాన్ని
ఆరాధిస్తారు. ఆ గిరిజనుల పర్వమే- నాగోబా జాతర.
ఆరోగ్యం, సిరిసంపదలు అనుగ్రహించే దైవంగా సర్పాన్ని
గిరిజనులు పూజిస్తారు. సస్యరక్షణ దేవతగా సర్పాన్ని
భావిస్తారు. నాగదేవత తమను సంరక్షిస్తున్నందుకు
కృతజ్ఞతగా ఆదివాసులు ఏటా పుష్యబహుళ అమావాస్య
నుంచి అయిదు రోజులపాటు ఈ జాతర నిర్వహిస్తారు.
తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం
కేస్లాపూర్లో గిరిజనులు తమ ఆరాధ్య దైవాన్ని సమష్టిగా
నాగోబా జాతరలో పూజించుకొంటారు. మేడారం ‘సమ్మక్క-
సారలమ్మ’ జాతర తరవాత గిరిజనులు భారీ సంఖ్యలో
పాల్గొనే ఉత్సవమిది. రేపటి నుంచి 14వ తేదీ వరకు ఈ
జాతర కొనసాగుతుంది.
నాగోబా జాతరలో ‘మెస్రం’ అనే గోండు తెగ వంశీయులది ప్రధాన
పాత్ర. ఆ తెగవారు ఏ ప్రాంతంలో స్థిరపడినా జాతర వేళ
ఇక్కడకు తరలివస్తారు. ఆదివాసులు కేవలం కాలి నడకన,
ఎండ్ల బండ్లలో మాత్రమే విచ్చేస్తారు. కాళ్లకు
పాదరక్షలు లేకుండా ఖటోడా (సమూహ నాయకుడు) ఆదేశాల
మేరకు సంప్రదాయ ఆచారాల్ని గిరిజనులు కొనసాగిస్తారు.
జాతర ప్రారంభానికి ముందు కేస్లాపూర్ గ్రామానికి 80కి.మీ.
దూరంలో ఉన్న కలమడుగు గోదావరి రేవు నుంచి ఆదివాసులు కొత్త
కుండల్లో నీరు సేకరిస్తారు. ఇంద్రవెల్లిలోని ఇంద్రాయి దేవికి
ప్రత్యేక పూజలు చేస్తారు. నాగోబా ఆలయానికి
చేరుకున్నాక, ప్రాంగణంలోని మర్రిచెట్టు కొమ్మలకు నీటి
కుండల్ని కట్టి ఉంచుతారు. జాతర రోజుల్లో ఆ జలాలతో
నిత్యం నాగోబా స్వరూపానికి అభిషేకం చేస్తారు. సిరికొండ
గ్రామం నుంచి తీసుకొచ్చిన 116 మట్టికుండల్ని వరసగా
పేర్చి, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ఆలయ ప్రాంగణంలో
ఉన్న పాతాళగంగతో ఆ కుండల్ని నింపుతారు. నిరుడు నిర్మించిన
మట్టిపుట్టల్ని ఆ నీటితో తొలగించి, వాటి స్థానంలో
నాగేంద్రుడి ఏడు పడగలకు ప్రతీకగా ఏడు మట్టిపుట్టల్ని
నిర్మిస్తారు. వాటిపై సర్పాకృతుల్ని ఉంచి- ఆవుపాలు,
నవధాన్యాల్ని నివేదన చేస్తారు. ప్రధాన ఆలయంలో
అయిదు పడగలతో ఉన్న నాగోబా విగ్రహాన్ని గిరిజన
ఆచారాల ప్రకారం విలక్షణంగా అలంకరిస్తారు. జొన్నలు,
మొక్కజొన్నలతో తయారు చేసిన గటక, అంబలి,
కూరగాయలతో వండిన పదార్థాల్ని నైవేద్యంగా
సమర్పిస్తారు. నాగోబా ఆలయ ప్రాంగణంలో ఈ ఏడాది
వివాహమైన నవ దంపతులకు భేటింగ్ (భేటీ) నిర్వహిస్తారు.
పితృదేవతలను ఆరాధించి, వారికి తూమ్ (ఆత్మశాంతి)
ప్రక్రియతో దీపాలు వెలిగిస్తారు.
మెస్రం వంశానికి చెందిన నాగాయిమోతి అనే రాణికి నాగేంద్రుడు,
సర్పరూపంలోనే పుత్రుడిగా జన్మించాడంటారు. తన మేనకోడలైన
గౌరితో, నాగేంద్రుడికి వివాహం జరుగుతుంది. సర్పాకృతిలో ఉన్న
తన భర్తను ఓ బుట్టలో పెట్టుకుని గౌరి, గోదావరి
స్నానానికి వెళ్తుంది. పావన గోదావరి జల ప్రభావం వల్ల
నాగేంద్రుడు మనిషి రూపం పొందాడని చెబుతారు. గౌరి
ఆశ్చర్యంతో భర్తను తాకిన మరుక్షణమే నాగేంద్రుడు,
తిరిగి సర్పరూపంలోకి మారిపోయేసరికి- గౌరి ఆవేదనతో
గోదావరిలో కలిసిపోయిందంటారు. గిరిజనుల వంశాన జన్మించిన
తాను సదా వారిని రక్షిస్తూనే ఉంటానని నాగేంద్రుడు
అభయమిచ్చి, కేస్లాపూర్ గుట్టల్లోకి వెళ్లి
అదృశ్యమయ్యాడనేది ఇక్కడి స్థలగాథ!
ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఛత్తీస్గఢ్,
ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల
నుంచీ గిరిజనులు ఈ జాతరలో పాల్గొంటారు. డోలు, కిక్రీ,
కొమ్ము వాయిద్యాలతో గిరిజనులు భక్తిపారవశ్యంతో
నృత్యాలు చేస్తారు. జాతర సందర్భంగా భక్తులు కేవలం
తెల్లటి వస్త్రాలనే ధరిస్తారు. జాతర చివరి రోజు గిరిజన
దర్బార్ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. గిరిజనుల
జీవనశైలికి, ఆచార వ్యవహారాలకు, సంస్కృతీ
సంప్రదాయాలకు, సామూహిక భక్తి చైతన్యానికి, సమష్టి
తత్వానికి, ఐకమత్య భావనకు నాగోబా జాతర సంకేతమై
నిలుస్తోంది!

ఏడుపాయల జాతర


మెదక్
ఏడుపాయల జాతర :
ఈ జాతర మెదక్ జిల్లా పాపన్నపేట మండలం
నాగసానిపల్లిలో జరుగుతుంది.
-ఈ ప్రాంతం వద్ద మంజీర నది ఏడు పాయలుగా చీలిపోతుంది.
ఇక్కడే దుర్గాభవాని ఆలయం ఉంది.
-ఈ ఏడుపాయల్లో మూడుపాయలు దుర్గాభవాని ఆలయం
ముందు వైపు నుంచి, మిగిలిన నాలుగు పాయలు దుర్గాభవాని
ఆలయం వెనుక వైపు నుంచి ప్రవహిస్తాయి.
-ఈ జాతర ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున జరుగుతుంది.
దుర్గాభవాని దేవాలయం
-ఈ ఆలయాన్ని గరుఢ గంగ అని కూడా అంటారు.
-ఆ జాతరను మూడు రోజులపాటు నిర్వహిస్తారు.
-ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రధానంగా ఏడుపాయల స్నానం
ఆచరిస్తారు.
-ఈ జాతరలో పాల్గొన్న భక్తులు ఒక రాత్రి గుడిలో
నిద్రపోవడం ఆచారంగా కొనసాగుతున్నది.
జోగినాథుని జాతర
-మెదక్ జిల్లా జోగిపేటలోని కొండపై జోడు లింగాలుగా వెలసిన
జోగినాథుని జాతర ప్రతి ఏటామార్చిలో జరుగుతుంది.
కేతకి సంగమేశ్వర స్వామి జాతర
-మెదక్ జిల్లాలో జహీరాబాద్ సమీపాన ఝరాసంగం గ్రామంలో
కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది.
-ప్రతి ఏడాది మాఘ బహుళ దశమి నుంచి ఫాల్గుణ శుద్ధ
పాడ్యమి వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు
జరుగుతాయి.
నల్లగొండ
-గొల్లగట్టు జాతర/దురాజ్పల్లి జాతర
-తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర.
-ఈ జాతర జరిగే ప్రదేశం - నల్లగొండ జిల్లా సూర్యాపేట
దగ్గరలోని పాలశేర్లయ్యగట్టు ప్రాంతం
-ఈ జాతరను పెద్దగట్టు జాతర అని కూడా అంటారు.
-యాదవులు తమకు ఆరాధ్య దైవమైన లింగమంతుల
స్వామికి మొక్కులు తీర్చుకోవడానికి ప్రతి రెండేండ్లకోసారి
నిర్వహిస్తారు. లింగమంతుల స్వామి సోదరి - చౌడమ్మ.
-నాలుగు రోజుల పాటు ఈ జాతరను నిర్వహిస్తారు.
-మొదటిరోజు : 30 విగ్రహాలు ఉన్న దేవరపెట్టెను కేసారం
గ్రామానికి తీసుకెళ్లి హక్కుదారులకు చూపించి పూజలు చేస్తారు.
తదనంతరం కంకణాలు కట్టి ఊరేగింపుగా గుట్టపైకి
తీసుకువస్తారు. తర్వాత చౌడమ్మకు మొక్కులు చెల్లిస్తారు.
ఖాసీంపేట యాదవులు పసిడికుండను ఆలయ గోపురం మీద
అలంకరిస్తారు.
-రెండో రోజు : బోనాలు వండుకొని లింగమంతుల స్వామికి, పక్కన
ఉన్న చౌడమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పిస్తారు.
-మూడో రోజు : నెలవారం చేసి పోతరాజు, మిగిలిన దేవుళ్లకు
మొక్కులు చెల్లిస్తారు.
-నాల్గవ/చివరి రోజు : సూర్యాపేట యాదవులు
మకరతోరణాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తారు. తదనంతరం
పూజారులు దేవుళ్లకు కేసారం చేయడంతో జాతర పూర్తవుతుంది.
-ఈ జాతరలో దిష్టిపోయడం అనేది ప్రధాన ఆచారంగా
వస్తుంది. దీన్ని వరంగల్ జిల్లా చికటాయపాలెంలోని
దేవరవంశీయులు, నల్లగొండ జిల్లాకు చెందిన తుండు, మట్ట
వంశ పూజారులు నిర్వహిస్తారు.
చెర్వుగట్టు జాతర
-నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని
ఎల్లారెడ్డిగూడెం గ్రామ సమీపంలో ఉత్సవాలు జరుగుతాయి.
-ఇక్కడి ప్రధాన దైవం - శ్రీజడల రామలింగేశ్వరస్వామి.
మేళ్లచెర్వు జాతర
-నల్లగొండ జిల్లా హుజూర్నగర్ తాలూకాలోని మేళ్లచెర్వు
గ్రామ సమీపంలో ఈ జాతర జరుపబడుతుంది.
-ఈ జాతరలో శంభులింగేశ్వరస్వామి ప్రధాన దైవం.
-శంభులింగేశ్వర స్వామి లింగం పైభాగాన ఐదు సెం.మీ.ల వివరం
ఉంటుంది. దీంట్లో ఎప్పుడూ జలం ఉంటుంది.
-ఈ లింగం లోపల ఉన్న జలాన్ని భక్తులకు తీర్థంగా
ఇస్తుంటారు.
అడవిదేవులపల్లి జాతర
-నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని అడవి
దేవులపల్లిలో ఈ జాతర జరుగుతుంది.
-ప్రధాన దైవం - కనకదుర్గమ్మ తల్లి.
-ఈ జాతరలో ప్రత్యేక కార్యక్రమాలు : సిడిమాన్
ఊరేగింపు, బండ్ల ఊరేగింపు, గండదీపం
కోదండాపురం జాతర
-నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లిపల్లి మండలంలోని
కోదండాపురం గ్రామంలో జాతర జరుగుతుంది.
-ఇక్కడి ప్రధాన దైవం - శ్రీవెంకటేశ్వరస్వామి
-ప్రతి ఏడాది మాఘ బహుళ పంచమి నుంచి ఏకాదశి వరకు
అంగరంగవైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
-ఏడు రోజుల్లో రథోత్సవం ముఖ్యమైంది.
చౌడమ్మ జాతర
-నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకాలో అనేక గ్రామాల్లో
ఈ జాతర జరుగుతుంది.
-చౌడమ్మ యాదవుల కుల దేవత. చౌడమ్మ జాతరను
మూడు రోజుల పాటు జరుపుతారు.
తుల్జాభవాని జాతర
-నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని పెద్దమునిగల్లో
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదిరోజుల పాటు
ఈ జాతర నిర్వహిస్తారు.
-ఈ జాతరలో అనేకమంది లంబాడీ తెగకు చెందినవారు
పాల్గొంటారు.
-జాతర జరిగే తొమ్మిది రోజులు పూజారి ఉపవాసం ఉండి
విజయదశమి రోజున ఉపవాసం విరమిస్తారు.

మన జాతరులు.

ఖమ్మం
-తేగడ జాతర : ఖమ్మం జిల్లా నూగూరు తాలూకా తేగడ
గ్రామంలో భద్రకాళి, వీరభద్రుల దేవాలయాలున్నాయి.
-ఈ దేవతలకు మాఘ బహుళ త్రయోదశి, చతుర్థశుల్లో
కల్యాణం చేస్తారు.
-గోదావరి నదికి వీరభద్ర స్వామి విగ్రహాన్ని తీసుకువెళ్లి
స్నానం చేయించి తిరిగి గుడికి తీసుకెళ్లి పూజలు
నిర్వహిస్తారు.
నిజామాబాద్
-సిద్దులగుట్ట జాతర : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్
మండలం సిద్దులగుట్ట వద్ద జాతర జరుగుతుంది.
-పురాతన కాలంలో నవనాథులు ఈ గుట్టపై శివలింగాన్ని
స్థాపించి తపస్సు చేయడంతో ఈ గుట్టను సిద్దులగుట్ట
అంటారు.
-ఇక్కడి దేవాలయంలోని శివుడిని సిద్దలింగేశ్వరుడిగా
కొలుస్తారు.
రంగారెడ్డి
-చేవెళ్ల జాతర : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల గ్రామంలో
శ్రీలక్ష్మి వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవాలు ప్రతి ఏడాది
చైత్రమాసంలో జరుగుతాయి. మూడు రోజుల పాటు జరిగే
ఉత్సవాల్లో బ్రహ్మోత్సవం, రథోత్సవం ప్రధానమైనవి.
మహబూబ్నగర్
కురుమూర్తి జాతర
-మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం అమ్మాపూర్
గ్రామంలో నిర్వహించబడుతుంది.
-ఇక్కడ ప్రధాన దైవం - కురుమర్తి రాయుడు
-ఈ జాతరను 19 రోజుల పాటు నిర్వహిస్తారు.
-దీనిలో 8వ రోజు జరిపే శ్రీవారి ఉద్ధాలసేవ చాలా
పవిత్రమైంది.
మన్నెంకొండ జాతర
-మహబూబ్నగర్ జిల్లాలోని మన్నెంకొండ వద్ద జాతర
జరుగుతుంది.
-ప్రముఖ దైవం - ఆంజనేయస్వామి
సిరసనగండ్ల జాతర
-మహబూబ్నగర్ జిల్లా వంగూరు మండలంలోని చారకొండ దగ్గర
సిరసనగండ్ల జాతర జరుగుతుంది.
-జాతర ప్రత్యేకత : వైభవంగా సీతారాముల కల్యాణం
జరపడం.
రంగాపూర్ జాతర
-మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్
గ్రామంలో ఈ జాతర జరుగుతుంది.
-ఇక్కడ నల్లమల అడవులోని కొండలపై ఉమామహేశ్వర
దేవాలయం ఉంది. కొండకింద రంగాపూర్ గ్రామంలో హజ్రత్
నిరంజన్ షావలి దర్గా ఉంటుంది.
-వారం రోజులపాటు ఈ జాతర మతాలకతీతంగా జరుగుతుంది.
సలేశ్వరం జాతర
-మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట మండలంలోని అడవుల్లో
చెంచుల ఆధ్వర్యంలో సలేశ్వర తీర్థం ఉంది.
-ఈ జాతర సంవత్సరానికి ఒకసారి ఏప్రిల్ నెలలో
చైత్రపౌర్ణమికి మూడు రోజుల ముందు, మూడు రోజుల వెనుక
మొత్తం వారం రోజులు జరుగుతుంది.
-ఇక్కడ ప్రధాన దైవం - శివుడు
మల్దగల్ జాతర
-మహబూబ్నగర్ జిల్లా మల్దగల్లో తిమ్మప్ప జాతర
జరుగుతుంది. శ్రీవేంకటేశ్వర స్వామిని భక్తులు తిమ్మప్పగా
కొలుస్తారు.
గద్వాల్ జాతర
-మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ పట్టణంలోని
చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రతి ఏడాది ఈ జాతర
జరుగుతుంది.
ఆదిలాబాద్
నాగోబా జాతర
-నోగోబా దేవాలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం
కేస్లాపూర్ వద్ద ఉన్నది.
-నాగోబా గిరిజనుల ఆరాధ్యదైవం. పూర్వకాలంలో నాగోబా గోండుల
కుటుంబంలో జన్మించి అద్భుతమైన మహిమలను కనబర్చి
కేస్లాపూర్ గ్రామాన ఉన్న పుట్టలోకి ప్రవేశించిందని
చెప్తారు. అప్పటి నుంచి గోండులు ఆ పుట్టకు పూజలు చేస్తూ
అక్కడ దేవాలయాన్ని నిర్మించారు.
-సర్పజాతిని పూజించడం ఈ పండుగ ప్రత్యేకత.
-ప్రతి ఏడాది పుష్యమాసం అమవాస్య రోజు నుంచి నాలుగు
రోజుల పాటు ఈ పండుగ జరుగుతుంది.
-నాగోబా జాతరలో దర్బార్ ఏర్పాటు చేసిన ప్రముఖ మానవ
పరిణామ శాస్త్రవేత్త - ప్రొఫెసర్ హైమన్డార్ప్
(1946)
బుర్నూరు జాతర
-ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు తాలూకాలోని బుర్నూరు ప్రాంతంలో
ఈ జాతరను జరుపుకుంటారు.
-బుర్నూరు ప్రాంతంలో గోండుల దేవతలు అయిన అకిపెణ్,
ఆవులపెణ్, మాసోబాలను గ్రామ పొలిమేరల్లో నెలకొల్పారు.
ఈ దేవతలను పూజిస్తూ గోండులు తమ కార్యక్రమాలను
కొనసాగిస్తారు.
వేలాల జాతర
-ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు తాలూకాలోని వేలాలలో
మహాశివరాత్రి రోజున అతిపెద్ద జాతర జరుగుతుంది.
-గోదావరి నది తీరంలో భక్తులు భజనలతో శంకరుడిని పూజించి
తమ మొక్కులు తీర్చుకుంటారు.
కరీంనగర్
బెజ్జంకి జాతర
-ఈ జాతర కరీంనగర్ జిల్లా బెజ్జంకి అనే ప్రాంతంలో
జరుగుతుంది.
-ఇక్కడ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం ఉంది. ఈ
దేవాలయంపై గోపికల నృత్యాలు, త్రిమూర్తుల విగ్రహాలు,
సముద్ర మథన కథ మొదలైన వాటిని అద్భుతంగా చెక్కారు.
-ఈ జాతరను చైత్రమాసంలో జరుపుతారు. చైత్రపూర్ణిమ
నాడు బండ్ల సేవ జరుగుతుంది. ఇక్కడ ఎడ్లబండ్ల పోటీలు
నిర్వహిస్తారు.
-ఆలయానికి ఉత్తరంగా 35 అడుగుల ఎత్తు స్తంభం ఉంది.
దీన్ని అండాళ్ స్తంభం అని అంటారు. సంతానం కోసం ఈ
స్తంభానికి చీర కట్టించి ఒడిబియ్యం పోసే ఆచారం ఉంది.
నల్లకొండ జాతర
-కరీంనగర్ జిల్లా కోడిమ్యాల మండలం నల్లకొండ గ్రామ
సమీపంలో ఈ జాతర జరుగుతుంది.
-ప్రతి ఏడాది మాఘ పౌర్ణమి రోజున జాతర జరుగుతుంది. -
ప్రధాన దైవం నల్లకొండ నర్సింహస్వామి.
సింగరాయ జాతర
-కరీంనగర్ జిల్లా కోహెడ మండలం కూరెళ్లలో ఈ జాతర
జరుగుతుంది.
-ప్రధాన దైవం - లక్ష్మీనర్సింహస్వామి.
-ప్రతి ఏడాది పుష్యబహుళ అమావాస్య రోజున
జరుగుతుంది.
కొండగట్టు జాతర
-కరీంనగర్ జిల్లా ముత్యంపేట సమీపంలో ఈ ఉత్సవాలు
జరుగుతాయి.
-ప్రధాన దైవం - ఆంజనేయస్వామి. ఇక్కడ హనుమంతుడు
ఒకవైపు నర్సింహస్వామి ముఖంతో, ఇంకోవైపున
ఆంజనేయస్వామి ముఖంతో రెండు ముఖాలను కలిగి ఉంటారు.

25 February 2016

మనం తెలుసుకోదగ్గ విషయాలు

మన పురాణాలనుండి
మనం తెలుసుకోదగ్గ విషయాలు.

1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.

2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.

3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.

4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు.

5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు.

6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు.

7. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి.

8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.

9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.

10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.












11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.

12. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి.

13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.

14. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు.

15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.

16. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్ర వచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోను అసహ్యించుకొనరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు.

17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం.

18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు.

19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.

20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.











21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు.

22. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమంలేదు.

23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు.

24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు.

25. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.

26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను.

27. ఏకాదశి నాడు ఎన్ని అన్నంమెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి.

 ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు.

28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు.

29. తూర్పు, ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు.

30. ఉమ్ము మాత్రం తూర్పు, పడమరగా వేయరాదు.










31. శివపూజకు మొగలిపువ్వు పనికిరాదు.

32. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు.

33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు.

34. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి.

35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.

36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.

37. గొడుగు, చెప్పులు కలిపి కాని, గోవును గాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు.

38. అన్నదానం, జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు.

39. సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్ళలో పుడతారు.

40. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది.










41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు.

42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు.

43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.

44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.

45. విష్ణు ఆలయంలో 4 ప్రదిక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి.

46. ఆలయంలో ఆత్మప్రదిక్షిణ అనునపుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు, గుడి చుట్టూ ప్రదిక్షిణం మాత్రమే చేయాలి.

47. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు.

48. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చినా దానిని తీసుకోరాదు. జ్యోతిర్లింగాలు, స్వయంభూలింగాలు, బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదం స్వీకరించవచ్చు.

49. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైధునం పనికిరాదు.

50. బహిష్టు కాలంలో పొయ్యి వెలిగించినా, అన్నం వంటివి వండినా పిల్లల వల్ల దుఃఖాల పాలౌతారు. కనుక అవి పనికిరావు.












51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం.

52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.

53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.

54. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.

55. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు.

56. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.

57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.

58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.

59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.

60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.











61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు.

62. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.

63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.

64. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు.

65. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.

66. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి.

67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.

68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.

69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.

70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.










71. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.

72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాగ్బంగం చాలా దోషం.

73. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే, వాడికి "యముడు" మల ముత్రాదులు ఆహారంగా ఇస్తాడు.

74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.

75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.

76. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి.

77. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. (ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు). పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి.

78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.

79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.

80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.






81. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.

82. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.

83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.

84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.

85. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.

86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.

87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.

88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలు.











తులసి పూజ

తులసీ దయాపూర్ణకలశీ - తులసి పూజ, దళచయనం

కార్తీక మాసం కదా? తులసి పూజ, తులసి వివాహం ఈ నెలలో వచ్చిన విశేషమైన పూజలు. తులశమ్మ విశేషాలు కొన్ని తెలుసుకుందాం.



తులసి - స్వయంగా శ్రీమహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకలసంపదలకు లొంగక, రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. తులసిని ఎన్నో విధాలుగా నుతించారు మన సనాతన ధర్మంలో. తులసిలేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. మరి తులసి ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి వద్ద నిత్యం దీపం పెట్టటం మన కనీస ధర్మం. అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలు కలది. మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం తులసి పత్రాలు అమృతముతో సమానము.






అనన్యదర్శనాః ప్రాతః మే పశ్యంతి తపోధన
జగత్త్రితయ తీర్థాని తైర్దృష్టాని న సంశయః




ఉదయము నిద్రనుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది.




తులసిచెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరిక, మానసిక ఆరోగ్యమునిస్తుంది.




తులసి పూజ ఎలా చేయాలి?

తులసికోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణము చేయాలి, నమస్కరించాలి. దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాపప్రక్షాళన జరుగుతుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు.





ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి చెట్టు వద్ద నిలుచొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి.




నమస్తులసి కళ్యాణీ! నమో విష్ణుప్రియే! శుభే!
నమో మోక్షప్రదే దేవి! నమస్తే మంగళప్రదే!
బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ!
పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణజీవనీ!



ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్థసంయుతం
యః పఠేత్తం చ సంపూజ్య సోశ్వమేధ ఫలం లభేత్



అని తులసిని ప్రార్థించి, అచ్యుతానంతగోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి. తరువాత క్రింది శ్లోకాన్ని ప్రార్థనా పూర్వకంగా పఠించాలి.



యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం



అని చెంబులోని నీళ్లను తులసిచెట్టు మొదట్లో పోసి నమస్కరించాలి.



తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే
నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే

అని తులసికోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి.



పూజ కోసం తులసీ పత్రాలను ఎలా కోయాలి అన్నదానికి సనాతన ధర్మం ఒక పద్ధతిని తెలియజేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.



తులసీం యే విచిన్వంతి ధన్యాస్తే కరపల్లవాః - పూజ చేయటం కోసం తులసి దళాలను త్రెంపిన చేతులు ఎంతో ధన్యములు అని స్కాందపురణం చెప్పింది.





తులసి చెట్టునుండి దళాలను మంగళ, శుక్ర, ఆది వారములలో, ద్వాదశి, అమావాస్య, పూర్ణిమ తిథులలో, సంక్రాంతి, జనన మరణ శౌచములలో, వైధృతి వ్యతీపాత యోగములలో త్రెంప కూడదు. ఇది నిర్ణయసింధులో, విష్ణుధర్మోత్తర పురాణంలో తెలియజేయబడినది. తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణం అయినట్లు కాదు. ఇది వరాహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి నిషిద్ధమైన రోజులలో, తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలి పడిన ఆకులతో, దళములతో పూజ చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములను త్రెంపి దాచుకొని మరుసటి రోజు ఉపయోగించాలి. సాలగ్రామ పూజకు మాత్రం ఈ నిషేధము వర్తించదు. సాలగ్రామమున్నవారు అన్ని తిథివారములయందు తులసి దళములను త్రెంపవచ్చు. ఎందుకంటే సాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం. శ్రీమహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలూ వర్తించవు. ఇది ఆహ్నిక సూత్రావళిలో చెప్పబడింది. స్నానము చేయకుండా మరియు పాద రక్షలు ధరించి తులసి చెట్టను తాకరాదు, దళములను త్రెంపకూడదు. ఇది పద్మపురాణంలో చెప్పబడింది.





తులసి దళాలను ఎలా త్రెంపాలి?

తులసి ఆకులను ఒక్కొక్కటిగా త్రెంపకూడదు. రెండేసి ఆకులు కలిగిన దళముతో కూడిన కొసలను త్రెంపాలి. అన్ని పుష్పాల కన్నా తులసీ మంజరులు (అంతే తులసికి వచ్చే పుష్పాలు) అత్యంత శ్రేష్ఠమని, ఈ మంజరులను కోసేటప్పుడు వాటితోపాటు ఆకులు తప్పనిసరిగా ఉండాలని బ్రహ్మపురాణం చెప్పింది.



తులసిమొక్కకు ఎదురుగా నిలబడి, రెండు చేతులు జోడించి, కింది మత్రాన్ని చదువుతూ పూజా భావంతో మొక్కను కదిలించకుండా తులసి దళాలను త్రెంపాలి. దీనివలన పూజాఫలం లక్షరెట్లు అధికంగా లభిస్తుంది అని పద్మపురాణం చెప్పింది.




మాతస్తులసి గోవింద హృదయానందకారిణి
నారాయణస్య పూజార్థం చినోమి త్వాం నమోస్తుతే


తులస్యమృతజన్మాసి సదా త్వం కేశవప్రియా
చినోమి కేశ్వస్యార్థే వరదా భవ శోభనే

త్వదంగసంభవైః పత్రై పూజయమి యథా హరిం
తథా కురు కురు పవిత్రాంగి! కలౌ మలవినాశిని!

(ఆహ్నిక సూత్రావళి)

శ్రెహరికి ఆనందాన్ని కలిగించే తులసీ మాతా! నారాయణుని పూజ కొరకు నీ దళములను కోస్తున్నాను. నీకు నా నమస్కారములు. అమృతమునుండి జన్మించిన, ఎల్లప్పుడు శ్రీహరికి ప్రియమైన తులసీమాతా! ఆ కేశవుని పూజ కొరకు నీ దళాలను త్రెంపుతున్నాను. నాకు అభయమునివ్వు శుభకరీ! నీ శరీరమునుండి జన్మించిన పత్రములతో ఆ శ్రీహరిని పూజిస్తాను. కలియుగంలో సమస్త దోషములు తొలగించే పవిత్రమైన శరీరము కల తల్లీ! నేను తలపెట్టిన హరిపూజను సాఫల్యము చేయుము.






పూజ చేసిన తరువాత ఒక తులసీదళాన్ని "అచ్యుతానంతగోవింద" అని స్మరిస్తూ నోట్లో వేసుకొని తినాలి. ప్రతిరోజు భక్తిభావంతో ఒక తులసిదళాన్ని సేవించటం వలన సకల రోగాలు నశిస్తాయి, రాబోయే రోగాలు నిరోధించబడుతాయి.




దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తులసీ దయాపూర్ణకలశీ అన్నారు ఒక గీతంలో. తులసి అంతటి వైభవము, దయ కల మాత. నిత్యం పూజిద్దాం, దళాన్ని సేవిద్దాం. సకల శుభాలను,ఆరోగ్యాన్ని పొందుదాం.