09 September 2016

నవ గ్రహ దోష నివారణకు




నవ గ్రహ దోష నివారణకు పూజించ వలసిన గణపతులు, వినాయకుని చవితి రోజు మనం చేస్తున్న తప్పులు మనం చేసిన దోషాలు తొలగించుకోవడానికి గణేశారాధన మంచిదని చెబుతుంటారు.









మనం చేసిన దోషాలు మన దగ్గరికి రాకుండా, మనం వాటిని తొలగించుకోవాలంటే గణేశారాధన చేయాల్సిందే.







సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.






చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి.








కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది.






బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి.






గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి.




శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతికి ఆరాధన చేయాలి.






శని దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి.





రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పుజిస్తే ఫలితం ఉంటుంది.





కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి.




ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు.




పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి.



పాలరాయితో చేసిన గణపతిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది.



మనకు ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి.




స్ఫటిక గణపతిని పూజిస్తే సుఖశాంతులను ప్రసాదిస్తాడు.





నక్షత్ర గాయత్రి

(( నక్షత్ర గాయత్రి ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలి))
1.అశ్విని ఓం శ్వేతవర్ణై విద్మహే సుధాకరాయై ధిమహి తన్నో అశ్వినేన ప్రచోదయాత్

2.భరణి ఓం కృష్ణవర్ణై విద్మహే దండధరాయై ధిమహి తన్నో భరణి:ప్రచోదయాత్


3.కృత్తికా ఓం వణ్ణిదేహాయై విద్మహే మహాతపాయై ధీమహి తన్నో కృత్తికా ప్రచోదయాత్

4.రోహిణి ప్రజావిరుధ్ధై చ విద్మహే విశ్వరూపాయై ధీమహి తన్నో రోహిణి ప్రచోదయాత్



5.మృగశిరా ఓం శశిశేఖరాయ విద్మహే మహారాజాయ ధిమహి తన్నో మృగశిర:ప్రచోదయాత్


6.ఆర్ద్రా ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే పశుం తనాయ ధిమహి తన్నో ఆర్ద్రా:ప్రచోదయాత్


7.పునర్వసు ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే అదితి పుత్రాయ ధిమహి తన్నో పునర్వసు ప్రచోదయాత్

8.పుష్య ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే మహాదిశాయాయ ధిమహి తన్నో పుష్య:ప్రచోదయాత్

9.ఆశ్లేష ఓం సర్పరాజాయ విద్మహే మహారోచకాయ ధిమహి తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్

10.మఖ ఓం మహా అనగాయ విద్మహే పిత్రియాదేవాయ ధిమహి తన్నో మఖ: ప్రచోదయాత్


11.పుబ్బ ఓం అరియంనాయ విద్మహే పశుదేహాయ ధిమహి తన్నో పూర్వఫల్గుణి ప్రచోదయాత్












12.ఉత్తరా మహాబకాయై విద్మహే మహాశ్రేష్ఠాయై ధీమహి తన్నో ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్

13.హస్త ఓం ప్రయచ్చతాయై విద్మహే ప్రకృప్రణీతాయై ధీమహి తన్నో హస్తా ప్రచోదయాత్

14.చిత్తా ఓం మహాదృష్టాయై విద్మహే ప్రజారపాయై ధీమహి తన్నో చైత్రా:ప్రచోదయాత్


15.స్వాతి ఓం కామసారాయై విద్మహే మహాని ష్ఠాయై ధీమహి తన్నో స్వాతి ప్రచోదయాత్



16.విశాఖ ఓం ఇంద్రాగ్నేస్యై విద్మహే మహాశ్రేష్ఠాయై చ ధీమహీ తన్నో విశాఖ ప్రచోదయాత్



17 అనూరాధ ఓం మిత్రదేయాయై విద్మహే మహామిత్రాయ ధీమహి తన్నో అనూరాధా ప్రచోదయాత్



18.జ్యేష్ఠా ఓం జ్యేష్ఠాయై విద్మహే మహాజ్యేష్ఠాయై ధీమహి తన్నో జ్యేష్ఠా ప్రచోదయాత్




19.మూల ఓం ప్రజాధిపాయై విద్మహే మహాప్రజాధిపాయై ధీమహి తన్నో మూలా ప్రచోదయాత్



20.పూర్వాషాఢ ఓం సముద్ర కామాయై విద్మహే మహాబీజితాయై ధిమహి తన్నో పూర్వాషాఢా ప్రచోదయాత్



21.ఉత్తరాషాఢ ఓం విశ్వేదేవాయ విద్మహే మహాషాఢాయ ధిమహి తన్నో ఉత్తరాషాఢా ప్రచోదయాత్



22. శ్రవణ ఓం మహాశ్రేష్ఠాయై విద్మహే పుణ్యశ్లోకాయ ధీమహి తన్నో శ్రవణ ప్రచోదయాత్




23.ధనిష్ఠా ఓం అగ్రనాథాయ విద్మహే వసూప్రితాయ ధీమహి తన్నో శర్విష్ఠా ప్రచోదయాత్




24.శతభిషం ఓం భేషజాయ విద్మహే వరుణదేహాయ ధీమహి తన్నో శతభిషా ప్రచోదయాత్


25.పూర్వాభాద్ర ఓం తేజస్కరాయ విద్మహే అజరక పాదాయ ధీమహి తన్నో పూర్వప్రోష్టపత ప్రచోదయాత్



26.ఉత్తరాభాద్ర ఓం అహిరబుధ్నాయ విద్మహే ప్రతిష్ఠాపనాయ ధీమహి తన్నో ఉత్తరప్రోష్టపత ప్రచోదయాత్




27.రేవతి ఓం విశ్వరూపాయ విద్మహే పూష్ణ దేహాయ ధీమహి తన్నో రేవతి ప్రచోదయాత్





మోక్షమునకు ప్రథమ సోపానము

పూర్వం ఇంద్రద్యుమ్నుడనే రాజేంద్రుడు ఉండేవాడు. అతడు ఎన్నో దానధర్మాలు చేసి ధర్మాచరణలో తనంతటి వాడు లేడనే ఖ్యాతిని పొందినాడు. లెక్కగట్టలేనన్ని గో భూ హిరణ్య దానములు పాత్రులైన వారికిచ్చి అనంత పుణ్యసంపదను ఆర్జించుకొన్నాడు. రాజర్షి అయ్యి ప్రజారంజకముగా పాలన చేసినాడు. అలా ఎన్నో వర్షములు రాజ్యపాలనము చేసి తన పుణ్యనిధి ప్రభావముతో కాలం చెల్లాక స్వర్గం చేరుకొన్నాడు.

చాలాకాలము స్వర్గభోగాలు అనుభవించిన తరువాత ఒకరోజు దేవేంద్రుడు ఇంద్రద్యుమ్నుని పిలిపించి “మహాత్మా! నీవు అనేక దానధర్మాలు చేసి ఎంతో పుణ్యమును ఆర్జించినావు కనుక ఇంత దీర్ఘకాలము స్వర్గములో ఉండగలిగినావు. కానీ పరమేశ్వరుని శరణువేడి ఆయన కృపతో పోందెడి మోక్షపదము ఒక్కటే శాశ్వతమైనది (ఇతరములు శాశ్వతములు కావు). నీ పుణ్యఫలమును అనుభవించినావు కావున సర్గమును వీడు సమయము వచ్చినది” అని చెప్పినాడు. 










స్వర్గాధిపతి మాటలు విని ఇంద్రద్యుమ్నుడు ఇంతకొద్ది కాలములోనే తన పుణ్యరాసులు ఎలా కరిగిపోయినాయి? అని ఆశ్చర్యపోయినాడు. అది చూసి శచీపతి “రాజా! భూలోకములో నిన్ను కానీ నీవుచేసిన సత్కర్మలను కానీ గుర్తుపెట్టుకొన్న వానిని నాకు చూపిస్తే నీవు స్వర్గములోనే ఉండవచ్చు. చేసిన దానములు మహనీయములు కాకపోతే జనులు చిరకాలము గుర్తుంచుకొనరు కదా! కావున నీ దానములను ఎంతకాలము ప్రజలు ఉపయోగింతురో అంతకాలము నీవిక్కడనుండవచ్చు” అని హితవు చెప్పినాడు. ఇంద్రుని ఆజ్ఞతీసుకొని అట్టివారు ఉన్నారేమో వెదకటానికి బయలుదేరినాడు ఇంద్రద్యుమ్నుడు. 





చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వద్దకువెళ్ళి నమస్కరించి “ఓ తపస్విచంద్రమా! నన్ను మీరు ఎఱుగుదురా”? అని అడిగినాడు. 

అప్పటికి ఎంతోకాలముగా తీర్థయాత్రలుచేసి ఉపవాస వ్రతాలు చేసి కృశించి ఉన్న మార్కండేయ మహర్షి గుర్తులేదని చెప్పినాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు “స్వామి! చిరంజీవులైన మీకంటే ముందుపుట్టిన ప్రాణి ఏదైనా బ్రతికి ఉన్నదా”? అని అడిగినాడు. “పవిత్ర హిమాలయ పర్వత ప్రాంతములో ప్రావారకర్ణం అనే గుడ్లగూబ ఉన్నది” అని బదులిచ్చినాడు మార్కండేయ మహర్షి. వెంటనే ఆ ఉలూకము వద్దకు చేరి “అయ్యా! నెన్నెఱుగుదువా”? అని ప్రశ్నించినాడు. తెలియదు అని చెప్పి “ఇక్కడికి కొన్ని యోజనాల దూరములో ఇంద్రద్యుమ్నమను సరోవరమున్నది. ఆ సరోవరములో నాడీజంఘమనే కొంగ ఉన్నది” అని ప్రావారకర్ణం చెప్పగా ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మదేవుని స్నేహితుడైన నాడీజంఘుని వద్దకు చేరి “ఓ బకరాజా! నన్ను మీరు గుర్తుపట్టినారా”? ప్రశ్నించినాడు. “లేదు. ఈ సరోవరములో ఆకూపారమనే తాబేలు ఉన్నది. అది నాకంటే పెద్దది. దానికి నీవు తెలుసేమో కనుక్కో” అని చెప్పినది. ఇంద్రద్యుమ్నుని చూడగానే ఆకూపార కళ్ళుచెమ్మగిల్లాయి “అయ్యా! వెయ్యి యజ్ఞములు సాంగముగా చేసి వెయ్యి యూపస్తంభాలు కట్టించినావు. ఆ యజ్ఞదానాలలో లెక్కకట్టలేనన్ని గోదానాలు ఇచ్చినావు. నీవు దానము ఇచ్చిన గోవుల రాకపోకలతో ఈ భూమి దిగబడి యింత సరోవరము అయినది. ఇది అంతా నీ చలవే” అని కృతజ్ఞతాపూర్వకముగా చెప్పినది.
మరుక్షణం దేవతలు దివ్యవిమానములో ఇంద్రద్యుమ్నుని స్వర్గానికి తీసుకొని వెళ్ళినారు.








మన సత్కీర్తి భూలోకములో ఉన్నంత కాలము సర్గలోకము కరతలామలకము. ఆకూపార ఇంద్రద్యుమ్నుడు చేసిన దానములు మరువలేదు కావున ఇంద్రద్యుమ్నునికి పునః సర్గలోక ప్రాప్తి కలిగినది.


 కానుక మనము నలుగురుకీ ఉపకరించే పనులు చేయాలి. అవియే మనలను రక్షించు సంపదలు (ధనము కాదు). దేవేంద్రుడు చెప్పినట్టు మోక్షము ఒక్కటే శాశ్వతపదము. ఇంత పుణ్యాత్ముడు కాబట్టే మహావిష్ణువు గజేంద్ర రూపములో ఉన్న ఇంద్రద్యుమ్నునిచే “నీవేతప్ప హితః పరంబెఱుగను …” అని అనిపించి అతనికి శాశ్వతమైన మోక్షమును ప్రసాదించినాడు (గజేంద్ర మోక్షము కథ). కావున మోక్షమునకు పుణ్యమే ప్రథమ సోపానము












ఈ జన్మలో చేసే పాపాలకు

ఈ జన్మలో చేసే పాపాలకు వచ్చే జన్మలో ఎలా పుడతారు.

సమాజంలో ప్రాచీన కాలం నుంచే మంచి నడక నడత ఉండాలని అనేక నియమాలను పెడుతూ వచ్చారు. అంతే కాదు అవి ధిక్కరించిన వారు ఎటువంటి ఫలితాలను అనుభవిస్తారో శాస్త్రాల్లో వివరించారు. 

తప్పుచేసేవారు భయపడి పోయేలా వాటిని తెలియజెప్పారు. నమ్మకాల సంగేతాలున్నా గాని మంచి పౌరినిగా వేలగాలంటే కొన్ని పాపకార్యాలకు దూరంగా ఉండాలి.










పూర్వ జన్మలో పాపం చేసినవారు ఈ జన్మలో ఎలా పుడతారో తాళపత్ర నిధి గ్రంధం లో స్పష్టంగా పేర్కొన్నారు.

గోహత్య చేసినవాడు తిరిగి మరుగుజ్జు గా జన్మిస్తాడు.

శాస్త్రాన్ని అవమానించినవాడు పాండు రోగిగా జన్మిస్తాడు.

స్త్రీని హత్య చేసినవాడు నిత్యరోగిగా పుడతాడు.

అబద్దపు సాక్ష్యం చెప్పిన వాడు మూగవాడిగా పుడతాడు.
 
అబద్దాలను వినేవాడు చీమై పుడతాడు.

పుస్తకాలను దొంగిలించిన వాడు గుడ్డివాడుగా జన్మిస్తాడు.

ఇష్టానుసారం వ్యభిచారించనవాడు అడవిలో ఏనుగుగా పుడతాడు.

పిలువని పేరంటానికి వెళ్ళినవాడు కాకిగా జన్మ ఎత్తుతాడు.

మిత్రుద్దిని మోసం చేసినవాడు గద్ద అవతారమెత్తుతాడు.

భర్తను పలువురిని హింసించే స్త్రీ జలగగా జన్మిస్తుంది.
అమ్మకాల్లో మోసం చేసినవాడు గుడ్లగూబ గా పుడతాడు.
భర్తను మోసం చేసిన ఆడది బల్లిగా పుడుతుంది.

  గురుపత్ని తో సంభోగం చేస్తే తొండగా జన్మిస్తాడు.

అతి కామం కలిగినవాడు గుర్రంగా జనిమిస్తాడు.

భార్యను హింసిస్తే మేకగా పుడతాడు. 

ఇలా పూర్వ జన్మలో పాపం చేస్తే వచ్చే జన్మలో ఖచ్చితంగా శిక్ష తప్పదని మన పురాణాల్లో పేర్కొన్నారు.










వినాయక చవితి రోజున పొరపాటున చంద్ర దర్శనం జరిగితే ఏం చెయ్యాలి.

వినాయక చవితి రోజున పొరపాటున చంద్ర దర్శనం జరిగితే ఏం చెయ్యాలి

వినాయక చవితి రోజున చంద్ర దర్శనం ( చంద్రుని చూడటటం ) వలన నీలాపనిందలు అనగా చేయని తప్పుకి మాటలు /నిందలు పడాల్సి రావడం వలన అబాసుపాలు అవ్వడం జరుగుతుందని శాస్త్ర ఉవాచ.










!! పురాణ కాలంలో శ్రీ కృష్ణుడు అంతటి వారు కూడా శమంతక మణి విషయంలో నిందలు పడవలసి వచ్చ్హిందని మనందరికి తెలుసు.








మరి అలాంటి సమయంలో ఈ క్రింది మంత్రమును చదువుకుని పూజ లో ఉంచిన అక్షింతలను శిరస్సు పై చల్లుకోవడము ద్వారా దోష పరిహారము అవుతుందని ప్రాచీన శాస్త్రములు చెబుతున్నాయి .కాబట్టి అవసరమున్న వారు దీనిని ఆచరించి తరించుటకు మీకు అందిస్తున్నాము.




సింహహ ప్రసేన మావదీత్ సింహో జాంబవతా హతః యేషా బాలక మరోదీః తవ హియేషా శమంతకః




శనిత్రయోదశి

శనిత్రయోదశి నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. 

సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు. 













ఏ త్రయోదశి అయితే శనివారము తో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని ' శనీశ్వరుడు 'గా సంబోదించి పరమశివుడు వరము ఇచ్చాడు . శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనేశ్వరుడు. శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చినది సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడునే ఆ శని ప్రభావమునకు లోనయ్యాను. 


సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు , శని... " నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీ కిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖు పుష్పములు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో .. వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరము ఇస్తునానని తెలిపాడు.





 ఆ తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు. 

శనివారం త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం. 

"శని" భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం న త్రయోదశి రోజు . 

శనిత్రయోదశి పూజ కోసము వారు కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.

 1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగినవారు ఆరోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము 8గంటలతరువాత భోజనాదులను చేయటము.

 2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు. 

3. వీలైన వారుశివార్చన స్వయముగా చేయటము.

 4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు (నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం) అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం. 

5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.

 6. ఆరోజు (కుంటివాళ్ళు,వికలాంగులకు) ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం.

 7. ఎవరివద్దనుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి. 













శని మహత్యం శనిభగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోపబడి, పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు నరికివేయబడ్డాడు. చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్ధించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు. 


శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి. 

శనిమహాత్మ్యం, కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్దలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది . 

బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి మోదం కలిగించారు. శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడాలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి పై సారించలేదు. తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి. 





శనీశ్వర జపం-శనీశ్వరుడి జప మంత్రాలు నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం, తమ్ నమామి శనైశ్చరం || ఓం శం శనయేనమ:|| || ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ || || ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః || శని గాయత్రీ మంత్రం: ఓం కాకథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్. || ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ || బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన "నవగ్రహ పీడహర స్తోత్రం": ||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మే శని: || ||ఓం శం శనైస్కర్యయే నమః|| ||ఓం శం శనైశ్వరాయ నమః|| ||ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః || ||కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:|| ఓం నమో శనైశ్వరా పాహిమాం, ఓం నమో మందగమనా పాహిమాం, ఓం నమో సూర్య పుత్రా పాహిమాం, ఓం నమో చాయాసుతా పాహిమాం, ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం, ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం, ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం.








శని మహాదశ
జాతకంలో శని అనుకూలంగా ఉన్న యెడల ఈ శని మహాదశలో వృత్తిలో ఉన్నత స్థాయికి ఎదగటం, శతృభయ నివారణ, సమస్యలు తొలగి పోవటం, సహోద్యోగుల నుంచి సహకారం, విదేశీయానం, ఆద్యాత్మికత పెరగటం మొదలైన ఫలితాలుంటాయి.


 శని జాతకంలో అనుకూలంగా లేనియెడల ఈ శని దశయందు మీకు గానీ, మీ కుటుంబ సభ్యులకు గానీ వాత సంబంధ రోగాలు (కీళ్ళ నోప్పులు ఇత్యాది) బాధించును. ఆర్థిక నష్టం, పంట నష్టం, నీచ జాతీయులుతో విరోధం, దుర్మార్గులతో స్నేహ సంబంధములు, పనివాళ్ళతో గొడవలు, దూర ప్రదేశములో నివాసం, ఊహించని ధన నష్టాలు, మొదలైన ఫలితాలుంటాయి. శనిదశలో కలిగే చెడుఫలితాలు తగ్గటానికి శని స్తోత్ర, మంత్రాలను చదవటం, హనుమాన్ చాలీసా చదవటం, హనుమాన్ ఆరాధన చేయటం మంచిది.


శని భుక్తి
శని మహాదశలో శనిభుక్తిలో అనుకూల ఫలితాలుంటాయి. ఆలస్యమవుతున్న పనులు త్వరగా పూర్తవటం జరుగుతుంది. ఉద్యోగంలో, ఆర్థికంగా, అన్ని విధములుగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. శని కర్మ కారకుడు కాబట్టి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. బద్ధకం తొలగి కార్యోన్ముఖులవుతారు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విదేశీయానం చేస్తారు. అయితే జాతకంలో శని అనుకూలంగా లేనట్టయితే ఇది పరీక్ష సమయంగా ఉంటుంది. ప్రతి పనిలో అడ్డంకులు పెరుగుతాయి. బద్దకం, నిరాశ, నిస్పృహలు పెరుగుతాయి. చేయగలిగే పనులుకూడా చేయకుండా వాయిదా వేస్తుంటారు. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. శనిగ్రహ దోష నివారణకుగాను రోజు శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా చదవటం, వృద్దులకు, వికలాంగులకు సేవచేయటం మంచిది.













02 April 2016

మాంగల్యధారణ నల్లపూసలు, పగడం, ముత్యం మెట్టెలు

హిందూ వివాహ తంతులో మాంగల్యధారణ మరియు నల్లపూసలు, పగడం, ముత్యం ప్రాముఖ్యత.













హిందూ వివాహ తంతులో మాంగల్యధారణే అతి ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతోబాటూ వివిధ రూపాలు కూడా ఉన్నాయి. మానవులకు మనువాడటం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం. మంగళసూత్రం లేదా మాంగళ్యం హిందూ సాంప్రదాయంలో పెళ్ళి జరిగిన స్త్రీలు మెడలో ధరించే గొలుసు లాంటి వస్తువు. దీనిలో తాళి లేదా తాళిబొట్టు, కొన్ని నల్ల పూసలు మొదలైనవి గుచ్చుకుంటారు. వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం.











ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు. “ మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!! ” మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్వతనుభంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం.శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు. అందుకే హిందూ స్తీ మంగళ సూత్రము ధరించును. వివాహిత మెడలో మంగళ సూత్రము లేదంటే భర్త చనిపోయినట్లుగా భావించవచ్చును.












మంగళసూత్రంలో పగడం, ముత్యం, నల్లపూసలు ప్రాముఖ్యత మంగళసూత్రంలో ముత్యం,పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది, ఎందుకు? 

ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక, దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు,అన్యోన్యదాంపత్యములకు కారకుడు,.






శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంధులు, సిరలు, ధమనులు, స్తనములు,స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భదారణ, ప్రసవములకు కారకుడు. కుజగ్రహ కారకత్వము: 










అతికోపం,కలహాలు,మూర్ఖత్వం,సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని,విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, ధీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు శారీకంగా ఉదరము,రక్తస్రావము,
గర్భస్రావము,ఋతుదోషములు మొ!! ఇహ స్త్రీ జీవితంలో వీరిద్దరు ఎంత పాత్రపోషిస్తారో పరిశీలిద్దాము. ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27, ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారంగావించి 28వ రోజునకుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం, అర్ధం ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనమవాలి. 









భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు, దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది, అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాతతరరం స్త్రీలలో ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం, కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్ లేనిదే జరగటం సర్వసాధారణమైపోయినది. ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలోనుండే ఎరుపు(కుజుడు)తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంటగ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను,దోషాలను తొలగిస్తాయనటం ఎటువంటి సందేహం వలదు. కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం,పగడం రెండూకూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభపలితాలు సమకూర్చగలవు. 








మరొక విషయమేమిటంటే శుక్రుడు వివాహకారకుడు మాత్రమే, కాని సంసారిక జీవితాన్ని నడిపేవాడు కుజుడేనన్న మాట మరువకూడదు, అందుకే తొలుతగా కుజదోషం ఉన్నదా లేదా అని చూస్తారు. స్త్రీలు నల్లపూసలతాడుకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడమనేది ప్రాచీనకాలం నుంచి వస్తోంది. నల్లపూసలు ఎంతో విశిష్టమైనవిగా ... పవిత్రమైనవిగా భావించడమనేది మన ఆచార వ్యవహారాలలో ఒక భాగమై పోయింది. ఇటీవల కాలంలో నల్లపూసలతాడును ప్రత్యేకంగా చేయించుకుని ధరించడం జరుగుతుందిగానీ, పూర్వం మంగళ సూత్రానికే నల్లపూసలను అమర్చేవారు. వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ 'నలుపు రంగు' ను పక్కన పెడుతూ వచ్చిన వారు, సరాసరి నల్లపూసలను మంగళ సూత్రానికి అమర్చడం పట్ల కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. అయితే నల్లపూసల ధారణ అనే మన ఆచారం వెనుక శాస్త్ర సంబంధమైన కారణం లేకపోలేదు. 







వివాహ సమయంలోనే వధువు అత్తింటివారు, ఓ కన్యతో మంగళ సూత్రానికి నల్లపూసలు చుట్టిస్తారు. ఆ మంగళ సూత్రానికి వధూ వరులచే 'నీలలోహిత గౌరి' కి పూజలు చేయిస్తారు. ఈ విధంగా చేయడం వలన నీలలోహిత గౌరీ అనుగ్రహంతో, వధువు యొక్క సౌభాగ్యం జీవితకాలంపాటు స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది. నీలలోహిత గౌరిని పూజించడం వలన ... ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించడం వలన వధూవరులకి సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం అంటోంది. అందువలన నల్లపూసలను ఓ ప్రత్యేక ఆభరణంగా భావించి ధరించకుండా, అవి మంగళ సూత్రంతో కూడి ఉండాలని స్పష్టం చేస్తోంది.









స్త్రీలు మెట్టెలు ఎందుకు ధరిస్తారో తెలుసా? 

మన దేశ సంస్కృతి లో చాలా సైన్స్ ఇన్ బిల్ట్ గా దాగుంది. మన ప్రతి సాంప్రదాయ పద్దతి వెనుక… శాస్త్రీయత మిళితమయ్యి ఉంటుంది. సాధారణంగా మన భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అయిన స్త్రీలుకాళ్లకు మెట్టలు ధరిస్తారు… ఇది కేవలం ఆమెకు పెళ్లి అయ్యిందని సూచించడమే కాదు. దానికి ఓ ప్రత్యేకత ఉంది.సాధారణంగా స్త్రీలు కాలి రెండవ వేలికి మెట్టెలు ధరిస్తారు. కాలి రెండవ వేలి నుండి ఓ ప్రత్యేక నరం గర్భాశయానికి సంధి చేయబడి గుండె వరకు వెళుతుంది. ఈ వేలికి మెట్టె పెట్టుకోవడం వల్ల గర్భాశయం ధృఢపడుతుంది. ఇది రక్తప్రసరణను నియంత్రించి రుతుచక్రం సక్రమంగా వచ్చి గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.వెండి మంచి ఉష్ణ వాహకం కావడం వల్ల..భూమి నుండి ధనావేశాలను గ్రహించి శరీరమునకు ప్రసరింపజేస్తుంది..అందుకే వెండితో చేసిన మెట్టలను మన భారతీయ స్త్రీలు కాలి రెండవ వేలుకు ధరిస్తారు. కేవలం మెట్టెల్లోనే కాదు.. 











నుదుటి పై ధరించే బొట్టుకు, శ్రీమంతం చేసేప్పుడు చేతికే తొడిగే గాజులకు… చాలా లాజిక్కులున్నాయ్. మన పెద్దోళ్లున్నారే ఏ పని చేసినా ఊరికే చేయారు. దానికి ఫర్ ఫెక్ట్ మీనింగ్ ఉంటది. కానీ మనం అర్థం చేసుకుంటేనే బోధపడుతుంది










01 March 2016

గృహ వాస్తు

కాలానుగుణ "వాస్తు" అంటే? 

జ్యోతిష్య శాస్త్రంలో సమానంగా ఎదుగుతున్న ప్రాచీన భారతీయ సంప్రదాయ శాస్త్రాలలో 'వాస్తు' ఓ విభాగం . కొన్ని సందర్భాల్లో ఇది జ్యోతిష్య శాస్త్రాన్ని సైతం అధిగమించి ఎదుగుతోందనడానికి నిదర్శనం, ఈ వాస్తు పట్ల దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణే అని చెప్పవచ్చు. అయితే కేవలం మార్కెట్లో పుస్తకాలు కొని చదివి వాస్తును తెలుసుకోవాలనుకుంటే మాత్రం గృహస్తు లేదా భవన నిర్మాణ నిర్మాతలు పప్పులో కాలేసినట్లే.
మారుతున్న కాలంతో పాటుగా భారతీయ వాస్తులో సైతం కొన్ని అధునాతనమైన మార్పులు ప్రయోగాత్మకంగా మార్చవలసి వస్తున్నా, వాటివల్ల జరిగే ప్రయోజనపు పాళ్ళు అధికంగా వుండటంతో, అటు ఆర్కిటెక్టులూ, ఇటు శాస్త్రీయ సిద్ధాంతులు సైతం వీటిని తమ నిర్మాణాల్లో అమలు పర్చేందుకు ముందుకు రావడం ఒక స్వాగతించవలసిన శుభపరిణామం.








సాధారణంగా వాస్తులో ప్రధానమైనది నిర్ధిష్టమైన కొలతలతో కూడిన “ఆయముల” నిర్ణయం. ఇంటిలోని ఏయేదిక్కుల్లో, యేయే ఆయములు వుంటే ఎలా కల్సివస్తుందో చెబుతుందీ పద్ధతి. దీనినే పాశ్చాత్యులు 'బాగ్‌వా' అంటారు. ఇళ్ళు లేదా భవంతిని నిర్మించబోయే భూమిని అష్టదిక్పాలకులు పాలిస్తుంటారు. ఒకొక్క దిక్కునూ ఒకొక్క దేవత శాసించి, నియంత్రిస్తుంటుంది. తూర్పును ఇంద్రుడు, పడమరను వరుణుడు, ఉత్తరానికి కుబేరుడు, దక్షిణానికి యముడు, ఈశాన్యమునకు ఈశానుడు, ఆగ్నేయానికి అగ్ని, వాయవ్యానికి వాయువు, నైరుతీదిశను నిరుతి అనే ఎనిమిదిమంది దిక్పాలకులు పాలిస్తుంటారు.


ఇంద్రుడికి ప్రతినిధి సూర్యుడు, వరుణుడికి శనీశ్వరుడు, కుబేరునికి బుధుడు, యమునికి కుజుడు, ఈశానునికి గురువు (బృహస్పతి), అగ్నికి శుక్రుడు, వాయువునకు కేతువు, నిరుతికి రాహువు ఉపప్రతినిధులు.
మనలో చాలామందికివాస్తు వేరు జ్యోతిష్యం వేరు అనే ఒక భిన్నాభిప్రాయముంది. అయితే సరియైన శాస్త్రం తెలిసిన వాస్తు లేదా జ్యోతిర్వేత్తలు నేటి ఈ వాస్తును జ్యోతిర్శాస్త్రంలోని ఒక విడదీయరాని అంతర్భాగంగా మాత్రమే పరిగణిస్తున్నారు. వాస్తవానికి ఇదే నిజం కూడానూ. ఉదాహరణకు, సైద్ధాంతిక వాస్తు నియమాలను అనుసరించి చూచితే యజమాని నిద్రించే మాష్టర్ బెడ్‌రూం (పడకగది) నైరుతిదిశలో కానీ వాయవ్యంలో కానీ వుండాలి. అదే విధంగా వంటగది (కిచెన్) అనేది ఆగ్నేయంలో వుండాలి. కానీ మీ జాతకంలో అగ్నిని ఉపప్రతినిధిగా చెబుతున్న శుక్రుడు ఈశాన్యరాశి అయిన మీనంలో వున్నాడనుకోండి అప్పుడు మీ పడకగది పై సిద్ధాంతానికి భిన్నంగా ఈశాన్యంలో నిర్మించుకుంటేనే బాగా కలిసివస్తుంది. 





జాతకచక్రంలోని 12 రాశుల్లో శుక్రుడు ఏ రాశిలో తన పూర్తి బలాన్ని కల్గివున్నాడో ఆ రాశి ప్రాతినిధ్యం లేదా ఆ రాశీనాథుడు ప్రాతినిధ్యం వహించే దిశగా కానీ, లేదా అటువంటి రాశీనాధుడున్న దిక్కునకానీ పడకగది వుంటే బ్రహ్మాండంగా కల్సివస్తుంది. 

దిక్కులూ - జాగ్రత్తలు -
 ప్రాముఖ్యతలు తూర్పులో బరువులు వుండకూడదు. అలా వుంటే సంతానం, ఐశ్వర్యాల వంటివి లభించవు. బావులు, బోర్లు ఈ దిశలో వుండరాదు. 

పడమర దిశలో ఎక్కువ స్థలాన్ని వదలరాదు. ఇది తూర్పు దిశకన్నా కొంచెం ఎత్తుగా వుండేట్టు చూసుకోవాలి.

 నైరుతీ, వాయవ్యాలకు తగలకుండా బావులు, బోర్లు కనుక నిర్మించుకుంటే సకల శుభాలు కలుగుతాయి.

ఉత్తర దిశ, దక్షిణ దిశ కంటే పల్లంగా వుండాలి. ఉత్తరం ఎంత పెరిగితే యజమానికి అంత ధనలాభం కలుగుతుంది. ఉత్తరం వల్ల సంతానం, విద్య, ఆదాయం, పలుకుబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. 

దక్షిణంలో జాగా ఎంత తగ్గితే అంత మంచిది. అలా లేకుంటే ఇంట్లో వాళ్ళకు ఎప్పుడూ రోగాలుంటాయి, తగ్గవు. వున్న ఆస్తులు అమ్ముకొని దివాళాతీస్తారు. 

ఈశాన్యం విశాలంగా, పల్లంగా వుండాలి. ఈ దిశలో నీరు వుండకుండా నైరుతీ, పడమర దిశలమీదుగా పారేనీరు ఈశాన్యం ద్వారా వెలుపలికి వెళ్ళడం వల్ల అద్భుతమైన ఫలితాలు కల్గుతాయి. కానీ సంప్రదాయవాదులు ఈ దిశలో బావికానీ, బోరు కానీ వెయ్యమనే చెబుతూ వస్తున్నారు. ఇది సరికాదు. 

ఆగ్నేయంను పల్లంగా వుంచకూడదు. గోతులూ, సంపులూ వుంచరాదు. అలా చేసినట్లయితే ఇంటిలోని స్త్రీలకు పలురకాల రోగాలతోపాటుగా లైంగిక, వివాహ సంబంధమైన అవరోధాలు ఏర్పడతాయి.
ఇక నైరుతి బాగా కురచగా వుండి ఎంత ఎత్తుగా వుంటే అంతమంచిది. ఈ దిశలో ఎంతగా బరువుంటే అంత లాభం కలుగుతుంది. నైరుతీలో గుంటలు, గోతులూ, బావులు, బోర్లు ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. అలా వుంటే మొండి రోగాలూ, ఆస్తులు అమ్ముకోవడం జరిగితీరుతుంది. 

వీటన్నింటినీ చదివిన తర్వాత మీకేమనిపిస్తోంది? సరే నేనే చెబుతాను. ఈ ఎనిమిది దిశలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పంచభూతాలను తలపింపజేస్తున్నాయి. అవి అగ్ని (ఫైర్), జలము (వాటర్), వాయువు (ఎయిర్), భూమి లేదా పృథ్వీ (ఎర్త్), ఆకాశము (స్కై). అయితే చైనీయుల వాస్తులో అగ్నికి బదులుగా దారువు (వుడ్ - చెక్క), ఆకాశానికి బదులుగా లోహము (మెటల్) అనేవి వుంటాయి. వాస్తు ఏ దేశానికి చెందినదైనా అందులోని మూల సూత్రాలు పంచభూతాలే. ఎందుకంటే మన (జీవుల) శరీరాలన్నీ కూడా ఈ పంచ భూతాలతోనే నిర్మించబడినవి కావడం వల్ల. చైనీయుల వాస్తులో వాయవ్యాన్ని... మెటల్ (లోహం), ఆగ్నేయదిశను.... దారువు, నైరుతిని.... భూమి (ఎర్త్), దక్షిణాన్ని... అగ్ని (ఫైర్), ఉత్తరాన్ని..... నీరు (వాటర్), ఈశాన్యాన్ని... ఎర్త్ (భూమి), తూర్పును... దారువు (వుడ్), పడమరను... లోహము (మెటల్) అనేవి ప్రభావితం చేస్తాయి.









ఏ గది ఎక్కడ, ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలి.

కాక్ - సి.వో.సి (coc) అంటే ఏమిటి? 

వాస్తులో "కాక్" పదానికి ఎంతో ప్రాముఖ్యత వుంది. ఇంటిలో ఎంతో కాలంగా ఉపయోగించని వస్తువుల్ని ఏరిపారేసి ఆయా దిక్కుల్లోని పంచభూతాలకు పరిశుభ్రమైన గాలిని అందించే ప్రక్రియనే క్లియరింగ్ ఆఫ్ క్లట్టర్ (సి.వో.సి - coc - కాక్) అంటారు.

 ఇంటి ఆవరణ, వంటగది, పడక గదులను తప్పనిసరిగా ఈ ప్రక్రియతో ఎప్పుడూ క్లీన్ చేస్తూనే వుండాలి. అంటే అష్టదిక్పాలురకు నిరంతరం పంచభూతాలతో అనుసంధానం వుండేట్లు చేస్తూనే వుండాలన్నమాట. 











తూర్పులోని చెత్త అంటే పనికిరాని సామానులుంటే అది మీ పరువు ప్రతిష్టలపైనా, వృత్తి మీదా, డబ్బు పైనా వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. పడమరలోని చెత్త దరిద్రాన్ని, నీటి కొరతను, శరీరంలో డీహైడ్రేషన్‌ను కల్గిస్తుంది. దక్షిణంలోని చెత్త వల్ల అనారోగ్యం, ఉత్తరంలోని చెత్తవల్ల అధిక ఖర్చులూ, నైరుతీలోని చెత్తవల్ల నిద్ర పట్టకపోవడం, వాయవ్యంలోని చెత్తవల్ల పిల్లలు చదువులో వెనుకబడిపోవడం, ఈశాన్యంలోని చెత్తవల్ల దైవ కృపకు దూరం అయ్యి శ్వాస సంబంధమైన వ్యాధులతో బాధ పడటం వంటివి సంభవిస్తాయి.




ఏ గది ఎక్కడ, ఏ వస్తువులు ఎక్కడ?
 సైద్ధాంతికపరంగా ఏ గది ఎక్కడ వుంటే మంచిది. ఏ గదిలో ఏయే వస్తువుల్ని వుంచుకోవచ్చు అనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే సిద్ధాంతం వేరు, దానిని జౌపయోగికంగా (ప్రాక్టికల్) ఉపయోగించడం వేరని మనం తెలుసుకోవాలి. 


పెన్సిలిన్ ఇంజక్షన్ మందులోని ఫార్ములా ఒకటే అయినా భిన్నరకాల వ్యాధులకు దానిని ఉపయోగించే తీరుమారినట్లుగా అన్నమాట.ఈ చిత్రం కేవలం సిద్ధాంతపరమైన గదుల అమరికలను, వాటిలో వుంచాల్సిన వస్తు సముదాయాల్ని మాత్రమే సూచిస్తుంది. ఇదే రీతిలో ఇళ్ళు కట్టిన వారందరికీ అభివృద్ధి వుంటుందన్న నియమం లేదు. 

ఆయా వ్యక్తుల జాతకాల్లోని గ్రహబలాన్ని అనుసరించి ఇంటి నిర్మాణంలోని గదుల హోదా, వుంచాల్సిన వస్తువుల జాబితాలో మార్పు చెందుతాయని గ్రహించాల్సివుంది. 

నాలుగు ప్రధాన దిక్కులైన తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనేవి మనిషి జీవితంలోని నాలుగు పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు పరోక్షమైన సూచికలు (ప్రతీకలు). తూర్పు ధర్మం, పడమర కామము, ఉత్తరం అర్థము (డబ్బు) ,దక్షిణం మోక్షము(మృత్యువు - పరలోక ప్రయాణాలు మొదలైనవి అని అర్థము). ఒక్కో దిక్కు, ఆ దిక్కును పాలించే దేవతలకు ఇష్టమైన రంగులూ, వస్తువులూ వుంటాయి.










29 February 2016

పిల్లలకు పేర్లు మరియు అన్నప్రాసన.

జ్యోతిష్య శాస్త్ర నియమం ప్రకారం చిన్న చిన్న పేర్లు మాత్రమే పెట్టాలి.

ఆడవాళ్ళకి తొమ్మిది, 

మగవాళ్ళకి ఎనిమిది అక్షరములు దాటకూడదు. 

యుగయుగాలు ఉన్న పేర్లలో చిన్నచిన్న పేర్లే తప్ప చాంతాడంత పేర్లు పెట్టమని ఎక్కడా చెప్పలేదు. పెద్ద పేర్లు పెట్టడం వలన ప్రమాదం కూడా.

ఎనిమిది అక్షరములు దాటకూడదు మగవారికి. అత్యంత ఆవశ్యకత వస్తే సూర్యుడికి నమస్కరించి మగవారికి 12 అక్షరములు దాటకుండా చూడమన్నారు.
ఆడపిల్లలకి 9 అక్షరములు దాటకూడదు. 
మరీ తీవ్రమైన మొక్కులు ఉంటే సూర్యుడికి మ్రొక్కి ఇంకొక్క రెండు అక్షరములు మాత్రమే జతచేసి పదకొండు అక్షరములు మాత్రమే పెట్టాలి. వీటికి మించి దాటితే ప్రమాదం.

బృహస్పతి, శుక్రాచార్యుల వంటి వారు పేర్లు విషయంలో బాగా నియమాలు పెట్టారు.











అన్నప్రాసన
మగపిల్లలకు 6,8,10,12 నెలలలోను,

ఆడపిల్లలకు 5,7,9,11 నెలలోను
అన్న ప్రాసనము చేయాలి.

లగ్న శుద్ధి, దశమ శుద్ది వృషభ, మిధు, కటక, కన్య, ధనుస్సు, మీనరాసుల లగ్నములలో చేయవలెను.

అశ్విని, రోహిణి, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి, అనురాధా, శ్రవణం, ధనిష్ఠ, శతబిశం రేవతి, ఉత్తరాభాద్ర మొదలగు నక్షత్రాలు మంచివి.

ముందుగా గణపతి పూజ చేసి తరువాత పరమేశ్వరుని, విష్ణుమూర్తిని సూర్య చంద్రులను అశ్తదిక్పలకులొఅను భూదేవిని పూజించవలెను.

బిడ్డ తల్లిదండ్రులు తూర్పు ముఖముగా చాప పై కుర్చున్దవలెను. శిశువును తల్లి ఒడిలో కూర్చోబెట్టు కావలెను. బంగారము, వెండి, కంచు మొదలగు ఏ పాత్రలలోనైనా పాలతో వండిన పాయసమును ఆ పాత్రలో వుంచి, పెరుగు, తేనే ఆ పాయసంలో కలుపవలెను.

తండ్రి కుడిచేతితో బంగారం ఉంగరం పట్ట్టుకుని దానితో ఆ పాత్రలతో పాయసమును శిశువునకు తినిపించవలెను ఈ విధంగా మూడుసార్లు తినిపించిన తరువాత నాల్గోసారి చేతితో తినిపించవలెను.

ఆ తరువాత తల్లి, మిగతా పెద్దలు అదే విధంగా చెయాలి. అన్నప్రాసన కార్యక్రమము ఈ విధంగా పూర్తి చేయాలి.










27 February 2016

శ్రీ సూక్తము

శ్రీ సూక్త విధానము పూజ గణేశాయ నమః శ్రీ లలితా పరమేశ్వర్యై నమః ఆచమ్యః దీపారాధనం కుర్యాత్ : ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషీ కేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్దాయ నమః పురుషోత్తమాయ నమః అదోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్ధనాయ నమః ఉపేన్ద్రాయ నమః హరయే నమః శ్రీ కృష్ణాయ నమః శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ప్రాణాయామము : ఓం భూ : ఓం భువః ఓగ్ o సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ o సత్యం ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ . ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువ స్సువరోమ్ (ఎవంత్రి :) సంకల్పము : మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ ప్రవర్త మానస్య అధ్య బ్రహ్మణః ద్వితీయ పరార్దే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరో ర్దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య ......ప్రదేశే కృష్ణా గోదావర్యో ర్మధ్య దేశే శోభన గృహే- సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానస్య వ్యావ హారిక చాంద్ర మానేన ......సంవత్సరే ....ఆయనే ఋతౌ...... మాశే ...... పక్షే ......తిదౌ .......వాసరే ......శుభ నక్షత్రే శుభ యోగే శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిదౌ శ్రీ మాన్ ........గోత్రః ..... నామధేయః శ్రీ మతః గోత్రోద్భవస్య......నామ దేయస్య ధర్మ పత్నీ సమేతస్య ఆయుష్యాభి వృధ్యర్ధం..... దేవతా ముద్దిశ్య ..... దేవతా ప్రీత్యర్ధం సంభవద్భి: ద్రవ్యై : సంభవదిభ పదార్ధై : సంభవితాని యమేన యావశ్చక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే . తదంగ కలశారాధనం కరిష్యే ,కలశే గంధ పుష్పాక్షతై రభ్యర్చ్య శ్లో || కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్ర స్సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతాః కుక్షౌతు సాగరా స్సర్వే సప్త ద్వీపా వసుంధరా ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః మం || అకల శేషు .........వస్సువరాప ఓం శ్లో || గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు ,ఆయాంతు ......దేవ పూజార్ధం మమ దురితక్షయ కారకాః కలశో దకేన పూజా ద్రవ్యాణి, దేవీం ఆత్మానంద సంప్రోక్ష్య ప్రాణ ప్రతిష్ట : రక్తాం బోధి స్థపోతోల్ల సదరుణ సరోజాధి రూడా కరాబ్జై : పాశాంకో దండ మిక్షూద్భవమణి గణమప్యంజ్కుశం పంచ బాణాన్ బిభ్రాణా సృక్క పాలంత్రి నయన విలసత్పీన వక్షోరు మాడ్యా దేవీ బాలార్క వర్ణా భవతు సుఖ కరీ ప్రాణ శక్తి : పరానః అస్య దేవతా త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణ వాక్పాణి పాద పాయూప స్తాదీని సర్వేంద్రి యాణి ఇహైవా గత్య, అస్మిన్ బింబే , కలశే ,యంత్రే సుఖం చరం తిష్టంతు స్వాహా || ......దేవతా స్థిరాభవ, వరదా భవ సుముఖీ భవ , సుప్రసన్నా భవ .స్థిరాసనం కురు. 1 ధ్యానము : సకుంకుమ విలేపనా మళిక మంబిక స్తూరికాం సమంద హాసితే క్షణాం సశర చాప పాశాంకుశాం అశేష జన మోహినీ o అరుణ మాల్య భూషాంబరాం జపాకుసుమ భాసురాం జప విధౌ స్మరేదమ్భికామ్. శ్లో || కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్ర స్సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతాః కుక్షౌతు సాగరా స్సర్వే సప్త ద్వీపా వసుంధరా ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః మం || అకల శేషు .........వస్సువరాప ఓం శ్లో || గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు ,ఆయాంతు ......దేవ పూజార్ధం మమ దురితక్షయ కారకాః కలశో దకేన పూజా ద్రవ్యాణి, దేవీం ఆత్మానంద సంప్రోక్ష్య ప్రాణ ప్రతిష్ట : రక్తాం బోధి స్థపోతోల్ల సదరుణ సరోజాధి రూడా కరాబ్జై : పాశాంకో దండ మిక్షూద్భవమణి గణమప్యంజ్కుశం పంచ బాణాన్ బిభ్రాణా సృక్క పాలంత్రి నయన విలసత్పీన వక్షోరు మాడ్యా దేవీ బాలార్క వర్ణా భవతు సుఖ కరీ ప్రాణ శక్తి : పరానః అస్య దేవతా త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణ వాక్పాణి పాద పాయూప స్తాదీని సర్వేంద్రి యాణి ఇహైవా గత్య, అస్మిన్ బింబే , కలశే ,యంత్రే సుఖం చరం తిష్టంతు స్వాహా || ......దేవతా స్థిరాభవ, వరదా భవ సుముఖీ భవ , సుప్రసన్నా భవ .స్థిరాసనం కురు. 1 ధ్యానము : సకుంకుమ విలేపనా మళిక మంబిక స్తూరికాం సమంద హాసితే క్షణాం సశర చాప పాశాంకుశాం అశేష జన మోహినీ o అరుణ మాల్య భూషాంబరాం జపాకుసుమ భాసురాం జప విధౌ స్మరేదమ్భికామ్. ధ్యాయామి : (దేవతాయై నమః అనే చోట ఈ పూజా విధాన మందు యే దేవత పూజ చేయుచున్నామో ఆ దేవత పేరు చెప్పుకొనవలెను) 2 . ఆవాహనము ఆసనము : మం : హిరణ్య వర్ణాం .......జాతవేదో మామా వహ|| కల్లో లోల్ల సితా మృతాబ్ది లహరీ మధ్యే విరాజన్మణి ద్వీవే కల్పక వాటికా పరివృతే కాదమ్భ వాట్యు జ్వలె రత్న స్తమ్బ సహస్ర నిర్మిత సభా మధ్యే విమానోత్తమే చింతా రత్న వినిర్మితం జననితే సింహాసనం భావయే || ........దేవ్యై నమః ఆవాహనం సమర్పయామి . మం || తామ్మ అవహ .............పురుషాన హమ్|| ఏణాం కానల భాను మండల లసచ్చ్రీ చక్ర మధ్యే స్థితాం బాలార్క ద్యుతి భాసురాం కరతలై : పాశాంకు శౌభి భ్రతీం చాపం, బాణ పిప్రసన్న వదనాం కౌసుంభ వర్ణాం శుకాం తాంత్వాం చన్ద్ర కళావతం సమ కుటాం చారు స్మితాం భావయే నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి . 3 .పాద్యం : మం || అశ్వ పూర్వాం........... శ్రీర్మా దేవీ జుషతామ్ లక్ష్మీ జ్ఞాన సుధార సార్ణవ జలే ణా పూర్వ పాత్రార్ఘ్య కం లక్తా లంకృత పాద పంకజ యుగం సంక్షాళ్య భక్త్యా పునః లక్ష్మీ రంజిత హేమ ధామ కలశే నా పూర్వ సీతాంబునా పాద్యం కుంకుమ గంధ కల్పిత మహం గృహ్ణాతు తే శాంభవీ పాదయోం పాద్యం సమర్పయామి. 4 అర్ఘ్యం : మం || కాం సోస్మితాం ......... పహ్వాకయే శ్రియమ్ || హ్రీం కారోధ్య సువర్ణ కల్పిత కళా లంకార సింహాసనే | హ్రీం కారంత సరస్వతీచ యమునా గంగాజలై రావృతం| హ్రీం కారాది సమస్త శుద్ధ కలశై స్సం స్తూయ మానం ముదా || హ్రీం కరేర్ఘ్య జలం సమర్పిత మహం గృహ్ణాతు తే శాంభవీ|| ........దేవతాయై నమః హస్తయో : అర్ఘ్యం సమర్పయామి . 5 ఆచమనము మం || చంద్రాం ప్రభాసాం ........తాం త్వాం వృణే || ఈశానాది శివైక దివ్య ఫలకం రత్నా సనంతే శుభం పాద్యం కుంకుమ చందనాది భరితం చార్గ్యం సరత్నాక్షత తై : శుద్ద్యై రాచమనీయకం తవ జలైర్భ క్తా మయాకల్పితం కారుణ్యా మృత వారిణే తద ఖిలం త్వత్ప్రీత యే కల్ప్యతాం ..........దేవతాయై నమః ముఖే శుద్దాచమనీయం సమర్పయామి 6 స్నానము . మం || ఆదిత్య వర్ణే.............యాశ్చ బాహ్య అలక్ష్మీ : లక్ష్యే యోగి జనస్య రక్షిత జగజ్జాలే విశాలాక్షణే ప్రాలేయాంబు పటీర కుంకుమ లసత్కర్పూర మిశ్రోదకై : గో క్షీరై రపినారి కేళ సలిలై : శుద్దోద కై ర్మంత్రితై: స్నానం దేవిది యామయై తద ఖిలం త్వత్ప్రీతయే కల్ప్యతాం ........దేవతాయ నమః స్నానం సమర్పయామి . స్నానానంతరం ఆచమనం సమర్పయామి. 8 వస్త్రము మం || ఉవై తుమాం ....... దదాతుమే హ్రీంకా రాంకిత మంత్ర లక్ష్మీ తతనో హేమాంచ లై రంచితం రత్నై రుజ్వల ముత్తరీయ సహితం కౌసుంభ వర్ణాంబరం ముక్తా సంతతి యజ్ఞ సూత్ర మమలం సౌవర్ణ తం తూద్భవం దత్తం దే విదియామయై తద ఖిలం త్వత్ప్రీతయే కల్ప్యతాం .....దేవతాయై నమః వస్త్ర యుగ్మం యజ్ఞోపవీతం కంచుకీ వస్తంచ సమర్పయామి . 9 ఆభరణము మం || క్షుత్పి పాసా మలాం .......గృహాత్ . హంసైర ప్యతి లోభ నీయ గమనే హారావళీ ముజ్వలాం హిందూళ ద్యుతి హీర పూరిత తరే హేమాంగదే కంకణే | మంజీరౌ మణి కుండలే మకుట మప్య ర్దేందు చూడామణిం నాసామౌక్తిక మంగుళీయ కటకే కాంచీ మపిశ్వీ కురే ......దేవతాయై నమః సర్వాభరణాని సమర్పయామి . 10 గంధము మం || గంధ ద్వారాం ......తామిహొ పహ్వాయే శ్రియః || సర్వాంగే ఘన సార కుంకుమ లసచ్చ్రీ గంధ పంకాంకితం కస్తూరీ తిలకంచ ఫాల ఫలకే గోరోచనా పత్రకే || గండా దర్శన మండలే నయన యోర్ది వ్యాంజ నంతే ర్పితం కంటాజ్జే మృగనాభి పంక మమలం త్వత్ప్రీతయే కల్ప్యతాం .......దేవతాయై నమః చందనం సమర్పయామి . హరిద్రంచ మయానీతం దేవి కళ్యాణ దాయిని సౌభాగ్య వర్ధనం దివ్యం గృహాణ హరి వల్లభే || హరిద్రం కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళ ప్రదం మయానీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరీ . కుంకుమ చూర్ణం సౌభాగ్య పరిమళ ద్రవ్యాణి సమర్పయామి . రాత్నాక్ష తైస్త్వాం పరి పూజయామి ముక్తా ఫలైర్వా రుచిర ప్రవాళై: | అఖండి తైర్దేవి మవాది భిర్వా కాశ్మీర పంకాంకిత తండు లైర్వా | అక్షతాం సమర్పయామి . 11 పుష్పము మం || మనసః కామమా ........ శ్రీ శ్శ్ర యతాం యశః కల్హారోత్పల మల్లికా మరువకై : సౌవర్ణ పంకేరుహై | జాజీ చంపక మాలతీవ కుళ కై : మందార కుందాది భి : కేతక్యాకర వీరకై : బహువిధై పుష్పై స్స్రజః కల్పతా సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే కల్ప్యతాం ......దేవతాయై నమః పుష్ప మాలికాః సమర్పయామి. అధాంగ పూజ : లలితాయై నమః పాదౌ పూజయామి గిరిజాయైన 15 తాంబూలము మం || ఆర్ద్రాంయః..............లక్ష్మీం జాతవేదో మమావహ| స్వచ్చా యైర్వ రకేతకీ దళ రుచా తాంబూల వల్లీ దళై : పూగై ర్భూరి గుణై స్సుగంధి మదురై : కర్పూర ఖండో జ్జ్వలై : ముక్తా చూర్ణ విరాజితై ర్బహు విధై ర్వక్త్రాం బుజా మోదకై : పూర్ణా రత్న కళా చికా తవ ముదేన్యస్తా పురస్తాదుమే|| .......దేవతాయ నమః తాంబూలం సమర్పయామి . 16 నీరాజనం మం || తాంమ ఆవాహ ......శ్వాన్విన్దే యం పురుషా నహమ్. కన్యాభి : కమనీయ కాంతిభి రలంస్వ శ్రీభి రారార్తికం పాత్రై ర్మౌక్తిక చిత్ర పంక్తి విలసత్కర్పూర దీపాళిభి : తత్తత్తాళ మృదంగ గీత సహితం నృత్య త్పదాంభో రుహం మంత్రా రాధ పూర్వకం సువివాహితం నీరాజనం గృహ్యాతామ్ మం || హిరణ్య పాత్రం ......దదాతి ...............దేవతాయై నమః కర్పూర నీరాజనం దర్శయామి . మన్త్ర పుష్పం లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం | శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వన్దే ముకుంద ప్రియాం | శిద్ద లక్ష్మీ ర్మోక్ష లక్ష్మీ ర్జయ లక్ష్మీ సరస్వతీ శ్రీ లక్ష్మీ ర్వరలక్ష్మీ శ్చ ప్రసన్నా మమసర్వదా | పరాంకుశౌ పాశ మభీ తిముద్రాం కరైర్వ హన్తీం కమలాసనస్తాం బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం భజే హమాంబాం జగదీశ్వరీం తాం ,సర్వ మంగళ మాంగళ్యే, శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే . .......దేవ్యై నమః మన్త్ర పుష్పం సమర్పయామి . ప్రదక్షిణ నమస్కారము యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణ స్యంతి ప్రదక్షిణ పదే పదే ,పాపోహం పాప కర్మాహం పాపా త్మా పాప సంభవః త్రాహిమాం కృపయా దేవీ శరణాగత వత్సలే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి హ్రీంకార త్రయ సంపుటే న మనునో పాస్యేత్ర యీ మౌళిభి ర్వాక్యై రక్ష్యత నోత వస్తుతి విధౌ కో వాక్ష మేతాంబికే సల్లాపాస్తూ తయః ప్రదక్షిణ శతం సంచార ఏవాస్తుతే సంవేశో మనసా సహస్ర మఖిలం సంతుష్టయే కల్ప్యతాం ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. లక్ష్మీ ర్మౌక్తి కలక్ష కల్పిత సితచ్చ త్రంచ దత్తే సదా | ఇంద్రాణీ చరతిశ్చ చామర వరౌ దత్తే స్వయం భారతీ | వీణా మేణవి లోక నాస్సుమనసా నృత్యంతి సంరాగవ | ద్భా వైరాంగిక సాత్వికై స్పుటర సం మాత స్త్వ యాకర్ణ్యతాం చత్ర చామరాది సర్వోపచారాన్ సమర్పయామి . యస్యా స్మృత్యాచ నామోక్త్యాత పః పూజా క్రియాది షు న్యూనం సంపూర్ణ |తాం యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హరిప్రియే | యత్పూజితం మాయాదేవి పరిపూర్ణం తదస్తుతే ధారా దత్తం అనయా ధ్యానా వాహనాది షోడశోప చార పూజయాచ భగవతీ సర్వాత్మకీ సర్వం ....దేవతా స్సుప్రీతా స్సుప్రసన్నా వరదా భవతు | శ్రీరస్తు శ్రీ బాలా త్రిపుర సుందర్యై నమః శ్రీ లలితాష్టోత్తర శత నామావళి : ఓం -ఐం- హ్రీం -శ్రీం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమః హిమాచల మహావంశ పావనాయై నమో నమః శంక రార్ధాంగ సౌందర్య శరీరాయై నమో నమః లసన్మర కత స్వచ్చ విగ్రహాయై నమో నమః మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమో నమః శశాంక శేఖర ప్రాణ వల్లభాయై నమోనమః సదా పంచ దశాత్మైక్య స్వరూపాయై నమోనమః వజ్ర మాణిక్య కటక కిరీటాయై నమోనమః కస్తూరీ తిలకోల్లాసినిటలాయై నమోనమః భస్మ రేఖాంకి తల సన్మస్త కాయ నమో నమః విక చాంబో రుహ దళ లోచనాయై నమోనమః శరచ్చాం పేయ పుష్పాభ నాసికాయై నమో నమః లసత్కాంచ న తాటంక యుగాళాయై నమోనమః మణి దర్పణ సంకాశ కపోలాయై నమోనమః తాంబూల పూరిత న్మేర వదనాయై నమోనమః సుపక్వ దాడి మీబీజ రదనాయై నమోనమః కంబు పూగ సమచ్చాయ కంధ రాయై నమోనమః స్థూల ముక్తా ఫలో దారా సుహారాయై నమోనమః గిరీశ బద్ద మాంగల్య మంగళాయై నమోనమః పద్మ పాశాంకుశ లసత్క రాబ్జాయై నమో నమః 20 పద్మకై రామందా సర సుమాలిన్యై యై నమో నమః సువర్ణ కుంభ యుగ్మాభ సుకుచాయై నమో నమః రమణీయచ తుర్భాహు సంయుక్తాయై నమో నమః కనకాంగద కేయూర భూషితాయై నమో నమః బృహత్సౌ వర్ణ సౌందర్య పసనాయై నమో నమః బృహన్ని తంబ విలసత్ జఘనాయై నమో నమః సౌభాగ్య జాత శృంగార మధ్య మాయై నమో నమః దివ్య భూషణ సందో హరంజితాయై నమో నమః పారిజాత గుణాదిక్య పదాబ్జాయై నమో నమః సుపద మరాగ సంకాశ చరణాయై నమో నమః 30 కామ కోటి మహా పద్మపీట స్థాయై నమో నమః శ్రీ కంట నేత్ర కుముద చంద్రికాయై నమో నమః సచామర రమావాణి వీజితాయై నమో నమః భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమో నమః భూతేశా లింగ నోద్భూత పులకాంగ్యైయై నమో నమః అనంగజన కాపాంగ వీక్ష ణాయై నమో నమః బ్రహ్మొపేంద్ర శిరో రత్న రంజితాయై నమో నమః శచీ ముఖ్యా మర వధూ శేవితాయై నమో నమః లీలా కల్పిత బ్రహ్మాండ మండలాయై నమో నమః అమృతాది మహాశక్తి సంవృతయై నమో నమః 40 ఏకాత పత్ర సామ్రాజ్య దాయికాయై నమో నమః సనకాది సమారాధ్య పాదుకాయై నమో నమః దేవర్శిభి : స్తూయ మాన వైభవాయై నమో నమః కలశోద్భవ దుర్వాస పూజితాయై నమో నమః మత్తేభ వక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమో నమః చక్ర రాజ మహా యంత్ర మధ్య వర్యై నమో నమః చిదగ్ని కుండ సంభూత సుదేహయై నమో నమః శశాంక ఖండ సంయుక్త మకుటాయై నమో నమః వందారు జన సందోహ వందితాయై నమో నమః 50 అంతర్ముఖ జనానంద ఫల దాయై నమో నమః పతి వ్రతాంగ నాభీష్ట ఫలదాయై నమో నమః అవ్యాజ కరుణా పూర పూరితాయై నమో నమః నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమో నమః సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమో నమః రత్న చింతామణి గృహ మధ్య స్థాయై నమో నమః హాని వృద్ది గుణాధిక్యర హితాయై నమో నమః మహా పద్మాట వీ మధ్య నివాసాయై నమో నమః జాగ్రత్స్వప్న సుషుప్తినాం సాక్షి భూత్యై యై నమో నమః మహా తాపౌఘ పాపానాం వినాశిన్యై యై నమో నమః 60 దుష్ట భీతి మహా భీతి భంజనాయై నమో నమః సమస్త దేవ దనుజ ప్రేరకాయై నమో నమః సమస్త హృదయాంభోజ నిలయాయై నమో నమః అనాహత మహా పద్మ మందిరాయై నమో నమః సహస్రార సరోజాత వాసితాయై నమో నమః పునరావృత్తి రహిత పురస్థాయై నమో నమః వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమో నమః రమా భూమి సుతా రాధ్య పదాబ్జాయై నమో నమః లోపా ముద్రార్చిత శ్రీ మచ్చరణాయై నమో నమః సహస్ర రతి సౌందర్య శరీరాయై నమో నమః భావనా మాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ద దాయై నమో నమః శ్రీ లోచన కృతో ల్లాస ఫలదాయై నమో నమః శ్రీ సుదాబ్ది మణి ద్వీప మధ్య గాయై నమో నమః దక్షా ద్వర వినిర్భేద సాధనాయై నమో నమః శ్రీనాధ సోదరీ భూత శోభితాయై నమో నమః చంద్ర శేఖర భక్తార్తి భంజనాయై నమో నమః సర్వోపాది వినిర్ముక్త చైతన్యాయై నమో నమః నామ పారాయణా భీష్ట ఫలదాయై నమో నమః సృష్టి స్థితి తిరోదాన సంకల్పాయై నమో నమః 80 శ్రీ షోడ శాక్షరీ మంత్ర మధ్య గాయై నమో నమః అనాద్యంత స్వయంభూత దివ్య మూర్త్యైయై నమో నమః భక్త హంస పరీ ముఖ్య వియోగాయై నమో నమః మాతృ మండల సంయుక్త లలితాయై నమో నమః భండ దైత్య మహా సత్వ నాశనాయై నమో నమః క్రూర భండ శిరచ్చేద నిపుణాయై నమో నమః ధాత్ర్య చ్యుత సురాదీశ సుఖదాయై నమో నమః చండ ముండ నిశుం భాది ఖండ నాయై నమో నమః రక్తాక్ష రక్త జిహ్వాది శిక్షణాయై నమో నమః మహిషాసుర దోర్వీర్య నిగ్రహాయై నమో నమః 90 అభ్ర కేశ మహోత్సా హకార ణాయై నమో నమః మహేశ యుక్త నటన తత్ప రాయై నమో నమః నిజ భర్త్రు ముఖాంబోజ చింతనాయై నమో నమః వృషభ ధ్వజ విజ్ఞాన భావనాయై నమో నమః జన్మ మృత్యు జరా రోగ భంజ నాయై నమో నమః విదేయ ముక్త విజ్ఞాన సిద్దిదాయై నమో నమః కామ క్రోదాది షడ్వర్గ నాశనాయై నమో నమః రాజ రాజార్చిత పద సరోజాయై నమో నమః సర్వ వేదాంత సంసిద్ద సుతత్వాయై నమో నమః శ్రీ వీర భక్త విజ్ఞాన నిధానాయై నమో నమః 100 అశేష దుష్ట దనుజ సూదనాయై నమో నమః సాక్షా చ్చ్రీ దక్షిణా మూర్తి మనోజ్ఞాయై నమో నమః హయ మేదాగ్ర సంపూజ్య మహిమాయై నమో నమః దక్ష ప్రజాపతి సుత వేషాడ్యాయై నమో నమః సుమభాణే క్షుకో దండ మండితాయై నమో నమః నిత్య యౌవన మాంగల్య మంగళాయై నమో నమః మహాదేవ సమాయుక్త శరీరాయై నమో నమః మహా దేవర తౌత్సుక్య మహాదేవ్యై నమో నమః 108 శ్రీ తులసీ పూజా ఆచమ్యః సంకల్ప్య . శ్రీ తులసీ పూజాం కరిష్యే || కలశ పూజాం కరిష్యే || గణపతయే నమః తులస్య మృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియా| కేశవార్చన యోగ్యామే వరదాభవ సర్వదా || శ్రీ తులస్యై నమః ధ్యాయామి | కృష్ణా నందాశ్రు సంభూతే వరదే తులసీ న్వయం| త్వా మద్యావా హయా మ్యార్ధ్యే కమలాపతి వల్లభే || శ్రీ తులస్యై నమః ఆవాహయామి . అనేక హార సంయుక్తం సువర్ణ మణి సంయుతం | రత్న సింహాసనం దివ్యం త్వమేహం ప్రతి గృహ్యాతాం || శ్రీ తులస్యై నమః సింహాసనం సమర్పయామి . పద్మనాభ ప్రియే దేవి పాద్యమేత్వం మయార్పితం | సం గృహాణ శుభే స్యామే వరదే లోక పావని || శ్రీ తులస్యై నమః పాదయో : పాద్యం సమర్పయామి. క్షీరో దధి సముత్పన్నే దేవాసుర సుపూజితే విష్ణు ప్రియే మయాదత్తం | గృహాణార్ఘ్యం నమోస్తుతే శ్రీ తులస్యై నమః అర్ఘ్యం సమర్పయామి హేలాల వంగ కర్పూర చందనార్యై స్సువాసితం | పానీయం తుమయా నీతం సమ్యగా చమనీయతాం || శ్రీ తులస్యై నమః ఆచమనీయం ...సమర్పయామి . క్షీరాజ్యే క్షురసై : పుణ్యైర్ద ద్నాచ మధూ నాతదా| పంచామ్రుతై : స్నాపయిష్యే తులస్యైతే నమోనమః శ్రీ తులస్యై నమం పంచామృత స్నానం సమర్పయామి సుశీతలం సుప్రసన్నం సర్వౌషది సమన్వితం | మయార్పితం జాలం దేవీ స్నానం కురు హరిప్రియే || శ్రీ తులస్యై నమః స్నానం సమర్పయామి . పీత వస్త్ర యుగం దేవి సర్వాభీష్ట ప్రదాయిని | సర్వ లక్షణ సంపన్నే శుభతే ప్రద దామ్యహం || వస్త్ర యుగ్మం సమర్పయామి . కంచుకం కాంచనం దివ్యం బ్రహ్మణా నిర్శితం పురా | అహం దాస్యా మిదేవేశి విష్ణు పత్నీ నమోస్తుతే || శ్రీ తులస్యై నమః కంచుకీ వస్త్రం యజ్ఞోపవీతం సమర్పయామి . స్వచ్చం నిర్మల మత్యర్ధం పురతస్తీ కృతం శుభం | కంట సూత్రం గృహాణత్వం దదామ్యాభ రణానిచ || శ్రీ తులస్యై నమః ఆభరణాని సమర్పయామి . చంద నాగరు కర్పూర మృగనాభి సమన్వితం గంధం స్వీకురు దేవేశి దేవ దేవాం క భూషణి|| శ్రీ తులస్యై నమః గంధం సమర్పయామి . శాలీం శ్చంద్ర వర్ణంశ్చ హరిద్రామి శ్రితా శుభాన్ | అక్షతాన్ సమర్పయే తుభ్యం గృహాణ శ్రీ హరి ప్రియే || శ్రీ తులస్యై నమః హరి ద్రాక్షతాన్ సమర్పయామి. మయాదత్త మిధం పుష్పం తులసీ దళ సంయుతం | మాల్యం గృహాణ దేవేశి వరదే విష్ణు వల్లభే || శ్రీ తులస్యై నమః పుష్పై పూజయామి || పుష్ప మాలికా సమర్పయామి .అధాంగ పూజా || విష్ణు ప్రియాయై నమః పాదౌ పూజయామి రంభోర్యై నమః ఊరూ పూజయామి క్షీరాబ్ది తనయాయై నమః కటిం పూజయామి సకల సుర పూజ్యాయై నమః నాభిం పూజయామి ఇందిరాయై నమః ఉదరం పూజయామి బృందావన వాసిన్యై నమః వక్షం పూజయామి మహాలక్ష్మ్యై నమః స్తనౌ పూజయామి సుభుజాయై నమః భుజౌ పూజయామి పద్మ హస్తాయై నమః హస్తౌ పూజయామి సుముఖ్యై నమః ముఖం పూజయామి రమాయై నమః లలాటం పూజయామి ఇందు సోదర్యై నమః శిరః పూజయామి శ్రీ తులస్యై నమః సర్వాంగాణి పూజయామి . చంద నాగరు కర్పూరా ఘ్యత గుగ్గుల సంయుతం | గృహాణ ధూపం తులసి వందే హం భక్త వత్సలే || శ్రీ తులస్యై నమః ధూప మాఘ్రాప యామి || ఘ్రుతవర్తి సదీప్తంతే మయార్తి పమిదం శుభే | గృహాణ మంగళం దీపం సర్వైశ్వర్య ప్రదాయిని || క్షీరంచ గుడ సంయుక్తం సర్పి షాయుత మాదరాత్ | మయా నివేదితం భుంక్ష్య పంచ భక్ష్య సమన్వితం | శ్రీ తులస్యై నమః నైవేద్యం సమర్పయామి . పూగీ ఫలెస్సకర్పూరై ర్నాగ వల్లీ దళైర్యుతం ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం(తాంబూలం ) పద్మనాభ ప్రియే నిత్య పద్మ సంభవ పూజితే పద్మ పత్ర విశాలాక్షి వరదా భవయే సదా | శ్రీ తులస్యై నమః నీరాజనం దర్శయామి . సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే | శ్రీ తులస్యై నమః మంత్ర పుష్పం సమర్పయామి . నమస్కరోమి దేవిత్వం విష్ణు వక్షస్తలే స్తితం ప్రణతార్తి హరే నిత్యం వరంతు ఫలదాభవ | (శ్రీ ....నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ) అనయా ధ్యానా వాహనాది షోడశోపచార పూజయాచ శ్రీ తులసీ దేవతా స్సుప్రీత స్సుప్రసన్నా వరదా భవన్తు. లక్ష్మీ అష్టోత్తరము వందే పద్మ కరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం| భాగ్యదాం హస్తాభ్యాం మభయ ప్రదాం మణి గణై ర్నానా విధై ర్భూషితాం|| భక్తా భీష్ట ఫల ప్రదాం హరి హర బ్రహ్మాదిభి : సేవితాం | పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధి భిర్యుక్తాం సదా శక్తిభి :|| సరసి జనయనే సరోజ హస్తే దవళ తరాంశుక గంధ మాల్య శోభే | భగవతి హరి వల్లభే మనోజ్ఞే త్రిభువన భూత కరీ ప్రసీద మహ్యం ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వ భూత హిత ప్రదామ్| శ్రద్దాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం || వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వదాం సుధాం | ధన్యాం హిరణ్య యీం లక్ష్మీం నిత్య పుష్టాం విభావరీమ్ || అదితించ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం| నమామి కమలాం కాంతాం కామాక్షీం క్రోధ సంభవామ్ || అనుగ్రహ పదాం బుద్దిం అనఘాం హరి వల్లభామ్ || అశోకామ మృతాం దీప్తాం లోక శోక వినాశినీం నమామి ధర్మ నిలయాం కరుణాం లోక మాతరం | పద్మ ప్రియాం పద్మ హస్తాం పద్మాక్షీం పద్మ సుందరీం || పదోద్భావాం పద్మ ముఖీం పద్మ నాభ ప్రియామ్ రమామ్ | పద్మ మాలాధరాం దేవీం పద్మినీం పద్మ గంధినీమ్ || పుణ్య గంధామ్ సుప్రసన్నాం ప్రసాదాభి ముఖీం ప్రభామ్ || నమామి చంద్ర వదనాం చంద్రాం చంద్ర సహోదరీం || చతుర్భుజాం చంద్ర రూపా మింది రామిందు శీతలామ్ | ఆహ్లాద జననీం పుష్టీం శివాం శివ కరీం సతీమ్ || విమలాం విశ్వ జననీం తుష్టిం దారిద్ర్య నాశినీమ్ | ప్రీతి పుష్కర ణీం శాంతాం శుక్ల మాల్యాంబరాం శ్రియమ్ | భాస్కరీం బిల్వ నిలయాం వరారోహం యశ స్వినీమ్ | వం సుధరా ముదారాంగాం హరిణీం హేమ మాలినీమ్ || ధన ధాన్య కరీం సిద్ధిం స్రైణ సౌమ్యాం శుభ ప్రదామ్ | నృప వేశ్మ గతానందాం వరలక్ష్మీ వసుప్రదామ్ | శుభాం హిరణ్య ప్రాకారం సముద్ర తనయాం జయామ్ నమామి మంగళాం దేవీం విష్ణు వక్ష స్థల స్థితాం విష్ణు పత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితామ్ దారిద్ర్యం ద్వంసినీం దేవీం సర్వోప ద్రవ వారిణీమ్ || నవ దుర్గాం మహా కాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికామ్ | త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువ నేశ్వరీమ్ || లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీ రంగ దామేశ్వరీం | దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ || శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ ద్బ్రహ్మేంద్ర గంగాధరాం| త్వాం త్రైలోక్య కుటుంబనీం సరసిజాం వందే ముకుంద ప్రియామ్ || మాతర్నమామి కమలే కమలాయ తాక్షి శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వా మాతః క్షీరో దజే కమల కోమల గర్భ గౌరి లక్ష్మీ ప్రసీద సతతం సమతాం శరణ్యే || మహా దేవ్యైచ విద్మహే విష్ణు పత్యైవ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్.

రుద్రాక్షలు

రుద్రాక్షలు 
రుద్రాక్షలు అనేవి శివుని కి ప్రీతికరమయినవి. రుద్రాక్షలు ధరించడం వల్ల శివ భగవానుని అనుగ్రహం లభించును. సమస్త పాపాలు హరించబడును. ధనం స్తిరం గా ఉండును. వాస్తు దోష పరిహారకరం, దారిద్ర వినాశకరం మరియు అన్నీ విధముల శుభప్రదము గా ఉండును.


















నవరత్నముల కు బదులు రుద్రాక్షలు కూడా ధరించవచ్చు. 1) కెంపు - ఏకముఖి, ద్వాదశముఖి

2) ముత్యం - ద్విముఖి, ఏకాదశ ముఖి

3) పగడం - త్రిముఖి, అష్టాదశ ముఖి

 4) పచ్చ – చతుర్ముఖి, త్రయోదశ ముఖి

 5) పుష్యరాగం – పంచ ముఖి, చతుర్దశ ముఖి

 6) వజ్రం – షణ్ముఖి, పంచ దశ ముఖి

7) నీలం – సప్త ముఖి, షోడశ ముఖి

8) గోమేధికం – అష్టముఖి, గౌరీ శంకర ముఖి

9) వైఢూర్యం – నవ ముఖి, ఆష్టా దశ ముఖి.












 రుద్రాక్షలు ధరించడం వల్ల వచ్చు ఫలితములు

1) ఏకముఖి రుద్రాక్ష - ఈ రుద్రాక్ష చాలా విలువైనది. ఎటువంటి మంత్ర తంత్ర ప్రయోగాలు అయినా తిప్పి కొట్టగలదు. సిరి సంపదలు, శిరో సంబంధ రోగములు నివారణ అగును.

2) ద్విముఖి – ఇది బ్రహ్మ రుద్రాక్ష అని కొందరి అభిప్రాయం. అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అని కూడా అనుకోవచ్చు. సంతాన ప్రాప్తి, ఏకాగ్రత, వ్యాపార అభివృద్ధి. కల్గును. మనోవ్యాకులతను దూరం చేస్తుంది.

 3) త్రిముఖి – ఈ రుద్రాక్ష చాలా అదృష్టదాయకమయినది. ధనధాన్యసమృద్ధి, కామెర్ల వ్యాధి నివారణ మరియు సర్ప దోష నివారణ అగును.

 4) చతుర్ముఖి – పరిశోధకులు, జ్యోతిర్గణిత వేత్తలు ధరించడం వల్ల అదికరాణింపు ఉండును మరియు ఏకాగ్రత పెరుగును.

5) పంచముఖి –బ్రహ్మ స్వరూపమయిన ఈ రుద్రాక్ష వల్ల అకాలమృత్యునివారణ, గుండెపోటు వంటి హృద్రోగ సంబంధిత వ్యాధులు నివారణ అగును మరియు మలబద్దకం నివారణ అగును.

6) షణ్ముఖి – ఈ రుద్రాక్ష కుమార స్వామి స్వరూపం, శక్తి, విజయం, శరీర ధారుఢ్యం, ఆరోగ్యం లభించును.

7) సప్త ముఖి- సభావశ్యత,సంపద, కీర్తి, ఉత్తేజం కల్గును. 8) అష్ట ముఖి – ఆకస్మిక ధన ప్రాప్తి కల్గును.

9) నవముఖి రుద్రాక్ష – ఈ రుద్రాక్ష భైరవ స్వరూపమయినది. రాజకీయ పదవులలో ఔన్నత్యం ఆశించువారికి, అపమృత్యు నివారణకు, పరోపకార దక్షులకు ధరిచవచ్చు.

10) దశముఖి రుద్రాక్ష – విష్ణు స్వరూపమయినది. గొంతు సంబంధ రోగాలను, నవగ్రహముల ద్వారా కలుగు కష్టములు, సమస్యలు నివారణ అగును.

11) ఏకాదశ ముఖి – ఇది శివాత్మకమయిన రుద్రాక్ష. వైవాహిక జీవితం లోఆనందమునకు, గర్భ సంభందరోగాలకు అనుకూలత లభించును.












వివాహ పొంతన

వివాహ పొంతన వివాహ పొంతన అనగా వధూవర జన్మనక్షత్రములకు మరియు జాతక చక్రములను పరిశీలించి ఇద్దరి వివాహం అయిన తదుపరి దాంపత్య అన్యోన్యత, సుఖ సంతోష అభివృద్ధి, సంతాన అభివృద్ధి అను తదితర విషయముతెలియచేయబడును.












వివాహ పొంతన అనేది ప్రస్తుత కాలంలో పంచాంగం లో వధూవర గుణమేళన చక్రం ప్రకారం 18 పాయింట్ల కన్నా ఎక్కువ వచ్చినచో వివాహం చేసుకోవచ్చు అని 18 పాయింట్ల కన్నా తక్కువ వచ్చినచో వివాహం చేసుకోనరాదని చెప్పుచున్నారు.పాయింట్స్ ఎక్కువ వచ్చినను వాళ్ళు జీవితాంతం బాగుంటారని చెప్పలేము.అది అంతా సమంజసం కాదు. పాయింట్స్ ఎలా వచ్చినను ఇరువురి జాతకములను పరిశీలించి తదితర నిర్ణయం తీసుకోవడం మేలు. ఇంకొక ముఖ్య విషయం కుజ దోషం సంసారులు కానిదే సర్వేశ్వరులకైనా పరిపూర్ణత లేదు అనేది అర్ధవాక్యం. అటువంటి ముఖ్యమయిన సంసారానికి మూలమయిన వివాహ వ్యవస్థ లో వధూవర జాతక పరిశీలనలో ఎంతటి వారు అయినా భయపడేది “కుజ దోషం”.
















ఏ జాతకము అయినా జన్మ లగ్నాత్తు 2,4,7,8,12 స్థానములలో కుజుడు ఉన్నా లేక ఆ స్థానములను కుజుడు చూసినను కుజదోషం కల్గి అది స్త్రీల యొక్క భర్త భావానికి పురుషుల కళత్ర భావానికి పీడ కల్గిస్తుందని, అలాంటి జాతకులకు వివాహం చేయరాదని, కుజ దోషం లేని వధూ వరులకు మాత్రమే పెండ్లి చేయాలని పెద్దల నిర్ణయం. కాని వధూవరుల జతకములు రెండింటా కుజ దోషం సమతుల్యంగా ఉంటే వివాహం చేయవచ్చు అని శాస్త్రాలు అంగీకరిస్తున్నాయి.






అంతే కాకుండా మేష, కర్కాటక, సింహా, వృశ్ఛిక, ధనుర్మీన లగ్నముల జాతకములకు కుజ దోషం వర్తించదు అని శాస్త్రం చెబుతుంది మరియు మేష,వృశ్చికములకు చతుర్ధ కుజుడు, వృషభతులల కు వ్యయ కుజుడు , మిధున కన్యలకు ద్వితీయ కుజుడు, మకర కర్కాటములకు సప్తమ కుజుడు, ధనుర్మీనములకు అష్టమ కుజుడు, కుంభ సింహములకు కుజుడు ఎక్కడ ఉన్ననూ కుజ దోషం లేదని శాస్త్ర నిర్ణయం.


దోషం అనేది నక్షత్రాలలో రాశులలో ఉండవు. అన్ని నక్షత్రాలు అన్ని రాశులు మంచివే.
మానవుల మనసులలో దోషాలు ఉంటాయి. 

ఒక సామెత చదవండి,  ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ ఒక గ్రామం చేరుతాడు ఆ ఊరిలో ఒక వ్యక్తి ని పిలచి ఈ ఊరు మంచిదేనా అని అడుగుతాడు,  దానికి ఆ ఊరు వాడు నీ నోరు మంచిది అయితే ఈ ఊరు మంచిదే అంటాడు.

మన మనస్సులు మారనప్పుడు , మనది మంచి ప్రవర్తన కానప్పుడు ఏ రత్నం ధరించిన, ఏ పూజ చేసిన ఉపయోగం ఉండదు.
అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే భావం మీ మనసులో ఉంటే  అన్నీటిలోను విజయం మీదే.













సమస్త యంత్రములు

సమస్త యంత్రములు

గణేశ యంత్రం - విఘ్నములు నివృత్తి చేయును.


లక్ష్మీ గణేశ యంత్రం - విఘ్నముల నివృత్తి, ఐశ్వర్య వృద్ది, సంతతి, గౌరవం, సర్వత్ర జయం మరియు లక్ష్మీ దేవి స్తిరంగా ఉండును.









ధన లక్ష్మి యంత్రం – ధనలక్ష్మి దేవి అనుగ్రహం ఉండి ఎల్లప్పుడు లక్ష్మి ప్రదము గా ఉండును.


 నరఘోష యంత్రం – నరుల బాధ లేకుండా చేయును.


వాస్తు పురుష యంత్రం – మీ గృహం లో వాస్తు దోషం నివృత్తి అగును.


 ఆంజనేయ యంత్రం – సర్వత్ర జయము గాను, ప్రతి కార్యము జయప్రదం గాను, శత్రు హాని, శత్రు జయము, సర్వ కార్య సిద్ది అగును.


 మత్స్య యంత్రం – మీ గృహములో సంపూర్ణం గా వాస్తు దోషములు అన్నియు నివృత్తి అగును.


అష్ట లక్ష్మి యంత్రం – ఎనిమిది మంది లక్ష్మి అమ్మవార్ల అనుగ్రహం ఎల్లప్పుడు మీ అందు, మీ వ్యాపారం అందు ఉండును. అష్ట దిక్పాలకుల యంత్రం – సమస్త వాస్తు దోషములు నివృత్తి అగును మరియు అష్ట దిక్పాలకుల అనుగ్రహం ఎల్లప్పుడు ఉండును.


 నారాయణ యంత్రం – అన్ని విధముల కస్టములు అన్ని తొలిగి పోయి సర్వత్ర శుభము గా ఉండి సుఖసంతోషములతో ఉండును.


 సాయినాధ యంత్రం – సాయి నాధుని అనుగ్రహం లభించి అధ్యాత్మిక చింతన కల్గును. ఆకర్షణ యంత్రం – జనులు ఆకర్షింపబడును.


 నవగ్రహ యంత్రం – సంపూర్ణ నవగ్రహముల దోషముల నివృత్తి అగును.


 మృత్యుంజయ యంత్రం – మృత్యుంజయ దోషం నివృత్తి అగును, అప మృత్యుంజయు ని జయించి ధీర్ఘాయుర్ధాయము కల్గును.


 గాయత్రి యంత్రం – సమస్త కష్టములు తొలిగిపోవును మరియు జ్ఞాపక శక్తి, సంపద,బ్రహ్మ జ్ఞానము కల్గును.


మహాలక్ష్మి యంత్రం – అన్ని రంగముల లోను అభివృద్ధి,ఆరోగ్యము, మనసౌఖ్యం,చర స్తిర ఆస్తుల యందు వృద్ధి అగును.
















 శ్రీ దుర్గా యంత్రం – సమస్త గ్రహ బాధలు, కస్టములు, పాపములు నివారణ అయి సుఖ సంతోషముల తో జీవించును. మహా సరస్వతి యంత్రం - మేధా శక్తి, బుద్ధి కుశలత, సూక్ష్మ గ్రాహక తత్వము, విద్యాభి వృద్ధి, పరీక్షల యందు విజయము, జ్ఞాన వృద్ధి కల్గును.


 శ్రీ సుబ్రహ్మణ్య యంత్రం – సంతాన వృద్ధి, ఆరోగ్య అనుకూలత మరియు దంపతుల కలహ దోషం నివృత్తి అగును.


 శ్రీ లక్ష్మి నారాయణ యంత్రం – దారిద్ర నిర్మూలన, ధనకనకవస్తువాహనఐశ్వర్య ప్రాప్తి, సర్వ కార్య సాధనం, సర్వత్ర జయము కల్గును.



కుబేర యంత్రం – ఋణ విముక్తి, ధన వృద్ధి, రాజా పూజ్యత కల్గును.వృత్తి లేని వారికి వృత్తి సమకూరును.













నవరత్నములు

నవరత్నములు నవరత్నములు ధరించడం వల్ల అనేక శుభయోగములు కల్గును.


రవి – కెంపు.



 చంద్రుడు – ముత్యం






 కుజుడు – పగడం





 బుధుడు – పచ్చ







 గురుడు - పుష్య రాగం







శుక్రుడు – వజ్రం







శని – నీలం









 రాహువు - గోమేధికం











 కేతువు - వైఢూర్యం









వాస్తు గృహాన్ని నిర్మించుకోవటం

వాస్తు నిరాకారమయిన భగవంతుని స్వరూపం వాస్తు. నిరాకార స్వరూపానికి ఆకారం ఏర్పరచు కోవటమే గృహాన్ని నిర్మించుకోవటం.


ఈ సృష్టి లో వాస్తు పుట్టుక ఏనాటిది అన్నది ఖచ్చితంగా చెప్పలేము. అయితే సృష్టి మొదలు నుండి సృష్టి అంతం వరకు వాస్తు పనిచేయక తప్పదు. వాస్తు అనేది వేద కాలంలో జన్మించింది అని కొందరు చెప్తారు.


వాస్తు లో అష్టదిక్పాలకులు, పంచ భూతములు ప్రధానపాత్ర వహిస్తాయి. వీటిని గురించి వేదాలలో, ఇతర ధర్మ శాస్త్రాలలో ఇలా ఉంది. వాస్తు శాస్త్రమును సంపూర్తిగా అధ్యయనం చేసి మనకు దగ్గర్లో అనేక గృహ నిర్మాణాలు గమనిస్తే శాస్త్రం వాస్తవమా ? కాదా ? అనేది అర్ధం అవుతుంది.





వాస్తు శాస్త్రం గురుంచి భగవద్గీత లో కూడా ప్రస్తావించడం జరిగింది. వాస్తుని సాకార స్వరూపంలో పూజించాల్సి వస్తే అది శ్రీకృష్ణ భగవానుడే. వాస్తు శాస్త్రంనకు వ్యతిరేఖం గా నిర్మాణాలు చేస్తే ఆర్దిక నష్టం, అవమానములు, హఠాన్మరణము వంటివి సంభవించును. ఇంకా చాలా ఆరిష్టాలు కల్గును. కావున అందరూ వాస్తు శాస్త్రమును పరిపూర్ణం గా తెలిసిన వారిని సంప్రదించి శాస్త్రము ప్రకారంగా గృహ నిర్మాణం చేసుకొనుట శ్రేయ స్కరం. అలా గృహమును నిర్మించుకోవడం వల్ల సకల అరిష్టాలను నివారించుకోవచ్చు.




మానవ జాతికి సంభందించి నంతవరకు చతుర్విధ పురుషార్ధ సాధనకు గృహస్థాశ్రమం ఆధార భూతం. సొంత ఇల్లు లేని గృహస్థుడు చేయు సమస్త శ్రౌత స్మార్త పుణ్య కర్మల ఫలితం ఆ గృహస్థుడు ఎవరి ఇంటివాడు ఆయా కర్మలను ఆచరించు చున్నాడో ఆ గృహ యజమానికి చెందునని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనిలో అర్ధం ఏమిటి అంటే ప్రతీ మానవుడు తన శక్తి కి తగ్గట్లు గా గృహ నిర్మాణం చేసుకొనవలయును.








ముహూర్తము.

ముహూర్త విషయము ముహూర్తం అనగా కనురెప్ప పాటు సమయం అని అర్ధం. ఈ ముహూర్తమును పంచాంగం ద్వారా నిర్ణయించబడును. పంచాంగం అనగా పంచ అంగములతో కూడుకున్నాటటువంటిది. అవి తిధి, వార, నక్షత్రం, యోగం, కరణం. అసలు ముహూర్తం అనగా కను రెప్ప పాటు సమయం అని ఇంతకముందు చెప్పుకున్నాం.











కాళిదాసు మతాను సారం గా వేయి కలువరేకులు ఒకే చోట వరుసగా పేర్చి దానిలో సన్నని బంగారు తీగ గుచ్చితే ఒక పద్మ పత్రంలో దిగే కాలమే ముహూర్తం అని చెప్పబడింది. అటువంటి ముహూర్తం ను తెలుసుకొనుట బ్రహ్మకు అయినా సాధ్యం కాదు.ముహూర్త నిర్ణయమందు జ్యోతిష్కుడు సాక్షీభూతుడు మాత్రమే కాబట్టి ముహూర్త సమయాన్ని ఆయా వ్యక్తులు పూర్వ జన్మ ఫలములు ను అనుసరించి వచ్చుచుండును.












ఒక ముహూర్తం నిర్ణయించాలంటే అనేక గ్రహ నక్షత్రాల కాంతి సమూహాలు ఒకే కేంద్రానికి వచ్చు సమయం నిర్ణయించడమే. ముహూర్తమునకు కావల్సిన నియమములు 1)లగ్నాధి పతి బలవంతుడు అయిఉండాలి. 2)లగ్నాధిపతి స్వక్షేత్ర, ఉచ్చ క్షేత్రములలో లేకపోయినను, మిత్రక్షేత్రమలలో గాని కేంద్ర కోణముల లో గాని ఉండవలయును. 3)కేంద్ర కోణములలో పాపులు ఉండకూడదు. 4)ముహూర్త లగ్నాధి పతి, వారాధి పతి, నక్షత్రాధి పతి ఒకరైనచో ఆ ముహూర్తం చాలా బలమయినది. 5)ఏకవింశతి దోషములను విడిచి ముహూర్తం నిర్ణయించుట చాలా మంచిది. 6)క్షీణ చంద్రుడు ఉన్నప్పుడు ముహూర్తం నిర్ణయించుట దోషము. 7)ఒక ముహూర్తం నిర్ణయించినపుడు కర్త యొక్క నామ,జన్మ నక్షత్రముల రెండిటికి తారాబాలమును చూడవలయును మరియు చంద్రబలమును, పంచరహితమును పరిశీలించవలయును. ఇంకను చాలా నియమ, నిభందనలు చాలా ఉన్నాయి.








కావున మీకు సంభందిత కార్యమునకు కావల్సిన ముహూర్తం ను మీరు పొందాలంటే మీ జన్మ నక్షత్రమును లేదా మీ నామనక్షత్రమును లేదా మీ జన్మ తేదీ, జన్మ సమయం, జన్మ ప్రదేశ వివరములు.

జ్యోతిష్యశాస్త్రం వలన ఉపయెగము ఏమిటి.

శ్లో; యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ! ప్రణమామిత మాదిత్యం బహిరంతస్తమోపహమ్ !! శ్లో; ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ ! గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః !!







జ్యోతిష్య శాస్త్రం ప్రతి మానవుడు తన జీవితం లో భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతుంటారు. అయితే భవిష్యత్తు తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి. అవి హస్త సాముద్రిక శాస్త్రం,సంఖ్యా శాస్త్రం,జ్యోతిష్య శాస్త్రం. అన్నిటి కంటే హేతుభద్దమయినది కష్టమయినది శాస్త్రీయమయినది జ్యోతిష్య శాస్త్రం.










ఫలితములు చెప్పడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అవి అన్నియు కూడా మహర్షులు సూచించినవే. ఫలితములు చెప్పడం అనేది జ్యోతిష్కుడు మీద ఆధారపడి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంను ఎక్కువ గా అధ్యయనం చేసే కొలది ఎన్నెన్నో విషయములు విపులంగా చెప్పగలరు. అలా ఫలితములు చెప్పాలంటే జాతకుడు/జాతకురాలు పూర్తి వివరములు కావలయును. అవి జన్మించిన తేదీ, జన్మించిన సమయం, జన్మించిన ప్రదేశం 3 వివరములు ఇచ్చినచో మీ జాతక ఫలితములు చెప్పవచ్చును. జన్మించిన సమయమును సరిగ్గా గుర్తించాలి. 









ప్రస్తుత కాలం లో ఆపరేషన్ ద్వారా జన్మించిడం జరుగుతుంది. కావున సరియాయిన సమయాన్ని గుర్తించాలి. ప్రదేశమును బట్టి అక్షాంశ, రేఖాంశములు(longitude and latitude)మారును. కావున సరిఅయిన తేదీ, సంవత్సరం, సమయం వివరములు గుర్తించవలయును. 










విద్య, వృత్తి, వ్యాపార లావా దేవీలు, వాహన యోగం, వివాహం, ప్రభుత్వ ఉద్యోగ అవకాశములు, ఉద్యోగ స్టిరత్వం, దాంపత్యఅన్యోన్యత తెలుపబడి గ్రహ దోష నివారణము మరియు మంచి రత్నం సూచించి ఏయే గ్రహములు దోషములు ఉన్నాయో తెలియ చేసి జపహోమదానాదులు  నిర్వహించబడలి.










నిత్య గణపతి పూజ,పలితాలు

1) గణపతి పూజ: విఘ్నములు నివారణగును మరియు ఏదైనా కార్యము ఫ్రారంభించినప్పుడు ఆ కార్యము విఘ్నము కలుగ కుండా జయప్రదము కల్గును.

2) పుణ్యాహవాచనం: శుద్ది ఏర్పడును.


3) మహాలక్ష్మి వ్రతం: లక్ష్మీ దేవి అనుగ్రహం కల్గును.

4) సత్యనారాయణ స్వామి వ్రతం: సత్ఫలితములు కల్గును, సంతానం కల్గును, వివాహం త్వరగా అగును, అన్నివిధాల శుభప్రదముగాను, మంగళ ప్రదము గాను ఉండును.











5) నక్షత్ర శాంతి: నక్షత్ర దోషం నివారణ అగును.

6) జనన దోష శాంతి: జన్మించిన సమయం లో గ్రహములు దోష యుక్తము గా ఉంటే దోషం నివృత్తి అగును.

7) నవగ్రహ శాంతి: నవగ్రహములు దోషం నివృత్తి అయి శాంతి కల్గి సత్ఫలితములు కల్గును.
8) రుద్ర శాంతి : మానసిక ప్రశాంతత లభించును.
9) గృహ శాంతి : వాస్తు దోషం తొలగిపోవును.
10) నరఘోష శాంతి : నరుల బాధ నుండి విముక్తి అగును.

11) కుజ గ్రహ శాంతి : కుజ దోషం నివృత్తి అయి దంపతులు సుఖ సంతోషముల తో ఆయురారోగ్యముల తో జీవిస్తారు.

12) గణపతి హవనం: సమస్త విఘ్నములు నివారణ అయి కార్యము జయప్రదము అగును.

13) లక్ష్మీ గణపతి హవనం : విఘ్నములు అన్నియు నివారణ అగును మరియు లక్ష్మీ దేవి అనుగ్రహము కల్గి శుభప్రదము గా ఉండును.

14) అష్ట లక్ష్మీ హవనం: అష్ట లక్ష్మీ దేవతల అనుగ్రహం కల్గి ఆయురారోగ్య, ఐశ్వర్యములతో సత్సంతానముతో జీవిస్తారు.

15) చండీ హవానం : కార్యసిద్ధి కల్గును.

16) మృత్యుంజయ హవనం : మృత్యుంజయుని అనుగ్రహం కల్గి ఆయుష్యు పెరుగును.

17) అపమృత్యుంజయ హవనం : అప మృత్యుంజయుని అనుగ్రహం కల్గి ఆయుష్యు పెరుగును.

18) నవగ్రహ హవనం : నవగ్రముల దోషములు నివృత్తి అయి శుభప్రదము గా ఉండును.
19) ఆయుష్య హవనం: ఆయుష్యు వృద్ధి అగును.
20) గాయిత్రి హవనం : కార్య సిద్ధి కల్గును. 21) ఋణ విమోచన హవనం : ఋణముల నుండి విముక్తి కల్గును.

22) దాంపత్య హవనం : దంపతులు ఇద్దరూ ఎటువంటి వివాదములు లేకుండా సుఖ సంతోషముల తో జీవిస్తారు.
 
23) పుత్ర కామేష్టి హవనం : సంతానము కల్గును మరియు సంతానం వృద్ధి అగును.

24) సరస్వతి హవనం : విద్య యందు ఆసక్తి,ఏకాగ్రత కల్గును సరస్వతి దేవి అనుగ్రహం కల్గును.
25) శ్రీ లక్ష్మీ సుదర్శన హవనం : కార్యసిద్ధి, మనోభీష్ట ఫలాభివృద్ధి, శ్రీఘ్రమే శ్రీమన్నారాయణ అనుగ్రహం కల్గును.











26 February 2016

పూజాకార్యక్రమాలు


ప్రస్తుతకాలం లో పూజాకార్యక్రమాలు శాస్త్రోక్తంగా ఆచరించాలి అనుకునే వారు ఆచరించ లేక పోతున్నారు.
అసలు పూజా కార్యక్రమాలు అంటే ఏమిటి అనే విషయానికి వస్తే పూజా కార్యక్రమాలు వేదముల సారాంశమే.


ఈ పూజా కార్యక్రమాలు మానవుని జన్మించిన దగ్గర నుండి గతించే వరకు షోడశ కర్మలు ఆచరించాలి. దీనిలో అంత్యేష్టి షోడశ కర్మ. దీనిని పరిగణన లోకి తీసుకోకుండా ఉంటే పంచదశ కర్మలు అవి.
గర్భాదానము .
సీమంతం .
జాతకకర్మ నామకరణం .
అన్నప్రాశన .
ఉపనయనం .
వైశ్వ కర్మ .
వ్రతం .
ప్రాజా పత్య వ్రతం
సౌమ్య వ్రతం.
ఆగ్నేయ వ్రతం .
వైశ్వ దేవ వ్రతం.
స్నాతక వ్రతం .
వివాహం .
పుట్టినరోజు.
ఈ కార్యక్రమాలన్నియు చతుర్వేదముల సారాంశం.
మన ఆచారాలను సాంప్రదాయాలను వదిలి పెట్టి వ్యాపారాల నిమిత్తం,ఉద్యోగాల నిమిత్తం మరియు మన అవసరాల నిమిత్తం వేరే ప్రదేశాలకి వెళ్ల వలసివస్తుంది.అచ్చట మన సాంప్రదాయముల ప్రకారం పూజా కార్యక్రమాలన్నియు ఆచరింప వలెను.



నిత్యములు,నైమిత్తికములు,స్నాన సంధ్యా నుష్టములు అనెడు కర్మలు ఆచరించుట ప్రతీ వ్యక్తికీ పరమ ధర్మమనియు ముఖ్య కర్తవ్య మనియు వేదాది సమస్త శాస్త్రము లందు చెప్పబడి ఉన్నది .







ప్రతీ వ్యక్తి కి మూడు విధముల ఋణములు ఉండును.అవి దేవ ఋణం,ఋషి ఋణము,పితృ ఋణము. "యత్కృత్వా నృణ్య మాప్నొతి దైవాత్ పై త్ర్యాచ్చ మానుషాత్" అని చెప్పినట్లు గా నిత్య కర్మలను చక్కగా ఆచరించుట వలన మానవుడు ఈ త్రివిధ ఋణముల నుండి విముక్తుడవును.



మానవ జన్మమును సఫల మొనర్చుట కై మానవ మాతృడయిన ప్రతీ వ్యక్తి నిత్య పూజా కార్యక్రమాలను నియామను సారంగా ఆచరించ వలయును.



అసలు బ్రాహ్మణుడు అంటే అర్ధం తెలుసుకుందాం బ్రహ్మ అస్య ఆస్తీతి బ్రాహ్మణః! బ్రహ్మ- బ్రహ్మ విద్య – వేద విద్య -జ్ఞాన విద్య అస్య - ఇతనికి ఆస్తి ఇతి - ఉన్నది కనుక బ్రాహ్మణుడు అగుచున్నాడు. యజనం – యజ్ఞ చేయుట యాజనం - యజ్ఞము చేయించుట అధ్యయనం – వేదము చదువట అధ్యాపకం – వేదము చెప్పుట దానము - దానము చేయుట ప్రతి గ్రహం - దానం తీసుకొనుట ఈ షట్కర్మములు కలవాడు బ్రాహ్మణుడు.








సదాచారము ,సత్ప్రవర్తన ,పరోప కార బుద్ధి ,సత్యము,సంస్కృతి,సాంప్రదాయము,భక్తి శ్రద్ధలు,వినయ విధేయతలు,ఏక పత్నీ వ్రతము,ధర్మకార్యా సక్తి,ఉపనయన సంస్కారము,సంధ్యా వందనము,నిత్యాగ్ని హవనములు,శాస్త్ర విజ్ఞానము మున్నగు సద్గుణములు కలవారు బ్రాహ్మణులు.

బ్రాహ్మణులు అనగా ఒక కులమునకు,ఒక మతమునకు చెందిన వారు కాదు. ఎవరైనా బ్రాహ్మణోత్తమును పొంద వచ్చును. జన్మనా జాయతే శూద్రః ! కర్మణే జాయతే ద్విజః ! వేదపాటేన విప్రః స్యాత్ ! బ్రహ్మ జ్ఞానేన బ్రాహ్మణః!! (స్కాంద పురాణము ) .
జన్మించినది మొదలు ఉపనయనము వరకు శూద్రత్వం,ఉపనయన సంస్కారము చేత ద్విజత్వము,వేద అధ్యయనము చేత విప్రత్వము,బ్రహ్మ జ్ఞానము చేత బ్రాహ్మణత్వము వచ్చును.



అవశ్య మను భోక్తవ్యమ్ ! కృతం కర్మ శుభా శుభం !! నా భుక్తమ్ క్షీయతే కర్మ ! కల్ప కోటి శతైరపి !!
జీవుడు తాను చేసిన పుణ్య పాప కర్మల ఫలాన్ని తప్పకుండా అనుభవించి తీరవలసిందే నని కొన్ని వందల కోట్ల కల్పాల కాలం జరిగిన చేసిన కర్మ అనుభవించ కుండా నశించదని పై శ్లోకం చెబుతుంది . ఇది ఋషి వాక్కు,పరమ ప్రమాణం. జనన మరణాత్మక మయిన ఈ సంసార మహా ప్రవాహం లో పాపము,పుణ్యము అప్రయత్నము గా జరిగి పోతూనే ఉంటాయి. పాపము వలన దుఃఖము,పుణ్యము వలన సుఖము కల్గును.దుఃఖదాయకములగు కర్మలను ఆచరించరాదని, సుఖ దాయకములగు కర్మలను ఆచరించాలని మన మహర్షుల ఉపదేశం. ఈ అంశాలను దృష్టి లో పెట్టుకుని మహర్షులు అనేక ఉపాయాలను సూచించారు.


అవి నవగ్రహ హవనం,చండీ హవనం,నవగ్రహ శాంతి, ఇలా ఇత్యాదికములు ఎన్నో పూజా కార్యక్రమములు ఉపదేశించారు.